Pages

Wednesday, July 1, 2015

ఇంకా ముందుకు వెళ్ళు…!!!

ఒక కట్టెలు కొట్టే వ్యకి అడవిలో కట్టెలు కొట్టి తెచ్చి, అమ్మి వచ్చిన సొమ్ము తో కష్టంగా రోజులు గడుపుతూ ఉండేవాడు.
ఒకరోజు ఒక మహాత్ముడు అతన్ని చూచి, “నాయనా! ఇంకా ముందుకు వెళ్ళు" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాట ప్రకారం కట్టెలు కొట్టే వ్యక్తి రోజూ కాస్త ముందుకు వెళ్లనారంభించాడు.
రోజు రోజుకూ ఎక్కువ లావైన కట్టెలు గల ప్రదేశం అతనికి కనిపించ సాగింది. ఆ విధంగా అతడు ఎక్కువ ధనం సంపదించి సదుపాయంగా జీవించసాగాడు.
ఆగకుండా ముందుకు పోతున్న ఆ కట్టెలు కొట్టే వాడికి, క్రమంగా టేకు చెట్ల వనం, చందన వృక్షాల వనం కనుపించసాగాయి.
ఈ విధంగా అతను కోట్ల సంపదకి అధికారి అయ్యాడు.
ధర్మమార్గం కూడా ఇలాంటిదే... ముందుకు పోయే కొద్దీ లాభాలు అందుతాయి.

తాబేలు తెలివి

ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్ధం కాలేదు.
వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు.
"ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో.
"చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ్! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు.
వేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్ళారు. " మీకు నా గానం నచ్చిందా?" "నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి. మనందరం కలిసి పాడుతూ ఆడదామ" అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో.
పిల్లలు తాబేలుని బయటకి తీశారు. తాబేలు మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తుంటే, పిల్లలు ఆడసాగారు. ఇలా చాలా సేపు జరిగింది. చివరకి అలసిపోయి, చెమటతో తడిసి్పోయారు ఆ పిల్లలు. "చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దాం? అని అన్నది తాబేలు తన పధకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చ్హారు. "ఇవి నాకు సరిపోవు. పదండి నదిలో స్నానం చేద్దామ" అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.
నీతి : అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానినుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం.

రెండు గాడిదల బరువు

ఒకరోజు ఉదయాన అక్బర్ యువరాజు సలీం మరియు బీర్బల్తో కలిసి వాహ్యాళికి వెళ్లాడు. అలా వారు నది ఒడ్డుకు వచ్చారు. అది ఎండాకాలం కావడంతో ఒక చెట్టునీడన కూర్చున్నారు.
కొద్దిసేపయ్యాక అక్బర్, నదిలో స్నానం చేద్దామా?’ అన్నాడు. బీర్బల్ నీళ్లలో చెయ్యిపెట్టి చూసి, అమ్మో, చాలా చల్లగా ఉన్నాయి. నేను మాత్రం చెయ్యను ప్రభూ’ అన్నాడు.
అక్బర్, సరే మంచిది. సలీం, నేనూ స్నానం చేస్తాము. నువ్వు ఇక్కడే ఉండి మా దుస్తులు పట్టుకో’’ అన్నాడు. అలా అని అక్బర్, సలీం తమ తమ దుస్తులు విప్పి బీర్బల్కు ఇచ్చి
నదిలో దిగి స్నానం చెయ్యసాగారు.
అక్బర్, సలీంతో బీర్బల్ ఒక మూర్ఖుడు. ఎండలో నిల్చుని మన బట్టలు మోస్తున్నాడు. నా కంటికి చాకలివాని గాడిదలా కనిపిస్తున్నాడు.
ఇప్పుడొక తమాషా చేస్తా చూడు’’ అని ఏయ్! బీర్బల్, నువ్వొక గాడిద
బరువు మోస్తున్నావు’’ అన్నాడు వ్యంగ్యంగా వెంటనే బీర్బల్, కాదు
ప్రభూ, రెండు గాడిదల బరువు మోస్తున్నా’’ అన్నాడు. అక్బర్ ముఖం
మాడిపోయిoది