Pages

Tuesday, September 11, 2012

Spoken Hindi - హిందీ నేర్చుకోండి

Click here for Spoken Hindi PDF File Or JPEG Files




































సమయస్ఫూర్తి


ఒక ఊళ్ళో భద్రయ్య అనేవాడు హస్త సాముద్రికంలో చాలా గట్టివాడు. ఆ చుట్టు పక్కల గ్రామాలలో భద్రయ్యకు చెయ్యి చూపించనివాడు లేడు. అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిదైనదీ, ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగినదీ, ముందు ఏమి జరగబోయేదీ చూసినట్టు చెప్పేవాడు.
 
హస్తసాముద్రికం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు భద్రయ్య పేరు ప్రతిష్ఠలు విని, అతనికి వెరచి, అతనుండే గ్రామం చాయలకు వెళ్ళేవారు కారు. ఎవరన్నా పొరపాటున వస్తే భద్రయ్య వాళ్ళను పదిమందిలోనూ పరీక్షకు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు తాగించి మరీ గ్రామం నుంచి బయిటికి పంపేవాడు.
 
భద్రయ్య సంగతి తెలియక రామశాస్ర్తి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ ఆ గ్రామానికి వచ్చాడు. రామశాస్ర్తి ఊళ్ళోకి వచ్చేసరికి గ్రామచావిడి వద్ద భద్రయ్య నలుగురితోపాటు చేరి లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. రామశాస్ర్తి కూడా చేతులు చూసేవాడని తెలియగానే భద్రయ్య, ‘‘ఏమయ్యూ, నువ్వు ఏయే గ్రంథాలు చదివావు? నీ గురువు గారెవరు? హస్తసాముద్రికంలో ఏయే విభాగాలు నీకు తెలుసు? అసలు నీదేవూరు?'' అని ప్రశ్నలు వేశాడు.
 
‘‘అయ్యూ, నేను హస్తసాముద్రిక శాస్ర్తం చాలా కొద్దిగా చదివాను. నాకు తెలిసినది బహుకొద్ది. తెలిసినంతవరకే ప్రశ్నలు చెప్పి పొట్టపోసుకుంటున్నాను. ఇక ఊరా? పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను. ఎక్కడ పొట్టగడిస్తే, అదే నా ఊరు,'' అన్నాడు రామశాస్ర్తి అణకువగా. అతని అణకువ చూసి భద్రయ్య రెచ్చి పోయి, ‘‘నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ వూళ్ళోవాళ్ళు డబ్బులిచ్చేటంత వెర్రివాళ్ళు కారయ్యూ! నా సంగతి నువ్వు వినలేదు కాబోలు.


హస్తసాముద్రికంలో అందెవేసిన చెయ్యిని నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచి నీరు కూడా పుట్టదు. అందుచేత మరోవూరు చూసుకో!'' అని నిష్ఠురంగా అన్నాడు. అది విని రామశాస్ర్తికి కోపం వచ్చింది. ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళగూడదనుకుని అతను, ‘‘అయ్యూ, ఎవరంతటివారు వారు! నేను మీ కన్న గొప్పవాణ్ణని ప్రగల్భాలు పలకలేదు.
 
కాని మీరు ఏ ఆధారమూ లేకుండానే నన్ను తీసిపారేశారు. తరతమ భేదాలు నిర్ణయమయ్యేది పరీక్షలో గదా? మీకు నాకన్న ఎక్కువ తెలిసినట్టు ఏ ఆధారం మీద చెబుతున్నారు?'' అని అడిగాడు. అక్కడ చేరినవారు రామశాస్ర్తి చెప్పినది సబబేననీ, ఇద్దరూ ఎరగని మనిషి చెయ్యి చూసి ఆ మనిషిని గురించి చెబితే, ఎవరు చెప్పినది సరిగా ఉన్నదీ తెలిసిపోతుందనీ అన్నారు.
 
వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అటుగా ఒక పొరుగూరి మోతుబరి వచ్చాడు. గ్రామచావడి వద్ద చేరినవాళ్ళు ఆయనను పిలిచి, ‘‘అయ్యూ, ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది. మీరు ఒక్క క్షణం ఇలా వచ్చి, వీరిద్దరికీ మీ చెయ్యి చూపండి,'' అన్నారు.
 
పొరుగూరి మోతుబరి దగ్గరికి వచ్చి చెయ్యి చాచాడు. భద్రయ్య అతని చెయ్యి చూసి, ‘‘అయ్యూ, ఇది పరీక్ష కనక ఉన్న మాట చెప్పక తప్పదు. మీకు ధనం చాలా ఉన్నదిగాని, అంతకు మించిన లోభితనం కూడా ఉన్నది. మీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారు,'' అన్నాడు.

మోతుబరి మండిపడి, ‘‘అబద్ధాల కూతలతో నన్ను అవమానించటానికేనా పిలిచారు?'' అన్నాడు. రామశాస్ర్తి అతనితో, ‘‘ఆగ్రహించకండి. కొందరు హస్తసాముద్రికమంతా తమకే తెలుసుననుకుంటారు. మీ చెయ్యి నన్ను కూడా చూడనివ్వండి..., ఈ చెయ్యి లక్ష్మీ పుత్రుడిది. ఈ రేఖలు గొప్ప ఉదారస్వభావాన్ని సూచిస్తున్నాయి. ఎంతటివారైనా ఈ వ్యక్తి ముందు పిల్లుల్లాగా అయిపోతారు.
 
పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి!'' అన్నాడు. ఈ మాటలకు మోతుబరి చెప్ప లేనంతగా పొంగిపోయి, ‘‘శబాష్‌! నా సంగతంతా దగ్గిరుండి చూసినట్టు చెప్పావు. చెయ్యి చూసి చెబితే అలా చెప్పాలి గాని, ఈ రెండో ఆయనలా పుల్లవిరుపుగా మాట్టాడితే ఎలా,'' అన్నాడు. రామశాస్ర్తి ఆయన చేతిలోకి చూస్తూ, ‘‘మీరు నా శాస్ర్తజ్ఞానాన్ని మెచ్చుకుని నాకు ఉంగరం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు.
 
మీ దాతృత్వం జగమెరిగినది గదా,'' అన్నాడు. ఈ మాటతో మోతుబరి కొయ్యబారి పోయూడు. రామశాస్ర్తి అది చూసి, ‘‘కొంపతీసి తప్పు చెప్పానా ఏమిటి? ఎందుకు అలా చూస్తున్నారు?'' అని అడిగాడు. మోతుబరి తమాయించుకుని, ‘‘అబ్బే, మరేమీ లేదు. నా మనసులో మాట కూడా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది,'' అని తన వేలిన ఉన్న ఖరీదైన ఉంగరం తీసి రామశాస్ర్తికి ఇచ్చి, తన దారిన తాను వెళ్ళిపోయూడు.
 
అందరూ రామశాస్ర్తిని రకరకాలుగా పొగడి, అతను పరీక్షలో గెలిచినట్టు అంగీకరించారు. భద్రయ్య ముఖం ముడుచుకుపోయింది. రామశాస్ర్తి వారితో, ‘‘నిజానికి ఈ భద్రయ్యగారు హస్తసాముద్రికంలో చాలా గట్టివాడే. కాని అదే వృత్తిగా గల నాబోటి వాడికి శాస్ర్తజ్ఞానం చాలదు. సమయస్ఫూర్తి కూడా ఉండాలి. జ్ఞానానికి లౌక్యం తోడు కాకపోతే అర్థంలేని అహంకారం పెరుగుతుంది. అహంకారం అవమానం తెచ్చి పెట్టుతుంది,'' అన్నాడు.

అత్తాకోడళ్ళ పోరు


 
ఏ ముహూర్తాన అరుంధతి అత్తవారింట అడుగు పెట్టిందోగాని, ఆమెకూ, అత్త ఆండాళ్ళమ్మకూ క్షణం పడేదికాదు. అత్త ఎడ్డెమంటే, కోడలు తెడ్డెమనేది. ఎప్పుడైనా మనసుపడి కోడలు కొత్త చీర సింగారించి శిగలో పూల చెండు తురుముకుంటే, ఆండాళ్ళమ్మకు మనసు ఒప్పేదికాదు. ‘‘ఏమిటీ వీధిమనిషివేషాలు? అసలిది సంసారుల కొంపేనా!'' అని ఈసడించేది.
 
‘‘నేను సింగారించుకుంటే, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావెందుకు?'' అని అత్తను ఎత్తిపొడిచేది అరుంధతి. ఏరోజైనా ఆండాళ్ళమ్మ తోటకూర తెచ్చి తి…్యుగూర చె…్యుమంటే, నీ కొడుక్కు పుల్లగూరే ఇష్టమని-పెడసరంగా బదులిచ్చేది అరుంధతి. రోజంతా పొలంలో కష్టపడి పని చేసి, చీకటి పడేవేళకు ఇంటికి తిరిగి వచ్చే అమర…్యుకు, ఈ అత్తాకోడళ్ళ పోరుతో మనశ్శాంతి లేకుండా పోయింది.
 
సాధుస్వభావంగల అతను, అటుభార్యకు గాని, ఇటు తల్లికిగాని సర్ది చెప్పలేక సతమతమై పోేువాడు. ఒక రోజు సా…ుంకాలం, ఇంటికి తిరిగి పోవడానికి మనసురాక, అమర…్యు పొలం గట్టు మీద విచారంగా కూర్చున్నాడు. అంతూపొంతూ లేకుండా ఎటైనా పారిపోవడమా లేక సన్యాసుల్లో కలిసి పోవడమా అని ఆలోచి స్తున్న అమర…్యును, ఆ దారి వెంట వెళుతున్న అతడి మిత్రులు రామ…్యు, భీమ…్యు చూసి దగ్గరకు వచ్చి, ‘‘ఏమైంది?
 
కొత్తగా పెళ్ళయిన వాడివి ఇట్లా దిగాలు పడి, ఇంటికి పోకుండా ఇక్కడ కూర్చున్నావేమిటి?'' అని అడిగారు. అమర…్యు, వాళ్ళకు తన పరిస్థితి వివరించి, ‘‘సరే, అంతా నాఖర్మ! అనుభవించక తప్పదు కదా. అది సరే, ఇప్పుడు మీ ప్ర…ూణం ఎక్కడిదాక?'' అని అడిగాడు. అందుకు వాళ్ళు, ‘‘పొరుగూరులో నాటకాలాడుతున్నారు. వేషంకట్టడానికి వెళుతున్నాం.

త్వరలో శ్రీరామ నవమి వస్తున్నది కదా!'' అన్నారు. ఆ తర్వాత రామ…్యు, భీమ…్యులు కాసేపు అమర…్యుతో అవీయివీ మాట్లాడి, ‘‘నువ్వేమీ దిగులు పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళు. త్వరలోనే నీ సమస్య పరిష్కారమై పోతుందిలే!'' అన్నాడు రామ…్యు. ‘‘అవును, రామ…్యు మాటకు తిరుగు లేదు మరి!'' అంటూ భీమ…్యు గట్టిగా నవ్వాడు.
 
ఒక వారం గడిచింది. ఆ రోజు నిండుపున్నమి. అమర…్యు గాఢనిద్రలో వున్నాడు. పెరట్లో నూతి దగ్గర ఏదో గలగలమంటూ పెద్దగా శబ్దం వినిపించింది. అత్తాకోడళ్ళిద్దరూ ఉలిక్కి పడి లేచి కూర్చుని, ఏమిటా శబ్దం అని ఆశ్చర్య పోతూ, పెరటిగుమ్మం తలుపు తీసి పెరట్లోకి వెళ్ళారు. నూతి గట్టుమీద రెండు జడల ద…్యూలు కూర్చుని, ఒక నగల మూటను ఊపుతూ గలగల శబ్దం చేస్తున్నవి. అది చూసి కెవ్వున అరవబోయిన అత్తాకోడళ్ళకు గొంతు పెగల్లేదు.
 
అది గమనించిన జడలద…్యూలు, ‘‘భ…ుపడకండి! మనుషుల్లో మంచివాళ్ళున్నటే్ట, ద…్యూల్లో మంచి ద…్యూలుండడం విడ్డూరమేంకాదు. అసలు సంగతేమంటే-అత్తాకోడళ్ళ పోరులేని ఇంట, ఈ నగల మూట వదిలి వెళదామని, ఊరంతా గాలిస్తూ ఇటు వచ్చాం. ఎంత తిరిగినా ఎక్కడా అలాంటి ఇల్లు ఒక్కటీ కనిపించలేదు. ఈ ఇంట్లోనూ అత్తాకోడళ్ళ మధ్య సఖ్యతవున్నట్టు తోచదు!'' అంటూ ఉస్సురుమన్నది పెద్ద జడలద…్యుం.

ఈ మాటలతో కొంత ధైర్యం తెచ్చుకున్న ఆండాళ్ళమ్మ, ‘‘సరే, ఇంతకూ ఈ నగల మూట మీకెక్కడిది?'' అని అడిగింది మెల్లగా అడుగు ముందుకు వేస్తూ. ఆ ప్రశ్నకు చిన్న జడలద…్యుం రెండు చేతులతో గట్టిగా తలగోక్కుని, ‘‘అదంతా చాలా పెద్ద కథ! నాలుగు మాటల్లో - మొన్న అర్ధరాత్రి మేమిద్దరం అడవిలో తిరుగు తూండగా, ఇద్దరు దొంగలు ఈ నగల మూటతో మాకెదురు పడి, కెవ్వుమంటూ కేకపెట్టి, మూటను జారవిడిచి చెట్లకడ్డంపడి పరుగు తీశారు,'' అన్నది.
 
ఆ జవాబువింటూనే ఆండాళ్ళమ్మ ఏదో మాట్లాడబోేుంతలో అరుంధతి ఆగమన్నట్టు అత్తకేసి గట్టిగా చేయివూపి, ‘‘మీ కథ బుద్ధిమంతులూ నమ్మదగినట్టుగానే వుంది! అయితే, ఆ నగలను ఎవరైనా పేదవాళ్ళకు దానం చె…్యుకుండా, పోరు లేని అత్తాకోడళ్ళకే ఇవ్వాలన్న ఆలోచన ఎందుక్కలిగింది మీకు?'' అని అడిగింది. అందుకు పెద్ద జడలద…్యుం విచారంగా, ‘‘గొంతు పట్టుకుపోేు ప్రశ్న అడిగావు, కోడలా! మేమిద్దరం కూడా మీలాగే అయినదానికీ కానిదానికీ పోట్లాడుకునే అత్తాకోడళ్ళమే.
 
మా ఇంటి కెదురుగా ధ్యానమందిరం ఒకటుండేది. అందులో ధ్యానం చేసుకునే జటామునికి, మా అరుపులూ కేకలూ ధ్యానభంగం కలిగిస్తూండడంతో ఆగ్రహించి, మమ్మల్ని ద…్యూలై పొమ్మని శపించాడు. అప్పుడు మేం ఆ…ున పాదాలపై బడి, క్షమించమని కోరగా - ఏ ఇంట్లో అయితే, అత్తాకోడళ్ళు సఖ్యంగా వుంటారో, ఆ ఇంటికి మీరు మంచి చేశారంటే, అప్పుడు మీకు ద…్యూల రూపం పోయి మనిషి రూపం వస్తుంది, అని చెప్పాడు,'' అన్నది.
 
అప్పుడు ఆండాళ్ళమ్మ, ‘‘ఇంతకూ ఆ నగల మూటను మాకిస్తారు గదా!'' అన్నది సందేహిస్తూ. ‘‘ఓ, నిక్షేపంగా ఇస్తాం! దానికి బదులుగా, మీరు మాకొక మాటివ్వాలి,'' అన్నది చిన్న జడలద…్యుం. ‘‘అలాగే! చెప్పండి,'' అన్నారు అత్తాకోడళ్ళు ఆశగా. ‘‘వచ్చే పౌర్ణమికి నగల మూటతో మళ్ళీ వస్తాం. ఈ నగల మీది ఆశతో కాకుండా, మీ అత్తాకోడళ్ళు నిజంగానే ఎంతో సఖ్యంగా వుండాలి. అలావున్నారా లేదా అనేది, మేం అదృశ్యంగా వుండి కనిపెడుతూనే వుంటాం.

సరే, తొలికోడి కూసేవేళయింది. పోయి, తలుపులు మూసుకుని పడుకోండి,'' అన్నవి జడలద…్యూలు. అత్తాకోడళ్ళు తృప్తిగా తలాడించి, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇంట్లోకి వెళ్ళాక, ద…్యూలు రెండూ పెరటి గోడదూకి చీకట్లో కలిసిపో…ూయి. ఆ మర్నాటి నుంచీ అత్తాకోడళ్ళు మంత్రం వేసినట్టుగా, తల్లీకూతుళ్ళలాగా సఖ్యంగా, ప్రేమగా మెలగ సాగారు. ఇది చూసి అమర…్యుకు అంతులేని ఆనందమూ ఆశ్చర్యమూ కలిగింది.
 
ఈ విధంగా ముప్ఫయి రోజులు గడిచి పో…ూయి. ఆ రోజు పౌర్ణమి. పెరట్లో వెన్నెల విరగబూచి కాస్తున్నది. ఎప్పుడు ఆ జడల ద…్యూలు వస్తా…ూ, నగల మూట తమ చేతికిస్తా…ూ అని, అత్తాకోడళ్ళిద్దరూ నిద్రపోకుండా కాచుక్కూర్చున్నారు. తొలికోడి కూసింది. అయినా ద…్యూల జాడలేదు. అత్త ఆండాళ్ళమ్మ విచారంగా అరుంధతితో, ‘‘మనం ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ప్రేమకన బరుచుకోవాలని ద…్యూలు చెప్పాయి కదా!
 
నాకు లోలోపల అప్పుడప్పుడు కొన్ని చెడ్డ ఆలోచనలూ, కపట బుద్ధీ కలిగిన మాట నిజం. ఇది గ్రహించే ద…్యూలు రాలేదనుకుంటున్నాను,'' అన్నది. ‘‘నీలాగే నాకూ అలాంటి ఆలోచనలు వచ్చిన మాట నిజం, అత్త…్యూ! నగల సంగతి ఎందుకు? ఈ నెల్లాళ్ళూ మనం ఎంతో అన్యోన్యంగా వున్నాం. ఇక బతికినన్నాళ్ళూ ఇలాగే కలిసి కట్టుగా జీవిద్దాం. అప్పుడు, మీ అబ్బాయి కూడా ఎంతగానో సంతోషిస్తాడు,'' అన్నది అరుంధతి.
 
‘‘అవును మరి! చిన్న దానివైనా ఎంచక్కటి ఆలోచనవచ్చిందే నీకు, అరుంధతీ!'' అంటూ ఆండాళ్ళమ్మ, కోడలిని మెచ్చుకున్నది. పక్కగదిలో వున్న అమర…్యు, తొలికోడి కూతవింటూనే, ఇక పొలానికి వెళ్ళాలని బ…ుల్దేరబోతూ, వాళ్ళ సంభాషణ విని, అత్తాకోడళ్ళలో వచ్చిన మంచి మార్పుకు చాలా ఆనందించాడు. తన మిత్రులిద్దరూ ద…్యూల రూపంలో వచ్చి తన ఇంటిని చక్కదిద్దారన్న సంగతి, అతడికి తెలి…ుదు!

పశ్చాత్తాపం


మోతీహారీ గ్రామంలో రఘులాల్‌ అనే ఒక పేదరైతు ఉండేవాడు. అదే గ్రామంలో ప్యారే లాల్‌ అనే ధనికుడైన వడ్డీవ్యాపారి ఉండేవాడు. గ్రామస్థులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి, మోసం చేసి అతడు డబ్బులు కూడబెట్టాడు. వడ్డీవ్యాపారి చేసే కుతంత్రాలు గ్రామస్థులకు తెలుసు. అయినా, అవసరాలలో తమను ఆదు కునే దిక్కు మరెవ్వరూ లేరుగనక, తాము మోసపోతున్నామని తెలిసినా, గ్రామస్థులు సాయం కోసం ప్యారేలాల్‌నే ఆశ్రయించేవారు.
 
అందువల్ల అప్పులు చేసే ప్రజలు నానాటికి మరింత పేదలుగా మారుతూంటే, అప్పులిచ్చే వ్యాపారి మరింత ధనికుడుగా ఎదగసాగాడు. ప్యారేలాల్‌ డబ్బు అప్పుగా ఇచ్చేప్పుడు పత్రాలు రాసుకునేవాడు కాదు. ‘‘పత్రాల మీద సంతకాలెందుకు? మీకు డబ్బుకావాలి. నేను ఇస్తున్నాను. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి చెల్లించండి. అయితే, వడ్డీ మాత్రం నెల నెలా చెల్లిస్తూ రావాలి. అది చాలు,'' అనేవాడు.
 
అప్పు పుచ్చుకున్నవారికి యేడాది పొడవునా, తాము పుచ్చుకున్నదానికన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించినట్టు అనిపించేది. అయితే, అసలు డబ్బు ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండేది. ప్యారేలాల్‌ లెక్కలు వారికి అంతుబట్టేవి కాదు. రఘులాల్‌ కూడా ప్యారేలాల్‌ దగ్గర అప్పు చేశాడు. డబ్బుల్లేనప్పుడు వడ్డీ కింద ప్యారేలాల్‌ ధాన్యం పట్టుకు పోయేవాడు. కొద్ది కొద్దిగా పొలాన్ని చేజిక్కించుకునేవాడు.
 
ఏదీ లేదంటే ఇంట్లో ఉన్న పాత్రసామగ్రిని పట్టుకుపోయే వాడు. ఒక నెల కనిపించక పోయేసరికి రఘు లాల్‌ ఇంటికి ఆతృతగా వెళ్ళాడు ప్యారేలాల్‌. ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన రఘులాల్‌, ‘‘అయ్యూ, కట్టుబట్టలు తప్ప నా దగ్గర మరేదీ లేదు. మార్చుకోవడానికి కూడా వేరే బట్టలు లేవు.
 
నన్నేం చేయమంటారు?'' అన్నాడు విచా రంగా. ‘‘సాయం అర్థించడానికి రాముడి వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? నా పట్ల అతడెంతో కరుణ చూపేవాడు. వెళ్ళిరా, నేను కొన్నాళ్ళ తరవాత వస్తాను,'' అని చెప్పి ప్యారేలాల్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయూడు.

‘‘ఆ రాముడు, ప్యారేలాల్‌కు సాయం చేసి వుంటే, నాకూ …ప్పక సాయం చేయగలడు. ఇప్పుడే బయలుదేరాలి,'' అనుకుంటూ రఘు లాల్‌ అప్పటికప్పుడే రాముణ్ణి వె…ుక్కుంటూ బయలుదేరాడు. నడిచాడు, నడిచాడు సాయం కాలం వరకు నడిచాడు. రాముణ్ణి గురించి ఆచూకీ చెప్పేవారు ఒక్కరూ కనిపించలేదు. ఆఖరికి ఒక పూజారిలాంటి మనిషి కనిపించ గానే, ‘‘నాదగ్గరున్న మూడు రొట్టెల్లో ఒకటి ఇస్తాను.
 
దయూపరుడెన రాముణ్ణి నేనెక్కడ చూడగలనో చెబువా?'' అని అడిగాడు. అ…డు ఏమీ పలక్కుండా రొట్టెముక్క కేసి కనీసం క్షణం కూడా చూడకుండా ఏదో మన సులో గొణుక్కుంటూ వెళ్ళిపోయూడు. రఘు లాల్‌ మరికొం… దూరం నడిచాక, ముఖాన విబూదిరేఖలో ఒక సాధువు ఎదురయ్యూడు. ఆయన చేతిలో ఒక రొట్టెముక్కను పెట్టి, ‘‘రాము డెక్కడ ఉంటాడు? ఆయన ఉండే చోటు మీకు …ప్పక ెలిసే ఉంటుంది,'' అన్నాడు రఘు లాల్‌. ‘‘నాకు శివుణ్ణి గురించే ెలుసు.
 
రాముణ్ణి గురించి ెలియదు,'' అంటూ వెళ్ళి పోయూడు ఆ సాధువు. రఘులాల్‌ అలా నడుస్తూ నడుస్తూ బాగా అలిసి పోయూడు. ఎవరెనా ఎదురుపడి రాము డుండే చోటు చెప్పక పోారా, వారిో కలిసి రొట్టెలు పంచుకుని తినకపోానా అన్న ఆశ కొద్దీ ఆకలిగా ఉన్నప్పటికీ రొట్టెలు తిన కుండానే నడవసాగాడు. ఆఖరికి చింపిరి దుస్తులో ఒక పేదవాడు ఎదురుపడ్డాడు. అ…డూ బాగా అలిసిపోయి కనిపించాడు.
 
‘‘నేను రాముడి కోసం వెళు…ున్నాను. ఆయన నాకు సాయపడ గలడని చెబు…ున్నారు,'' అంటూ రొట్టెల మూటను విప్పాడు. ‘‘అలాగా! నువ్వు రాముణ్ణి చూడాలని వెళు…ున్నావా? నేనే రాముణ్ణి. నేనేం సాయం చేయగలనో చెప్పు,'' అన్నాడ…డు రొట్టెల కేసి ఆ్ర…ంగా చూస్తూ. ‘‘ఇదిగో, ఈ రొట్టె తీసుకో,'' అంటూ రఘులాల్‌ అ…డి చేతికి ఒక రొట్టె ఇచ్చాడు. ఇద్దరూ తినడం ప్రారంభించారు.
 
ఆరవాను వడ్డీ వ్యాపారి ద్వారా ఎలా మోసపోయిందీ ఏకరువు పెట్టి, ‘‘నా వద్ద ఇప్పుడు డబ్బులూ లేవు, ధాన్యమూ లేదు. కుంట పొలం కూడా లేదు. ఎలా బ…కాలో ెలియడం లేదు,'' అన్నాడు రఘులాల్‌ విచారంగా. ఆకలి తీరిన పేదవాడు …న సంచీలో నుంచి ఒక శంఖాన్ని తీసి, రఘులాల్‌కి ఇచ్చి, ‘‘దీనిని ఇలా ఊదావంటే నీకు కావలసినది ఇస్తుంది. దీన్ని ఊదే శక్తి నాకు లేదు. గనక, నాకు ఉప యోగపడదు. నువ్వే తీసుకో.

మళ్ళీ వడ్డీ వ్యాపారి చేత… మోసపోకుండా మా్ర…ం జాగ్ర్తిపడు,'' అని చెప్పి నదారిన వెళ్ళిపోయూడు. రఘులాల్‌ ఇంటికి తిరిగి వచ్చాడు. …లు పులూ, కిటికీలూ మూసి వచ్చి శంఖాన్ని ఇటూ అటూ తిప్పు…ూ ఊదసాగాడు. అ…డుదాన్ని ఒక విధంగా పట్టుకుని ఊదినప్పుడు నాణాలు రాలాయి. అ…డు దురాశాపరుడు కాదు గనక, అం…టిో ఊదడం ఆపాడు. ఆరోజు …నకు కావలసిన ఆహారం కొనడానికి చాలినన్ని నాణాలు ఉంటే చాలనుకున్నాడు.
 
ఆ రోజంా విశ్రాంతి తీసుకుని, మరునాడు ెల్లవారగానే …నకున్న కొద్దిపాటి పొలంలో పనిచేయడానికి వెళ్ళాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు ప్యారే లాల్‌ కో…కు సిద్ధంగా ఉన్న రఘులాల్‌ చిన్న పంట పొలాన్ని చూసి ఆశ్చర్యపోయూడు. తిను బండారాలు తీసుకుని రఘులాల్‌ ఇంటికి వెళ్ళి, ‘‘మళ్ళీ నీ ఇంటికి సంపద కలగడం నా కెం ఆనందంగా ఉంది రఘులాల్‌. నేను ఇప్పుడు పా…బాకీ వసూలు చేసుకోవడానికి రాలేదు. నీ విజయ రహస్యం ఏమిటి? ఇం… సంపద ఎలా కలిగింది? అది చెప్పు చాలు,'' అన్నాడు నవ్వు…ూ.
 
వెర్రిబాగులవాడెన రఘులాల్‌ శంఖాన్ని తీసి చూపు…ూ, ‘‘నా సంపదకం…టికీ ఇదే కారణం,'' అన్నాడు. ప్యారేలాల్‌ శంఖాన్నెలాగెనా రె…ు నుంచి కాజేయూలనుకుని పథకం వేశాడు. కొం…సేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడు…ూ గడిపి, బయలుదేరేప్పుడు శంఖాన్ని చాకచక్యంగా దుస్తుల్లో దాచుకుని వెళ్ళిపోయూడు. …నకు శంఖం అవసరం అప్పటికి లేదు గనక, రఘు లాల్‌ కూడా అది ఎక్కడుందో పట్టించుకోలేదు.
 
ఇంటికి చేరిన ప్యారేలాల్‌ శంఖాన్ని ఊద డానికి ప్రయత్నించాడు. అయిే ఎం… ప్రయ త్నించినా ఎలాంటి శబ్దమూ రాలేదు. రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ప్యారేలాల్‌ మళ్ళీ రఘులాల్‌ వద్దకు వెళ్ళి, ‘‘మి్ర…మా, ఆ రోజు నీకో మాట చెప్పడం మరిచాను. నువ్వు చూపిన శంఖాన్ని చూసి దాని అందానికి ముచ్చట పడి నావెంట పట్టుకుపోయూను.
 
ఊదినప్పుడు ఎలాంటి శబ్దమూ రాలేదేంటి? దాని వల్ల నీకిన్ని సిరి పదలు సమకూరాయంటే నమ్మశక్యం కాలేదు,'' అన్నాడు. రఘులాల్‌ ఆ శంఖాన్ని తీసుకుని ఊదాడు. గలగలమంటూ శంఖంలోంచి నాణాలు రాలడం చూసిన ప్యారేలాల్‌ …న కళ్ళను ానే నమ్మ లేకపోయూడు. ‘‘బావుంది, రఘులాల్‌ చాలా బావుంది. నా దగ్గర నువ్వు తీసుకున్న అప్పు సంగతి ఈ క్షణమే మరిచిపో. అయిే, ఒక్క సంగతి. ఈ శంఖం ఊదడం ద్వారా నీ కెంత ధనం వస్తుందో అంతకు రెండింతలు నాకు వచ్చేలా చూడు, సరేనా?'' అన్నాడు.

రఘులాల్‌కు కోపం వచ్చింది. ‘‘నువ్వు నన్నెంతకాలమో మోసం చేశావు. అవునా? నువ్వు నా వద్ద నుంచి పుచ్చుకున్న అదనపు డబ్బును నాకివ్వాలి. నా పొలాన్ని మళ్ళీ నాకు అప్పగించాలి. పాత్ర సామగ్రి విషయం కూడా మరిచిపోవద్దు. అవి లేకుండా వంటలు చేసుకో లేకుండా ఉన్నాను,'' అన్నాడు. ప్యారేలాల్‌ శంఖాన్ని అంది పుచ్చుకుని, ‘‘అయితే, దీన్ని నా వద్దే ఉండనివ్వు. నీకూనాకూ ఇద్దరికీ ఉపయోగపడకూడదు,'' అంటూ అక్కడి నుంచి బయలు దేరబోయూడు.
 
రఘులాల్‌, ‘‘సరే నువ్వు నానుంచి ఇక డబ్బు అడగవన్న మాటను నమ్ముతున్నాను. ఆ శంఖం నాకిచ్చెయ్‌. అది ఊదినప్పుడు నాకు లభించేవన్నీ రెండింతలు నీకు లభిస్తాయి. అయితే, నా పాత్ర సామానులు ఈ రో జే నాకు ఇవ్వాలి. పొలాన్ని నాపరం చేసి, అందులో పనిచేస్తూన్న నీ కూలీలను ఈ రోజే వెనక్కు తీసుకోవాలి,'' అన్నాడు. ప్యారేలాల్‌ తలవంచుకుని వెళ్ళిపోయూడు. సాయంకాలానికే అతడి పాత్రలు ప్యారేలాల్‌ పనిమనుషులు తెచ్చి ఇచ్చి వెళ్ళారు.
 
మరు నాడు శంఖాన్ని తీసి, రఘులాల్‌ నాణాలు రావాలని కోరుకోవడానికి బదులు తన కన్ను ఒకటి పోవాలని కోరుకుంటూ ఊదాడు. మరి కొన్ని రోజులలో ప్యారేలాల్‌ కూలీలు తన పొలం వదిలి వెళ్ళడం రఘులాల్‌ చూసి సంతోషిం చాడు. అప్పటికప్పుడే బయలుదేరి ప్యారేలాల్‌ వద్దకు వెళ్ళాడు. రెండు కళ్ళు పోగొట్టుకున్న ప్యారేలాల్‌, రఘులాల్‌ కంఠస్వరం వినగానే, చేతిలోని కరన్రు నేలకేసి తడుతూ వచ్చాడు.
 
తగిన శాస్తి జరిగిందని రఘులాల్‌ సంతోషించాడు. ‘‘రఘులాల్‌, నేనెన్నో దుర్మార్గాలకు ఒడి గట్టాను. నన్ను క్షమించు. మళ్ళీ నాకు కంటి చూపునివ్వమని నీ శంఖాన్ని కోరుకో. నా జీవి తాంతం ఎవరికీ అపకారం తెలపెట్టను. దేవుడి మీద ఒట్టు!'' అని ప్రాథేయ పడసాగాడు ప్యారేలాల్‌. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ప్యారే లాల్‌ను చూసి, రఘులాల్‌కు జాలికలిగింది.
 
అతడు చూపు పోయిన తన కంటికి తిరిగి చూపు రావాలనుకుంటూ శంఖం ఊదాడు. మరు క్షణం అతడి కంటితో పాటు ప్యారేలాల్‌ రెండు కళ్ళకూ చూపువచ్చింది. ఆ తర్వాత నుంచి ప్యారేలాల్‌ ఎవరినీ మోస గించకుండా, ధర్మవడ్డీకి అప్పులిస్తూ, గ్రామ స్థుల చేత మంచివాడనిపించుకున్నాడు.

కోడిపుంజు సాయం!


ఈనాటి ఇండొనేషియూలో అంతర్భాగమైన జావాలో శతాబ్దాలక్రితం పలు రాజ్యాలు ఉండేవి. అలాంటి ఒక రాజ్యానికి కేతనం కోడిపుంజు. దానికి సంబంధించిన పూర్వగాథ ఇది: రాజుగారి ఏకైక సంతానమైన యువరాజుకు కోడిపందాలంటే మహా ఇష్టం. ఎప్పుడు చూసినా స్నేహితులతో కలిసి కోడిపందాలాడుతూ వినోదిస్తూండేవాడు.
 
అందువల్ల ఆయన స్నేహితులు బలమైన కోడిపుంజులు ఎక్కడ కనిపించినా సరే, అవి ఎవరివైనా సరే, వాటిని పట్టుకుని కోడిపందాలు నిర్వహించేవారు. ఎవరో వచ్చి, తాము యువరాజు మిత్రులమని చెప్పి తమ కోడిపుంజులను పట్టుకుపోవడం రాజ్య ప్రజలకు బాధ కలిగించింది. అయినా, ఆ విషయూన్ని రాజుగారి దృష్టికి తీసుకు వెళ్ళే ధైర్యం ఎవరికీ లేదు.
 
అయితే, రాజు ఒకసారి మారువేషంలో తిరుగుతూ, కొందరు యువకులు రైతులనుంచి బలవంతంగా బలిష్ఠమైన కోడిపుంజులను లాక్కుపోవడం, ఇదంతా యువరాజు కోసమే చేస్తున్నట్టు చెప్పడం గమనించాడు. ఆ తరవాత ప్రజలు ఇది తరచూ జరుగుతూన్న వ్యవహారమే అని మారువేషంలో వున్న రాజు అడగడంతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు.
 
విచారంతో రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు, యువరాజును వెంటనే రాజ్యాన్ని వదిలి వెళ్ళమని ఆగ్రహావేశంతో ఆజ్ఞాపించాడు. యువరాజుకు రాజభవనాన్ని వదిలిపెట్టక తప్పలేదు. యువరాజు రాజ్యపొలిమేరల్లో వున్న అరణ్యం చేరే వరకు గూఢచారులు ఆయన్ను వెంబడించి వెళ్ళి, తిరిగివచ్చారు. అప్పటికే బాగా పొద్దుపోయింది.
 
అర ణ్యాన్ని మెల్ల మెల్లగా చీకటి ఆవరిస్తోంది. యువరాజు దారీ తెన్నూ తెలియక కొట్టుమిట్టాడ సాగాడు. ధైర్యశాలి అయినప్పటికీ క్రూర మృగాల అరుపులు అతన్ని ఆందోళనకు గురిచేశాయి. అంతలో దూరంలో వున్న ఒక గుడిసెలోంచి మిణుకు మిణుకుమంటూ దీపం వెలుతురు కనిపించడంతో, అక్కడికి వెళ్ళి తలుపుతట్టాడు. తలుపు తెరిచిన ఒక యువతి నఖ శిఖ పర్యంతం అతన్ని అనుమానంగా చూసింది.
 
అతడు తాను యువరాజునన్న విషయం మాత్రం దాచి, రాజుగారి ఆగ్రహానికి లోనై రాజ్యబహిష్కారం శిక్ష పొంది, అడవులు పట్టిన దురదృష్టవంతుణ్ణని మాత్రం చెప్పాడు. ఆ యువతి అతని మీద దయ తలచి తలదాచుకోవడానికి చోటిచ్చింది. ఆమె తల్లిదండ్రులు అడవిలో లభించే మూలికలను సేకరించి, వైద్యులకు అమ్మి, దాంతో వచ్చే ఆదాయంతో పొట్టపోసుకునేవారు. వారు అలా ఒకనాడు మూలికలతో, దాపులనున్న నదిని దాటుతూండగా, వెల్లువ వచ్చి వాళ్ళు ఎక్కిన పడవ తల్లకిందులు కావడంతో చనిపోయూరు.
 
ఆ తరవాత ఆ యువతి ఎక్కడికి వెళ్ళడమో తెలియక, తన తల్లిదండ్రులు చేసిన పనినే కొనసాగిస్తూ అక్కడే ఒంటరిగా ఉంటున్నది. ఆమె వివరాలు తెలుసుకున్న యువరాజు ఆమెతో పాటే ఉండిపోవాలని నిశ్చయించుకుని, ఆమె సమ్మతితో ఆమెను పెళ్ళాడాడు. అతడు దృఢమైన శరీర సౌష్ఠవం కలవాడూ, తెలివైనవాడూ కావడంతో జింకలనూ, పక్షులనూ పట్టి, కట్టెల కోసం అడవికి వచ్చినవారికి అమ్మేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. తన తండ్రి మరణించిన వార్త, కట్టెలు కొట్టేవారి ద్వారా యువరాజుకు చేరింది.
 
‘‘నేను ఇప్పుడే నగరం వెళ్ళి కొన్ని రోజుల తరవాత వస్తాను. వచ్చాక నీకో శుభవార్త చెబుతాను. మనకు మంచి రోజులు రానున్నాయి,'' అన్నాడు భార్యతో. ‘‘త్వరగా వచ్చెయ్‌. వచ్చాక నేనూ నీకో సంతోషకరమైన విషయం, చెబుతాను,'' అన్నది భార్య, తాను తల్లి కాబోతూన్న విషయం బయట పెట్టకుండా. తిరిగి వచ్చిన యువరాజును చూడగానే నగర ప్రజలు ఆనందోత్సాహాలు పొందారు. రాజ్యానికి ఏకైక వారసుడు ఆయన.
 
యువరాజుకు రాజ్య బహిష్కార శిక్ష విధించాడే తప్ప, రాజు తనకు వారసుడిగా వేరెవరినీ ప్రకటించలేదు. యువరాజుకు వెనువెంటనే రాజ్య పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయ బద్ధమైన ఇతర క్రతువులు జరగడానికి మరికొన్ని రోజులు పట్టింది. వాటి మధ్య అడవికి వెళ్ళి భార్యను చూసే అవకాశం యువరాజుకు కలగలేదు.
అదే సమయంలో అడవిలో అకాలవర్షాలు, వెల్లువ బీభత్సం సృష్టించాయి. యువరాజు భార్య ఒక గుహలో తలదాచుకోవలసివచ్చింది. అడవి సమీపంలో నివసించే కట్టెలుకొట్టేవారి భార్యలు యువరాజు భార్య ప్రసవ సమయంలో దగ్గరుండి ఆమెను ఆదుకున్నారు. ఆమె చక్కని మగబిడ్డను కన్నది. పట్టాభిషేకానంతరం యువరాజు, తన భార్యను రాజధానికి వెంటబెట్టుకు రావడానికి అడవికి వెళ్ళాడు.
 
అయితే, అక్కడ ఆమెగాని, ఆమె గుడిసె ఆనవాళ్ళుగాని కనిపించలేదు. నిరాశతో వెనుదిరిగి వచ్చాడు. ఒకనాడు యువరాజు భార్య బిడ్డతో, గుహ ముందు కూర్చుని వున్న సమయంలో, ఆకాశంలో ఎగురుతూన్న ఒక గద్ద ముక్కు నుంచి ఒక కోడిపిల్ల జారి ఆమె ఎదుట పడింది. ఆమె దానిని తీసి కాపాడింది. తన బిడ్డతో పాటు ఆహారం పెడుతూ పెంచసాగింది.
 
కోడిపిల్ల, ఎవరూ ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరగనంతగా బలిష్ఠ మైన కోడిపుంజుగా ఎదిగింది. దాన్ని చూసిన ఇతర పక్షులూ, జంతువులూ ఆ గుహ దరిదాపు లకు రావడానికి కూడా జడుసుకునేవి. అక్కడ నగరంలో కొత్త రాజు మళ్ళీ కోడిపందాలను ప్రారంభించాడు. అయితే, ఇప్పుడు కోడిపుంజులను రైతుల నుంచి బలవంతంగా అపహరించడంలేదు. పందాలలో గెలిచిన పుంజులకు బహుమతులు ఇస్తామని ప్రకటించాడు.
 
ఆ ప్రకటన గురించి కట్టెల కొట్టే వారి ద్వారా అడవిలో పెరుగుతూన్న యువరాజు కుమారుడు కళేరసు చెవిన పడింది. అతనికిప్పుడు వయసు పన్నెండేళ్ళు. తల్లి అను మతితో కళేరసు తన కోడిపుంజును తీసుకుని రాజధానికి బయలుదేరాడు. అతడు అక్కడికి చేరేసరికే కోడిపందాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ రోజు రాజుగారే స్వయంగా శిక్షణ ఇచ్చిన కోడిపుంజు ఇతర పుంజులను ఢీకొని సులభంగా ఓడించింది.
 
‘‘మహారాజా! నా పుంజు, మీ పుంజును గనక ఓడిస్తే మీరు నాకేం బహుమతి ఇస్తారు?'' అని అడిగాడు కళేరసు, బుట్టలో దాచిన తన కోడిపుంజును చూపకుండా. రాజు మొదట ఆ కురవ్రాణ్ణి చూడగానే తెలి యని ఆకర్షణకులోనయ్యూడు. ‘‘అయితే, మా పుంజు నీ పుంజును ఓడిస్తే?'' అని అడిగాడు రాజు. ‘‘నేను నా పుంజు ద్వారా బహుమతి సంపాయిద్దామన్న ఆశతో వచ్చిన పేద కుర్రాణ్ణి. మీకేం ఇవ్వగలను? కొన్నాళ్ళు మీకు సేవలందించగలను,'' అన్నాడు కళేరసు. ఆ తరవాత బుట్టలోనుంచి కోడిపుంజును వెలుపలికి తీశాడు.

‘‘ఓరి దేవుడా! ఎంత పెద్ద కోడిపుంజు!'' అంటూ ఆశ్చర్యపోయూరు అక్కడి వారందరూ. పందాలు ఆరంభమయ్యూయి. అంతకు క్రితం, మిగతా పుంజులన్నిటినీ ఓడించిన రాజుగారి కోడిపుంజు, కళేరసు కోడిపుంజు వద్ద చిత్తుగా ఓడిపోయింది. రాజు కళేరసుకు వంద బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.
 
ఆ తరవాత రాజుగారి వద్ద వున్న మిగిలిన కోడిపుంజులన్నింటినీ కళేరసు పుంజు సునాయూసంగా ఓడించడంతో, రాజు అతన్ని కాసులతో ఘనంగా బహూకరించాడు. ‘‘అబ్బాయీ, నీ పుంజును నాకు అమ్మడానికి నీకేమైనా అభ్యంతరమా?'' అని అడిగాడు రాజు. ‘‘క్షమించండి మహారాజా! ఈ పుంజు నా ప్రాణ నేస్తం. ఇది నేను పుట్టినప్పుడు చిన్న పిల్లగా ఆకాశం నుంచి వచ్చింది. ఇద్దరం కలిసి పెరిగి ఇంత వాళ్ళయ్యూం.
 
ఇప్పుడు ఈ పుంజు సంపాయించిన బహుమతి మొత్తంతో, నేనూ మా తల్లీ సుఖంగా జీవించగలం,'' అన్నాడు కళేరసు. ‘‘నువ్వు ఎప్పుడు పుట్టావు?'' అని అడిగాడు రాజు. ‘‘పన్నెండేళ్ళ క్రితం. అప్పుడు మహా ప్రవాహం అడవిని ముంచెత్తిందట! అప్పటికే మా తండ్రి, ఎందుకో హఠాత్తుగా వెళ్ళిపోవడంతో మా తల్లి దూరంలో వున్న ఒక గుహలోకి పారిపోయి ప్రాణాలతో తప్పించుకుందట,'' అన్నాడు కళేరసు.
 
‘‘సరే, పుంజును అమ్మడానికి నీకు ఇష్టంలేదనుకో, నువ్వు ఇక్కడే రాజభవనంలో నాతో ఉండడానికి నీకేమైనా అభ్యంతరమా?'' అని అడిగాడు రాజు. ‘‘అది మా తల్లి అభిప్రాయం మీద ఆధారపడి వుంటుంది మహారాజా!'' అన్నాడు కళేరసు. రాజు సింహాసనంపైనుంచి చటుక్కున లేచి, ‘‘నువ్వు నన్ను నీ తల్లి దగ్గరికి తీసుకు వెళ్ళు నాయనా,'' అన్నాడు గద్గద స్వరంతో. ‘‘అలాగే మహారాజా!'' అంటూ కళేరసు అక్కడి నుంచి బయలుదేరాడు.
 
రాజూ, ఆయన పరివారం అతడి వెంట బయలుదేరారు. అడవి ప్రాంతంలో నివసిస్తూన్న పేద ప్రజలు ఆ దృశ్యం చూసి విస్తుపోయూరు. రాజుగారి ముందు, గుర్రం మీద కూర్చుని వస్తూన్న తన బిడ్డను చూసిన కళేరసు తల్లి ఆనందాశ్చర్యాలకు హద్దులు లేకుండా పోయింది.
 
మరికొద్ది క్షణాల్లో రాజు ఎవరన్నదీ ఆమె గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చింది. అప్పటి కప్పుడే మహారాజు కళేరసును యువరాజుగానూ, అతడి తల్లిని పట్టమహిషిగానూ ప్రకటించాడు. ఊరేగింపు రాజధానికేసి బయలుదేరింది. తండ్రి తదనంతరం కళేరసు రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాక, కోడిపుంజును తన రాజ్యకేతనంగా ప్రకటించాడు!

పోయిన ఉంగరం


ఒక శబరరాజు దగ్గిర ఇల్లుడూ, పులిదొరా అనే ఇద్దరు కొలువు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ నమ్మకమైన వాళ్ళే. కాని రాజుకు ఇల్లుడంటే అభిమానమూ, పులిదొర అంటే ద్వేషమూ ఉండేది. ఒకరోజు రాజు ఆ ఇద్దరినీ పిలిచి, ‘‘మీ రిద్దరూ సెలవు తీసుకుని ఇళ్ళకు పొండి. మూడు రోజుల అవతల సంబరం జరుగుతుంది.
 
దానికి రండి. ఇవిగో మీ బహుమానాలు,'' అంటూ పులిదొరకు పెద్ద కందదుంపా, ఇల్లుడికి చిన్న రాయీ ఇచ్చాడు. తనకు రాజు పనికిమాలిన రాయి ఇచ్చాడని ఇల్లుడికి లోపల కాస్త గునుపుగా ఉండి, ‘‘ఈ వెధవ రాయిని పనికట్టుకుని ఇంటికి మోసుకుపోవటం కూడా దేనికి, ఇక్కడే ఏ పొదలోనో పారేస్తాను,'' అన్నాడు. ‘‘వద్దు, వద్దు. ఈ కందదుంపను మొయ్యలేక చస్తున్నాను. మనం వస్తువులు మార్చుకుందాం,'' అన్నాడు పులిదొర.
 
ఇద్దరూ తమ తమ బహుమానాలు మార్చుకుని తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయూరు. ఇల్లుడు తన భార్య చేత కంద వండించుకు తిన్నాడు. పులిదొరకు రాయి మాట ఆ రాత్రిదాకా జ్ఞాపకం రాలేదు. అతను ఇంటి బయట వెన్నెలలో కూర్చుని, ఆ రాయి తీసి పరీక్షిస్తూ ఉండగా, దాని పగులులో ఏదో తళుక్కున మెరిసింది. అతను ఆ రాతిని పగలగొట్టేసరికి దానిలోపల నేర్పుగా దాచి ఉన్న బంగారు నగలు బయటపడ్డాయి.
 
రాజు పక్షపాతబుద్ధి పులిదొరకు అర్థమయింది. ఆ నగలు ఇల్లుడి కోసం ఉద్దేశించినవి. అయినా వాటిని తానే ఉంచుకోవటానికి పులిదొర నిశ్చయించాడు. బహుమతులు మార్చుకోవటం జరిగింది గద. మూడు రోజుల అనంతరం రాజుగారి ఇంటి వద్ద సంబరమూ, విందూ జరిగాయి. ఎంతోమంది వచ్చారు. భోజనాలు చేసే సావిడి పాక కిటకిటలాడి పోయింది.

రాజు అందరినీ పలకరిస్తూ, పులిదొర ధరించిన ఆభరణాలు చూసి, ‘‘ఇవి నీకు ఎక్కడివి?'' అని అడిగాడు ఆశ్చర్యంగా. తాము బహుమానాలు మార్చుకున్న సంగతి ఇల్లుడూ, పులిదొరా రాజుకు తెలిపారు. రాయి విలువ తెలియక దాన్ని పులిదొరకు ఇచ్చినందుకు ఇల్లుడు రాజుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. రాజు ఇల్లుణ్ణి క్షమించాడు. కాని పులిదొరను హతమార్చటానికి నిశ్చయించాడు. పులిదొర రాజుతో, ‘‘ఈ నగలు నేను ఉంచుకు న్నందుకు ఏలినవారు క్షమించాలి.
 
తమరిచ్చిన బహుమానాలను మేము న్యాయంగా మార్చుకున్నాం. కందగడ్డను ఇల్లుడూ, భార్యా భోంచేశారు,'' అన్నాడు. ‘‘నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. అందుకు నిదర్శనంగా నీకు నా ఉంగరం బహుమానంగా ఇస్తున్నాను. దీన్ని పోగొట్టుకున్నావంటే మటుకు నీకు మరణశిక్ష విధిస్తాను. గుర్తుంచుకో!'' అన్నాడు రాజు, పులిదొరకు తన వేలిఉంగరం ఇస్తూ. రాజు తన మీద పగపట్టినట్టు పులిదొర గ్రహించి, ఆ ఉంగరాన్ని ప్రాణప్రదంగా కాపాడాలనుకున్నాడు.
 
అతని గుడిసెలో ఉంగరాన్ని దాచే చోటే లేదు. ఆ రాత్రి తన భార్యా, కొడుకూ నిద్రపోయేటప్పుడు అతను తన ఇంటి మట్టిగోడలో రంధ్రం తొలిచి, అందులో ఉంగరాన్ని పెట్టి, తడిమట్టితో రంధ్రాన్ని కప్పి, గుర్తు తెలియరాకుండ ఆ మట్టిని గోడతో సమంగా చదునుచేసేశాడు. రెండు రోజులు గడవనిచ్చి రాజు పులిదొర భార్యను పిలిపించి, ‘‘నీ మొగుడు ఉంగరం ఎక్కడ దాచాడో కనుక్కుని తీసుకువచ్చి నా కియ్యి.
 
నీకు బోలెడంత బంగారం ఇస్తాను. ఈ మాట నీ మొగుడితో ముందుగా అనకు; బంగారం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు,'' అన్నాడు. రాజు తన భర్త ప్రాణం తీయదలచి ఉంగరం అడిగాడని పులిదొర భార్య ఎరగదు. ఆమె ఉంగరం కోసం ఇల్లంతా గాలించింది. ఉంగరం కనిపించలేదు. ఆ సాయంకాలం ఆమె, తన భర్త ఇంటికి రాగానే, ‘‘నీ దగ్గిర ఏదో ఉంగరం ఉండెనే, అది ఏమయింది?'' అని అడిగింది. ఉంగరం తన భార్య కళ్ళ పడనేపడిందనుకుని పులిదొర, ‘‘గోడలో దాచాలే,'' అన్నాడు.

మర్నాడు భర్త బయటికి వెళ్ళిన సమయంలో పులిదొర భార్య గోడలన్నీ శ్రద్ధగా పరిశీలించింది; అనుమానంగా ఉన్న చోటనల్లా గోడలో గీరింది. చిట్టచివరకు ఆమెకు ఉంగరం దొరకనే దొరికింది. ఆమె చప్పున ఆ రంధ్రాన్ని మట్టితో పూడ్చి, ఉంగరం తీసుకుని రాజుగారి ఇంటికి పరిగెత్తింది. రాజు ఉంగరం తీసుకుని, ఆమెకు సంచీలో బంగారం ఇచ్చాడు. ఆమె పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి, ఆ సంచీని ఇంటి వెనక పూడ్చిపెట్టింది.
 
వారం పూర్తి అయిన రోజున పులిదొర దగ్గిరికి రాజుగారి మనిషి వచ్చి, ‘‘ఉంగరం తీసుకుని రాజుగారు రమ్మంటున్నారు,'' అని చెప్పాడు. పులిదొర తాను ఉంగరం దాచిన చోట వెతికి, ఉంగరం పోయినట్టు తెలుసుకుని, ‘‘నా ఆయువు మూడింది!'' అనుకున్నాడు. అతను తన భార్యను పిలిచి, ‘‘ఉంగరం చూశావా?'' అని అడిగాడు. నిజం చెబితే భర్త కొడతాడని గ్రహించి ఆమె ఉంగరం చూడలేదన్నది.
 
పులిదొర కాళ్ళీడ్చుకుంటూ రాజు వద్దకు వెళ్ళి, ఉంగరం చూపలేనన్నాడు. ‘‘అయితే నీకు మరణదండన తప్పదు,'' అన్నాడు రాజు. ‘‘శిక్ష రేపటిదాకా వాయిదా వెయ్యండి. ఈ లోపల నా వ్యవహారాలు చక్కబెట్టుకుంటాను,'' అన్నాడు పులిదొర. ‘‘సరే, రేపు ఉదయం కసాయీలను నీ ఇంటికి పంపుతాను,'' అన్నాడు రాజు. పులిదొర కాళ్ళీడ్చుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు. కాని మధ్య దారిలో అతనికి ఒక వాగు ఒడ్డున కాస్సేపు కూర్చోవాలని పించింది.

‘రేపు ఎలాగూ చస్తున్నాను గనక, ఇవాళ ఒక్క సుఖమైనా అనుభవిస్తాను. వాగులో పెద్ద చేపను పట్టి, నాకు కావలిసినట్టు భార్య చేత వండించుకు తింటాను,'' అనుకుని పులిదొర బొడ్డులో నుంచి చేపలు పట్టే గాలం పైకి తీసి, నీటిలో వేశాడు. కొంతసేపటికి చేప పడింది. పైకి తీసి చూస్తే అది ఒక పెద్ద తెల్ల చేప. పులిదొర దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి, ఇంటి వద్ద అతని భార్య లేదు. ఆమె వచ్చే లోపుగా తానే చేపను శుభ్రం చేతామనుకుని అతను దాన్ని కత్తితో కోసి, ఆనందంతో, ‘‘ఉంగరం! రాజుగారి ఉంగరం!'' అని కేకపెట్టాడు.
 
అతను అప్పటికప్పుడే రాజుగారి ఇంటికి పరుగుతీస్తూ, దారిలో కనిపించిన ప్రతి మిత్రుడితోనూ, ‘‘నా ఆయువు మూడిందే అనుకున్నాను, కాని బతికిపోయూను!'' అని గట్టిగా అరిచి చెప్పాడు. అతను రాజుగారి ఇంటికి చేరేసరికి అతని వెంట ఒక పెద్ద మూక తయూరయింది. ‘‘బయట ఏమిటా కోలాహలం?'' అని రాజు తన నౌకర్లను అడిగాడు. అంతలోనే పులిదొర తన మిత్రులతో సహా లోపలికి వచ్చి, రాజుతో, ‘‘ఇదుగో మీ ఉంగరం.
 
నా మరణదండనను మీరు రద్దుచెయ్యవచ్చు,'' అన్నాడు. రాజు మరణదండనను రద్దు చెయ్యక తప్పలేదు. అదీగాక, తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరం మళ్ళీ పులిదొర వద్దకు ఎలా వెళ్ళిందో, ఏ మాయశక్తులు పులిదొరకు సహాయపడుతున్నాయో రాజు ఊహించలేకపోయూడు. ఆయన తిరిగి పులిదొరకు అపకారం చేసే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. నిజానికి జరిగినదేమంటే, పులిదొర భార్య తనకు ఉంగరం తెచ్చి ఇయ్యగానే రాజు దాన్ని తన తల దగ్గిర ఉండే పీట మీద ఉంచాడు.
 
ఆ రాత్రి ఒక ఎలుక పీట మీదుగా పరిగెట్టుతూ, ఉంగరాన్ని నీళ్ళ కుండలోకి తోసింది. మర్నాడు రాజుగారి నౌకరు అలవాటు ప్రకారం ఆ కుండలోని నీళ్ళు వాగులో పారబోసి కొత్త నీరు పట్టుకుపోయూడు. రాజుకు ఇవేమీ తెలియనందున, తన ఉంగరం తిరిగి పులిదొరకు ఎలా దొరికినదీ ఊహించలేక పోయూడు.

విలువిద్య పోటీ!


ఒకానొకప్పుడు అరుణాచలప్రదేశ్‌ డిబాంగ్‌ లోయను ఆనుకునివున్న ఇడు ముష్మీ గిరిజన పల్లెల సమీపంలో వున్న అడవుల్లో కోతులు మందలు మందలుగా నివసిస్తూండేవి. అవన్నీ బాణాలు వేయడంలో అపరిమితమైన ఆస క్తినీ, నైపుణ్యాన్నీ కనబరచేవి. పెద్దకోతులు, పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధను కనబరచేవి. ‘‘బాల్యంలోనే పట్టు కోవాలి!'' అనే మాటమీద పెద్ద కోతులకు పరి పూర్ణమైన నమ్మకం ఉండేది.
 
విలువిద్యలో నిపుణులైన తమ తాత ముత్తాతలు తమకు శిక్షణ ఇచ్చినట్టే, తమ పిల్లలకు, మనవళ్ళకు విలువిద్యా శిక్షణ ఇవ్వాలని దీక్షతో కృషి చేసేవి. విల్లమ్ములూ, బాణాలూ చేయడానికి ఉపయోగ పడే మంచి వెదుళ్ళు, పేములు, ఏ లోయలో వున్నా, శ్రమను పట్టించుకోకుండా వెళ్ళి తీసుకు వచ్చేవి. వెదుళ్ళతో దృఢమైన విల్లులనూ, పేముతో పదువైన బాణాలనూ తయూరు చేసుకునేవి.
 
వాటిని ఉపయోగించడంలో అపరిమిత మైన ఆనందాన్ని పొందేవి. ప్రతిరోజూ తెల్లవారక ముందే పసికోతులు క్రమం తప్పకుండా బాణాలు వేయడంలో శిక్షణ పొందేవి. చేతులకు దృఢమైన పట్టు, గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడానికి తదేక దృష్టి, అచంచలమైన ఏకాగ్రత అలవడేలా పెద్ద కోతులు, చిన్న కోతులకు శిక్షణ ఇచ్చేవి. తూరుపు కొండల నుంచి అరుణోదయం కాగానే, ‘‘సరిగ్గా పట్టుకో!'' ‘‘నారిని గట్టిగా లాగు!'' ‘‘గురిచూసి కొట్టు!'' ‘‘చేయి వణక కూడదు!'' ‘‘ఒక కన్ను మూసుకో!'' ‘‘అదిగో పండు కనిస్తుందికదా!'' ‘‘గురి చూసి నారిని చెవులదాకా లాగి ఒక్క దెబ్బతో ఆ ఎగురుతూన్న పిట్టను కొట్టు!''
 
మొదలైన సూచనలతో, రివ్వు రివ్వు మంటూ దూసుకు పోయే బాణాల శబ్దాలతో, అరుపులతో, కేకలతో, కీచుకీచు శబ్దాలతో ఆ కొండ ప్రాంతమంతా మారుమ్రోగేది. దీనికంతా కారణం పెద్ద కోతులు, పిల్లకోతులకు విలువిద్యలో శిక్షణ ఇవ్వడమే. అప్పుడప్పుడూ పెద్ద కోతులు చిన్న కోతులతో ఉత్తుత్తి యుద్ధాలు చేసి వినోదించేవి. ఆ సమ యంలో, ఇరువైపుల నుంచీ బాణవర్షం కురి సేది. లోయంతా బాణాలతో నిండిపోయేది.

అందువల్ల ఉదయకాలంలో పక్షులు అటువైపు ఎగరాలన్నా, లేళ్ళు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటుకేసి వెళ్ళాలన్నా భయపడేవి. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయూయి. అయినా, కోతులు కోతులే కదా! వాటి బుద్ధి ఎలా బుద్ధిగా ఉంటుంది? కోతుల నాయకుడి చిన్న కొడుకు ఒకనాడు, ‘‘ఇలా ఎన్నాళ్ళని శిక్షణ పొందుతూ ఉంటాం? కాస్త వినోదం కూడా కావాలి కదా? మన నైపుణ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించకపోతే అభ్యాసంవల్ల ఒరిగే దేమిటి?'' అన్నాడు. ‘‘అవును.
 
మనమంటే లెక్కచేయని ఆ పొగరుబోతు ఏనుగుకూ, కోరలపులికీ అప్పుడ ప్పుడూ మన సత్తా కాస్త చవి చూపాలి. అప్పుడే మనల్ని ఉదాసీన పరచవు,'' అన్నాయి దాని స్నేహితులైన లాలు, కాలు అనే కోతులు. ‘‘అవును, వాటికి మరువరాని గుణపాఠం నేర్పాలి!'' అని వంతపాడింది మిట్టూ అనే పిరికి కోతి. కిచకిచమంటూ నవ్వుతూ ఒక నల్ల కోతి, ‘‘దుర్మార్గమైన ఆ తోడేలు చేసే అఘాయిత్యం చూశారా!
 
పాపం అమాయక మైన ముంగిసను ఎలా హింసిస్తుంది? భయంకరమైన దాని నోటిలోకి బాణం వదిలితే ఎంత సరదాగా ఉంటుంది!'' అన్నది. ఆ మాటకు తక్కిన కోతు లన్నీ నవ్వాయి. ఆ తరవాత ఒక్కొక్క కోతికి ఒక్కొక్క ఆలోచన పుట్టుకు వచ్చింది. పిల్ల కోతు లన్నీ నిజమైన వినోదం కోసం ఉబలాట పడ సాగాయి. వాటికి తోచిన పథకాలను రూపొం దించుకున్నాయి. మరునాటి ఉదయం నుంచే డిబాంగ్‌ అడవీ ప్రాంతంలో కోతులు పెట్టే బాధలు పెరిగి పోయూయి.
 
వాటి బాణాల దెబ్బలకు రోజూ ఎవరో ఒకరు గురయ్యేవారు. ఆఖరికి అవి ఇడుముష్మి పల్లెవాసులను కూడా వదిలిపెట్ట లేదు. కోతులు వదిలే బాణాలు పిల్లల తలల మీదుగా దూసుకుపోయేవి. ముసలివాళ్ళ తలపాగాలను ఎగురగొట్టేవి. బయట ఎండ బెట్టిన మాంసపు ముక్కలను బాణాలు తన్నుకు పోతూంటే ఇడూ స్ర్తీలు నిస్సహాయంగా చూస్తూ ఉండేవారు!
 
కోతులు పెట్టే బాధలు ఇక భరించలేక వన్య మృగాలూ, పక్షులూ ఒకనాడు ఆనో దగ్గరికి వెళ్ళాయి. దయూమయుడూ, గొప్ప శక్తిమం తుడూ అయిన దేవుడు ఆనో. ఆయన వాటిని చూడగానే, ‘‘అందరూ కలిసి కట్టుగా ఒక్క సారిగా వచ్చారే మిటి? ఎందుకలా విచారంగా ఉన్నారు?'' అని ఆదరంతో పలకరించాడు.

‘‘ఏం చెప్పమంటారు ప్రభూ! ఈ రోజుల్లో ఏ ఒక్కరం కూడా ప్రశాంతంగా మా బతుకు మేము బతక లేకున్నాము,'' అన్నది చెకుముకి పిట్ట దీనంగా. ‘‘ప్రభూ! ఈ తుంటరి కోతులు పెట్టే బాధలు రోజు రోజుకూ మితిమించి పోతున్నాయి. నిన్న ఉదయం నా కూన అరటి పండు తినడానికి నోరు తెరిచి అలాగే మూలుగుతూ నేలకొరిగింది. చాటు నుంచి కోతి వేసిన పదునైన బాణం దాని గొంతులోకి దిగిపోయింది.
 
నా బిడ్డ పడే బాధను చూసి భరించలేక పోయూను. తలపైకెత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద బాణాలతో కూర్చున్న రెండు తుంటరి కోతులు పళ్ళికిలిస్తున్నాయి,'' అన్నది ఏనుగు బాధతో తొండాన్ని ఊపుతూ. ‘‘ఈ అన్యాయూన్ని చూడండి ప్రభూ!'' అంటూ ఒక కుందేలు కట్టు కట్టిన తన కాళ్ళను చూపుతూ, ‘‘అడవిలో జరుగనున్న క్రీడా పోటీల్లో పాల్గొనాలన్న ఉత్సాహంతో శిక్షణ పొందుతూ ఆడుకుంటున్నాం. ఆట ప్రారంభించామో లేదో నాలుగు బాణాలు వచ్చి నా కాళ్ళకు గుచ్చుకోవ డంతో చతికిల పడ్డాను.
 
ఈ గాయూలే గనక లేకుంటే పోటీల్లో తప్పక జయించి ఉండేదాన్ని,'' అన్నది బొట బొటా కన్నీళ్ళు కారుస్తూ. ‘దగ్గరికి రావమ్మా' అంటూ ఆనో కుందేలును మృదువుగా నిమిరాడు. ‘‘మీ బాధలు నాకర్థ మయ్యూయి. విచారించ కండి. కోతుల వ్యవహారం నేను చూస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి,'' అంటూ వాటిని ప్రేమతో సాగనంపాడు. మరునాడు ఆనో కోతుల నాయకుణ్ణి పిలి పించి, ‘‘మీ వాళ్ళ విలువిద్యా పాటవం ఎలా వుంది. అడవంతా అదే మాటగా ఉంది,'' అన్నాడు. ‘‘అవును, ప్రభూ.
 
మా పిల్లలు అందులో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూన్నారు,'' అన్నాడు నాయకుడు గర్వంగా. ‘‘అంటే, ఈ యేటి అరణ్య క్రీడాపోటీల్లో ప్రథమ బహుమతి మీదే నన్న మాట!'' అన్నాడు ఆనో. ‘‘అవును, ప్రభూ! మా కుర్రాళ్ళు మంచి ప్రతిభావంతులు. బుడతగాళ్ళు సైతం, ఎగిరే సీతాకోకచిలుకనూ, బాణంలా దూసుకుపోయే పిచ్చుకనూ సునాయూసంగా పడగొడుతున్నా రంటే చూడండి,'' అన్నాడు నాయకుడు.
 
‘‘అలాగా!'' అని ఆనో తల పంకించి, ‘‘మీ వాళ్ళ ప్రతిభను స్వయంగా చూడాలని కుతూ హలంగా ఉంది. రేపు నదీ తీరంలో జరుగనున్న పోటీకి మీలో చాలా గట్టివాడుగా పేరు తెచ్చు కున్న ఒక విలుకాణ్ణి పంపండి,'' అన్నాడు. మరునాడు అందమైన ఒక కోతి యువ కుడు, విల్లమ్ములతో వచ్చి ఆనోకు నమస్క రించాడు.

అప్పటికే ఆనో చేతిలో బాణం ధరించి నిలబడి ఉన్నాడు. ‘‘అంటే, నువ్వు పోటీకి సిద్ధంగా వచ్చావన్న మాట!'' అంటూ కోతియువ కుడి కేసి తిరిగాడు ఆనో. ‘‘అవును, ప్రభూ!'' అన్నాడు యువకుడు. ‘‘సరే, అదో అలా చూడు,'' అంటూ ఆనో నది ఆవలి గట్టును చూపుతూ, ‘‘గట్టుకు దగ్గ రగా నీళ్ళల్లో మునిగివున్న పెద్ద బండ కని పిస్తున్నది కదా?'' అని అడిగాడు. ‘‘కనిపిస్తున్నది,'' అన్నాడు కోతియువకుడు నీళ్ళలోకి పరిశీలనగా చూస్తూ.
 
‘‘బాణంతో నీళ్ళల్లో మునిగివున్న కొండను కొట్టాలి. అలా కొండను కొట్టగలిగిన వాడే పోటీలో విజేత!'' అని వివరించాడు ఆనో. ఇద్దరూ విల్లమ్ములతో పోటీకి సిద్ధమయ్యూరు. పోటీ ఆరంభమయింది. మొదట ఆనో కొండను గురిచూసి బాణం వదిలాడు. ‘క్లంగ్‌' మన్న శబ్దంతో గాలిలోకి దూసుకు వెళ్ళిన లోహపు బాణం ఆవలి గట్టు సమీపంలో నీళ్ళను చీల్చు కుంటూ వెళ్ళి రక్కుమని బండను తాకింది.
 
తరవాత ఆయన వదిలిన నాలుగు బాణాలూ అలాగే వెళ్ళి లక్ష్యానికి తగిలాయి. ఆ తరవాత కోతియువకుడు విల్లును ఎక్కుపెట్టి, లక్ష్యాన్ని గురిచూసి పేము బాణాన్ని వదిలాడు. అది రివ్వున వెళ్ళింది గాని, బండ సమీపంలో నీళ్ళు తగల గానే పేముబాణం గనక ముందుకు దూసుకు వెళ్ళలేక మెల్లగా ఆగి పోయింది. దాన్ని చూసి కోతియువకుడు దిమ్మెర పోయూడు. ఇంకో బాణం వదిలాడు. అదీ నీళ్ళపై తేలుతున్నది గాని, అందులోకి చొచ్చుకుని వెళ్ళి బండను తాకలేక పోయింది.
 
అతడు ఎన్ని సార్లు బాణం వేసినా అలాగే జరిగింది. లక్ష్యాన్ని ఛేదించలేక పోయూడు. ‘‘నా బాణం నీళ్ళ లోపలికి చొచ్చుకు పోవడం లేదు. నేను ఓడి పోయూను,'' అంటూ తలదించుకు న్నాడు కోతి యువకుడు. ఆ తరవాత అవమాన భారంతో ఇకపై విల్లమ్ములు ముట్టుకోకూడదన్న నిర్ణయంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయూడు.
 
ఆనో చిన్నగా నవ్వుకున్నాడు. తన బాణం ఇనుముతో తయూరైనది గనక నీళ్ళలోకి చొచ్చుకు పోగలదనీ, కోతియువకుడి బాణం పేముతో తయూరు చేయబడింది కాబట్టి, నీళ్ళలోకి మునగదనీ ఆయనకు ముందే తెలుసు. ఆ రోజు నుంచే కోతులు విల్లమ్ములను ఉపయోగించే శక్తిని కోల్పోయూయి!

బానిసవాడి భవిష్యవాణి!


అంకాయస్‌ అనే పెద్ద మనిషి చాలా సాహసోపేతమైన జీవితం గడిపాడు. ఓడను నడిపే నావికుల నాయకుడిగా ఎన్నో క్లిష్టమైన పనులను సులభంగా నెరవేర్చాడు. పదవీ విరమణ చేసి ఒక చిన్న కొండ మీద అందమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. దాని చుట్టూ పూలతోటలూ, పళ్ళ తోటలూ పెంచడానికి నౌకర్లను నియమించుకుని సుఖంగా జీవించసాగాడు. ‘‘నాయనా, భగవంతుడు నీకు సంపదలతో పాటు, ఎంతో అనుభవాన్ని ప్రసాదించాడు.
 
ఇకపై సాటి మనుషులకు ఉపయోగపడే మంచిపనులు చేస్తూ, జీవితంలోని వివిధ అంశాల గురించి లోతుగా ఆలోచిస్తూ శేషజీవితాన్ని ఫలవంతంగా సాగించు,'' అని సలహా ఇచ్చాడు వృద్ధుడైన ఆయన గురువు. తన గురువు సలహాను అంగీకరిస్తున్నట్టు తల పంకించాడే తప్ప, అంకాయస్‌ వాటిని అసలు పట్టించుకోలేదు. వినోదం తప్ప మరేదీ తెలియని కొందరు మిత్రులు ఆయన చుట్టూ చేరారు.
 
హాస్యోక్తులతో అంకాయస్‌కు వినోదం కలిగిస్తూ, ఆయన సంతోషపడేలా పొగు డుతూ, ఆయన నుంచి తమకు కావలసిన వాటిని సంపాయించుకునేవారు. ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి యుద్ధాలు చేస్తూండేవి. యుద్ధంలో గెలుపొందిన రాజ్యం సైనికులు ఓడిపోయిన రాజ్యం నుంచి స్ర్తీ పురుషులను బానిసలుగా తరలించుకుని వెళ్ళేవారు. వారిని ఎవరు కావాలన్నా అడిగిన డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు.
 
అలా బానిసలుగా విక్రయించబడే వారిలో కొందరు ప్రతిభావంతులుగానూ, జ్ఞాన సంపన్నులుగానూ ఉండేవారు. అయినా యజమానులు వారిచేత కఠిన శ్రమ చేయించేవారు. బానిస వృద్ధుడైనా, బలహీనుడైనా వ్యాధిగ్రస్తుడై మరణించబోయే స్థితిలో వున్నా కూడా ఏమాత్రం కనికరం చూపకుండా కఠినమైన పనులు చేయించుకునేవారు. అంకాయస్‌ వద్ద కూడా పలువురు బానిసలు ఉన్నారు. వాళ్ళను పర్యవేక్షించే అధికారి పరమ క్రూరుడు. అంకాయస్‌ ఉత్తమమైన ద్రాక్షపళ్ళ తోట వేయూలని నిర్ణయించాడు.

అందుకోసం రాళ్ళతో నిండిన భూమిని బాగుచేయడానికీ, దున్నడానికీ బానిసలు రాత్రింబవళ్ళు కష్టపడి చెమటోడ్చ వలసివచ్చింది. అలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ క్రూరుడైన బానిసల అధికారి, ‘‘త్వరగా కానివ్వండి, సోమరి గాడిదల్లారా! ఇంత మందగొడిగా పనిచేస్తూంటే, తోట తయూరయ్యేదెప్పుడు? ఉత్తమమైన ద్రాక్ష పండేదెప్పుడు? ఆ ద్రాక్ష నుంచి తయూరయ్యే మధురసాన్ని మన యజమాని తాగేదెప్పుడు?'' అంటూ కొరడా ఝళిపించేవాడు.
 
తోటపని ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఒకనాడు అంకాయస్‌ అటుకేసి వచ్చాడు. ఆ సమయంలో అధికారి బానిసలను బెదిరించడం ఆయన విన్నాడు. ‘‘అవును, నేను ఇక్కడ పెంచుతూన్న ద్రాక్ష ప్రపంచంలోనే చాలా ఉత్తమమైనది. నా సొంత తోటలో పండిన ద్రాక్ష నుంచి తయూరైన మధురసాన్ని చవిచూసే క్షణాలకోసం ఎదురు చూస్తున్నాను,'' అన్నాడు. ‘‘మూర్ఖులారా, విన్నారా మన యజమాని మాటలు! మీరు పండించే ద్రాక్ష నుంచి తయూరయ్యే మధురసం కోసం ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నారు!''
 
అంటూ కొరడాతో బానిసల వీపులను ఛెళ్ళుమనిపించసాగాడు. ‘‘అయ్యో!'' అని బాధతో మూలిగిన ఒక బానిస, ‘‘ఈ తోటలో పండే ద్రాక్షల నుంచి తయూరయ్యే మధురసాన్ని యజమాని ఈ జన్మలో చవిచూడలేడు,'' అన్నాడు మెల్లగా. అయినా అది పర్యవేక్షకుడికి వినిపించడంతో, ‘‘ఏమన్నావురా దుర్మార్గుడా!'' అని గద్దిస్తూ అడిగాడు దిక్కులు పిక్కటిల్లేలా. ‘‘ఏమన్నాడేమిటి?'' అని వెనక్కు తిరిగాడు యజమాని.
 
పర్యవేక్షకుడు బానిస మెడపట్టి ముందుకు తోస్తూ, ‘‘ఈ వెధవకు పిచ్చెక్కింది. అందువల్లే ఏదో వాగాడు!'' అన్నాడు. ‘‘ఏం చెప్పావో దాన్ని మరోసారి చెప్పు!'' అని ఆజ్ఞాపించాడు యజమాని. ‘‘ఈ తోటలో కాచే ద్రాక్షల నుంచి తయూరయ్యే మధురసాన్ని మన యజమాని రుచి చూడలేడు, అన్నాను,'' అని చెప్పాడు బానిస. అంతటా కొంతసేపు మౌనం అలముకున్నది. యజమాని ఆ పొగరుబోతు బానిసను కఠినంగా శిక్షించగలడని అందరూ అనుకున్నారు. అయితే, అంకాయస్‌ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయూడు. రోజులు గడిచాయి. ద్రాక్షతోట విరగకాచింది.

నిగనిగలాడే ఆ ద్రాక్ష పళ్ళ నుంచి మధురసం తయూరుచేయడానికి దూర ప్రాంతం నుంచి నిపుణులైన వారిని పిలిపించారు. మధురసం తయూరయింది. దానిని అందమైన మధుపాత్రలో నింపి, యజమాని ముందున్న మేజామీద ఉంచారు. అంకాయస్‌ పరమానందం చెందాడు. దానిని రుచి చూడడానికి ముందు ఆనాడు భవిష్యత్తు చెప్పిన బానిసను పిలుచుకుర మ్మన్నాడు.
 
మధురసాన్ని సేవిస్తూ, తమ యజమాని బానిసను శిక్షంచగలడని అందరికీ అర్థమయింది. బానిస రానే వచ్చాడు. వాడి ముఖంలో పశ్చాత్తాపంగానీ, భయంకానీ లవలేశం కూడా కనిపించలేదు. ప్రశాంతంగా నిలబడ్డాడు. అంకాయస్‌ గట్టిగా నవ్వుతూ, ‘‘ఆనాడు నువ్వు మూర్ఖంగా పలికిన మాట గుర్తుందా? ఇప్పుడు చూడు నేను అదే తోటలో పండిన ద్రాక్ష నుంచి తయూరు చేసిన మధురసాన్ని రుచి చూడబోతున్నాను,'' అంటూ తన వెనకా, ఇరువైపులా నిలబడ్డ తన మిత్రులు, సేవకుల కేసి ఒకసారి గర్వంగా చూసి, మళ్ళీ బానిసతో, ‘‘ఇప్పుడేమంటావు?'' అంటూ నవ్వసాగాడు.
 
‘‘చేతికందింది, నోటికి అందకపోవచ్చు కదా?'' అన్నాడు బానిస ప్రశాంత కంఠస్వరంతో. అంకాయస్‌ మరింత గట్టిగా నవ్వుతూ, మధుపాత్రను అందుకున్నాడు. ఆ క్షణమే ఒక సేవకుడు పరుగున వచ్చి, ‘‘ప్రభూ! కోరలు తిరిగిన భయంకరమైన అడవిపంది ఒకటి మన తోటలో పడినాశనం చేస్తున్నది!'' అన్నాడు. ‘‘ఏమిటీ, అడవిపందా?'' అంటూ మధుపాత్రను మేజాపై ఉంచి, దాపుల గోడకు వేలాడుతూన్న ఖడ్గాన్ని తీసుకుని అడవిపందిని చంపడానికి పళ్ళతోట కేసి పరిగెత్తాడు, అంకాయస్‌.
 
అయితే, అతడు అడవిపందిని చంపలేదు. అడవిపంది అతన్ని చంపేసింది! మనం ఎంత జాగ్రత్తగా పథకం వేసినప్పటికీ, ఒక్కొక్కసారి అనుకోని సమయంలో, అవాంతరాలు వస్తూంటాయి. పరిస్థితి వికటిస్తుంది. దాన్నే చేతికి అందింది నోటికి అందక పోయిందని అంటూవుంటాం!

శాస్ర్తజ్ఞానం-లోకజ్ఞానం


రామాపురంలో రంగనాధుడనే వైద్యుడుండేవాడు. ఆయుర్వేదం ఆయనకు కొట్టినపిండి. ఎవరెవరి శరీర తత్వాన్ని బట్టి, జీవనశైలిని బట్టి, వారికి ఏయే వయసులో, ఏయే రుగ్మతలు వచ్చే అవకాశముందో ఇట్టే చెప్పేసేవాడు. తన దగ్గరకు వచ్చే రోగుల వాలకాన్ని బట్టి, వారు చెప్పక ముందే వారి బాధేమిటో, దానికి మూలకారణమేమిటో కూడా చెప్పి, వారిని ఆశ్చర్యపరిచేవాడు. ఆ కారణంగా అతడికి వైద్యం బాగా ఎరిగినవాడనే పేరొచ్చిందికానీ, రోగులు మాత్రం అంతగా వచ్చేవారుకాదు.
 
ఒకనాడు, దూర ప్రాంతానవుంటున్న చరకాచార్యుడనే గురువు, రంగనాధుణ్ణి చూడడానికి వచ్చాడు. ఆ సమయంలో ఒక స్ర్తీ రంగనాధుడి దగ్గిరకు వచ్చి, ‘‘అయ్యూ! నా వయసు ఇరవై ఏళ్ళు. ఇంత చిన్న వయసులోనే, వచ్చిన రోగమేమిటో అంతుబట్టకుండావుంది...'' అని ఇంకా ఏదో చెప్పబోతూండగానే, రంగనాధుడు ఆశ్చర్యపోతూ, ‘‘నీ వయసు ఇరవై ఏళ్ళేమిటమ్మా? ఎంతలేదన్నా ఇరవై ఎనిమిదేళ్ళకు తక్కువుండదు,''అన్నాడు.
 
ఆ మాట వింటూనే వచ్చిన స్ర్తీ ముఖం మటమటలాడించుకుంటూ గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. రంగనాధుడు, తన గురువు చరకాచార్యుడి కేసి తిరిగి, ‘‘ఏమిటో, గురువర్యా! వచ్చిన రోగుల్లో కొందరు మధ్యలో చిరాగ్గా తిరిగి వెళ్ళిపోతున్నారు,'' అన్నాడు.
 
దానికి చరకాచార్యుడు నవ్వి, ‘‘తెలుస్తూనే వుందిగదా, రంగనాధా! నీకు శాస్ర్తజ్ఞానమైతే వుంది కానీ; లోకజ్ఞానం కొరవడింది. వచ్చిన వాళ్ళతో నిజం చెప్పినా వాళ్ళు బాధపడేలా కాకుండా లౌక్యంగా చెప్పడం అవసరం కదా!'' అన్నాడు.

స్వర్గం - నరకం


ఒకానొక ముని ఒక శిథిలాలయం ముందున్న మంటపంలో కూర్చుని ధ్యాన నిమగ్నుడై ఉండగా, అక్కడికి వచ్చిన ఒక సైనిక యోధుడు గుర్రందిగి ఆయన ఎదుట నిలబడ్డాడు. కొంత సేపటికి ముని కళ్ళు తెరవగానే యోధుడు ఆయనకు వినయంగా నమస్కరించి, ‘‘కొన్నాళ్ళుగా నాకో సందేహం,'' అన్నాడు.
 
‘‘ఏమిటి? అడుగు,'' అన్నట్టు మందహాసం చేశాడు ముని. ‘‘మనవాళ్ళు చెప్పుకునే స్వర్గం, నరకం నిజంగానే ఉన్నాయూ? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి?'' అని అడిగాడు యోధుడు. ‘‘నువ్వెవరివి? ఏం చేస్తూంటావు నాయనా?'' అని అడిగాడు ముని. ‘‘నేనీ దేశానికి సేనాధిపతిని!'' అన్నాడు యోధుడు గర్వంగా. ‘‘నీలాంటి మూర్ఖుణ్ణి సేనాధిపతిని చేసిందెవరు?'' అన్నాడు ముని. ఆ మాటకు భగ్గుమన్న సేనాధిపతి, పట్టరాని ఆవేశంతో కత్తి దూశాడు.
 
‘‘ఇప్పుడే నీలో నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి,'' అన్నాడు ముని మందహాసంతో. ఆ మాటతో సేనాధిపతి ఒక్క క్షణం వెనక్కు తగ్గి, కత్తిని ఒరలో వేసి, ‘‘క్షమించండి, ముని వర్యా!'' అన్నాడు చేతులు జోడిస్తూ. ‘‘ఇదిగో ఇప్పుడే నీలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మనలో చెలరేగే క్రోధం, లోభం, మోహం మొదలైన దుర్గుణాలే నరకకూపాలు. మనకూ, మనసాటివారికీ సుఖసంతోషాలు సమకూర్చే శాంతి, కరుణ, దయ, ఓర్పు మొదలైన సద్గుణాలు వెల్లివిరిసే మనసే స్వర్గం.
 
స్వర్గ నరకాలు మరెక్కడో లేవు. మన మనసుల్లోనే ఉన్నాయి!'' అన్నాడు ముని ప్రశాంత వదనంతో. ‘‘తెలిసింది, మునివర్యా! కృతజ్ఞతలు!'' అంటూ మునికి మరొక్కసారి నమస్కరించి అక్కణ్ణించి సంతోషంగా బయలుదేరాడు సేనాధిపతి.

దయ్యం వదిలింది


వాణీ, వర్మలకు సంతానం లేదు. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎదుటివాళ్ళకు సాయపడడంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్లో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒక రోజురాత్రి పెద్దవర్షం పడుతున్నది. వర్మా, వాణీ భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే, వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు. ‘‘పట్నానికని బయలుదేరి, వర్షంలో చిక్కుపడ్డాం.
 
ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా?'' అని వాళ్లు అడిగారు. ‘‘లోపలికి రండి,'' అంటూ వాణి వాళ్ళను ఆహ్వానించి, భోజనం పెట్టి, పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళుతిన్నాక అన్నం కొద్దిగామిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు. ముద్దగా తడిసిపోయూయి. ‘‘ఇద్దరమూ చెరిసగమూ తిందాం,'' అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని, పడుకున్నారు.
 
తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్లు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చుని, వెక్కివెక్కి ఏడుస్తున్నది. వాణీ వర్మలు నిర్ఘాంతపోయి, ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. ‘‘నా కాపరం గంగపాలయింది! రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది.
 
రాత్రి నా భర్త మీ ఆలూమగల అన్యోన్యం చూసి, ‘నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ప్రియంగా నాలుగు మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి?' అని, ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళి పోయూడు. మొండిమనిషి! మళ్లీ తిరిగి రాడు.

ఇక నా బతుకేంగాను? ఏం చేయను? ఎక్కడికని వెళ్ళను?'' అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్తకోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. ‘‘నాకు తెలుసు, ఆయన రాడు. నా కింకెవరూ లేరు. లోతయిన బావి చూసి దూకేస్తాను,'' అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది.
 
‘‘నువ్వు ఏమీ బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు,'' అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్లింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి, నాలుగు రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు రెండు, మూడు నెలల కొకసారి అలా వస్తూంటాడు.
 
కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికి చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యూక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కాని అతనికి చాలా సేపటిదాకా నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్రపట్టుతూండగా ఏదో అలికిడి అయి, మెలుకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని, చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది!
 
వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తనా, కిటికీ చప్పుడూ అనుమానం కలిగించాయి. ఆమె వంట గదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి, చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు.
 
చంద్రమతి ఒక గిన్నెలో అన్నమూ, కూరా, పులుసూ, పెరుగూ అమర్చి, కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. ‘‘ఇంకా ఎన్నాళ్లు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చెయ్యి,'' అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణంచేత ఆ మనిషి మురారికి కనిపించలేదు.

‘‘ఇప్పుడిప్పుడే వీళ్ళకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపికపట్టు,'' అన్నది చంద్రమతి. ‘‘అమ్మ దొంగముండా! పైకి అమాయకంగా కనిపిస్తూ, మావాళ్ళ మంచితనాన్ని ఆసరాచేసుకుని, మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను!'' అంటూ మురారి తనలో అనుకున్నాడు.
 
అతను వెంటనే వెళ్ళి పడుకుని, చంద్రమతి గురించి వాణీ, వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యూన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, ‘‘బాబోయ్‌, రాత్రి నేను కన్నుమూస్తే ఒట్టు. ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా గజ్జెలచప్పుడు! నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటివైపుకు ఈడ్చుకు పోయింది.
 
కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయట పడ్డాను. మరొకరైతే, హరీ అనేవాళ్ళు,'' అన్నాడు. వాణీ, వర్మా ఈ మాట విని హడలి పోయి, ‘‘అయితే భూతవైద్యుణ్ణి పిలుద్దాం,'' అన్నారు. ‘‘మీరేమీ కంగారుపడకండి, ఎటువంటి దయ్యూన్ని అయినా నేను వదలగొట్టగలను,'' అని మురారి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకొని, అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు.
 
తరవాత అతను తలగడను మంచంమీద నిలువుగా అమర్చి, వాటిమీద దుప్పటి కప్పి, పెరటివైపు వెళ్ళి, వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలా సేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని, చంద్రమతి వచ్చి, గిన్నెలో అన్నీ సర్ది, మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి, ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి, మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి, ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు.
 
చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి, కిటికీని సమీపించి, బయట తన భర్త జాడ కనబడక, వంటగది తలుపు మూసి, తనగదిలోకి వెళ్ళి, కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మా, వాణీ ఉలిక్కిపడి లేచి, చంద్రమతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు.

చంద్రమతి భయంతో, ‘‘దయ్యం ఉన్న మాట నిజమే! నాకూ గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదికి వచ్చింది,'' అన్నది. ‘‘భయపడకండి. త్వరలోనే ఈ దయ్యం భరతం పట్టుతాను,'' అన్నాడు మురారి. రెండు రోజులపాటు అతను రాత్రిళ్ళు గజ్జెలచప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే, తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావటానికి భయపడింది.
 
మూడోరోజు రాత్రి మురారి బయటనే పొంచి వుండి, చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా, తాను అదే దారిన వెళ్ళబోతున్నవాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, ‘‘నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా? నేను చూస్తాను!'' అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ‘‘ఏం జరిగిందండి?'' అని అనుమానంగా అడిగాడు. ‘‘ఇంకా ఏం జరగాలండీ? ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు.
 
ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిణ్ణి చేసుకుంటాడట! ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే వున్నది!'' అంటూ విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి, వీధితోవన లోపలికివచ్చి, తనమంచం మీద పడుకుని నిద్రపోయూడు. మురారి చెప్పినమాటమీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే మూడు రోజులుగా అతనికి కిటికీ తెరవటంలేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, ‘‘నేను బుద్ధి గడ్డితిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను.
 
ఆమెను నాతో పంపెయ్యండి,'' అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణీ, వర్మలు బాధ పడుతూంటే, ‘‘దయ్యం వదిలిందని సంతోషించక బాధ పడుతున్నారా?'' అంటూ మురారి జరిగిన సంగతి వాళ్ళకు చెప్పి, వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయూడు.

అత్యాశ


కుముద్వతీ రాజ్యం పొలిమేరలో ప్రవహించే కుముదినీ నదీ తీరంలో సుప్రసిద్ధమైన సోమశేఖర ముని ఆశ్రమం ఉండేది. అక్కడ గురుకుల ఆశ్రమాన్ని నడిపే సోమశేఖర ముని శిష్యులకు వివిధ ధ్యాన పద్ధతులను బోధించడంతోపాటు, చిత్రలేఖనంలో కూడా సిద్ధహస్తుడు. మనుషులను చూసి యథాతథంగా చిత్రించడంలో అద్భుతమైన ప్రతిభ కనబరచేవాడు.
 
అందువల్ల కళాభిరుచిగల సంపన్నులు, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన అడిగిన సొమ్ము చెల్లించి ఆయన చేత తమ చిత్రాలను గీయించుకుని వెళ్ళేవారు. ముని తను గీసిన చిత్రాలకు ఎక్కువ మొత్తాలు వసూలు చేయడంలో చాలా జాగ్రత్త వహించేవాడు. ఇది పలువురికి ఆశ్చర్యం కలిగించేది. మరి కొందరయితే, ‘‘సర్వసంగ పరిత్యాగి అయిన మునికి ఇంత ధనాశ పనికిరాదు,'' అని చాటుమాటుగా విమర్శించేవారు.
 
ముని వీటన్నిటినీ పట్టించుకోకుండా చిత్రలేఖనం ద్వారా సొమ్మువసూలు చేయడంలోనే నిమగ్నుడై ఉండేవాడు! ఇలా ఉండగా ఒకనాడు చక్కగా అలంకరించబడిన ఒక అందమైన గురబ్బ్రండిలో ఆశ్రమానికి వచ్చిన రాజనర్తకి శుభాంగి మునిని సందర్శించి, తన చిత్రపటం గీయించుకోవాలన్నది. ‘‘సంతోషం. క్షణాలలో చిత్రించి ఇస్తాను. అయితే కొంచెం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది!'' అన్నాడు ముని.
 
‘‘ఆ విచారమే వద్దు. తమరు ఎంత అడిగినా ఇస్తాను. అయినా, ముందుగానే అడుగుతున్నారు. ఎంత కావాలేమిటి?'' అని అడిగింది రాజనర్తకి. ‘‘నీ స్థాయికి తగ్గట్టు ఎంత ఇవ్వగలవో నువ్వే చెప్పు,'' అన్నాడు ముని. ‘‘వంద వరహాలు చాలా?'' అని అడిగింది నర్తకి, ముని పరమానందం చెందగలడన్న ఆశతో.

‘‘రెండు వందల వరహాలు,'' అన్నాడు ముని ఏమాత్రం తొణక్కుండా. ఆ మాటవిని ఒక్క నిమిషం అవాక్కయి పోయిన నర్తకి, వెంటనే తేరుకుని, ‘‘మరీ ఎక్కువ మొత్తం. అయినా మునివర్యులకు అంతటి అత్యాశ పనికి రాదు!'' అన్నది నిష్ఠూరంగా. ‘‘ఇందులో బేరసారాలకు ఏమాత్రం తావు లేదు. మరో మాట మాట్లాడకుండా అడిగిన మొత్తం ముందు పెడితేనే చిత్రపటం. లేకుంటే వచ్చిన దారినే తిరిగి వెళ్ళవచ్చు,'' అన్నాడు ముని నిష్కర్షగా.
 
వచ్చిన పని పూర్తి చేసుకోకుండా తిరిగి వెళ్ళడానికి నర్తకి అహం అడ్డుపడి, ముని అడిగిన రెండు వందల వరహాలు తీసి ఆయన ముందుంచి, ‘‘సరే, ఆ పొన్నచెట్టు కింద నిలబడతాను. చిత్రించు,'' అంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు కింద నృత్యభంగిమలో నిలబడింది. ముని తదేకంగా ఆమెవంక కొంతసేపు చూసి, కుంచెనందుకుని చకచకా చిత్రపటం చిత్రించి ఆమె చేతికిచ్చాడు.
 
దానిని చూసిన ఆమె, ‘‘చిత్రపటం అద్భుతంగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే దానిని గీసినందుకు మీరు పుచ్చుకున్న మొత్తం మాత్రం చాలా ఎక్కువ. ఇలా ధనం కూడబెట్టి వెళ్ళేప్పుడు పట్టుకు పోతారా?'' అంటూ విసురుగా వెళ్ళి, గురబ్బ్రండిలో కూర్చుని నగరానికి తిరుగు ప్రయూణమయింది.

మరికొన్ని నెలల పాటు ముని దీక్షగా చిత్రాలు గీస్తూ, అలాగే ధన సంపాదన కొనసాగించాడు. అయితే, ఆ తరవాత హఠాత్తుగా చిత్రాలు గీయడం మాని శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, ధ్యాన పద్ధతులు నేర్పడం ప్రారంభించాడు. ఆ సంగతి తెలిసి, ఆయనలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ రాజనర్తకి ఒకనాడు ఆశ్రమానికి బయలుదేరింది.
 
కిందటిసారి వచ్చినప్పుడు రాయిరప్పలతో ఎత్తు పల్లాలుగా ఉన్న ఆశ్రమానికి వెళ్ళే బాట ఇప్పుడు చదును చేయబడి ఉండడంతో ఆమె ప్రయూణం హాయిగా సాగింది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద మంటపం ఉండడం చూసి ఆమె ఆశ్చర్యం చెందింది.
 
మంటపంలోపల శిష్యులనూ, భక్తులనూ ఉద్దేశించి సోమశేఖర ముని ప్రధాన శిష్యుడు ఉపన్యసిస్తున్నాడు: ‘‘ధ్యాన మందిరం నిర్మించాలని ఎంతగానో ప్రయత్నించి, అది నెరవేరకుండానే తన గురువు భానుప్రకాశానంద స్వాములు పరమపదించడంతో, ధ్యాన మందిర నిర్మాణాన్ని తనలక్ష్యంగా పెట్టుకుని, మన గురువర్యులు సోమశేఖర ముని నిర్విరామంగా కృషి చేశారు. స్వార్థపరుడనీ, దురాశాపరు డనీ తనను లోకులు కాకులై కూసినా బాధ పడలేదు.
 
తనకు తెలిసిన చిత్రలేఖనం ద్వారా స్వయంగా ధనార్జన చేసి గురువు కోరికను నెరవేర్చారు. భావితరాలకు మహోపకారం చేసి, తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిన మహానుభావుడాయన. ఆయన కారణంగానే ఆశ్రమానికి ఈరోజు చక్కని బాట ఏర్పడింది. మన మందరం ఆయనకెంతో రుణపడి ఉన్నాం!'' ఆ మాటలు వినగానే రాజనర్తకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
 
మునివర్యులను అపార్థం చేసుకున్నందుకు నొచ్చుకుని, మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నది. ఆ తరవాత తన కంఠహారాన్నీ, చేతులకు పెట్టుకున్న బంగారు మురుగులనూ తీసి, ధ్యానమందిరానికి కానుకగా సమర్పించి, ప్రశాంత చిత్తంతో నగరానికి తిరుగు ప్రయూణమయింది.

గాడిద... గాడిదే!


జీవన్‌సింగ్‌ అనే వ్యాపారి తన దుకాణానికి కావలసిన సరుకులను కొనడానికి తరచూ దాపులనున్న పట్టణానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళేప్పుడు తన గాడిదను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. ఒకనాడలా వెళ్ళి, పట్టణంలో సరుకులు కొనుక్కుని తిరుగు ప్రయూణ మయ్యేసరికి బాగా అలిసిపోవడంతో, విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడలో నడుం వాల్చాడు. కొంతసేపటికి అలాగే మగత నిద్రలోకి జారుకున్నాడు.
 
ఉన్నట్టుండి చిన్న పిల్లలు ముక్తకంఠంతో పాఠాలు వల్లెవేయడం చెవిని పడడంతో జీవన్‌ సింగ్‌ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, చుట్టుపక్కల కలయచూశాడు. పక్కనే ఉన్న ఇంట్లో ముల్లా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడని గ్రహించాడు. ‘‘నేనెందుకిలా గొంతుచించు కుని అరుస్తున్నానో తెలుసా? మీరందరూ గాడిదలు. మిమ్మల్ని మనుషులుగా తీర్చి దిద్దాలని ప్రయత్నిస్తున్నాను.
 
మీరేమో నా మాటలేవీ పట్టించుకోకూడదని శపథం చేసిన వాళ్ళలా కూర్చున్నారు!'' అని ముల్లా కేకలు పెట్టడం ఆయన విన్నాడు. ఆ తరవాత పిల్లలు మౌనంగా ఇంటినుంచి వెళ్ళిపోవడం జీవన్‌సింగ్‌ గమనించాడు. అప్పుడాయనకు తన బాల్యం ఒకసారి కళ్ళ ముందు కదలాడింది. తనెప్పుడూ బడికి వెళ్ళిన పాపాన పోలేదు. తండ్రి దుకాణమే అతని బడి. మాట్లాడడం, చదవడం, రాయడం లెక్కలు వేయడం నేర్చుకున్నదంతా అక్కడే.
 
అన్నిటికీ మించి దుకాణానికి వచ్చేవారితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అన్న విషయూలను తండ్రి ప్రత్యక్షంగా అక్కడే నేర్పాడు. ముల్లా మాటలు వినగానే, ‘‘ఆహా, గాడిదలను మనుషులుగా మార్చడానికి ప్రయత్నించే మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఈ విషయం తనకు తెలియక పోయిందే!'' అని భావించాడు.

బరువులు మోయడానికి తప్ప మరిదేనికీ పనికిరాని గాడిద తన దగ్గర ఉన్నది. ఆ పని చేయడానికి గాడిదకు ఎలాంటి తెలివితేటలూ అవసరం లేదు కదా మరి. జీవన్‌సింగ్‌ లేచి గాడిదను వెంటబెట్టుకుని వెళ్ళి, ముల్లాకు సలాం చేసి, తన గాడిదను మనిషిగా మార్చమని వేడుకున్నాడు. ముల్లా అతని కేసి ఆశ్చర్యంగా చూశాడు. చెట్టుకింద పడుకుని తాను విన్నదంతా వివరించిన జీవన్‌ సింగ్‌ మాటలు విని ముల్లా గట్టిగా నవ్వాడు.
 
ఆ తరవాత అతనికి ఆశాభంగం కలిగించడం దేనికని, ‘‘సరే, నీ గాడిదను ఇక్కడే వదిలి, దానిని మూడు నెలల పాటు మేపడానికి అయ్యేఖర్చును కూడా ఇచ్చి వెళ్ళు. ఆ తర వాత వచ్చి చూడు,'' అన్నాడు. జీవన్‌సింగ్‌ చాలా సంతోషించాడు. సరు కులు కొనగా మిగిలివున్న డబ్బును ముల్లాకు ఇచ్చాడు. గాడిద మీద వేసిన సరుకులను తీసి భుజానికి తగిలించుకున్నాడు. గాడిదను ముల్లాకు అప్పగించి కృతజ్ఞతలు చెప్పుకుని తిరుగు ప్రయూణమయ్యూడు.
 
మూడు నెలల పాటు ఉచితంగా బరువులు మోయించ డానికి చక్కటి గాడిద వెతుక్కుంటూ వచ్చి నందుకు ముల్లా సంతోషించాడు. పైగా దాని మేతకు తను దమ్మిడీ ఖర్చుపెట్టనవసరం లేదు. మూడు నెలలు ఇట్టే గడిచిపోయూయి. తన గాడిద బలమైన యువకుడి రూపంలో కాచుకుని వుంటుందన్న గంపెడాశతో జీవన్‌ సింగ్‌ ముల్లా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే ముల్లా నవ్వుతూ ‘‘రండి, రండి. నేను అనుకున్న దానికన్నా గాడిద చాలా తెలివైనది.
 
ఒక నీతిగ్రంథంలో రెండు గీతాలు వల్లించడం ఆరంభించగానే మెల్ల మెల్లగా అందమైన యువకుడిగా మారిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పక్క ఊరి అధికారి మరణించాడు. ఆ ఊరి పెద్దలు సమర్థుడైన అధికారి కోసం వెతుకుతూ సలహా కోసం నా దగ్గరికి వచ్చారు.
 
నేను యువకుడిగా మారిన గాడిదను చూపాను. గ్రామపెద్దలు నాకు కృత జ్ఞతలు చెప్పి, ఆ యువకుణ్ణి వెంటబెట్టు కుని వెళ్ళారు,'' అన్నాడు. ఆ మాటవిని జీవన్‌సింగ్‌ మొదట పరమా నందం చెందాడు. వెంటనే తనకు గాడిద లేక పోవడం గుర్తుకురావడంతో కాస్త బాధ పడ్డాడు.

అయినా, అంతటి తెలివైన యువకుడు తనతో వుంటే వ్యాపారంలో తనకు ఎంతో సహాయకారిగా ఉండగలడని ఆలోచించాడు. ఆ యువకుణ్ణి కలుసుకోవాలని నిర్ణయిం చాడు. అప్పటికప్పుడే బయలుదేరి ఆ గ్రామానికి వెళ్ళి అధికారి ఇంటిని సమీ పించాడు. అప్పుడు అధికారి గ్రామ పెద్దలతో ఏదో చర్చలు జరుపుతున్నాడు. ముల్లా చెప్పినట్టు అధికారి అందంగానూ లేడు; యువకుడు కూడా కాడు.
 
అయితే, సమస్యలను పరిష్క రించడంలో అతని నేర్పును చూస్తే చాలా తెలివైనవాడిలాగే కనిపించాడతనికి. సమా వేశం ముగిశాక జీవన్‌సింగ్‌ వెళ్ళి అధికారిని పలకరించి, ‘‘నేను గుర్తులేనా? నీ యజమా నిని. జ్ఞాని అయిన ముల్లా దగ్గర నిన్ను మూడు నెలల క్రితం వదిలి వెళ్ళాను,'' అన్నాడు. అదృష్టవశాత్తు, జీవన్‌సింగ్‌ మాట తీరుకు అధికారి ఆగ్రహం చెందకుండా, ‘‘అయ్యూ నేనీ గ్రామాధికారిని.
 
నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వెలా నాకు యజమాని విగా ఉండేవాడివో తెలియడం లేదు,'' అన్నాడు నెమ్మదిగా. జీవన్‌సింగ్‌ మూడు నెలల క్రితం జరిగిన దానినీ, ఈ ఉదయం ముల్లాను చూసిన విషయమూ పూస గుచ్చినట్టు వివరించాడు. తనను అతని గాడిదగా భావిస్తూన్న వ్యాపారి వెర్రి బాగుల మనస్తత్వాన్ని చూసి గ్రామాధి కారి మనసులోనే నవ్వుకుని, అతన్ని మరింత ఆటపట్టించాలని, అతని చేతులు పట్టు కుంటూ, ‘‘మిత్రమా, ముల్లా నీ గాడి దను ఇక్కడికి అధికారిగా పంపాడని పొర బాటున చెప్పాడు.
 
నిజానికి అది ఇప్పుడు వివిధ మతాల ముఠాలకు నాయకత్వం వహిస్తూన్న ఫకీరుగా ఉంటోంది. నువ్వెళ్ళి ఆయనను చూడవచ్చు,'' అన్నాడు. జీవన్‌సింగ్‌ ఫకీరును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఫకీరు నదీ తీరంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పూర్తికాగానే జీవన్‌సింగ్‌ ఆయన్ను సమీపించి, ‘‘పక్క పట్టణంలో వున్న ముల్లా నీకు జ్ఞాపకం లేడా? ఆయనే నీకు నీతిగ్రంథం నుంచి పద్యాలు బోధించి నిన్ను మనిషిగా మార్చాడు.
 
అంతకు పూర్వం నువ్వు నా గాడిదవు. నేను నీ యజమానిని,'' అన్నాడు. ‘‘నేను గాడిదనా? ఏం చెబుతున్నావు?'' అని నిరసనగా చూసిన ఫకీరు, ‘‘ముల్లా ఎవర్నీ నేను ఎరుగను. మదరసా నుంచి నీతిగ్రంథం పద్యాలు నేర్చుకున్నాను. నువ్వేదో మతిచెడి భ్రమలో ఉన్నావనుకుంటున్నాను.

దాన్ని మాయమంత్రాలతో పోగొట్ట గలను. అయితే, అంతకు ముందు నువ్వు నీ గాడిదను గురించి వివరంగా చెప్పాలి,'' అన్నాడు. జీవన్‌సింగ్‌ తన గాడిదను గురించిన వివరా లను పొల్లు పోకుండా వివరించాడు. ఫకీరు చెబుతూన్న మాయూమంత్రాలు తన మీద పని చేయవనీ, ఆఖరికి ఫకీరే తన పాత గాడిదగా మారిపోగలడనీ, గాడిద తనను యజమానిగా గుర్తించగలదనీ జీవన్‌సింగ్‌ లోలోపల ఆశతో ఊహించుకోసాగాడు.
 
అంతా విన్న ఫకీరు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. జీవన్‌సింగ్‌ కూడా ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఊపిరి బిగపట్టుకుని ఆయనకు ఎదురుగా కూర్చు న్నాడు. ఫకీరు కొంతసేపయ్యూక మెల్లగా కళ్ళు తెరిచి, ‘‘నాయనా, మనలో ఎవరైనా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తే వారిని సింహం అంటాం. కుతంత్రంతో కూడిన తెలివి తేటలు గలవాణ్ణి నక్క అంటాం. అయితే, ధైర్యశాలి సింహం కాదనీ, జిత్తులమారి వాడు నక్క కాదనీ మనకు తెలుసు.
 
అయితే, మన భావాలను అలా ప్రక టిస్తాం. ఎదుటి వారికి అది సులభంగా అర్థమవుతుంది. అదే విధంగా తను బోధించే పాఠాలను పిల్లలు, శ్రద్ధగా వినడం లేదని ముల్లా వారిని గాడిదలని మందలించాడు. ఆ ‘పిల్ల గాడిదల్ని' తెలివి తేటలు గల మనుషులుగా మారుస్తానని చెప్పాడు. అందులో ముల్లా తప్పేమీ లేదు. నీ గాడిదను మనిషిగా మార్చమని నువ్వు అడగడం నీ అమాయకత్వం.
 
ముల్లా దగ్గరికి వెళ్ళి చూడు. అతని పెరట్లో నీ గాడిద కనిపి స్తుంది,'' అన్నాడు. ‘‘చాలా కృతజ్ఞతలు, స్వామీ,'' అంటూ లేచి నిలబడిన జీవన్‌సింగ్‌, ‘‘నా జీవితంలో తొలిసారిగా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను.
 
నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే ముల్లా దగ్గరికి వెళ్ళి నా గాడిదను వెనక్కు తీసేసుకుంటాను,'' అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఫకీరు చెప్పినట్టే, ముల్లా ఇంటి వెనక పెరట్లో గాడిద కనిపించింది. ముల్లా జాడ లేదు. గుంజకు కట్టివున్న తన గాడిదను విడిపించుకుని, జీవన్‌సింగ్‌ గ్రామంకేసి తిరుగు ప్రయూణమయ్యూడు.

దుస్సాహసం తెచ్చిన దుర్మరణం!


పరుగెత్తడంలోనూ, వేటాడడంలోనూ సాటిలేని యువకుడు యూక్టియూన్‌. అరణ్యం మధ్య అతడు పరుగులు తీస్తూంటే ఒక చోట అదృశ్యమై మరోచోట ప్రత్యక్షమయ్యే మాంత్రికుడా అన్నట్టు చూపరులకు సంభ్రమాశ్చర్యాలు కలిగేవి. ఇక వేటాడ డంలో అతనికి సాటి రాగలవారు ఆ రాజ్యం లోనే లేరు. తను వేటాడమే కాదు; తన వెంట వేటకు తీసుకువెళ్ళే వేటకుక్కలకు కూడా చక్కని శిక్షణ ఇచ్చేవాడు.
 
అతడు ఉసిగొలిపితే చాలు, జింకలు, కుందేళ్ళు వంటి జంతువులు తప్పించుకోడానికి ఎంతవేగంగా పరిగెత్తినా వెంటాడి వెళ్ళి వాటిని చంపి యజమాని ముందు తెచ్చి పడేసేవి అతని వేటకుక్కలు. అరణ్యాల అధిదేవత డయూనా. ఆమె ఒకనాడు అరణ్యంలో విహరిస్తూ, వాయువేగంతో పరుగెత్తుతూన్న యూక్టియూన్‌ను చూసి ముచ్చటపడింది. ఆమెకూ అరణ్యాల వెంట పగిగెత్తాలన్న కుతూహలం కలిగింది. అయితే, ఆమెకు తోడుగా పరిగెత్తడానికి తగిన చెలికత్తెలెవరూ లేరు.
 
అందువల్ల ఆమె యూక్టియూన్‌ను తనతో పరిగెత్తడానికి ఆహ్వానించింది. యువకుడు పొంగిపోయూడు. సాక్షాత్తు వన దేవతతో స్నేహం కలవడమంటే మాటలా? మహాభాగ్యంగా భావించాడు. రోజూ ఇద్దరూ కలిసి కొంతసేపు పరుగులు తీసేవారు. ఇద్దరికీ చాలా సంతోషం కలిగేది. వాళ్ళిద్దరి వెనకగా యూక్టియూన్‌ వేట కుక్కలు కూడా పరుగులు తీసేవి.
 
ఆరంభదశలో యూక్టియూన్‌ వనదేవతతో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. మర్యాద కనబరచేవాడు. అయితే, రోజులు గడిచే కొద్దీ అతనిలో ఒక విధమైన గర్వం, డయూనా చూపిన చనువు కారణంగా ఆమెపట్ల కొద్ది కొద్దిగా అలసత్వం ప్రబల సాగాయి.

ఒక్కొక్కసారి యూక్టియూన్‌ ఆమెతో, ‘‘నేను అనుకుంటే నీకన్నా వేగంగా పరిగెత్తగలను. కాని నిన్ను వెనకగా వదిలి ముందుకు వెళ్ళడం బావుండదుకదా!'' అనే వాడు. ఆ మాట విని డయూనా చిన్నగా నవ్వుకునేదే తప్ప సమాధానం చెప్పేది కాదు. ఆమె కావాలనుకుంటే మెరుపు వేగంతో పరిగెత్తగలదు. ఆ సంగతి ఆమెకూ తెలుసు. అయినా ఒక అల్ప మానవుడి మీద తన అతీతశక్తుల్ని ప్రదర్శించడం ఆమెకు ఆమోదయోగ్యం కాదు.
 
అయితే, అతడు తనను గానీ, తన ఆభరణాలను గానీ స్పృశించ కూడదని హెచ్చరించేది. యూక్టియూన్‌ తలపంకించి ఊరుకునేవాడు. రోజులు గడవసాగాయి. ఒకానొక వేసవి మధ్యాహ్న సమయంలో, డయూనా అరణ్య మధ్యంలోని ఒక సుందర తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళింది. తటాకం చుట్టూ పరచుకున్న ప్రశాంత ప్రకృతి సౌందర్యం. వివిధ వర్ణాలతో పరిమళాలు వెదజల్లుతూన్న వేనవేలపుష్పాలు. చల్లటి తటాక జలాలు.
 
వీటన్నిటినీ చూస్తూ స్నానం చేస్తూన్న వనదేవత ఆనందంతో మెల్లగా గీతాలాపన అందుకున్నది. వేళకాని వేళలో తన వేటకుక్కలతో అరణ్యంలోకి వచ్చిన యూక్టియూన్‌ వనదేవత పాట విని, వెళ్ళకూడని తటాకం సమీపించి చేయకూడని పనిచేయడానికి పూనుకున్నాడు. తటాకం ఒడ్డున పెద్ద బండ మీద ఉన్న దేవత ఆభరణాలను ముట్టుకున్నాడు. జలకాలాడుతూన్న వనదేవత కేసి పళ్ళికిలిస్తూ చూశాడు. యూక్టియూన్‌ను చూసి ఆశ్చర్యం చెందిన డయూనా, అతని అకృత్యాలకు అమితాగ్రహం చెందింది.
 
తన శక్తితో అతన్నొక జింకగా మార్చివేసింది. అంతే! మరుక్షణమే వేట కుక్కలు వాడి మీదికి ఉరికాయి. జింక రూపంలోని యూక్టియూన్‌ ప్రాణభయంతో పరుగులంకించుకు న్నాడు. అయినా వేట కుక్కలు జింక వెంటబడి తరుముకున్నాయి. క్షణాలలో వేటకుక్కలు జింకను పట్టుకుని చీల్చి చెండాడాయి. ఒక మానవుడికీ, దేవతకూ మధ్య సంతోషంగా ఆరంభమయిన పరిచయం ఆ మనిషి దుస్సాహసం, దుందుడుకు స్వభావం కారణంగా విషాదంగా ముగిసింది!

ఉత్తమ వైద్యుడు


వల్లభాపురంలో నివసించే ధనాచారి పేరున్న వైద్యుడు. చుట్టుపక్కల గ్రామాల్లో, ఆయనకు మించిన వైద్యుడు లేడని ప్రతీతి. ధనాచారికి పిల్లల్లేరు. ఎవరికైనా వైద్యవృత్తి నేర్పుదామనివున్నా ఏ విద్య అయినా స్వతహాగా కొంత ఆసక్తీ, అభిలాషా వుంటే తప్ప, కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం. ఇలావుండగా-ధనాచారికి దూరపు బంధువైన తిరుమలాచారి, తన కొడుకు లిద్దరితో కలిసి వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు.
 
అతడికి నగరంలో నగల వ్యాపారం వున్నది. కొంత కాలంగా అతడు నారిపుండు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరూ ధనాచారి చేస్తున్న వైద్యవృత్తి పట్ల ఆకర్షితులయ్యూరు. ధనాచారి వైద్యంతో రెండు వారాల్లో తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది. ఆయన తిరిగి నగరానికి ప్రయూణమవుతూ ధనాచారితో, ‘‘అన్నగారూ, తమరు అపర ధన్వంతరులు. అయితే, ఇంత విద్వత్తు, హస్తవాసి అన్నీ మీతోనే ఆగిపోవడం, నాకెందుకో నచ్చడంలేదు,'' అన్నాడు.
 
అందుకు ధనాచారి, ‘‘నే చేయగలిగిందేమీలేదు కదా! కొంతయినా ఈ విద్యపట్ల సహజంగా ఆసక్తి, అనురక్తి వుంటే తప్ప, ఇతరులకు నేర్పలేం,'' అన్నాడు. ‘‘నా కొడుకులు రమణుడూ, రాఘవుడూ ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తివుంది. వాళ్ళను మీ శిష్యులుగా చేసుకోండి,'' అని కోరాడు తిరుమలాచారి. తగిన పరీక్ష పెట్టిన తర్వాతే వాళ్ళను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు, ధనాచారి.
 
ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్ళిపోయూడు. ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు. తొందరగా ఆకళింపు చేసుకునేవాడు. రాఘవుడు నెమ్మదస్థుడు. విషయూన్ని ఒకటి రెండు సార్లు విని నిర్థారించుకునేవాడు. పది రోజుల పాటు ఇద్దరికీ పలురకాల ఆకులు, మూలికలు మొదలైనవాటిని పరిచయం చేశాడు, ధనాచారి.తను వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు. ఇలావుండగా, పక్క ఊరు భూస్వామిగారికి బొత్తిగా అన్నహితవు పోయిందనీ, కనిపించని రోగమేదో ఆయనను కృంగదీస్తోందనీ, ధనాచారి వచ్చి వైద్యం చేయూలనీ కబురువచ్చింది. ధనాచారి కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర మరికొంత సమాచారం రాబట్టాడు. భూస్వామిగారి అజీర్ణవ్యాధికి మందేం వాడాలో చెప్పి, రమణుణ్ణి పంపాడు. రమణుడు వారం రోజుల పాటు గురువుగారు చెప్పిన మూలికలూ, ఆకులూ నూరి గుళికలు చేసి భూస్వామికి ఇవ్వసాగాడు.
 
ఆయనకు తగ్గినట్లే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది. రమణుడి కేమీ పాలుపోలేదు. ఈసారి రాఘవుడు, భూస్వామి వద్దకు వెళ్ళి తాను వైద్యం చేస్తానన్నాడు. సరేనన్నాడు ధనాచారి. ముందుగా ఆయన ప్రతి రోజూ భుజించే ఆహారాన్ని తెప్పించి, పరీక్షించాడు రాఘవుడు. ఆయన భోజనంనిండా నెయ్యి, నూనెలు గుప్పించబడివున్నాయి. బలవర్థకమైన అనేక రకాల పదార్థాలు అవసరమైన వాటికన్నా అధికంగావున్నాయి. అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవుడికి.
 
‘‘అయ్యూ! మీరు పత్యం చేయవలసివుంటుంది. పది రోజుల పాటు చింతపండు రసం, చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చేయూలి. అప్పుడే నేను, మా గురువుగారి ఆజ్ఞగా ఇచ్చే ద్రావకం తమకు ఉపకరిస్తుంది,'' అన్నాడు రాఘవుడు వినయంగా. అలాగేనన్నాడు భూస్వామి. వారం రోజులలోపుననే, ఆయన అజీర్ణవ్యాధి తగ్గు ముఖం పట్టింది. భూస్వామి ఎంతో సంతోషించి రాఘవుడికి ఘనంగా సంభావనలు ఇచ్చి సాగనంపాడు.
 
రాఘవుడు తిరిగి వచ్చిన సమయంలో ధనాచారి ఇంటలేదు. రమణుడు, అతణ్ణి అడిగి జరినదంతా తెలుసుకున్నాడు. సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే, రమణుడు ఆయనతో, ‘‘గురుదేవా! రాఘవుడు, భూస్వామికి చేసిన వైద్యమేమిటో తెలుసుకున్నాను. శొంఠిపొడి, జీలకర్ర, కాస్త మిరియం, మరికొంత బెల్లం కలిపి కాచిన కషాయం మాత్రమే! కానీ, నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను. అయినా ఫలితం కనిపించలేదెందుకని?'' అని అడిగాడు.

‘‘అలాగా!'' అంటూ ధనాచారి చిరునవ్వు నవ్వి, ‘‘రమణా! వైద్యుడు రోగిని మాత్రమే కాదు, రోగాన్ని కూడా పరీక్షించాలి. రోగానికి మూలకారణ మేమిటో తెలుసుకోగలగాలి. భూస్వామిగారికి అతిగా భోజనం చేయడం వల్ల వచ్చిన వ్యాధి. దానికి మందులకన్నా, లంఖణమే బాగా పనిచేస్తుంది. అందుకే రాఘవుడి వైద్యం ఫలించింది,'' అన్నాడు. మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతూండగా రమణుడు, రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడివుండడం కనిపించింది.
 
చిరిగిన దుస్తులతో బక్కచిక్కివున్న అతణ్ణి చూసి, ‘‘ఎవడో బిచ్చగాడు. తిండి లేక సొమ్మసిల్లినట్టున్నాడు. పద, మనం వచ్చినపని చూద్దాం,'' అంటూ కదలబోయూడు రమణుడు. ‘‘వచ్చిన పని సరే! ఆపదలో వున్న ఇతణ్ణి ఇక్కడ ఎలా వదిలిపెట్టి పోగలం,'' అంటూ రాఘవుడు అతడి ముఖం మీద నీరు చల్లి, స్పృహ రాగానే, ‘‘రమణా! ఇతణ్ణి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం.
 
ఇలా పడివుండడానికి కారణం తిండిలేక పోవడంతో పాటు, మరేదైనా వ్యాధి కూడా వున్నదేమో గురువుగారి చేత పరీక్ష చేయిద్దాం,'' అని, ఆ వ్యక్తిని ధనాచారి వద్దకు తీసుకువచ్చాడు. జరిగింది విన్న ధనాచారి, రమణుడితో, ‘‘నిస్సహాయ స్థితిలో వున్నవాళ్ళ పట్లా, రోగుల పట్లా వైద్యుడికి సానుభూతి వుండాలి. అతడి ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి డబ్బు తీసుకోవాలి. వైద్యుడు, రోగికి మంచి మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా మసలుకోగలిగితే, వృత్తిలో రాణించగలడు,'' అన్నాడు.
 
ధనాచారి మాట ముగించగానే, రమణుడు వెల వెల పోతూ, ‘‘క్షమించండి, గురుదేవా! వైద్య వృత్తి ద్వారా, వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను. మా తండ్రిగారి నగల దుకాణంలో ఒక నగ అమ్మితే వచ్చే లాభం, పదిమందికి వైద్యం చేసినారానట్లు కనబడుతున్నది. ఈ వైద్య వృత్తి నా మనస్తత్వానికి సరిపోదు, క్షమించండి!'' అని సెలవు తీసుకున్నాడు. రాఘవుడు, ధనాచారి అడుగుజాడల్లో నడిచి, కొంత కాలానికి ఉత్తమ వైద్యుడిగా, గురువును మించిన శిష్యుడుగా పేరు తెచ్చుకున్నాడు.

విదురయ్య కోడళ్ళు


ఊబలంక అనే గ్రామంలో విదుర…్యు, ధర్మ…్యు అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరూ మధ్యతరగతి వ్యవసా…ుదారులు. విదుర…్యుకు గోపన్న, సోమన్న అని ఇద్దరు కొడుకులు. ధర్మ…్యుకు పిల్లలులేరు. ధర్మ…్యు ఒక రోజున విదుర…్యుతో, ‘‘విదుర…్యూ! నువ్వు గమనించావో లేదో, మనిద్దరం …ూభై…ువ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. నీ కొడుకులిద్దరూ ప్రెూజకుల…్యూరు. పెళ్ళిళ్ళు చేసేశావంటే, మనవలూ, మనవరాళ్ళూ పుట్టుకొస్తారు.
 
నీ వార్థక్య జీవితంలో సుఖంగా వుంటావు. నేనూ, నా భార్యా పిల్లాజెల్లాలేని ఒంటరివాళ్ళం. ఏ పిల్లవాడినైనా పెంపుడు తెచ్చుకుందామని ప్ర…ుత్నిస్తే, వాళ్ళ తల్లిదండ్రులు ముందు నా ఆస్తిపాస్తుల గురించిన ఆరాలు అడుగుతున్నారు, '' అన్నాడు బాధగా. విదుర…్యు, ధర్మ…్యు భుజం మీద చేయివేసి, ‘‘మనిషికి తప్ప ఏ ఇతర ప్రాణిలోనూ ముసలితనంలో ఆదుకునేందుకు వారసులంటూ వుండరు.
 
ఇప్పటి వరకూ నేనూ, నా భార్యా సుఖంగానే వున్నాం. కోడళ్ళు వచ్చాక ఏమౌతుందో చెప్పలేం. ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఏది ఎలా జరిగినా మనం అన్నదమ్ముల్లా కలిసివుందాం,'' అన్నాడు. ‘‘ఏదో మాటవరసకన్నాను. నీ కొడుకులు బంగారంలాంటి వాళ్ళు. వాళ్ళకు అంత బుద్ధిమంతులైన భార్యలు వస్తారని, నా నమ్మకం,'' అన్నాడు ధర్మ…్యు. గోపన్న, సోమన్న చెవులలో తండ్రీ, ఆ…ున స్నేహితుడు ధర్మయ్యూ మాట్లాడుకున్న మాటలు పడ్డాయి.
 
వాళ్ళిద్దరూ కూడ బలుక్కుని, వాళ్ళున్న చోటుకు వచ్చారు. గోపన్న, ధర్మ…్యుతో, ‘‘బాబా్ు! నేనూ, తమ్ముడూ, మిమ్మల్ని ఎప్పుడూ మానాన్నకు తమ్ముడుగా భావించి, చిన్నాన్నగా అభిమానం పెంచుకున్నాం. మమ్మల్ని మీ కొడుకులుగా భావించండి,'' అన్నాడు.

ధర్మ…్యు ఆనందబాష్పాలు రాలుస్తూ, ‘‘మీ ఇద్దరి గుణం నాకు తెలుసు. మీ నాన్నకు మంచికోడళ్ళు దొరికితే, నేనూ, మీ పిన్నీ మీ నీడలో హాయిగా బ్రతికేస్తాం!'' అన్నాడు. సోమన్న తృప్తిగా తలాడించి, ‘‘కోడళ్ళ మంచితనం గురించి బాగా గుర్తు చేశావు, బాబా్ు! నేనూ, తమ్ముడూ మా భార్యలు అక్కచెల్లెళ్ళయితే కలుపుగోలుగా వుంటారనుకుంటున్నాం,'' అన్నాడు. కొడుకు మాటలకు విదుర…్యు చిన్నగా నవ్వి, ‘‘ఒరే, మనం మంచి మాట్లాడుకుంటున్నప్పుడు, పైన తథాస్తు పలికే దేవతలుంటారని పెద్దలు చెప్పే మాట నిజం.
 
మీకు చెప్పలేదు - ఆ మధ్య నారదకుండం గ్రామంనుంచి అలాంటిదే ఒక సంబంధం వచ్చింది. ఆ గ్రామ మునసబువిశ్వేశ్వర…్యుకు ఇద్దరూ కూతుళ్ళే. ఆ…ునతో మనకు కొంచెం దూరపు బంధుత్వం కూడా వుంది. ఆ అమ్మాయిల్ని మంచి రోజు చూసి చూడ్డానికి వెళ్ళండి. నచ్చితే, నాకభ్యంతరం లేదు. అంతా మీకే వదిలేస్తున్నాను,'' అన్నాడు. ‘‘వాళ్ళను చూడడానికి మనం అందరం కలిసే వెళదాం,'' అన్నారు సోమన్న, గోపన్నలు.
 
ఒక మంచి రోజున, తను కుటుంబంతో, పిల్లలను చూసేందుకు వస్తున్నట్టు విదుర…్యు, నారదకుండం గ్రామ మునసబువిశ్వేశ్వర…్యుకు కబురు పంపాడు. తమతో పాటు రావలసిందిగా ధర్మ…్యు కుటుంబాన్ని కూడా ఒప్పించాడు. అనుకున్న రోజున అందరూ ఒక బాడుగ బండిలో బ…ుల్దేరారు. బండి తీరా విశ్వేశ్వర…్యు ఇంటి దాపులకు వచ్చేసమ…ుంలో, విదుర…్యుకు గుండెనొప్పి వచ్చింది. విశ్వేశ్వర…్యు వెంటనే అతణ్ణి ఇంటిలోపలికి తీసుకు పోయి మంచం మీద పడుకోబెట్టి వైద్యుడి కోసం మనిషిని పంపాడు.
 
వైద్యుడు హుటాహుటిన వచ్చి విదుర…్యును పరీక్షంచి, ‘‘ఇదే మంత తీవ్రమైన గుండెపోటులా కనిపించడం లేదు. ఏమైనా చిన్న పామునైనా పెద్ద కరత్రో కొట్టమన్నారు. నేనిచ్చే మందులు వాడుతూ, కదలకుండా వారం రోజులు మంచంమీద వుండాలి,'' అని చెప్పాడు. అప్పుడు ధర్మ…్యు, విశ్వేశ్వర…్యుతో, ‘‘ఇలా జరుగుతుందనుకోలేదు.


మీరు గ్రామంలో ఏదైనా కాస్త మంచి ఇల్లు చూసి బాడుగకు ఇప్పించండి. అవసరం అయితే పది రోజులు కాదు, ఇరవై రోజులైనా అక్కడవుండి విదుర…్యు వైద్యం చేయించుకుంటాడు,'' అన్నాడు. విశ్వేశ్వర…్యు ఏదో చెప్పబోేుంతలో, ఆ…ున కూతుళ్ళిద్దరూ సైగ చేసి ఆ…ున్ను పక్కగదిలోకి పిలిచారు. ఇద్దరిలో పెద్దదైన రాగిణి, తండ్రితో, ‘‘నాన్నా! వాళ్ళు మన ఇంటికి పెళ్ళిచూపులకు వచ్చిన వాళ్ళు. విదుర…్యుగారికి వైద్య సహా…ుం అవసరం అయినన్నాళ్ళూ, మన ఇంటిలోనే వుంచుకోవడం ధర్మం,'' అన్నది.
 
చిన్న కూతురు మోహిని, అక్కమాటలకు తలవూపి, తండ్రితో, ‘‘అక్క చెప్పినట్టు చెయ్యి, నాన్నా! పెళ్ళిచూపులకు ముందే, మామగారు అనారోగ్యం పాల…్యూరనే అపవాదు మాకు రాకూడదు. సంబంధం కలిసినా కలవక పోయినా, వాళ్ళు సంతృప్తిగా మన ఇంటి నుంచి వీడ్కోలు తీసుకోవాలి. విదుర…్యుగారు మన ఇంట్లోనే వుండి వైద్యం చేయించుకోవడం అన్ని విధాలామంచిది,'' అన్నది.
 
కూతుళ్ళు చెప్పినదంతా విన్న విశ్వేశ్వర…్యు, పక్కనే నిలబడి మౌనంగా చూస్తున్న భార్యకేసి తలతిప్పాడు. ఆమె, కూతుళ్ళ కేసి మెచ్చుకోలుగా చూసి, ‘‘అమ్మాయిలు చెప్పినటే్ట చే…ుండి. వచ్చిన బంధువులందర్నీ వేరే ఇంట్లో వుంచడం మర్యాద అనిపించుకోదు. తర్వాత మీ ఇష్టం,'' అన్నది. ఈ సంభాషణ అంతా పక్కగదిలోని మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని వున్న విదుర…్యుకు కాస్త స్పష్టాస్పష్టంగా వినబడుతూనే వున్నది.

 ప్ర…ూణ బడలికవల్ల కలిగిన కొద్దిపాటి అనారోగ్యం తను, విశ్వేశ్వర…్యు కుటుంబీకుల స్వభావాలను తెలుసుకునేందుకు చక్కగా ఉపెూగించిందని, ఆ…ున చాలా సంతోషించాడు. విశ్వేశ్వర…్యు, తన భార్య, కూతుళ్ళు చెప్పినదాన్ని గురించి బాగా ఆలోచించి-చివరకు విదుర…్యు, ధర్మ…్యు కుటుంబాలకు, గ్రామంలో మంచి సదుపా…ూలుగల ఒక ఇంటిలో వసతి ఏర్పాటు చేశాడు.
 
ఆ ఇంట ధర్మ…్యు కుటుంబానికీ, విదుర…్యు కుటుంబానికీ పది రోజులు హాయిగా గడిచి పోయినై. ఇంత త్వరలో కోలుకున్నందుకు విదుర…్యును, వైద్యుడు తెగమెచ్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి బ…ుల్దేరదామనుకుంటుండగా ధర్మ…్యు, విదుర…్యుతో, ‘‘మనం విశ్వేశ్వర…్యుకు కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోదాం. నువ్వు విన్న దాన్ని బటే్ట-భార్య, కూతుళ్ళు చెప్పినా విశ్వేశ్వర…్యు నిన్ను వేరే ఇంటికి మార్చాడు,'' అన్నాడు చిరుకోపంగా.
 
ఆ మాటలకు విదుర…్యు నవ్వి, ‘‘ధర్మ…్యూ, విశ్వేశ్వర…్యు భార్యా, కూతుళ్ళు జాలిగుణంతో పాటు మంచీ మర్యాదా ఎరిగినవాళ్ళు. ఇక విశ్వేశ్వర…్యు అంటావు; ఆ…ున వాటితో పాటు మంచి వ్యవహార జ్ఞానం కలవాడు. నన్నా…ున వాళ్ళ ఇంట్లో వుంచుకుంటే, ఆడ పిల్లలనంటగట్టడానికి పన్నాగం పన్నాడంటారు! అందుకే ఆ…ున నన్ను వేరే ఇంట్లో వుంచి అవసరమైన వైద్యం చేయించాడు.
 
ఆ…ున అంగీకరిస్తే రాగిణి, మోహినిలు, నా కోడళ్ళవుతారు. గోపన్న, సోమన్నలకు వాళ్ళిద్దరూ అన్ని విధాలా నచ్చారు,'' అన్నాడు. ఆ మర్నాడు లాంఛనంగా పెళ్ళిచూపులు జరిగినై. తల్లిదండ్రులతో పాటు, విశ్వేశ్వర…్యు కూతుళ్ళూ, విదుర…్యు కొడుకులూ ఇష్టపడడంతో నిశ్చితార్థం, ఆ తర్వాత నెల రోజులు గడవ కుండానే వాళ్ళ వివాహాలూ జరిగిపోయినై. కాలక్రమంలో విదుర…్యు, ధర్మ…్యు ఆశించినట్టు, కోడళ్ళిద్దరూ వాళ్ళపట్ల ఎంతో గౌరవాదరాలతో ప్రవర్తించి, వాళ్ళకు ఎంతో సంతోషం కలిగించారు.