Pages

Sunday, September 9, 2012

అక్కచెల్లెళ్ళు


ఒకానొకప్పుడు ఒకరాజు ప్రజలక్షేమమే ధ్యే…ుంగా పరిపాలన జరిపేవాడు. మంత్రులద్వారా, రాజోద్యోగుల ద్వారా ప్రజల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి చారులను గూడా ని…ుమించాడు. అంతేగాదు. తరచూ తనే మారువేషాలలో తిరుగుతూ తన పాలనగురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి కష్టసుఖాలేమిటో స్వ…ుంగా తెలుసుకునేవాడు.
 
ఒకనాటి అర్ధరాత్రి సమ…ుంలో రాజు నగరంలోని ప్రధాన వీధిగుండా వెళుతూంటే, ఒక రాజోద్యోగి ఇంటినుంచి ఏవోమాటలు వినిపించాయి. రాజు ఆ ఇంటిని సమీపించాడు. ఒక కిటికీ తెరిచివుంది. లోపల చిన్న దీపం నుంచి కొద్దిగా వెలుతురు వస్తోంది. మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు …ుువతులు తాము ఎలాంటి వారిని వివాహమాడాలో చర్చించుకుంటున్నారు.
 
‘‘నాకు భోజనం అంటే మంచి ఇష్టమని మీకు తెలుసుకదా? నాకు రాజభవనంలోని వంటవాణ్ణి పెళ్ళాడాలని వుంది. అలాజరిగితే, మహారాజుకూ, మహారాణికీ త…ూరు చేసే వంటలన్నిటినీ రుచిచూడవచ్చు,'' అన్నది ఒక …ుువతి. ‘‘నేను మంత్రినే గనక వివాహమాడితే, ఆ…ునతోపాటు రాజ్యమంతా ప్ర…ూణం చేసి, అన్ని ఊళ్ళూ చూస్తాను. కొత్తప్రదేశాలు చూడడమంటే నాకు మహాఇష్టం,'' అన్నది రెండవ …ుువతి.
 
ఆ తరవాత కొంతసేపు నిశ్శబ్దం నెలకొన్నది. ముందుమాట్లాడిన ఇద్దరు …ుువతులూ, ‘‘నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీకెవరిని పెళ్ళాడాలని వుందో చెప్పు,'' అని అడిగారు. ‘‘మహారాజుగారు నన్ను వివాహమాడితే, ఆ…ునకు అందమైన పిల్లల్ని కని ఇవ్వాలని వుంది,'' అన్నది మూడవ …ుువతి. ముగ్గురూ గలగలా నవ్వారు. ఆ మాటలను విన్న రాజు మౌనంగా రాజభవనానికి వెనుదిరిగాడు. వారి మాటలను గురించితీవ్రంగా ఆలోచించసాగాడు.

ప్ప టికే రాజుకు ఇద్దరు భార్యలున్నారు. ఇద్దరికీ సంతానభాగ్యం కలగలేదు. ఆ వినిపించిన కంఠస్వరాలు-ముగ్గురు అక్కచెల్లెళ్ళవని రాజు ఊహించాడు. మూడవ …ుువతి కోరుకున్నట్టు ఆమెను తాను వివాహమాడితే మంచిదేకదా అని భావించాడు. మరునాడు తెల్లవారగానే రాజు ముగ్గురు …ుువతులనూ రాజభవనానికి రమ్మని మేనాను పంపాడు. ఆ …ుువతులు రాజభవనానికి రాగానే, వారి తండ్రిని పిలిచి రాత్రి జరిగిన సంగతి చెప్పి, ‘‘మీ పెద్దమ్మాయి మా వంటవాణ్ణీ, రెండవ అమ్మాయి మంత్రినీ వివాహమాడడానికి నేను ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు.
 
తనకేసీ, రాజుకేసీ మార్చిమార్చి చూస్తూన్న తన చిన్న కూతురి గురించి ఏంచెబుతాడో అని రాజోద్యోగి ఆతృతగా ఎదురు చూశాడు. రాజు మందహాసం చేస్తూ, ‘‘నేను నీ చిన్న కుమార్తెను నా మూడవ భార్యగా స్వీకరించి ఆమెను రాణిని చేస్తాను!'' అన్నాడు. ఆ మాట వినగానే చిన్న కూతురు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మూడు పెళ్ళిళ్ళూ ఘనంగా జరిగాయి.
 
ముగ్గురు పెళ్ళికూతుళ్ళూ, వారి వారి భర్తల ఇళ్ళకు చేరి కాపురాలు చే…ుసాగారు. తమ చెల్లెలు రాజభవనంలో రాజభోగాలు అనుభవిస్తూండగా తాము మాత్రం సాధారణ గృహాలలో మామూలు జీవితంగడవలసివచ్చిందే అని అక్కలు ఇద్దరూ విచారపడసాగారు. క్రమంగా ఆ విచారం అసూ…ుగా మారింది. అయితే, చెల్లెలు మాత్రం అక్కలపట్ల ఎంతో ప్రేమాదరాలతో మసలుకోసాగింది.
 
తన ఇద్దరి అక్కలలో ఎవరైనా ఒకరు ఆనాటి రాత్రి రాజుగారిని వివాహమాడాలని కోరుకుని ఉంటే తనకీ భాగ్యం లభించేది కాదు కదా అన్న కృతజ్ఞతాభావంతో వారిపట్లనడుచుకునేది. ేుడాది తిరిగేలోపల మూడవ రాణి గర్భవతి అయింది. కాన్పు సమ…ుం సమీపించడంతో, తన అక్కలు తనకు సా…ుంగా ఉంటే బావుంటుందని రాజుకు చెప్పింది. రాజు సంతోషంగా ఆమె ఇద్దరు అక్కలనూ రాజభవనానికి పిలిపించాడు. వాళ్ళు అక్కడే ఉండసాగారు. అయితే చెల్లెలి మీద అకారణ అసూ…ూద్వేషాలతో కుట్రపన్నసాగారు.
 
ఆమె మగబిడ్డను ప్రసవించగానే, రాణిపరిచారిక సా…ుంతో ఆ బిడ్డను ఒక బుట్టలో ఉంచి, రాజభవన సమీపంలో ప్రవహించే నదిలో వదిలేలా చేశారు. బిడ్డస్థానంలో అప్పుడే పుట్టిన ఒక కుక్కపిల్లను తెచ్చి పడుకోబెట్టి రాణితో, ‘‘కుక్కపిల్లను ప్రసవించావు,'' అని చెప్పారు.

‘‘అదే భగవంతుడి సంకల్పమయితే, దానినే నేను నా బిడ్డగా స్వీకరిస్తాను,'' అన్నది రాణి చెప్పరాని ఆవేదనతో. మరుసటి సంవత్సరం కూడా రాణి మరొక మగ శిశువును ప్రసవించింది. అయితే అక్కలు మళ్ళీ తమ దుష్ట పథకంతో, బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలి, ఒక పిల్లిపిల్లను తెచ్చి రాణి పక్కనపడుకోబెట్టారు. తన విధిని తలుచుకుని రాణి, ‘‘అంతా భగవదేచ్ఛ,'' అని సరిపెట్టుకున్నది.
 
మళ్ళీ ఒక సంవత్సరం గడిచింది. రాణి ఈసారి పండంటి ఆడ శిశువును ప్రసవించింది. అక్కలు మళ్ళీ తమ దుష్టపథకం ప్రకారం బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలి, ఒక మట్టి బొమ్మను తెచ్చి, రాణి పక్కన పడుకోబెట్టారు. రాణి తనకు జరుగుతున్న దానికి విషాదం చెందింది. రాజు కూడా విచారించాడు. ఆనాటి రాత్రి, ‘‘రాజు నన్ను వివాహమాడితే, ఆ…ునకు అందమైన పిల్లల్ని కంటాను,'' అని ఆమె అనడం తలుచుకుని బాధపడసాగాడు.
 
రాజు …ుధాప్రకారం మారువేషంలో మళ్ళీ తిరగడం ప్రారంభించాడు. రాణిగారు కుక్కపిల్ల, పిల్లిపిల్ల, మట్టిబొమ్మలను ప్రసవించడం గురించి ప్రజలు వింత వింతలుగా మాట్లాడుకోవడం రాజువిన్నాడు. రాణి మామూలు స్ర్తీ కాదనీ, ఆమె ద…్యుమనీ, అలా పిల్లలకు బదులు జంతువులను కనడం, రాజ్యానికి జరుగనున్న అనర్థాలకు సూచనలనీ పలువురు మాట్లాడుకోసాగారు. ఆమె ఇంకా రాజభవనంలో ఉంటే రాజ్యానికి అరిష్టమనీ ఆమెను అడవిలో వదిలిపెట్టడమే రాజ్యానికి క్షేమం అనీ చెప్పుకోసాగారు.
 
ఆ మాటలువిన్న రాజు ఆమెను అడవిలో వదిలిపెట్టాడు. ఇది ఇలా ఉండగా అంతకుముందే మరొక విచిత్రం జరిగింది. రాజభవనానికి ఆనుకుని ప్రవహించే నదీతీరంలో, అరణ్య సమీపాన బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. ఆ బ్రాహ్మణుడు వేకువ జాముననదిలో స్నానంచేసి సంధ్యావందనం చేస్తూండగా ప్రవాహంలో ఒక బుట్ట కొట్టుకురావడం కనిపించింది. అందులో అప్పుడే పుట్టిన శిశువును చూసి అతడు అమితాశ్చర్యం చెంది, బిడ్డను తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు.
 
అంతవరకు సంతానానికి నోచుకోని ఆ దంపతులు, బిడ్డను అమితానందంతో పెంచసాగారు. మరుసటి సంవత్సరం కూడా బ్రాహ్మడికి బిడ్డ నదిలో తేలుతూ రావడం కనిపించింది. ఆ బిడ్డను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పిల్లలిద్దరూ ఒకే పోలికతో ఉండడం చూసి దంపతులు ఆశ్చర్యపో…ూరు.

మరో సంవత్సరం గడిచాక అదేవిధంగా మరొక శిశువువున్నబుట్ట నదిలో తేలుతూ రావడం చూసి బ్రాహ్మడు ఆశ్చర్యానందాలు చెందాడు. ఇప్పుడు తేలుతూవచ్చింది ఆడశిశువు. ఆ దంపతులు పిల్లలకు మదనుడు, మోహనుడు, మోహిని అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. కొన్నేళ్ళకు బ్రాహ్మణుడూ, ఆ తరవాత అతని భార్యా మరణించారు. పిల్లలు తమను తామే పోషించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఒకరోజు, వేటకు అడవికి వెళ్ళిన రాజు, తన పరివారానికి దూరమై దారితప్పి, రాత్ర…్యూక కాలినడకన బాగా అలిసిపోయి, నదీ తీరంలో ఆ ముగ్గురు పిల్లలున్న ఇంటి దగ్గరికి వచ్చాడు. పిల్లలు ఆ…ునకు అన్నపానాదులిచ్చి, సపర్యలు చేశారు. రాజు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. తెల్లవారి నిద్రలేచాక, రాజు తాను ఎవరైనదీ వాళ్ళకు తెలి…ుచేసి తన సా…ుం కావలసి వచ్చినప్పుడు రాజధానికి రావచ్చునని చెప్పాడు.
రాజధానికి చేరగానే భటులచేత వాళ్ళకు సంచీ నిండుగా బంగారు నాణాలు పంపాడు. తమ ఇంటికి సాక్షాత్తు రాజుగారే అతిథిగా వచ్చారు గనక తమ ఇంటిని కూడా రాజభవనంలా కట్టుకోవాలని మోహిని అన్నలకు సలహా ఇచ్చింది. అన్నలు ఆమె కోరికను నెరవేర్చారు. పెద్ద భవన నిర్మాణం జరిగింది. మోహిని అందమైన వస్తువులతో ఇంటిని అలంకరించసాగింది.

ఒకరోజు ఒకెూగి అటుకేసి వచ్చాడు. నదీ తీరంలో వెలసిన అందాల భవనాన్ని చూసి ఆనందం చెందాడు. అయితే అది అరణ్యసమీపంలో ఉండడమే ఆ…ునకు వింతగొలిపింది. ెూగికి అతిథి సత్కారాలు చేసిన మోహిని, తమ భవనంలో ఏదైనా లోపం ఉందా? అని అడిగింది. ‘‘అంతా బాగానే వుంది. అయితే, ఇలాంటి భవనంలో బంగారు చెట్టు, బంగారు పంజరంలో బంగారు చిలుక, ఒక బంగారు విల్లు ఉన్నట్టయితే మరీ బావుంటుంది!'' అన్నాడు.
‘‘అవి ఎక్కడున్నాయి?'' అని అడిగింది మోహిని. ‘‘ఉత్తరదిశలో ఉన్న కొండశిఖరంమీద, ఆ మూడూ ఉన్నాయి,'' అని, వాటిని ఎలా తెచ్చుకోవాలో వివరాలు చెప్పి వెళ్ళిపో…ూడుెూగి. అన్నలూ, చెల్లెలూ ఆ విష…ుం గురించి బాగా ఆలోచించారు. ఆఖరికి మదనుడు లేచి నిలబడి, ‘‘చెల్లీ, నేను వెళ్ళి వాటిని సాధించుకుని వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి.


ఇదిగో ఈ కత్తిని నీ దగ్గర ఉంచు. నాకేదైనా ఆపదవాటిల్లితే ఈ కత్తి పదును తగ్గుతుంది,'' అని చెప్పి చెల్లెలికి తన కత్తిని ఇచ్చి బ…ులుదేరాడు. కొన్ని రోజులు గడిచాయి. కత్తి పదునుతో తళతళలాడుతూనే ఉన్నది. తన అన్న క్షేమంగా ఉన్నాడని ఆమె భావించింది. అయితే ఒకనాడు ఉద…ుం కత్తి పదును కోల్పోయి, వెలవెలబోయింది. అక్కడ మదనుడికి ఏం జరిగిందంటే- అతడు ెూగి చెప్పిన కొండశిఖరాన్ని చేరుకుని భవనం మెట్లను ఎక్కుతూన్నప్పుడు, ‘‘మదనా, ముందుకు వెళ్ళకు!'' అనే మాటలు వినిపించాయి.
 
అయినా మెటె్లక్కుతూన్నప్పుడు వెనుతిరిగి చూడకూడదన్న ెూగి హెచ్చరికను గుర్తుంచుకున్న మదనుడు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాడు. మరొక రెండు మెట్లు ఎక్కాడు. ‘‘మదనా, ఆగు. నేనూ వస్తాను,'' అన్న మాటలు తన పెంపుడుతండ్రి కంఠస్వరంతో వినిపించడంతో, అతడు తిరిగి చూశాడు. మరుక్షణమే శిలగా మారిపో…ూడు! మోహనుడు తన వేణువును తీసి చెల్లెకిస్తూ, ‘‘మార్గ మధ్యంలో నా కేదైనా ఆపద వాటిల్లినట్టయితే, వేణువు రెండుగా చీలి విరిగి పోతుంది,'' అని చెప్పి అన్నను వెతుక్కుంటూ బ…ులుదేరాడు.
 
కొన్నాళ్ళకు అతడు కొండశిఖరం మీది భవనాన్ని సమీపించి మెటె్లక్కుతూండగా, ‘‘మోహనా, నేను నీ వెనకే ఉన్నాను. ఆగు, వస్తాను,'' అంటూ అన్న కంఠస్వరం వినిపించింది. అన్నను వెతుక్కుంటూ వెళుతూన్న మోహనుడు ఆ మాటలకు వెనుదిరిగి చూశాడు. అంతే, ఆక్షణమే అతడూ శిలగా మారిపో…ూడు! అక్కడ ఇంట వేణువు రెండుగా చీలివిరిగిపోవడంతో మోహిని దిగ్భ్రాంతి చెందింది.
 
ఆరోజంతా భోరున విలపించింది. మరునాడు ధైర్యాన్ని కూడగట్టుకుని అన్నలను వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించింది. ఆమె కూడా కొన్నిరోజులకు ెూగి సూచించిన కొండశిఖరం మీది భవనాన్ని సమీపించింది. దృఢసంకల్పంతో భవనం మెటె్లక్కసాగింది. అమ్మానాన్నలు, అన్నలు పిలుస్తున్నట్టు ఏవేవో కంఠస్వరాలు వినిపించాయి.
 
అయినా ఆమె వెనుదిరిగి చూడలేదు. హెచ్చరికలూ, బెదిరింపులూ వినిపించాయి. అయినా ఆమె గుండె నిబ్బరంతో ముందుకు అడుగువేసింది. భవన మంటపాన్ని చేరి అక్కడి బంగారు చెట్టునూ, బంగారు పంజరంలోని చిలుకనూ …ూసింది.

ఆమెను చూడగానే బంగారు చిలుక, ‘‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో ఆ మృదంగం మీద బంగారు విల్లు కనిపిస్తోంది చూడు. ఆ విల్లుతో మృదంగాన్ని వాయించు. ఆ శబ్దం వినగానే శిలలుగా మారిన నీ అన్నలు సజీవులవుతారు,'' అన్నది. మోహిని చిలుక చెప్పినటే్ల చేసి, ‘‘నా చేతికి బంగారువిల్లు, బంగారుచిలుక వచ్చాయి. మా అన్నలు వెతుక్కుంటూ వెళ్ళిన బంగారుచెట్టును సాధించేదెలా?'' అని అడిగింది.
 
‘‘మీ అన్నలలో ఒకడు ఈ విల్లుతో ఆ చెట్టు మొదలును తాకితే, అది తానంతట ఆ…ున చేతిలోకి వస్తుంది,'' అన్నది చిలుక. ‘‘మోహినీ, నువ్వెలా ఇక్కడికి వచ్చావు?'' అంటూ అన్నలు అక్కడికి రావడం చూసి, మోహిని పరమానందం చెందింది. ‘‘అవన్నీ తరవాత చెబుతాను. ముందు మీలో ఒకరు ఈ బాణంతో ఆ బంగారు చెట్టు మొదలును తాకండి. అది మీ చేతుల్లోకి వస్తుంది,'' అన్నది మోహిని ఉత్సాహంగా. మదనుడు విల్లుతో బంగారు చెట్టును తాకాడు.
 
అది అలాగే లేచి అతని చేతిలోకి వచ్చింది. ముగ్గురూ భవనం నుంచి వెలుపలికి వచ్చి కొండదిగి ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల తరవాత వాళ్ళు రాజును తమ ఇంటికి ఆహ్వానించారు. రాజువచ్చి, భవనంలోపల తిరిగిచూసి, వాళ్ళ సంపదకు అమితాశ్చర్యం చెందాడు. భోజనాలకు కూర్చున్నప్పుడు పళ్ళాలలో ఆహార పదార్థాలకు బదులు, మణులు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు ఉన్నాయి.
 
‘‘ఏమిటీ విడ్డూరం?'' అని అడిగాడు రాజు. ‘‘ఒకస్ర్తీ కుక్కపిల్లనూ, పిల్లిపిల్లనూ, మట్టిబొమ్మనూ ప్రసవించగలిగినప్పుడు, బంగారుచెట్టు ప్రసాదించే మణిమాణిక్యాలతో వంట చే…ువచ్చు కదా? ఇందులో వింత, విడ్డూరం ఏమున్నాయి?'' అన్నది బంగారు పంజరంలోని బంగారుచిలుక. చిలుక మాటలలోని అంతరార్థాన్ని రాజు గ్రహించాడు. ‘‘అయితే, నా పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?'' అని అడిగాడు.
 
‘‘నీ ఎదుటే ఉన్నారు మహారాజా! అసూ…ూగ్రస్తులైన వారి అక్కలే రాణిగారికి కుక్క పిల్లా, పిల్లిపిల్లా, మట్టిబొమ్మా పుట్టా…ుని చెప్పారు. ఇప్పుడైనా వెళ్ళి ఆమెను ఏలుకోండి మహారాజా!'' అన్నది బంగారుచిలుక. రాజు వెళ్ళి అడవిలోవున్న రాణిని వెంట బెట్టుకుని అక్కడికి వచ్చాడు. పిల్లలను చూసి తల్లితండ్రులూ, తల్లితండ్రులను చూసి పిల్లలూ చెప్పలేని ఆనందం పొందారు.

No comments:

Post a Comment