Pages

Sunday, September 9, 2012

పశుపతి మాన్యం


పశుపతి వాడవల్లి వేదపాఠశాలలో పదేళ్ళ వయసున్నప్పుడు చేరి వేదం నేర్చుకున్నాడు. ఇరవై సంవత్సరాలు వచ్చాక, నేర్చుకున్న విద్యతో ఏదో ఒక గ్రామంలో పురోహితుడిగా స్థిరపడి సంసారి కావాలని, గురువుల ఆశీస్సులు పొంది బయలుదేరాడు. పశుపతి అలా ప్రయూణం చేస్తూ రాజవరం అనే గ్రామాన్ని సమీపిస్తూండగా, ఒక వ్యక్తి చేతిలో శివలింగంతో ఏటి నీటిలోకి దిగడం చూశాడు.
 
పశుపతి ఆయన్ను ఆపి, ‘‘అయ్యూ, తమరు ఏమిటి చేయబోతున్నారు?'' అని అడిగాడు. ‘‘మా గ్రామ శివాలయం శిథిలమై పోవడంతో పునర్నిర్మించి, పాత శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించాలని, కాశీ నుంచి ఈ శివలింగాన్ని తీసుకువచ్చాను. కాని ప్రతిష్ఠ సమయూనికి తిరిగి రాలేక పోయూను. పాతశివలింగాన్నే ప్రతిష్ఠించారు. అందువల్ల ఈ శివలింగాన్ని జల నిమజ్జనం చేస్తున్నాను,'' అన్నాడు ఆ వ్యక్తి విచారంగా.
 
‘‘అయ్యూ, కాశీనుంచి తెచ్చిన శివలింగం తప్పక పూజార్హం కావాలి. ఒక దేవాలయంలో ఎన్ని శివలింగాలయినా ఉండవచ్చు. ఇది వేద ప్రమాణం. పాత దానితో పాటు దీన్ని కూడా ప్రతిష్ఠించండి. రెండు శివలింగాల గుడిగల గ్రామంగా మీ ఊరు పేరు పొందాలన్నది దైవ సంకల్పమై ఉంటుంది. మీ గ్రామస్థులకు నేను వచ్చి చెబుతాను. పదండి ఊళ్ళోకి వెళదాం,'' అన్నాడు పశుపతి. పశుపతి వేదప్రమాణంగా చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి. రెండు శివలింగాల ప్రతిష్ఠ జరిగి నూతన దేవాలయం అందరినీ ఆకర్షించ సాగింది.

ప్రతిష్ఠ సమయంలో పశుపతి వేదమంత్రాలు వల్లించిన తీరు అందరినీ ఎంత గానో ఆకట్టుకున్నది. అతణ్ణి తమ గ్రామంలోనే ఉండిపొమ్మని కోరారు. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన పెద్దమనిషి పేరు పట్టెయ్య. పెద్ద భూస్వామి. తను తెచ్చిన శివలింగానికి గుర్తింపు తెచ్చిన పశుపతి తమ గ్రామంలోనే ఉండాలన్న కోరికతో ఒక ఎకరం పొలాన్ని అతనికి దానంగా ఇచ్చాడు.
 
నా అన్న వాళ్ళు లేని పశుపతి రాజవరం గ్రామంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. శివలింగ ప్రతిష్ఠ జరిగాక ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో శివాలయ పూజారి కుమార్తె దుర్గ శివలీలల కథాగానం చేసి భక్తులను ఎంతగానో అలరించింది. ఆఖరి రోజున ఆమె నందీశ్వరుడి కథ చెప్పింది. దాన్ని విని, ��కథ విన్నవారికి పాడి ఆవు, చెప్పిన వారికి చూడిఆవు ఇవ్వాలని అంటారు.
 
చక్కని కథలు చెప్పిన పూజారిగారమ్మాయికి నేను చూడావును బహూకరిస్తాను,�� అంటూ బసవయ్య అనే పెద్దమనిషి ఆమెకు ఒక చూడి ఆవును కానుకగా ఇచ్చాడు. బహుమతిగా ఇచ్చిన ఆవు మరికొద్ది సేపట్లోనే కవల కోడె దూడలను ఈనింది. నందీశ్వరుడే కోడెదూడల రూపంలో అవతరించి రెండు శివలింగాలకు నమస్కరించదలిచాడని జనం భక్తితో పరవశించిపోయూరు.
 
నందీశ్వర ప్రతిరూపాలైన ఆ దూడలను శివార్పితంగా అచ్చోసి ఆబోతులుగా వదిలెయ్యూలని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఆ మాటలు విన్న గంగిరెద్దులవాడు ఊరి పెద్దలకు నమస్కరించి, ��అయ్యూ, శివుడు నాట్యప్రియుడు. మా గంగిరెద్దుల ఆటకు ప్రసన్నుడయ్యూడేమో! మాకో దూడను ఇప్పించండి. దానికి ఆట పాట నేర్పి, యేటా శివరాత్రి ఉత్సవాలకు తీసుకువస్తాం,�� అన్నాడు.
 
అయితే, అక్కడే ఉన్న పశుపతి, ��అది నాలుగేళ్ళ తరవాతి మాట. అప్పటికిగాని దూడలు పెద్దవి కావు. పైగా అవి పూజారిగారివి. ఆయన అభిప్రాయూన్నిమన్నించాలి కదా?�� అనడంతో అందరూ అవునంటూ అంతటితో ఊరుకున్నారు. ఆ మరునాటి సాయంకాలం ఏటిగట్టున కూర్చుని వున్న పశుపతికి మరో ఊరికి తిరిగి వెళ్ళిపోతూన్న గంగిరెద్దులవాళ్ళు కనిపించారు.

వాళ్ళ వెంట నాలుగయిదు గంగి రెద్దులు ఉన్నాయి. వాటిలో ఒక కోడెదూడ నీరసంగాకుంటుతూ వెళ్ళడం గమనించిన పశుపతి మనసు కలత చెందింది. అది దీనంగా తనకేసి చూస్తున్నట్టు పశుపతికి అనిపించింది. మరి కొంతసేపటికి అతడి చూపు కొంత దూరంలో అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తూ పచ్చిక మేస్తున్న ఆబోతు మీదికి మళ్ళింది. అతడు లేచి దాని దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, పరిశీలనగా చూస్తూ ఆప్యాయంగా నిమిరాడు.
 
ఆ తరవాత ఏటిగట్టుకు తిరిగివచ్చాడు. ఆబోతు అతడి వెనకే మెల్లగా వచ్చింది. ఏటిగట్టున పెద్ద రావిచెట్టు ఉంది. ఆ రోజు శనివారం కావడంతో రావిచెట్టును పూజించడానికి వచ్చిన పూజారి కూతురు దుర్గ పశుపతినీ, అతడి పక్కనే వున్న ఆబోతు ఒంటి మీది వాతలనూ చూసి, ��పాపం, ఏమిటిది?�� అని అడిగింది. ��ఏముంది! అంతా మనం చేసే పనులే,�� అంటూ నిట్టూర్చిన పశుపతి, కొంతసేపు మౌనంవహించి ఆ తరవాత, ��దేవలోకానికి కామధేనువులాంటిది భూలోకానికి పశుసంపద.
 
పాడి పంటలకు అది మూలాధారం. మన పూర్వులు వాటిని దైవాలుగా భావించి పూజలు చేసేవారు. కొందరైతే దేవుడికి గోవుల రూపంలో మొక్కులు చెల్లించేవారు. అలా వచ్చిందే అచ్చోసి ఆబోతును వదిలే మన సంప్రదాయం. అచ్చోసి వదిలే కోడెదూడను అందరూ నందీశ్వరుడిగా భావించేవారు. ఇంటి గుమ్మంలోకి వస్తే చేటలో బియ్యం పోసి పెట్టేవారు. అది పంటచేల్లో పడి మేసినా కొట్టరు.
 
కాని ఈ ఆబోతును ఎవరో చితకకొట్టారు. అదేవిధంగా గంగిరెద్దుల వారికిచ్చే కోడెదూడలను కూడా వాళ్ళు ఆటలు నేర్పడానికి వాటిని నానా హింసలు పెడతారు. కొడతారు. దారికి వచ్చేంత వరకు తిండి పెట్టకుండా మాడుస్తారు. ఈ విషయూలను తలుచుకుంటే బాధగా ఉంటోంది,�� అన్నాడు. ��అవును, వేదపండితులు కదా. తమ మాటకు తిరుగేముంటుంది? అయినా, ఇలాంటి దుస్థితి నుంచి వాటిని కాపాడడానికి కూడా తమరే ఏదో ఆలోచించాలి మరి,�� అంటూ అక్కడి నుంచి బయలుదేరింది దుర్గ.

ఆలోచనలో పడ్డ పశుపతి తెల్లవారే సరికి ఒక నిర్ణయూనికి వచ్చి, గ్రామపెద్దను కలుసు కుని, ��పట్టెయ్య నాకు దానంగా ఇచ్చిన పొలాన్ని పశుపోషణకు వినియోగించాలనుకుంటున్నాను. గ్రామంలో తిరిగే ఆబోతుల అవసరాలు చూసుకుంటూ, గోశాలను ఏర్పాటు చేసి పశువులను శ్రద్ధగా మేపే రైతుకు ఆ పొలాన్ని కౌలుకు ఇస్తూ, అందులో వచ్చే ఆదాయూన్ని పశుపోషణకే వినియోగించేలా తమరు ఏర్పాటు చేయూలి,�� అని వేడుకున్నాడు.
 
��మరి నీ జీవనోపాధికి ఏంచేస్తావు?�� అని అడిగాడు గ్రామపెద్ద. ��ఆ పొలం నేను ఆశించి రాలేదు. భగవత్కృపవల్ల వచ్చిన ఆ పొలాన్ని నందీశ్వరుడి సేవకు వినియోగిస్తున్నాను. నేను నేర్చుకున్న వేదవిద్య ద్వారా ఆ పరమేశ్వరుడే నాకు ఏదో మార్గం చూపకపోడు. నేను ఈ రోజే మరో ఊరికి బయలుదేరుతాను,�� అన్నాడు పశుపతి. అంతకు ముందే అక్కడికి వచ్చి అతడి మాటలు విన్న శివాలయ పూజారి, ��నాయనా పశుపతీ! వేద మంత్రాలతో పాటు గోసంపద మీద నీకున్న శ్రద్ధ ప్రశంసనీయం.
 
నీకు అభ్యంతరం లేకపోతే నీలాంటి ఉన్నత వ్యక్తికి మా ఒక్కగానొక్క కూతురు దుర్గను ఇచ్చి వివాహం జరిపించడం భాగ్యంగా భావిస్తాను. నువ్వు వేరెక్కడికీ వెళ్ళనవసరం లేదు. మాతోనే ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ సుఖంగా జీవయూత్ర సాగించవచ్చు,�� అన్నాడు. ��మీ కుమార్తెకు సమ్మతమైతే, సరస్వతీ కటాక్షం గల ఆమెను వివాహమాడడం నాకూ సంతోషమే,�� అన్నాడు పశుపతి చిన్నగా నవ్వుతూ.
 
మరుసటి ముహూర్తంలోనే ఊరి పెద్దల సమక్షంలో దుర్గ-పశుపతుల వివాహం నిరాడంబరంగా జరిగింది. నూతన వధూవరులు బసవయ్య కానుకగా ఇచ్చిన ఆవు-దూడల పోషణను తామే స్వయంగా చూసుకోవాలనుకున్నారు. పశుపతి నిర్ణయూన్ని గ్రామప్రజలందరూ మెచ్చుకున్నారు. పశుపోషణకని అతడు ఇచ్చిన పొలానికి కాలక్రమంలో పశుపతి మాన్యం అనే పేరువచ్చింది.

No comments:

Post a Comment