Pages

Monday, September 10, 2012

లోయచివరి నిటారుబండ!


గామ సీమలకు దూరంలో ఒకానొక లోయ ప్రాంతంలో చాలా ఎత్తయిన నిటారు బండ ఒకటి ఉంది. దాని మీద తరచూ మేఘాలు తేలి ఆడుతూ ఉంటాయి. అంత ఎత్తయినదన్న మాట అది! అయితే, మామూలు కొండ శిఖరాల్లా దాని కొస మొనదేలి ఉండదు. బల్ల పరుపుగా బడిపిల్లలు వినోద యూత్రకు వెళ్ళడానికి చాలినంత విశాలంగా ఉంటుంది దాని ఉపరితలం. అయితే, ఉపరితలానికి ఎక్కి వెళ్ళాలంటే సాధ్యపడదు. ఒకసారి కొందరు పర్వతారోహకులు ఉత్సాహం కొద్దీ తాళ్ళు, మేకులు, సుత్తుల సాయంతో ఆ బండ ఉపరితలానికి చేరుకోగలిగారు.
 
అయితే, తీరా అక్కడికి చేరాక, ఆ ఎత్తయిన కొండపై నుంచి కిందికి దిగడం అసాధ్యమని గ్రహించి వెలవెలబోయూరు. ఆఖరికి హెలికాప్టర్‌సాయంతో వారిని అక్కడి నుంచి కిందికి దించడం జరిగింది! అయితే మనం ఇప్పుడు చెప్పుకోనున్న కథ వీరికి సంబంధించినది కాదు. చాలాకాలం క్రితం, అంటే హెలికాప్టర్లూ, విమానాలూ, వైర్‌లెస్సులూ కనుగొనడానికి కొన్ని శతాబ్దాలకు పూర్వం జరిగిన కథ.
 
ఆ కాల ఘట్టంలో స్థానికులైన ఇద్దరు కుర్రాళ్ళు, ఈ ఉపకరణాల సాయం లేకుండానే కిందికి దిగి వచ్చారు. ఎలా? ఇక్కడ మీకో విషయం చెప్పాలి. అసలా కుర్రాళ్ళు బండ ఉపరితలానికి ఎక్కి వెళ్ళలేదు.
 
ఎక్కి పైకి వెళ్ళకపోతే, దిగివచ్చే సమస్యే లేదు కదా, అనుకుంటున్నారు కదూ! అయితే వాళ్ళు బండ ఉపరితలం మీదే ఉన్నారు. ఎక్కకుండానే ఉపరితలాన్ని ఎలా చేరారు? తెలుసు కోవాలని కుతూహల పడుతున్నారు కదూ? అప్పుడు ఈ కథ చదవండి: ఇద్దరు కుర్రాళ్ళు తేలికయిన కొయ్యతో చేసిన బంతిని ఇటూ అటూ విసురుతూ, పట్టు కుంటూ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు.

అలా ఓసారి ఒక కుర్రాడు విసిరిన బంతి గ్రామంచివర ఉన్న చిన్న కొండకు అవతల పోయిపడింది. బంతి కోసం ఆ కుర్రాళ్ళు కొండను ఎక్కవలసి వచ్చింది. కొండమీదికి చేరిన కుర్రాళ్ళు, చుట్టుపక్కల కలయ చూశారు. కొండకు ఆవలి వైపున రకరకాల పుష్ప ఫలవృక్షాలుగల అందమైన లోయ కనిపించింది. ఆ చెట్ల మధ్య బుల్లిబుల్లి సాధు జంతువులు కొన్ని హాయిగా దాగుడు మూతలు ఆడుకుంటున్నాయి.
 
కుర్రాళ్ళిద్దరూ అపరిచితమైన ఆ లోయలోకి దిగి బంతి కోసం వెతకసాగారు. కాని దాన్ని కనుగొనలేక పోయూరు. చేతికి అందే ఎత్తులో వున్న మధుర ఫలాలను కోసి తింటూ, బంతిని వెతుక్కుంటూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళారు. తమ గ్రామం నుంచి చాలా దూరం వచ్చామన్న సంగతి వాళ్ళు గ్రహించలేక పోయూరు. సాయంకాలమై, సూర్యుడు అస్తమించాడు. వెన్నెల వెలుగులో లోయ అందాలను తిలకిస్తూండగా, అంతవరకు గుహలో ఉన్న అతి పెద్ద భయంకరమైన ఎలుగుబంటు ఒకటి వెలుపలికి వచ్చింది.
 
ఆ కుర్రాళ్ళను చూసి ఎలుగుబంటు అమితానందం చెందింది. ఎందుకూ? వెన్నెలలో ఆడుకోవడానికి ఇద్దరు ఆటగాళ్ళు దొరికారనా? కాదు, కాదు. రుచికరమైన ఆహారం దొరికిందని! అది తమ మీదికి ఉరకడానికి ఆయత్తమవు తోందని కుర్రాళ్ళు గ్రహించారు. ‘‘ఒక్క నిమిషం ఆగు ఎలుగుబంటు దొరా! ఎందుకంత తొందర? మమ్మల్ని మా చివరి ప్రార్థనను చేసుకోనివ్వు!'' అన్నారు కుర్రాళ్ళు.
 
ఎదురైన అపాయమే వారిలో అమితధైర్యాన్ని పురికొల్పింది. ‘‘ప్రార్థనా? అది మీకెలా ఉపయోగపడగలదు? మీరు నా నుంచి తప్పించుకువెళ్ళి దాక్కోడానికి చోటు లేదు. నాతో పోరాడడానికి మీ వద్ద ఆయుధాలు లేవు. మిమ్మల్ని వచ్చి రక్షించడానికి చుట్టుపక్కల ఒక్కరూ లేరు.

1 comment:

  1. ENDUKU BAGOLEDANTE IDHI COMPLETEGAA LEDHU. STORY SAGAM VARAKE UNDHI.PLZ PUBLISH COMPLETE STORY....

    ReplyDelete