Pages

Saturday, September 15, 2012

వీరనారి ఝాన్సీరాణి


పరాయి పాలకుల అణచివేతపై తిరుగుబాటు జరిపి మాతృభూమిస్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించడానికిసైతం వెనుకాడకుండా భారతవీరులు పోరాటం ప్రారంభించిన కాలఘట్టం అది. వ్యాపారం కోసమని వచ్చిన ఆంగ్లేయులు తమ ఈస్‌‌ట ఇండియూ కంపెనీ ద్వారా దేశాన్ని వశపరచుకోవడం ప్రారంభించారు. అది 1857వ సంవత్సరం.
 
 అంతవరకు లోలోపల రగులుతూన్న తిరుగుబాటు జ్వాల ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయింది. దురాక్రమణదారులు స్థానిక సంస్థానాలను ఏదో ఒక నెపం మీద ఆక్రమించుకోసాగారు. అలా వాళ్ళు ఝాన్సీ మీద దాడిని ప్రారంభించారు. అప్పుడు ఝాన్సీ కోట బురుజులపై నుంచి ఒక కంఠస్వరం ఉరుములా ఉరిమింది: ‘‘ఝాన్సీని వదులుకోవడమా? అసంభవం! ఎన్నటికీ సాధ్యపడదు. దమ్ములున్న వాడు ప్రయత్నించనీ!'' అలాంటి దృఢనిర్ణయంతో గర్జించింది ఏ రాజో కాదు.
 
పట్టుమని ఇరవైయేళ్ళు కూడా నిండని ఝాన్సీరాణి లక్ష్మీబాయి! 1830 ప్రాంతంలో మోరాపంత్‌ టాంబే, భాగీరథీబాయిలకు జన్మించిన ఆమెకు మణికర్ణిక అని నామకరణం చేశారు. పసిప్రాయం నుంచి ఆమె చదువు సంధ్యలలో, ఆటపాటలలో విలక్షణమైన ప్రతిభను కనబరచింది. ఏడేళ్ళ ప్రాయంలోనే గురప్రుస్వారీ నేర్చుకున్న ఆమె కత్తిసాము, విలువిద్య మొదలైన యుద్ధ విద్యలలో ఆరితేరింది.
 
మగపిల్లలకు మించిన సామర్థ్యాన్ని కనబరచేది. బాల్యంలో తండ్రి చెప్పినపురాణ కథలనూ, వీరగాథలనూ విని వీరుల లక్షణాలను, ఉదాత్త గుణగణాలను హృదయంలో పదిలపరచుకున్నది.

ఆమె వివాహం జరిపించారు. ఆ విధంగా మణికర్ణిక ఝాన్సీరాణి లక్ష్మీబాయి అయింది. ఆమెకో మగసంతానం కలిగింది కాని, దురదృష్టవశాత్తు వెంటనే మరణించింది. విషాదగ్రస్తులైన రాజదంపతులు ఒక మగబిడ్డను దత్తత చేసుకుని అతనికి దామోదరరావు అని పేరు పెట్టారు. మరికొన్నాళ్ళకే రాజా మరణించడంతో లక్ష్మీబాయి పద్ధెనిమిదవ యేటనే వితంతువు అయింది. అయినా ఏమాత్రం జంకకుండా సంస్థాన పాలనా బాధ్యతలు చేపట్టి దక్షతతో నిర్వర్తించసాగింది.
 
తమరాణిని ప్రజలు దేవతలా భావించి గౌరవించేవారు. భారతీయ సంప్రదాయం ప్రకారం దత్తపుత్రుడు కూడా కన్న బిడ్డకు సమానుడే. అయితే, గవర్నర్‌ జనరల్‌ లార్‌‌డ డల్హౌసీ విచిత్రమైన నిబంధనలు విధించాడు. వారసులు లేని సంస్థానాన్ని కంపెనీ తమ రాజ్యంలో కలుపుకుంటుందని చెప్పాడు. అందుకు రాణి అంగీకరించకుండా ఎదురుతిరగడంతో ఝాన్సీని జయించడానికి సైన్యాన్ని పంపాడు. ధైర్యవంతులైన సైనికులతో కోట రక్షణకు రాణి తగిన చర్యలు తీసుకుని ఇరవై నాలుగు గంటలూ పర్యవేక్షించసాగింది.
 
తల్లిలాంటి తమ రాణి కోసం, పవిత్రమైన స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు త్యాగం చేయడానికి వీరులు సంసిద్ధులయ్యూరు. ప్రతిబురుజు వద్ద, ద్వారం సమీపంలో తుపాకులతో సైనికులను నిలిపి కోటకు బలమైన రక్షణా ఏర్పాట్లు చేసి స్వయంగా పర్యవేక్షిస్తూ సైనికులలో మరింత స్ఫూర్తిని కలుగ జేసింది. తెల్లటి దుస్తులు ధరించి, తెల్లటి గుర్రం మీద స్వయంగా సేనకు నాయకత్వం వహించింది. గుర్రం పగ్గాలను నోటితో పట్టుకుని రెండు చేతులతో ఖడ్గాలు తిప్పి శత్రుసేనల తలలను తెగనరికింది.
 
ఆఖరికి శత్రు సేనలు హడలిపోయి వెనుదిరిగి పారిపోయూయి. కొన్ని నెలలు ప్రశాంతంగా గడిచాయి. ఓటమిని భరించలేని బ్రిటిష్‌ పాలకులు అప్పటి శక్తివంతుడైన సేనానాయకుడు సర్‌ హగ్‌ రోజ్‌ సాయూన్ని కోరారు. 1858లో బ్రిటిష్‌ సైనికులు ఝాన్సీని ముట్టడించారు. వారి వద్ద శక్తివంతమైన తుపాకులు, ఫిరంగులు ఉన్నాయి. వాటితో పాటు టెలిస్కోపుల ద్వారా దూరం నుంచే చూడగల అదనపు సౌకర్యం ఉన్నది.

అయినప్పటికీ బ్రిటిష్‌ సేనల మీద మెరుపుదాడులు జరిపి, గెలుపు ఓటముల నీడలో కొన్నాళ్ళ పాటు బ్రిటిష్‌ సేనలను కోటలోకి జొరబడనీయకుండా అడ్డుకున్నది రాణి. ఈ సంఘటన గురించి హగ్‌ రోజ్‌ ఆ తరవాత ఇలా రాశాడు: ‘‘ధైర్యసాహసాలకు, తెలివితేటలకు, పట్టుదలకు రాణి ప్రశంసించ తగ్గ వ్యక్తి. ఆమె తన అనుచరుల పట్ల చూపిన దయ ఎల్లలు లేనిది. వీటితో పాటు ఆమె సేనలు కలిసి ఆమెను చాలా ప్రమాదకరమైన తిరుగుబాటు నాయకురాలిగా చేశాయి.'' బ్రిటిష్‌ వాళ్ళు ఆమెను అసమానమైన ధైర్యశాలిగా పరిగణించారు.
 
అయినా, తమ కన్నా శక్తివంతులైన దురాక్రమణదారులను ఆమె ఎన్నాళ్ళని ఎదుర్కొనగలుగుతుంది? ఆమె సైనిక బలం, ఆయుధాలు వేగంగా తరిగిపోసాగాయి. అయితే కోట ఉపరితలంలో నిలబడి ఉండగా దూరంలో కనిపించిన దృశ్యం ఆమెకు సంతోషం కలిగించింది. ఝాన్సీ కేసి పెద్ద సైన్యం వస్తున్నది. మరాఠా వీరుడు తాంతియూ తోపే ఆ సేనలకు నాయకత్వం వహించి నడిపిస్తున్నాడు.
 
నగ రాన్ని ముట్టడి నుంచి కాపాడాలన్న రాణిగారి విజ్ఞప్తిని అందుకుని ఆ స్వాతంత్య్రవీరుడు సాయపడడానికి సేనలతో వస్తున్నాడు. ఆయన బ్రిటిష్‌ సేనలపై వెనుకనుంచి దాడి చేశాడు. ముందు దీటైన రాణి, వెనక ఇరవై రెండు వేల సైన్యంతో మరాఠాపులి! శత్రుసేనలు దిక్కు తోచక తల్లఢిల్లి పోయూయి. హడలిపోయి ఉద్రిక్తతకు లోనైన బ్రిటిష్‌ సేనలు కోట కేసి దూసుకుపోయూయి. ఈ విపత్కర సమయంలో కోట రక్షకుడొకడు లంచానికి ఆశపడి ద్రోహం తలపెట్టాడు.
 
శత్రువులకు ఒక కోట ద్వారాన్ని తెరిచాడు. హగ్‌ సేనలు కోటలోకి చొచ్చుకు పోయూయి. వారు పిల్లలు, వృద్ధులు, స్ర్తీలు అన్న విచక్షణ చూపకుండా అక్కడున్న అందరినీ హతమార్చారు. సర్వాన్ని దోచుకున్నారు. క్రూరులైన శత్రువుల దురాగతాలకు లోను కాకుండా వందలాది మంది స్ర్తీలు అక్కడున్న లోతైన బావుల్లోకి దూకేశారు. నగరం అగ్నికి ఆహుతయ్యింది. ఆకాశం హాహాకారాలతో ప్రతిధ్వనించింది. ఆ దృశ్యాలను చూసిన రాణి కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయూయి.
 
గొంతు మూగ బోయింది. ఒకటి శత్రువులకు లొంగి పోవడం; రెండు తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడడం. లేదా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి సేనలను సమకూర్చుకుని శత్రువులతో యుద్ధం చేయడం. ఆమె ముందు ఈ మూడు ప్రత్యామ్నాయూలే కనిపించాయి. రాణి మూడవ ప్రత్యామ్నాయూన్ని ఎన్నుకుని అక్కడి నుంచి బయట పడాలని నిర్ణయించింది.


అది వెన్నెల రాత్రి. రాణి తప్పించుకో కుండా కోట చుట్టూ శత్రు సైనికుల కాపలా పకట్బందీగా ఉన్నది. భవనాన్ని ఆనుకుని ఎక్కడో కింద రాణిగారి గుర్రం నిలబడివుంది. రాణి చంటిబిడ్డను వీపుకు కట్టుకుని, తాడుసాయంతో మరో కంటికి తెలియకుండా జారివచ్చి గుర్రం వీపుపై కూర్చున్నది. ఎవరికీ తెలియని ద్వారం గుండా వెలుపలికి వచ్చింది. వెలుపల విశ్వాసపాత్రులైన స్ర్తీపురుషులు ఆమెతో చేరారు.
 
అందరూ ఏమాత్రం అదురూ బెదురూ లేకుండా, రాణిగారి ఆజ్ఞానుసారం, ఎవరికీ అనుమానం రాకుండా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ముందుకు నడిచారు. ‘‘ఎవరు మీరు?'' అని అడిగారు కొందరు బ్రిటిష్‌ సైనికులు. ‘‘ఓర్ఛా నుంచి వస్తూన్న మీ మిత్రులం. మీకు సాయంగా వస్తున్నాం,'' అన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు మరీ విచార రహితంగా, మామూలుగా ఉండడంతో, పురుషవేషంలో వెళుతూన్న రాణికి అంగరక్షకులుగా వెళుతున్నారని శత్రువులు అనుమానించలేక పోయూరు.
 
అదే సమయంలో రాణి దళనాయకుడు మరోవైపు నాలుగు వందల మంది సైనికులతో పోరాటం కొనసాగిస్తూ వచ్చాడు. తెల్లవారేసరికి అందరూ హతులయ్యూరు. రాణి కోట నుంచి తప్పించుకున్నదన్న విషయం తెలియడంతో ఆగ్రహోదగ్రుడైన హగ్‌ రోజ్‌, ఆమెను తరిమి పట్టుకోమని జనరల్‌ డౌకర్‌ను ఆజ్ఞాపించాడు. రాణి సేనలకూ బ్రిటిష్‌ సేనలకూ మధ్య భీకరసంగ్రామం జరిగింది. హఠాత్తుగా కత్తి దెబ్బతో డౌకర్‌ను కింద పడగొట్టి రాణీ లక్ష్మీబాయి అక్కడి నుంచి తప్పించుకున్నది.
 
రాయిరప్పలు, బండలు నిండిన మార్గం గుండా వీపుపై శిశువును కట్టుకుని గుర్రం మీద దాదాపు వందమైళ్ళు ప్రయూణం చేసి కల్పీ చేరుకున్నది. గమ్యం చేరగానే గుర్రం నేలకు ఒరిగి ప్రాణాలు విడిచింది. హగ్‌ రోజ్‌ కల్పీకి సేనలను నడిపించి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని వశపరచుకున్నాడు గాని, రాణి జాడ కనుగొన లేకపోయూడు.

రాణి గ్వాలియర్‌కు చేరింది. ఆంగ్లేయుల అనుచరుడైన అక్కడి పాలకుడు కోటను వదిలి పారిపోయూడు. రాజ్య ప్రజలు ఆనందోత్సాహాలతో రాణికీ, ఆమెతో పాటు దేశభక్తులైన తాంతియూతోపే, రావుసాహెబ్‌ పీష్వాలకూ మద్దతు తెలియజేశారు. సైన్యాన్ని సమీకరించడం జరిగింది. సర్‌ హగ్‌ రోజ్‌ నాయకత్వంలో దాడి చేసిన బ్రిటిష్‌ సేనలను రాణి దీటుగా ఎదుర్కొన్నది. కాని క్రమేణా ఆమె పక్షంలోని సైనికులు తరిగిపోసాగారు.
 
వారిని ఉత్సాహపరుస్తూ, తనే స్వయంగా యుద్ధ రంగంలోకి ఉరికి పోరాడసాగింది. అయినా హగ్‌ రోజ్‌ ఒంటెల సైన్యాన్ని తట్టుకోవడం కష్టమనిపించింది. క్రమంగా బ్రిటిష్‌ సేనలు అన్ని వైపుల నుంచీ తనను చుట్టుముట్టడం ఆమె గ్రహించింది. ఇరవై మంది సైనికులతో, ఇద్దరు పరిచారికలతో శత్రుసైనికుల వలయూన్ని ఛేదించుకుని ఆవలికి వెళ్ళాలి. అంతలో కీచుమనే ఏడుపు వినిపించింది. వెనక్కు తిరిగి చూస్తే తన పరిచారికను ఒక బ్రిటిష్‌ సైనికుడు కాల్చినట్టు తెలిసింది.
 
ఆగ్రహించిన రాణి ఒక్క కత్తివేటుతో ఆ బ్రిటిష్‌ సైనికుడి తలను తెగనరికి గుర్రంపై ముందుకు వెళ్ళింది. దారిలో ఆమె ఒక చిన్న నదిని దాటవలసివచ్చింది. అయితే, ఎంత అదిలించినప్పటికీ గుర్రం నదిలో దిగలేదు. అంతలో శత్రుసైనికులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె ఒక్క ఖడ్గం అనేక ఖడ్గాలను వీరోచితంగా ఎదుర్కొన్నది. చాలా మందిని హతమార్చింది. మరెందరినో క్షతగాత్రుల్ని చేసి, గాయపడి నేలకొరిగింది. పురుష వేషంలోని రాణిని ఆమె దళనాయకుడని పొరబడ్డ సైనికులు ఆమెను అక్కడే వదిలి తమ శిబిరాలకు తిరిగి వెళ్ళారు.
 
విశ్వాసపాత్రులైన రాణిగారి అనుచరులు కొందరు ఆమెను దాపులనున్న గుడిసెలోకి మోసుకు వెళ్ళారు. తను మరణించిన వెంటనే భౌతికకాయూన్ని శత్రువుల కంటబడకుండా కాల్చివేయమని అనుచరులకు సూచనలిచ్చి, ఆమె తుదిశ్వాస విడిచింది. స్వాతంత్య్రం కోసం సాటిలేని ధైర్యసాహసాలతో పోరాడి జాతికి స్ఫూర్తినిచ్చిన వీరనారీ శిరోమణి ఝాన్సీలక్ష్మీబాయి మరణించినప్పుడు ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే!

No comments:

Post a Comment