Pages

Saturday, September 15, 2012

కన్నీటి విలువ


అది ఒక వసంతకాల ఉదయం. ఎక్కడ చూసినా విరబూసిన పసుపు, పచ్చ, ఎరుపు, నీలం, ఊదా అంటూ రంగురంగుల పువ్వులు. పక్షుల కిలకిలారావాలు. సెలయేళ్ళు కూడా పాడుతున్నాయి. ఎటు తిరిగినా ఆనందం తాండవిస్తున్నది. రాజభవనంలోని మహారాణి మధురిమాదేవి అప్పుడే నిద్రలేచింది. గవాక్షం నుంచి వెలుపలికి చూసింది. రాజోద్యానంలోని రంగురంగుల పువ్వులు ఆమెకు కనులవిందు చేశాయి.
 
వీనుల విందుగా కోయిలపాట, పక్షుల కిలకిలారావాలు వినిపించాయి. ఆమె హృదయం ఆనందంతో ఉప్పొంగింది. అప్పుడే అక్కడికి వచ్చిన మహారాజుతో, ‘‘ఈ రోజు మనం వనవిహారానికి వెళ్ళి అక్కడ వసంతోత్సవం జరుపుకుందామా?'' అన్నది రాణి మధురిమాదేవి ఉత్సాహంగా. రాజు మందహాసం చేసి, ‘‘నువ్వు చెలికత్తెలతో కలిసి వెళ్ళు. నేను సాయంకాలానికి వచ్చి కలుసుకుంటాను,'' అన్నాడు.
 
రాణి చెలికత్తెలతో కలిసి సమీపంలోని అడవిని చేరుకున్నది. అక్కడి సెలయేటిలో స్నానమాడింది. పువ్వులు కోసి మాలలు కట్టింది. సుమధుర ఫలాలను అందుకుని తిన్నది. చెలికత్తెలతో కలిసి సీతాకోక చిలుకలను పట్టుకోవడానికి పరుగులుతీస్తూ, పక్షులతో కలిసి పాడుతూ రోజంతా సమయం గడవడం తెలియకుండా సంతోషంగా గడిపింది.

సాయంకాలమయింది. సూర్యాస్తమయంతో పక్షులన్నీ గూళ్ళకు చేరాయి. మెల్లమెల్లగా ఆకాశంలో తారలు మిలమిలా మెరవసాగాయి. అయితే, వస్తానని మాట ఇచ్చిన రాజు మాత్రం రాలేదు. చెప్పిన మాట మరిచి పోయూడా అని రాణి అనుమాన పడింది. ఆమె చెలికత్తెలతో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చింది. వచ్చీరాగానే రాజుకు అడవిలో చూసిన విశేషాల గురించి చెప్పాలని రాణి ఉబలాటపడింది.
 
కాని రాజు అక్కడ లేడు. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడిచిపోతున్నా రాజు జాడకనిపించలేదు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. రాజభవనం సమీపంలోని రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి. భవనంలో ఎలాంటి శబ్దమూ లేకుండా ప్రశాంతగంభీరంగా ఉన్నది. అప్పటికీ రాజు రాకపోయేసరికి రాణి అసహనం ఆగ్రహంగా మారసాగింది. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చిన రాజును చూసి, ��ఇంత ఆలస్యానికి కారణం ఏమిటి ప్రభూ?�� అని అడిగింది రాణి.
 
��ప్రజల బాధలు, రాణీ!�� అన్నాడు రాజు. ��బాధలా?�� అంటూ ఆశ్చర్యపోయింది రాణి. ��అవును. సమస్యలను పరిష్కరించి వాళ్ళ బాధలు పోగొట్టడం, రాజుగా నా బాధ్యత కదా?�� అన్నాడు రాజు. ��అందమైన రోజును, బాధలు వింటూ వృధా చేశారా?�� అంటూ గాఢంగా నిట్టూర్చింది రాణి. రాజు మరేమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
 
మరునాడూ, ఆ మరుసటి రోజూ అలాగే జరిగింది. రాణి రోజంతా వనంలో గడిపినప్పటికీ రాజు అటుకేసి రాలేదు. దాంతో రాణికి అమితమైన ఆగ్రహం కలిగింది. సహనంకోల్పోయి, ��నీ రాజ్యంలో ఎందుకిన్ని బాధలు? వనాంతరాలలోని ప్రశాంతత ఇక్కడ మచ్చుకైనా కానరాదు.
ఎక్కడ చూసినా ఏడుపులు, పడబొబ్బలు! నాకిది భరించ శక్యం కాలేదు. నేను సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అందరూ నవ్వుతూ కనిపించాలి,�� అన్నది రాజుతో. ��అది సాధ్యం కాదు మధురిమా! మనం ఎంత ప్రయత్నించినా, జీవితం అన్నాక కష్టాలు తప్పవు. వెలుగు చీకట్లు, సుఖదుఃఖాలు, నవ్వులు ఏడుపులు-పడుగూ పేకల్లా కలగలిసిపోయి ఉంటాయి.
 
మనుషులన్నాక రెండింటినీ ఎదుర్కోవాలి, ఒకదానిని పూర్తిగా బహిష్కరించడం సాధ్యం కాదు,�� అన్నాడు రాజు. ��ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు ప్రభూ! మీరు ఈ రాజ్యానికి రాజు. కన్నీళ్ళు కార్చేవాళ్ళను రాజ్యం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించండి. ఆ తరవాత ఏడ్చే వాళ్ళంటూ ఒక్కరూ ఉండరు!�� అన్నది రాణి. ఆ మాటకు దిగ్భ్రాంతి చెందిన రాజు, ��రాజ్యానికి రాణివైన నువ్వు ప్రజలకు తల్లిలాంటి దానివి.
 
నీ మనసులో ఇలాంటి కఠోరమైన, అసంబద్ధమైన కోరిక ఎలా కలిగింది?�� అని అడిగాడు. ��ఇది నా కోరిక. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యూలి. అంతే!�� అన్నది రాణి నిష్కర్షగా. ��చేస్తాను కాని, నీ నిర్ణయూనికి నువ్వు త్వరలో పశ్చాత్తాప పడగలవు. ఆలోచించుకో!�� అని హెచ్చరించాడు రాజు. ఆ మాటకు రాణి హేళనగా నవ్వి, అద్దంవైపు తిరిగి తన అందచందాలు చూసుకోసాగింది.
 
రాజుగారి చాటింపు విని ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. తమ కన్నీళ్ళను సైతం దోచుకునే కఠినాత్ములెవరో తెలియక సతమతమయ్యూరు? బాధలలో, కష్టనష్టాలలో, విషాదాలలో కన్నీరు కార్చకుండా ఎలా నవ్వగలరు? సంతోషాన్ని బలవంతంగా పుట్టించగలరా? మరు రోజునుంచే కన్నీళ్ళు కార్చడంతో రాజ్యబహిష్కారానికి గురయ్యేవారి సంఖ్య పెరగసాగింది! రుతువుల కాలచక్రం తిరగడంతో సంవత్సరం గడిచిపోయి మళ్ళీ వసంతం వచ్చింది.
 
అరణ్యాలు నూతన శోభను సంతరించుకున్నాయి. కోయిలలు పాడసాగాయి. అయితే వాటన్నిటినీ చూసి ఆనందించే స్థితిలో రాణి లేదు. ఎందుకంటే ఆమె ఒక్కగొనొక్క బిడ్డకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆవేదనతో రాణిగారి గుండె బరువెక్కింది. ఆస్థానవైద్యులే కాక రాజ్యం నలుమూలల నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేక ఒకనాడు వేకువ జామున యువరాజు శాశ్వతంగా కన్ను మూశాడు. రాణి మధురివ……ూదేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.


ఇక తన జీవితంలో నవ్వు అన్నదే లేకుండా పోతుందేమో అన్న పరిస్థితి ఏర్పడింది. మరునాడు రాజు రాణిని సభకు పిలిపించి, ��నీ ఆజ్ఞను నువ్వే అతిక్రమించావు. రాజ్య బహిష్కరణ శిక్షను నువ్వు అనుభవించాలి!�� అన్నాడు. ఆ మాటకు రాణి నివ్వెరపోయింది. ��రాణినే బహిష్కరిస్తారా?�� అన్నది ఆవేశంతో. ��నీ ఆజ్ఞానుసారం చట్టం చేశాను. చట్టం ముందు అందరూ సమానులే.
 
రాజ కుటుంబానికి సైతం అందులో మినహాయింపు ఉండదు,�� అన్నాడు రాజు గంభీరంగా. అప్పటికప్పుడే రాణి అడవికి వెళ్ళక తప్పలేదు. ఏ వన్యమృగాలకు ఆహారం కావలసివస్తుందో కదా అని మౌనంగా విలపిస్తూ అడవి చేరిన ఆమెకు అక్కడ మనుషుల కంఠస్వరాలు వినిపించాయి. రాజ్యంనుంచి బహిష్కరించబడ్డ అభాగ్యులందరూ అక్కడే ఉన్నారు. వారు రాణిగారికి స్వాగతం పలికారు.
 
ఆమె పుత్రశోకంలో పాలుపంచుకున్నారు. ఓదార్చారు. ఆమెకని ప్రత్యేకంగా ఒక కుటీరం నిర్మించి ఇచ్చారు. ఆమెను తమలో ఒకరిగా భావించి ఆమె అవసరాలన్నీ సమకూర్చసాగారు. రోజులు గడిచేకొద్దీ అడవిలోని ప్రజలు రాణి పట్ల గౌరవంతో పాటు ప్రేమను పెంచుకున్నారు. తమ కష్ట సుఖాలను ఆమెతో చెప్పుకోసాగారు. రాణి కూడా తన పాతవైభవాన్నంతా మరిచిపోయింది.
 
ఆమెలోని అధికార దర్పం, అహంకారం మటుమాయమయ్యూయి. ప్రజలతో కలిసి పనిపాటులు చేయసాగింది. తనకు నూతన జీవితాన్ని ప్రసాదించిన అక్కడివారి పట్ల కృతజ్ఞత పెంచుకున్నది. ఆఖరికి ప్రజల బాగోగులు చూసుకునే నిజమైన రాణిగా తల్లి మనసును సంతరించుకున్నది. ఒకనాటి ఉదయం వేళ రాజు బంగారు రథంలో వచ్చి అక్కడ దిగాడు. చుట్టుపక్కల కలయచూస్తే-రాణి ఆరోగ్యం బాగాలేని బిడ్డను ఆప్యాయంగా తడుతూ కనిపించింది.
 
బిడ్డ రాణి చేతులను పట్టుకుని ఉన్నది. ఆమె కళ్ళనిండా నీళ్ళు. రాజును చూడగానే ఆమె తలవంచి నమస్కరించింది. ��మధురిమా! కన్నీటివిలువ ఇప్పుడు తెలిసి వచ్చింది కదా?�� అని అడిగాడు రాజు మృదువుగా. ��తెలుసుకున్నాను, ప్రభూ!�� అన్నది రాణి వినయంగా. ��మరి ఇంకేం. బహిష్కరించబడ్డ ప్రజలం దరితో పాటు, నువ్వూ వెంటనే రాజధానికి బయలు దేరవచ్చు కదా!�� అన్నాడు రాజు గంభీరంగా.

No comments:

Post a Comment