Pages

Tuesday, September 11, 2012

రాజుగారి బావమరిది


ఒకానొకప్పుడు మహాసేనుడనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యూడు. మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై, అతని నిర్ణయూలనుబట్టి పరిపాలించసాగారు. సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు. పైగా, ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు; అందుకొరకు అనేక ప్రణాళికలు వేసి, సామ్రాజ్య మంతటా అమలు జరిపించేవాడు.
అందుచేత మహాసేనుడి సామ్రాజ్యంలో అన్ని దేశాలూ సుభిక్షంగా ఉండేవి. ఒక్క కోసలదేశం మటుకు ఈ విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది. తన ప్రణాళికలు అన్ని ప్రాంతాలామంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఒక్క కోసలలో అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో మహాసేనుడికి అంతుబట్ట లేదు. ఈ విషయమై ఎంత సమాచారం సేకరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
చక్రవర్తికి రాజపురోహితుడుండేవాడు. ఆయనకు దగ్గిర బంధువు గుణనిధి అనే అమాయకుడు ఒకడు ఉండేవాడు. గుణనిధి సంభాషణ అందరికీ నవ్వు పుట్టించేదిగా ఉండేది. మహాసేన చక్రవర్తి కూడా తన మనసుకు విశ్రాంతి కావలసినప్పుడు గుణనిధిని పిలిపించి, అతన్ని వాగించి, అతని అమాయిక సంభాషణ విని ఆనందించేవాడు. గుణనిధికి దైవభక్తి హెచ్చు. భారత దేశంలో ఉండే అందరు దేవుళ్ళ దర్శనమూ చేసుకుని, పుణ్యం సంపాదించాలని అతని ఆశ.
కోసల దేశంలో ఊరికొక దేవత ఉన్నదనీ, గుడి లేని గ్రామం లేదనీ, చివరకు కీకారణ్య ప్రాంతాలలో కూడా అతి ప్రాచీన పవిత్ర దేవాలయూలు ఉన్నాయనీ విని గుణనిధి ఆ దేశంలో యూత్రలు చేయూలని బయలుదేరాడు. గుణనిధి ప్రయూణం సుఖంగానూ, శీఘ్రంగానూ సాగగలందులకు రాజపురోహితుడు అతనికి ఒక రథాన్నీ, సారథినీ ఏర్పాటు చేశాడు.

కోసల సరిహద్దులో ప్రవేశిస్తూనే గుణనిధి రామపురి అనే గ్రామం చేరాడు. అక్కడ ఈశ్వరుడు నటరాజు రూపంలో వెలిశాడుట. ప్రజలు నటరాజుకు ఒక అందమైన దేవాలయం నిర్మించారు. గుణనిధి ఆ ఆలయూన్ని చూడగానే పులకించి, మందిరం లోపల దేవుని మూర్తిని చూసి పరవశించిపోయి, ‘‘హరహర మహాదేవా!'' అంటూ గట్టిగా అరిచాడు. మరుక్షణమే ఇద్దరు భటులు ఎక్కడి నుంచో ఊడిపడి, ఆయనను పట్టుకున్నారు.
గుణనిధి ఆశ్చర్యపోయి, ‘‘ఇదేమిటి?'' అని అడిగాడు. ‘‘గర్భగుడిలో శబ్దం చెయ్యటం నేరం. గ్రామాధికారి దగ్గిరికి వెళదాం పద,'' అన్నారు భటులు. తనకు ఆ సంగతి తెలియదనీ, మొదటి తప్పుగా ఎంచి వదలి పెట్టమనీ గుణనిధి ఎంతో వేడుకున్నాడు. కాని భటులు అతడి మాటలేవీ వినిపించుకోక, గ్రామాధికారి వద్దకు రమ్మని తొందర పెట్టారు. విధిలేక, గుణనిధి వాళ్ళ వెంట పోవటానికి సిద్ధపడ్డాడు.
దేవాలయంలోనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక యువకుడు నెమ్మదిగా గుణనిధిని సమీపించి, ‘‘ఎందుకయ్యూ, వీళ్ళతో గొడవ? ఇద్దరికీ చెరొక రూకా పారేస్తే, నీకే బాధా ఉండదు,'' అని రహస్యంగా చెవిలో చెప్పి పక్కకు తప్పుకున్నాడు. వెంటనే గుణనిధి ఆ భటులకు చెరి ఒక వెండి రూకా ఇచ్చుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయూరు. తరవాత గుణనిధి ఆ యువకుడికి తన కృతజ్ఞత చెప్పుకుని, ‘‘గర్భగుడిలో దేవుడి పేరు ఉచ్చరించటం నేర మెలా అయిందీ?'' అని అడిగాడు.
ఆ యువకుడు నవ్వి, ‘‘ఈ దేశంలో ఇది తప్పూ, ఇది ఒవ్పూ అని నియమం ఏమీ లేదు. ఎప్పుడు ఏది నేరం అవుతుందో, ఈ ఊరి వాళ్ళం మాకే తెలియదు. మాకు తెలిసినది ఏమిటంటే, రాజభటులు మా మీద నేరం ఆరోపించి పట్టుకున్నప్పుడు వాళ్ళకు లంచం ఇచ్చి వదిలంచుకోవటం. గ్రామాధికారి దాకా పోతే, అతడికి ఇంకా పెద్ద లంచం ఇచ్చుకోవలిసి వస్తుంది,'' అన్నాడు. గుణనిధి తెల్లబోయి, ‘‘గ్రామాధికారి కూడా లంచం పుచ్చుకుంటాడా? అలాటప్పుడు మీ రాజుగారికి ఫిర్యాదు చేసుకోవచ్చునే?'' అన్నాడు.


‘‘ఏమి ఫిర్యాదు చేస్తాం? ఆయన రాజుగారి బావమరిది!'' అన్నాడు ఆ యువకుడు. గుణనిధి తాను రాజరోహితుడి బంధువునని చెప్పిన మీదట ఆ యువకుడు, ‘‘మీరు ఈ సంగతి గ్రామాధికారికి చెప్పుకుంటే, ఇక మీదట మీకు ఏ ఇబ్బందీ ఉండదు,'' అని చెప్పాడు. గుణనిధి అలాగే చేశాడు. అతనికి ఆ
గ్రామంలో మరి ఎలాటి ఇబ్బందీ కలగలేదు. అంతా సుఖంగా జరిగిపోయింది. మిగతా గ్రామాలలో కూడా అతను అలాగే చేసి తన తీర్థయూత్రలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాడు.
అయితే తాను చూసిన ప్రతి గ్రామంలోనూ, రామపురిలో లాగే, రాజభటులు ప్రజలను అయిన దానికీ, కాని దానికీ భయపెట్టుతూ ఉండటమూ, లంచాలు పుచ్చుకుంటూ ఉండటమూ, అందులో కొంత భాగం తమ పైఅధికారులకు వాటా పెట్టుతూ ఉండటమూ కనబడింది. ఆ అధికారుల మీద ఫిర్యాదు చెయ్యటమంటే ప్రజలకు భయం.
ఎందుకంటే, వాళ్ళు అందరూ రాజుగారి బావమరదులే! ప్రతి ఊళ్ళోనూ జనం, ‘‘మా గ్రామాధికారి రాజుగారి బావమరిది అయిపోయూడు! మేమేం చెయ్యగలం?'' అనటం గుణనిధి విన్నాడు. గుణనిధి తీర్థయూత్రలు ముగించుకుని వచ్చినట్టు తెలిసి, మహాసేనుడు అతన్ని పిలిపించి, యూత్రావిశేషాలు అడిగాడు. గుణనిధి చూసిన విశేషాలన్నీ చెప్పి, ‘‘రసికత్వంలో ఆ కృష్ణుడి తరవాత ఈ కోసలరాజునే చెప్పుకోవాలి. ఆయనకు ఎంతమంది బావమరుదులు ఉన్నారో చెప్పలేం!'' అన్నాడు.
మహాసేనుడు నవ్వు ఆపుకుంటూ, ‘‘లెక్క పెట్టలేకపోయూరా?'' అన్నాడు. ‘‘ఎలా లెక్కపెట్టేది, ప్రభూ? ప్రతి గ్రామాధికారీ రాజుగారి బావమరిదే. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవారంతా రాజుగారి బావమరుదులే,'' అన్నాడు గుణనిధి. ఈసారి మహాసేనుడికి నవ్వు రాలేదు. ఆయన గుణనిధిని ప్రశ్నించి, అతను తనకు చెప్పిన మాట కోసలప్రజల నోట విన్నదేనని స్పష్టం చేసుకున్నాడు.
ఆయనకు ఇందులో ఏదో రహస్యం ఉంటుందని తోచింది. మహాసేనుడికి తెలిసినంత వరకు కోసలరాజుకు ఇద్దరే భార్యలు. వారిలో ఒకతె మహాసేనుడి సొంత చెల్లెలు. మరి, కోసలరాజు వ్యవహారాలన్నీ అతని బావమరుదులు ఎలా నిర్వహిస్తు న్నారు? కోసలరాజు రెండో భార్యకు ఇన్ని వేలమంది సోదరులుండటం అసంభవం.


గుణనిధిని పంపేసి, మహాసేనుడు ఆలోచనలో పడ్డాడు. తాను తయూరు చేసిన ప్రణాళికలు చాలా యోగ్యమయినవి అని సంతోషించాడేగాని, వాటిని అమలు జరిపే యోగ్యులను గురించి తాను ఆలోచించలేదు. తన ప్రణాళికలు ఒక్క కోసలలో మాత్రమే సత్ఫలితాలు ఇవ్వకపోవటానికి అధికారులలో ఏదో లోపం ఉండటమే కావచ్చునని ఇప్పుడాయనకు తోచింది. వెంటనే నమ్మకస్థులైన ఇద్దరు చారులను ఆయన కోసలదేశానికి పంపాడు. వాళ్ళు చక్రవర్తికి కావలసిన సమాచారం సేకరించారు.
గుణనిధి చెప్పినట్టుగానే, కోసలరాజ్యంలో ప్రజాపీడన విచ్చల విడిగా సాగుతున్నది. అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకు కారణం అధికారుల నియూమకం అర్హతలను బట్టి జరగకపోవటం. ఉదాహరణకు, కోసల రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న శూరసింహుడు అనేవాడు ఎన్నడూ కత్తిపట్టి ఎరగడు. అతని పరాక్రమమంతా అతని పేరులో మాత్రమే ఉన్నది.
అతను రాజుగారి బావమరిది! అందుకే కోసలదేశంలో అర్హతలేకుండా, ఇతర కారణాల వల్ల అధికారి అయిన ప్రతి ఒక్కడికీ ‘రాజుగారి బావమరిది' అన్న మాట వాడుకలోకి వచ్చింది. ఇదంతా విన్న మహాసేనుడికి కనువిప్పు కలిగింది. కోసలరాజు తనకు బావమరిది కావటం చేతనే కదా ఇంతకాలమూ కోసలదేశంలో తన ప్రణాళికలు విఫలం కావటానికి సరి అయిన కారణం విచారించక, కోసలరాజు చెప్పిన సాకులు నమ్మి ఊరుకున్నాడు?
ఇలాటి గుడ్డి నమ్మకం ప్రజలకు ఎంత హాని చేస్తున్నదో ఇప్పుడు స్పష్టమయింది. మహాసేనుడు తగిన చర్యలు తీసుకుని, కోసలలో అనర్హులైన అధికారుల నందరినీ పదవుల నుంచి తొలిగించేశాడు. కొద్ది సంవత్సరాల్లో కోసలదేశం సుభిక్షమయింది. తరవాత ఆయన ఆ దేశంలో సంచారం చేసినప్పుడు గ్రామాలలో ప్రజలు, ‘‘మా గ్రామాధికారి రాజుగారి బావమరిది కాడు లెండి! అందుకే అందరమూ చల్లగా ఉన్నాం,'' అన్నారు.

No comments:

Post a Comment