Pages

Tuesday, September 11, 2012

స్వయంకృషి విలువ


ఒక గ్రామంలో రామశర్మా, బంగారయ్యూ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ పేదవారే. ఒక రోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకుని, ధనం సంపాదించడానికి, తమ గ్రామం నుంచి బయలుదేరారు. చాలాదూరం ప్రయూణం చేసి అలసిపోయి, వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలబడ్డారు. ముని వారి సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు:
 
‘‘నాయనలారా, నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను. మీలో ఒకడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు; జ్ఞానం సంపాదించి, దాన్ని పదిమందికీ పంచి ఇచ్చి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణజన్మ సార్థకమవుతుంది. రెండవవాడు వైశ్యుడు. కాబట్టి, అతను వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకుని ధన సంపాదన చేయవచ్చు. వ్యాపారం ధనం సంపాదించటానికి మాత్రమేగాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించినవాడే అసలైన వైశ్యుడు.''
 
ముని సలహాప్రకారం స్నేహితులిద్దరూ మూడు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. ఈ జ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థానపండితుడు అయ్యూడు. బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. నాలుగైదు సంత్సరాలు గడిచీ గడవక ముందే ఇద్దరూ సంపన్నులయ్యూరు. కాలం గడిచింది.
 
రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు. కాని ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగపట్టుకున్నది. వాడు చాలా పెంకెవాడు. వాడికి చదువు మీద ఏమాత్రమూ ఉత్సాహం లేదు. అస్తమానమూ ఆటలతోనూ, అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు. తన కొడుకు తనంతవాడు కావటానికి రామశర్మ చేసిన రకరకాల ప్రయత్నాలు కొంచెం కూడా ఫలించలేదు. ఇంతలో ఒక వింత జరిగింది.

రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు. అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటంచేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు. చెప్పినదే చెప్పి నోరు నొప్పిపుట్టి, రామశర్మ కాస్సేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు. తండ్రి శిష్యులకు పాఠం చెప్పటానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళగానే అతను వచ్చి, తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చుని, తానే పాఠం చెప్పటం మొదలు పెట్టాడు.
 
చిత్రమేమిటంటే, రామశర్మ నోట వింటే అర్థంకాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటూంటే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమయ్యూయి. లోపలినుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయూడు. తన కొడుకు తెలివి తక్కువవాడు కాడు. వాడి జ్ఞాపకశక్తి కూడా గొప్పది. చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుంది. రామశర్మ ఈమాటే అంటే, కృష్ణశర్మ, ‘‘ఎందుకు చదువుకోవాలి?'' అని అడిగాడు.
 
‘‘పదిమంది చేతా గౌరవం పొందాలన్నా, ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం. ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది,'' అన్నాడు రామశర్మ. ‘‘మహాపండితుడి కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు. బ్రాహ్మణ్ణి గనక పూజిస్తారు. ధనవంతుడి కొడుకును, ఇంక సంపాదించే దేమిటి?'' అని కృష్ణశర్మ అడిగాడు. కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమయింది. దాన్ని మార్చటానికి ఏం చెయ్యూలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా, ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు.
 
ఇద్దరూ కలుకుసుని మాట్లాడుకోవటంలో, బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్టు బయట పడింది. బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులాయివాడుగా తయూరై, తండ్రి తనను దారిలో పెట్టటానికి ప్రయత్నించినప్పుడల్లా, ‘‘ధనవంతుడి కొడుకును! నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి?'' అంటున్నాడు. మిత్రులిద్దరూ కూర్చొని ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం బంగారయ్య, తన కొడుకును రామశర్మ ఇంట వదిలి, తాను భార్యతోసహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయూడు.
వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుక్కు సేవలు చెయ్యటానికి ఇద్దరు సేవకులను పెట్టి వెళ్ళాడు. కృష్ణశర్మకూ, వరాలయ్యకూ మంచి స్నేహం అయింది. ఇద్దరూ ఒకేరకం మనుషులు, వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలుచేస్తూ ఉండేవాళ్లు. రెండు నెలలు గడిచాయి. రామశర్మ ఒకరోజు వరాలయ్యను పిలిచి, ‘‘మీనాన్న డబ్బు కావాలని కబురుచేశాడు. మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు,'' అన్నాడు. వరాలయ్య పట్టించుకోలేదు.
 
మరో నెల గడిచింది. ఒక రోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి, ‘‘బంగారయ్యగారి ఓడ మునిగింది. దానితోపాటు బంగారయ్యూ, భార్యా, వారి సంపాదన యూవత్తూ మునిగిపోయూయి. నేను ఆయనను కొసప్రాణంతో ఒడ్డుకు తెచ్చి, మాయింటికి చేర్చాను. కాని ఆయన బతకలేదు,'' అని చెప్పాడు. ఈమాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు.
 
కాని ఆయన ఒక్క విషయం వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు. ‘‘నేను మీ తండ్రిలాగా వ్యాపారస్థుణ్ణి కాను. నిన్ను పోషించటం నాకు సాధ్యం కాదు. అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలిసిందే.'' వరాలయ్యకు పౌరుషం వచ్చి, రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయూడు. కాని అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు. తిండి కూడా ఎవరూ పెట్టకపోవటం చేత, వరాలయ్య అభిమానం చంపుకుని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి, భోజనం పెట్టమన్నాడు.
 
రామశర్మ అతనికి భోజనం పెట్టాడు, కాని ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు. ఈమాట విని కృష్ణశర్మకు కోపంవచ్చి, ‘‘స్నేహితుడి కొడుకును కష్టసమయంలో ఆ మాత్రం ఆదరించలేరా?'' అన్నాడు. ‘‘బంగారయ్య నాస్నేహితుడు. అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి. వరాలయ్యకూ, నాకూ సంబంధం లేదు,'' అన్నాడు రామశర్మ.
 
‘‘వరాలయ్య మీ కేమీ కాకపోవచ్చు. అతను నా మిత్రుడు. నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లభించదా?'' అని కృష్ణశర్మ అడిగాడు. ‘‘ఏమిటి నీ గొప్పతనం?'' అన్నాడు రామశర్మ నిరసనగా. ‘‘దేవుడికి అర్చనచేసినందువల్ల పూజారిని దేవుడంత వాడుగా గౌరవిస్తాం గద.

మహాపండి తుడు రామశర్మ కుమారుణ్ణి, అది నాకు గొప్పతనం కాదా?'' అని కృష్ణశర్మ అడిగాడు. రామశర్మ ఒక్కనిమిషం ఆలోచించి, ‘‘నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. కాని ముందుగా నువ్వొక పని చెయ్యూలి. నీకూ, వరాలయ్యకూ సేవలు చేసిన ఇద్దరు సేవకులనూ పిలిచి, వాళ్ళ చేత వరాలయ్యకు రెండు రోజులపాటు సేవలు చేయించు,'' అన్నాడు. కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు.
 
వాళ్ళు ఇదివరలో ఒక్క పైసా అడగకుండా సమస్తసేవలూ చేసినవాళ్ళు, కాని ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి, అటువంటి దరిద్రుడికి సేవలు చెయ్యమని చెప్పేశారు. వాళ్ళ సమాధానానికి ఆశ్చర్యపోయి, కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగినది చెప్పాడు. రామశర్మ నవ్వి, ‘‘వాళ్ళు సరిగానే చెప్పారు. వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు. అతను డబ్బు నీడలో ఉన్నంతకాలమూ, తండ్రి డబ్బు అతనికి రక్ష అయింది.
 
ఆ డబ్బుపోగానే అతను సామాన్యుడయ్యూడు. రేపు నీ గతీ అంతే అవుతుంది. నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు. నా ఆస్తి ఆ పాండిత్యమే. అది నీకు సంక్రమించక పోతే నీ పనీ అంతే గదా! స్వయంకృషి వల్ల ఆర్జించినదే శాశ్వతం. వ్యాపారరహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాడు. విద్యలేని వాడు బ్రాహ్మణుడు కాడు,'' అన్నాడు. ‘‘స్వయంకృషి అవసరమే. అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి
 
చేయలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఏం చెయ్యూలి?'' అని కృష్ణశర్మ అడిగాడు. ‘‘నువ్వూ, నీ స్నేహితుడూ నేను చెప్పిన చోటికి వెళ్ళి, కొన్ని ఏళ్ళపాటు విద్యాభ్యాసం చెయ్యండి,'' అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు. కృష్ణశర్మా, వరాలయ్యూ రెండు సంపత్సరాలపాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు. వరాలయ్య తండ్రి జీవించి ఉండడమే గాక, తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు. తమను మార్చటానికి రామశర్మా, బంగారయ్యూ కలిసి పన్నిన పన్నాగమే ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు.

No comments:

Post a Comment