Pages

Saturday, September 8, 2012

మరుగుజ్జు పిశాచం


అరణ్య మధ్యంలో ఆశ్రమం నిర్మించుకుని శిష్యులకు శిక్షణనిస్తూన్న అలోకానంద యోగి శత వృద్ధుడు. ఆయన తన తదనంతరం ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను ధీరానందుడనే ప్రధాన శిష్యుడికి అప్పగించాడు. ఒకనాటి రాత్రి బాగా పొద్దు పోయాక, ధీరానందుడు గురువుగారి పాదాల వద్ద కూర్చున్నాడు. అప్పుడు యోగి శిష్యుడితో, ‘‘ఆశ్రమంలోని పవిత్ర వస్తువులన్నిటినీ జాగ్రత్తగా పరిరక్షంచుకో. అవి ఎంతో కష్టపడి సాధించినవి. మీకు మేలు కలిగిస్తాయి. అయితే, వాయవ్యమూలలో ఉన్న పెట్టెలో, విచిత్ర ఆకారంతో ఒకశిల కనిపిస్తుంది. దాన్ని తీసుకుపోయి శాంతిమంత్రం పఠిస్తూ నదీజలాలలో పారవెయ్యి!'' అన్నాడు. ‘‘ఆ శిల ప్రత్యేకత ఏమిటి గురుదేవా?''
 
అని అడిగాడు ధీరానందుడు వినయంగా.
 
‘‘చెబుతాను, నా…యనా. దానిని నాకొక తాంత్రిక మిత్రుడు ఇచ్చాడు. ఆ శిల లోపల ఒక మరుగుజ్జు పిశాచం ఉంది. ఆ రాయిని ఎవరైనా నేలకేసి కొడితే, పిశాచం వెలుపలికి వచ్చి, ‘ఏం చే…యాలో ఆనతి…య్యండి,' అంటుంది. నిజానికి ఉపయోగకరమైన పనులేవీ దానికి చేతకాదు. చిన్న చిన్న వస్తువులు తెప్పించడం, వింతవింత ధ్వనులు పుట్టించడం, లాంటి చిల్లర మల్లర పనులు చేసి, చూసేవారిని అబ్బురపరుస్తుంది. అంతే! అసలు సమస్య ఏమిటంటే, అది వెలుపలికి వచ్చాక ఒక్క క్షణం ఊరుకోదు. అలాంటి పనులే చెప్పమని …యజమానిని వేధిస్తుంది. అందువల్ల ముందుగానే ఆ శిలను నదీ జలాలలో విసిరి వేస్తే పిశాచం శాంతిస్తుంది. అలా కాకుండా మరుగుజ్జు పిశాచం గనక ఒకసారి వెలుపలికి వచ్చిందంటే, వెలుపలికి తెప్పించిన మనిషిని ఓ పట్టాన వదిలి పెట్టకుండా పనులు పురమా యించమని వేధించి, వేధించి ఐదేళ్ళ తరవాత అదృశ్యమై పోతుంది,''

ఇది జరిగిన మరునాడే గురువు పరమపదించాడు. రెండు రోజులు గడిచాక ధీరానందుడు గురువు చెప్పిన శిల కోసం, ఆ…యన చెప్పిన కొ…య్యపెట్టెను తెరిచి చూశాడు. అందులో శిల ఏదీ కనిపించలేదు.
 
ఇంకో రెండు రోజులు గడిచాయి. అర్ధరాత్రి సమయం ఎవరో తలుపు తట్టే చప్పుడు విని ధీరానందుడు లేచి వెళ్ళి, తలుపు తెరిచాడు. ఎదురుగా గురువుగారి పాత శిష్యుడు చంద్రశేఖరుడు కనిపించాడు.
 
‘‘ఏమిటి సంగతి? ఎందుకలా దిగులు పడి ఉన్నావు?'' అని అడిగాడు ధీరానందుడు.
 
‘‘ఏం చెప్పమంటావు మిత్రమా? మరుగుజ్జు పిశాచం పెట్టే బాధలు భరించలేక చస్తున్నాను,'' అన్నాడు చంద్రశేఖరుడు.
 
‘‘పిశాచం పెట్టే బాధ? కాస్త వివరంగా చెప్పు,'' అని అడిగాడు ధీరానందుడు.
 
‘‘గురువుగారు మరణించడానికి ముందు విచిత్రమైన శిల గురించి నీతో అన్న మాటలు చాటు నుంచి విన్నాను. అంతే, నా ఆశను అదుపు చేయలేక పోయాను. దాన్ని దొంగిలించి తీసుకుపోయి నేలకేసి కొట్టాను. వెంటనే మరుగుజ్జు పిశాచం ప్రత్యక్షమయింది. పైగా, అది నాకు మాత్రమే కనిపిస్తున్నది. సంబర పడిపోయాను. ‘ఏం చె…య్యాలో ఆజ్ఞాపించు,' అన్నది. నేను గ్రామం రచ్చబండ వద్దకు వెళ్ళాను. అక్కడ పలువురు గుమిగూడి ఉన్నారు. వాళ్ళకు అద్భుతం చేసి చూపుతానన్నాను. వాళ్ళు వింతగా నాకేసి చూశారు. నేను పిశాచంతో దాపుల నున్న పొదకు నిప్పంటించమన్నాను. మరుక్షణమే పొద భగ్గుమన్నది. వెంటనే దానిని ఆర్పమన్నాను. పిశాచం అలాగే చేసింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కాని ఆనందించలేదు. నేను నిరుత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాను. నా వెంటనే వచ్చిన పిశాచం, ‘ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు,' అన్నది. నాతోటలోని మొక్కలకు నీళ్ళు పోయమన్నాను. మరుక్షణమే చెట్లన్నిటినీ పీకి, నీళ్ళు పోసింది. దిగ్భ్రాంతి చెందాను. దాన్ని తిట్టాను. అదేం పట్టించుకున్నట్టు లేదు. ‘ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు,' అన్నది మళ్ళీ. ‘నాకొక బంగారు ఉంగరం తెచ్చిపెట్టు,' అన్నాను. ఆ క్షణమే నాచేతిలోకి ఒక ఉంగరం వచ్చింది. అయితే, నా చెల్లెలి వేలి ఉంగరం మామయింది. అంటే పిశాచం ఆమె చేతిలోంచి లాగి, నాకు ఇచ్చిందన్న మాట!'' అని ఏకరువు పెట్టాడు చంద్రశేఖరుడు.
 
‘‘దాన్ని నీ పొలానికి వెళ్ళి దున్నమని ఎందుకు చెప్పకపోయావు?'' అని అడిగాడు ధీరానందుడు.
 
‘‘నా పెరటిలోని మొక్కలకు చేసినట్లే అది ఏ అఘాయిత్యానికి ఒడిగడుతుందో అని భ…యపడ్డాను. ఇంకా ఐదేళ్ళ పాటు జనానికి పనికిరాని అద్భుతాలు ఎలా చూపుతూ కూర్చోమంటావు? వాటిని ఎవరు పట్టించుకుంటారు? ఈ రెండు రోజుల్లోనే నాకు పిచ్చిపట్టేటట్టున్నది.

అర్ధరాత్రి సమయంలో ఒక గంట సేపు మాత్రమే అది విశ్రాంతి తీసుకుంటుంది. ఆ తరవాత రెట్టించిన ఉత్సాహంతో నన్ను వేధించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది గనక, ఇలా రాగలిగాను.
 
దయచేసి దాన్ని వదిలించుకునే మార్గం చెప్పు. నీకు పుణ్యముంటుంది,'' అన్నాడు దీనంగా కళ్ళనీళ్ళ పర్యంతమైపోతూ. ధీరానందుడు నెమ్మదిగా ఆలోచించి చంద్రశేఖరుడికి ఏదో చెప్పాడు. అంతలో అక్కడికి వచ్చిన పిశాచం కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తూ, ‘‘ఏం పని చే…యాలో ఆజ్ఞాపించు,'' అన్నది.
 
‘‘నువ్వు చే…వలసిన పని సిద్ధంగా వుంది,'' అంటూ చంద్రశేఖరుడు వెలుపలికి వచ్చాడు. పిల్ల పిశాచాన్ని వెంట బెట్టుకుని తన పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకుక్క పడుకుని ఉంది.
 
‘‘పిశాచమా! అదిగో మా కుక్కను చూశావుకదా. దాని తోకను చూడు. వంకరగా వుంది. దాన్ని నిటారుగా వుండేట్టు చెయ్యి, చాలు. నీ పని పూర్తికాగానే వచ్చిచెప్పు,'' అంటూ ఇంటి లోపలికి నడిచాడు చంద్రశేఖరుడు.
 
‘‘అదెంతపని. చిటికలో చేస్తాను,'' అంటూ పిశాచం అలాగే ఎగిరి వెళ్ళి కుక్క పక్కన కూర్చుని కుక్క తోకను పట్టి నేరుగా లాగింది. అది వదలగానే తోకమళ్ళీ…యథాస్థానానికి వచ్చి వంకరగా తయారయింది. పిశాచం మళ్ళీ ప్రయత్నించింది. మళ్ళీ మళ్ళీ ప్ర…యత్నించింది. ఎన్ని సార్లు ప్ర…యత్నించినా కుక్క తోక వంకరపోలేదు. కుక్క కొంత సేప…య్యాక లేచి వళ్ళు విదిలించుకుని ఇంటివాకిట్లోకి వచ్చింది. పిశాచం దాని వెనకే నడిచింది, అదృశ్యంగానే అక్కడా తన ప్రయత్నాన్ని కొనసాగించింది.
 
చంద్రశేఖరుడు ఎంతగానో సంతోషించాడు. ఒక సంవత్సరం గడిచింది. అయినా పిశాచం తిరిగి రాలేదు. ఐదేళ్ళయినా కుక్క తోకవంకర అలాగే వుంటుంది గనక పిశాచం తన వద్దకు రాజాలదనీ, అలాగే అది గడువు ముగిశాక అదృశ్యం కావలసిందేనని చంద్రశేఖరుడు గ్రహించాడు.
 
మరునాడు తెల్లవారగానే అతడు ధీరానందుడి వద్దకు వెళ్ళాడు. ‘‘మన గురుదేవులు కొందరు మానవుల మనస్తత్వాన్ని తరచూ కుక్కతోకతో పోల్చేవారు నీకు జ్ఞాపకం ఉందా? ఆ పోలిక ఎంతటి భావగర్భితమో ఇప్పుడు అర్థమయిందనుకుంటాను. కొందరి స్వభావాలను ఎంత ప్రయత్నించినా బాగుపరచలేము. కుక్కతోకలా వంకరగానే ఉంటుంది, అవునా?'' అన్నాడు ధీరానందుడు మెల్లగా నవ్వుతూ.
 
‘‘అవును,'' అంటూ చంద్రశేఖరుడు కూడా ఆయనతో కలిసి నవ్వాడు. ఆశ్రమం నుంచి ఆ శిలను దొంగిలించుకుని వెళ్ళినందుకు క్షమాపణలు చెప్పుకుని అతడు అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి బయలుదేరాడు.

No comments:

Post a Comment