Pages

Saturday, September 8, 2012

నత్కీరుడి చమత్కారం


చింతాపురంలో నత్కీరుడనే మహాపండితుడుండేవాడు. ఆ…ున ఎంతటి క్లిషమైన విష…ూన్నయినా, అరటిపండు వలిచినట్లు చెప్పగలడని పేరు. చమత్కారంగా మాట్లాడడంలో, ఆ…ునకున్న ప్రజ్ఞ గురించి గ్రామస్థులు కథలు కథలుగా చెప్పుకుంటారు. సకలశాస్ర్త పారంగతుడైనా, విన…ుంలోనూ తనకుతనే సాటి అయిన నత్కీరుడంటే గ్రామస్థులందరికీ ఎంతో గౌరవం.
 
ఇలావుండగా, ఆ ఊరుకు కొత్తగా కీర్తికాముకుడనే భాగ్యవంతుడువచ్చాడు. తనకురాని విద్యలేదని ఆ…ునకు మిడిసిపాటు. తన గురించిన పొగడ్తలువివడం, ఆ…ునకు ఎంతో ఇష్టం. అందుకోసం ఆ…ున డబ్బు ఖర్చుచే…ుడానికి కూడా వెనుకాడడు. పట్నంలో తననెవరూ పట్టించుకోవడంలేదని, ఆ…ున తన నివాసం పల్లెటూరికి మార్చాడు. అక్కడే లంకంత ఇల్లూ, వందెకరాల మాగాణీ కొన్నాడు.
 
కీర్తికాముకుడి గురించి తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఆ…ున చుట్టూచేరారు. నిత్యం ఆ…ునను పొగడ్తలతో ముంచెత్తుతూ తమ అవసరాలకు డబ్బు సంపాదించు కోవడం వృత్తిగా చేసుకున్నారు. దాంతో కీర్తికాముకుడికి చింతాపురం విపరీతంగా నచ్చేసింది. అక్కడ ఆ…ునకు రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి.
 
కీర్తికాముకుడి భార్య సునగరి పట్నంలో పుట్టిపెరిగింది. ఆమెకు పల్లెటూరునచ్చలేదు. అటుపైన, భర్త పొగడ్తల కోసం చేస్తున్న వృథాఖర్చులు, ఆమెను మరింతగా కలవర పెట్టాయి. అందుకని ఆమె, పట్నంలోవున్న తన తమ్ముడు శుభాకరుడికి వెంటనే బ…ుల్దేరిరావలసిందిగా కబురుపెట్టింది. ఆ ప్రకారం చింతాపురం వచ్చిన శుభాకరుడు త్వరలోనే అక్కడి పరిస్థితి ఆకళింపు చేసుకున్నాడు. వ…ుసులో తనకంటే పెద్దవాడైన బావగారిని మందలించడం బాగుండ దని, ఆ…ునకు నచ్చచెప్పే ఉపా…ుం కోసం ఎంతగానో ఆలోచించాడు.

చివరకు ఆ…ునను పొగడ్తలతోనే గెలవాలనుకుని, ఒకరోజున ఆ…ునతో, ‘‘బావా! ఏ దేశానికైనా గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామంలో స్థిరపడాలన్న నీ నిర్ణ…ూన్ని నేను మెచ్చుకోకుండావుండలేకపోతున్నాను. ఐతే, వ్యవసా…ుంలోకంటె వ్యాపారంలో అగ్రగణ్యుడివి గాబట్టి, నీవు పట్నానికి తిరిగివెళ్ళి వ్యాపారం కొనసాగించి, మన కుటుంబానికి మంచి లాభాల నార్జించి పెట్టవలసిందిగా, నిన్ను వేడుకుంటున్నాను. నీ ఆశ…ుసాధన కోసం నేను చింతాపురంలో స్థిరపడి వ్యవసా…ుం చేస్తూంటాను,'' అన్నాడు.
 
దీనికి కీర్తికాముకుడు ఏమాత్రము అంగీకరించలేదు. ఆ…ున శుభాకరుడితో, ‘‘ఇక్కడ నాకు అపారమైన గౌరవం లభిస్తున్నది. డబ్బు ఎంత సంపాదించినా, పట్నంలో ఇలాంటి గౌరవం మాత్రం దొరకదు. నాకిక్కడే బాగుంది,'' అని ఖచ్చితంగా చేప్పేశాడు.
 
ఈ సమాధానం శుభాకరుడు ఊహించ లేనిదేమీకాదు. ఆ కారణంగా అతడు ఏ మాత్రమూ తొణకక, ‘‘బావా! గ్రామాల్లో ప్రజలు డబ్బుకు ప్రాముఖ్యాన్నివ్వరు. వారు ప్రతిభకు మాత్రమే పట్టంకడతారు. డబ్బు పుచ్చుకోకుండానే ప్రతిభావంతులైన కవులను, పండితులను, ఇతర కళాకారులను వారు అభిమానించి గౌరవిస్తారు. అలాంటి గౌరవం నత్కీరుడికి ఈఊళ్ళో లభిస్తున్నది. ఇక్కడ నిన్ను పొగిడేవారందరూ, డబ్బుకోసమే పొగుడుతున్నారు!'' అంటూ చురక కూడా వేశాడు.
 
ఈ మాటలు కీర్తికాముకుడిలో పౌరుషాన్నిలేపాయి. అంతవరకూ నత్కీరుడంటే ఆ…ునకూ గౌరవంవుంది. గ్రామస్థుల గౌరవం విష…ుంలో నత్కీరుడు తనకు పోటీదారని తెలి…ుగానే, ‘‘డబ్బుతో ఎక్కడైనా ఏమైనా చే…ువచ్చు. ఆ నత్కీరుడి చేతనే, నావంటివాడు లేడనిపించుకుంటాను, చూడు!'' అంటూ ఆ…ున, శుభాకరుడి వద్ద ప్రతిజ్ఞలాంటిది చేశాడు.
 
తర్వాత ఆ…ున, ‘‘నేను మిమ్మల్ని డబ్బుతో సన్మానించాలనుకుంటున్నాను,'' అని నత్కీరుడికి కబురుపంపాడు.
 
‘‘సన్మానం దేనికి?'' అని నత్కీరుడు బదులు ప్రశ్నపంపాడు.
 
ఇలా జరుగుతుందని ఊహించని కీర్తికాముకుడు, ‘‘సన్మానిస్తానంటే, దేనికని అడిగే ఈ నత్కీరుడు అహంకారి అ…ుుం డాలి లేదా పరమ మూర్ఖుడైనా కావాలి.

ఇలాంటివాడని తెలి…ుక, ఈ గ్రామస్థులు ఆ…ునను గౌరవించి, తమను తాముతక్కువ చేసుకుంటున్నారు. ఈ విష…ుం బ…ుటపెట్టి, ఇక్కడ నా కీర్తి ప్రతిష్ఠలు మరింతగా పెంచుకుంటాను,'' అని తిరస్కారంగా శుభాకరుడితో అన్నాడు.
 
‘‘బావా! అహంకారం, మూర్ఖత్వం నీవి. నీవు ఆ…ునను స్వ…ుంగా కలుసుకో, ఆ…ునను సన్మానించడానికి, నీకున్న అర్హతలునిరూపించుకో,'' అంటూ శుభాకరుడా …ునను మందలించాడు.
 
ఈ విధంగా, కీర్తికాముకుడు నత్కీరుడి ఇంటికి వెళ్ళాడు.
 
ఇంటికి వచ్చిన ఆ…ునను నత్కీరుడు ఎంతో అభిమానంగా ఆదరించి మర్యాదలు జరిపి వచ్చినపని అడిగాడు.
 
‘‘ప్రతిభకు పట్టంకట్టడానికి ప్రతిభేవుండ నవసరంలేదు. ప్రతిభావంతులను గౌరవించే సహృద…ుం నాకున్నది. మీకు సన్మానం చే…ూలని, నాకోరిక. మీరు కాదన కూడదు,'' అంటూ వచ్చిన పని చెప్పాడు కీర్తికాముకుడు.
 
‘‘మీ ఆశ…ుం మెచ్చుకోతగ్గది. అయితే, నాకున్న కాస్త ప్రతిభా పాండిత్యంలో మాత్రమే వున్నది. నన్ను సన్మానించేవారు పండితులైతేనే, నాకు సంతోషం. నా పాండిత్యంలో మీకు నచ్చిన అంశాలు చెప్పండి!'' అన్నాడు నత్కీరుడు ఎంతో విన…ుంగా.
 
కీర్తికాముకుడు, ఈ మాటలకు మనసులో నొచ్చుకున్నా బ…ుటపడకుండా, ‘‘ఆర్యా! కారణం గురించి మీకు మరీ అంత పట్టింపు వుంటే, తమరు నాగురించి నలుగురికి గొప్పగా చెప్పండి. కవులు, పండితులు తమకు సన్మానంచేసిన వారినిపొగిడే సంప్రదా…ుం పూర్వం నుంచీవస్తున్నదేకదా!'' అన్నాడు.
 
‘‘సన్మానంకోసం కాకపోయినా నేను మిమ్మల్ని పొగడ గలను. ఏ అంశం చెప్పి మిమ్మల్ని పొగిడేది? ఏ అంశమూ లేదనుకున్నా, కనీసం నాపొగడ్తవల్ల ఏమైనా ప్రెూజనముండాలి కదా?'' అని అడిగాడు నత్కీరుడు.
 
‘‘పొగడ్తకింతగా ఆలోచించాలా? పట్నంలో వ్యాపారంలో ఎంతగానో రాణిస్తున్న నేను, నా సంపాదనను త్యాగంచేసి పల్లెటూరువచ్చాను. అదే నా గొప్పతనం!'' అన్నాడు కీర్తికాముకుడు.
 
‘‘పొగడ్తలకోసమే ఇక్కడుండాలనుకునేవారివల్ల, ఈ గ్రామానికి ప్రెూజనంవుండదని నా అభిప్రా…ుం. మనిద్దరం ఒకరినొకరు పొగడుకునే ఆలోచన మంచిది కాదు,'' అని నత్కీరుడు నిష్కర్షగా చెప్పి, కీర్తికాముకుణ్ణి పంపేశాడు.

కీర్తికాముకుడికి చాలాకోపం వచ్చింది. అప్పటినుంచీ ఆ…ున నత్కీరుడి మీద దుష్ర్పచారంచేయించసాగాడు. డబ్బుకాశపడి కొందరు గ్రామస్థులు, నత్కీరుడు అహంకారి అనీ, సన్మానం చేస్తానన్న కీర్తికాముకుణ్ణి అవమానించి పంపాడనీ, గ్రామంలో అందరికీ చెప్పసాగారు. ఆ మాటలుకొందరునమ్మారు, కొందరు నమ్మలేదు. నత్కీరుడు మాత్రం ఈ ప్రచారాన్ని బొత్తిగా పట్టించుకోలేదు.
 
అయితే, వారం రోజులుగడిచే సరికి, నత్కీరుడికి చెరువుకుస్నానానికి పోయినప్పుడు మెట్లమీద కాలుజారి పడడంతో, కాలు దెబ్బతిని పదిరోజుల పాటు మంచం మీద వుండవలసివచ్చింది.
 
కీర్తికాముకుడు పరమ సంతోషంతో దీనిని చక్కని అవకాశంగా తీసుకుని, ‘‘ నేను అన్నీ మంచిపనులే చేస్తాను కాబట్టి, నాకు దైవానుగ్రహంవుంది. నా పట్లతప్పుగా ప్రవర్తించినవారిని భగవంతుడు శిక్షస్తూంటాడు. నత్కీరుడి విష…ుంలో ఇప్పుడు జరిగిందదే!'' అంటూ తన అనుచరుల ద్వారా మళ్ళీ ప్రచారంచేయించాడు.
 
దీనికి నత్కీరుడు నొచ్చుకున్నాడు. ఆ…ున గ్రామాధికారిని కలుసుకుని, ‘‘నేను అహంకారినని ప్రచారం జరిగితే పట్టించుకోలేదు. ఎందుకంటే, నా గురించి ఎవరిష్టంవచ్చినట్లు వారనుకోవచ్చు. కానీ నాకు జరిగిన ప్రమాదం భగవంతుడు నా కిచ్చిన శిక్షƒ అంటే మాత్రం నేనొప్పుకోను. నేను తప్పుచేసిందీ లేనిదీ విచారణచేసి నిర్ణయించ వలసిందిగా, మిమ్మల్ని వేడుకుంటున్నాను,'' అన్నాడు.

 నత్కీరుడంటే గౌరవమున్న గ్రామాధికారి వెంటనే, ఈ విష…ుమై విచారణ ప్రారంభించాడు. విచారణ గ్రామదేవత ఆల…ుం ముందు జరుగుతుంది. సాక్ష్యంచెప్పేవాళ్ళు నిజంచెబుతున్నారా, లేదా అన్నది గ్రామదేవత, తన పూజారినోట పలికిస్తుందన్నది గ్రామస్థుల నమ్మకం. అందువల్ల, నత్కీరుడు, కీర్తికాముకుణ్ణి అవమానించాడని అబద్ధంచెప్పడానికి ఒక్కరు కూడా ముందుకురాలేదు.
 
కీర్తికాముకుడు కూడా, ‘‘నాపట్ల తప్పుచేసినవారికి కీడు జరుగుతుందనడానికి, ఇప్పటి వరకూ ఎన్నో నిదర్శనాలున్నాయి. నత్కీరుడికి చెరువుదగ్గర ప్రమాదం జరగడంతో, నా పట్ల తప్పుచేసివుంటాడని నేను నమ్మాను. పాపపుణ్యాలు ఆ భగవంతుడికెరుక!'' అని తప్పించుకోజూశాడు.
 
దానితో గ్రామాధికారి విష…ూన్ని చూచా…ుగా ఆకళింపు చేసుకోగలిగాడు. అందుకని, ఆ…ున కీర్తికాముకుడితో, ‘‘మీ మాటల్లో ఎంతనిజమున్నదీ తెలుసుకునేందుకు కూడా గ్రామదేవత సా…ూన్నికోరవలసివుంటుంది!'' అన్నాడు. అయితే, నత్కీరుడు వెంటనే, ‘‘కీర్తికాముకుడి మాటల్లో నిజమున్నదని, నేనూ నమ్ముతున్నాను.
 
ఆ…ున ఎంతగా అడిగినా, నేను పొగడకపోవడమేకాక, ఆ సంగతి పదిమందికీ చెప్పకపోవడమే, నేను చేసిన తప్పయివుండవచ్చు. అందుకే భగవంతుడు నన్ను శిక్షంచి వుంటాడని, నేనూ నమ్ముతున్నాను! ఇక గ్రామదేవతను అర్థించవలసిన అవసరమేముంది?'' అన్నాడు.
 
ఈ మాటలకు గ్రామాధికారితో సహా అక్కడున్న వారందరూ ఫక్కున నవ్వారు. కీర్తికాముకుడికి చచ్చేటంత అవమానమయింది. ప్రతిభావంతులతో గొడవపెట్టుకోవద్దని బావమరిది చేసిన హెచ్చరిక చెవినిపెట్టనందుకా…ున పశ్చాత్తాపపడి, వ్యవసా…ూన్ని శుభాకరుడికి అప్పచెప్పి, తను తిరిగి పట్నం వెళ్ళిపో…ూడు.
 
అయితే, చింతాపురం గ్రామస్థులు తరచుగా చెప్పుకునే, నత్కీరుడి చమత్కారం గురించిన కథల్లో మాత్రం, ఆ…ున శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నాడు.

No comments:

Post a Comment