Pages

Saturday, September 8, 2012

సంసార బంధం!


పద్మనందుడనే గురువు ఇద్దరు శిష్యులతో కలిసి తీర్థ…యాత్ర చేసి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఒక అందమైన గ్రామాన్ని చూసి, అటు వెళుతూన్న రైతును ఆ గ్రామం పేరేమిటో అడిగాడు. వదనపురం అన్నాడు రైతు. ఆ పేరు వినగానే గురువుకు పాత సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చి, ‘‘వదనపురమా, ఇది సుమేరుడి గ్రామం అయివుంటుందేమో!'' అన్నాడు.
 
‘‘సుమేరుడా? ఎవరా…యన?'' అని అడిగారు శిష్యులు.
 
‘‘యోగశాస్ర్తం అభ్యసించడానికి మన ఆశ్రమంలో చేరిన ఉత్తమ జిజ్ఞాసువు. అయితే, అతని తండ్రి తీవ్ర అనారోగ్యం పాల…య్యాడని తెలి…యడంతో, వెళ్ళి చూసి ఒక నెలలోపల తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇది జరిగి పది సంవత్సరాలయింది. ఇంతవరకు అతని జాడలేదు. ఏమయిందో వెళ్ళి చూద్దామా?'' అన్నాడు గురువు. ‘‘చిత్తం, గురుదేవా,'' అన్నారు శిష్యులు.
 
గురుశిష్యులు ఆ గ్రామంలోకి వెళ్ళారు. ఎదురుపడ్డ గ్రామస్థుణ్ణి ఆపి, ‘‘పది సంవత్సరాల క్రితం, ఈ గ్రామం నుంచి సుమేరుడనే ఒక …యువకుడు పద్మనందుల ఆశ్రమంలో ఉండేవాడు. ఆ…యన గురించి ఏమైనా తెలుసా?'' అని అడిగాడు ఒక శిష్యుడు.
 
‘‘నువ్వు అడుగుతున్నది సుమేరుసేఠ్‌ గురించేనా నాయనా! ఆ…యన పద్మనంద గురువుల ప్రి…యశిష్యుడు. వ్యాధిగ్రస్తుడైన తండ్రిని చూడడానికి వచ్చాడు. అవసాన దశలోవున్న తండ్రి కోరిక ప్రకారం ఆ…యన వెంటనే వివాహం చేసుకోవలసి వచ్చింది. కొడుక్కు తన వడ్డీ వ్యాపారం అప్పగించి తండ్రి సంతోషంగా కన్నుమూశాడు. గురు కృపాకటాక్షం వల్ల సుమేరుడికి వ్యాపారం బాగా కలిసివచ్చింది.

అదిగో కనిపిస్తున్నదే పెద్దమేడ, అదే ఆ…యన ఇల్లు,'' అంటూ ఒక అందమైన భవంతిని చూపాడు గ్రామస్థుడు.
 
గురుశిష్యులు ఆ భవంతిని సమీపించారు. మేడపైనుంచి వారిని చూసిన సుమేరుడు పరుగు పరుగున దిగివచ్చి, గురువు పాదాలకు భక్తితో నమస్కరించి, లోపలికి తీసుకువెళ్ళాడు. ఉచితాసనంలో కూర్చోబెట్టి, కుశల ప్రశ్నల అనంతరం, ‘‘గురుదేవా, తమ రాకతో నా గృహం పావనమయింది. ఇక్కడే కొన్నాళ్ళుండి, తమకు సేవలందించే భాగ్యం కల్పించండి,'' అన్నాడు.
 
‘‘లేదు, ఆశ్రమానికి వెంటనే వెళ్ళాలి. చాలా పనులున్నాయి,'' అన్నాడు గురువు.
 
‘‘అయితే, కనీసం ఈ రాత్రికయినా ఇక్కడే ఉండి, మా ఆతిథ్యం స్వీకరించండి,'' అన్నాడు సుమేరుడు.
 
గురువు అందుకు సమ్మతించాడు. ఆ రాత్రి భోజనాలయిన తర్వాత, సుమేరుడు గురువును ఏకాంతంలో కలుసుకుని, ‘‘గురువర్యా, మరోమార్గం కనిపించక ఈ సంసార బంధంలో చిక్కుకున్నాను. ఇద్దరు పిల్లలూ పెరిగి పెద్దవాళ్ళు కాగానే, వ్యాపార బాధ్యతలను వాళ్ళకు అప్పగించి, ఆశ్రమానికి వచ్చి తమసేవలో శేషజీవితాన్ని గడపాలనుకుంటున్నాను,'' అన్నాడు.
 
‘‘అలాగే నా…యనా. ఆ సమ…యంలో నేను ఆశ్రమంలో లేకపోయినా, నీకు దారి చూపే బాధ్యతను శిష్యులకు చెప్పి వెళతాను. నీకు యోగవిద్యా ఉపదేశం జరిగింది గనక, దానిని మధ్యలో మానివే…యకుండా కొనసాగించడం నీకు మేలు చేస్తుంది,'' అన్నాడు గురువు. తెల్లవారగానే గురుశిష్యులు ఆశ్రమానికి బ…యలుదేరాడు. సుమేరుడు గురువును భక్తితో సాగనంపాడు.
 
మరోపదేళ్ళు గడిచాయి. మళ్ళీ గురువు వదనపురంకేసి వెళ్ళవలసివచ్చి, శిష్యుడు ఎలా ఉన్నాడో చూద్దామని అతని ఇంటికి వెళ్ళాడు. సుమేరుడు మళ్ళీ గురువు పాదాలపై బడి కన్నీరుకారుస్తూ, ‘‘రత్నంలాంటి మనవడు పుట్టాడు. ఒక్క క్షణం వదిలిపెట్టడం లేదు. వాడికి కాస్త ఊహ తెలి…యగానే, నేను ఆశ్రమానికి బ…యలుదేరి వస్తాను,'' అన్నాడు.
 
‘‘చాలా మంచిది నా…యనా,'' అని చెప్పి గురువు అక్కడి నుంచి బ…యలుదేరాడు. మరుసటి సంవత్సరం గురువు కాలధర్మం చెందాడు. అయినా తన అనంతరం ఆశ్రమ బాధ్యతలు చేపట్టనున్న గంగానందుడనే శిష్యుడికి సుమేరుణ్ణి గురించి చెప్పి, ‘‘అతడు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అందుకోవలసినవాడు. సంసార బంధాల నుంచి అతనికి విముక్తి లభించాలి. అతనికి సద్గతి చూపడం మరిచిపోవద్దు,'' అని సూచించాడు.
 
మరికొన్ని సంవత్సరాలు గడిచిపో…యాయి. ఒకనాడు గంగానందుడికి సుమేరుడు ఇప్పుడెలా ఉన్నాడో చూడాలన్న ఉత్సాహం కలిగింది అప్పటికప్పుడే వదనపురానికి బ…యలుదేరాడు.

తీరా అక్కడికి చేరాక సుమేరుడు ఎప్పుడో మరణించాడన్న సంగతి తెలిసింది. సుమేరుడి కుమారులు గంగానందుణ్ణి గౌరవ మర్యాదలతో ఆదరించారు.
 
గంగానందుడు ఆ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి, ఇంట్లోని కుక్క తోక ఆడిస్తూ ఆ…యన చుట్టూ అదేపనిగా తిరగడం, నాలుకతో పాదాలను స్పృశించడం ఆ…యన గమనించాడు. రాత్రి పడుకునే ముందు దాన్ని బలవంతంగా వెలుపలికి తీసుకువెళ్ళవలసి వచ్చింది. అర్ధరాత్రి సమ…యంలో గంగానందుడు ధ్యానంలో కూర్చుని కుక్క ఆత్మతో సంప్రదించడానికి ప్ర…యత్నించాడు. అప్పుడు ఆ…యనకొక ఆసక్తికరమైన విష…యం తెలి…యవచ్చింది. సుమేరుడి ఆత్మ కుక్కలో ప్రవేశించి ఇంటికీ, కొడుకులకూ, మనవలకూ కాపలా కాస్తూ కాపాడుతున్నది!
 
ఐదేళ్ళ తరవాత గంగానందుడు మళ్ళీ ఒకసారి సుమేరుడి ఇంటికివెళ్ళాడు. అప్పటికి కుక్క చచ్చిపోయింది. అయితే, సుమేరుడి ఆత్మకు ఏమయిందా అని ఆలోచించాడు. బలమైన ఆశాపాశాలకు ప్రగాఢంగా లోనైన ఆత్మకు అంత త్వరగా విముక్తి లభించివుండే అవకాశం లేదని భావించాడు. ఆనాటి రాత్రి ధ్యానంలో గంగానందుడికి ఇంకొక విష…యం తెలి…ువచ్చింది. సుమేరుడి కుటుంబ నిధులున్న భోషాణంలో దాగివున్న త్రాచుపాములోనే సుమేరుడి ఆత్మ నివాసం చేస్తున్నది!
 
గంగానందుడు సుమేరుడికి ఈసారి సరైన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. తెల్లవారగానే కుటుంబ సభ్యులతో, వాళ్ళ నిధుల భోషాణంలో సర్పమొకటి దాగి వుందని చెప్పాడు. ఆ మాటవిని భ…యపడి, వాళ్ళు, పాములు పట్టేవాడికి కబురు పెట్టారు. వాడు రాగానే భోషాణంలోకి పొగ పెట్టారు. పాము పొగదెబ్బకు కదలలేక పడివుంది. పాములవాడు దాన్ని పట్టి మెల్లగా బ…యటకు లాగాడు. సేవకుడు ఒకడు బలమైన కరత్రో పామును కొట్టి చంపబో…యాడు. కాని గంగాధరుడు వారించాడు. దాన్ని ఒక కుండలో వేసి పెట్టి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. పాము కొసప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పాము నుంచి సుమేరుడి ఆత్మకు శాశ్వత విముక్తి లభించే విధంగా గంగానందుడు చచ్చిపోతూన్న పాముకు మంత్రాలు వల్లిస్తూ కొన్ని క్రతువులు జరిపాడు.
 
అంతా సవ్యంగా ముగించాక గంగానందుడు తృప్తిగా నిట్టూరుస్తూ, ‘‘సుమేరుడు ఒకప్పుడు నాతో సహాధ్యాయిగా ఎంత వివేకిగా ఉండేవాడు. ఆ తరవాత అజ్ఞానం కొద్దీ లేనిపోని సంసార బంధాలను పెంచుకుని ఎలా పతనమై పో…యాడు! ఎలాగో గురువుగారి ఆజ్ఞను నెరవేర్చాను. అంతే చాలు!'' అనుకున్నాడు.      

No comments:

Post a Comment