Pages

Saturday, September 8, 2012

యువరాజుకు సాయపడిన ఎలుకలు చీమలు!


ఒకానొకప్పుడు ప్రతాప్‌ఘడ్‌ రాజ్యాన్ని మహేంద్ర ప్రతాపుడనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజ లను కన్నబిడ్డల్లా భావించి ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించేవాడు. ఆయన కొడుకు ప్రతాపవర్మ కరుణాహృదయుడూ, మృదుస్వభా వుడూ కావడం వల్ల ప్రజలు యువకుడైన అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. అతడు జంతువుల పట్లకూడా అమితమైన ప్రేమ చూపే వాడు.
 
మంచి విలుకాడే అయినప్పటికీ వేటాడ డానికి వెళ్ళేవాడు కాదు. ఒకనాడు ముగ్గురు పరదేశస్థులు రాజును చూడడానికి వచ్చారు. వారు తమకు మూడు విలక్షణమైన శక్తులు ఉన్నాయని చెప్పారు. వారు చేశామని చెప్పుకున్న సాహసకృత్యాలను గురించి విన్న ప్రతాపవర్మ చాలా ఆశ్చర్య పోయూడు. ఆ ముగ్గురిలో ఒకడు చాలా గొప్ప విలుకాడు. ఎంత దూరంలో ఉన్న దాన్నయినా తాను ఉన్నచోటి నుంచే కొట్టగలడు.
 
రెండవ వాడు వాయువేగంతో పరిగెత్తగలడు. మూడవ వాడు ఎవరూ చూడలేని ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా స్పష్టంగా చూడగలడు. వారి మాటలను వింటూ కొంతసేపు వారితో గడిపిన యువరాజు ప్రతాపవర్మకు వారి వెంట వెళ్ళి కొన్నాళ్ళు దేశాటన చేసిరావాలన్న కోరిక కలిగింది.
 
అందుకు తండ్రి అనుమతిని కోరాడు. తన కుమారుడు రాజ్యాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక రాజు మొదట వద్దన్నాడు. అయితే వచ్చిన ఆ ముగ్గురూ యువ రాజును కంటిని రెప్పలా కాపాడి తీసుకువచ్చి అప్పగించగల మని హామీ ఇచ్చాక, యువరాజు వారి వెంట వెళ్ళడానికి రాజు సమ్మతించాడు. మరునాడు తెల్ల వారగానే యువరాజు కొత్త మిత్రు లతో దేశాటనకు బయలుదేరాడు.

వాళ్ళు కొంతదూరం వెళ్ళాక, ఒక ఎలుక బురద గుంట నుంచి పైకి రాలేక కొట్టుమిట్టాడు తూండడం యువరాజు కంటబడింది. అది పైకి రావాలని పైకెక్కడానికి ప్రయ త్నించినప్పుడల్లా, బురదగా ఉన్న గట్టు జారడం వల్ల మళ్ళీ నీళ్ళల్లో పడిపో సాగింది. యువరాజుకు ఆ ఎలుక మీద జాలి కలిగింది. ఒక బాణాన్ని కొలను లోకి వదిలాడు. దాన్ని పట్టుకుని ఎలుక సునాయూసంగాపైకి ఎక్కి వచ్చింది.
 
ఎలుక కరుణ ఉప్పొంగే యువ రాజు మోమును చూస్తూ, ‘‘నా ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు యువరాజా! నేను ఎలుకల రాజైన చూహా రాజాను. ఈ క్షణం నుంచి నా రాజ్యంలోని ఎలుకƒలన్నీ, పిలిచినప్పుడు వచ్చి మీకు సాయమందించడానికి సిద్ధంగా ఉంటాయి. మా సాయం అవసరమైనప్పుడు మీరు నేలపై పడుకుని నా పేరు చెబితే చాలు. మరుక్షణమే మేమందరం మీ సమక్షంలో ఉంటాం,'' అన్నది.
 
యువరాజు ఎలుక కేసి చూస్తూ మంద హాసం చేసి ముందుకు సాగాడు. నలుగురు మిత్రులూ మరికొంత దూరం వెళ్ళాక, వరు సలు వరుసలుగా వెళుతూన్న చీమల బారును యువరాజు చూశాడు. అప్పుడే పక్క ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్దమనిషి అక్కడ చీమలున్న సంగతి గమనించకుండా బిందెడు నీళ్ళు వాకిట్లో కుమ్మరించాడు. దాంతో కొన్ని చీమలు నీళ్ళల్లో కొట్టుకుపోయూయి.
 
మరి కొన్ని చీమలు నీళ్ళ నుంచి బయట పడడానికి ఎంతగానో ప్రయత్నించసాగాయి. దానిని చూసిన ప్రతాపవర్మ, దాపులనున్న చెట్టు నుంచి పెద్ద పెద్ద ఆకులను కోసి నీళ్ళ మీద వేశాడు. ప్రాణాలతో ఉన్న చీమలు ఆకుల మీదికి చేరాయి. అప్పుడే వీచిన గాలికి ఆకులు కొట్టుకుపోయి పొడిగా ఉన్న నేల మీద పడ్డాయి. పరమానందం చెందిన చీమలు, ‘‘యువరాజా! మీ మేలును ఈ జన్మకు మరిచిపోము.
 
మీకెప్పు డైనా మా అవసరం ఏర్పడితే, మమ్మల్ని తలుచు కుని మూడుసార్లు చప్పట్లు కొడితే చాలు. మరుక్షణమే మేము వచ్చి మా సేవలు అందించ గలం,'' అన్నాయి. మరునాటికల్లా యువరాజు, అతని మిత్రులు చంద్రసేనుడు పరిపాలిస్తున్న చంద్రపుర నగ రాన్ని చేరుకున్నారు. ఆనాటి రాత్రి గడపడానికి ఒక సత్రంలో దిగారు.

అప్పుడు వారికొక విచిత్ర విషయం తెలియవచ్చింది. ఆ రాజ్యాన్ని పాలించే చంద్రసేనుడు పరమక్రూరుడనీ, అందమైన తన కుమార్తె చంద్రమతిని వివాహ మాడడానికి వచ్చే రాకుమారులకు అసాధ్యమైన మూడు పరీక్షలు పెడతాడనీ, అందులో ఓడిపోయిన వారిని ఖైదుచేస్తాడనీ తెలియవచ్చింది. ఇప్పటి వరకు అలా వచ్చిన పలువురు రాకుమారులు ఖైదుపాలయ్యూరు.
 
ఆ సంగతి విన్న యువ రాజు ప్రతాపవర్మ, రాజు వద్ద ఖైదీలుగా ఉన్న రాకుమారులకు తప్పక విముక్తి కలిగించాలని నిర్ణయించాడు. మరునాడు తెల్లవారగానే ప్రతాప వర్మ, చంద్రసేన రాజును దర్శించి, ఆయన కుమార్తెను వివాహ మాడడానికి వచ్చానని చెప్పాడు. ఆ మాట వినగానే రాజు చంద్రసేనుడు కారాగారంలో ఖైదీగా మగ్గడానికి మరొక రాకుమారుడు వచ్చాడన్న ఆనందంతో లోలోపల నవ్వుకున్నాడు. తన కుమార్తెను వివాహ మాడాలంటే మూడు ఘనకార్యాలను సాధించాలని ప్రతాపవర్మకు చెప్పాడు.
 
ప్రతాపవర్మ అందుకు సమ్మతించి తాను సాధించవలసిన మొదటి కార్యం ఏదని అడిగాడు. ‘‘హిమాలయ పర్వత సానువుల మధ్య అంద మైన పసుపురంగు పువ్వులు పూస్తాయి. యువ రాణి తలలో పెట్టుకోడానికి వాటిని నువ్వు కోసుకుని రావాలి. అయితే, ఒక విషయం గుర్తుంచుకో. సూర్యరశ్మి సోకగానే ఆ పువ్వుల రంగు వెలిసిపోతుంది. అందువల్ల తెల్లవారక ముందే నువ్వా పువ్వులను ఇక్కడికి తీసుకు రావాలి,'' అన్నాడు రాజు. ఇది అసాధ్యమైన కార్యం.
 
ఎక్కడో ఉన్న హిమాలయూలకు వెళ్ళి, అక్కడున్న పసుపు రంగు పువ్వులను వెతికి కోసుకుని తెల్లవారక ముందే ఇక్కడికి తీసుకురావడం అన్నది ఎవరికి సాధ్యం? ప్రతాపవర్మ తన మిత్రులను సంప్రదించాడు. సుదూరంలో ఉన్న వస్తువులను చూసే శక్తిగల మిత్రుడు, ఆ పువ్వులు ఉండే చోటును స్పష్టంగా చెప్పాడు. వాయువేగంతో పరిగెత్తగల మిత్రుడు, ‘‘విచారించకు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పువ్వులను తెచ్చి నీకు ఇస్తాను,'' అంటూ వెళ్ళాడు. ఆ తరవాత ప్రతాపవర్మ, మిగిలిన ఇద్దరు మిత్రులు, రాత్రి దిగిన సత్రంలోకే వెళ్ళి బసచేశారు.

అర్ధరాత్రి సమయంలో ఒక మిత్రుడు, ‘‘మన మిత్రుడు హమాలయూలకు వెళ్ళి, పువ్వులను కోసుకుని తిరిగి వస్తున్నాడు,'' అన్నాడు. అనుకున్న ప్రకారం అతడు తెల్లవారేసరికి పువ్వులతో తిరిగివచ్చాడు. ప్రతాపవర్మ పువ్వు లతో రాజును చూడడానికి వెళ్ళాడు. పువ్వులను చూసి రాజు చిన్నగా నవ్వినప్పటికీ, వీడెలా సాధించగలిగాడా అని లోలోపల బాధపడ్డాడు. అయితే, ఆ మాటను అడగలేక ఊరుకున్నాడు.
 
సాధించవలసిన రెండో కార్యం గురించి చెప్పి, తన సేవకుల చేత మూడు బస్తాల సన్నటి ధాన్యాన్ని తెప్పించి కింద పోయించాడు. వాటిలో మట్టినీ గులకరాళ్ళనూ కలిపించాడు. ‘‘తెల్ల వారేసరికి, ఈ మట్టీ, గులకరాళ్ళ నుంచి ధాన్యాన్ని వేరుచేయూలి. ధాన్యం మూడు బస్తాలకు సరి పోవాలి. గింజ తగ్గ కూడదు,'' అన్నాడు. ప్రతాపవర్మ కాస్సేపు తీవ్రంగా ఆలోచించాడు. తను చంద్రపురికి వస్తూ, మార్గ మధ్యంలో కాపాడిన చీమలు అతనికి జ్ఞాపకం వచ్చాయి.
 
వాటిని తలుచుకుంటూ అతడు మూడుసార్లు చప్పట్లు కొట్టాడు. మరుక్షణమే వేనవేల చీమలు అతని పాదాల వద్దకు వచ్చాయి. ఏమి చేయూలో వాటికి వివరించి, ప్రతాపవర్మ సత్రానికి వెళ్ళి పోయూడు. సూర్యోదయమవు తూండగా రాజ భవనానికి వచ్చాడు. ధాన్యం రాశిని చూసి పర మానందం చెందాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన రాజు, సేవకులను పిలిచి, ధాన్యాన్ని బస్తాలకు నింపమన్నాడు. మూడు బస్తాలకు ధాన్యం సరిగ్గా సరిపోయింది.
 
రాజు తన కళ్ళను తనే నమ్మలేక పోయూడు. అయినా ఇది ఎలా సాధ్యమయిందని యువరాజును అడగలేక ఊరుకున్నాడు. ‘‘మంచిది, యువ రాజా! నువ్వు చాలా తెలివైన వాడివిలా కనిపిస్తు న్నావు. ఎంత తెలివిగలవాడివైనా మూడవ కార్యాన్ని సాధించగలవనే నమ్మకం నాకు లేదు.
 
రాజభవన ద్వారానికి వెలుపల ఎండి పోయిన చెట్టు ఒకటి ఉన్నది.

తెల్లవారేసరికి దాన్ని సన్నటి ధూళిగా చేసెయ్యూలి. చెట్టును నరకకూడదన్న విషయం గుర్తుంచుకో,'' అని చెప్పాడు రాజు. ప్రతాపవర్మ భవన ద్వారం దగ్గరకు వెళ్ళి దాపులనున్న ఎండిపోయిన ఎత్తయిన చెట్టును చూశాడు. కొంతసేపు ఆలోచించిన అతడు నేలపై పడుకుని, ‘‘చూహా రాజా! మీ సాయం కావాలి!'' అన్నాడు.

మరుక్షణమే వందలాది ఎలుకలు అక్కడికి వచ్చి, ఎండిపోయిన చెట్టును పదునైన తమ పళ్ళతో కొరికి పిండి చేయడం ప్రారంభించాయి. తెల్లవారి, ప్రతాప వర్మ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, చెట్టు జాడ కనిపించలేదు. దాని స్థానంలో రాసి పోసిన కొయ్యపొట్టు కనిపించింది. ప్రతాపవర్మ రాజ దర్శనం కోసం వెళ్ళాడు. రాజు రాగానే ద్వార పాలకులను పిలిచి చెట్టు ఎలా ఉందో చూసి రమ్మన్నాడు.
 
ఒక ద్వారపాలకుడు వెళ్ళి చూసి వచ్చి, ప్రతాపవర్మ చెబుతున్నది అక్షరాలా నిజం అని చెప్పాడు. ‘‘ప్రతాపవర్మా, నేను చెప్పిన మూడు ఘన కార్యాలనూ నువ్వు సాధించావు. నేనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. రేపే నా కుమార్తెను వివాహ మాడడానికి సిద్ధంగా ఉండు,'' అన్నాడు రాజు చంద్రసేనుడు. ఖైదీలుగా వున్న రాకుమారులందరినీ వెంటనే విడుదల చేయూలని ప్రతాపవర్మ కోరాడు.
 
ఇది చంద్రసేనుడికి ఇష్టం లేదు. ప్రతాపవర్మ ఇలాంటి కోరిక కోరగలడని అతడు ఊహించలేదు. ప్రతాపవర్మ, చంద్రమతుల వివాహం ఘనంగా జరిగింది. ప్రతాపవర్మ భార్య సమేతంగా ముగ్గురు మిత్రులతో కలిసి ప్రతాప్‌ఘడ్‌కు బయలుదేరాడు. ముందు ప్రతాపవర్మ భార్యతో వెళుతూంటే, ముగ్గురు మిత్రులు కూడా గుర్రాల మీద వారిని అనుసరించారు. క్రూరుడైన చంద్రసేనుడు అంతటితో ఊరుకో లేదు.
 
ప్రతాపవర్మ, బందీలైవున్న రాకుమారు లను విడిపించమనడం అతనికి ఆగ్రహం కలిగించింది. అయిష్టంగానే వారిని వదిలి పెట్టాడు. అందువల్ల తన సైనికులు కొందరిని పిలిచి, మార్గ మధ్యంలో ప్రతాపుణ్ణీ, అతని ముగ్గురు మిత్రులనూ బంధించి, తన కుమా ర్తెను వెనక్కు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
 
రాజు కుట్ర తెలుసు కున్న ప్రతాపవర్మ, విలు విద్యలో నేర్పరి అయిన తన మిత్రుడితో కలిసి సైనికు లను ఎదుర్కొన్నాడు. సైని కుల మీద బాణవర్షం కురిపిం చాడు. సైనికులు బెదిరిపోయి చెల్లాచెదరుగా పారిపోయూరు. ప్రతాపవర్మ తన ప్రయూణాన్ని కొనసాగించి ప్రతాప్‌ఘడ్‌ను చేరు కున్నాడు. అందం, అణకువగల రాకుమారిని తమకు కోడలిగా తీసుకువచ్చిన కుమారుణ్ణి చూసి రాజదంపతులు పరమా నందం చెందారు.

No comments:

Post a Comment