1. ప్రజల సుఖమే పాలకులకు సుఖము. ప్రజల హితమే పాలకులకు మంచి.
2. పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రదేశములలో గృహములను నిర్మించాలి. ఆ గ్రామములలో తటాకములు నిర్మించాలి. దీనివలన నీటి కొరత ఉండదు . రెండవ పంటకు కూడా ఈ తటాకాలు ఉపయోగపడతాయి.
3. ఆనకట్టల నిర్మాణం జరపాలి. నీటిని వృధా కానీయరాదు. ప్రతి చుక్కా విలువైనదే.
4. వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించాలి. కాలువలు, చేరువుల ద్వారా వ్యవసాయానికి అనూకూల పరిస్థితులు కల్పించాలి.
5. పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయలి. దీనివలన పశువులకు గ్రాసం లభించి పాడి అభివృద్ధి చెందుతుంది.
6. వ్యాపర మార్గాలు ఏర్పాటు జరపాలి. వాణిజ్య సౌకర్యాలు మెరుగుపడటం వలన దేశ ఆదాయం పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు.
7. విదేశీ వ్యవహారాలలోనూ, దేశ రక్షణలోనూ అప్రమత్తత కలిగిఉండాలి. లేదంటే ఇతరులు చొరబాట్లకు అవకాశం కల్పించినట్లు అవుతుంది.
8. దేశక్షేమం కోరే పాలకులు క్లిష్ట పరిస్థితులలో శత్రువులతో కూడా స్నేహం చేయవలసిన పరిస్థితి ఉంటుంది.
9. దేశానికి ఆదాయాన్ని ఇచ్చేదే అయినా ప్రజలకు నష్టం కలిగించే వాటిని వదిలేయాలి. (కాని నేటి పాలకులు ప్రజలను నాశనం చేసే ఎన్నిటినో దేశంలోకి అనుమతులు మంజూరు చేశారు. చేస్తూనే ఉన్నారు.)
10. ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు పాలకుడు అనుక్షణం ప్రజల యోగక్షేమాలు విచారించి తగిన రక్షణ కల్పించాలి.
11. ధర్మరక్షణకు రాజు కఠినముగా ప్రవర్తించాలి. (నేడు అధర్మ రక్షణ బాగా పెరిగిపోతుంది. కూనీలు, కుట్రలు, చేసినవారికి, గజదొంగలకి, రక్షణగా అనేక చట్టాలు వత్తాసు పలుకుతున్నాయి.)
12. పాలకుడు ప్రజలను ఆకారణముగా దండిస్తే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుంది. (ఈ విషయంలో ప్రజలు ఒకడుగు ముందుకేసి పొతేపోనివ్వండి అనుకుంటూ దిక్కుమాలిన బ్రతుకులు బ్రతికేస్తున్నారు.)
13. పాలకులు ప్రజాగ్రహానికి గురికాకుండా ప్రజాభీష్ట ప్రకారం పరిపాలించాలి. (ప్రజల ఉదాసీనతని అలుసుగా తీసుకుని పాలకులు చేయని ఘోరం లేదు.)
14. విదేశీయులు పరిపాలిస్తే ధనము వారి దేశమునకు తరలించుకుని పోతారు. (ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం అదే చేసింది. నేడు సోనియా పాలనలో(2006 నుండి -2014 వరకు) ఇదే జరుగుతుంది.)
15. మంత్రులు ఉన్నతాదికారులలో విదేశీయులను నియమించరాదు.
16. విదేశీయులు లాభార్జన దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించవచ్చు. (వరల్డ్ బ్యాంక్ మఱియు మల్టినేషనల్ సంస్థలు దేశానికి చేస్తున్న మేలు ఏంటో?
17. విదేశీ పాలకులు తమకు లాభం లేదనుకున్నప్పుడు దేశాన్ని నిర్లక్ష్యం చేసి తమదేశానికి వెళ్లిపోవచ్చు. (బ్రిటీష్ వారు పోతూ పోతూ ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంధాలయం ఆయన తక్షశిలని తగలేబెట్టేశారు. ఇది పూర్తిగా ద్వంశం కావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. దీనిలో ఉన్న ఎన్నో విలువైన గ్రంధాలు కాలి భూడిద అవ్వడం వలన దేశ భవిష్యత్తు, దేశ తలరాత మారిపోయి ప్రజలు దిక్కుతోచని చదువులతో అల్లాడి పోతున్నారు.)
18. వ్యవసాయం చేసే రైతులు, పశు పోషకులు, వ్యాపారస్థులు
కూడా ఆయుధ శిక్షణ పొందాలి. దీనివలన వీరు శత్రువుల నుండి తమనుతాము రక్షించుకోవడమే కాకుండా దేశ రక్షణ సమయంలో సైనికులుగా మారి శత్రువులపై విరుచుకు పడతారు.
19. మానవుడు సంఘంలో ప్రతి ఒక్కరితో మిత్రత్వం సలపాలి.
--------------------------------------------------------------------------
1. ఉన్నత వంశంలో జన్మించడం (గుణం తక్కువ వాడికి పదవి అప్పగిస్తే అటు దేశానికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఋతువులు సక్రమంగా రావు. తద్వారా వాతావరణ వ్యవస్థ దెబ్బతిని దేశం కరువు కాటకాలు పాలౌతుంది.)
2. దైవభక్తి కలిగి ఉండాలి. (దైవభక్తి గలవానికి తను చేసే పనులను భగవంతుడు చూస్తుంటాడు అనే భావంతో చేడుపనులు చేయడానికి దూరంగా ఉంటాడు)
3. మంచి బుద్ధి కలిగిఉండాలి.
4. బలము కలిగి ఉండాలి. తనను తాను రక్షించుకొనడంతో బాటు ఇతరులను రక్షణ కల్పిస్తాడు)
5. ధర్మతత్పరులైన పెద్దలను కలవడం. (పెద్దలను కలవడం వలన వారి అనుభవముల నుండి సలహాలు స్వీకరించి దేశాన్ని సుస్థిరం చేయగలుగుతాడు)
6. సత్యభాషణ.
7. అనవసరపు వాదనలు చేయకుండా ఉండటం. అతిగా మాట్లాడకపోవడం. (ఈ రెండింటి వలన మీలోని లోటుపాట్లు కనిపెట్టి మీతోబాటు వ్యవస్థకి చేటు చేసే అవకాశం ఉంటుంది)
8. పొందిన మేలు మరచిపోకుండా ఉండాలి.
9. పని పని వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి.
10. చేసే పని యందు ఉత్సాహం కనబరచాలి.
11. ఎప్పటికప్పుడు కొత్తవిషయాలను తెలుసుకోవాలి. జాతీయ గంధాలు పరిశీలన చేస్తుండాలి.
12. అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండాలి. పాలకునికి మతిమరపుతో చాలా ప్రమాదం.
13. శౌర్య ప్రతాపాలు. సమయ సందర్భాన్ని బట్టి ఎంతో చాకచక్యంగా ప్రవర్తించాలి.
14. దుర్వ్యసనములు ఉండరాదు. వ్యసనపరుడైన పాలకుడు దేశాన్ని ఏ క్షణంలో నైన ప్రమాదంలో పడేయవచ్చు.
15. దూరదృష్టి కలిగి ఉండాలి. తను చేసే పనులు భావితరాలకు కూడా ఉపయోగపడేలా, మార్గదర్శనం చేసేలా ఉండాలి.
16. విషయజ్ఞానము, శాస్త్రజ్ఞానము కలిగుండాలి. దీనివలన నీతితప్పే అవకాశం ఉండదు.
17. నాలుగు ఆశ్రమాలను, నాలుగు వర్ణములను ఎల్లప్పుడూ పాలకుడు కాపాడుతూ ఉండాలి.
18. సర్వేంద్రియాలు జయించాలి.
19. రహస్యాలను అత్యంత గోప్యంగా ఉంచాలి.
20. పరస్త్రీ సాంగత్యం కూడదు.
21. అనవసరపు హింసను విడనాడాలి.
22. పరద్రవ్యములు అపహరణ చేయకూడదు. (ద్రవ్యం అంటే! ధనం, ధాన్యం, భూమి, గనులు, పెట్రోలియం,లోహాలు, ఖనిజాలు, ప్రజల సంపద)
23. అప్రయోజకులతో స్నేహం కూడదు.
24. విద్యార్ధులు కొత్తవిషయాలు అభ్యసించడానికి, నేర్చుకున్న దానిని మననం చేయడానికి సరిపడా కాలమాన పరిస్థితులు ఏర్పాటు చేసి, ఇతర వ్యవహారముల మీద నుండి దృష్టి మళ్ళించాలి. జాతీయ గ్రంధాలు పఠనం తప్పనిసరి.
25. ధర్మమే పాలకుని రక్షణా కవచం. ధర్మాన్ని రక్షించడమే పాలకుని పని.
26. సుక్షితులైన నాలుగు వర్ణములలో (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రలో ) గల వారిని సైన్యంలో చేర్చవచ్చు.
27. ఋత్విక్కులు, ఆచార్యులు, పురోహితులు, కర్మిష్ఠులైన వారి వద్ద పన్నులు తీసుకొనరాదు. (బ్రాహ్మణులు సమాజ శ్రేయస్సు కోసం క్రతువులు, యాగాలు, లోకశాంతి కోసం తపస్సులు చేస్తూ జీవితం గడుపుతారు. వారికోసం ఇలాంటి దేశకాలమాన అవకాశములు కల్పించాలి. లేనిచో వ్యవస్థ దెబ్బతింటుంది.)
మనకి ఇప్పుడు జరుగుతుంది ఇదె. వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.)వీరికి సరైన పోషణ లేక యజ్ఞయాగాది క్రతువులు అంతరించి కరువుకాటకాలు కలుగుతున్నాయి. ఎండలు మండుతున్నాయి. సరైన సమయంలో వర్షాలు లేవు, అడవులలో చెట్లు నరికేయడం, నక్సలిజం పెరిగి తపస్వికి అడవులలో నెలవు కరువైంది.)
28. పాలకులు కొత్తప్రాంతాన్ని జయించిన తరువాత ఆ ప్రాంత ప్రజల ఆచారాలు, వ్యవహారాలు, వేషభాషలను వీలయితే తాను అనుసరించాలి గాని మార్చడానికి ప్రయత్నించకూడదు.
29. సంఘంలో గృహస్థాశ్రమం అత్యంత విలువైనది. ఈవ్యవస్థని అత్యంత జాగరూకతతో పరిశీలించి తగిన కట్టడి చేయాలి.
30. ఇలాంటి భర్తను వదిలేయవచ్చు. 1. దుష్టుడైన వాడిని(నిత్యం మానసికంగా, శారీరకంగా హింస పెట్టేవాడిని), 2.రాజద్రోహిని, స్వదేశమును విడిచి శాశ్వతంగా విదేశములకు వెళ్ళినవాడు, 3. ప్రాణహాని కలిగించేవాడు, 4. పతితుడు. (శీలవతి, గుణవతి, రూపవతి యైన భార్య చెంత ఉండగా పరస్త్రీ లోలుడు అయినప్పుడు. ఇతర కన్యలను తార్చేవాడిని,) 5. నపుంసకుడు.
31. భార్యాభర్తలు పరస్పర ద్వేషులైనప్పుడు విడాకులు పొందవచ్చు. (రాజు సమక్షంలో విచారించి తగవులు తెలుసుకుని వీలైతే తీర్చాలి. లేదా మార్చాలి. పైన చెప్పిన 5కారణములు వలన భర్త వద్దనుండి విడాకులు పొందవచ్చు. భార్య విషయంలో గయ్యాళిని, సంసారానికి పనికిరాని దానిని, అత్తమామలను వేదించే దానిని, కుటుంబ వ్యవహారాలు పట్టించుకోకుండా బరితెగించి తిరిగేదానిని, పరపురుషుడి సాంగత్యం కోరేదానిని, దేశ-రాజ ద్రోహిని)
32. విధవలు, పరివ్రాజకులుగా లేదా సన్యాసము స్వీకరించి నట్లైతే గూడచారిణిగా నియమించవచ్చు.
33. సన్యసించినవారు తనమీద ఆధారపడిన వారికి మార్గం చూపించిన పిదపే సన్యసించాలి. లేదంటే రాజు అలాంటివారిని శిక్షించాలి.
34. దేవాలయముల ఆస్థులు ఆక్రమించే వారిని, స్వాదీనం చేసుకునేవారిని, ఆలయ ఆస్థులను ద్వంసం చేసేవారిని, ఆలయ సంపద అనుభవించేవారిని కఠినంగా శిక్షించాలి.
35. దండయాత్రలకు ముహూర్తం అనవసరం.
36. శత్రు గూఢాచారులను పసికడుతూ ఉండాలి.
37. అనుమానితులు రాజ్యంలో సంచరిస్తుంటే ప్రజలు బాధ్యత తీసుకుని వారిని పట్టుకుని అధికారులకు అప్పగించాలి.
38. పక్క ఇంటివారికి ఇబ్బందికలిగే విధంగా నూతన గృహ నిర్మాణం జరుపరాదు.
39. అద్దె ఇంటిలో ఉన్నవారు సంవత్సరానికి సరిపడా అద్దె ఒకేసారి చెల్లించాలి.
40. తగిన కారణం లేకుండా అద్దెకు ఉన్నవారిని యజమాని ఖాళీ చేయించరాదు.
41. అద్దెకు ఉన్నవారు మధ్యలో ఖాళీ చేస్తే సంవత్సరంలో మిగిలిన కాలానికి అద్దె చెల్లించి ఖాళీ చేయించాలి.
42. అభయారణ్యంలో ఉండే జింకలను, పక్షులను, మృగములను, మత్స్యములను, బంధించుట, వధించుట, హింసించుట శిక్షర్హము.
43. పాలిచ్చే ఆవులను, ఎద్దులను, దూడలను చంపరాదు.
44. వాసన వచ్చే మాంసమును, స్వయంగా మరణించిన జంతువుల మాంసమును అమ్ముట నేరము.
45. త్రాగడానికి, తినడానికి పనికిరాని ఆహార పదార్దములు ఇతరులకు ఇవ్వరాదు.
46. చనిపోయిన వారి కర్మకాండలు సమయంలో వచ్చిన బంధుమిత్రులకు మద్యం ఇవ్వాలి. (కొన్ని కులములలో మాత్రమే)
47. మద్యాన్ని మద్యకేంద్రములలోనే త్రాగాలి.
48. యజమానులు ఉతకడానికి ఇచ్చిన దుస్తులు చాకలి ధరించకూడదు.
49. బట్టలను ఉతకడానికి కర్రపలక గాని, రాతి పలక గాని వాడాలి.
50. బట్టలు ఉతకడంలో పాడుచేస్తే ఆ చాకలి నష్టపరిహారాన్ని యజమానికి చెల్లించాలి.
51. ఏ ప్రాంతంలో వినోద ప్రధానమైన ప్రదర్శనలు ఉంటాయో ఆ ప్రాంత ప్రజలందరూ తిలకించినందుకు చందాలు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే దానిని నేరంగా పరిగణించాలి. (ప్రజలే కళలను పోషించుకోవాలని చాణక్యుని భావం)
52. కళాకారులకు ప్రభుత్వ ఆదరణ ఉండాలి.
53. మధ్యం తయారీ, వాడకం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి.
54. జూదరంగాన్ని ప్రభుత్వమే నడపాలి.
55. జూదశాలలో మంచి గవ్వలు, పాచికలు మాత్రమే ఉపయోగించాలి.
56. గృహముల ద్వారా వచ్చే పన్నులతో ప్రభుత్వం కోశాదికారం నింపుకోవాలి.
57. కొందరు స్త్రీ బలహీనతలను ఉపయోగించుకుని ప్రముఖుల మధ్య వివాదాలు సృష్టింఛి మిత్రభేదం కల్పించవచ్చు.
58. అవసరమైతే పాలకులు వేశ్యలను ఉపయోగించి ప్రముఖులను సంహరించవచ్చు.
59. గ్రామముల మధ్య సరిహద్దు కచ్చితంగా ఉండాలి.
60. బీడు భూములు సాగుభూములుగా చేసిన వారి నుండి ప్రభుత్వం ఆ భూములను స్వాదీనం చేసుకోరాదు.
61. రాజ్యంలో ఖాళీగా ఉన్న ప్రదేశాలు రాజ్యానికే చెందుతాయి.
62. కొత్త స్థలంలో రైతులు వ్యవసాయం ప్రారంభించినప్పుడు స్థలము చదును చేయుటకు, విత్తనాలు, దున్నుతకు, పశువుల కొనుగోలుకు పాలకులు ద్రవ్యమును అప్పుగా ఇవ్వవలెను. రైతు కూడా ఆ అప్పును సకాలంలో తీర్చవలెను.
63. అలజడులు జరిగే ప్రాంతాల్లోనూ, కరువు ప్రాంతాలలోనూ పన్నులను వసూలు చేయరాదు.
64. తగిన సాక్ష్యాధారాలు చూపిన తరువాతనే ప్రజలు తమ పూర్వికులచే దాచబడిన నిధి నిక్షేపాలు తాము పొందవచ్చు.
65. ప్రజలందరకి ఉపయోగపడే నీటి వసతుల నిర్మాణాలలో అందరూ పాల్గొనాలి.
66. ఆనకట్టలు నిర్మించేవారికి భూమిని, వృక్షములను, పనిముట్లను, రహదారులను నిర్మించి సహాయం చేయాలి.
67. రైతులు భూమి శిస్తులతో బాటుగా నీటి పన్నును కూడా చెల్లించాలి.
68. వ్యవసాయం కోసం పనికిరాని భూములలో పశువుల మేతకోసం పచ్చికబయళ్ళు వృద్ది చేయాలి.
69. వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ధరలను నిర్ణయించాలి.
70. ప్రభుత్వమునకు లాభదాయకమైనా ప్రజలకు నష్టం కలిగించే ధరలను ఎట్టి పరిస్థితులలోనూ విధించరాదు. (ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలేమైనా పర్వాలేదు పాలకులు మాత్రమే బావుండాలి అన్నట్టు తయారుచేశారు.)
71. దిగుమతి చేసే వస్తువులపై పన్నులు విధించాలి
72. ఏ వస్తువు నైనా ఉత్పత్తి చేసే చోట అమ్మడానికి వీలులేదు.
73. వివాహ వస్తువులు, స్త్రీకి పుట్టింటి నుండి పెళ్లి నిమిత్తం ఇచ్చే కానుకలు, వ్రతదీక్షలలో ఉపయోగించే సామాగ్రికి పన్ను చెల్లించే అవసరం లేదు.
74. నిషేదించిన వస్తువులు ఎగుమతి చేయరాదు.
75. దేశానికి నష్టం కలిగించేవి, నాణ్యత లేని వస్తువులు దిగుమతి చేసుకోరాదు. (మన నాయకులు, వ్యాపారాలు చేస్తున్న పని దీనికి పూర్తి వ్యతిరేకం. పనికిరానివి, ఇతర దేశస్తులు బహిష్కరించినవి, నాణ్యత లేనివి ఎక్కడ దొరుకుతాయో చూసి జల్లెడ వేసి మరీ తీసుకొచ్చి ప్రజల నెత్తిన వేస్తున్నారు. ప్రజలు కొందరు గతిలేక కొంటుంటే, మరికొందరు కక్కూర్తి పడి కొంటున్నారు.)
76. నీటి మార్గాల కంటే భూమార్గం రవాణాకి శ్రేయస్కరం.
77. కల్తీ ఉప్పు అమ్మేవారు శిక్షార్హులు.
78. ప్రభుత్వ అనుమతి లేకుండా ఉప్పు తయారుచేసేవారు శిక్షార్హులు.
79. వివిధ రకాలైన వస్త్రాలు తాయారు చేయడానికి అనేక రకాల కర్మాగారాలు స్థాపించాలి.
80. విత్తనాలు నాటే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పనివారిని శిక్షించాలి.
81. పనికిరాని విత్తనాలు పంపిణి చేసేవారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. లేనిచో ఇటు రైతు నష్టపోతాడు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.
82. రాజు ప్రతి సంవత్సరం వర్షాల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో యజ్ఞములు నిర్వహించాలి.
83. వేశ్యావృత్తి నిర్వహించే వేశ్యలు తమ ఆదాయంలో సగభాగం ప్రభుత్వానికి చెల్లించాలి.
84. చెల్లించే వారి శక్తిని బట్టి ప్రభుత్వం పన్నులు విధించాలి.
85. అధికంగా సంపాదించే వారిమీద అధిక పన్నులు వేయాలి. అలా చేయకపోతే ధనవంతులు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళతారు. ప్రభుత్వానికి ఎదురుతిరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి.
86. మహిళలు యుక్తవయస్కులు కానివారు, వికలాంగులు, బలహీనులు, ప్రత్యేక లక్షణములు కలిగిన బ్రాహ్మణులు పన్నులు చెల్లించనవసరం లేదు.
87. పాలకులు ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని పన్నులు వేయాలి.
88. పాలకులు ప్రజక్షేమాన్ని విస్మరిస్తే రాజ్యక్షేమానికి భంగం వాటిల్లుతుంది.
89. పురోహితులు ఎల్లప్పుడూ పాలకుల చెంత ఉండి మంచి చెడు నిర్ణయించి పాలకులని విజయం దిశగా నడిపించాలి.
90. పురోహితుడు రాజనీతి, దండనీతి శాస్త్రములలో అవగాహన కలిగిఉండాలి.
91. మంచి చెడులు నిర్ణయించే మంత్రి రాజు చెంతన ఉండాలి.
92. పురోహితుడు, మంత్రి ఎంతటి నేరం చేసినా మరణదండన విధించకూడదు.
93. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాజు ఒకరహస్య కోశాధికారమును మరణదండన విధించిన నేరస్థులచే దేశ సరిహద్దుల యందు నిర్మింపజేయాలి. పిమ్మట వారిని ఉరితీయడం వలన రహస్య కోశాధిగారం ఎవ్వరికీ తెలియదు.
94. దూతలు చేయవలసిన పనులు:
1. వార్తలు పంపడం
2. సంధి షరతులు పాటించడం.
3. తమ పాలకుని ఘనత చాటాడం.
4. స్నేహితులను ఏర్పరచుకోవడం.
5. కుతంత్రాలు చేయడం.
6. విరోధుల మిత్రుల మధ్య విరోధం కలిగించడం.
7. గూడచారులను, సైనికులను విరోధ దేశములలో ప్రవేశపెట్టడం. (ఈనీతి పుట్టింది మనదగ్గరే అయిన దీన్నీ వాడుకుంటుంది మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్. మనదేశం మీదకి ఉగ్రవాదులని ప్రేరేపించి హింస సృష్టిస్తున్నాయి.)
8. శత్రువుల సంపదను, బంధుమిత్రులను అంతరింపచేయడం.
9. ఇతర దేశముల నుండి రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలి.
98. మంత్రికి ఉండవలసిన లక్షణాలు :
1. స్వదేశీయుడు
2. మంచి వంశంలో జన్మించినవాడు
3. విద్యావంతుడు. శాస్త్రాలయందు ప్రావీణ్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా ధర్మశాస్త్రంలో నిపుణుడై ఉండాలి.
4. మంచివక్త.
5. పట్టుదల కలిగినవాడు
6. కార్యదక్షత కలిగుండాలి. అప్పజెప్పిన పనిని చివరి కోన ఊపిరి వరకు పట్టుదలగా సాధించాలి. విసుగు, అలసత్వం ఉండకూడదు.
7. సహనశీలి
8. మంచి శీలము కలిగుండాలి.
9. బలాడ్యుడు.
10. బలహీనతలు లేకుండా ఉండాలి.
99. శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చదివినవాడే ఉద్యోగానికి అర్హుడు.
100. ప్రభుత్వ ఉద్యోగి హుందాగా, ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.
101. పాలకుని యొక్క, ప్రభుత్వం యొక్క మంచే తనకు అతిముఖ్యమైన విషయముగా ప్రభుత్వోద్యోగి పరిగణించాలి.
102. గూఢచారులుగా నియమించబడే వారి విషయంలో కుల మత, లింగ భేదాలు పాటించరాదు.
103. గూఢచారులు తెలివితేటలు సమయస్పూర్తి, సమర్థత కలిగియుండాలి.
104. పాలకులు నిజయతీతో, సమయస్పూర్తితో పనిచేసే గూఢచారులకు తగిన బహుమతులు ఇస్తూ ప్రోత్సహించాలి.
105. మంచి నడవడి లేకుండా, చెడ్డపనులు చేసే గూఢచారులను కనిపెట్టి పాలకులే శిక్షించాలి.
106. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించే సంఘవిద్రోహ శక్తులను రహస్యంగా మట్టుబెట్టాలి.
107. పాలకులపై ప్రజలెలా స్పందిస్తున్నారో ఎప్పటికప్పుడు గూఢచారులు పాలకులకు తెలియజేయాలి.
108. తగాదాల సందర్భంలో పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేసేవారి నుండి గూఢచారులు సరైన నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నించాలి.
109. ఎలాంటి గొడవలు, ఆర్బాటాలు, వ్యయం లేకుండా శత్రువులను మట్టుబెట్టాలి. (హోటల్ తాజ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో పట్టుబడిన ఉగ్రవాదికి చేసిన ఖర్చుతో ఒక ఊరిని సుందరంగా తీర్చిదిద్దవచ్చు. మన పాలకులు బడుగు వర్గాలకి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు గాని విచ్చలవిడిగా ఖర్చుచేయాలంటే వెనకాడరు.)
110. నాలుక మీద ఉండే తేనే గాని, విషం గాని ఏవిధమైన రుచి చూడకుండా ఉండాలేమో, అదే విధముగా ప్రభుత్వ ఆర్థిక శాఖలో కొద్దిపాటైన అవినీతికి పాల్పడకుండా ఉండటం కష్టసాధ్యమైన పని. (ప్రస్తుతం ఒక్క ఆర్థికశాఖ మాత్రమే కాదు అన్ని శాఖలలో అవినీతి వూడలు వేసింది. పెకిలించాలంటే ప్రాణాలు పోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది.)
111. ప్రతి కార్యలయమందు అధికారులను ఒకే చోట ఉంచక తరుచూ బదిలీలు చేస్తూ ఉండాలి.
112. అవినీతికి పాల్పడిన అధికారిని పేడలో ముంచి, ఒంటినిండా భూడిద పోసి, గుండు గీయించి ఆ గ్రామమంతా ఊరేగించి, అతను చేసిన తప్పును తెలియజేస్తూ ఇటుకలతో కొట్టాలి.
113. దేశ ఆదాయంలో నాల్గవ వంతు ప్రభుత్వాన్ని చక్కగా నడిపించేందుకు తోడ్పడే పాలకులకు ఇవ్వాలి.
114. ప్రభుత్వ ఆదాయంలో నాల్గవ వంతు ఉద్యోగుల జీతభాత్యముల క్రింద ఖర్చు చేయాలి.
115. ఉన్నతాధికారులలో అసంతృప్తి పెరగకుండా ఉండేందుకు, వారు సక్రమంగా పనిచేసేందుకు ఎక్కువ జీతాలు చెల్లించాలి.
116. ఉద్యోగంలో ఉన్నవారు హటాత్తుగా మరణిస్తే అతని జీతభత్యం అతని భార్యాబిడ్డలకు ఇవ్వాలి.
117. ప్రభుత్వ ఉద్యోగము చేసే కుటుంబంలో చిన్నపిల్లలకు, ముసలివారికి, రోగగ్రస్తులకు వైద్య సాయం చేయాలి.
118. ఉద్యోగి మరణించి నపుడు అంత్యక్రియలు జరిపేందుకు, అనారోగ్యం కలిగినపుడు, ప్రసవ సమయాలలో ప్రభుత్వం ధన సాయం చేయాలి.
119. అన్యాయంగా ఇతరులను గాయపరచినవాడు, గాయపడినవాడు ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలి.
120. పాలకుడు నిర్ణీత సమయంలో ప్రజాసమస్యలు విని తక్షణమే పరిష్కరించాలి.
121. దేవాలయమునకు సంబధించిన విషయాలు, బ్రాహ్మణులు, తపస్విలు, మహిళలు, పిల్లలు, ముసలివారు, రోగగ్రస్తులు, అనాధలు మొదలైనవారు న్యాయస్థానము వద్దకు రావడం ఇబ్బందికరమైన విషయం కావున వీరికి న్యాయస్థానం కలగజేసుకుని తగిన న్యాయం చేయాలి.
122. సాక్షులుగా పనికిరానివారు:
1. భార్య, 2. సోదరుడు, 3. సహోద్యోగి, 4. సేవకుడు, 5. అప్పుతీసుకున్నవాడు, 6. అప్పు ఇచ్చినవాడు, 7. విరోధి, 8. అంగవైకల్యం కలవారు, 9. మాజీ నేరస్థుడు, 10. వ్యవహార దక్షత లేనివాడు, 11. పాలకుడు, 12. బ్రాహ్మణుడు, 13. గ్రామ నౌకరు, 14.కుష్ఠురోగి, 15.గాయాలతో బాధపడుచున్నవారు, 16.పతితుడు, ఛండాలుడు, 17.చెడు వృత్తులందు ఉన్నవారు, 18.అంధుడు, 19.మూగవారు, 20.కూటసాక్ష్యము చెప్పేవాడు, 21.ప్రభుత్వోద్యోగి, 22.స్త్రీ.
123. అధికమొత్తంలో శిక్షలు విధించుకుంటూ పొతే అసలు సాక్ష్యానికి ఎవ్వరూ ముందుకు రారు.
124. న్యాయస్థానముల నుండి ప్రజలకు తప్పక న్యాయం జరగాలి. (ప్రస్తుత న్యాయవ్యవస్థ ప్రజలకు ఎట్టి పరిస్థితులలో ప్రజలకు న్యాయం జరగరాదు అనీ రీతిలో వ్యవహరిస్తున్నాయి.)
125. న్యాయమూర్తులు నిజాయితీగా లేకపోతే వారిని కూడా కఠినంగా శిక్షించాలి.
126. న్యాయవిరుద్ధంగా న్యాయమూర్తి ఒక వ్యక్తికీ శారీరక దండన విధిస్తే అది తప్పు అని తెలిస్తే అదే దండనను న్యాయమూర్తి అనుభవించాలి.
127. ధర్మానికి సత్యం, న్యాయానికి సాక్షులు, చరిత్రకు మనుషుల అభిప్రాయములు, శాసనానికి పాలకుల ఆజ్ఞ ఆధారాలు.
128. ధర్మమనేది ఎవరికైనా ధర్మమే.
129. సంతానం తన తండ్రి ఆస్తిని, అప్పులను సమానంగా పంచుకోవాలి.
130. తండ్రి తన స్వార్జితమును పిల్లలకు పంచనవసరం లేదు.
131. పుత్రసంతానం లేనివారు వారి ఆస్థిని అతని సోదరులు, భార్య, స్త్రీ సంతానం పంచుకోవాలి.
132. కారణం లేకుండా కుమారుడికి తండ్రి ఆస్థిని ఇవ్వడం కుదరదు.
133. వీరికి ఆస్థిలో వాటాలేదు :
నైతికంగా పతనం చెందినవాడు, వేశ్యకు పుట్టినవాడు, సంసార సుఖమునకు పనికిరానివాడు, జడుడు, పిచ్చివాడు, గ్రుడ్డివాడు, కుష్టురోగి. వీరికి ఆస్థిలో వాటాపొందే హక్కులేదు.
134. పైన చెప్పినవారికి భార్యా పిల్లలు ఉన్నట్లయితే వారికి ఆస్థిని పంచాలి.
135. స్థిరాస్తులకు సంబంధించిన తగదాలన్ని ఇరుగుపొరుగువారి సాక్ష్యాలు మూలాధారంగా చేసుకుని పరిష్కరించాలి.
136. ఒక ప్రాంతంలో గాని, గ్రామంలో గాని జీవించేటప్పుడు అక్కడి చరలకు అనుగుణంగా జీవించాలి. దీనికి విరుద్ధంగా జీవించేవారు శిక్షార్హులు.
137. సాంఘిక కార్యక్రమములలో పాల్గొననివారు జరిమానా చెల్లించాలి.
138. గ్రామాలలో జరిగే ఉత్సవాలకు ప్రజలు తమ స్థితిననుసరించి ఆహారపదార్థాలు, పానీయాలు సమర్పించాలి.
139. గ్రామాభివృద్ధిలో పాల్గొనకపోయినా, పనిచేయకపోయినా తగిన అపరాధ రుసుములు పౌరులు చెల్లించాలి.
140. గ్రామంలో జరిగే వివిధ ప్రదర్శనలకు తమవంతు వాటా ఇవ్వకపోతే వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆ కార్యక్రమములు చూడడానికి అనర్హులు.
141. తనవంతు వాటా ఇవ్వనివారు రహస్యంగా ఆ కార్యక్రమాలు వీక్షించినా, విన్నా చెల్లించవలసిన దానిరెండింతలు చెల్లించాలి.
142. అందరికీ మేలుచేసే పనులను ప్రోత్సహించే వారి మాటలు అందరూ వినాలి.
143. దేశము,జాతి, కులము,సంఘము,మొదలైన వాటి విషయములో వున్నఆచా ర వ్యవహారములను,కట్టుబాట్లను అతిక్రమించిన వారు శిక్షార్హులు.
144. అప్పు తిసుకున్నవాడు సకాలంలో అప్పు తీర్చకపోతే అతను శిక్షర్హుడు .
145. చేసిన అప్పు 10 సం.లు గడువులోపున తీర్చకపోతే ఆ అప్పులు చెల్లవు.
146. 10సంవత్సరములు దాటిన ఈ క్రింది వారి అప్పులు రద్దుకావు.
1. తగిన వయస్సు రానివారు, 2. ముసలివారు, 3. అనారోగ్యవంతుడు, 4. అధిక కష్టములలో ఉన్నవాడు, 5. విదేశములలో ఉన్నవారు, తాత్కాలికంగా ఇతరదేశము లందు ఉన్నవారు, 6. అరాచక పరిస్థితులలో దేశం వదిలి వెళ్ళినవారు.
147. భార్య అనుమతి లేకుండా భర్త అప్పు చేసినట్లయితే ఆ అప్పు భార్యకు సంబంధంలేదు . ఆ అప్పు భర్త తీర్చకపోతే ఆమెకు తిర్చవలసిన భాధ్యత కూడా లేదు. 148. భర్త యితర దేశాలలో వున్నప్పు డు ఇక్కడ భార్య కుటుంబ అవసరాల నిమిత్తం చేసే అప్పులకు భర్తే బాధ్యత వహించలి.
149. ఆడవారైనా, మగవారైనా పనివారిచే కూడని పనులు చేయిస్తే శిక్షార్హులు .
150. యజ్ఞయాగాదులు నిర్వహించే ఋత్విక్కులకు, వారు చేసే ఆ కార్యక్రమమును బట్టి దక్షిణలు ఇవ్వాలి.
151. యజ్ఞ సమయంలో యజమాని జబ్బు పడితే ఋత్విక్కులు ఆ కార్యక్రమమును పూర్తిచేసి దక్షిణలు తీసుకోవాలి.
152. ఆకారణముగా యజమాని గాని, ఋత్విక్కులు గాని యాగాన్ని వదిలి వెళితే వారు శిక్షార్హులు.
153. పెళ్ళయిన తరువాత పురుషుడు సంసారానికి పనికిరానివాడైతే ఆ వివాహమును రద్దు చేయవచ్చు.
154. సంతానం కలిగిన తరువాత భార్యాభర్తలు వివాహం రద్దుచేయడానికి అనర్హులు.
155. స్థిరాస్తి అయినప్పటికీ ఇరవై సంవత్సరముల నుండి ఆస్థి తమ స్వాదీనంలో లేకపోతే ఆస్థి మనకు రాకుండా పోతుంది.
156. జూదమాడే వారి అందరికి మోసబుద్ధి ఉంటుంది.
160. ప్రజలకు మేలు కలిగించే పనులుచేయడం ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యం.
161. అవినీతికి పాల్పడే ప్రభుత్వోద్యోగులు, మోసాలకు పాల్పడే వ్యాపారులు మొదలైన వారందరూ సంఘవిద్రోహ శక్తులు.
162. పాలకులు చెప్పిన పనిని ఉద్యోగులు నిర్ణీత సమయంలో ప్రభుత్వం నిర్ణయించినట్లు ఖచ్చితంగా పూర్తిచేయాలి.
163. అలా చేయని ఉద్యోగికి జీతంలో నాల్గవ వంతు కోతవిదించాలి.
164. చెప్పిన పనికి వ్యతిరేకంగా చేసిన ఉద్యోగి జీతం పూర్తిగా రద్ధు చేయడమే కాకుండా దానికి రెండింతలు ప్రభుత్వానికి చెల్లించాలి.
165. బంగరం పని చేసేవారు దొంగబంగారం కొనుగోలు చేస్తే వారు శిక్షార్హులు.
166. దొంగ నాణేలు తయారుచేసేవారు, సేకరించేవారు, మార్చేవారు శిక్షార్హులు. దొంగ నాణేలు ప్రభుత్వ ఖజానాలోకి చేర్చితే వారికి మరణ దండన విధించాలి.
167. తూనికలు కొలతలలో మోసం చేసేవారికి అతడెంత మోసం చేశాడో అంతకు రెండింతలు వినియోగదారునికి చెల్లించాలి.
168. అక్రమపద్దతుల ద్వార డబ్బు ఆర్జించెవారిని, దొంగ నాణేలు ముద్రించేవారిని, విషం తాయారు చేసేవారిని గూడచారులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి.
169. అక్రమ జీవితం గడిపేవారిని, ఇతరులను హింసించేవారిని దేశ బహిష్కరణ చేయాలి.
170. అగ్ని, వరదలు, రోగాలు, క్రూరమృగములు, దుష్టజంతువులు, దుష్టశక్తుల బారి నుండి పాలకుడు ప్రజలను ఎల్లవేళలా రక్షించాలి.
171. ఏ వ్యక్తి నైన బంధించేటప్పుడు మూడు విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.
1. అనుమానం, 2. దొంగ వస్తువులు కలిగివుండటం, 3. దొంగతనం, కుట్రలలో ప్రమేయం.
172. ఈక్రింది లక్షణములు కలిగినవారిని దొంగగా పరిగణించవచ్చు.
1. కుటుంబ ఆదాయం తగ్గినవారు. దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంది. (ఆదాయం తగ్గినా ఖర్చులు తగ్గవు).
2. తక్కువ జీతం కలిగినవాడు. (ఆదాయం తక్కువగా ఉన్నవారు కొందఱు జల్సా ఖర్చుల నిమిత్తం కావచ్చు, లేదా అవసరం కోసం కావచ్చు కనుక దొంగతనం చేసే అవకాశం ఉంది. వీరిని గుర్తించి తగిన శిక్ష వేయాలి.)
3. తనదేశం, జాతి, గోత్రం, పేరు, వృత్తి గురించి చెప్పనివారిని దొంగగా అనుమానించవచ్చు.
4. మాంసం, తాగుడు, జూదం యందు దుష్టబుద్ది గలవారు. ఇలాంటి వ్యసనములు కలవారు ద్రవ్యం కొరకు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నది.
5. దుబారా ఖర్చులకు అలవాటు పడినవారు. (వీరు తమకు వచ్చిన సంపాదకు మించిన ఖర్చులు చేసి పనికిరాని పనులకు, వస్తువుల నిమిత్తం అదుపులేని ఖర్చుల కొరకు, జల్సా జీవితం కొరకు ,దొంగతనం చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఇలాంటి దుబారా ఖర్చులు చేసేవారిలో విద్యార్ధులు, ఐ టి ఇంజినీర్లు, ఎక్కువగా ఉన్నట్లు చాలా సర్వేలలో తేలింది.)
6. విటుడు (స్త్రీ లోలుడు తనకు నచ్చిన స్త్రీ కొరకు ఏ పనిచేయడానికైనా వెనుకాడడు. ఇందునిమిత్తం దొంగతనాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జాబితాలో స్త్రీలు కూడా చేరారు.)
7. ఇంటిపట్టున ఉండకుండా తిరిగేవారు.
8. చీకటి ప్రదేశములలో తచ్చాడేవాడు.
9. గాయాలకు రహస్యముగా వైద్యం చేయించుకునేవాడు.
10. ఎల్లవేళలా గృహమువద్దనే ఉండేవాడు.(ఇంటివద్ద ఉంటూ ఉంటే జీవనం గడవదు. కనుక రహస్యమార్గంలో సంపాదిస్తుంటాడు. కనుక ఈతడి సంపద దొంగ సంపదే)
11. ఇతర స్త్రీల గురించి, ఆస్థుల గురించి ఆరాతీసేవాడు.
12. రక్షక భటులను చూసి దాగేవారు, పారిపోయేవారు.
13. కంగారు పడేవారు.
173. దొంగతనం జరిగినపుడు ఆ వస్తువులు కనుగొనకపోయినపుడు, అటువంటి వస్తువులు అమ్మకాలు-కొనుగోలు జరిపేవారికి తెలియజేయాలి. ముందుగా వారికి తెలిజేప్పినప్పుడు దొంగలు ఆ వస్తువులు అమ్మకానికి తెచ్చినప్పుడు వర్తకుడు ఆ సమాచారాన్ని రక్షకభటులకు తెలియజేయడం వలన దొంగలు దొరుకుతారు.
174. వర్తకులు దొంగ వద్ద నుండి దొంగతనం చేసిన వస్తువులు కొనుగోలు చేసి, దొంగల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయకపోతే వారు శిక్షార్హులు. అటువంటప్పుడు ఆ వస్తువుకు సమానమగు ధరను గాని, వస్తువును గాని ఆవర్తకుని నుండి వసూలు చేయడంతో బాటు, అలాంటి వస్తువులు కొనుగోలు చేసినందుకు వ్యాపారిని శిక్షించాలి. అతని వ్యాపారాన్ని రద్దుచేయాలి.
175. ఇంటిలోని వారు దొంగతనం చేసినట్లు ఈ రుజువులు ఆధారంగా చూపాలి.
1. ముఖద్వారం నుండి కాక ఇతర మర్గం ద్వార ప్రవేశించడం.
2. లోపల తలుపులకు రంద్రాలు చేయడం, తలుపులు తొలగించడం.
3. ధనాగారము ఉన్న గదిలోని కిటికీలను గాని, చూరును గాని బ్రద్దలు చేయడం.
176. బయటినుండి ఆధారాలు దొరకనప్పుడు బయటివారే దొంగతనం చేసినట్లు నిర్ధారించాలి.
177. గృహమునకు బయట - లోపల కన్నాలు కనిపిస్తే బయట-లోపలి వారు కలిసి చేశారని నిర్థారించుకోవాలి.
178. ఇంటి దొంగలను ఈవిధంగా గుర్తించవచ్చు.
1. ఇంటి యజమానికి దగ్గరి బంధువులు,
2. చెడు అలవాట్లు ఉన్నవారు.
3. చెడ్డవారితో సహవాసం చేసేవారు,
4. నేరాలు చేయడానికి ఉపయోగించే సామాగ్రి ఉన్నవారు,
5. కీచు లేక బొంగురు గొంతు ఉన్నవారు,
6. దొంగతనం జరిగినప్పుడు మట్టిలోను, బురద ప్రదేశాలలో దొంగ నడచిన ఆ అడుగు జాడలకు, ఇంటిలో ఉన్నవారి అడుగు జాడలు ఒకటే అయితే వారు.
7. అతినిద్రా లోలురు. వీరు ఎక్కువగా కష్టించడానికి ఇష్టపడరు. వీరు తమజీవనం కొనసాగించడానికి దొంగతనము చేయడానికి, అటువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది. కష్టపడకుండా సుఖపడటానికి వారు చెడు మార్గమునె ఎంచుకునే అవకాశం ఉంది.
178. ఎవరినైనా అనుమానముతో బంధించినపుడు వారి ఊరు, పేరు, జాతి, వృత్తి వివరములు తెలుసుకుని నిర్ధారించుకుని, నిజమని తేలితే వానిని సాదారణ విచారణతో విచారణతో వదిలేయాలి. అవాస్తవం అయినచో వానిని నేరస్థునిగా నిర్ధారించి, విచారణ చేసి ఋజువైతే కటినంగా శిక్షించాలి.
179. దొంగ కాని వారిని దొంగ అని నిందలు మోపెవారిని, సాక్ష్యం చెప్పేవారిని, దొంగను దాచేవారిని, దొంగకు విధించే శిక్ష కంటే ఎక్కువగా శిక్ష వేయాలి.
180. కేవలం వైరభావముతోను, ద్వేషముతోనూ ఇతరులమీద ఫిర్యాదు చేస్తే దానిని పరిగణలోకి తీసుకోరాదు.
181. ఎవరైనా ఒక వ్యక్తి నిర్దోషి అని తేలితే అతనిని వెంటనే కారాగారం నుండి వదిలివేయాలి.
182. ఒక వ్యక్తి నేరం చేసాడని అనుమానం ఉన్నా, లేక నేరం చేసి కూడా చేయలేదని బుకాయిస్తున్నా అతనిని తప్పనిసరి పరిస్థితులలో హిమసించైనా నిజాన్ని రాబట్టాలి. (ఇప్పటిపరిబాషలో థర్డ్ డిగ్రి అంటున్నాము.)
183. వీరివిషయంలో రక్షక ;దళం అతిగా వ్యవహరించరాదు.
1. చిన్న చిన్న నేరములు చేసినవారిని.
2. ముసలివారు.
3. పిల్లలు.
4. రోగగ్రస్థుడు
5. పిచ్చివాడు.
6. ఆకలి దప్పుల గొన్నవాడు.
7. ఎక్కువ భోజనం చేసినవాడు. (వీడికి తిండి అరిగేవరకు ఆగాలి)
8. త్రాగుబోతు. (వీడికి నిషా దిగేవరకు ఆగాలి)
9. అసలు భోజనం చేయనివాడు. (ఆకలి భాధకి తోడు హింస చేస్తే చనిపోయే ప్రమాదం ఉంది)
10. బలహీనుడు. (పైన చెప్పిన వారందరూ కఠినమైన దండన విధిస్తే ప్రాణములు కోల్పోయే అవకాశం ఉంది)
184. ఒక వ్యక్తి నేరం చేసాడని బలమైన ఆధారం ఉంటె వాని నుండి నిజం రాబట్టుట కొరకు అత్యంత కఠినముగా శిక్షించాలి.)
185. ఎట్టి పరిస్థితులలోనూ గర్బిణీ స్త్రీలను, బిడ్డను ప్రసవించె నెలరోజుల లోపు ఉన్న స్త్రీలను రక్షకదళం కఠినదండన విధించకూడదు.
186. స్త్రీల విషయంలో తప్పని సరి పరిస్థితులలో సాధారణ దండన మాత్రమే అమలుచేయాలి.
187. దండన విషయంలో నేరస్థుడిని నిత్యం హింసించరాదు. రోజువిడిచి రోజు మాత్రమే శిక్షించాలి. లేనిచో మరణించే అవకాశం ఉంది. అందువలన నిజం రాబట్టే అవకాశం కోల్పోవడమే కాకుండా అమానుషంగా అవతలి వ్యక్తిని చంపడమనే తప్పిదం జరుగుతుంది.
188. నేరము - శిక్ష
1. పుణ్యక్షేత్రాలలో దొంగతనము - మధ్యవ్రేలు, బ్రొటనవ్రేలు ఖండన లేదా 54ఫణాలు అపరాధము.
2. దుస్తులలో దాచుకున్న ధనాన్ని అపహరించడం - మధ్యవ్రేలు, బ్రొటనవ్రేలు ఖండన లేదా 54ఫణాలు అపరాధము.
3. మొదటిసారి దొంగతనం - మధ్యవ్రేలు, బ్రొటనవ్రేలు ఖండన లేదా 54ఫణాలు అపరాధము.
4. పైనచేప్పినవి రెండవసారి చేసినట్లయితే చేతికున్న ఐదు వ్రేళ్ళు ఖండించడం మరియు 100 ఫణాలు అపరాధం.
5. పై నేరాలు మూడవసారి చేసినట్లయితే కుడిచేతిని తొలగించడం మరియు 400ఫణాలు అపరాధము.
6. పైనేరాలు 4వసారి చేసిన యెడల రక్షక దళాధిపతి తన ఇష్టానుసారం ఎటువంటి కఠిన శిక్షనైనా విధించవచ్చు.
7. కోళ్ళు, మార్జాలము, శునకము, ముంగిసలు, పందుల దొంగతనము లేదా చంపుట. 54ఫణాలు అపరాధము.
8. జంతువులను, ధనమును దొంగతనము చేసిన యెడల నూరు ఫణాలు అపరాధము.
9. అనుమతి లేకుండా కోటలోనికి ప్రవేశించుట. కోటనుండి ధనం దొంగలించుట. కోటలోని ఏదో ఒక ప్రకారము నుండి బయటకు వచ్చుట. - పాదములు ఖండన లేదా 200 ఫణములు అపరాథము.
10. గవ్వలు, పాచికలతో మోసాలు, హస్తలాఘవముతో జనములను మోసగించుట - ఒక చేతిని తీసేయడం లేదా 400ఫణాలు దండన.
11. దొంగకు విటుల సాయం, వ్యభిచార స్త్రీ - స్త్రీలకు ముక్కు చెవి ఖండించడం, లేదా 500 ఫణాలు జరిమానా.
12. ఉత్తమ వర్ణాల వారిని, గురువులను కొట్టుట, తన్నుట, రాజు అధిరోహించే వాహనం ఎక్కడం - చేతిని, కాలిని తీసివేయుట లేదా 700ఫణాలు జరిమానా.
13. దొంగతనము, ఇతర స్త్రీలతో వ్యభిచరించే వానిని తప్పించేవాడు. రాజశాసనము సక్రమముగా లిఖించకపోవుట. నగలతో ఉన్న కన్యను సేవకురాలిని అపహరించుట, మంచి మాంసాన్ని విక్రయించకపోవుట - ఎడమచేయి, రెండు పాదాలు నరికివేయడం, లేదా 900ఫణాలు జరిమానా.
14. మనుష్యులను చంపడం _ మరణశిక్ష.
15. దేవాలయ ఆస్తులు దొంగతనము - కఠిన శిక్ష, మరణ దండన.
188. హఠాత్తుగా ఒక మనిషి మరణించినపుడు అది ఆత్మహత్యా లేక హత్యా అనేది తెలుసుకోవడం కోసం వాని శరీరం నిండా నూనెపోసి పరీక్షించినట్లయితే హింసించుట లేదా పొడుచుట వలన కలిగే గాయాలు తెలుస్తాయి.
189. మూత్ర పరీశము చిమ్మినట్లు వెలుపలికి వచ్చినా, కడుపుపై చర్మం వాతంతో నిండి ఉన్నప్పుడు చేతులు-కాళ్ళు ఉబ్బినట్లు ఉన్నా, కండ్లు తెరువబడి ఉన్నప్పుడు, కంఠమందు గుర్తులున్నా, శ్వాస ఆడకుండా కంఠం నులిమి హత్యచేయబడినట్లు గుర్తించాలి.
190. పై లక్షణములతో పాటు చేతులు, తొడలు ముడుచుకుని పోయినట్లుంటే ఉరితీసి చంపినట్లు భావించాలి.
191. కండ్లు మూతపడి, నాలుక కొరకబడినట్లు ఉండి, కడుపు పొంగినట్లుంటే నీటిలో మునిగి చనిపోయినట్లుగా భావించాలి.
192. రక్తము చెల్లాచెదురై, శరీర అవయవాలు విరిగి, కదిలి ఉన్నప్పుడు కర్రలతో గాని, రాళ్ళతో గాని కొట్టి చంపినట్లు గ్రహించాలి.
193. చేతులు, కాళ్ళు, పళ్ళు, గోళ్ళు నల్లబడి, కండలు, జుట్టు, చర్మము శిథిలమై నురగ నోటినిండా ఉన్నప్పుడు విషప్రయోగం జరిగినట్లుగా భావించాలి.
194. పై లక్షణములతో పాటు పాము కాటు గాని, పురుగు కాటుగాని ఉంటె ఆయా జంతువు వలన మరణం సంభవించినట్లు గ్రహించాలి.
195. ఒక వ్యక్తి విషాహారం వలన చంపబడ్డాడన్న అనుమానం కలిగినపుడు అతడు తిన్న ఆహారములోని మిగిలిన పదార్థములను పక్షులకు వేయాలి. ఆ ఆహారము తిన్న పక్షులు మరణించినట్లయితే ఆహారములో విషము కలిసినట్లు గ్రహించి దానికి కారణమైన వారిని శిక్షించాలి.
196. విషప్రయోగం జరిగి మరణించిన వ్యక్తీ యొక్క గుండె నుండి తీసిన ద్రవపదార్థము నిప్పులో వేస్తె చిటపట శబ్దము వినిపించినా, ఇంద్రధనస్సు రంగు కనిపించినా అతడు విషప్రయోగమునకు గురై మరణించినట్లు గుర్తించాలి.
197. చనిపోయిన మనిషిని దహనం చేసినప్పుడు శరీరమంతా కాలి, గుండె కాలకపోతే అతడు విషప్రయోగం చేత చంపబడినట్లు నిర్థారించుకోవాలి.
198. ఒక మనిషి విషప్రయోగముచే మరణించాడంటే ముందుగా ఈక్రింది వారిని అనుమానించాలి.
1. చనిపోయిన వానిచే భౌతిక, మానసిక హింసకు గురైన సేవకుడు.
2. పరపురుషుడి సంగమం కోరే భార్య.
3. మృతుని ఆస్థికి సంబంధించిన వారసులు.
199. ఒక వ్యక్తి హత్య గావింపబడడానికి ప్రధాన కారణములు.:
1. పరస్త్రీతో అక్రమ సంబంధము.
2. ఆస్థి.
3. చేసే పనికి సంబంధించిన వారితో తగాదాలు.
4. న్యాయ సంబంధ తగాదాలు.
200. ఎవరైనా తనకు తానుగా హత్య చేశాడా?ద్రవ్యం నిమిత్తం దొంగలు చేశారా? ఒకరిని చంపాలని పొరబాటున వారి పోలికల కారణం చేత మరొకరిని చంపారా? అనే విషయాల మీద కూపీ లాగాలి.
201. హంతకుడు హత్య చేసిన ప్రదేశానికి ఎలా వచ్చాడు? అతడిని పిలిచింది ఎవరు? అతని కూడా ఎవరున్నారు? ఎవరితో కలిసి ప్రయాణం చేసాడు? అనే విషయాలు రక్షకదళం తెలుసుకోవాలి.
202. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు దానికి గల కారణములు అన్వేషించాలి.
203. ఆత్మహత్య చేసుకున్న వానికి అంత్యక్రియలు అక్కరలేదు. శ్రార్థ కర్మాది క్రియలు అవసరంలేదు.
204. చెడు వ్యసనాలు కల పురుషుడు గాని, కులటయైన స్త్రీ గాని ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాజమార్గంలో అటువంటి శవానికి తాడుకట్టించి చండాలునిచే ఈడ్పించాలి.
205. ధనం శాశ్వతం కాదు. ప్రాణం స్థిరం కాదు. ప్రపంచం అనేకవిధముల మారిపోతుంది. కాని మనం చేసే ధర్మం మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది.
206. మానవజాతిలో కృతఘ్నుడు, పక్షులలో కాకి, జంతువులలో నక్క, స్త్రీలలో దాసస్త్రీ తక్కువగా పరిగణించబడతారు.
207. ఈ ఐదుగురు జనకులే.
1. జన్మనిచ్చినవాడు.
2. ఉపనయనాది సంస్కరాలు చేసినవారు.
3. ఆహారం ఇచ్చినవాడు.
4. ఆపద్భాంధవులు.
5. విద్యాదాత అయిన గురువు.
208. చెడుమార్గంలో పయనించే మనిషిని సమాజము నిందిస్తుంది.
209. చెడు మాటలు మాట్లాడటం వలన మన మనస్సే చెడుగా మారి చేడుత్రోవ పడుతుంది.
210. మన నడతను బట్టి అవతలివారి ప్రవర్తన ఉంటుంది. ఇతరులతో మనం చెడుగా వ్యవహరిస్తే వారు కూడా చెడుగానే ఉంటారు. మంచిగా ఉంటె మంచిగానే ఉంటారు. అందుచే ఇతరులతో మంచిగా ప్రవర్తించి పేరు తెచ్చుకో. మన ప్రవర్తనను బట్టి పంచభూతాలు వ్యవహరిస్తాయి.
211. ప్రేమించలేకపోవడం, ప్రేమించబడకపోవడం చావుతో సమానం. సకల ధర్మాల సారం ప్రేమే. అందువలన ప్రతిజీవిని ప్రేమతో ఆదరించు. ప్రేమభావం కలిగి ఉంటె పంచభూతాలు శాంతిని పొందుతాయి. వంశం వృద్ధి చెందుతుంది.
212. సంచరించుట వలన పండితుడు, పాలకుడు, తపశ్శాలి పూజించబడతారు. (పండితుడు విదేశములలో సంచరించి తనవిధ్య ప్రదర్శించడం వలన కీర్తి, ధనం పెరుగుతుంది. రాజు వివిధ ప్రాంతములలో సంచరించుట వలన ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని ధర్మ పరిపాలనం సాగించవచ్చు. యోగి సంచరించుట వలన ప్రజలకు ధర్మబోధలు, యోగమార్గము తెలియజెప్పడం ద్వార భగవంతుని తెలుసుకునే మార్గాన్ని బోధించవచ్చు.
213. బూడిద వలన కంచు పాత్రకు శుబ్రత. పులుపు వస్తువు వలన రాగిపాత్రకు శుబ్రత, వేగం వలన నదికి శుబ్రత, రజోగుణం వలన స్త్రీకి శుబ్రత కలుగును.
214. వీరు అయిదుగురు తల్లులు.
1. జన్మనిచ్చిన తల్లి.
2. అత్తగారు.
3. స్నేహితుడి భార్య.
4. గురుపత్ని.
5. పాలకుని భార్య.
215. మంచి వినడం ద్వార ధర్మాన్ని తెలుసుకుని, చెడు బుద్ది వదులుకుని, జ్ఞానం సంపాదించి తద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడు.
216. పనికిమాలినవాడు పుట్టినప్పుడే మరణిస్తే ఒక్క ఏడుపుతో సరి. జీవించాడా వాడి వలన జీవితాంతం తల్లిదండ్రులు, ఆలు బిడ్డలు వాడు చేసేపనులకు ఏడుస్తూనే ఉంటారు.
217. నిప్పు లేకుండా దహించేవి :
1. మూర్ఖుడైన కొడుకు.
2. వైధవ్యముతో పుట్టినింట ఉండే కూతురు,
3. చెడు బుద్ధి కలిగిన భార్య,
4. పాచిపోయిన అన్నం,
5. చెడ్డవాడైనా యజమాని,
6. పాడుపడిన ఊరిలో జీవితం.
218. పాలు ఇవ్వని, వట్టిపోయిన ఆవు ఏవిధంగా ఉపయోగం లేనిదో, పాండిత్యము, తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రపత్తులు కొడుకు ఉండికూడా ఉపయోగి కాడు.
219. ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని ఏకం చేయవచ్చు.
220. సర్వ ప్రాణులను ప్రేమించడం ద్వారానే భవత్ప్రాప్తి కలుగుతుంది.
221. ధనవంతుడు అందరికీ మిత్రుడే, అందరికీ చుట్టమే. అతడు గొప్పవాడిగా పరిగణింపబడతాడు.
222. మన తెలివిని బట్టి బుద్ధి పనిచేస్తుంది. తెలివిని బట్టి మనకు సయంచేసేవారు దొరుకుతారు. మన తెలివిని బట్టి పనులు జరుగుతాయి.
223. కాలం సమస్త ప్రాణికోటిని నశింపజేయగలదు.
224. నిదురించే వారిని కూడా కాలం మేల్కొలపగలదు.
225. కాలాన్ని ఎదిరించి నిలువగలిగే లేరు.
226. పుట్టుకతో కళ్ళు లేనివారు చూడలేరు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వారు కొద్దిగా చూడగలడు. కాని స్వార్థబుద్ది గలవాడు తనగురించి మాత్రమే ఆలోచిస్తాడు.
227. ప్రాణి సంతాన పోషణ:
1. చాప - చూపుతో
2. తాబేలు - ధ్యానంతో,
3. పక్షులు - స్పర్శతో.
228. మంచివారితో స్నేహం మానవులను పోషిస్తుంది.
229. చదువు కామధేనువు లాంటిది.
230. చంద్రుడు తన కాంతి ద్వారా చీకట్లను దూరం చేసి కాంతిని ప్రసాదిస్తాడు. అలాగే మంచి లక్షణాలు కలిగిన సుపుత్రుడు తన వంశ ప్రతిష్ఠ పెంచుతాడు.
231. నక్షత్రాలు ఎన్ని ఉన్నా చీకటి పోదు. చెడ్డవారైన పుత్రులు ఎంతమంది ఉన్నా నిష్ప్రయోజనం.(ఎందుకూ పనికిరారు).
232. ప్రతిజీవి తను చేసిన కర్మకు తానే ఫలాన్ని అనుభవించాలి.
233. మానవజాతికి శత్రువులు:
1. అప్పు చేసిన తండ్రి. 2. కులట అయిన స్త్రీ, 3. అందగత్తె అయిన భార్య, 4. మూర్ఖుడైన కొడుకు.
234. వీరిని ఇలా వశం చేసుకోవచ్చు.
పండితులను - సత్యవాక్కు ద్వార.
గర్విష్టిని - దండం పెట్టడంచేత,
లోభిని - ధనం చేత,
మూర్ఖుడిని - వాడికి ఇష్టమైన పనిచేయడం చేత వశం చేసుకోవచ్చు.
235. మూర్ఖుని పాలనలో ప్రజలు సుఖపడరు.
236. దుష్టుని వలన సుఖం ఉండదు.
237. చెడు బుద్ది కలిగిన స్త్రీవలన ఇల్లు అశాంతి మయం అవుతుంది.
238. మందబుద్దికి విద్యాభ్యాసం చేయడం వలన గురువుకు కీర్తిరాదు.
240. ఇవి ఉండేకంటే అసలు లేకపోవడమే మేలు.
1. చెడ్డ భార్య,
2. చెడ్డ శిష్యుడు,
3. చెడ్డ మిత్రుడు,
4. చెడు రాజ్యం.
241. వీరు ఇక్కడ మిత్రులు.
ఇంటియందు - భార్య,
రోగికి - ఔషదము,
మృతునికి - ధర్మము,
విదేశాల యందు - విద్య.
242. జరగడం వలన ఉపయోగముండదు.
1. పగలు దీపం వెలిగించుట,
2. ధనవంతుడికి చేసిన దానం,
3. కడుపు నిండినవానికి అన్నదానం(పంచభక్ష్య పరమాన్నాలు పెడితే ఉపయోగం ఏముంటుంది? ఆకలేసిన పేదవాడికి పచ్చడి అన్నం పెట్టినా సంతోషంగా ఉంటాడు)
4. సముద్రం నందు వర్షం.
243. నీరు అన్నింటిలోనూ వానవలన వచ్చేనీరు ప్రశస్తమైనది.
244. అన్నానికి మించిన ఇష్టమైన వస్తువు ఉండదు.
245. వీరు వీటిని కోరుతారు.
1. పేదవాడు - ధనాన్ని,
2. మనిషి - స్వర్గాన్ని,
3. దేవత - మోక్షాన్ని,246. సత్యం వలన మాత్రమే భూమిమీద నిలబడగలుగుతున్నాము. సత్యం వలన సూర్యభగవానుడు మనకి వేడిని, వెలుతురును ప్రసాదిస్తున్నాడు. సత్యం కారణం గానే గాలి వీస్తుంది. చెప్పాలంటే సత్యం వలనే లోకాలు మనగలుగుతున్నాయి. సర్వం "సత్యం" లోనే దాగి ఉన్నాయి.
250. సత్యం వల్లనే ఈ భూమి మీద నిలబడగలుగుతున్నాం. సత్యం వల్లనే సూర్యభగవానుడు మనకు వేడిని,వెలుతురునూ ప్రసాదిస్తున్నాడు.సత్యం కారణంగానే గాలి వీస్తోంది. చెప్పాలంటే సర్వం సత్యం లోనే వున్నాయి.
251. ఈ జంతువు నుండి
1. సింహం - కఠినమైన పనిని సాధించడం
2. కొంగ - ఇంద్రియ నిగ్రహం,కార్యసాధన
3. గాడిద - అలసినా బరువులు మోయుట
4. కోడి - సకాలములో మేల్కొనుట కలియబడి ఆహారముగైకొనుట పోరాట పటిమ చుట్టాలకు తనకున్నదానిలో పెట్టుట
5. కాకి -ఎల్లప్పుడు జాగ్రతగానుండుట నిరంతరం వస్తుసేకరణ ఇతరులను
నమ్మకపోవుటఒంటరిగా నున్నప్పుడు మాత్రమే స్త్రీని కలియుట
6. కుక్క - దొరికన ఆహారంతోసంతృప్తిపడటం నిద్రంచే వేళలో కూడా జాగూరకత
వహించుట ధైర్యం,యజమాని యందు విశ్వాసము.
252. వీరికి ఇవి గడ్డితో సమానము
1. బ్రహ్మ జ్ఞానికి - స్వర్గం
2. వీరునికి - జీవితం
3. నిరాశా,నిస్పృహలలో వుండే వానికి ఈ ప్రపంచామందే ఆసక్తి వుండదు.
253. జ్ఞానానికి మించిన సుఖం లేదు.
254. క్రోధానికి మించిన అగ్నిలేదు.
255. మోహానికి మించిన శత్రువు లేడు.
256. ఏ పనీ చేయకపోవడానికి మించిన రొగము లేదు.
257. తార్కికంగా అలోచిన్చేవాడికి భయం ఉండదు.
258. బుద్ధిని పెంచుకోవడం ద్వారా అజ్ఞానాన్ని దూరం చేసుకోండి.
259.శీలవంతులకు చెడు పరిస్థితులు దరిచేరవు.
260. వీరి గురించి చెడుగా ప్రచారం చేస్తే మనకే నష్టం :
1. వేదములు
2. పండితులు
3. శాంతి స్వభావము గలవారు
4. సదాచార సంపన్నులు.
261. దానం వల్ల ధర్మం రక్షింపబడుతుంది.
262. యోగం ద్వారా విద్య రక్షింపబడును.
263. సున్నితముగా ప్రవర్తించే రాజు వల్ల ప్రజలు రక్షింపబడతారు.
264. మంచి ప్రవర్తనగల స్త్రీ వల్ల గృహమునకు మేలు జరుగుతుంది.
265. ఉత్తమునకు అభిమానమే ధనము.
266. మద్యమునకు ధనము,అభిమానము రెండింటినీ కోరతాడు.
267. అదమునకు ధనము మాత్రమే ముఖ్యము.
268. మనం తీసుకునే ఆహారమును బట్టి ఆయా గుణములు గల సంతానం కలుగుతారు.
269. సముద్రపు నీటిని గ్రహించి మేఘుడు దానిని వర్షంగా మార్చి ప్రపంచానికి అందజేస్తాడు. అట్లే మనం మంచివానికి దానం చేస్తే అతడు దానిని మంచి పనులకు ఉపయోగిస్తాడు.
270. ఈ పనులు చేసిన తర్వాత స్నానం చేయండి.
1. స్త్రీ సంభోగనాంతరం
2. శరీరానికి నూనెను మర్ధానా చేయించుకొన్న తర్వాత.
3. శవం కాలుతున్నప్పుడు లేచిన పొగ శరీరానికి తాకినపుడు.
271. కోపిష్టియైన స్త్రిని విడిచిపెట్టండి.
272. దయలేని ధర్మాలు ఆచరించవద్దు
273. వృద్ధునకు యౌవ్వనంలో వున్న భార్యే విషం.
274. పుత్రులు లేని తల్లిదండ్రులకు గృహమే శూన్యముగా కనిపిస్తుంది.
275. మూర్ఖునికి హృదయముండదు.
276. ధరిద్రునకు ప్రపంచమే శున్యంగా వుంటుంది.
277. మంచి నడవడిక కలిగి,పతి మార్గములో పయనించే స్త్రీలకు పతివ్రతగా పరిగణించబడుతుంది.
278. తపస్సు ఒక్కడే కూర్చుని చేస్తే ఫలితము లభిస్తుంది.
279. చదువు కొనుటకు, గానమునకూ యిద్దరుండాలి.
280. నలుగురు నడిచే దారి, ఐదుగురున్న వ్యవసాయం, యుద్ధానికి అనేక మంది వుంటేనే రాణింపు.
281. సంసారికి భార్య, సంతానం, మంచివారితో చెలిమి సుఖానిస్తాయి.
282. వీరి జీవితము వ్యర్థము :
1. జ్ఞానాన్ని అనుసరించని జ్ఞాని.
2. జ్ఞానములేని జీవితము.
3. సేనాపతి లేని సైన్యము.
4. భర్తలేని భార్య.
283. మగవాడి జీవితములో అతి దురదృష్టకరమైన సంఘటనలు :
1. వృద్ధాప్యంలో భార్య మృతి చెందుట.
2. బంధువులచే తన ధనము అపహరణమునకు గురి కావడం.
3. ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం.
284. అగ్నిహొత్రములేని వేదపఠనము వృధా.
285. యజ్ఞములో దానము చేయము. . చేయకాపోతే యజ్ఞము నిష్ఫలం .
286. పవిత్రభావము లేకుండా చేసిన యజ్ఞాలు కూడా సత్ఫలితాలివ్వవు.
287. భాక్తితోరాయనిగానీ,లొహన్నిగానీభగవద్భావనతోపూజిస్తే ఫలితముంటుంది.
288. శాంతితో సమానమైన తపస్సు లేదు.
289. దయకు మించిన ధర్మము లేదు.
290. కోరికను మించిన రోగము లేదు.
291. సంతోషం కన్నా సుఖము లేదు.
292. శాంతిని కలియుండటం కన్నా గొప్ప తపస్సు వేరొకటి లేదు.
293. కోపమే యమధర్మరాజు కోరికయే వైతరణీ నది చదువే కామధేనువు సంతోషమే నందనవనం.
294. మంచి గుణమే మనిషికి నిజమైన అందాన్నిస్తుంది.
295. శీలమే కులానికి ఆభరణము లాంటిది.
296. సిద్ధి, విద్యకు అలంకారము
297.ధనమున్నది అనుభవించడానికే.
298. ఆర్యధర్మాన్ని అవలంభిచే వారు ఒక్క మారే వివాహ మాడాలి.
299. మనిషి తల్లికడుపులోవుండగానే అతనిఆయువు, చదవు,ధనం మృత్యువు భగవంతుడురాస్తాడు.
300. ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తివున్నవాడు పుడుతూ, చస్తూ అవి లభించే దాకా జన్మలనెత్తుతాడు. అవి తీరిన వానిని జన్మరాహిత్యంలభిలభిస్తుంది.
301.అల్లర్లూ, దండయాత్రలు, కరువులు, దుష్టుడుతో వెళ్ళవలసిన సందర్భం వచ్చినప్పుడు పారిపోవాలి. లేకపోతే ప్రాణహాని తధ్యం. (సామాన్యులను ఉద్దేసించి చెప్పిన మాటలై ఉండవచ్చు )
302. బాధను కలిగించే కుమారులు వేలమంది ఉండటం కంటే సుఖాన్ని ఇచ్చే ఒక్క కుమారుడు చాలును. (కౌరవులు వందమంది ఉన్నా వారి తండ్రి ధృతరాష్ట్రునికి సుఖం లేదు. శ్రావణ కుమారుడు వంటి చక్కని పుత్రుడి వలన అతని అంధ తల్లిదండ్రులు సుఖించారు )
303. సమర్ధుడికి ఎంత కష్టమైన భాదగా తోచదు.
304. వ్యవసాయానికి భూమి ముఖ్యం తప్ప ప్రదేశం కాదు.
305. మంచిగా మాట్లాడేవారికి శత్రువులు ఉండరు.
306. కులము గురించి వ్యక్తిని, గ్రామం గురించి కులాన్నీ, రాష్ట్రం గురుంచి గ్రామాన్నీ, ఆత్మరక్షణ కోసం ప్రుధ్విని విడిచిపెట్టు.
307. ఇతరులను చంపటంకంటే తాను చావటమే మేలు.
308. చెడ్డ గుణము ఉన్నవానికి మంచి రూపము ఉన్నా వృధా.
309. చెడునడవడిక కలవాని వలన కులమునకు చెడు జరుగును.
310. ఉపయోగపడని విద్య నిష్ఫలము .
311. అనుభవించని ధనం వ్యర్ధమే.
312. అత్యంత పవిత్రములు :-
1. సంతోషంగా ఉండే బ్రాహ్మణుడు
2. ప్రజలమేలుకోరే పాలకుడు
3. పతివ్రత ఐన స్త్రీ
4. నేలను చేరుకున్న నీరు .
313. వీరు నిక్రుష్టులు :-
1. త్రుప్తి లేని బ్రాహ్మణుడు,
2. త్రుప్తిగల పాలకుడు (పాలకునికి త్రుప్తిఉంటె రాజ్యం అభివృద్ధి చెందదు),
3. సిగ్గుగల వ్యభిచారిణి,
4. సిగ్గులేని గృహ స్త్రీ,
314. మూర్ఖుడు చదువుకొని మంచి పండితునిగా మారితే వానిని దేవతలుకూడా పూజిస్తారు.
315. విద్య ద్వారా సాధించలేనిది లేదు. అందువలన మానవుడు చదువుకొనుటకే అధిక ప్రాధాన్యము ఇవ్వవలెను.
316. చెడు పనులు చేస్తూ కలకాలం జీవించటం కంటే ఒక్క మంచి పని చేసి ఒక్క రోజు జీవించినా చాలును.
317. గతం తిరిగిరాదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు. బుద్ధిమంతులు వర్తమానంలోనే జీవిస్తారు.
318. మూర్ఖుడిని రెండుకాళ్ళు ఉన్న జంతువుగా భావించాలి. ఎందుకంటే వాడి మాటలు శూలాలతో గుచ్చినట్టు, కాలులో గుచ్చుకున్న ముల్లులా భాదిస్థాయి. కావున మూర్ఖుడుని విడిచిపెట్టాలి.
319. పాలకులు తమవద్ద సేవకులను ఆదరిస్తే వారు కష్ట, సుఖాలలో వీరిని విడిచిపెట్టరు. (ధనికుడు పేదవానికి ధనం మాత్రమే ఇవ్వగలడు పేదవాడు అవసరమైతే ధనికునికి ప్రాణాలు కూడా ఇవ్వగలడు )
320. ఇతరులకు దానం చేయటం, అధ్యయనం చేయటం ద్వారా జీవితాన్ని సార్ధకం చేసుకో
321. కాలాన్ని వ్యర్ధంగా గడపకు
322. లోపం లేని కులం, రోగం లేని ప్రాణి, ఎల్లప్పుడూ సుఖపడే ప్రాణి ఉండుట అసంభవము.
323. వీరితో స్నేహం నాశనానికి హేతువు :-
1. చెడ్డ అలవాట్లు ఉన్నవాడు 2. వ్యభిచారి 3. చెడ్డ ప్రాంతాలలో నివసించేవాడు.
324. వీరు తమపని పూర్తి అయిన వెంటనే వీరిని విడిచి పెడతారు:-
1.ధనము పూర్తిగా పోగొట్టుకున్న వానిని వేశ్య
2. పండ్లను పూర్తిగా తినివేసిన తరువత చెట్టును పక్షులు,
3. బలహీనుడైన పాలకుని ప్రజలు,
4. భోజనం తిన్న తరువాత అతిధి గృహమును,
5. దక్షిణ స్వీకరించిన తరువాత యజమానిని బ్రాహ్మణుడు,
6. చదువు పూర్తిచేసుకున్నతరువాత గురువును శిష్యుడూ,
7. కాలి పోయిన అడవిని జంతువులు.
325. బిడ్డలను గారాబం చేసి పాడు చేయకండి.
326. బిడ్డలు తప్పు చేస్తే శిక్షిస్తే వారు తాత్కాలికంగా బాధపడిన మంచి గుణవంతులు అవుతారు.
327. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తే వారు పెద్దయ్యాక ప్రయోజకులై అందరి చేత గౌరవింపబడతారు.
328. విధేయుడైన కొడుకు, అనుకూలవతి అయిన భార్య, లభించిన దానితో తృప్తి పడే గుణం, ఉన్నవానికి వేరే స్వర్గం అవసరం లేదు.
329. మానవుడు ఎప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
330. మంచి వానిని వరించిన డబ్బు వాని వద్ద వినయంగా ఉంటుంది.
331. భవిషత్తులో రాబోయే కష్టాలను ఎదుర్కొనే శక్తి, సమయస్పూర్తి గలవాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు.
332. పాలకుడు మంచివాడు అయితే ప్రజలు మంచివాళ్ళే అవుతారు. ఆ పాలకుడే చెడ్డవాడైతే ప్రజలు చెడ్డవారు అవుతారు." యథారాజా తథా ప్రజా "
333. ధర్మాత్ముడు మరణించినా జీవించినట్లే, చెడ్డవాడు జీవించిఉన్నా మరణించినట్లే.
334. కోర్కేలందు మనస్సు కేంద్రీకరించటమే బంధనం. ఆ కోరికలను విదిచిపెట్టడమే ముక్తి. బందనాలకు, ముక్తికి మన మనస్సే కారణం సుమా.
335. అల్ప సంతోషిగా జీవించు.
336. పదివేల గోవుల మధ్య తప్పిపోయిన దూడ తిరిగి తనతల్లి ఆవు వద్దకు ఎట్లు చేరునో, అట్లే కర్మ ఫలానంతరం ప్రతిజీవి భగవంతుని సన్నిధికి చేరును.
337. అస్థిరునికి ఎక్కడా సుఖము ఉండదు. సమాజంలోగానీ, అడవిలోగానీ వానికి మిగిలేది దుఃఖమే.
338. భూమిని లోతుకు తవ్వగా, తవ్వగా నీరు లభిస్తుంది. అలాగే శిష్యుడు గురువును శ్రద్ధతో సేవించి విద్యను సంపాదించాలి.
339. గొప్పవారు చెడ్డవారిని కూడా క్షమించి విడిచిపెడతారు తప్ప, ఏవిధంగానూ భాధించరు.
340. దయార్ద్ర హృదయులు, ఇతరులకు ఉపకారం చేసేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, ఈ భూమిని మోస్తున్న స్థంభాలవంటివారు.
341. విద్య కనిపించని నేత్రం. దానికి మించిన నేత్రం లేదు.
342. త్యాగంలో ఉన్న సుఖం దేనిలోనూ లేదు.
343. కష్టాలలో అధైర్య పడకూడదు.
344. నీ పట్ల తప్పు చేసినవారిని కూడా క్షమించు.
345. కష్టాలలో ఉన్నవారిపట్ల సానుభూతి చూపు.
346. సత్యమార్గంలో పయనించు.
347. బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంభిచు.
348. స్వధర్మ అవలంబవనకై ఎన్ని కష్టాలనైనా సహించు.
349. సర్వ ప్రాణులను దయతో చూడు.
350. ఇంద్రియాలపై అదుపు సపాదించు.
351. చెడ్డ గుణం విడిచి పెట్టు.
352. ఏ ప్రాణికి ద్రోహం చేయకు.
353. ఇతరుల సొమ్మును దొంగిలించటం కన్నా భిక్షాటన చేసి బ్రతకటం మేలు.
354. అబద్దమాడుట కన్నా మౌనంగా ఉండటం మేలు.
355. మూర్ఖునికి ఉపదేశం వృధా.
356. చెడు గుణం గల స్త్రీని పోషించకు.
357. ఎల్లప్పుడు ఏడుస్తూ ఉండేవారితో స్నేహం చేయకు.
358. చల్లని నీరుకన్నా, మంచి గంధంకన్నా, చల్లని నీడకన్నా, మంచి మాట మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. అందువలన మధురభాషణం అలవరచుకో .
359. వీరివలన ప్రాణానికి ముప్పు :-
1. చెడ్డ బుద్ది గల భార్య,
2. ఎదురు జవాబు చెప్పే సేవకుడు,
3. సర్పమున్న గృహము . వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
360. స్త్రీలలో సహజముగా ఉండే చెడు గుణాలు :-
1. అబద్దాలు,
2. గోళ్ళు గిల్లుకోవటం,
3. ఒక్కసారి పనిచేసి విశ్రాంతి తీసుకోవడం,
4. మూర్ఖత్వము,
5. పేరాశ,
6. నిర్భయత్వం,
7. అపవిత్రంగా తిరగడం.
361. స్త్రీ మగవాని కన్నా రెండు రెట్లు ఆహారము, నాలుగు రెట్లు సిగ్గు, ఆరు రెట్లు సాహసం, ఎనిమిది రెట్లు కోరికలు కలిగి ఉండును.
362.పనిచేసే టప్పుడు సేవకుని, కష్టకాలంలో మిత్రుని,దుఃఖ కాలంలో బంధుజనం, దారిద్ర్య కాలంలో భార్య అసలు స్వభావం తెలియును.
363. వీరు స్నేహానికి పనికిరారు:-
1. సిగ్గు లేనివాడు,
2. భయము లేనివాడు,
3. రోజు గడుపుకోలేనివాడు,
4. ఇతరులపట్ల దయలేనివాడు,
5. త్యాగము లేనివాడు.
364. ఈ ప్రదేశాలలో నివసిచవద్దు :-
1. వేద పండితులైన బ్రాహ్మణులు లని చోటు (పూర్వము చదువంటే వేదమే. వేదము అంటే జ్ఞానము అని అర్ధము. ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించే వారు బ్రాహ్మణులు అందుకే వారు లేని చోట నివసించ కూడదు),
2. డబ్బున్న షావుకారు లేని చోటు,
3. వీరులైన పాలకులు లేనిచోటు,
4. నదులు లేని చోటు (నాగరికత నదీతీరలలోనే జరుగుతుంది. త్రాగటానికి, ఆహారోత్పత్తి కి నదులు అవసరం. అందుకే నీటికి దగ్గరగా ఉండాలని మన పూర్వులు చెప్పారు.),
5. వైద్యులు లేనిచోట (వైద్యులు లేక పోతే రోగాలను ఎవరు నయం చేస్తారు. అందుకే "వైద్యో నారాయణో హరి" అన్నారు.)
365. వివాహం జరిగిన వారికి చదువు రావటం కష్టం.
366. మాంసం తినే వారికి దయ ఉండదు.
367. పిసినారి నిజం చెప్పడు.
368. కామంధునికి పవిత్ర భావం కలగదు.
369. మానవునికి సహజ సిద్దంగా వచ్చేవి :-
1. దానగుణం,
2. మధుర వాక్కు,
3. ధైర్యం,
4. సమయస్పూర్తి
370. గ్రుడ్డి వానికి అద్దం చూపటం వల్ల ఎట్లు ఉపయోగం ఉండదో, బుద్దిలేనివానికి శాస్త్రం ఉపదేసించినా అంతే.
371. లోభికి ముష్టివాడు, చెడునడత గల స్త్రీకి భర్త, దొంగకి చందమామ శత్రువులు.
372. కాకి తినని వస్తువు ఉండదు.
373. మద్యం త్రాగిన వాడు ఏదైనా వాగుతాడు.
374. స్త్రీకి సాధ్యము కాని పని ఉండదు.
375. కవి చూడలేని వస్తువే ఉండదు. (ప్రపంచాన్నంతా తన దృష్టిలో ఉహించుకునే బుద్ధిశాలి కవి )
376. సుఖం కోరుకునే వానికి చదువు రాదు.
377. చదువు కావాలనుకునే వారికి సుఖాలు అవసరం లేదు.
378. వడబోసిన నీటినే త్రాగుము.
378. చదువు లేనివాడు సర్వహీనుడు.
379. వీరిని ఎట్టి పరిస్థితులలోను నిద్ర లేపకండి:-
1. పాము (కాటేస్తుంది ),
2. పాలకుడు (అధికారంతో శిక్షించ వచ్చు ),
3. సింహము (చంపుతుంది ),
4. చిన్నపిల్లలు (ఏడుస్తారు),
5. ఇతరుల కుక్క (కరుస్తుంది),
6.మూర్ఖులు (కొట్టవచ్చు , తిట్టవచ్చు).
380. వీరిని ఎప్పుడైనా నిద్రనుండి లేపవచ్చు :-
1. సేవకుడు,
2. విద్యార్ధి,
3. అన్నార్తుడు,
4. బాటసారి,
5. ద్వారపాలకుడు,
6. భయస్తుడు,
7. కోశాధికారి.
381. మిత్రభేదం కలిగించేవాడు సర్వనాశనమగుట తధ్యం.
382. పిల్లలను 5సంవత్సరముల వరకు బుజ్జగించాలి, 10సంవత్సరముల వరకు దండించాలి, 16సంవత్సరముల తరువాత స్నేహితులుగా మెలగాలి.
383. అతి ఎప్పుడు అనర్ధాన్నే తెస్తుంది. (అతి సౌందర్యం వల్ల సీతాదేవి అపహరించ బడినది, అతి గర్వం వల్ల రావణుడు అంతమైనాడు, అతిధానం వల్ల బలి పాతాళానికి అణగద్రోక్కబడినాడు )
384. ఉద్యోగము వలన ఆర్ధిక బాధలు తోలగుతాయి.
385. భగవన్నామ స్మరణ వలన పాపాలు నశిస్తాయి.
386. మౌనం వహిస్తే అసలు గొడవలే రావు.
387. జాగ్రత్తగా ఉంటే భయమే ఉండదు.
388. కోకిలకు అందము దాని గొంతే.
389. కురూపికి అందం అతని చదువే.
390. మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ, మంచి నడవడిక కలిగినప్పటికీ, మంచి సౌందర్యం ఉన్నప్పటికీ, చదువు లేనివాడు వాసన లేని పువ్వుగానే పరిగణింప బడతాడు.
391. చెడ్డవాడు పాముకన్నా ప్రమాదకారి. (పాము దానికి ఇబ్బంది కలినప్పుడే కాటేస్తుంది, చెడ్డవాడు ప్రతిక్షణం బాధిస్తూనే ఉంటాడు )
392. ముఖస్తుతి మాటలు మాట్లాడేవారిని దూరంగా ఉంచు.
393. తండ్రి మీద భక్తి భావము కలవాడే కొడుకు.
394. సంతానమును మంచి మార్గములో పెంచువాడు మాత్రమే తండ్రి.
395. మన మీద నమ్మకమున్నవాడే స్నేహితుడు.
396. భర్త మనస్సుకు ఆనందం కలిగించేట్టు ప్రవర్తించేదే భార్య.
397. నదులకు, ఆయుధాలకు, క్రూరజంతువులకు సమీపములో ఉండకండి.
398. రూపవతి ఐన చెడు హృదయం గల స్త్రీ కన్నా, కురూపి ఐన గుణవంతురాలైన స్త్రీనే వివాహమాడు.
399. వివాహమనేది స్వకులం లోనే జరగాలి. అప్పుడే వారు సుఖ, సంతోషాలతో జీవితం గడుపుతారు. (ఇది ముమ్మాటికి నిజం చాలా మంది దీనిని ఖండించినా నేడు కులాంతర వివాహాలు విఫలం అవుతున్నాయి. వీరిని బంధువులు చేరదీయరు, సంఘంలో కూడా వెనక అవహేళ్ళనగా మాట్లాడుతారు )
400. నీ రహస్యములను నీలోనే దాచుకో మంచివారైనా, చెడ్డవారైనా ఎవరితోనూ చెప్పకు నేడు మంచిగా ఉన్నవారే చెడుగా మారే అవకాశం ఉన్నది.
400. భర్త మనస్సుకు ఆనందం కలిగించేట్టు ప్రవర్తించేదే భార్య.
401. నదులకు, ఆయుధదారులకు, క్రూరజంతువులకు సమీపములో వుండకండి.
402. రూపవతి యైన చెడు హృదయం గల స్త్రీ కన్నా, కురూపియైన గుణవతి యైన స్త్రీనే వివాహమాడు.
403. వివాహమనేది స్వకులంలోనే జరగాలి. అప్పుడే వారు సుఖసంతోషాలతో జీవితం గడుపుతారు.
404. నీ రహస్యములను నీలో దాచుకో . మంచివరైనా, చెడ్డవారైనా ఎవరితోనూ చెప్పకు. మంచి వారు రేపు శత్రువులుగా మారకపోవచ్చునన్న హామీ జీవితానికి లేదు కాబట్టి నీ రహస్యాన్ని నీ గుండెల్లో దాచుకో.
405. మీ సంతానాన్ని చదివించకపోతే మీ సంతానం భవిష్యత్తులో మిమ్మిల్ని శత్రువులుగా చూస్తారు.
406.హంసల మధ్య కొంగవలె చదువురానివాడు చదువుకున్న వారి మధ్య వెలితిగా కనిపిస్తాడు.
407. కష్టకాలంలో ధనమును, ధనము కంటే భార్యనూ, ధనమూ-భార్యకన్నా ముందు తన్ను తాను రక్షించుకోవాలి.
408. మనకు విలువలేని చోట,చుట్టాలు,స్నేహితులు లేని చోట,చదువురాని చోట వుండకండి.
409. స్వ్తంత్ర్యముగా జీవించడం నేర్చుకోండి.
410. వీరికి ఇవి బలము.
1. బ్రాహ్మణునికి చదువు . 2. రాజుకు సైన్యము .
3. వైశ్యులకు ద్రవ్యము. 4. శూద్రులకు ద్విజాతి సేవ.
411. ప్రతీ మానవుడూ తప్పక చేయవలసినవి.
1. కుమార్తెకు చక్కని వరుని చూసి వివాహము చేయుట.
2. కుమారునికి మంచిగా చదివించడం.
3. శత్రువులకు కష్టము కల్గించుట.
4. మిత్రుడు ధర్మమార్గములో నుండునట్లు చూచుట.
412. నేరములు వాటికి తగు శిక్షలు ;-
1. నేరము : చెరువు గట్లు తెంపుట
శిక్ష :చెరువులో ముంచి చంపుట
2. నేరము : తల్లి, తండ్రి, కుమారుడు, సోదరుడు, గురువు, తపశ్శాలి మొదలగువారిని తిట్టుట
శిక్ష : నాలుక కోసివేయుట
3. నేరము : ఇతరులకు అంగబాధ కలిగించుట
శిక్ష :అంగాన్ని నరికివేయుట
4. నేరము : బలవంతముగా పురుషులను, స్త్రీలను కొట్టుట, చంపుతామని బెదిరించుట. దారిలో అడ్డగించి రాజుయొక్క ఏనుగును, గుర్రాన్ని చంపుట లేదా దొంగిలించుట
శిక్ష : ఆయుధాలతో శూలము నెక్కించి పొడిచి చంపుట
5.నేరము : శత్రువులకు సహాయం, సైనిక తిరుగుబాటులకు ప్రోత్సాహం.
శిక్ష :చేతులు, శిరస్సు కాల్చి చంపుట.
6. నేరము : తల్లి, తండ్రి, గురువు, తపస్వి, కొడుకు, సోదరులను చంపుట.
శిక్ష :తలమీద చర్మం వొలిచి తలకు నిప్పు అంటించి చంపుట.
7. నేరము : చెడు పనులు చేసేవారికి సహాయం, ప్రోత్సాహం.
శిక్ష : ఉత్తమ సాహస దండన.
8. నేరము : చేడుపనులు చేసేవారికి తెలియక సహాయం చేయుట.
శిక్ష : హెచ్చరించి వదిలి వేయుట.
9. నేరము : స్వయంగా కన్యత్వాన్ని పోగొట్టుకున్న స్త్రీ.
శిక్ష : రాజ దాసిగా చేయుట
10. నేరము : కుటుంబ సభ్యులను గాని, గురువులను గాని హత్య చేసిన స్త్రీ మరియు ఇంటిని తగులబెట్టిన, విష ప్రయోగము చేసిన, తలుపులు పగుల గొట్టి ఇంటిలోకి ప్రవేశించిన స్త్రీ ని.
శిక్ష : ఎద్దులతో తొక్కించి చంపుట
11. నేరము : పాలకనింద, ప్రభుత్వ రహస్యాలు బయటకు వెల్లడించుట, రాజద్వేషి, బ్రాహ్మణ గృహములో వంట పదార్దాలను రుచిచూచుట.
శిక్ష : సమూలముగా నాలుక ఖండన.
12. నేరము : ఆయుధాగారములో దొంగతనము
శిక్ష : 1. సైనికుడైతే ఉత్తమ సహసదండము 2. సైనికుడు కాక పోతే మరణ శిక్ష.
13. నేరము : రజస్వల కానీ స్త్రీని బలాత్కారం చేయుట.
శిక్ష : చేతులు నరికి వేయుట లేదా 400 పణాల జరిమానా.
14. నేరము : రజస్వల కానీ స్త్రీని బలాత్కారించినపుడు ఆమె మరణిస్తే.
శిక్ష : ఉరిశిక్ష.
15. నేరము : రాజస్వలైన స్త్రీని బలాత్కారం చేస్తే.
శిక్ష : మధ్య వేలు, చూపుడు వేలు ఖండించటం లేదా 200 పణాల జరిమానా.
16. నేరము : చూపుల్లో ఒక అమ్మాయిని చూపించి, పెళ్లి మరో అమ్మాయికి చేస్తే.
శిక్ష : 100 పణాల జరిమానా.
17. నేరము : శోభనం రోజుకు పెండ్లి కుమార్తె శీలవతీ కాదని రుజువు అయితే.
శిక్ష : 54 పణాల జరిమానా, శుల్కము, ఖర్చులను మగ పెళ్లి వారికి తిరిగి ఇవ్వాలి.
18. నేరము : వేశ్యా బలత్కారము.
శిక్ష : 12 పణాల జరిమానా.
19. నేరము : అధికారులు 10 పణాలు విలువ చేసే వస్తువులు దొంగిలించుట.
శిక్ష : మరణ దండన.
413. రాజు పొరపాటున నిర్దోషిని శిక్షించినట్లయితే ఆ జరిమానాకు ముప్పై రెట్లు ద్రవ్యాన్ని వరునదేవుణ్ణి ఉద్దేశించి నీటిలో వేసి మరలా దానిని తీసి బ్రాహ్మణులకు పంచిపెడితే రాజు తెలియక జేసిన ఆ పాపానికి పరిహారమవుతుంది.
414. స్త్రీ పురుషులకు వేరు వేరు చెరసాలలు ఉండాలి.
415. జైలులో పరిశుభ్రతతో పాటు గాలి,వెలుతురు వుండాలి.
416. జైలుకు అగ్నిప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
417. ఖైదీలు ప్రార్ధించు కొనేందుకు వీలుగా దేవతా పటములుండాలి.
418. ఖైదీలకు విషపు పాముల బెడద లేకుండా పిల్లులు, ముంగిసలను పెంచాలి.
419. రాజు ఇతర ప్రాంతములను జయించినప్పుడు, యువరాజు పట్టాభిషేకము సమయాల్లోనూ, పుత్రసంతానంకలిగినసందర్భాలలోఖైదీలనువదిలి పెట్టాలి.
420. నమస్కరంచేయడంద్వారా శత్రువులు బ్రాహ్మణసైనికులను వశపరచుకునే ప్రమాదముంది.
421. సెలవు రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో సైనికులు అప్రమత్తత కోసం తప్పనిసరిగా కవాతు చేయాలి.
422. పాలకులు తరుచూ సైనికుల కవాతుల్ని పరీక్షిస్తుండాలి.
423. ఆయుధాల విషయంలో స్వయం పోషకంగానే వుండాలి.
424. . ఆయుధాలను ఎండా,గాలి తగలకుండా ఒక స్థలం నుండి వేరొక స్థలానికి మారుస్తూ వుండటం మంచిది.
425. ఆయుధాగారంలో వుండే అన్ని ఆయుధాలకూ, రాజముద్ర వేయాలి.
426. యుద్ధంలో రాజు సైన్యాన్ని ఈ విధంగా నడిపించాలి.
1. యుద్దానికి మానసికంగా సిద్దమైతే సగం విజయం సాధించినట్లే.
2. యుద్ధం ప్రారభించే ముందు పాలకులు దైవ పూజలు చేసినపిమ్మట సైన్యాన్ని సమావేశపరచి యుద్ధం జరిగే స్థలము, యుద్ధ ప్రారంభ సమయం తెలియపరచాలి.
3. రాజ్యం అందరు కలసి అనుభవించ వలసినదని, తాను జీతం తీసుకునే ఉద్యోగినేనని, నా విన్నపం మన్నించి మీరందరూ శత్రువుతో యుద్ధం చేయండని కోరాలి. (రాజంతటి వాడు తమను కోరే సరికి సైనికుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది)
4. మంత్రులు, పురోహితులు, జ్యోతీష్యులూ సైన్న్యాన్ని ఉత్సాహ పరచాలి.
5. వేగులు యుద్ధానికి అనుకూల వాతావరణం కల్పించాలి.
6. శత్రువర్గాలను రకరకాలుగా భయపెట్టాలి.
7. దేశం కోసం పోరాడే వారు స్వర్గానికి పోతారు. పోరాడనివారు నరకానికి పోతారు అనే భావాన్ని సైనికులలో పెంపొందించాలి.
8. శత్రురాజులను, ఇతర దళాల అధిపతులను చంపినవారికి బహుమతులు ప్రకటించాలి.
9. యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స చేసేందుకు వైద్యులను సిద్ధంగా ఉంచాలి.
10. సైనికులను ఉత్సాహం కలిగించేందుకు ఆహారపానియలతో స్త్రీలు అందుబాటులో ఉండాలి
11. దక్షిణ ముఖం కాకుండా సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. సూర్యుడు కంటిలో పడకుండా, గాలి అనుకూలంగా ఉండేటట్లు చూసుకుని యుద్ధ తంత్రాలు పన్నాలి.
427. రాజ్యం చిన్నదైనా తెలివైన పాలకుడు సమయానుకూలంగా రాజనీతి ఉపయోగించుట ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు.
428. క్రమశిక్షణ పాటించటం ద్వారానే అన్నిపనులు విజయంతంగా పూర్తి చేయవచ్చు.
429. వేగుల ద్వారా శత్రురాజ్యాల సమాచారము ఎప్పటికప్పుడు పాలకులు సేకరిస్తూ ఉండాలి.
430. తనకు సలహా ఇచ్చే వారికి రహస్య విషయాలు తెలియకూడదు. లేకపోతే సలహాదారుల ద్వారా రాజ్యవిషయాలను శత్రువులు సేకరించే ప్రమాదముంది.
431. శత్రువుని తనకాళ్ళ వద్దకు వచ్చేటట్లు చేసుకోవాలి.
432. సహాయం చేసేవారిని సన్మానాల ద్వారా ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.
433. మిత్రుణ్ణి శత్రువు ద్వారా, శత్రువుని మిత్రుడు ద్వారా వశపరుచుకోవాలి.
434. శత్రురాజ్యంలో ప్రవేశించి గూడచారుల ద్వారా శత్రుదేశంలోని ప్రముఖులను, ప్రజలను, కొండజాతి వారిని పలకునిపై వ్యతిరేకత కల్పించటం.
435. శత్రురాజును బలహీనపరచు, కానీ శత్రురాజ్యంలోని ప్రజలకు అపకారం చేయకు.
436. పాలకులు శక్తిని, సంతోషాన్ని పెంచుకోవాలి.
437. శత్రువు కంటే బలహీనంగా ఉంటే సంధి చేసుకొండి.
438. మన శత్రువు కంటే మనం బలంగా ఉన్నప్పుడు విరోధం వహించండి.
439. యుద్ధం వల్ల ధన, ప్రాణ నష్టాలు అయిన వారికి దూరంగా ఉండటమే కాకుండా అనేక ఇబ్బందులున్నాయి.
440. యుద్దానికి వెళ్ళేటప్పుడు కొద్దిరోజులకు సరిపడు ఆహార సామాగ్రి, సైనికులకు రోగాలు, గాయాలు తగిలనప్పుడు వారికి వైద్యం చేయటానికి వైద్యులను కూడా తీసుకువెళ్ళాలి.
441. యుద్ధంలో అన్ని పద్దతులూ పాటించండి.
442. వీరితో యుద్ధం చేయకూడదు :- 1. యుద్దంలో క్రింద పడిన వారితో 2. లొంగిపోయిన వారితో 3. ఆయుధాలు అప్పగించిన వారితో 4. యుద్ధంలో పాల్గొనని వారితో
443. శత్రుదేశాన్ని జయించిన తరువాత పాలకులు అనుసరించవలసినవి:-
1. శత్రురాజులోని లోపాలు తెలుసుకొని తాను చేయకుండా చూసుకోవాలి.
2. ధర్మ కార్యాలు చేస్తూ, ప్రజలకు ఇష్టమైన పనులు చేయాలి.
3. దానధర్మాలు చేస్తూ ప్రజలను గౌరవించాలి.
4. శత్రువు తరపున తన వర్గానికి మారిన వారికి తగిన మేలు చేయాలి.
5. కష్టపడి పనిచేసేవారికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలి.
6. ప్రజలకు చేసిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలు పరచాలి.
7. తాను జయించిన ప్రాంతాల ప్రజల ఆచార,వ్యవహారాలను తను అనుసరించటం ద్వారా ప్రజలు పాలకుని తమ వాడిగానే భావిస్తారు.
8. యుద్ధంలో దొరికిన ఖైదీలను హింసించరాదు.
9. యుద్దవిజయంతో విర్రవీగి జయించిన దేశంలోని ప్రజలతో ఇష్టంవచ్చినట్లుగా వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదు.
444. భారీ సైన్యాన్ని చూసి శత్రువు భయపడతాడనే అభిప్రాయం ఉన్నప్పుడు భారీ సైన్యాన్ని కదనరంగానికి తరలించాలి.
445. ఏ సమయంలో ఏ విధానాన్ని అవలంభించాలో అవలంభించి రాజ్యానికి పాలకులు మేలు చేయాలి.
446. దూత అనేవాడు పాలకుడు అప్పగించిన పనిని చక్కబెట్టేవాడుగా ఉండాలి.
447. పాలకుడు అప్పగించిన పనిని పూర్తి చేయలేకపోతే దూత వెంటనే సొంత రాజ్యానికి వచ్చేయాలి.
448. శత్రు రాజ్యంలో తనకు గౌరవం ఇవ్వక పోయినా దూత పట్టించుకోకూడదు.
449. శత్రు రాజ్య స్థితిగతులను చాకచక్యంగా పసిగట్టాలి.
450. త్రగుడుకు, స్త్రీ కి లోబడరాదు.(శత్రురాజులు దూతపై ప్రయోగించేవి ఇవే. మహాభారతంలో పాండవుల మేనమామ శల్యుని కౌరవులు ఈబలహీనతలతోనే తమ వైపు తిప్పుకున్నారు )
451. ప్రభువిచ్చిన సందేశాన్ని దూత యధాతధంగా శత్రు రాజుకు తెలియజేయాలి.
452. ఎటువంటి ప్రలోభాలకు దూత లొంగకూడదు.
453. పరిసరాలను జాగ్రతగా గమనిస్తూ ప్రజలతో మంచిగా వ్యవహరిస్తూ ఆ రాజ్యవిషయాలను సేకరించాలి.
454. పిచ్చివారు, త్రాగుబోతులు,యాచకులు, నిద్రిస్తున్న వారు నిద్రలో మాట్లాడే మాటల ద్వారా ఆ రాజ్య రహస్యాలను దూత సేకరించాలి.
455. దేవాలయాల్లోని శాసనాలు, బొమ్మలు, సంజ్ఞలు ద్వారా దేశ సమాచారాన్ని దూత జాగ్రతగా పసిగట్టాలి.
456. దూత నిద్రలో రహస్యాలను వెల్లడించే అవకాశముంటుంది. కావునా దూత ఒంటరిగా నిద్రించాలి.
457. శత్రుపాలకుని నుండి తన ప్రాణానికి ముప్పు ఉంటుందన్న సంశయం కలిగినప్పుడు అతని అనుమతి ఉన్నా లేకున్నా దూత అక్కడనుంచి తెలివిగా నిష్క్రమించాలి. లేకపోతే ప్రాణానికి ముప్పుగాని, చెరసాలకు గాని గురయ్యే అవకాశముంది.
458. దూత చేయవలసిన పనులు:-
1. పాలకునికి తాజా సమాచారం అందించటం.
2. సంధి షరతులను జాగ్రతగా పాటించటం.
3. తన పాలకునుకి స్నేహితులను సంపాదించుట.
4. శత్రువుల యొక్క స్నేహితులలో వైరాలు కల్పించటం.
5. శత్రు పాలకుల అధికారులను వారి బలహీనతలను తెలుసుకుని లోబరుచుకొని రహస్యాలను సేకరించటం.
6. శత్రువుల చుట్టాలను, రత్నాలను అపహరించుట.
7. హామీగా ఉంచుకున్నవారిని తప్పించేలా చేయుట. మొదలైన కార్యకలాపాలను దూత కడు జాగ్రతగా నిర్వహించాలి.
459. దూత ఎంత నీచంగా వ్యవహరించినా ఎట్టి పరిస్థితులలోను చంపరాదు.
460. రాజనీతిలో సామ, దాన, బేద, దండాలు పాలకులు సమయానుసారంగా అనుసరించాలి.
461. దూత శత్రు దేశంలో కూడా ఇష్టానుసారం తిరగవచ్చు.
462. ఓడరేవుల వద్ద సుంకము దూత చెల్లించనవసరం లేదు.
463. ఆ దేశంలో కొనుగోలు చేసిన వస్తువులను తమ దేశానికి తెచ్చుకునేటప్పుడు కూడా దూత సుంకం చెల్లించనవసరం లేదు.
464. పాలకులు, కొడుకు, సోదరుడు, బంధువుల వల్ల వచ్చే ఇబ్బందులను దాన ,బేధములను ఉపయోగించుట ద్వారా పరిష్కరించుకొనుట పాలకుల విధి.
465. సామంత పాలకులు, ఆటవిక జాతులతో వచ్చే ఇబ్బందులను బేధ, దండోపాయాల ద్వారా పాలకులు పరిష్కరించుకోవాలి.
466. శత్రుదేశపు రాజు యొక్క మిత్రులను వారి బలహీనతలను తెలుసుకొని వాటిని ఎరవేసి మన వైపుకు త్రిప్పుకోవాలి.
467. మంత్ర, తంత్రాలను ప్రయోగించారనే భయం శత్రురాజులో కలిగించాలి.
468. శత్రురాజు యొక్క మంత్రులను, సేనానులను, రాజ్యకాంక్ష గల శత్రురాజు కుమారులను అన్ని రకాల ప్రలోభాల ద్వారా తమ వైపుకు త్రిప్పుకునేలాగా పాలకులు ప్రయత్నాలను చేయాలి.
469. తన రాజ్యాన్ని ఎప్పటికప్పుడు పటిష్టం చేసుకుంటూ, పొరుగు రాజ్యాలనుండి ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనటానికి పాలకులు సదా సిద్ధంగా ఉండాలి.
470. రాజ్యం ఉనికికి ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి నీతి సూత్రాలను పాటించనక్కరలేదు. ఏ పద్ధతిలోనైన రాజ్యాన్ని పాలకుడు రక్షించుకోవాలి.
471. దేశ రక్షణకు, స్వేచ్ఛకు హాని కలిగినప్పుడు నీతిబాహ్యమైన చర్యలను చేపట్టయిన రాజ్యాన్ని పాలకులు రక్షించాలి.
472. రాజ్యాన్ని రక్షించుటయే పాలకుని ప్రధాన విధి.
473. రాజకీయాలకు, మతానికి సంబంధం ఉండరాదు.
474. పనికి తగిన వేతనం యివ్వాలి.
475. ప్రజలకు ఆర్ధిక, సామజిక హక్కులుండాలి.
476. సెలవు దినాలలో పని చేసినందుకు ప్రత్యేక జీతము యివ్వాలి.
477. యుద్ధములో ధర్మమార్గములోనే విజయాన్ని సాధించాలి.
478. ప్రభుత్వ కోశాగారము ఎప్పుడు నిండుగా ఉండాలి.
479. ఆర్ధికాంశాల మీద ప్రభుత్వానికి పట్టు ఉండాలి.
480. గనులు, గనుల త్రవ్వకం, పరిశ్రమలు ప్రభుత్వాధీనంలో ఉండాలి.
481. ప్రభుత్వోద్యోగులకు భద్రతా సౌకర్యాలు ఉండాలి.
482. పౌరులకు ప్రజలనుండి, పాలకులనుండి ఇబ్బందులు లేకుండా కొన్ని హక్కులుండాలి.
483. నిష్పక్షపాతంగా, సమర్ధవంతంగా పాలనను అందించేందుకు ప్రతిభ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయాలి.
484. ఎంత గొప్ప అధికారైన తప్పుచేస్తే శిక్ష కఠినంగా ఉండాలి.
485. రాజశాసనానికి తిరుగులేదు.
486. నిమ్న వర్ణాల వారిని గౌరవించాలి.
487. ప్రక్క దేశంవాడెప్పుడు శత్రువే. (ఎంత దూర దృష్టితో చెప్పాడు చాణిక్యుడు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనం స్నేహ హస్తం అందిస్తున్నా ద్రోహనికే పూనుకుంటున్నాయి )
488. ప్రక్కదేశాలు మరీ శక్తివంతం కాకుండా, మరీ బలహీనం కాకుండా చూసుకోవాలి.