Pages

Saturday, August 4, 2012

ఆవు-పులి కథ

ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది, అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది, ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవుచూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది, ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు..నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది.

ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది, ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా, చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా ననుకున్నావా. అయ్యో!  పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు, నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను, నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా నన్ను నమ్ము.

పులి ఆవుమాటలకు నవ్వి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది.అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, బిడ్డా ఇదే నా ఆఖరిచూపు, మంచి దానిగా మసులుకో, బుద్దిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు, సత్యాన్నే పలుకు అది నీకు మేలు చేస్తుంది, అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్దులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది.

అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి, దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది, ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది, అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది, తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంత గొప్పది, ఇలాంటి సత్యవచణురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది.ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల నువ్వు ఎంత సత్యవచణురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది, నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది.ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది.

పేదరాశి పెద్దమ్మ కధ

సింహళ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య తలపై ఒక వెంట్రుక, రెండో భార్య తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రాజుగారి రెండో భార్య.. "మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.

మొదటి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి "మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు "మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి "మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని" చెప్పాయి. 

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.

ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చిన పెద్ద భార్య... "నాకు బోలెడన్ని వెంట్రుకలు ఉన్నాయి, మీ రెండో భార్యకు రెండే వెంట్రుకలు ఉన్నాయి. కాబట్టి ఆమెని ఇంట్లోంచి తరిమేయండని" అడిగింది. వెంటనే రాజు రెండో భార్యను తరిమేశాడు.

అలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.
అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి .


అలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి .


అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి .


తోక తెగిన నక్క


అదొక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఓసారి అది, జంతువులను పట్టుకోటానికి వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకుంది. దాన్నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించింది. చివరకు తప్పించుకుంది. కానీ ఆ ప్రయత్నంలో అనుకోకుండా దాని తోక తెగిపోయింది. దాంతో ఎక్కడలేని దిగులూ నక్కకు పట్టుకుంది.

‘‘అయ్యో, నా తోక తెగిపోయిందే. ఇప్పుడెలా! తోక లేని నన్ను చూసి అడవిలోని మిగిలిన నక్కలన్నీ గేలి చేస్తాయేమో’’ అంటూ బెంగపడింది. ఆ అవమానాలు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం మొదలెట్టింది. అప్పుడు దానికో ఉపాయం తట్టింది. వెంటనే మిగిలిన నక్కలన్నిటినీ పిలిచి, ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అన్నీ వచ్చాక ఇలా అంది.

‘‘చూడండి మిత్రులారా! ఇవాళ నేనో కొత్త విషయం తెలుసుకున్నాను. అది మీ అందరికీ చెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మనం మామూలుగానే అందంగా ఉంటాం. కానీ మన తోకలు కత్తిరించుకుంటే ఇంకా అందంగా ఉంటాం. అయినా తోక వల్ల మనకు పెద్ద ఉపయోగమేమీ లేదు సరికదా అదో బరువు కూడా. అందుకే మీరందరూ కూడా నాలా తోకలు కత్తిరించుకుంటే మరింత సుందరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఓసారి ఆలోచించండి’’ అంది.

అక్కడున్న నక్కల్లో ఒకదానికి విషయం అర్థమయ్యింది. ‘‘మిత్రమా! నువ్వు తోకను అందం కోసం కత్తిరించుకోలేదని, అది ప్రమాదంలో తెగిపోయిందని నాకు తెలుసు. అయినా నీ తోక తెగిపోకుండా ఉంటే, నువ్విలాగే చెప్పేదానివా’’ అని అడిగింది.తన పథకం వారికి తెలిసిపోవడంతో నక్క మారు మాట్లాడలేకపోయింది. అతి తెలివికి పోతే మనమే బోల్తా పడతామని తెలుసుకుని, మెల్లగా అక్కడ్నుంచి జారుకుంది.

రాజకుమారుడు


మాళవరాజుకు పురుషోత్తముడనే కొడుకు ఉండేవాడు. పురుషోత్తముడు ఏమాత్రం చురుకుదనం లేకుండా అమాయకంగా, నెమ్మదిగా ఉండేవాడు. రాజకుమారుడు అలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతాడో ఏమోనని రాజుగారికి దిగులు పట్టుకుంది. దాంతో దేశంలోని గొప్ప గొప్ప పండితులను పిలిపించి, తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు.

పండితులు రాజుగారి ఆజ్ఞను శిరసావహించి పురుషోత్తముడిని తమతోపాటు తీసుకెళ్లారు. ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన ఆ పండితులు రాజకుమారుడికి తగిన విద్యాబుద్ధులు నేర్పించి తిరిగీ తండ్రివద్దకు తీసుకొచ్చారు. "మహారాజా..! మీ సుపుత్రుడికి తమకు తెలిసిన విద్యలన్నింటినీ నేర్పించామనీ, కావాలంటే తమరోసారి పరీక్షించి చూడండని" అన్నాడు పండితులు.

దీంతో రాజుగారు తన కుమారుడికి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు రాజకుమారుడు. అదంతా స్వయంగా చూసిన రాజుగారు సంతోషించి పండితులను బాగా సత్కరించి పంపించారు. అయితే వృద్ధుడయిన ఒక మంత్రి రాజుగారి వద్దకు వచ్చి.. "మహారాజా..! యువరాజుగారు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని" సూచించాడు.

అవును నిజమే కదా..! అని మనసులోనే అనుకున్న రాజుగారు.. "సరే.. ఆ విద్య తెలిసిన ఓ పండితుడి గురించి మీరే చెప్పండని" మంత్రిని అడిగాడు. "మహారాజా..! ఈ భవిష్యత్ జ్ఞానం అనేది పండితుల నుంచి నేర్చుకునేది కాదు గానీ, లోకజ్ఞానం తెల్సిన వివేకవంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయం" అని చెప్పాడు మంత్రి.


తనకు మాధవుడు అనే ఓ సామాన్య వ్యక్తి తెలుసనీ.. అతడయితే మన రాజకుమారుడికి తగిన వివేకాన్ని, విచక్షణను నేర్పగల సమర్థత కలిగినవాడని చెప్పాడు మంత్రి. వెంటనే రాజుగారు మాధవుడిని పిలిపించి తన కుమారుడికి జ్ఞానాన్ని బోధించమని చెప్పగా.. మాధవుడు సరేనని రాజకుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు.

మూడు నెలల తరువాత రాజకుమారుడిని తండ్రి వద్దకు తీసుకొచ్చిన మాధవుడు.. తనకు తెలిసిన జ్ఞానాన్నంతా మీ సుపుత్రుడికి నేర్పానని చెప్పాడు. దాంతో మంచి వివేకి అయిన తన వృద్ధ మంత్రిని పిలిపించి మీరే రాకుమారుడిని పరీక్షించండని అన్నాడు. వృద్ధమంత్రి లోపలి గదిలోకి వెళ్లి గుప్పిట్లో ఏదో పట్టుకొచ్చి నా గుప్పెట్లో ఏముందో చెప్పండి యువరాజా అని అడిగాడు.

పురుషోత్తముడు ఏ మాత్రం తడుముకోకుండా "ఉంగరం" అని చెప్పాడు. దాంతో రాజుగారితోపాటు, సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వృద్ధ మంత్రి కూడా ఆశ్చర్యానికి గురై నోట మాట రాకపోగా.. "సమాధానం ఎలా చెప్పగలిగారు యువరాజా..?" అని ప్రశ్నించాడు.

"ఏమీలేదు మంత్రివర్యా...! మిమ్మల్ని మా తండ్రిగారు పిల్చినప్పుడు మీ వేలికి ఉంగరం ఉంది. మీరు గదిలోకి వెళ్లి వచ్చిన తరువాత ఉంగరం మీ వేలికి లేదుకదా..!" అన్నాడు. దీనికి సంతోషించిన మంత్రి.. "మహారాజా..! పరిశీలన ఉంటే, భవిష్యత్తును పసిగట్టే జ్ఞానం వస్తుంది. ఆ నేర్పు యువరాజా వారికి ఇప్పుడు సంపూర్ణంగా ఉంద"ని అన్నాడు.

తన కుమారుడు విద్యతోపాటు వివేకం పొందినందుకు ఎంతగానో సంతోషించిన మహారాజావారు.. వృద్ధ మంత్రితోపాటు, తన కుమారుడికి విచక్షణా జ్ఞానాన్ని నేర్పించిన మాధవుడికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి, సత్కరించారు. ఇక ఆరోజు నుంచి భవిష్యత్తుపై బెంగలేకుండా మహారాజు సంతోషంగా గడపసాగాడు.
  

నీలిరంగు నక్క

అనగనగా ఒక నక్క. ఆహారం కోసం వెతుకుతూ అది అడవిని దాటింది. నగరంలోకి వచ్చి పడింది. నెమ్మదిగా నేత పనివాళ్ల వాడకు వెళ్లింది. దాహం వేయడంతో నీళ్ల పీపా అనుకుని నీలిమందు కలిపిన ఓ పీపాలోకి దూకింది. దాంతో అది నీలినక్కగా మారిపోయింది. ఎలాగో మళ్లీ అడవిలోకి చేరుకుంది. 


తీరా అది అడవిలోకి వెళ్లేసరికి జంతువులు దాన్ని గుర్తించలేక పోయాయి. నీలిరంగులో వుండే సరికి ఇదేదో కొత్త జంతువనే అనుకున్నాయి. ఆ జిత్తుల మారి నక్క తన రంగుతో లాభం పొందాలనుకుంది. అన్ని జంతువులను చేరబిలిచి, ‘‘నేను మీ కొత్త రాజును. నాకు రోజూ మీరే ఆహారం తెచ్చి పెట్టాలి’’ అంది. ‘‘...అందుకు ప్రతిఫలంగా మీకే హానీ చేయను’’ అని కూడా హామీ ఇచ్చింది. దాంతో జంతువులన్నీ తలలూపాయి. అప్పటినుంచి దానికి తామే ఆహారం సమకూర్చి పెట్టసాగాయి.

అలా కాలం గడిచింది. ఒక రాత్రి కొన్ని నక్కలు ఊళ వేయసాగాయి.  ఒంటరిగా ఉన్న నక్క అది వింది.  తాను కూడా బదులుగా వూళ వేసింది. అంతే, దొరికిపోయింది. ఆ జంతువులన్నీ అది నక్కే అని తెలుసుకుని ఇక తరిమి తరిమి కొట్టాయి.

నక్కబావ సమయస్ఫూర్తి


అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంటోంది. ఒకసారి అనుకుంది.. నేను మా అత్తగారింటికి వెళ్లాలి అని.. ఇక అనుకుందే తడవుగా పక్క ఊరిలో ఉన్న తన అత్తగా రింటికి బయలుదేరింది. అలా..అలా.. నడుచుకుంటూ అడవి దాటుకుని కొండదారి వెంట వెళ్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నమైంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పేద్ధ బండరాయి కింది పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడినుండో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. 


ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువెైపు నుండి పులి వస్తోందా అని తేరపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. ‘అయ్యోయ్యో! ఎలా ఇప్పుడు ? నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది. ఎలా?...’ ఆలోచించింది.. ఒక ఉపా యం తట్టింది. అంతే.. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్లను నేలకు తన్నిపట్టి ఉంచి వీపును కొండకు ఆనించి, మిగతా తనపెై రెండు కాళ్లను ముడు చుకుని ఎంతో కష్ట పడి ఆ కొండను మోస్తున్నట్లు ఆపసో పాలు పడుతూ, చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది..



‘ఏం! నక్కబావ ! ఏంటి ఆ కొండను మోస్తున్నావ్‌?’ అని నక్కని పులి అడిగింది. ‘ఏం చెయ్యను పులి మావా! నేను ఈ కొండ దగ్గరికి రా గానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను.. అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దుటి నుంచీ అ న్నం, నీళ్లు లేవు. దాహం, ఆకలితో నోరు పిడచకట్టి పోతోంది. ’ అని పులితో బాధగా అన్నది నక్క..పాపం పులికి జాలి కలి గింది.. నక్కతో అన్నది కదా..‘సరే ! అదిగో అక్కడ నీళ్ల గుంట ఉంది. వెళ్లి తాగిరా.. అ ప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను..నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను..నేను మొయ్యనుగాక మొ య్య ను.. త్వరగా వెళ్లిరా..’ అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది. 



నక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తనభారం అప్ప చెప్పింది. ఇక పులికూడా ఆ కొండ ఎక్క డ మీ ద పడుతుందోనని కాళ్లు తన్నిపట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పు డు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నటిస్తూ..‘వస్తా పులి మావా! నీళ్లు తాగంగానే చప్పున వ చ్చేస్తా.. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే..’ అంటూ నీరసంగా మాట్లాడింది.



‘పాపం.. వెళ్లిరా..’ అంటూ నక్కమీద పులి జాలిపడింది..పులి. అంతే ఇక కొద్దిగా ముం దుకు నడిచి ఒక్క ఉదుటన ముందుకు దూకి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుని పారిపోయింది నక్క.గంట...గంటా గడిచిపోతోంది. నక్క ఎంతకీ రావట్లేదు. ఎందుకు చెప్మా అని తనలో తాను అనుకుంటూ పులి ఎదురు చూసింది. పాపం ఆ కుంటలో పడిపోయి చచ్చి ఉంటుంది అనుకుంటూ ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండ నుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీదకు పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్ఛర్యం.. కొండ కొద్దిగా కూడా కదలలేదు. ‘అరె..నక్క నన్ను ఎంత మోసం చేసిం దీ’ అనుకుంటూ ఈ సారికి బతికి పోయింది అనుకుంటూ తనదారిన తాను పులి వెళ్లిపోయింది. 

నక్కబావ సమయస్ఫూర్తి

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంటోంది. ఒకసారి అనుకుంది.. నేను మా అత్తగారింటికి వెళ్లాలి అని.. ఇక అనుకుందే తడవుగా పక్క ఊరిలో ఉన్న తన అత్తగా రింటికి బయలుదేరింది. అలా..అలా.. నడుచుకుంటూ అడవి దాటుకుని కొండదారి వెంట వెళ్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నమైంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పేద్ధ బండరాయి కింది పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడినుండో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. 

ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువెైపు నుండి పులి వస్తోందా అని తేరపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. ‘అయ్యోయ్యో! ఎలా ఇప్పుడు ? నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది. ఎలా?...’ ఆలోచించింది.. ఒక ఉపా యం తట్టింది. అంతే.. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్లను నేలకు తన్నిపట్టి ఉంచి వీపును కొండకు ఆనించి, మిగతా తనపెై రెండు కాళ్లను ముడు చుకుని ఎంతో కష్ట పడి ఆ కొండను మోస్తున్నట్లు ఆపసో పాలు పడుతూ, చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది..

‘ఏం! నక్కబావ ! ఏంటి ఆ కొండను మోస్తున్నావ్‌?’ అని నక్కని పులి అడిగింది. ‘ఏం చెయ్యను పులి మావా! నేను ఈ కొండ దగ్గరికి రా గానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను.. అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దుటి నుంచీ అన్నం, నీళ్లు లేవు. దాహం, ఆకలితో నోరు పిడచకట్టి పోతోంది. ’ అని పులితో బాధగా అన్నది నక్క..పాపం పులికి జాలి కలి గింది.. నక్కతో అన్నది కదా..‘సరే ! అదిగో అక్కడ నీళ్ల గుంట ఉంది. వెళ్లి తాగిరా.. అ ప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను..నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను..నేను మొయ్యనుగాక మొ య్య ను.. త్వరగా వెళ్లిరా..’ అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది. 

నక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తనభారం అప్ప చెప్పింది. ఇక పులికూడా ఆ కొండ ఎక్క డ మీ ద పడుతుందోనని కాళ్లు తన్నిపట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పు డు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నటిస్తూ..‘వస్తా పులి మావా! నీళ్లు తాగంగానే చప్పున వ చ్చేస్తా.. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే..’ అంటూ నీరసంగా మాట్లాడింది.

‘పాపం.. వెళ్లిరా..’ అంటూ నక్కమీద పులి జాలిపడింది..పులి. అంతే ఇక కొద్దిగా ముం దుకు నడిచి ఒక్క ఉదుటన ముందుకు దూకి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుని పారిపోయింది నక్క.గంట...గంటా గడిచిపోతోంది. నక్క ఎంతకీ రావట్లేదు. ఎందుకు చెప్మా అని తనలో తాను అనుకుంటూ పులి ఎదురు చూసింది. పాపం ఆ కుంటలో పడిపోయి చచ్చి ఉంటుంది అనుకుంటూ ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండ నుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీదకు పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్ఛర్యం.. కొండ కొద్దిగా కూడా కదలలేదు. ‘అరె..నక్క నన్ను ఎంత మోసం చేసిం దీ’ అనుకుంటూ ఈ సారికి బతికి పోయింది అనుకుంటూ తనదారిన తాను పులి వెళ్లిపోయింది. 

నడ్డి విరిగిన నక్క


అనగనగా ఒక అడవిలో ఒక టక్కరినక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక పులి ఎదురొచ్చింది. ఆ పులి కూడా చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతోంది. నక్కను చూడగానే పులి దాని వెంటపడింది. ‘బాబోయ్! నా ఆకలి సంగతి సరే.  ఈ పులికి దొరికితే నేను దానికి ఆహారమైపోతాను’ అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది. పులి దాన్ని వెంబడించింది. నక్క పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతోంది. నక్క రాకతో దానికి నిద్రాభంగమై కళ్ళుతెరిచి చూసింది.


‘‘ఎలుగుబంటి మామా! ఈ చెట్టు కింద ఒక పులి నాకోసం కాచుకుని కూర్చుంది. కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాలు కాపాడు’’ అని ప్రాధేయపడింది. ‘సరే’నంటూ ఎలుగుబంటి తిరిగి నిద్రలోకి జారుకుంది. నక్క ఎప్పుడైనా కిందకు దిగకపోతుందా, దాన్ని తినకపోతానా అని పులి చెట్టు కిందే కాపు కాసింది. ఎంతకీ పులి కదలకపోవడంతో దాని బారినుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది. చివరకి దానికో ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది. ఎలుగుబంటి గాఢనిద్రలో ఉంది. ‘దీన్ని కిందకు తోసేస్తే? అప్పుడు పులి దాన్ని తింటుంది కాబట్టి నన్ను వదిలిపెడుతుంది. అది తినగా మిగిలిన మాంసాన్ని నేను తినొచ్చు. ఈ విధంగా నా ప్రాణాలను నేను రక్షించుకోవడమే కాకుండా నా కడుపు కూడా నిండుతుంది’ అని ఆలోచించి నక్క ఎలుగుబంటిని కిందకు తోసేసింది.

అయితే ఎలుగుబంటి పడటం పడటం సరిగ్గా పులి మీద పడింది. ఎలుగుబంటి బరువుకు పులి నడ్డి విరిగింది. జరిగిందేమిటో ఎలుగుబంటికి అర్థమైంది. అంతే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టెక్కి నక్క గూబ మీద ఒక్కటిచ్చింది. గూబ గుయ్యిమన్న నక్క పట్టు తప్పి కింద పడింది. దానితో దాని నడ్డి కూడా విరిగింది.

మెదడు లేని వరాహం

అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి పంది మెదడును తినాలని కోరిక పుట్టింది. అయితే పందిని చంపి తినగలిగే శక్తి నక్కకు లేదు. నక్క అసలే జిత్తులమారి. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అడవి రాజు సింహం దగ్గరకు వెళ్లింది. ‘‘రాజా మీకు పంది మాంసంతో విందు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కాదనకూడదు. అలాగే మీరు నాకు సహాయం చేయాలి’’ అని అడిగింది నక్క. పందిమాంసంతో విందు అనగానే సింహానికి నోరూరింది, ఇక ఏమీ ఆలోచించకుండా సరేనని ఒప్పుకున్నది. 

నక్క ఒకరోజు పంది దగ్గరకు వెళ్లింది. ‘‘నిన్ను అడవికి రాజును చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ అడవికి రాజువి కావచ్చు’’ అని ఆశపెట్టింది. తెలివితక్కువ పంది ఆ మాటలను నమ్మింది. వెంటనే నక్క వెంట వెళ్లింది. పందిని నక్క సరాసరి సింహం దగ్గరకు తీసుకెళ్లింది. పంది భయపడింది. వణుకుతూనే సింహం దగ్గరకు నడిచింది. వెంటనే సింహం పంది మీదకు దూకబోయింది. పంది తప్పించుకుని పారిపోయింది.


నక్క మరలా పంది దగ్గరకు వెళ్లింది. ‘‘ఎందుకు పారిపోయి వచ్చేశావు?’’ అని అడిగింది. ‘‘సింహం నన్ను చంపబోయింది, తప్పించుకుని వచ్చేశాను’’ అని చెప్పింది పంది. ‘‘సింహం నిన్ను చంపటానికి రాలేదు. కాబోయే రాజువు కదా అని నిన్ను కౌగిలించుకుని అభినందించడానికి వచ్చింది. నువ్వు అనవసరంగా భయపడ్డావు’’ అని పందికి సర్ది చెప్పి దానిని మళ్లీ సింహం దగ్గరకు తీసుకెళ్లింది నక్క.


సింహం దగ్గరకు వెళ్లిన తర్వాత పందిని ‘తల వంచి నమస్కరించ’మని చెప్పింది నక్క. పంది తల వంచగానే, సింహం దానిని చంపేసింది. వెంటనే పంది మాంసాన్ని తినబోయింది సింహం. నక్క వారించింది.


పంది మాంసాన్ని స్నానం చేసి వచ్చి తినాలని చెప్పింది. అలాగేనని వెళ్లింది సింహం. అది స్నానం చేసి వచ్చే లోపుగానే పంది మెదడును తినేసింది నక్క. సింహం వచ్చి పంది మెదడు ఏదని అడిగింది.  ‘‘రాజా, ఆ పందికి మెద డే ఉంటే రెండుసార్లు నా మాటలు నమ్మి మీ దగ్గరకు ఎందుకు కొస్తుంది?!’’ అన్నది నక్క. ‘నిజమే దానికి మెదడు ఉంటే నా దగ్గరకు వచ్చి ఉండేది కాదు’ అనుకుంది సింహం. సింహం మాంసం తినటం మొదలు పెట్టింది. ఈ లోగా నక్క నెమ్మదిగా బయటకు జారుకుంది. నక్క ఆ విధంగా పంది మెదడును తినాలనే కోరికను తీర్చుకుంది.

తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది. నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క ఆనందంగా ఉండేది. రాను రాను నక్కకు ఇదొక వ్యాపకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు. ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది. అది అడవిలోని పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎవరి జోలికి పోకుండా వినయంగా ఉండేది. ఒక రోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో నక్క ‘అడవిలో జంతువులన్నీ తనను చూస్తే గౌరవంగా, తను చెప్పే కబుర్ల కోసం ఆసక్తిగా ఉంటే ఈ గుర్రం తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దీని సంగతి చూడాలి’ అనుకున్నది. పైకి గుర్రంతో ‘‘నీకు ఒక ప్రమాదం ముంచుకు రాబోతోంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడ నుంచి పారిపో’’ అన్నది. 

‘‘ఏమిటా ప్రమాదం’’ అని అడిగింది గుర్రం. ‘‘మన మృగరాజు సింహం నిన్ను చంపటానికి వస్తోంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను’’ అంది నక్క. నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది. ‘‘అంతేనా? నాకు సింహం అంటే భయం లేదులే. దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని చెప్పి, ‘‘నక్కా... నక్కా... నా సంగతి అలా ఉంచుగానీ మొదట నీ ప్రాణాలు రక్షించుకో’’ అన్నది గుర్రం. నా ప్రాణాలకేమైంది అని అడిగింది నక్క. 

మన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట. వైద్యం కోసం ఎలుగుబంటి దగ్గరకు వెళ్తే ‘తోక చివర తెల్ల మచ్చ ఉన్న నక్క రక్తం తాగిస్తే జబ్బు నయం అవుతుంద’ని చెప్పిందట. అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది. నువ్వు కనిపిస్తే చంపేస్తుంది. వెళ్లి దాక్కుని నీ ప్రాణాల్ని కాపాడుకో’’ అని చెప్పింది. దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్లమధ్యలో దూరి ఎవరికీ కనపడకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్లింది.

మూడు రోజుల తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది. నక్కకి కనీసం కుందేల్ని పట్టుకునే ఓపిక కూడా లేదు. తన విషయం అంతా చెప్పి ‘సింహం వస్తోందేమో చూసి చెప్ప’మని అడిగింది. ‘‘వామ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు. నేను వెళ్లను, నాకు భయం’’ అన్నది కుందేలు. మరొక రోజు నక్కను చూడడానికి కోతి వచ్చింది, అది కూడా అలాగే అన్నది. గతంలో అనవసరంగా వాటికి లేని పోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది. వారం రోజుల తర్వాత గుర్రం వచ్చింది. ‘‘సింహం వస్తోందా’’ అని అడిగింది నక్క. ‘‘సింహం రాదు. కావాలనే నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోనివి చెప్పి భయపెడుతున్నావు కదా? భయం అంటే నీకు తెలియాలనే అలా చెప్పాను’’ అంది గుర్రం. నక్క తప్పు తెలుసుకుని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది.

చిట్టెలుక ఉపకారం

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.

ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.

చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... "ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు" అని చిట్టెలుకతో అంది. అవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి.

ఎలుగుబంటి ఉపాయం

ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. తను ఉండటానికి ఎంతో శ్రమపడి ఒక గుహను నిర్మించుకుంది. రంగురంగుల పువ్వులు, రకరకాల ఆకులు ఏరుకునివచ్చి గుహకు అలంకరించింది. దాంతో ఎలుగుబంటి గుహ చాలా అందంగా తయారైంది. జంతువులన్నీ వచ్చి ఆ గుహను చూసి ఎలుగుబంటిని అభినందించసాగాయి. ఆనోటా ఈనోటా ఈ విషయం ఆ అడవికి రాజైన సింహానికి తెలిసింది. దానికి ఈర్ష్య కలిగింది. ‘అడవికి రాజును నేను. అంత అందమైన గుహ నా దగ్గర తప్ప మరొకరి దగ్గర ఉండటానికి వీల్లేదు’ అనుకుని వెంటనే ఆ గుహను వెతుక్కుంటూ బయలుదేరింది.

సింహం ఆ గుహను చూసింది. ‘నిజంగా చాలా బాగుంది. నేనిక్కడే ఉంటాను’ అనుకుంటూ లోపలకి వెళ్లింది. అక్కడున్న ఎలుగుబంటితో ‘‘ఇకనుండి ఈ గుహ నాది. నువ్వు బయటకు వెళ్లి మరో గుహ కట్టుకోపో’’ అని శాసించింది.ఎలుగుబంటికి ఏం చేయాలో తోచలేదు, పాపం ఏడుస్తూ వెళ్ళిపోసాగింది. దారిలో ఒక నక్క ఎదురైంది. జరిగిన విషయం విని నక్క ‘‘బాధ పడకు. నేను చెప్పినట్టు చెయ్యి’’ అంటూ ఒక ఉపాయం చెప్పింది.

మరునాడు ఎలుగుబంటి ఒక సంచి తీసుకుని సింహం దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో సింహం నిద్రపోతోంది. ఎలుగుబంటి నెమ్మదిగా ఆ సంచిని అక్కడే ఉన్న ఒక బల్ల మీద పెట్టి బయటకు వచ్చేసింది. కాస్సేపటి తరువాత సింహం నిద్ర లేచింది. బల్లమీద సంచి కనబడగానే ఆసక్తిగా దాన్ని విప్పి చూసింది. సంచి మూతి తెరుచుకోగానే ‘గుయ్‌’ మని కొన్ని వందల తేనెటీగలు బయటకు వచ్చాయి. అంతసేపు సంచిలో బంధింపబడి ఉండటం వల్ల అవి చాలా కోపంగా ఉన్నాయి. ఒక్కసారిగా అవి సింహం మీదకు దాడి చేసాయి. 

వాటిని తప్పించుకోవడానికి సింహం గుహ బయటకు పరుగెత్తింది. తేనెటీగలు దాన్ని వదలక వెంటబడి మరీ కుట్టసాగాయి. అలా తేనెటీగలు సింహాన్ని చాలా దూరం తరిమాయి. సింహం ఎలాగోలా వాటి బారి నుండి తప్పించుకుంది. ఆ సంఘటనతో భయపడ్డ సింహం మళ్ళీ ఎలుగుబంటి గుహ పేరెత్తలేదు. సింహం పీడ విరగడవడంతో ఎలుగుబంటి తిరిగి తన గుహలో ఆనందంగా ఉండసాగింది.

కుందేలుకు గుణపాఠం

కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు.

తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు.

గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గరే కూలబడి, ‘‘నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదూ!’’ అంది. ‘‘అవును. నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలనే ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. రా భోజనం చేద్దాం’’ అంటూ పిలిచింది తాబేలు. దానితో కుందేలు తన తప్పు తెలుసుకుంది. 

చీమ ప్రత్యుపకారం

నది ఒడ్డున ఉన్న ఒక మర్రిచెట్టుపైన ఒక పావురం నివసిస్తూంది.ఒకరోజు అది నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమను చూసింది.ఆ చీమను ఎలాగైన కాపాడాలి అనుకున్నది.వెంటనే ఒక మర్రి ఆకును తెంపి చీమకు దగ్గరలో నీళ్ళలో వేసింది పావురం.

ఆ అకుపై చీమ ఎక్కి కూర్చుంది.తేలుతున్న ఆ ఆకు ఒడ్డును చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురమును చూసి అది చేసిన సహాయానికి తన ధన్యవాదాలను తెలియజేసింది చీమ. ఒకరోజు చీమ పక్షులకోసం నాలుగువైపుల గాలిస్తున్న వేటగాన్ని చూసింది.చెట్టుపైన కూర్చుని ఉన్న తన ప్రాణాలను కాపాడిన పావురాన్ని చూసింది.ఆ వేటగాడు చెట్టుపైన కూర్చున్న పావురం పైకి విల్లు ఎక్కు పెట్టి గురి పెట్టాడు.ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి ఆలస్యం చేయకుండ కుట్టింది.బాదతో వెటగాడు అరిచాడు.బాణం గురి తప్పింది.పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది.వేటగాడు వెళ్ళిపోయాక పావురం తనకు ప్రత్యుపకారం చేసిన చీమకు ధన్యవాదాలు చెప్పుకుంది.

స్వార్ధపరులతో స్నేహం

అనగనగా రామయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు.వారు ఒకరోజు పక్కఊరికి ప్రయణమై వెళ్ళారు.మధ్యలో ఒక అడవి ఉంది.తిరుగు ప్రయాణమై వస్తుండగా అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి ఒకటి వీరిని చూచింది.వీరివైపు పరుగెత్తుకు రావడం చూచారు.

వెంటనే రామయ్య గబ గబ  చెట్టుమీదకు ఎక్కి కూర్చున్నాడు.కాని సోమయ్య మాత్రం చెట్టు ఎక్క రాకరాక పొవడంతో చనిపోయినట్టుగాకింద పడుకున్నాడు.ఎలుగుబంటి సోమయ్య దగ్గరకు వచ్చి వాసన చూసి  చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయింది.అది అటు వెళ్ళగానే రామయ్య చెట్టు దిగి వచ్చి ఏమి సోమయ్య ఎలుగుబంటి నీతో చెవిలో ఏదొ రహస్యం చెప్పినట్టుంది అని హాస్యామాడాడు.అప్పుడు సోమయ్య అందుకు బదులుగా  స్వార్ధపరులతో స్నేహం చేయకు అని చెప్పింది అంటూ బదులిచ్చాడు.అది విన్నాకా రామయ్య సిగ్గుతో తల దించుకున్నాడు.

రామయ్య ఉపాయం

ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు.అతడు టోపీలు కుట్టుకుని పొరుగూరిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవితం గడిపేవాడు.ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలిసిపోయి ,ఒక చెట్టు క్రిందకు వచ్చిటోపీల బుట్ట ప్రక్కన పెట్టి ఆ చెట్టు క్రిందే నిద్రపోయాడు.ఆ చెట్టుపైన చాలా కోతులు ఉన్నవి.


ఆకోతులునిద్రించు రామయ్య తలపైనున్న టోపీనీ చూసి క్రిందకు వచ్చిబుట్టలోనున్నా టోపీలనీ తీసుకొని తలా ఒకటొపీనీ పెట్టుకొని గంతులు వేస్తున్నవి కోతులు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్టవైపు చూసాడు.బుట్టలోని టోపీలు ఏమైనవి అని చుట్టు కలియ చూసాడు.తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన ఆడుతున్న కోతులను చూసి ఏమిచేయాలో తోచలేదు.కొంతసేపు ఆలోచించినతరువాత ఒక ఆలోచన తట్టింది.వెంటనే తన తలపైనున్న టోపీ తీసి వేసి నేలపై విసిరాడు.అది గమనించిన కోతులు వాటి తలలమీద టోపీలు తీసి నేలమీదకు విసిరాయి.వెంటనే  రామయ్య టోపీలన్ని ఏరీ బుట్టలో వేసుకొని తన దారినతాను వెళ్ళిపోయాడు.

వర్తకుడి సమయస్ఫూర్తి

ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు.


‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు. 

రాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు. 

చాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడిని పట్టుకోలేకపోయినందుకు సైనికాధికారులను కేకలేశాడు. అయితే ఆ మరునాడు వర్తకుడు అదే గుర్రంతో తిరిగి ఆస్థానానికి రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు.  వర్తకుడు వినయంగా రాజుకు నమస్కరించి ‘‘ప్రభూ! నా గుర్రాల పనితనాన్ని, నాణ్యతను మీకు తెలియజేయాలని అలా చేశాను. నన్ను క్షమించండి’’ అన్నాడు.

వర్తకుడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకు రాజు ఎంతగానో సంతోషించాడు. వర్తకుడి దగ్గర ఉన్న గుర్రాలన్నింటినీ అతడు చెప్పిన ధర చెల్లించి కొన్నాడు రాజు

చిత్రకారుడి సమయస్ఫూర్తి

కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు.

వెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు.


గంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్రాలు గీయటం పూర్తి చేశారు. అందులో మొదటి చిత్రకారుడు తాను గీసిన చిత్రం తీసుకెళ్లి రాజుకి చూపించాడు. అచ్చం రాజుగారిలా వున్న చిత్రానికి రాజుగారికి మల్లే మెల్లకన్నూ యధావిధిగా చిత్రించాడు అతడు. అది చూసిన రాజు ఊహించినట్టుగానే ఉగ్రుడై చిత్రకారుడిపై కోపం ప్రదర్శించి తన అసహనం చూపించాడు. రెండవ చిత్రకారుడు చాలా ఆనందంగా తాను గీసిన చిత్రం తీసుకుని రాజు వద్దకొచ్చాడు. ఆ చిత్రం కూడా రాజులాగే చాలా అందంగా ఉంది. చిత్రంగా రాజు రెండు కళ్లూ సరిగ్గా వున్నట్టు గీసాడతడు.ఆ చిత్రకారుడి అతి వినయానికి తెలివికి చిరాకు పడ్డాడు రాజు. అసంతృప్తితో నిరుత్సాహంగా దాన్ని పక్కన పడేశాడు.


చివరగా మూడో చిత్రకారుడు చాలా ధైర్యంగా తాను గీసిన సుదర్శనుడి అందమైన చిత్రపటాన్ని రాజు చేతికందించాడు. దాన్ని తీక్షణంగా చూసిన రాజు మొహంలో చిరునవ్వులు మెరిశాయి.ఆ చిత్రకారుడి యుక్తికి నైపుణ్యానికి మనసారా అభినందించి విలువైన బహుమతులు అందించడమేగాక అతడ్ని ఆ రాజ్యానికి ఆస్థాన చిత్రకారుడిగా నియమించాడు రాజు. అందమైన రూపంతో జీవకళ ఉట్టిపడే ముఖ కవళికలు, అపురూప ఆభరణాలు రాచఠీవితో హుందాగా ఒక పక్కకు చూస్తూ కూర్చున్నట్టు గీసిన రాజుగారి బొమ్మలో సరిగ్గా ఉన్న కన్నును మాత్రమే చిత్రకారుడు బొమ్మలో చూపించాడు. మెల్లకన్ను చిత్రంలో అవతలి వైపుగా ఉండి కన్పించకుండా ఉండేట్టు గీశాడు. చిత్రకారుడి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా ఆనందించడమే గాక అందమైన రూపంలో మంచితనంలో చిన్న అవలక్షణం, చెడ్డ గుణం కనిపించవనే నిండు నిజం తెలుసుకున్నారు.

ఆశపోతు ధనయ్య - అక్బర్-బీర్బల్ కథలు


అనగా అనగా ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు. ఓసారి "ఊరికామందు" ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి.

దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది. వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు. వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు. అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు. కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు. దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు. నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు. పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు.

దొంగ సాధువు - అక్బర్-బీర్బల్ కథలు


అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది.

  దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.

నువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. "నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు
    

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.

మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.

ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.

ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.

ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.

తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి "తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది" అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి" అని అన్నాయి.

ఆహా! అలాగా అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది. 

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.

రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.

కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.

"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.

ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.

బ్రాహ్మణబాలుడి కథ

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.


ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.



రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. "నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.


విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, "భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

నసీరుద్దీన్ కథలు

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం. ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.  ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.


దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు. ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు. 

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్. తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది."ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్. "హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్. "ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్."ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్. అయోమయంగా చూశాడు తైమూర్. 

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్. 

తైమూర్ కి మతిపోయింది.అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్. 

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు. తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్. 

ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే! కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

సాటిలేని విలుకాడు నసీరుద్దీన్

ఒక సారి ఎవరో నసీరుద్దీన్ సాటిలేని విలుకాడు అంటుంటే, పాదూషా విన్నాడు. దాంతో ఆయనకి చాలా కుతూహలంగా అనిపించింది. సరే అని నసీరుద్దీన్ ని పిలిపించాడు. వాళ్ళు ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో ఒక చెట్టు కనిపించింది. వెంటనే పాదూషా నసీరుద్దీన్ ని ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టుని గురి చూసికొట్టమని కానీ 3 మాత్రమే అవకాశాలు అని చెప్పాడు. నసీరుద్దీన్ మొదటి బాణం పొరపాటున గురి తప్పింది. పాదూషా వెటకారంగా నవ్వాడు.

"నవ్వకండి, ప్రభూ! యిది తమరి నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత రెండో బాణం కూడా గురితప్పింది. పాదూషా మళ్ళీ నవ్వాడు."నవ్వద్దు, ప్రభూ!యిది తమరి మంత్రుల నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత మూడో బాణం మాత్రం సూటిగా వెళ్ళి కాండానికి గుచ్చుకుంది. 

నసీరుద్దీన్ వంగి సలామ్ చేస్తూ “వినయంగా చెప్పాలంటే యిది నసీరుద్దీన్ నైపుణ్యం” అన్నాడు. పాదూషా గతుక్కుమన్నాడు. గతుక్కుమన్నది నసీరుద్దీన్ చివరి మాటకి కాదు. `ఇందాకటి దాకా నసీరుద్దీన్ తనని, తన మంత్రులని అన్నప్పుడు తను నసీరుద్దీన్ కొట్టలేడు అన్న ఉద్దేశంతో పట్టించుకోలేదు కానీ తన మీద నసీరుద్దీన్ విసిరిన చలోక్తులకి ఎవరైనా నవ్వుతారేమోనని.’

బ్రహ్మరాక్షసుడు

భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?

“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.

సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.

“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.

ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.

సుకుమార రాకుమారి

ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది.

యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది.

సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని గులక 
రాళ్లు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ  గులక రాళ్ల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు. 

ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.

విక్రమసింహుడు

మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు. 

ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. 

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది. చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.

రెండు నాలుకల ధోరణి

ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్లు తరుముతున్నాయి. నక్క గుక్క తిప్పుకోకుండా, ప్రాణభయంతో, ఊపిరి బిగబట్టి పరుగుతీస్తోంది. తోడేళ్లు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకొస్తున్నాయి. నక్క ఇక పరిగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది. ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు. నక్క అతన్ని చూసి "అయ్యా! నేను ప్రాణ భయంతో పరిగెత్తుకు వస్తున్నాను. నన్ను తోడేళ్లు తరుముతున్నాయి. అవి వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు" అని అంది. బదులుగా అతను "సరే ! నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకుని వస్తున్నావు. నువ్వు ఇక్కడ దాక్కున్నావని చెప్పనులే" అన్నాడు.

అంతలో తోడేళ్లు రొప్పుతూ అతని ముందుకొచ్చాయి. " అయ్యా! మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం. ఆ నక్క గాని ఇటు వైపు వచ్చిందా? చెప్పండి. మీకు మేము రుణపడి ఉంటాం", అని అన్నాయి తోడేళ్లు ముక్తకంఠంతో. కొద్దిసేపు ఆలోచించి ఆ కట్టెలు కొట్టేవాడు, ఒక వైపు చేయి నక్కవైపు, మరో చేయి రోడ్డువైపు చూపిస్తూ, " అటుగా వెళ్ళింది" అని పలికాడు. అతని సంజ్ఞను అర్ధం చేసుకోలేని వెర్రి తోడేళ్లు అతను చూపించిన రోడ్డువైపు పరిగెత్తాయి. "హమ్మయ్య" అని బయటకొచ్చిన నక్క తన దారిలో తాను వెళ్తుంటే కట్టెలు కొట్టేవాడు నక్కతో, " నువ్వు మామూలు వాడివి అయితే కృతజ్ఞతలు చెప్పేదాన్ని. కానీ నువ్వు రెండు నాలుకలవాడివి. నావైపు చూపిస్తూ మరోవైపు వెళ్లిందని చెప్పావు. నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు" అంది నక్క.

ఎవరు యజమాని? - అక్బర్-బీర్బల్ కథలు


అక్బర్ చక్రవర్తి కొలువుకు రకరకాల వ్యక్తులు వస్తుండేవారు. వారంతా రకరకాల సమస్యలతో వస్తుంటారు. అందులో కొన్ని జటిలంగా ఉంటే, కొన్ని సరదాగా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా బీర్బల్ సమయస్ఫూర్తితో చాలా తేలికగా పరిష్కరించేవాడు.

ఒకసారి పొరుగుదేశం నుండి ఇద్దరు వ్యక్తులు అక్బర్ కొలువుకు వచ్చారు. వారిద్దరూ ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నారు. ‘‘అక్బర్ పాదుషా వారికి వందనాలు. ప్రభూ! నా పేరు చిత్రసేనుడు. ఇతడు సుగ్రీవుడు, మా పనివాడు’’ అని చెప్పాడు ఒక వ్యక్తి.

వెంటనే రెండో వ్యక్తి ‘‘అబద్ధం. నేను ఇతని పనివాణ్ని కాదు. ఇతనే నా పనివాడు’’ అన్నాడు.‘‘ఇంతకూ ఎవరు పనివారు? ఎవరు యజమాని?’’ అయోమయంగా అడిగాడు అక్బర్. నేను యజమానినంటే నేను యజమానినని, నువ్వు పనివాడివంటే నువ్వు పనివాడివని వారిద్దరూ వాదించుకోసాగారు. అక్బర్‌కు, అక్కడి సభలోని వారికి ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాలేదు. చివరకు అక్బర్ బీర్బల్ సహాయాన్ని అర్థించాడు.

‘‘బీర్బల్! వీళ్ళిద్దరిలో పనివాడెవరో చెప్పగలవా?’’ అని అడిగాడు అక్బర్. అంతవరకు జరుగుతున్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్, ‘‘తప్పకుండా ప్రభూ. నేను చాలా తేలికగా పనివాడిని గుర్తించగలను’’ అన్నాడు.

బీర్బల్ ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి కాసేపు వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు నటించి, ‘‘మీరిద్దరూ నేల మీద బోర్లా పడుకోండి’’ అన్నాడు. బీర్బల్ సూచించినట్టు చిత్రసేనుడు, సుగ్రీవుడు నేల మీద పడుకున్నారు. అక్బర్‌తో సహా సభికులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొద్దిక్షణాలు గడిచాయి. బోర్లా పడుకున్న వ్యక్తులకు ఏం జరుగుతోందో తెలియట్లేదు.

ఇంతలో బీర్బల్ గట్టిగా ‘‘భటులారా! వీడే పనివాడు. వెంటనే అతని తలను నరకండి’’ అనడం వినిపించింది. అది విని చిత్రసేనుడనే వ్యక్తి పైకి లేచాడు. ‘‘ప్రభూ! నేను పనివాడిని. నన్ను చంపకండి’’ కంగారుగా అంటూ చుట్టూ చూశాడు. అక్కడ భటులు కనిపించలేదు. నవ్వుతూ నిలబడ్డ బీర్బల్ కనిపించాడు.

‘‘వాహ్... బీర్బల్! నీ తెలివి అమోఘం. శభాష్!’’ అంటూ అక్బర్ అభినందనగా చప్పట్లు చరిచాడు. మరుక్షణం అక్బర్ కొలువంతా చప్పట్లతో మారు మోగింది.

బీర్బల్ చతురత - అక్బర్-బీర్బల్ కథలు


బీర్బల్‌ను ఎలాగైనా మాటలతో ఓడించాలని అక్బర్ సరదాగా ఎన్నో ఎత్తులు వేసేవాడు. అయితే  బీర్బల్ సమయస్ఫూర్తితో ఆ ఎత్తులను చిత్తు చేసేవాడు. ఒకసారి అక్బర్‌కి ఒక ఆలోచన వచ్చింది. ‘ఈసారి బీర్బల్ కచ్చితంగా ఓడిపోతాడు. బీర్బల్ తెల్లముఖం వేస్తే చూడాలని ఎన్నాళ్ళనుంచో కోరికగా ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది’ అనుకుని సంతోషించాడు అక్బర్. ‘‘బీర్బల్, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు దాన్ని తింటావా?’’ అని ఒకరోజు సభలో బీర్బల్‌ని అడిగాడు అక్బర్.

‘‘జహాపనా, మీ చేతులతో విషం ఇచ్చినా తింటాను.’’ అని జవాబిచ్చాడు బీర్బల్. ‘‘మరొక్కసారి ఆలోచించుకో బీర్బల్. నీకు సందేహంగా అనిపిస్తే తినలేనని ఇప్పుడే చెప్పు. నీకు తెలుసుకదా ఎవరైనా చేస్తానని చెప్పి చేయకపోతే వారికి నేను శిక్ష విధిస్తానని!’’ నవ్వును అతి బలవంతంగా దాచుకుంటూ గంభీరంగా అన్నాడు అక్బర్.

‘‘సందేహం ఏమీ లేదు ప్రభూ! మీ అమృత హస్తాలతో ఏది ఇచ్చినా తింటాను’’ అక్బర్ ఒక సేవకుడిని పిలిచి వెంటనే ఒక కోడిని తీసుకురమ్మని ఆదేశించాడు. సేవకుడు బతికి ఉన్న కోడిని కంచంలో పెట్టి తీసుకువచ్చాడు. ‘‘బీర్బల్ దీన్ని నువ్వు తినాలి’’ అన్నాడు అక్బర్. ‘‘తప్పకుండా తింటాను ప్రభూ’’ అంతే నిశ్చయంగా చెప్పాడు బీర్బల్. బీర్బల్ సమాధానంతో ఆశ్చర్యపోయాడు అక్బర్. ‘‘బీర్బల్ నువ్వు శాకాహారివి కదా. మాంసాహారం తినడం ఎప్పుడు మొదలు పెట్టావ్?’’

‘‘ప్రభూ మీరు కోడిని తినమన్నారు. కానీ ఎలా తినాలో షరతులు విధించలేదుగా. నేను ఈ కోడిని అమ్ముకొని తింటాను’’ చిన్నగా నవ్వుతూ ఎంతో వినయంగా చెప్పాడు బీర్బల్. అక్బర్ ఎప్పటిలాగే బీర్బల్ చతురతకు ఎంతో సంతోషించాడు.

ఉంగరం దొంగ ఎవరు? - అక్బర్-బీర్బల్ కథలు

ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.

ఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. "బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు." అన్నాడు రాజు గారు "ఏమైనది మహారాజా!" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు "నామనసు బాగాలేదు" అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైన అంతే కదా! మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా! అలాగే బీర్బల్‌ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్న మాట.

"చెప్పండి మహారాజా! మీ మనసు ఎందుకు బావుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది?" అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్‌కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. "మీమనసు ఎందుకు బావుండ లేదు?" అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్. "మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ!" అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు.

"బీర్బల్! ఒక సారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది." అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేసాడు బీర్బల్. "ఊఁ ఏమైనా అర్థం అయిందా!" అడిగాడు అక్బర్ చక్రవర్తి. "అర్థం అయ్యింది మహారాజా! మీ సమస్య ఏమిటో తెలిసింది" అన్నాడు. "అయితే చెప్పు మా సమస్య?" అడిగాడు అక్బర్. మీ మధ్య వ్రేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా!" అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృషికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. "అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు."అన్నాడు అక్బర్. "ఎక్కడైనా భద్రంగా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!"

"లేదు బీర్బల్ నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్‌రూమ్‌కు వెళుతూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది." అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. "ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది." "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి." అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు." అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అక్బర్ "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు. "చెప్పండి మహారాజా! నేను ఏం చేయాలో చెప్పండి." అడిగాడు బీర్బల్. "బీర్బల్! నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి." చెప్పాడు అక్బర్. రాజుగారు చెప్పినదానికి బీర్బల్ ఒప్పుకున్నాడు." మహారాజా మీరు బాత్‌రూమ్‌కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి." అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్‌ను ఓ అలమారు దగ్గరకు తీసుకునివెళ్ళాడు. "ఇదిగో ఇక్కడే పెట్టాను" అంటూ ఆ స్థలం చూపించాడు. బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. "ఆహఁ! అలాగా! సరే... సరే..." అన్నాడు.

బీర్బల్ ఏమిచేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు 'ఆహా! అలాగా! ఓహొ! అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెపుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. షుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గరనుండి ఇవతలకు వచ్చాడు. "ఉంగరం దొంగ దొరికాడు మహారాజా!" అన్నాడు. "చెప్పు బీర్బల్! ఎవారా దొంగ త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి." అన్నాడు.

"మహారాజా" ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారో అని అతను ఖంగారు ఖంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ ఖంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట. మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు, అలమారలో చిక్కుకుని పోయాయట. కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి." అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను ఖంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. "మహారాజా! దొంగ దొరికాడు" అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్‌కు చెప్పాడు. అంత కచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"మరేమి లేదు మహారాజా! మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడి నుంచి ఇవతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు." అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వరించాడు బీర్బల్.