Pages

Saturday, September 8, 2012

తీరిన కోరిక


మణిఘంటికాపురంలో శివన్న అనే కాటి కాపరి ఉండేవాడు. పేదవాడే అయినప్పటికీ శివన్న మంచి మనసున్నవాడు. చేసే వృత్తిని దైవసమానంగా భావించేవాడు. సొంత మనుషులను పోగొట్టుకుని దుఃఖంలో వున్నవారిని ఎన్నడూ కట్టెలకోసం, డబ్బుల కోసం ఇబ్బంది పెట్టి ఎరుగడు. ఇచ్చినంత తీసుకునేవాడు. శవం పూర్తిగా కాలే వరకు చితి దగ్గరి నుంచి కదిలేవాడు కాడు. ఉన్నంతలో జీవితాన్ని తృప్తిగా గడుపుతూన్న శివన్నకు ఒక్కసారి హరిద్వారం వెళ్ళి అక్కడి గంగా నదిలో స్నానం చేయూలని కోరికగా ఉండేది.
 
హరిద్వారం ప్రయూణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గనక, అది తీరని కోరకగానే ఉంటూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు శివన్నకు ఏ ఊరి పొలిమేరకూ చెందని ఒక చింతతోపులో ఒక అనాధశవం పడివున్నదని తెలిసింది. అతడు వెళ్ళి శవాన్ని భుజాన వేసుకుని శ్మశానం చేర్చి, చితి పేర్చి దహన సంస్కారాలు చేశాడు. అతడాపని చేస్తున్నంతసేపూ ఒక పెద్ద మనిషి దూరంగా నిలబడి శివన్నను గమనించసాగాడు.
 
పని పూర్తయ్యూక శివన్న శ్మశానం సమీపంలోని బావి దగ్గర స్నానం చేసి ఇంటికి బయలుదేరాడు. అప్పుడు అంతసేపూ శివన్నను గమనించిన పెద్దమనిషి అతణ్ణి సమీపించి, ‘‘శివన్నా, మాది లక్ష్మీపురం. నా పేరు నారాయణస్వామి. నీ గురించి చాలా విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. నీ మనసులో ఒక తీరని కోరిక ఉందని తెలిసి, దాన్ని తీర్చడానికే వచ్చాను,'' అన్నాడు. ‘‘అయ్యూ, తమరే విషయం మాట్లాడుతున్నారో నాకు అంతుబట్టడం లేదు. కాస్త వివరంగా చెప్పండి,'' అన్నాడు శివన్న వినయంగా.

‘‘నీకు హరిద్వారం వెళ్ళి గంగాస్నానం చేయూలని కోరిక ఉన్నట్టు తెలిసింది. నేనూ హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు వస్తానంటే నిన్ను నాతో తీసుకువెళతాను,'' అన్నాడు నారాయణస్వామి. ‘‘అయ్యూ, నాకు అంతటి భాగ్యమా!'' అంటూ కంటతడితో చేతులు జోడించాడు శివన్న. నారాయణస్వామి ఆప్యాయంగా శివన్న భుజం తట్టి, ‘‘వచ్చే పంచమి రోజు హరిద్వారం బయలుదేరుదాం. సిద్ధంగా ఉండు,'' అని చెప్పి వెళ్ళాడు.
 
పంచమి నాటి ఉదయం శివన్న గుడిసె ముందు గురప్రు బగ్గీ వచ్చి ఆగింది. అందులో నారాయణస్వామి కూర్చుని ఉన్నాడు. ఆయన శివన్నను సాదరంగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని బగ్గీని ముందుకు నడపమని నౌకరును ఆదేశించాడు. నెలరోజుల ప్రయూణం తరవాత వాళ్ళు హరిద్వారం చేరారు. అక్కడి గంగా నదిలో స్నానం చేసి, గంగామాతను పూజించారు. శివన్న జన్మ సాఫల్యం పొందినంతగా ఆనంద పడ్డాడు. మరో నెల పాటు సాగిన తిరుగు ప్రయూణంలో మార్గ మధ్యంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ వచ్చి ఇరువురూ లక్ష్మీపురం చేరారు.
 
శివన్న ఇంటికి బయలుదేరుతూ చేతులు జోడించి, ‘‘అయ్యూ, నా జీవితంలో హరిద్వార దర్శనం చేసుకుంటానని అనుకోలేదు. మీ దయవలన నా కోరిక తీరింది. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను,'' అన్నాడు. అందుకు నారాయణస్వామి, ‘‘శివన్నా, నన్ను మరీ అంతగా పొగడవద్దు. నీకు హరిద్వారం చూపించడంలో నాకూ కొంత స్వార్థం ఉంది,'' అన్నాడు. ‘‘అడగకుండానే నాకా దివ్య క్షేత్రం చూపిన పూణ్య పురుషులు మీరు.
 
మీకు స్వార్థమా? నమ్మను,'' అన్నాడు శివన్న. ‘‘అవును, శివన్నా. నేను నిజమే చెబుతున్నాను. సముద్ర వ్యాపారం చేసి కోట్లకు కోట్లు సంపాదించాను. కాని మనశ్శాంతి మాత్రం లేదు. ప్రేమాభిమానాలు కరువై పోయూయి. ఉన్న ఇద్దరు కొడుకులూ పరమ స్వార్థ పరులు. నేను పోతే వచ్చే ఆస్తి గురించే తప్ప నాక్షేమం గురించి ఆలోచించరు. రేపు నేను చనిపోతే చిత్తశుద్ధితో దహనసంస్కారాలు చేయగలరన్న నమ్మకం కూడా లేదు.

ఒక వేళ చేసినా అది నాకు సంతృప్తికరం కాదు. దాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడే నీ గురించి తెలిసింది. నీలాంటి మంచివాడికి ఉపకారం చేస్తే వృధా పోదని నిన్ను హరిద్వారం తీసుకువెళ్ళాను. రేపు ఎప్పుడైనా నేను మరణిస్తే నువ్వే నా దహనసంస్కారాలు జరిపించాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పుడే చేస్తాను,'' అన్నాడు నారాయణస్వామి బరువెక్కిన మనసుతో. ఆ మాట విన్న శివన్న చలించిపోయి, ‘‘అయ్యూ, మీరు ధర్మప్రభువులు. మీకు అటువంటి స్థితి ఎప్పటికీ రాదు.
 
నాలాంటి నిరుపేదకు హరిద్వారం చూపించిన పుణ్యం ఊరకే పోదు. మీ కొడుకుల్లో మార్పు తెస్తుంది,'' అంటూండగా నారాయణస్వామి ఇద్దరు కొడుకులూ వచ్చి తండ్రి పాదాలపై బడి, ‘‘నాన్నా, మమ్మల్ని క్షమించండి. మీకు అలాంటి స్థితి రానివ్వం. ఇన్నాళ్ళు అజ్ఞానంతో ప్రవర్తిచాం. ఇకపై మీ మాట జవదాటకుండా, మీకు ఎలాంటి కొరతా లేకుండా చూసుకుంటాం,'' అన్నారు. ఒక కాటికాపరితో కలిసి నారాయణస్వామి హరిద్వారం వెళ్ళిన సంగతి తెలిసి ఊళ్ళో నలుగురూ నాలుగు విధాలుగా మాట్లాడుకోవడం విని ఆయన కొడుకులు సిగ్గుతో తలలు దించుకున్నారు.
 
తండ్రి వచ్చిన విషయం తెలిసి, ఆయనకు క్షమాపణలు చెప్పడానికి వెళ్ళి చాటు నుంచి ఆయన మాటలు విన్నారు. కొడుకుల్లో వచ్చిన మార్పును చూసి నారాయణస్వామి ఎంతగానో సంతోషించాడు. వాళ్ళను చిరునవ్వుతో చూస్తూ కాటికాపరితో, ‘‘శివన్నా, నా కొడుకుల్లో మంచి మార్పు చూడాలన్నది నా తీరని కోరిక. హరిద్వారం చూడాలన్న నీ తీరని కోరిక తీర్చగానే, నా తీరని కోరిక, తీరిన కోరికగా మారి పోయింది,'' అన్నాడు.
 
‘‘అయ్యూ, నాకు హరిద్వార దర్శనం చేయించిన పుణ్యం ఊరికే పోదుకదా. ఎన్నటికైనా మంచివారికి మంచే జరుగుతుంది,'' అన్నాడు శివన్న పట్టరాని ఆనందంతో. నారాయణస్వామి ఆ తరవాత శివన్న ఉండడానికి మంచి ఇల్లు కట్టించి, అతని జీవనానికి ఎలాంటి లోటూ రాకుండా చూసుకున్నాడు.

వడ్డీలేని రుణం


లక్ష్మీశివరామపురం ఊరు చిన్నదే అయినా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఊరి మొదట్లో లక్ష్మమ్మవారి గుడి, ఊరి నడుమ శివాల…ుం, ఊరి చివర రాములవారి గుడి ఉండడంచేత ఏడాది పొడవునా ఉత్సవాలూ, తిరునాళ్ళూ జరుగుతూ ఉంటాయి. ఊరి చుట్టుపక్కల అందమైన కొండలూ, సెలేుళ్ళూ ఉన్నందున విహారస్థలంగా కూడా లక్ష్మీ శివరామపురం పేరుగాంచింది.
 
ఆ ఊరి నడుమ ఒక చిన్న బట్టల కొట్టుపెట్టుకుని జీవితం సాగిస్తున్న శరభ…్యును, తనకంటూ ఒక సొంత ఇల్లు లేదనే విచారం పట్టి పీడ్తిన్నది. తన కళ్ళ ముందే చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించినవాళ్ళంతా అదే ఊళ్ళో మిద్దెలు, మేడలు కట్టుకున్నారు. తనకు ఒక చిన్న పెంకుటిల్లు కూడా లేదు. ఒక రోజు శరభ…్యు భార్య పార్వతి భర్తతో, ‘‘మన ఊరవతల తాటితోపు కొట్టివేసి, ఆ స్థలంలో ఇళ్ళ స్థలాలు చౌకగా అమ్ముతున్నారని శివాల…ుం పూజారి భార్య చెప్పింది.
 
మనమూ అక్కడ చిన్న స్థలం కొనుక్కుందామండీ,'' అన్నది. తన మనసులోని కోరిక భార్య నోటి వెంట బ…ుటపడడంతో, శరభ్యుకు చాలా సంతోషం కలిగింది. తను అంతవరకు కొద్దికొద్దిగా దాచిన సొమ్ము, తన దగ్గరున్న వెండి కడి…ూలు, అత్తవారు పెట్టిన ఉంగరం అమ్మగా వచ్చిన డబ్బు కలిపి ఒక ఇరవై అంకణాల స్థలం కొన్నాడు శరభ…్యు.
 
‘‘స్థలం కొనుక్కున్నాక ఖాళీగా ఉంచడం దేనికి? చిన్న పెంకుటిల్లయినా కట్టుకోకపోతే మనకే కదా నష్టం,'' అని పోరసాగింది పార్వతి. భార్య మాట నిజమేననిపించింది శరభ్యుకు. భార్య నగలు అమ్మి, వ్యాపార మిత్రుల దగ్గర కొంత అప్పు తెచ్చి, ఇంటి పనిని ప్రారంభించాడు. మొదట చిన్న వసారా, రెండు గదులు చాలనుకున్నాడు శరభ…్యు.


అయితే, భార్య, ‘‘రేపు పిల్లలు కలిగితే, ఈ ఇల్లు చాలుతుందా?'' అని చెప్పడంతో, అదీ నిజమేనని, మరి రెండు గదులూ వేయించాడు. ఇల్లు పూర్తి కావడానికి ఇంకా పది వేలు కావలసి వచ్చింది. ఏం చె…్యూలో తోచక సతమతమవుతున్న శరభ…్యుతో పార్వతి, ‘‘హరికృష్ణాపురంలో దశరథరామ…్యు అని మా బంధువు ఒకా…ున ఉన్నాడు. వరసకు నాకు అన్న అవుతాడు. జమీందారు దివాణంలో మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించాడు.
 
నేను వెళ్ళి అడిగితే పది వేలు అప్పుగా ఇవ్వకపోడు. వాయిదాల పద్ధతి మీద నిదానంగా తీర్చె…్యువచ్చు. రేపే మనం ఆ ఊరు బ…ులుదేరుదాం,'' అని ధైర్యం చెప్పింది. పొద్దున్నే బ…ులుదేరి భార్యాభర్తలు మధ్యాహ్నానికల్లా దశరథరామ…్యు ఇంటికి చేరుకున్నారు. దశరథరామ…్యు దంపతులు ఆప్యా…ుంగా పలకరించారు. క్షేమ సమాచారాలన్నీ అ…్యూక, దశరథరామ…్యు, ‘‘ఏం పార్వతమ్మా, ఇల్లు కడుతున్నారని విన్నానే. ఎందాకా వచ్చింది? నాకూ చెబితే సంతోషించేవాణ్ణి కదా!''
 
అన్నాడు చిన్నగా నవ్వుతూ. ‘‘తప్పుగా భావించకండి అన్న…్యూ. మీకు చెప్పకుండానా? గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాలనుకున్నాం. కాని ఆ భాగ్యం ఉన్నట్టు లేదు,'' అన్నది పార్వతి చాలా దిగులుగా. ‘‘ఏమయిందమ్మా?'' అని అడిగాడు దశరథరామ…్యు ఆదుర్దాగా. ‘‘కనీసం మరో పది వేలు లేనిదే ఇల్లు పూరే్త్యుట్టు లేదన్న…్యూ. ఆ విష…ుంగానే నీ దగ్గరికి వచ్చాము. పది వేలు అప్పుగా ఇచ్చావంటే, వాయిదాల పద్ధతిలో తీర్చేస్తాము, మా ఇల్లు నిలబెట్టిన వాడివవుతావు,'' అన్నది పార్వతి. ‘‘అన్ననయి ఉండి ఆమాత్రం సహా…ుం చె…్యుకపోతానా?
 
అవన్నీ తరవాత చూద్దాం. ముందు భోజనాలకు లేవండి,'' అన్నాడు దశరథరామ…్యు. భోజనాల…్యూక, దశరథరామ…్యు లోపలికివెళ్ళి, పది వేలు తెచ్చి శరభƒ…్యు చేతిలో పెట్టి, ‘‘మీకు వీలైనప్పుడే ఇవ్వండి. తొందరేం లేదు,'' అన్నాడు. శరభƒ…్యు సంతోషంగా డబ్బును సంచీలో పెట్టుకుంటూ, ‘‘వడ్డీ సంగతి కూడా సెలవిస్తే...''అని మాట పూర్తిచేసేలోపల, ‘‘భలేవారే. మీ దగ్గర వడ్డీ పుచ్చుకుంటానా? 

మొదట ఇంటిపని పూర్తి చే…ుండి. పార్వతమ్మ మా చెల్లెమ్మ కదా! చేబదులుగా ఇస్తున్నాను,'' అన్నాడు దశరథరామ…్యు. ‘‘మీ మేలు ఎన్నటికీ మరచిపోము. వెళ్ళివస్తాము,'' అని చెప్పి తిరుగు ప్ర…ూణమ…్యూరు భార్యాభర్తలు. వాళ్ళటు వెళ్ళగానే దశరథరామ…్యు భార్య, ‘‘ఎంత బంధువులైతే మాత్రం, అంత మొత్తం వడ్డీ లేకుండా చేబదులుగా ఎవరైనా ఇస్తారా? మనకూ పిల్లలున్నారు. వారి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మనకుంది. మరచిపోకండి,'' అని ఎత్తి పొడిచింది.
 
దశరథరామ…్యు, భార్యకు ఎలాంటి సమాధానమూ చెప్పక మౌనంగా ఊరుకున్నాడు. రెండు నెలలలో శరభ…్యు ఇల్లు పూర్తయింది. గృహప్రవేశానికి దశరథరామ…్యు దంపతులూ, కొడుకూ, పిల్లలూ వచ్చారు. శరభ…్యు దంపతులు వారికి ఆప్యా…ుంగా స్వాగతం పలికారు. ఇతర బంధువులతో కలిసి రెండు రోజులు హాయిగా గడిచిపో…ూయి. మూడవ రోజు సా…ుంకాలం దశరథరామ…్యు ఆరుబ…ుట మంచంమీద కూర్చుని పక్కనే నిలబడ్డ భార్యతో, ‘‘ఇల్లు వదలి వచ్చి మూడురోజులయింది. రేపు బ…ులుదేరుదాం,'' అన్నాడు.
 
‘‘మరో వారం రోజుల్లో ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతా…ుట. అందరం ఉండి చూసి వెళదాం,'' అన్నది భార్య. ‘‘అంటే, ఇంకా పది రోజులు ఇక్కడ తిష్ఠ వే…ుడమా? మనవల్ల వాళ్ళకు ఇబ్బందిగా ఉండదూ?'' అన్నాడు దశరథరామ…్యు అయిష్టంగా. ‘‘ఎందుకు ఇబ్బంది? పది వేల రూపా…ులు ఇచ్చారుగా చేబదులుగా. దానికి వడ్డీ వేసుకుంటే ఎంతవుతుందో లెక్కగట్టి చూడండి.
 
మనకే్యు ఖర్చు అందులో ఏ మాత్రం?'' అన్నది భార్య వెటకారంగా. ‘‘గట్టిగా మాట్లాడకు. ఎవరైనా రాగలరు. శరభ…్యు కష్టజీవి, నమ్మకస్థుడు. మన డబ్బు ఎక్కడికీ పోదు,'' అన్నాడు దశరథరామ…్యు. ‘‘అయినా, ఈ కాలంలో వడ్డీ లేకుండా ఎవరైనా అప్పిస్తారా? మీరేమో దమ్మిడీ వడ్డీ లేకుండా పదివేలు ఇచ్చారు. అది ఎప్పుడు తిరిగి వస్తుందా అని నేను దిగులు పడి చస్తూంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదు,'' అంటూ మళ్ళీ దెప్పిపొడిచింది భార్య. ఆ మాటలు, సమ…ూనికి పాల లోటాతో వాకిట్లోకి వచ్చిన పార్వతి చెవిన పడ్డాయి.

ఆమె వారి కంట పడకుండా వెనక్కి తిరిగి వెళ్ళింది. ఆ రాత్రి భోజనం చేసి చేయి కడుక్కుంటూ దశరథరామ…్యు పార్వతితో, ‘‘మేము రేపు ఉద…ుం బ…ులుదేరుతాం,'' అన్నాడు. ‘‘ఇంకో వారం రోజుల్లో ఇక్కడి శివాల…ుంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉండి చూసుకుని వెళ్ళండి, అన్న…్యూ,'' అన్నది పార్వతి. ‘‘లేదమ్మా, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి వెళ్ళక తప్పదు,'' అన్నాడు దశరథరామ…్యు. ‘‘అంత ముఖ్యమైన పనులుంటే వదినెనూ, పిల్లల్నీ ఇక్కడే వదిలి మీరు వెళ్ళండి.
 
చూసుకుని వస్తారు,'' అన్నది పార్వతి. ‘‘ఎందుకులేమ్మా, మీకు ఇబ్బంది,'' అన్నాడు దశరథరామ…్యు. ‘‘ఇందులో ఇబ్బంది ఏమిటి అన్న…్యూ. ఈ ఇల్లు కట్టుకున్నదే మీ చలవ వల్ల. అయినా, ఈ కాలంలో వడ్డీ లేకుండా ఎవరైనా అప్పిస్తారా? మీరేమో దమ్మిడీ వడ్డీ లేకుండా పదివేలిచ్చారు. దానికి వడ్డీవేసుకుంటే ఎంతవుతుందో లెక్కగట్టి చూడండి. మీకే్యు ఖర్చు అందులో ఏమాత్రం?'' అన్నది పార్వతి. ఆ మాటకు గతుక్కుమన్న దశరథరామ…్యు, భార్యకేసి చూశాడు.
 
భర్త మొహం చూడలేక ఆమె తల పక్కకు తిప్పుకున్నది. ‘‘అన్న…్యూ, సమ…ూనికి మీరు సా…ుం చే…ుడం వల్లే, ఈ ఇల్లు కట్టుకోగలిగాం. ఆ రోజు మీరు వడ్డీ వద్దంటే బలవంతం చే…ుడం ఎందుకని ఊరుకున్నాం. ఆరు నెలలలోగా మీ రుణం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. అంతవరకు ఓపిక పట్టండి,''అన్నది పార్వతి. ‘‘అలాగేనమ్మా. తొందరేం వచ్చింది?'' అంటూ దశరథరామ…్యు భార్య కేసి మళ్ళీ ఒకసారి చూశాడు. ఆమె ముఖం సిగ్గుతో వెలవెలబోయింది.

పుకారు


ఏదైనా ముఖ్య విశేషముంటే, దాన్ని అందరికన్న ముందుగా తాను తెలుసుకుని, అందరికీ చెప్పాలని సూరప్ప ఆరాటం. ఆ తొందరలో వాడు చాలాసార్లు తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యడంవల్ల వాడి మాటలు ఎవరూ నమ్మేవారు కారు. ఇది సూరప్పకు చాలా బాధ కలిగించింది. కాని వాడు తన మీద లోకులకు గల అభిప్రాయం మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక రోజు ఊళ్ళో ఏదో గొడవ జరిగింది.
 
అలాటి గొడవలను పరిష్కరించడంలో పొరుగూరి కరణంగారికి మంచి పేరున్నది. అందుకని ఊళ్ళోవాళ్ళు ఆయనకు కబురు చేస్తే, మర్నాడు ఉదయం వస్తానని ఆయన చెప్పి పంపాడు. గొడవ పడిన ఇరుపక్షాలవాళ్ళూ మర్నాడు ఉదయం పొరుగూరి కరణంగారి కోసం ఒక చోట చేరి, చాలా సేపు ఎదురు చూశారు. ఎందువల్లనో ఆయన ఎంతకూ రాలేదు. చివరకు రెండు పక్షాల వాళ్ళూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయూరు.
 
పొరుగూరి కరణం అన్నమాట తప్పే మనిషి కాడు. ఆయన రాకపోవడానికి తప్పకుండా ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అదేమిటో అందరికన్న తనే ముందుగా తెలుసుకుని, అందరికీ చెప్పాలని సూరప్ప ఆరాటపడి, మండుటెండనూ, భోజనం వేళనూ కూడా లక్ష్యపెట్టకుండా పొరుగూరు బయలు దేరాడు. ఊరి వెలుపలనే సూరప్పకు ఒక శవం ఎదురయింది. దారిలో కనిపించిన ఒక మనిషితో వాడు, ‘‘ఎవరిదా శవం? మామూలు మనిషిదిలాగాలేదే?'' అన్నాడు.

"ఈ ఊళ్ళో ఉండే ఒక్క గొప్పవాడిది," అన్నాడా మనిషి. "ఈ ఉళ్ళో గొప్పవాడెవరు?" అని సూరప్ప ఆ మనిషిని మళ్ళీ అడిగాడు. "మా కరణంగారి కన్న ఈ ఊళ్ళో గొప్పవాడెవరున్నారు?" అని ఆ మనిషి జవాబు చెప్పాడు. సూరప్పకు అంతా అర్థమైపోయింది. పాపం, ఆ ఊరి కరణంగారు పోయూడు.
 
అందుకే ఆయన ఈ ఉదయం తగువుతీర్చటానికి తమ ఊరికి రావడం జరగలేదు! ఈ అపూర్వ వార్త తమ ఊళ్ళో అందరికీ అందించడానికి సూరప్ప పరిగెత్తుకుంటూ వచ్చి, కనిపించిన ప్రతి మనిషికీ, "పాపం, ఈ ఉదయం పొరుగూరి కరణంగారు పోయూరు! అందుకే ఆయన ఈ ఉదయం రాలేదు. శవాన్ని నేను కళ్ళారా చూశాను!" అని చెప్పనారంభించాడు.
 
ఒక్కడు కూడా వాడు తెచ్చిన అద్భుత వార్తను నమ్మలేదు. సూరప్పకు చాలా బాధ కలిగింది. నిజం చెప్పినా తన మాట ఎవరూ నమ్మరెందుకు? తాను నిజం చెబుతాడని అందరికీ నమ్మకం కలిగేలా చెయ్యడం ఎలా? "అయ్యూ, కరణంగారు పోయినందుకు మన ఊరి పెద్దలు కొందరు వెళ్ళి పరామర్శించి రావడం అవసరం కూడా గనక, వెంటనే బయలుదేరండి. నిజం మీకే తెలుస్తుంది!" అన్నాడు సూరప్ప. అలా అన్నప్పటికీ వాడి మాటలు ఎవరూ పట్టించుకోలేదు.


"ఆ ఊరి కరణంగారి శవాన్ని చూశానంటున్నావు గదా, ఆ కరణంగారు అసలు ఎలా ఉంటారో నువ్వెప్పుడైనా చూశావురా?" అని కొందరు సూరప్పను అడిగారు. "అంత గొప్పవాడు పోతే ఆ వార్త తెలియడానికి శవాన్ని గుర్తించాలా?" అన్నాడు సూరప్ప. తనతోబాటు, చచ్చిపోయిన పొరుగూరి కరణంగారికి కూడా తన గ్రామస్థులు తీరని అన్యాయం చేస్తున్నారు! అందుచేత, ఆ పొరుగూరికి చెందినవాణ్ణి ఒకణ్ణి పిలుచుకు వచ్చి చెప్పిస్తే, తనపైన తన గ్రామంవాళ్ళకున్న దురభిప్రాయం పోతుంది.
 
ఇలా అనుకుని సూరప్ప మరోసారి పొరుగూరికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక పెద్దమనిషి ఎదురయ్యూడు. ఆయన ఫలానా గ్రామం నుంచి వస్తున్నట్టు అడిగి తెలుసుకుని, "ఈ ఉదయం మీ గ్రామ కరణంగారు చచ్చిపోయూరని కనీసం మీరైనా నమ్ముతారుగా!" అన్నాడు సూరప్ప. "నమ్మను గాక నమ్మను!" అన్నాడాయన. "ఎందుకు నమ్మరు?" అన్నాడు సూరప్ప ఆశ్చర్యంగా.
 
"నేనే ఆ గ్రామ కరణాన్ని గనక!" అన్నాడాయన. సూరప్ప నిశ్చేష్టుడయ్యూడు. వాడు ఎలాగో తేరుకుని, ఆ ఉదయం తనకూ, ఇంకో మనిషికీ జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. "అకస్మాత్తుగా ఇవాళ ఉదయం మా ఊరి పెద్ద షావుకారు పోవడంవల్ల మీ ఊరు రాలేకపోయూను. మా ఊళ్ళో నీకు తగ్గవాడు ఒకడున్నాడు. వాడు అబద్ధం చెప్పకుండానే, వినేవాడికి అబద్ధం స్ఫురించేటట్టు చెప్పగలడు.
 
చచ్చి పోయినవాడు గొప్పవాడన్నాడు. ఊళ్ళో నేను గొప్పవాణ్ణి అన్నాడు. ఈ రెండూ నువ్వు జోడించుకుని, నేనే చచ్చిపోయూననుకున్నావు. నువ్వు వాడి సంగతి తెలియక నమ్మావుగాని, మా ఊళ్ళో వాడి మాట ఎవరూ నమ్మరు," అన్నాడు పొరుగూరి కరణంగారు. సూరప్పకు జ్ఞానోదయం అయింది. అబద్ధం స్ఫురించేటట్టు నిజం చెప్పేవాణ్ణే ఎవరూ నమ్మరంటే, నిజం తెలుసుకోకుండానే గ్రామంలో వార్తలు చెప్పే తనను ఎవరూ నమ్మకపోవటంలో ఆశ్చర్యం ఏమున్నదీ?

అరవింద-గురివింద


భూస్వామి రంగనాధానికి వ్యవసాయంతో పాటు, పట్నంలో కొన్ని వ్యాపారాలు కూడా వున్నాయి. పనివాళ్ళను ఇంట్లోమనుషుల్లా చూస్తాడనీ, మంచి జీతంఇస్తాడనీ అంతా ఆయన గురించి చెప్పుకుంటారు. ఆయనవద్ద పనిలో చేరడానికి ఉత్సాహ పడుతూంటారు. ఇప్పుడు రంగనాధం వద్ద పని చేసే పుల్లయ్య అనేవాడు, దూర దేశంలో వున్న తమ్ముడికి సాయంగా వెళ్ళవలసి వచ్చింది. పుల్లయ్య తర్వాత అంత నమకస్థుడైన చంద్రన్నకు, అతడి స్థానమివ్వాలని రంగనాధానికి వున్నది.
 
కానీ, ‘‘నా తమ్ముడు శివుడికి చెబితే అంతకంటే మంచి పనివాణ్ణి చూసి పెడతాడు. మీరు ఈ విషయంలో తొందరపడకండి!'' అని భార్య వారించింది. కబురందుకుని వచ్చిన రంగనాధం బావమరిది శివుడు, ‘‘నాకు తెలిసిన హరి, నీ పుల్లయ్య కంటే కూడా మంచి పనివాడు, సమర్థుడు,'' అన్నాడు రంగనాధంతో. రంగనాధం వెంటనే, ‘‘అంత తొందరగా ఏ నిర్ణయూనికీ రాకూడదు. నేను పనివాళ్ళను వాళ్ళకు తెలియకుండా రకరకాలుగా పరీక్షిస్తూంటాను.
 
కొందరు కొన్నింటిలో నెగ్గినా, అన్నింటిలో నెగ్గాడనే పుల్లయ్యంటే నాకు ప్రత్యేకాభిమానం,'' అంటూ ఆ విశేషాలు చెప్పాడు: పుల్లయ్య పట్నంలో రంగనాధం బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. పుల్లయ్య వ్యాపార దక్షతవల్ల ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చాలా మంది వ్యాపారులు పుల్ల య్యకు ఎక్కువ జీతం ఇస్తామని ఆశచూపారనీ, కానీ పుల్లయ్య, రంగనాధాన్ని విడిచి రానన్నాడనీ, ఆనోటా ఈనోటా విన్న రంగనాధం, నిజానిజాలు తెలుసుకునేందుకు, విశ్వాసపాత్రుడైన బాపన్న అనే ఆసామీని నియమించాడు.

బాపన్న, పుల్లయ్యను కలుసుకుని, ‘‘నీకు రంగనాధం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు. నేను రెండు వేలిస్తాను. నేను పెట్టబోయే బట్టలదుకాణంలో పనిచేస్తావా?'' అని అడిగాడు. పుల్లయ్య తల అడ్డంగా వూపి, ‘‘అయ్యూ! ఇప్పటికే నెలకు మూడు వేలు ఇస్తామన్న వారుకూడావున్నారు. నేను ఒప్పుకోలేదు,'' అన్నాడు. బాపన్న అతడి వంక జాలిగా చూసి, ‘‘తనకుమాలిన ధర్మం కూడదు.
 
నీకు నేను నాలుగు వేలిస్తాను. ఆ రంగనాధంతో వుంటే, ఆయనకు లాభమే తప్ప, ఎన్నాళ్ళయినా సరే నీ బ్రతుకు ఎక్కడ వేశావే గొంగళీ అన్నట్లుంది,'' అని హితవు చెప్పాడు. పుల్లయ్య నవ్వి, ‘‘అయ్యూ! ముందు చూపున్న పనివాడికి, జీతంకంటే యజమానే ప్రధానం. ఆయన వ్యాపారం దెబ్బతీయడానికే కొందరు నాకు ఎక్కువ జీతం ఇస్తామంటున్నారు.
 
అది జరిగాక నన్ను నాదారి చూసుకోమంటారు. రంగనాధంగారు, నా అవసరం కనిపెట్టి నన్నాదుకోగలరని నా నమ్మకం,'' అన్నాడు. బాపన్న ఈ విషయం అప్పటికప్పుడే రంగనాధానికి చేరవేశాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఇది జరిగిన మర్నాడే పుల్లయ్య చెల్లెలికి మంచి చోట పెళ్ళి కుదిరింది. పెళ్ళికి మూడు నెలలు గడువున్నా, వియ్యూలవారు వెంటనే వెయ్యి రూపాయలు కావాలన్నారు. డబ్బు దగ్గరలేక పుల్లయ్య రంగనాధాన్ని డబ్బడిగాడు.
 
రంగనాధానికి, పుల్లయ్యను మళ్ళీ పరీక్షించాలనిపించింది. ఆయన బాధగా ముఖం పెట్టి, ‘‘నెల రోజులదాకా ఎవరికీ అప్పివ్వరాదని నియమం పెట్టుకున్నాను, ఈ మొత్తం నీ అవసరానికి సరిపడకపోవచ్చు!'' అంటూ అతడికి రెండు వేల రూపాయిలిచ్చి, ‘‘ఈ డబ్బును ఒక రహస్యకార్యం కోసం వుంచాను. దీన్ని రెండు నెలల పాటు నీ ఇంట్లో జాగ్రత్తగా దాచాలి. పొరపాటునైనా ఇందులో ఒక్క పైసా కూడా వాడకూడదు సుమా,'' అని హెచ్చరించాడు.
 
పుల్లయ్య మారుమాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని వెళుతూండగా, బాపన్న అతణ్ణి దారిలో కలిసి, ‘‘నీకు డబ్బు అవసరం అని విన్నాను. రంగనాధం మొండిచేయి చూపాడటగా-ఇప్పుడైనా బుద్ధితెచ్చుకుని నా పనిలోచేరు,'' అన్నాడు. పుల్లయ్య అదోలా ఆయన వంక చూసి, ‘‘నేనప్పుడో మాటా ఇప్పుడో మాటా చెప్పను.

అవసరానికి ఆదుకున్నా ఆదుకోక పోయినా, నాకు రంగనాధంగారే మంచి యజమాని,'' అన్నాడు. ఇదంతా రంగనాధం చెప్పగా విన్న శివుడు, ‘‘వ్యాపారంలో ఎంతో దక్షతవున్న వాడంటున్నా వుగదా? పుల్లయ్య నువ్వు పెట్టే పరీక్షలు అర్థం చేసుకోలేడా? నీ వల్ల అతడికి మంచి ప్రతిఫలం ముట్టేవుంటుందని, నా నమ్మకం,'' అన్నాడు. ఆ మాటకు రంగనాధం నవ్వి, ‘‘సరే, ఇంతకీ నువ్వు పుల్లయ్య స్థానంలో పనిచేయడానికి ఎన్నిక చేసిన వాడికి ఏం పరీక్షలు పెట్టావు?'' అని అడిగాడు.
 
శివుడు వెంటనే, ‘‘వేరే పరీక్షలు అవసరం లేదు, నా భార్యకు అందరి ఇళ్ళకూ వెళ్ళి ఆరాలు తీసే అలవాటుంది. ఏ ఇంట్లో అడిగినా భర్త చాలా కోపిష్టి అనీ తాము సర్దుకు పోతున్నామనీ చెబుతారట ఆడవాళ్లు. హరి భార్య అరవింద మాత్రం, మా ఆయన అందరిలాంటి వాడు కాదని హరిని అదేపనిగా పొగిడేసిందట. హరి మంచివాడనడానికి అదే తిరుగులేని సాక్ష్యం,'' అన్నాడు. రంగనాధానికీ సమాధానం సబబుగా తోచలేదు.
 
కానీ ఆయన భార్య కూడా తమ్ముణ్ణే సమర్థించి, ‘‘వాడి మాట మీద నమ్మకంలేకుంటే, చేతనైతే మీరు ఇంతకంటే మంచి పరీక్ష పెట్టండి,'' అన్నది. ఈ విషయమై పుల్లయ్యనే సలహా అడిగాడు రంగనాధం. అతడు కాసేపాలోచించి, ‘‘హరి లేని సమయంలో మనం వాళ్ళ ఇంటికి వెళదాం. హరిని గురించి అతడి భార్య అరవింద ద్వారా తగిన సమాచారం సంపాయించవచ్చు,'' అని చెప్పాడు. ఆ ప్రకారం వాళ్ళిద్దరూ హరి ఇంటికి వెళ్ళారు. పుల్లయ్య అరవిందతో, ‘‘నేనీ రంగనాధంగారి బట్టల దుకాణంలో చాలా కాలంగా పని చేస్తున్నాను.
 
నా తమ్ముడికి సాయం చేయవలసిన కారణంగా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. రంగనాధంగారు, నా స్థానంలో మీ దగ్గరబంధువు చంద్రన్నను నియమించాలనుకుంటున్నారు. అతణ్ణి గురించి నీకు తెలిసింది చెబితే వినాలని వచ్చాం,'' అన్నాడు. అరవింద గొంతు సవరించుకుని, ‘‘ఆ చంద్రన్న గురించి ఏం చెప్పేది? ఉత్త తాగుబోతు, లంచగొండి, అబద్ధాలకోరు. ఈమధ్య అతడు మా ఆయనతో మాట్లాడ్డం మానేశాడు,'' అన్నది తడుముకోకుండా.

‘‘చాలా సంతోషమమ్మా! మాకు ఎంతో ఉపయోగపడే సమాచారం ఇచ్చావు,'' అన్నాడు పుల్లయ్య. తర్వాత ఇద్దరూ అక్కణ్ణించి బయల్దేరారు. దారిలో పుల్లయ్య రంగనాధంతో, ‘‘గురివిందకు నలుపు తెలియదని సామెత. నా అభిప్రాయంలో అరవింద భర్త తాగుబోతు, లంచగొండి. చంద్రన్న గురించి మనకు తెలుసుకాబట్టి అరవింద చెప్పింది నిజం కాదని తెలుసుకున్నాం. నిజానికి అరవిందకూ, చంద్రన్నకూ ఏ బంధుత్వమూ లేదు.
 
తన భర్త హరికి, మీరు ఉద్యోగమివ్వాలనుకుంటున్న విషయం ఆమెకు తెలిసివుంటుంది. అందుకే లేనివి పోనివి చెప్పి, ఆమె తన భర్తకు పోటీ లేకుండా చేయూలనుకుంటున్నది,'' అని చెప్పాడు. ‘‘అది సహజమే! కానీ ఆమె చెప్పిన అవలక్షణాలు హరికి వున్నాయని ఎలా చెప్పగలవు?'' అని అడిగాడు రంగనాధం. ‘‘అయ్యూ! పాండుతనయుడు ధర్మ రాజును తనకు తెలిసినవారిలో మంచి వారెవరో, చెడ్డవారెవరో చెప్పమంటే, ఆయనకు అందరిలోనూ మంచే తప్ప చెడు కనబడలేదు.
 
అదే దుర్యోధనుణ్ణడిగితే, ఆయనకు ఎవరిలోనూ చెడు తప్ప, మంచికనబడలేదట! ఈ కథ తమరు వినేవుంటారు!'' అన్నాడు పుల్లయ్య. రంగనాధం చప్పున పుల్లయ్య చేతులు పట్టుకుని, ‘‘నీ విషయంలో నాకో అనుమాన ముంది. ఇంత తెలివైనవాడివి నువ్వే స్వయంగా వ్యాపారం చేయక, నా దగ్గర ఎందుకు పనికి కుదిరావు?'' అని అడిగాడు. దానికి పుల్లయ్య వెంటనే, ‘‘అయ్యూ! భూసారం ఒక్కటే అయినా పళ్ళ చెట్లు పళ్ళు కాస్తే, పూలచెట్లు పూలు పూస్తాయి.
 
అలాగే తెలివి ఒక్కటే అయినా, మనుషులందరూ ఒకటి కాదు. మీ తెలివి వ్యాపారానికి పనికివస్తుంది. నా తెలివి సరైన యజమానిని ఎన్నుకునేందుకు పనికివస్తుంది,'' అన్నాడు. రంగనాధం, పుల్లయ్య వివేకాన్ని మెచ్చుకుని, వారం తిరక్కుండానే చంద్రన్నకు పట్నంలోని తన బట్టల దుకాణం అజమాయిషీ అప్పగించాడు.

అపాత్ర దానం


ఒక ఊళ్ళో గంగయ్య, దుర్గయ్య అని ఇద్దరు ధాన్యపు వర్తకులు కలిసి వ్యాపారం చేసేవారు. వాళ్ళు ఏళ్ళతరబడి ఎంతో సఖ్యంగా, ఎలాటి అభిప్రాయ భేదాలూ లేకుండా మసలటం చూసి, ఎవరన్నా అన్నదమ్ముల మధ్య పోట్లాటలు వస్తే, ఊరి పెద్దలు, ‘‘గంగయ్యూ, దుర్గయ్యలను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి!'' అని మందలించే వాళ్ళు. ప్రతి ఏడూ సంక్రాంతికి ఈ మిత్రులిద్దరూ తమకు వచ్చిన లాభాలు పంచుకునేవారు.
 
ఆ సమయంలో గంగయ్య తన వంతు లాభంలో నుంచి, మూడు వందల అరవై అయిదు రూపాయలు విడిగా తీసి మూటగట్టేవాడు. అయితే, దుర్గయ్య అతన్ని ఎన్నడూ, ‘‘ఆ డబ్బు అలా ఎందుకు మూట గట్టుతున్నావు?'' అని అడగలేదు. అది గంగయ్యకే ఆశ్చర్యంగా ఉండేది. ఏటా ఆ ఊరి పొలిమేరల్లో సంతజాతర జరిగేది. ఆ సందర్భంలో సంతతోబాటు, వినోదం కలిగంచే ఆటలూ, జూదమూ కూడా చురుకుగా సాగేవి. సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది.
 
ఆ దిబ్బ మీద ఒక బావీ, చుట్టూ నీడనిచ్చే ఎత్తయిన చెట్లూ ఉండేవి. ఆ ప్రదేశం ప్రయూణీకుల విశ్రాంతికీ, భోజనాలకూ చాలా అనుకూలంగా ఉండేది. మూడు వందల అరవై అయిదు రూపా యలు విడిగా మూటగట్టిన గంగయ్య ఎవరూ చూడకుండా దాన్ని ఆ బావి దగ్గిర పెట్టి పోతూండేవాడు. అది ఎవరు తీసుకుపోయేదీ అతనికి తెలీదు.
 
కాని ఒక ఏడు తన గుప్తదానం ఎవరికి దక్కుతున్నదీ తెలుసుకోవాలనిపించి, గంగయ్య బావివద్ద నుంచి వెళ్ళిపోయినట్లే పోయి, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎవరో వ్యక్తి పైపంచ తలమీది నుంచి కప్పుకుని, చెట్లచాటుగా వెళ్ళుతూండటం గంగయ్యకు కనిపించింది.

గంగయ్య వదిలిన డబ్బు సంచీ బావిదగ్గిర లేదు. ఆ మనిషే తన డబ్బు సంచీ తీసి ఉంటాడని గంగయ్య అతన్ని కొంత దూరం వెంబడించాడు. ఆ వ్యక్తి దుర్గ్యయేనని త్వరలోనే తెలిసిపోయింది. ‘‘నా డబ్బు ఏ పేదవాడికన్నా దొరికి, వాడు లాభంపొందాలనుకుంటే, అది నీకా దొరికింది?'' అన్నాడు గంగయ్య బాధగా. దుర్గయ్య పెద్దగా నవ్వుతూ, ‘‘నువ్వు పారేశాక ఈ డబ్బు ఎవరికి దొరికితే నీకేం?'' అన్నాడు.
 
‘‘డబ్బు నేనిలా ఎందుకు పారేస్తున్నానో తెలిస్తే నువ్విలా అనవు,'' అని గంగయ్య తన కథ ఇలా చెప్పాడు: ‘‘నాకు పసితనంలోనే తల్లిదండ్రులు పోయూరు. పేదవాణ్ణి. పొట్టపోసుకునేందుకు అంత చిన్న వయసులోనే రకరకాల పనులు చెయ్యవలసి వచ్చింది. ఒకసారి కరువు వచ్చి, మా ఊరి నుంచి జనం అన్ని వైపులా పారి పోయూరు. నేను ఈ ఊరు వచ్చాను. ఇక్కడ పెద్ద సంతా, జాతరా జరుగుతున్నది.
 
ఆ రోజు సంక్రాంతిట. నాలుగు రోజులుగా తిండిలేదు. యూచన లాభించ లేదు. ఒక మిఠాయి కొట్లో లడ్డూలు రెండు దొంగిలించి, పట్టుబడి, చావు దెబ్బలు తిన్నాను. ఆకలి బాధా, అసహాయతా మూలంగా చావాలనిపించి, ఈ బావి దగ్గిరికి వచ్చాను. బావిలోకి దూకబోతూండగా నా కాలికింద ఏదో తగిలింది. ఎరర్రాళ్ళుగల బంగారు ఉంగరం! అంతే! నాకు జీవితంమీద మళ్ళీ ఆశ పుట్టింది. ఆ ఉంగరం అమ్మి ఒక పాడిగేదెను కొన్నాను.
 
దానిమీద ఆదాయంతో ఒక ఎద్దుబండి కొన్నాను. దాంతో కొన్నాళ్ళు బతుకు బండిని నెట్టుకొచ్చాను. తరవాత నువ్వు కలిశావు. ధాన్యపు వ్యాపారంలో ఇద్దరం పైకి వచ్చాం. ఏ రోజున నాకు బావి దగ్గిర ఉంగరం దొరికిందో, అదే సంక్రాంతి రోజున ఆ బావి దగ్గిరే మూడువందల అరవై అయిదు రూపాయలు గుప్తంగా వదిలేస్తున్నాను.'' అంతా విని దుర్గయ్య, ‘‘నీ అభిప్రాయం మంచిదే కావచ్చు.
 
కాని నీ డబ్బు దొరికినవాడి బుద్ధి వక్రించే అవకాశం లేకపోలేదు. మనం ఆ సత్యాన్ని ప్రత్యక్షంగానే చూడవచ్చు. నాతో రా,'' అన్నాడు. అతను ఆ డబ్బు సంచీని పెద్ద సంచీలో పెట్టి గంగయ్యతో పాటు బావివద్దకు తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టెక్కారు. దుర్గయ్య తన పెద్ద సంచీ నుంచి ఒక చిన్న సంచీ తీసి, బావి దగ్గర పడేటట్టు విసిరాడు.

కొద్ది సేపటికి నిలువునా కాషాయబట్టలు ధరించిన తెల్లగడ్డపు సాధువు, తాను అడుక్కు తెచ్చుకున్న అన్నపు మూట బావిగట్టున పెట్టి, కాళ్ళు కడుక్కోవటానికి బొక్కెన ఎత్తు తూండగా దుర్గయ్య విసిరేసిన మూట కనబడింది. వెంటనే అతనిలో చిత్రమైన మార్పు వచ్చింది. తాను పాడుతున్న భక్తిపదం ఆపి, అతను చుట్టూ ఎవరూ లేరుగదా అని చూసి, ఆ మూటను తన జోలెలో వేసుకుని, ‘‘ఇన్నాళ్ళకు ఈ వెధవ బ్రతుకునుంచి విమోచనం కలిగింది! ఇకనైనా పెళ్ళాడి సుఖపడతాను,'' అని పైకే స్వగతం చెప్పుకుంటూ, తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మరిచిపోయి వెళ్ళిపోయూడు.
 
‘‘అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకు ఈ వయసులో పెళ్ళా!'' అంటూ చెప్ప లేనంతగా గంగయ్య ఆశ్చర్యపోయూడు. దుర్గయ్య మాట్లాడవద్దని సైగచేశాడు. అతను ఒక వెండి రూపాయి తీసి బావి గట్టు దగ్గిర పడేటట్టు విసిరేశాడు. కొద్ది సేపటికి ఇద్దరు జూదరులు ఒకరినొకరు తిట్టుకుంటూ బావి దగ్గిరికి వచ్చారు. ‘‘పాడి గేదెను కొందామని తెచ్చిన డబ్బు, నీ మాటలు విని, జూదంలో తగలేశాను.
 
చిల్లిగవ్వ మిగల్లేదు. ఇంటికి ఏ ముఖం పెట్టుకు పోయేది? ఇంతకన్న ఈ బావిలో దూకి చచ్చేది మేలు,'' అంటూ ఒకడు బావికేసి పరిగెత్తాడు. రెండోవాడు వాణ్ణి వారించే ప్రయత్నంలో ఉండగా, మొదటివాడికి రూపాయి కనిపించింది. వెంటనే వాడు ఆ రూపాయి చేతిలోకి తీసుకుంటూ, ‘‘సమయూనికి దొరికింది!

పోయిన డబ్బు తిరిగి వస్తుందేమో! ఎవరు చూశారు?'' అంటూ వాడు జూదశాలలవైపు పరిగెత్తాడు. ‘‘అందులో నాకు సగం వాటా ఉన్నది,'' అంటూ రెండోవాడు మొదటి వాడి వెనక పరిగెత్తాడు. గంగయ్య దుర్గయ్యతో, ‘‘ఇదేమిటి? ఎంతో డబ్బు జూదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నవాడు, ఒక్క రూపాయి దొరకగానే మళ్ళీ జూదం ఆడటానికి పరిగెత్తాడు,'' అన్నాడు. దుర్గయ్య మాట్లాడలేదు.
 
మరి కొంచెం సేపటికి ఒక కట్టెలమోపువాడు బావికేసి వస్తూ కనిపించాడు. దుర్గయ్య ఒక చిన్న డబ్బుల సంచీ తీసి, కట్టెలవాడికీ, బావికీ మధ్య దారిలో పడేటట్టు విసిరాడు. కట్టెలవాడు, ‘‘ఈ కట్టెలు అమ్మేదెప్పుడు? ఇంటికి చేరి, గంజి కాచుకునేదెప్పుడు?'' అనుకుంటూ కట్టెలమోపు దింపి, బొక్కెనతో నీళ్ళు తోడి తాగి, మోపు ఎత్తుకుని సంత కేసి వేగంగా వెళ్ళాడు. ‘‘ఇదేమిటి? దారిలో డబ్బు సంచీ పడి ఉంటే దానికేసి చూడనైనాలేదు!''
 
అన్నాడు గంగయ్య. ‘‘నీ గుప్తదానం అపాత్రులకు దొరికి ఎంత హాని చేసిందో చూశావా? శ్రమ పడకుండా, అయూచితంగా దొరికే డబ్బు విలువ తెలిసినవాళ్ళు చాలా అరుదు. వయసు మళ్ళిన సాధువుకు డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది. ఆ మూటలో ఉన్నది చిల్లపెంకులని కూడా చూసుకోకుండా వాడు సుఖాల మీదికి దృష్టి మళ్ళి వెళ్ళాడు. అలాగే రూపాయి చూడగానే జూదగాడికి కలిగిన జ్ఞానోదయం కాస్తా పోయింది.
 
నిజంగా డబ్బుతో బాగుపడే అర్హతగల వాడికి తేరగా వచ్చే డబ్బు దృష్టే లేదు. కట్టెలవాడు తన శ్రమఫలితం మీదే ఆశలు పెట్టుకున్నాడు!'' అన్నాడు దుర్గయ్య. ‘‘అయితే నేను ఇన్నేళ్ళూ చేసిన గుప్తదానం బూడిదలో పోసిన పన్నీరేనా?'' అన్నాడు గంగయ్య ఎంతో విచారపడిపోతూ. ‘‘లేదు, అదంతా నేను తీసి భద్రం చేస్తూ వచ్చానులే. దానితో శాశ్వతంగా మన పేర ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాం,'' అన్నాడు దుర్గయ్య. 

అడ్డగాడిద


లోకయ్య ముపై్ఫ ఏళ్ళ వయసువాడు. వాడికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఊళ్ళో వాళ్ళు ఎవరేపనిచెప్పినా, ఏమాత్రం విసుక్కోకుండా, వాళ్ళవాళ్ళ పనులు సక్రమంగా చేస్తూండే వాడు. వాడికి ఆకలి బాధా, రాత్రికి ఎక్కడ నిద్రించడమా అన్న సమస్య లేదు. ఆకలిగా వున్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఇంత అన్నం పెట్టే వాళ్ళు. రాత్రి వేళ ఏ గృహస్థు ఇంటి పంచనో నిద్రపోయేవాడు.
 
ఒకసారి వాడు, గుడిపూజారి చెప్పిన పని మీద పొరుగు గ్రామంలో ప్రతి శనివారం జరిగే సంతకు వెళ్ళి, కావలసిన వస్తువులు కొని, అక్కడ ఆటగాళ్ళూ పాటగాళ్ళూ ప్రదర్శించే వింతలు చూసి, తిరిగి ఊరుకు బయలుదేరాడు. ఆ సరికి సూర్యుడస్తమించి కనుచీకటిగా వున్నది. లోకయ్య ఏవో కూనిరాగాలు తీస్తూ, ఊరి చెరువుకట్ట దిగుతూండగా, హఠాత్తుగా ఒకడు ఎదురై, ‘‘ ఒరే, ఆరోజు నన్ను చాటు మాటుగా వుండి కొట్టి పారిపోతావా? ఇదుగో, రత్తిగా కాచుకో!'' అంటూ, వాడి మెడ మీద బలంగా కొట్టాడు.
 
ఆ దెబ్బకు లోకయ్య వెల్లకిలాపడి లేస్తూ, ‘‘ఆహా, ఆహా,'' అంటూ పెద్దగా నవ్వసాగాడు. అది చూసి వాణ్ణి కొట్టినవాడు, ‘‘అలా అడ్డగాడిదలా ఓండ్ర పెడతావెందుకురా, రత్తిగా?'' అంటూ చెయ్యెత్తాడు. లోకయ్య ఇంకా నవ్వుతూనే, ‘‘ఆ అడ్డగాడిదను నేను కాదు; నా పేరు లోకయ్య!'' అంటూ మరింతగా నవ్వసాగాడు.

యువరాజుకు సాయపడిన ఎలుకలు చీమలు!


ఒకానొకప్పుడు ప్రతాప్‌ఘడ్‌ రాజ్యాన్ని మహేంద్ర ప్రతాపుడనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజ లను కన్నబిడ్డల్లా భావించి ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించేవాడు. ఆయన కొడుకు ప్రతాపవర్మ కరుణాహృదయుడూ, మృదుస్వభా వుడూ కావడం వల్ల ప్రజలు యువకుడైన అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. అతడు జంతువుల పట్లకూడా అమితమైన ప్రేమ చూపే వాడు.
 
మంచి విలుకాడే అయినప్పటికీ వేటాడ డానికి వెళ్ళేవాడు కాదు. ఒకనాడు ముగ్గురు పరదేశస్థులు రాజును చూడడానికి వచ్చారు. వారు తమకు మూడు విలక్షణమైన శక్తులు ఉన్నాయని చెప్పారు. వారు చేశామని చెప్పుకున్న సాహసకృత్యాలను గురించి విన్న ప్రతాపవర్మ చాలా ఆశ్చర్య పోయూడు. ఆ ముగ్గురిలో ఒకడు చాలా గొప్ప విలుకాడు. ఎంత దూరంలో ఉన్న దాన్నయినా తాను ఉన్నచోటి నుంచే కొట్టగలడు.
 
రెండవ వాడు వాయువేగంతో పరిగెత్తగలడు. మూడవ వాడు ఎవరూ చూడలేని ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా స్పష్టంగా చూడగలడు. వారి మాటలను వింటూ కొంతసేపు వారితో గడిపిన యువరాజు ప్రతాపవర్మకు వారి వెంట వెళ్ళి కొన్నాళ్ళు దేశాటన చేసిరావాలన్న కోరిక కలిగింది.
 
అందుకు తండ్రి అనుమతిని కోరాడు. తన కుమారుడు రాజ్యాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక రాజు మొదట వద్దన్నాడు. అయితే వచ్చిన ఆ ముగ్గురూ యువ రాజును కంటిని రెప్పలా కాపాడి తీసుకువచ్చి అప్పగించగల మని హామీ ఇచ్చాక, యువరాజు వారి వెంట వెళ్ళడానికి రాజు సమ్మతించాడు. మరునాడు తెల్ల వారగానే యువరాజు కొత్త మిత్రు లతో దేశాటనకు బయలుదేరాడు.

వాళ్ళు కొంతదూరం వెళ్ళాక, ఒక ఎలుక బురద గుంట నుంచి పైకి రాలేక కొట్టుమిట్టాడు తూండడం యువరాజు కంటబడింది. అది పైకి రావాలని పైకెక్కడానికి ప్రయ త్నించినప్పుడల్లా, బురదగా ఉన్న గట్టు జారడం వల్ల మళ్ళీ నీళ్ళల్లో పడిపో సాగింది. యువరాజుకు ఆ ఎలుక మీద జాలి కలిగింది. ఒక బాణాన్ని కొలను లోకి వదిలాడు. దాన్ని పట్టుకుని ఎలుక సునాయూసంగాపైకి ఎక్కి వచ్చింది.
 
ఎలుక కరుణ ఉప్పొంగే యువ రాజు మోమును చూస్తూ, ‘‘నా ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు యువరాజా! నేను ఎలుకల రాజైన చూహా రాజాను. ఈ క్షణం నుంచి నా రాజ్యంలోని ఎలుకƒలన్నీ, పిలిచినప్పుడు వచ్చి మీకు సాయమందించడానికి సిద్ధంగా ఉంటాయి. మా సాయం అవసరమైనప్పుడు మీరు నేలపై పడుకుని నా పేరు చెబితే చాలు. మరుక్షణమే మేమందరం మీ సమక్షంలో ఉంటాం,'' అన్నది.
 
యువరాజు ఎలుక కేసి చూస్తూ మంద హాసం చేసి ముందుకు సాగాడు. నలుగురు మిత్రులూ మరికొంత దూరం వెళ్ళాక, వరు సలు వరుసలుగా వెళుతూన్న చీమల బారును యువరాజు చూశాడు. అప్పుడే పక్క ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్దమనిషి అక్కడ చీమలున్న సంగతి గమనించకుండా బిందెడు నీళ్ళు వాకిట్లో కుమ్మరించాడు. దాంతో కొన్ని చీమలు నీళ్ళల్లో కొట్టుకుపోయూయి.
 
మరి కొన్ని చీమలు నీళ్ళ నుంచి బయట పడడానికి ఎంతగానో ప్రయత్నించసాగాయి. దానిని చూసిన ప్రతాపవర్మ, దాపులనున్న చెట్టు నుంచి పెద్ద పెద్ద ఆకులను కోసి నీళ్ళ మీద వేశాడు. ప్రాణాలతో ఉన్న చీమలు ఆకుల మీదికి చేరాయి. అప్పుడే వీచిన గాలికి ఆకులు కొట్టుకుపోయి పొడిగా ఉన్న నేల మీద పడ్డాయి. పరమానందం చెందిన చీమలు, ‘‘యువరాజా! మీ మేలును ఈ జన్మకు మరిచిపోము.
 
మీకెప్పు డైనా మా అవసరం ఏర్పడితే, మమ్మల్ని తలుచు కుని మూడుసార్లు చప్పట్లు కొడితే చాలు. మరుక్షణమే మేము వచ్చి మా సేవలు అందించ గలం,'' అన్నాయి. మరునాటికల్లా యువరాజు, అతని మిత్రులు చంద్రసేనుడు పరిపాలిస్తున్న చంద్రపుర నగ రాన్ని చేరుకున్నారు. ఆనాటి రాత్రి గడపడానికి ఒక సత్రంలో దిగారు.

అప్పుడు వారికొక విచిత్ర విషయం తెలియవచ్చింది. ఆ రాజ్యాన్ని పాలించే చంద్రసేనుడు పరమక్రూరుడనీ, అందమైన తన కుమార్తె చంద్రమతిని వివాహ మాడడానికి వచ్చే రాకుమారులకు అసాధ్యమైన మూడు పరీక్షలు పెడతాడనీ, అందులో ఓడిపోయిన వారిని ఖైదుచేస్తాడనీ తెలియవచ్చింది. ఇప్పటి వరకు అలా వచ్చిన పలువురు రాకుమారులు ఖైదుపాలయ్యూరు.
 
ఆ సంగతి విన్న యువ రాజు ప్రతాపవర్మ, రాజు వద్ద ఖైదీలుగా ఉన్న రాకుమారులకు తప్పక విముక్తి కలిగించాలని నిర్ణయించాడు. మరునాడు తెల్లవారగానే ప్రతాప వర్మ, చంద్రసేన రాజును దర్శించి, ఆయన కుమార్తెను వివాహ మాడడానికి వచ్చానని చెప్పాడు. ఆ మాట వినగానే రాజు చంద్రసేనుడు కారాగారంలో ఖైదీగా మగ్గడానికి మరొక రాకుమారుడు వచ్చాడన్న ఆనందంతో లోలోపల నవ్వుకున్నాడు. తన కుమార్తెను వివాహ మాడాలంటే మూడు ఘనకార్యాలను సాధించాలని ప్రతాపవర్మకు చెప్పాడు.
 
ప్రతాపవర్మ అందుకు సమ్మతించి తాను సాధించవలసిన మొదటి కార్యం ఏదని అడిగాడు. ‘‘హిమాలయ పర్వత సానువుల మధ్య అంద మైన పసుపురంగు పువ్వులు పూస్తాయి. యువ రాణి తలలో పెట్టుకోడానికి వాటిని నువ్వు కోసుకుని రావాలి. అయితే, ఒక విషయం గుర్తుంచుకో. సూర్యరశ్మి సోకగానే ఆ పువ్వుల రంగు వెలిసిపోతుంది. అందువల్ల తెల్లవారక ముందే నువ్వా పువ్వులను ఇక్కడికి తీసుకు రావాలి,'' అన్నాడు రాజు. ఇది అసాధ్యమైన కార్యం.
 
ఎక్కడో ఉన్న హిమాలయూలకు వెళ్ళి, అక్కడున్న పసుపు రంగు పువ్వులను వెతికి కోసుకుని తెల్లవారక ముందే ఇక్కడికి తీసుకురావడం అన్నది ఎవరికి సాధ్యం? ప్రతాపవర్మ తన మిత్రులను సంప్రదించాడు. సుదూరంలో ఉన్న వస్తువులను చూసే శక్తిగల మిత్రుడు, ఆ పువ్వులు ఉండే చోటును స్పష్టంగా చెప్పాడు. వాయువేగంతో పరిగెత్తగల మిత్రుడు, ‘‘విచారించకు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పువ్వులను తెచ్చి నీకు ఇస్తాను,'' అంటూ వెళ్ళాడు. ఆ తరవాత ప్రతాపవర్మ, మిగిలిన ఇద్దరు మిత్రులు, రాత్రి దిగిన సత్రంలోకే వెళ్ళి బసచేశారు.

అర్ధరాత్రి సమయంలో ఒక మిత్రుడు, ‘‘మన మిత్రుడు హమాలయూలకు వెళ్ళి, పువ్వులను కోసుకుని తిరిగి వస్తున్నాడు,'' అన్నాడు. అనుకున్న ప్రకారం అతడు తెల్లవారేసరికి పువ్వులతో తిరిగివచ్చాడు. ప్రతాపవర్మ పువ్వు లతో రాజును చూడడానికి వెళ్ళాడు. పువ్వులను చూసి రాజు చిన్నగా నవ్వినప్పటికీ, వీడెలా సాధించగలిగాడా అని లోలోపల బాధపడ్డాడు. అయితే, ఆ మాటను అడగలేక ఊరుకున్నాడు.
 
సాధించవలసిన రెండో కార్యం గురించి చెప్పి, తన సేవకుల చేత మూడు బస్తాల సన్నటి ధాన్యాన్ని తెప్పించి కింద పోయించాడు. వాటిలో మట్టినీ గులకరాళ్ళనూ కలిపించాడు. ‘‘తెల్ల వారేసరికి, ఈ మట్టీ, గులకరాళ్ళ నుంచి ధాన్యాన్ని వేరుచేయూలి. ధాన్యం మూడు బస్తాలకు సరి పోవాలి. గింజ తగ్గ కూడదు,'' అన్నాడు. ప్రతాపవర్మ కాస్సేపు తీవ్రంగా ఆలోచించాడు. తను చంద్రపురికి వస్తూ, మార్గ మధ్యంలో కాపాడిన చీమలు అతనికి జ్ఞాపకం వచ్చాయి.
 
వాటిని తలుచుకుంటూ అతడు మూడుసార్లు చప్పట్లు కొట్టాడు. మరుక్షణమే వేనవేల చీమలు అతని పాదాల వద్దకు వచ్చాయి. ఏమి చేయూలో వాటికి వివరించి, ప్రతాపవర్మ సత్రానికి వెళ్ళి పోయూడు. సూర్యోదయమవు తూండగా రాజ భవనానికి వచ్చాడు. ధాన్యం రాశిని చూసి పర మానందం చెందాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన రాజు, సేవకులను పిలిచి, ధాన్యాన్ని బస్తాలకు నింపమన్నాడు. మూడు బస్తాలకు ధాన్యం సరిగ్గా సరిపోయింది.
 
రాజు తన కళ్ళను తనే నమ్మలేక పోయూడు. అయినా ఇది ఎలా సాధ్యమయిందని యువరాజును అడగలేక ఊరుకున్నాడు. ‘‘మంచిది, యువ రాజా! నువ్వు చాలా తెలివైన వాడివిలా కనిపిస్తు న్నావు. ఎంత తెలివిగలవాడివైనా మూడవ కార్యాన్ని సాధించగలవనే నమ్మకం నాకు లేదు.
 
రాజభవన ద్వారానికి వెలుపల ఎండి పోయిన చెట్టు ఒకటి ఉన్నది.

తెల్లవారేసరికి దాన్ని సన్నటి ధూళిగా చేసెయ్యూలి. చెట్టును నరకకూడదన్న విషయం గుర్తుంచుకో,'' అని చెప్పాడు రాజు. ప్రతాపవర్మ భవన ద్వారం దగ్గరకు వెళ్ళి దాపులనున్న ఎండిపోయిన ఎత్తయిన చెట్టును చూశాడు. కొంతసేపు ఆలోచించిన అతడు నేలపై పడుకుని, ‘‘చూహా రాజా! మీ సాయం కావాలి!'' అన్నాడు.

మరుక్షణమే వందలాది ఎలుకలు అక్కడికి వచ్చి, ఎండిపోయిన చెట్టును పదునైన తమ పళ్ళతో కొరికి పిండి చేయడం ప్రారంభించాయి. తెల్లవారి, ప్రతాప వర్మ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, చెట్టు జాడ కనిపించలేదు. దాని స్థానంలో రాసి పోసిన కొయ్యపొట్టు కనిపించింది. ప్రతాపవర్మ రాజ దర్శనం కోసం వెళ్ళాడు. రాజు రాగానే ద్వార పాలకులను పిలిచి చెట్టు ఎలా ఉందో చూసి రమ్మన్నాడు.
 
ఒక ద్వారపాలకుడు వెళ్ళి చూసి వచ్చి, ప్రతాపవర్మ చెబుతున్నది అక్షరాలా నిజం అని చెప్పాడు. ‘‘ప్రతాపవర్మా, నేను చెప్పిన మూడు ఘన కార్యాలనూ నువ్వు సాధించావు. నేనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. రేపే నా కుమార్తెను వివాహ మాడడానికి సిద్ధంగా ఉండు,'' అన్నాడు రాజు చంద్రసేనుడు. ఖైదీలుగా వున్న రాకుమారులందరినీ వెంటనే విడుదల చేయూలని ప్రతాపవర్మ కోరాడు.
 
ఇది చంద్రసేనుడికి ఇష్టం లేదు. ప్రతాపవర్మ ఇలాంటి కోరిక కోరగలడని అతడు ఊహించలేదు. ప్రతాపవర్మ, చంద్రమతుల వివాహం ఘనంగా జరిగింది. ప్రతాపవర్మ భార్య సమేతంగా ముగ్గురు మిత్రులతో కలిసి ప్రతాప్‌ఘడ్‌కు బయలుదేరాడు. ముందు ప్రతాపవర్మ భార్యతో వెళుతూంటే, ముగ్గురు మిత్రులు కూడా గుర్రాల మీద వారిని అనుసరించారు. క్రూరుడైన చంద్రసేనుడు అంతటితో ఊరుకో లేదు.
 
ప్రతాపవర్మ, బందీలైవున్న రాకుమారు లను విడిపించమనడం అతనికి ఆగ్రహం కలిగించింది. అయిష్టంగానే వారిని వదిలి పెట్టాడు. అందువల్ల తన సైనికులు కొందరిని పిలిచి, మార్గ మధ్యంలో ప్రతాపుణ్ణీ, అతని ముగ్గురు మిత్రులనూ బంధించి, తన కుమా ర్తెను వెనక్కు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
 
రాజు కుట్ర తెలుసు కున్న ప్రతాపవర్మ, విలు విద్యలో నేర్పరి అయిన తన మిత్రుడితో కలిసి సైనికు లను ఎదుర్కొన్నాడు. సైని కుల మీద బాణవర్షం కురిపిం చాడు. సైనికులు బెదిరిపోయి చెల్లాచెదరుగా పారిపోయూరు. ప్రతాపవర్మ తన ప్రయూణాన్ని కొనసాగించి ప్రతాప్‌ఘడ్‌ను చేరు కున్నాడు. అందం, అణకువగల రాకుమారిని తమకు కోడలిగా తీసుకువచ్చిన కుమారుణ్ణి చూసి రాజదంపతులు పరమా నందం చెందారు.

మారిన మనసు


గజపతివర్మ పాలించే గిరిపురం రాజ్యంలోని రామవరం అనే చిన్న పట్టణంలో రమణయ్య అనే బట్టలవ్యాపారి ఉండేవాడు. ఆయనకు భార్యా, ధనశేఖరుడనే ఒక కొడుకూ, శాంతామణి, చింతామణి అనే ఇద్దరు కూతుళ్ళూ ఉన్నారు. పెళ్ళీడుకు వచ్చిన పెద్ద కూతురిని ఉన్న ఊళ్ళో కాకుండా, రాజధానిలో మంచి ఉద్యోగం చేసే వరుడికిచ్చి వివాహం చేయూలని రమణయ్య ఆశించాడు. ఇలా ఉండగా, రమణయ్య ఒక సంబంధం గురించి విన్నాడు.
 
రాజధానిలో రాజుగారి ఖజానాకు కాపలా భటుడిగా పనిచేస్తున్న దివాకరుడనే యువకుడు అందగాడు; అంతకు మించిన తెలివి తేటలు, ధైర్యసాహసాలు కలవాడు. అతడు కూడా వేరే ఊళ్ళోని అమ్మాయిని చేసుకోవాలని చెబుతున్నాడని రమణయ్యకు తెలియవచ్చింది. వెంటనే రమణయ్య రాజధానికి బయలుదేరి వెళ్ళి, మూడు రోజులు అక్కడ బస చేసి దివాకరుడి వివరాలను సేకరించాడు.
 
అతనికి తల్లిదండ్రులు లేరు. స్వయంగా కలుసుకుని అతని ఉద్యోగ బాధ్యతలు తెలుసుకున్నాడు. అతని మాటతీరుకు సంతృప్తి చెందాడు. తన కుమార్తెను గురించి చెప్పి, అతనికి చేసుకోవడానికి సమ్మతమైతే, రామవరానికి వచ్చి చూడమని చెప్పాడు. ఒక వారం రోజుల తరవాత దివాకరుడు రామవరానికి వెళ్ళాడు. అతడు రమణయ్య ఇంటిని సమీపిస్తూండగా, ఇంటి ముందు గుమ్మంలో ముగ్గు వేస్తూ ఒక యువతి కనిపించింది.
 
ఆమె రమణయ్య పెద్ద కూతురై ఉంటుందని దివాకరుడు అనుకున్నాడు. రమణయ్య, దివాకరుడికి మర్యాదలు చేసి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూండగా, ఆయన చిన్న కూతురు చింతామణి ఏడుపుముఖంతో అక్కడికి వచ్చింది. ‘‘ఏమిటి చింతామణీ? ఏం జరిగింది?'' అని అడిగాడు రమణయ్య ఆందోళనతో.

"పళ్ళ దుకాణానికి వెళ్ళి వస్తూంటే, ఓబులుగాడు పరాచికాలాడి నడివీధిలో నన్ను పరిహసించాడు,"అన్నది చింతామణి కళ్ళు తుడుచుకుంటూ. "వాడొక తుంటరి వెధవ. వాడి నాన్న ఘట్టయ్య పేరుమోసిన గజదొంగ. దుష్టులకు దూరంగా ఉండాలి తల్లీ. అసలు నువ్వు ఒంటరిగా పళ్ళదుకాణానికి ఎందుకు వెళ్ళావు?" అన్నాడు రమణయ్య బాధగా. "దీనికి మాటలతో బుద్ధిరాదు. ఒక రోజంతా తిండిలేకుండా గదిలో పెట్టి గొళ్ళెం వేయూలి," అన్నాడు పక్కనే ఉన్న అన్న ధనశేఖరుడు చెల్లెలికేసి కోపంగా చూస్తూ.
 
సానుభూతి కోసం చూస్తూన్న చింతామణి, సాధింపులు ఎదురయ్యేసరికి, ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. "నేను వెళ్ళి వస్తాను, రమణయ్యగారూ,"అంటూ లేచి నిలబడ్డాడు దివాకరుడు. "అది మా రెండో అమ్మాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ అనుకోకు. ఇంతకూ మా పెద్దమ్మాయి నీకు నచ్చినట్టేనా?" అని అడిగాడు రమణయ్య. "ఏ సంగతీ తరవాత చెబుతాను.
 
దూర ప్రయూణం చేయూలికదా? చీకటి పడుతోంది. ఇక బయలుదేరుతాను," అంటూ దివాకరుడు వీధికేసి నడిచాడు. ఊరి మొదట మర్రిచెట్టు కూడలి వద్ద రాజధానికి వెళ్ళే జోడెడ్ల బండి సిద్ధంగా ఉన్నది. దివాకరుడు బండి ఎక్కాడు. అప్పటికే అందులో ముగ్గురు ప్రయూణీకులు కూర్చుని ఉన్నారు. బండివాడు ఎడ్లను అదిలించాడు. బండి మట్టిదారి మీద వేగంగా వెళుతూంటే, బండి కాడెకు కట్టిన కంచుగంట గణగణమంటూ మోగుతోంది.
 
చీకటి కమ్ముకుంటూండగా బండినొగకు దిగువ వేలాడుతున్న దీపం వెలిగించాడు బండివాడు. అది చూసి ఒక ప్రయూణీకుడు, "పగలు ప్రయూణం చేయూలంటే పనిఒత్తిడి. రాత్రిళ్ళు ప్రయూణం చేయూలంటే దారిలో దొంగల భయం. ఏం చేస్తాం. తప్పదు మరి," అంటూ నిట్టూర్చాడు. అలా బండి రెండు గంటలు ప్రయూణించి, అడవి దాటే సమయంలో, దారి కడ్డంగా ఒకడు కత్తిపట్టుకుని నిలబడివుండడం చూసిన బండివాడు, "గజదొంగ ఘట్టయ్య... పారి పొండి... పారి పొండి," అంటూ బండిని ఆపాడు.

ఘట్టయ్య పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బండి దగ్గరికి వచ్చి, "ఒక్కరూ ఇక్కడి నుంచి పారిపోలేరు. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులు, బంగారం బయటకు తీయండి," అన్నాడు భయంకరమైన కంఠస్వరంతో. బండిలోని ముగ్గురు ప్రయూణీకులు భయపడి వాడు చెప్పినట్టు చేయబోతూండగా, దివాకరుడు ఒక్క చెంగున ముందుకు దూకి, బండివాడి చేతిలోని చెర్నాకోలును లాక్కుని గాలిలో గట్టిగా ఝళిపిస్తూ, "ఒరే, ఎంతకాలానికి దొరికావురా ఘట్టయ్యూ? నీ దొంగతనాలూ, నీ కొడుకు ఆగడాలూ గురించి విని, నిన్ను పట్టుకోమని రాజుగారు నన్ను పురమాయించాడు.
 
గుట్టుగా లొంగిపోయూవో తక్కువ శిక్ష పడుతుంది. పారిపోవాలని ప్రయత్నించావో, అడవిలో మాటువేసి వున్న మాసైనికుల చేతిలో దారుణంగా చస్తావు,"అని హెచ్చరించాడు. అడవిలో సైనికులున్నారన్నమాట వినగానే ఘట్టయ్యకు గుండె ఆగినట్టయింది. ఏం చేయడమా అని దిక్కులు చూడసాగాడు.
 
అదే అదునుగా దివాకరుడు వాడి మీదికి సింహపు కొదమలా ఉరికి, చేతిలోని కత్తి దూరంగా పడేలా చేతి మీద గట్టిగా కొట్టాడు.అంతలో ముగ్గురు ప్రయూణీకులూ ముందుకు దూకి వాణ్ణి వడిసి పట్టుకుని, కాళ్ళు చేతులు కట్టి బండిలో కుదేశారు. మరునాడు రాజు సభలో ఉండగా, ఘట్టయ్యను అక్కడికి లాక్కుపోయి, సంగతి వివరించారు. ఘట్టయ్య తలవంచుకుని నేరాలను అంగీకరించాడు.

అంతా విన్న రాజు, "ఘట్టయ్య చేస్తూన్న దారుణాలను గురించి కొంతకాలంగా ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. వీడు దొంగతనాలు చేసి అడవిలోకి పారిపోవడం వల్ల ఇన్నాళ్ళు పట్టుకోలేక పోయూం. వీణ్ణి బంధించి తెచ్చిన మా దివాకరుడి ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని అభినందిస్తున్నాను. ఇదే విధంగా ఘట్టయ్య కొడుకును కూడా బంధించి తీసుకు రావలసిందిగా దివాకరుణ్ణి ఆదేశిస్తున్నాను," అన్నాడు.
 
దివాకరుడు కొందరు భటులను వెంటబెట్టుకుని రామవరం వెళ్ళి, ఘట్టయ్య కొడుకు ఓబులును చాకచక్యంగా పట్టి బంధించి తెచ్చి, రాజు ఎదుట హాజరు పరచాడు. తండ్రీ కొడుకులకు కఠిన కారాగారశిక్ష విధించిన రాజు, దివాకరుణ్ణి నగర కాపలాభటుల విభాగంలో ఉన్నత అధికారిగా నియమించాడు. ఆ సంగతి రమణయ్యకు తెలియడంతో, తన కాబోయే అల్లుడి ధైర్య సాహసాలకు మురిసిపోతూ, అతన్ని చూడడానికి ఉత్సాహంతో రాజధానికి బయలుదేరాడు.
 
అయితే, ఆయన పెళ్ళి ప్రస్తావన తేగానే దివాకరుడు, "క్షమించండి. నేను మీ అమ్మాయిని చేసుకోలేను," అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. "ఎందుకు బాబూ? అమ్మాయి నచ్చలేదా?" అని అడిగాడు రమణయ్య. "అమ్మాయి నచ్చక పోవడం వల్ల కాదు," అన్నాడు దివాకరుడు. "ఉద్యోగం హోదా పెరిగినందువల్ల మరింత పెద్ద సంబంధం చూస్తున్నావా ఏం?" అని అడిగాడు రమణయ్య.

‘‘అదేం కాదు,'' అన్నాడు దివాకరుడు తల అడ్డంగా ఊపుతూ. ‘‘మరెందుకు మా సంబంధం వద్దంటున్నావో తెలుసుకోవచ్చా?'' అని మళ్ళీ అడిగాడు రమణయ్య. ‘‘మీ తండ్రీ కొడుకుల స్వభావం వల్లే! ఆ రోజు నేను మీ ఊరికి మొదట వచ్చినప్పుడు మీ చిన్నమ్మాయిని ఒక తుంటరివెధవ అల్లరి చేశాడని చెబితే, మీ తండ్రీకొడుకుల్లో సరైన ప్రతిస్పందన రాలేదు. తప్పు చేసినవాణ్ణి న్యాయూధికారి దగ్గరికి తీసుకు వెళ్ళకపోగా, ఏమాత్రం తప్పుచేయని మీ అమ్మాయినే తప్పు బట్టారు. ఇది మీ చవటదనాన్ని చాటుతుంది.
 
అటువంటి కుటుంబంతో సంబంధం చేయడానికి నా మనసొప్పడం లేదు,'' అన్నాడు దివాకరుడు కోపంగా. ‘‘బాబూ, నువ్వొక రాజోద్యోగి అయిన యువకుడిగా కాకుండా, మామూలు ఆడపిల్లల తండ్రిగా, అన్నగా ఆలోచిస్తే ఈ సమస్య అర్థమవుతుంది. ఆరోజు మా అమ్మాయిని అల్లరి చేసిన ఓబులు పేరుమోసిన గజదొంగ కొడుకు. ఆ గజదొంగను గురించి మా పట్టణ ప్రజలు రాజుగారికి మొరపెట్టుకున్నా ఫలితం లేని రోజులు అవి.
 
అలాంటప్పుడు మేము వాడి కొడుకు మీద తిరగబడడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించు. ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా నష్ట పోయేది అరిటాకే. ఆ స్థితిలో మా బిడ్డను అదుపు చేయడం తప్ప మేము చేయగలిగిందేమీ లేదు. అనువుగాని చోట అప్పటి పరిస్థితులను అనుసరించి వెళ్ళడం పిరికితనం కాదు. బాగా ఆలోచించి చూడు. నీ మంచి నిర్ణయూన్ని నిదానంగానే తెలియజెయ్,'' అని చెప్పి రమణయ్య అప్పటికప్పుడే రామవరానికి బయలుదేరి వెళ్ళాడు.
 
దివాకరుడు రమణయ్య చెప్పిన మాటలు విని నిదానంగా ఆలోచించాడు. వాటిలో వాస్తవం ఉందని గ్రహించాడు. రాజోద్యోగి అయిన తనలో ఉన్న తెగువ, సాహసం సామాన్య పౌరులైన ఆ తండ్రీకొడుకుల్లో లేదని ఆగ్రహించడం సబబు కాదని అర్థం చేసుకున్నాడు. అతడు శాంతామణిని వివాహ మాడడానికి సమ్మతి తెలియజేయడంతో, త్వరలోనే వాళ్ళ వివాహం జరిగిపోయింది.

అమరఫలం


పూర్వం ఒక ముని సర్వసంగపరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా, ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై, మునికి ఒక ఫలాన్ని ఇచ్చి, ‘‘నీ తపస్సుకు మెచ్చాను. ఈ అమరఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది,'' అని చెప్పి అంతర్థానమయింది.
 
మునికి కోరిక ఏదీ లేదు. అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆ…ున భావించాడు. దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు చే…ు నిశ్చయించి, ఆ…ున ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు.
 
రాజు మునికి తగిన మర్యాదలు చేసి, ఆ…ున వచ్చిన పని అడిగాడు.
 
‘‘రాజా, ఇదొక అమరఫలం. దీన్ని వెలఇచ్చి కొన్నవారికి ఒక్క కోరిక సిద్ధిస్తుంది. ఆ తరవాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి. కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారంరోజుల కన్న ఎక్కువకాలం దగ్గిర ఉంచుకోరాదు. ఉంచుకోవటం చాలా అపా…ుం. దీన్ని ముందుగా నీకిస్తున్నాను. దీనికెంత వెల ఇస్తావో చెప్పు,'' అని ముని అన్నాడు. రాజుకు అగత్యంగా తీరవలసిన కోరిక ఒకటి ఉన్నది.
 
ఆ…ునకూ, పొరుగురాజుకూ చాలాకాలంగా …ుుద్ధం సాగుతూ ఉన్నది. నిష్కర్షగా ఎవరికీ విజ…ుం చేకూరటం లేదు. ఇరుపక్షాలకూ బోలెడంత నష్టం మాత్రం అవుతున్నది. అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజ…ుం సాధించాలనుకుని, ఆ పండును లక్షవరహాలకు కొన నిశ్చయించాడు. ముని ఆ పండును రాజుకిస్తూ, ‘‘నీ కోరిక తీరిన వారం రోజుల లోపల, కొన్న ధర కంటె తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి.
 
నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి,'' అని లక్షవరహాలూ రాజు నుంచి పుచ్చుకుని, వాటిని తీసుకుపోయి పేదసాదలకు దానం చేసేసి, తన దారిన తాను అరణ్యానికి తిరిగి వెళ్ళి, ఎప్పటిలాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు.

అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునా…ూసంగా కోరిక సిద్ధించింది. మళ్ళీ …ుుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపో…ూడు. ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయింది. విజ…ుం లభించిననాడే రాజు నిండు కొలువులో పరమానందంతో అమరఫలాన్ని అందరికీ చూపి, దాని మహిమ గురించి వివరించి, కావలిసిన వారికి దాన్ని విక్రయిస్తా నన్నాడు.
 
దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతు డొకడు దాన్ని అమితాసక్తితో తొంభైవేల వరహాలిచ్చి కొని, తన దీర్ఘ వ్యాధి నివారణ చేసుకున్నాడు.
 
వెంటనే అమరఫలం చేతులు మారింది. దాని ప్రభావంతో అనేకమందికి అనేక రకాల కోరికలు తీరాయి. కొందరికి వాణిజ్యం కలిసివచ్చింది, కొందరు విద్యావంతుల…్యూరు, అనేకమంది వ్యాధుల నుంచి విముక్తుల…్యూరు. కోరికలు తీర్చుతున్నకొద్దీ అమరఫలం విలువ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది.
 
చాలాకాలం గడిచింది. పుష్యార్కుడనే వాడికి పక్షవాతం వచ్చింది. అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యు ముఖం నుంచి తప్పించాడు.ఆ అమర ఫలం ఇప్పు డెంత వెలలో ఉన్నదని విచారించగా రెండు కాసులని తెలిసింది. రెండుకాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి న…ుమ…్యూక దాన్ని మరొకరికి ఒకకాసుకే అమ్మాలి.

ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు. ఇలా అనుకుని పుష్యార్కుడు వ్యాధి నివారణకు అమరఫలాన్ని కొనక, వైద్యుణ్ణే నమ్ముకుందామనుకున్నాడు.
 
కాని అతని భార్య మాలిని తన భర్తకు తెలి…ుకుండా రెండుకాసు లిచ్చి, తమ నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి,తన భర్త వ్యాధి న…ుం కావాలని కోరుకున్నది. పుష్యార్కుడి వ్యాధి తీసేసినట్టు న…ుమయింది. తాను తీసుకున్న మందులే పనిచేశా…ునుకున్నా డతను.
 
ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరి కన్నా ఒక కాసుకు అమ్మాలి. కాని ఎవరికని అమ్మటం? అమ్మితే ఆతరవాత కొన్నవాళ్ళ గతేమిటి? బాగా ఆలోచించి అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గిరే ఉంచుకుని ఏ అపా…ుం వచ్చినా భరించటానికే ఆమె నిశ్చయించుకున్నది.తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో నన్న బెదురుతో మాలిని రోగిష్ఠిదానిలాగా అయిపోసాగింది.
 
నౌకరు ఒకనాడు, ‘‘ఏమండి, అమ్మగారూ? వంట్లో బాగా లేదా?'' అని అడిగాడు.
 
‘‘ఇక నేను ఎంతోకాలం బతకనురా!'' అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది.
 
‘‘ఎందుకండీ అమ్మగారూ, మీరు చావటం?'' అన్నాడు నౌకరు. ‘‘దాన్ని ఎవరికి అమ్మనురా? ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు. చూస్తూ చూస్తూ ఇంకొకర్ని చంపటం దేనికి? నేనే చస్తాను,'' అన్నది మాలిని.
 
నౌకరు నవ్వి, ‘‘ఎవరూ చావొద్దు! ఒక కాసుకు ఆ అమరఫలాన్ని నాకు అమ్మె…్యుండి,'' అన్నాడు. ‘‘ఇంకాన…ుం! నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు?'' అన్నది మాలిని.
 
‘‘నే నసలు కోరిక కోరితేగద! దాన్ని పెటె్టలో దాస్తాను,'' అంటూ నౌకరు ఒక కాసు తీసి మాలిని కిచ్చి, అమరఫలాన్ని తీసుకుపోయి, తన ఇంట్లో కొ…్యుపెటె్ట అడుగున భద్రంగా దాచాడు.
 
అటుతరవాత అది ఏమైనదీ తెలీదు. కొంతకాలమ…్యూక చూస్తే దాని జాడ కనిపించలేదు.

విదూషకుడి సమస్య


ఒకానొకప్పుడు విన…ుుడు అనే రాజు ఉండేవాడు. ఆ…ునకు చదరంగం అంటే మహా ఇష్టం. అయితే రాజుగనక, ఆ…ునతో సమ ఉజ్జీగా ఆడడానికి ఎవరూ ముందుకు వచ్చేవారుకారు. ఆస్థాన విదూషకుడు మాధవుడు మాత్రం రాజుదగ్గర ఉన్న చనువు కొద్దీ రాజుతో తరచూ చదరంగం ఆడేవాడు. సమ…ుం ఉన్నప్పుడల్లా ఇద్దరూ చదరంగం బల్ల దగ్గర కూర్చునేవారు. రాజు విలువైన మణులు, మాణిక్యాలు ఆటలో పందెం కాసేవాడు. మాధవుడు సాధారణ వస్తువులను పందెంగా పెటే్టవాడు. విదూషకుడు చదరంగం ఆడడంలో చాలా నేర్పరి. రాజు అతనితో ఆడుతూ, ఎన్నో మెళకువలను నేర్చుకునేవాడు. ఆటలోకి దిగారంటే రాజు, విదూషకుడు అనే తరతమ భావాలు మరిచిపోయి, సమ ఉజ్జీలుగా భావించి, ఆటలో లీనమై పోేువారు.
 
ఒకరోజు ఇద్దరూ ఆటలో నిమగ్నులై ఉన్నప్పుడు, అన్నను వెతుక్కుంటూ విదూషకుడి చెల్లెలు మోహిని సరాసరి రాజభవనంలోకి వచ్చింది. పేరుకు తగ్గటే్ట ఆమె చాలా సౌందర్యవతి. ఆమెను చూసి రాజు ముగ్థుడ…్యూడు. మరునాడు చదరంగం బల్ల ముందు ఆటకు కూర్చుంటూ, ‘‘మీ చెల్లెల్ని పందెం కాస్తావా? ఆటలో నేను గెలుపొందితే, ఆమెను నా రాణుల్లో ఒకతెగా చేసుకుంటాను,'' అన్నాడు రాజు విదూషకుడితో.
 
విదూషకుడు విస్మ…ుంతో తనకేసి చూడడం గమనించిన రాజు, ‘‘ఒకవేళ ఆటలో నువ్వు గెలుపొంది నేను ఓడిపోతే, ప్రవాళ నగరాన్ని నీకు ఇస్తాను,'' అన్నాడు.
 
విదూషకుడు కొంచెంసేపు మౌనంగా ఆలోచించి, ‘‘ప్రభూ, మనం కాచే పందాలు సమంగా లేవు. పైగా నాకు నగరం మీద మక్కువలేదు,'' అన్నాడు.
 
‘‘మరేం కావాలో కోరుకో,'' అన్నాడు రాజు.


‘‘తీరా చెప్పాక, ప్రభువులు ఆగ్రహించకూడదు,'' అన్నాడు విదూషకుడు విన…ుంగా. ‘‘కావలసినదాన్ని నిర్భ…ుంగా కోరుకో, ఇస్తాను,'' అన్నాడు రాజు.
 
‘‘తమరు తమ సోదరిని, మా చెల్లెలికి సమంగా పందెం కా…ూలి,'' అన్నాడు విదూషకుడు. రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. ఆ తరవాత నెమ్మదిగా ఆలోచించాడు. అప్పటికే విదూషకుడి చెల్లెల్ని వివాహమాడాలన్న నిర్ణ…ూనికి వచ్చేశాడు గనక, ‘‘సరే, అలాగే,'' అని తల పంకించాడు రాజు.
 
ఆట ఆరంభమయింది. ఇద్దరూ ఏకాగ్రతతో ఆడసాగారు. విదూషకుడి వద్ద నేర్చుకున్న మెళకువలన్నిటినీ ఉపెూగించి, రాజు చాలా జాగ్రత్తగా పావులు కదపసాగాడు. విదూషకుడు ఇక ఓడి పోవడం తప్పదు అన్న పరిస్థితి ఏర్పడడంతో, రాజు మనసులో రకరకాల ఆలోచనలు కదలాడాయి.
 
తను మోహినిని వివాహ మాడే అద్భుత ఘడి…ులను తలుచుకుంటూ ఆటలో తప్పటడుగు వేశాడు. విదూషకుడు గెలిచాడు. రాజు ఓటమిని అంగీకరించాడు! విదూషకుడు పరమానందం చెందాడు. ‘‘ప్రభూ! తమ సోదరిని పంపండి. వివాహమాడతాను,'' అన్నాడు విన…ుంగా.
 
‘‘వివాహమాడతావా?'' అంటూ విస్మ…ుం చెందినరాజు, ‘‘నాకున్నది ఒక్కగానొక్క సోదరి. ఆమెకు అప్పుడే, నగరంలోని సంపన్న వర్తకుడితో వివాహ మయింది. నీకు మరేం కావాలన్నా కోరుకో, సంతోషంగా ఇస్తాను,'' అన్నాడు.
 
‘‘అది న్యా…ుం కాదు కదా ప్రభూ. తమరు ఆమెను పణంగా ఒడ్డారు కదా? ప్రభువులు మాట తప్పరని భావిస్తాను,'' అన్నాడు విదూషకుడు పట్టుదలతో.
 
రాజు విదూషకుడికి పట్టుబడిపోయినట్టు గ్రహించాడు. ‘‘సరే, రేపు నా సోదరి మా తల్లిని చూడడానికి ఇక్కడికి వస్తున్నది. ఆమెను నీ వెంట రమ్మంటే రాకపోవచ్చు. కాబట్టి ఆమెను నువ్వు వెంట బెట్టుకు వెళ్ళడానికి నీకు ఒక అవకాశం కల్పిస్తాను. ఆ ప్రకారం చె్ు,'' అంటూ ఏంచే…ూలో చెప్పాడు.
 
రాజుగారి చెల్లెలు సునీతాదేవి అనుకున్నట్టు తల్లిని చూడడానికి రాజభవనానికి వచ్చింది. మరునాడు సా…ుంకాలం రాజు నదీ తీరంలో వాహ్యాళికి వెళ్ళి వద్దామని ఆమెను ఆహ్వానించాడు. ముందు రాజూ, వెనక ఆ…ున చెల్లెలూ వెళుతూండగా, ఆమె దాపులనున్న ఒక తామర తటాకాన్ని చూసింది. 

తటాకం నిండుగా తామర పుష్పాలు వికసించి ఉన్నాయి. ‘‘ఆహా! ఎంత అందమైన దృశ్యం!'' అంటూ రాజు ముందుకు నడిచాడు.
 
సునీతాదేవి మనసులో తళుక్కున ఒక ఆలోచన తోచింది. ‘‘అన్న…్యూ, మీకు కొన్ని తామర పుష్పాలు కోసి ఇస్తాను,'' అంటూ తటాకం ఒడ్డుకుపోయి, ముందుకు వంగి ఒక పువ్వును కో…ుబోతూ కాలుజారి తటా కంలోకి పడిపోయింది. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం రాజు తిరిగి కూడా చూడకుండా ఏమీ ఎరగనట్టు వెళ్ళిపో…ూడు.
 
సునీతాదేవి చుట్టుపక్కల కల…ు జూసింది. అన్న కనిపించలేదు. తను కొలనులో పడిపోయిన సంగతి తెలి…ుక అన్న వెళ్ళిపోయి ఉంటాడని అనుకుని, ‘‘ఎవరైనా వచ్చి కాపాడండి. నీళ్ళల్లో మునిగి పోతున్నాను. కాపాడండి, కాపాడండి,'' అని కేకపెట్టింది. ఎప్పుడు పిలుస్తుందా అని దాపులనే, కాచుకుని ఉన్న విదూషకుడు ఒక్క గెంతున గుర్రంపై నుంచి కిందికి దూకి సునీతను సమీపించి చేయి అందించాడు. …ుువరాణి అతడి చేయిపట్టుకుని గట్టు మీదికి ఎక్కి వచ్చింది. ‘‘…ుువతీ రత్నమా, నా చేయి పట్టుకున్నావు గనక, ఇక నిన్ను వదిలి పెట్టను. నాతో వచ్చి, నన్ను వివాహమాడి, నాతోనే నా భార్యగా జీవించు,'' అన్నాడు విదూషకుడు ఉత్సాహంగా.
 
సునీతాదేవి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందింది. ‘‘నేను …ుువరాణి సునీతాదేవిని. నన్ను రక్షంచినందుకు సర్వదా కృతజ్ఞు రాలిని. అయినా, నేను వివాహితను. నిన్నెలా పెళ్ళాడగలను,'' అన్నది.
 
‘‘అవన్నీ తరవాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నిన్ను ఇక్కడ ఒంటరిగా విడిచి వెళ్ళలేను. రా, మా ఇంటికి వెళదాం. గుర్రం మీదికి రా,'' అంటూ విదూషకుడు గుర్రం మీదికి ఎగిరి కూర్చున్నాడు.
 
సునీతాదేవి మరొక మార్గం కనిపించక మౌనంగా వెళ్ళి గుర్రాన్ని అధిరోహించి, విదూషకుడి వెనక కూర్చున్నది. గుర్రం నగరంలో ఒక మారుమూలనున్న చిన్న ఇంటి ముందు ఆగింది. గుర్రందిగి, ఇంట్లోకి అడుగు పెట్టాక, విదూషకుడు సునీతాదేవికి చదరంగం ద్వారా తాను ఆమెను రాజుగారి నుంచి ఎలా గెలుచుకున్నదీ తెలి…ుజేశాడు.

తనకు తెలి…ుకుండా, తన అనుమతి పొందకుండా, రాజు తనను చదరంగంలో పణంగా పెట్టాడని సునీతాదేవి గ్రహించింది. ఆ వేదన చెందింది. అయినా రాజుగారి గౌరవాన్ని కాపాడాలని, ‘‘సరే, నేను ఇక్కడే ఉంటాను. అయితే మన వివాహం మాత్రం వచ్చే పౌర్ణమికే,'' అన్నది.
 
విదూషకుడు అందుకు అంగీకరించాడు. సునీతాదేవి ఆక్షణం నుంచే అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగింది. పౌర్ణమికి ఇంకా మూడు రోజులు ఉన్నా…ునగా, రహస్యంగా ఇంటినుంచి బ…ుటపడింది. పుట్టినింటికి కాకుండా తిన్నగా భర్త భవనానికి చేరుకున్నది. ఆమె భర్తకేమో ఇక్కడ జరిగిన సంగతులేవీ తెలి…ువు.
 
…ుువరాణి కనిపించక పోవడంతో, విదూషకుడు హడావుడిగా రాజు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. తన చెల్లెలు భర్త ఇంటికి వెళ్ళి వుంటుందనీ, ఆమెను మళ్ళీ ఇక్కడికి రప్పించడం సాధ్యంకాదనీ రాజు చెప్పాడు. కావాలంటే విదూషకుణ్ణే అక్కడికి వెళ్ళి, మొరపెట్టుకోమని సలహా ఇచ్చాడు.
 
విదూషకుడు …ుువరాణి అత్తవారింటికి వెళ్ళాడు. సంగతి తెలి…ుగానే సునీతాదేవి భర్త ఆగ్రహోదగ్రుడ…్యూడు. కేవలం చదరంగంలో తన భార్యను పణంగా పెట్టినందుకు రాజు మీదా, వివాహిత అని తెలిసీ ఆమెను పెళ్ళాడడానికి చూస్తూన్న విదూషకుడి మీదా మండిపడ్డాడు. ‘‘చదరంగంలో కాదు, చేవవుంటే ఇప్పుడు నాతో కత్తి …ుుద్ధం చేసి, జయించి, సునీతను తీసుకువెళ్ళు!'' అని విదూషకుడికి సవాలు విసిరాడు. విదూషకుడు అయిష్టంగానే అందుకు అంగీకరించాడు.
 
మరునాడే ఇద్దరూ కత్తి …ుుద్ధానికి సన్నద్ధుల…్యూరు. అయితే …ుుద్ధం అటే్ట సేవు జరగలేదు. …ుువరాణి భర్త కాలు మడతబడి కింద పడడంతో, అతని చేతిలోని కత్తి రెండుగా విరిగి, కొస అతని గుండెల్లోకి గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు!
 
భర్త మరణానికి సునీతాదేవి భోరున విలపించింది. ఆమె విషాదానికి అంతం లేకుండా పోయింది.

దుఃఖం ఉపశమించేంత వరకు ఏమీ మాట్లాడకూడదని విదూషకుడు మౌనంగా ఊరుకున్నాడు. ఆచారం ప్రకారం సునీతాదేవి భర్త చితి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షణ చేసి చితికి నిప్పంటించింది. మంటలు వ్యాపించగానే, ఆమె పతి విెూగాన్ని భరించలేక మంటల్లోకి ఉరికి, భర్తతోపాటు సహగమనం చేసింది.
 
ఈ హఠాత్సంఘటన చూసి విదూషకుడు ఖిన్ను డ…్యూడు. ఆ తరవాత దుఃఖ భారంతో అక్కడ ఉండలేక రాజ్యం వదిలి పెట్టాడు. ఉన్న చోట ఉండలేక దేశదిమ్మరి అ…్యూడు. సునీతాదేవి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తనవల్లే ఆమెకీ దుర్గతి పట్టిందని పశ్చాత్తాపంతో దహించుకుపోసాగాడు. తన భర్తపట్ల ఆమె ప్రదర్శించిన విశ్వాసం తలుచుకున్నప్పుడల్లా ఆమెపట్ల అతనికి గౌరవం పెరగసాగింది.
 
సునీతాదేవి భర్తను తను చంపలేదు. ప్రమాద వశాత్తు అతను మరణించాడు. ద్వంద్వ …ుుద్ధంలో జయిస్తే, తన భార్యనే అప్ప చెబుతానన్న వీరుడికి అలాంటి దుర్గతి పట్టడం దారుణం అనిపించింది. ఇలాంటి రకరకాల ఆలోచనలతో విదూషకుడు వివిధ ప్రాంతాలు తిరిగాడు. ఆఖరిక ఒక పల్లెటూరు చేరాడు. అక్కడొక ఫకీరును చూశాడు. ఆ…ున మాటలు విదూషకుడికి ఊరట కలిగించాయి. విచారం నుంచి ఉపశమనం లభించింది. మాటల సందర్భంలో ఫకీరు విదూషకుడికి మరణించిన వారిని బతికించవచ్చని చెప్పాడు. మరణించిన సునీతాదేవినీ, ఆమె భర్తనూ బతికించుకునే అవకాశం ఉంటుందన్న ఆశతో, విదూషకుడు తన కథను ఫకీరుకు చెప్పుకున్నాడు. అంతా విన్న ఫకీరు కొంతసేపు మౌనంగా ఆలోచించి, ‘‘ఉత్తర దిశగా మూడు ెూజనాల దూరం వెళ్ళావంటే ఒక కొండ వస్తుంది. ఆ కొండల మధ్య ఒక గ్రామం వుంది. ఆ మారుమూల గ్రామంలోని కొందరికి చచ్చిన వారిని బతికించే మృతసంజీవనీ మంత్రం తెలుసునని విన్నాను. అక్కడికి వెళ్ళి వారికి సేవలు అందించి వారిని మెప్పిస్తే ఆ మంత్రం నీకు ఉపదేశించగలరు,'' అన్నాడు.
 
విదూషకుడు ఆ క్షణమే కొండలకేసి బ…ులుదేరి కొన్నాళ్ళకు అక్కడికి చేరుకున్నాడు. ఒక గ్రామంలోని ప్రజలు పక్షులను చంపి తినడం - ఆ తరవాత చచ్చిన పక్ష ఈకలనూ, చర్మాన్నీ ఒక చోట చేర్చి ఏదో మంత్రం చెప్పడం మరుక్షణమే చర్మానికీ, ఈకలకూ ప్రాణం వచ్చి పక్షులు ఎగిరి వెళ్ళడం విదూషకుడు చూశాడు.

ఫకీరు చెప్పిన గ్రామం ఇదే అని గ్రహించిన విదూషకుడు ఆ గ్రామంలోనే ఉంటూ, మంచిగా మాట్లాడుతూ వారి కార్యకలాపాలలో పాలుపంచుకోసాగాడు. ఆ గ్రామస్థులు పక్షులను చంపి తిని, ఆ తరవాత వాటికి ప్రాణం పో…ుడం విదూషకుడు మళ్ళీ ఒకసారి చూశాడు. అదెలా సాధ్యం అని వాళ్ళను ఆశ్చర్యంతో అడిగాడు.
 
గ్రామస్థులు అతన్ని ఒక వృద్ధురాలి దగ్గరికి తీసుకు వెళ్ళారు. విదూషకుడి తరపున గ్రామస్థుల వేడుకోలును ఆలకించిన వృద్ధురాలు అతనికి మృత సంజీవనీ విద్యను నేర్పడానికి అంగీకరించింది. ఆమె అతన్ని తన గుడిసెలోని చీకటి మూలకు తీసుకుపోయింది.అతను మంత్రాన్ని ఆరుసార్లు వల్లించేలా చేసింది. విదూషకుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చే…ుకుండా, తనరాజ్యానికి తిరుగు ప్ర…ూణమ…్యూడు. రాజధానికి చేరి …ుువరాణి సునీతాదేవి సహగమనం చేసిన స్థలానికి చేరాడు. అక్కడి భస్మరాసిపై నీళ్ళు చల్లి కళ్ళుమూసుకుని మూడుసార్లు మంత్రం జపించాడు. కళ్ళు తెరవగానే సునీతాదేవి ప్రాణాలతో లేచిరావడం చూశాడు.
 
విదూషకుడు మళ్ళీ కళ్ళు మూసుకుని మూడుసార్లు మంత్రం జపించగానే సునీతాదేవి భర్త కూడా సజీవుడై లేచాడు.
 
విదూషకుడు పరమానందం చెందాడు. సునీతాదేవిభర్త విదూషకుణ్ణి సమీపించి, ‘‘మాధవా, కత్తి …ుుద్ధంలో నువ్వు జయించావు. కాబట్టి సునీత మీద హక్కు నీకే ఉంది,'' అన్నాడు.
 
సునీత నోరువిప్పలేదు. మౌనం వహించింది. ఆమెను చేపట్టడమా? వద్దా? అన్న పెద్ద సమస్య విదూషకుడికి ఎదురయింది.
 
సరిగ్గా ఆ సమ…ూనికి అటుకేసి వచ్చిన ఫకీరు అతని సమస్యను గ్రహించి, ‘‘మాధవా, నువ్వు ఆమెకు ప్రాణం పోశావు. ప్రాణదాత తండ్రితో సమానం. తండ్రిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు,'' అన్నాడు.
 
ఆ వెంటనే విదూషకుడు సునీతాదేవి చేతిని, ఆమె భర్త చేతిలో పెట్టి, ఒక్క మాట యినా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపో…ూడు. ఆ తరవాత రాజ్యంలో విదూషకుడి జాడ కనిపించలేదు.

తాయత్తు మహిమ


ఒకనాటి ఉదయం ఒక నగరంలోకి ఒక అతిస్థూలకాయుడు ప్రవేశించాడు. అంతటి ఒడ్డూ, పొడుగూ ఏ మానవ మాత్రుడికీ ఉండదు. ఈ స్థూలకాయుడు ఒంటి నిండా నల్లటి బట్ట కప్పుకుని ఉన్నాడు. వాడి లావుపాటి జబ్బకు ఒక తాయత్తు కట్టి ఉన్నది. వాడు అతి కష్టం మీద తన స్థూల శరీరాన్ని ముందుకు నడిపిస్తూ, ‘‘తాయత్తు మహిమ తెలుసుకోవాలంటే త్వరగా రండి,'' అని అరుస్తున్నాడు.
 
కాని వాడు మాయగాడేమోనని భయపడి, ఎవరూ వాణ్ణి సమీపించలేదు. అయితే, ఆ ప్రాంతంలో ఏకాకిగా నివసిస్తున్న మరిడయ్య అనేవాడు, తాయత్తు మహిమ తెలుసుకోవాలని కుతూహలం పుట్టి, స్థూలకాయుడితో, ‘‘అబ్బీ, తాయత్తు మహిమ ఏమిటో నాకు చూపించు,'' అన్నాడు. స్థూలకాయుడు, ‘‘నా వెంటరా!'' అంటూ మరిడయ్యను ఊరి బయటికి తీసుకుపోయి, మర్రిచెట్టు కింద ఆగి, తన జబ్బకు కట్టి ఉన్న తాయత్తు విప్పాడు.
 
అంత పెద్ద జబ్బకు సరిపోయిన తాయత్తు మామూలు మనిషి జబ్బకు సరిపోయే దానిలాగా చిన్నదై పోయింది. ‘‘ఇదేనా తాయత్తు మహిమ?'' అని మరిడయ్య చప్పరించాడు. ‘‘అప్పుడే ఏం చూశావు. నేను దీన్ని నీ జబ్బకు కట్టి వెళ్ళిపోతాను. నేను నీకు కనపడకుండా పోయినాక గాని, దీని మహిమ నీకు తెలీదు.
 
నువ్వు దీన్ని వదిలించు కోవాలంటే మరెవడి జబ్బకైనా కట్టాలి గాని, మరో మార్గంలేదు,'' అంటూ ఆ స్థూలకాయుడు, మరిడయ్య ఏదో అడగబోతే కూడా వినిపించు కోకుండా, తాయత్తు మరిడయ్య జబ్బకు కట్టి, గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయూడు. వాడు వెళ్ళినవైపే చూస్తూ ఉండిన మరిడయ్య, తన జబ్బకు కట్టి ఉన్న తాయత్తును చూసి అదిరిపడ్డాడు.

తరవాత తన శరీరమంతా కలయ చూసుకుంటే వాడికి మూర్ఛ వచ్చినట్టయింది.మరిడయ్య అతిస్థూలకాయుడు అయిపోయూడు. మరిడయ్య నెత్తీ, నోరూ బాదుకుంటూ ఆ మనిషి వెళ్ళినవేపే ఆయూసపడుతూ పరిగెత్తాడు. వీధి మలుపు తిరిగే సరికి దూరంగా ఒక సన్నని మనిషి నల్లబట్టకప్పుకుని పోతూ కనిపించాడు. మరిడయ్యకు తాయత్తు మహిమ తెలిసింది.
 
తాయత్తును వదిలించుకుంటే స్థూలకాయం పోయి, మామూలు మనిషి కావచ్చు. తన ఇంటి కేసి తిరిగి వచ్చిన మరిడయ్యను చూసి ఎరిగినవాళ్ళు నిర్ఘాంత పోయి, ‘‘ఇందులో ఏదో మోసం ఉందని మేం ముందే అనుకున్నాం. ఆ దరిద్ర గొట్టు తాయత్తును వెంటనే తెంపి అవతల పారెయ్యి,'' అన్నారు. మరిడయ్య తాయత్తును విప్పి దూరంగా గిరవాటు వేశాడు. కాని అది వెంటనే వచ్చి మరిడయ్య జబ్బకు అంటుకున్నది. అంతే కాదు, ఇప్పుడది నిప్పులా కాలటం మొదలు పెట్టింది.
 
మరిడయ్య దాన్ని తీసే ప్రయత్నం మానుకున్నాకనే అది చల్లబడింది. మరిడయ్యకు పెద్ద చిక్కే వచ్చింది. నెల పొడుగునా తినటానికి తెచ్చుకున్న తిండిగింజలు రెండు రోజులు కూడా రాలేదు. కాయకష్టం చేసుకునే మరిడయ్య కదల్చటానికే సాధ్యంకాని స్థూలశరీరంతో నానా అవస్థా పడవలసి వచ్చింది. ఒక్క తిండికే తనకున్నదంతా అమ్ముకుని, మరిడయ్య తనకిక చావు తప్ప శరణ్యం లేదనుకుని, ఊరి బయట ఉన్న మర్రిచెట్టు కిందికి చేరి, చావుకోసం ఎదురు చూడసాగాడు.
 
అపరాహ్ణం వేళ, పొరుగూరి నుంచి అటుగా వస్తున్న ఒక బక్కచిక్కి ఉన్న మనిషి మర్రిచెట్టు కింద ఆగి, మరిడయ్య శరీరం కేసి చూసి, ‘‘గురువుగారూ, నా పేరు వెంకయ్య. ఒళ్ళు లావెక్కటానికి చిట్కా ఏమన్నా ఉంటే చెబుతారా? అస్థిపంజరంలా ఉండటం చేత నాకు పెళ్ళి కాకుండా ఉన్నది,'' అన్నాడు. ప్రాణంలేచి వచ్చినట్టయి, ‘‘అంతా తాయత్తు మహిమ!'' అన్నాడు మరిడయ్య. ‘‘ఆ మహిమ ఏమిటో నాకు చూపిద్దురూ,'' అన్నాడు వెంకయ్య. మరిడయ్య తన జబ్బకు ఉన్న తాయత్తు విప్పి, వెంకయ్య జబ్బకు కట్టుతూ, ‘‘నేను కనుమరుగై వెళ్ళిపోయూకగాని, దీని మహిమ నీకు తెలియదు.

నువ్వు ఈ తాయత్తును వదిలించుకోవాలంటే దాన్ని మరొకరి జబ్బకు కట్టవలిసి ఉంటుంది. దాన్ని పొరపాటున కూడా ఊడతీసి పారెయ్యకు, నిప్పు కాల్చినట్టు నిన్ను కాల్చుతుంది,'' అని చెప్పి, తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయూడు. అతను కనపడకుండా పోయినదాకా చూసి తన శరీరం కేసి చూసుకునే సరికి వెంకయ్యకు తల తిరిగినట్టయింది. అతని శరీరం అతిస్థూలంగా తయూరయింది.
 
అతను తన ఊరు వెళ్ళాడు గాని, అంత స్థూలంగా ఉన్నవాడికి ఎవరూ పిల్ల నిచ్చారు కారు. హతాశుడై వెంకయ్య తిరిగి నగరం చేరుకున్నాడు. వెంకయ్యకు కూడా తిండి సమస్య ఏర్పడింది. కాషాయవస్త్రాలు ధరించి, ఇల్లిల్లూ తిరిగి ముష్టి ఎత్తుతూ, జీవించసాగాడు. ఒకనాడు వెంకయ్య ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఒక బ్రహ్మచారిణి ఉంటున్నది. ఆమె వికారి కావటం చేత పెళ్ళికాలేదు.
 
ఆమె తలుపు తెరిచి, వెంకయ్య కాషాయవస్త్రాలు చూసి, ‘‘అందంగా కనిపించటానికి కిటుకు ఏమైనా ఉన్నదా, స్వామీ?'' అన్నది. వెంకయ్య బుర్ర మెరుపులా పనిచేసింది. ‘‘లేకేమి? తాయత్తు ఉన్నది,'' అన్నాడు. ‘‘ఆ తాయత్తు నా కిచ్చి పుణ్యం కట్టుకోండి,'' అన్నది బ్రహ్మచారిణి. వెంటనే వెంకయ్య తన తాయత్తు విప్పి ఆమె జబ్బకు కట్టుతూ, ‘‘నేను కనిపించ కుండా వెళ్ళిన తరవాతనే ఈ తాయత్తు మహిమ నీకు తెలుస్తుంది.
 
దీన్ని వదిలించాలంటే మరొకరి జబ్బకు కట్టటం తప్ప మార్గాంతరం లేదు,'' అని చెప్పి, వెళ్ళిపోయూడు. బ్రహ్మచారిణి లోపలికి వెళ్ళి, తన అందం చూసుకోవటానికి నిలువుటద్దం ముందు నిలబడి, తుళ్ళి పడింది. అంత నిలువు అద్దంలోనూ ఆమె శరీరంలో నాలుగో వంతు కూడా కనపడటం లేదు. ఆమె శోకాలు పెట్టింది. చుట్టు పక్కల వాళ్ళు వచ్చి ఆమెను చూశారు.
 
అలా వచ్చినవారిలో ఆ నగరపు యువరాణి పరిచారిక కూడా ఉన్నది. బ్రహ్మచారిణిని చూడగానే ఆమె విరగబడి నవ్వుతూ, ‘‘యువరాణీ వారు నవ్వి నాలుగేళ్ళయింది. నిన్ను చూస్తే ఆమె తప్పక నవ్వుతుంది,'' అన్నది. ఆమె బ్రహ్మచారిణిని ఉద్యానవనంలో ఉన్న యువరాణి వద్దకు తీసుకుపోయింది.

భూతకిలా ఉన్న బ్రహ్మచారిణి ఒయ్యూరంగా నడుస్తూ వస్తూ ఉండటం చూడగానే యువరాణి గల గలా నవ్వి, ‘‘ఇంతకాలానికి నన్ను మళ్ళీ నవ్వించగలిగావు. నీలో ఏం మహత్తు ఉన్నది?'' అని బ్రహ్మచారిణిని అడిగింది. ‘‘మహత్తు నాది కాదు, తాయత్తుది,'' అన్నది బ్రహ్మచారిణి. ‘‘ఏదీ? ఆ తాయత్తు ఒక్కసారి చూస్తాను. ఇలా ఇయ్యి,'' అని యువరాణి అడిగింది.
 
‘‘కట్టుకుని మరీ చూడండి,'' అంటూ బ్రహ్మచారిణి తన తాయత్తు తీసి యువరాణి జబ్బుకు కట్టి, ‘‘మరొకరి జబ్బకు కట్టినప్పుడే ఇది మిమ్మల్ని వదులుతుంది,'' అని చెప్పేసి, వేగంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. యువరాణి పల్లకి ఎక్కి, రాజభవనానికి బయలు దేరింది. కొద్దిదూరం పోయేసరికే బోయీలకు పల్లకి బరువు మోయరానంత అయిపోయి దాన్ని కింద పడేశారు.
 
యువరాణి భూతకిలా లేచింది. తన తండ్రిని చూడగానే యువరాణి బావురుమని ఏడుస్తూ, జరిగిన సంగతి చెప్పింది. ఒక్కగా నొక్క కూతురు పరిస్థితి చూడలేక రాజు తాయత్తును తెంపి దూరంగా పారేశాడు. కాని మరుక్షణమే అది వచ్చి యువరాణి జబ్బకు కరుచుకుని, నిప్పులా కాల్చసాగింది. ఆమె పడేబాధ సహించలేక, రాజు ఆ తాయత్తును తానే కట్టుకున్నాడు. యువరాణి ఎప్పటిలా నాజూకుగా తయూరయింది గాని, రాజు స్థూలకాయుడై పోయూడు.
 
రాజుగారు కనక తిండి సమస్య లేదుగాని, దుస్తులూ, సింహాసనమూ, కిరీటమూ, ప్రతిష్ఠా సమస్యలై కూర్చున్నాయి. మర్నాడు ఆయన బ్రహ్మచారిణిని ప్రశ్నించి, తాయత్తును ఆమెకిచ్చిన వెంకయ్యను అడిగి, అతనికిచ్చిన మరిడయ్య ఆరా తీయించి, మరిడయ్యకు తాయత్తు అంటగట్టిన వాణ్ణి గురించి తెలుసుకోలేక పోయూడు.
 
చివరకు ఆయన నిండు సభలో తాయత్తు గురించి చెప్పి తన తాయత్తు కట్టించుకున్న వాడికి తిండి వగైరా ఏర్పాట్లు చేస్తానన్నాడు. అప్పుడు ఒక మనిషి తాయత్తు కట్టించుకునేటందుకు ముందుకు వచ్చాడు. వాడే మరిడయ్యకు తాయత్తు అంటగట్టిన వాడు. వాడు మళ్ళీ స్థూల శరీరం తెచ్చుకుని, హాయిగా రాజమందిరంలో తింటూ, యువరాణిని వినోదపరుస్తూ జీవించాడు.

కొలనులో అద్భుతం!


ఒకానొకప్పుడు గొప్ప శివభక్తుడైన విజయూ దిత్యుడనే రాజు చలవరాళ్ళతో అందమైన శివాలయం నిర్మించాడు. గుడిలోని శివలింగా నికి రకరకాలుగా పూజలు జరిపి, శివుడి కరుణ పొందాలని నిరంతరం తపిస్తూ ఉండేవాడు. ఒకనాడాయన, ‘‘శ్రావణమాసం ఆరంభ మయింది. శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతిపాత్రమైన శుభదినం. ఆ రోజు శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తే బావుంటుంది కదా?'' అని తీవ్రంగా ఆలోచించసాగాడు.
 
శివుడు అభిషేక ప్రియుడు కదా. అందువల్ల ప్రతి సోమవారం శివలింగాన్ని వెయ్యిన్ని ఎని మిది కలశాల పాలతో అభిషేకించడం శ్రేయస్కరం. అందుకు అవసరమయ్యే పాలను ప్రజల నుంచే సేకరించాలి. అప్పుడే అభిషేక పుణ్యం ప్రజలందరికీ దక్కుతుంది, అని భావించి పాలను సేకరించడానికి, వెనువెంటనే ఆలయ ప్రాగణంలోనే ఒక కొలను తవ్వించాడు. కొన్ని రోజుల తరవాత నగరంలో, ‘‘నగర ప్రజలందరూ వినండహో... రేపే మొదటి శ్రావణ సోమవారం.
 
దానిని ఉద్దేశించి మన రాజుగారు వెయ్యిన్ని ఎనిమిది బిందెల పాలతో శివుడికి అభిషేకం చేయనున్నారు. దీని కోసం ప్రతి గృహస్తూ, రేపు తెల్లవారగానే, తమ ఇంట్లో ఉన్న పాలను తీసుకువెళ్ళి, శివాలయ ప్రాంగ ణంలో అందుకని ప్రత్యేకంగా తవ్వబడి ఉన్న కొలనులో పోయూలి. గుర్తుంచుకోండి: మీ ఇళ్ళల్లో ఉన్న పాలన్నింటినీ కొలనులో పోయూలి. చుక్క కూడా మిగుల్చుకోకూడదు. అప్పుడే కొలను త్వరగా నిండగలదు.
 
ఇదే శివుడికి సంతోషం కలిగిస్తుంది. మీ అందరినీ కృపతో చూసి రక్షిస్తాడు!'' అని చాటింపు చేశారు. నగర ప్రజలందరూ ఆ చాటింపు విన్నారు. రాజుగారి శివభక్తిని తలుచుకుని కొందరు సంతోషించారు. తమ దగ్గరున్న పాలన్నిటినీ శివపూజకని కొలనులో పోసేస్తే ఎలా అని పలు వురు అనుకున్నారు. అయినా, రాజాజ్ఞ గనక ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయూరు.

ఒకానొకప్పుడు గొప్ప శివభక్తుడైన విజయూ దిత్యుడనే రాజు చలవరాళ్ళతో అందమైన శివాలయం నిర్మించాడు. గుడిలోని శివలింగా నికి రకరకాలుగా పూజలు జరిపి, శివుడి కరుణ పొందాలని నిరంతరం తపిస్తూ ఉండేవాడు. ఒకనాడాయన, ‘‘శ్రావణమాసం ఆరంభ మయింది. శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతిపాత్రమైన శుభదినం. ఆ రోజు శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తే బావుంటుంది కదా?'' అని తీవ్రంగా ఆలోచించసాగాడు.
 
శివుడు అభిషేక ప్రియుడు కదా. అందువల్ల ప్రతి సోమవారం శివలింగాన్ని వెయ్యిన్ని ఎని మిది కలశాల పాలతో అభిషేకించడం శ్రేయస్కరం. అందుకు అవసరమయ్యే పాలను ప్రజల నుంచే సేకరించాలి. అప్పుడే అభిషేక పుణ్యం ప్రజలందరికీ దక్కుతుంది, అని భావించి పాలను సేకరించడానికి, వెనువెంటనే ఆలయ ప్రాగణంలోనే ఒక కొలను తవ్వించాడు. కొన్ని రోజుల తరవాత నగరంలో, ‘‘నగర ప్రజలందరూ వినండహో... రేపే మొదటి శ్రావణ సోమవారం.
 
దానిని ఉద్దేశించి మన రాజుగారు వెయ్యిన్ని ఎనిమిది బిందెల పాలతో శివుడికి అభిషేకం చేయనున్నారు. దీని కోసం ప్రతి గృహస్తూ, రేపు తెల్లవారగానే, తమ ఇంట్లో ఉన్న పాలను తీసుకువెళ్ళి, శివాలయ ప్రాంగ ణంలో అందుకని ప్రత్యేకంగా తవ్వబడి ఉన్న కొలనులో పోయూలి. గుర్తుంచుకోండి: మీ ఇళ్ళల్లో ఉన్న పాలన్నింటినీ కొలనులో పోయూలి. చుక్క కూడా మిగుల్చుకోకూడదు. అప్పుడే కొలను త్వరగా నిండగలదు.
 
ఇదే శివుడికి సంతోషం కలిగిస్తుంది. మీ అందరినీ కృపతో చూసి రక్షిస్తాడు!'' అని చాటింపు చేశారు. నగర ప్రజలందరూ ఆ చాటింపు విన్నారు. రాజుగారి శివభక్తిని తలుచుకుని కొందరు సంతోషించారు. తమ దగ్గరున్న పాలన్నిటినీ శివపూజకని కొలనులో పోసేస్తే ఎలా అని పలు వురు అనుకున్నారు. అయినా, రాజాజ్ఞ గనక ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయూరు.

నగరంలోని ప్రజలందరూ తమ వద్ద ఉన్న పాలన్నింటినీ తెచ్చి కొలనులో పోశారు; అయినా వృద్ధురాలు వచ్చి తనవంతు పాలు పోసేంతవరకు కొలను సగమే నిండింది. ఆమె వచ్చి గిన్నెడు పాలు పోయగానే కొలను పూర్తిగా నిండిపోయింది. ఆ సంగతి రాజుకు తెలియడంతో, దాని రహస్యమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అందువల్ల మూడవ సోమవారం ఏం జరుగు తున్నదో చూడాలన్న కుతూహలంతో కాపలా భటుడి వేషం ధరించి తెల్లవారకముందే కొలను వద్ద నిలబడ్డాడు.
 
ఎప్పటిలాగే ప్రజలు బిందె లలో పాలు తెచ్చి కొలనులోకి కుమ్మరించ సాగారు. కొలను సగం వరకు నిండి అలాగే ఆగిపోయిందే తప్ప, ఆ తరవాత ఎన్ని బిందెల పాలు పోసినా ఏమాత్రం పెరగలేదు. మధ్యాహ్నవేళకు గిన్నెనిండా పాలతో వచ్చిన వృద్ధురాలు, ‘‘పరమేశ్వరా, నేను మిగల్చ గలిగి నంత పాలు తెచ్చి నీకు భక్తితో సమర్పిస్తు న్నాను. అపార కరుణాసముద్రుడివైన నువ్వు దయతో స్వీకరించగలవని దృఢంగా విశ్వసిస్తు న్నాను. మమ్మల్నందరినీ చల్లగా చూడు తండ్రీ,'' అంటూ గట్టిగా ప్రార్థిస్తూ పాలను కొలనులో పోసి, వెనుదిరిగింది.
 
ఆ క్షణమే పాలు పొంగుతూ కొలను నిండిపోయింది. ఆ అద్భుత దృశ్యం చూసిన రాజు అబ్బుర పడ్డాడు. ఒక్క గెంతున ముందుకు వచ్చి వృద్ధురాలి దారికి అడ్డంగా నిలబడి ఆమెను ఆపాడు. ‘‘నన్నెందుకు ఆపావు నాయనా? నేనేం తప్పు చేశాను?'' అన్నది వృద్ధురాలు భయంతో కంపి స్తూన్న కంఠస్వరంతో. ‘‘భయపడకమ్మా, నేనీ రాజ్యాన్ని పాలించే రాజును. నీ నుంచి ఒక విషయం తెలుసు కోవాలి. పొద్దుట్నుంచి ప్రజలందరూ శివాభి షేకం కోసం బిందెలతో పాలను తెచ్చి కొలనులో పోశారు.
 
అయినా, అది సగం వరకే నిండి అలాగే ఉండి పోయింది. నువ్వు వచ్చి గిన్నెడు పాలు పోయగానే, అంచుల వరకూ నిండి పోయింది. ఎందుకిలా జరిగిందో చెప్పగ లవా?'' అని అడిగాడు రాజు. ‘‘ప్రభూ, నేనొక తల్లిని. కన్న బిడ్డలు ఆకలితో అలమటించడం ఏ తల్లీ చూడ జాలదు కదా! అందువల్ల తమ ఆజ్ఞను పూర్తిగా పాటించలేక పోయూను. పాలు పితికేప్పుడు లేగలకు కొంచెం వదిలి పెట్టాను. పిండిన పాలను నా పిల్లలకూ, మనమలకూ ఇవ్వగా మిగిలిన గిన్నెడు పాలనే తెచ్చి శివుడి అభిషేకానికి సమర్పించాను. సకల జీవరాశులకూ తల్లీ తండ్రీలాంటివాడు కదా శివుడు.

తన బిడ్డలకు ఆహారం లేకుండా చేయడం ఆయన ఆమోదించగలడా? ప్రభూ, ఉన్న మాట అంటున్నందుకు క్షమించాలి. తమరు చేసింది అదే కదా! ప్రజలందరూ దూడ లకూ, పిల్లలకూ, వృద్ధులకూ, రోగులకూ మిగల్చకుండా పాలన్నిటినీ తీసుకురావాలని ప్రజలను ఆజ్ఞాపించారు కదా. ప్రజలకది ఇష్టం లేదు. బాధ కలిగించింది. తమ ఆజ్ఞను మీర లేక, అయిష్టంగానే పాలను తెచ్చి సమర్పిం చారు. శివుడికిది ఇష్టం లేదు. అందుకే అసంతృప్తి వ్యక్తం చేశాడనుకుంటాను,'' అన్నది వృద్ధురాలు.
 
ఆ మాట విని రాజు దీర్ఘాలోచనకు లోన య్యూడు. ‘‘అవును, ఆ వృద్ధురాలి మాట అక్షరాలా నిజం. కన్న తండ్రిలా, ప్రజల అవసరాలకు, ఆరోగ్యానికి ఎలాంటి కొరతా లేకుండా చూడడం రాజు బాధ్యత. అయితే ఇప్పుడు తను చేసిందేమిటి? అభిషేకం పేరుతో పిల్లలకూ, పెద్దలకూ ఆఖరికి నోరులేని లేగ లకు సైతం పాలు లభించకుండా చేస్తున్నాను. ఇది ఘోర పాపమే అవుతుంది. దీన్ని దేవుడెలా ఆమోదించగలడు? నన్నెలా ఆశీర్వదిస్తాడు?'' అనుకుంటూ తీవ్రమైన అంతర్మథనానికి లోనయ్యూడు.
 
ఒక విధమైన అపరాధభావమూ, అవమానమూ ఆయన్ను ఆవరించాయి. ఆ తరవాత వృద్ధురాలికేసి తిరిగి, ‘‘నాకు నిజమైన భక్తి మార్గం చూపి, నా కళ్ళు తెరిపిం చావు. కృతజ్ఞతలు తల్లీ,'' అంటూ చేతులు జోడించాడు. రాబోయే సోమవారం లేగలకూ, పిల్లలకూ, వృద్ధులకూ ఇవ్వగా మిగిలిన పాలను మాత్రం శివుడి అభిషేకానికి తెచ్చి ఇస్తే చాలునని అప్పటి కప్పుడే నగరమంతటా చాటింపు చేయించాడు. మరుసటి సోమవారం, అంటే ఆఖరి శ్రావణ సోమవారం రానే వచ్చింది.
 
తెల్లవారేసరికి నగర ప్రజలు తాము మిగల్చగలిగిన పాలతో ఆలయం వద్దకు వచ్చారు. రాజు సైతం, లేగలకూ, రాజ భవనంలోని పిల్లలకూ ఇవ్వగా మిగిలిన పాలను మాత్రమే తెచ్చి, అభిషేకానికి కొలనులో పోశాడు. దాని ఫలితం వెనువెంటనే తెలియ వచ్చింది. రెండుబారల పొద్దెక్కే సరికి కొలను పాలతో నిండిపోయింది! వృద్ధురాలు వచ్చేంతవరకు రాజు అక్కడే కాచుకుని ఉన్నాడు. ఆమె వచ్చి, తన వంతు పాలు సమర్పించాక, రాజు ఆమెను సాద రంగా ఆలయం లోపలికి తీసుకువెళ్ళాడు. ఉభయులూ కలిసి శివుడికి క్షీరాభిషేకం నిర్వ హించారు. ‘‘ఆఖరికి దేవుడు నిజంగానే ఆనందిం చాడు. చాలా కృతజ్ఞతలు తల్లీ,'' అన్నాడు రాజు ఎంతో ఆనందంతో.

క్లిష్టమైన ప్రశ్న - చక్కని జవాబు


గొప్ప పండితుడుగా అందరి చేతా కొని…ూడబడే చిత్రానందస్వామి, చాలా కాలంగా గ్రామసీమలకు దూరంగా, ఒక సెలేుటి ఒడ్డున గల ఒక అందమైన ఉద్యానవనంలో విద్యాపీఠం నిర్వహిస్తున్నాడు.
 
ఆ…ున పదిహేనేళ్ళ వ…ుసులో, విద్యా పిపాసకొద్దీ, అనేక ప్రాంతాలు తిరిగి, ఎందరో పండితుల వద్ద విద్యాభ్యాసం చేసి, చివరకు …ూభై ఏళ్ళు నిండుతుండగా, నవద్వీపం నుంచి తిరిగి వచ్చాడు.
 
ఆ…ున నడుపుతూన్న సుప్రసిద్ధమైన ఆ గురుపీఠంలో ప్రవేశం దొరకడం సామాన్యమైన విష…ుం కాదు. అక్కడ ఐదేళ్ళపాటు శిక్షణ పొంది బ…ుటికి వచ్చిన విద్యార్థులకు ఏ ఆస్థానంలో అయినా సులభంగా మంచి ఉద్యోగం దొరికేది.
 
ఆ కారణం వల్ల, చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా, ఎందరో విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుంచి, చిత్రానంద స్వామి గురుపీఠంలో విద్య నభ్యసించేందుకు వచ్చేవారు.
 
తన దగ్గర శిక్షణ పొందడానికి వచ్చే విద్యార్థుల తెలివితేటలనూ, సమ…ుస్ఫూర్తినీ పరీక్షంచటానికి, ఆ…ున వారికి కొన్ని పరీక్షలు పెటే్టవాడు. వాటిలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే గురుపీఠంలో ప్రవేశం లభించేది.
 
ఒకనాటి సా…ుం సమ…ు వేళ, పదహారేళ్ళు నిండిన …ుువకుడొకడు చిత్రానంద స్వామిని దర్శించ వచ్చి పాదాలకు నమస్కరించి, ‘‘గురుదేవా! తమ విద్యాపీఠం ప్రసిద్ధి విని ఎంతో దూరప్రాంతం నుంచి వచ్చాను. మీ విద్యాపీఠంలో శిక్షణ పొందే భాగ్యం నాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను,'' అన్నాడు.
 
చిత్రానంద స్వామి, ఆ …ుువకుణ్ణి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూశాడు. ఆ…ునకు, ఆ …ుువకుడి ముఖంలో ఏదో అనిర్వచ నీ…ుమైన తేజస్సు కనిపించింది.

విన…ుంగా చేతులు మోడ్చి నిలబడిన ఆ …ుువకుడితో ఆ…ున, ‘‘విద్యాపీఠంలో చేర్చుకునే ముందు ఎవరికైనా పరీక్ష పెడుతుంటాను. నేనిప్పుడు, నీకొక చిన్న పరీక్ష పెట్టదలచాను. నేనడిగే ప్రశ్నలకు, నాకు నచ్చిన సమాధానం చెప్పావంటే, పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడివైనటే్ట!'' అన్నాడు.
 
‘‘అలాగే, ఆ ప్రశ్న ఏదో అడగండి, గురుదేవా!'' అన్నాడు ఆ …ుువకుడు ఏమాత్రం తొణకకుండా.
 
‘‘సరే! అతి సామాన్యమైన పది ప్రశ్నలు అడగమంటావా లేక ఒకే ఒక క్లిష్టమైన ప్రశ్న అడగమంటావా?'' అన్నాడు చిత్రానందుడు చిరునవ్వుతో.
 
‘‘క్షమించండి, గురుదేవా! గంగిగోవు పాలు గరిటెడయినను చాలు, అంటారు కదా. పది ప్రశ్నలు అడిగించుకుని, మీ విలువైన సమ…ూన్ని వృథా చే…ుడం ఉచితం కాదు. అందుచేత, ఒకే ఒక క్లిష్టమైన ప్రశ్నే అడగండి సమాధానం చెప్పడానికి ప్ర…ుత్నిస్తాను,'' అన్నాడా …ుువకుడు.‘‘ఐతే, తడుముకోకుండా వెంటనే సమాధానం చెప్పు. విత్తుముందా చెట్టుముందా?'' అని ప్రశ్నించాడు చిత్రానంద స్వామి.
 
‘‘చెటే్టముందు, గురుదేవా!'' అంటూ వెంటనే సమాధానమిచ్చాడు …ుువకుడు దృఢ విశ్వాసంతో. ఆ సమాధానం విని, చిత్రానందస్వామి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోతున్నవాడిలా, …ుువకుడి ముఖంలోకి చూస్తూ, ‘‘ఈ జవాబుకు తిరుగులేదన్నట్టుగా - చెటే్ట అని ఎలా అంతరూఢిగా చెప్పగలవు?'' అని మళ్ళీ ప్రశ్నించాడు.
 
అప్పుడా …ుువకుడు, ‘‘గురుదేవులు మన్నించాలి. నన్ను ఒకే ప్రశ్న అడుగుతాన న్నారు. కానీ, తమరు ఇప్పుడు నన్నడిగింది రెండో ప్రశ్న. కనక సమాధానం చెప్పవలసిన అవసరం లేదని సవిన…ుంగా మనవి చేసు కుంటున్నాను,'' అన్నాడు ఎంతో భక్తిగా చేతులు జోడించి.
 
ఈ జవాబుకు చిత్రానంద స్వామి మొదట ఆశ్చర్యపోయినా, తర్వాత చిరునవ్వు నవ్వి …ుువకుడి సూక్ష్మబుద్ధికీ, సమ…ుస్ఫూర్తికీ ఎంతగానో సంతోషించి, అతణ్ణి ఆ రోజే తన విద్యాపీఠంలో చేర్చుకున్నాడు.

వీరముష్టి


బుద్ధవరం అనే ఒక చిన్న పట్టణంలో, నారన్న అనే మంచి మాటకారి బిచ్చగాడుండేవాడు. వాడు బిచ్చం కోసం తిరిగే వీధుల్లో ఒక చోట పెద్ద వడ్డీ వ్యాపారివుండేవాడు. నారన్నకు మామూలు ఇళ్ళల్లో బిచ్చం సులువుగా దొరికినా, అది వాడి రోజువారీ తిండికి సరిపోయేదికాదు. వడ్డీ వ్యాపారి నుంచి అయితే, ఏదో కొంత భారీగా డబ్బు ముట్టుతుందని, వాడి ఆశ.
 
కానీ, వడ్డీవ్యాపారి భవనద్వారం దగ్గరుండే కాపలావాడు, నారన్న అటుకేసి నాలుగడుగులు వేయగానే, పోపొమ్మంటూ కసురుకునేవాడు. వడ్డీ వ్యాపారి కంటబడడం ఎలాగా అని వాడు బాగా ఆలోచించి, ఒకనాడు వ్యాపారి ఇంటికాపలావాడు కొంచెందూరంలో ఎవరితోనో మాట్లాడు తుండగా, ధైర్యం చేసి ద్వారం గుండా లోపల ప్రవేశించి, ‘‘అయ్యూ, వడ్డీ వ్యాపారిదాతగారూ!'' అంటూ కేకపెట్టాడు. నారన్న అలా భవనం లోపలికిరావడం, ఆ కేకలూ విని వ్యాపారి పనివాళ్ళు, వాణ్ణి బయటకు నెట్టేసేందుకు ప్రయత్నించారు.
 
ఐతే, వాడు మరింతగా కేకలు పెట్టడం ప్రారంభించాడు. భవనం పైగదిలో వడ్డీ లెక్కలు చూసుకుంటున్న వ్యాపారి కిందికి దిగి వచ్చి, గొడవకు కారణం తెలుసుకుని, నారన్నకు ఐదు రూపాయిలిస్తూ, ‘‘ఒరే, నీదేదో వీరముష్టిలా వుంది! ముష్టి అడిగే పద్ధతి ఇది కాదు. నువ్వింత గొడవ చేయకపోతే, ఐదు కాదు పది రూపాయలిచ్చి వుండేవాణ్ణి,'' అన్నాడు.
 
నారన్న డబ్బును జోలెలో వేసుకుని, వడ్డీ వ్యాపారితో, ‘‘అయ్యూ, ఇంతవరకు ఒళ్ళు హూనమయ్యేలా మీ పనివాళ్ళు వడ్డించింది చాలు. అయినా, మీ వృత్తి వడ్డీ వ్యాపారం. అదెలా చేయూలో మీకు నేను సలహాయివ్వలేదు. నేను వృత్తి బిచ్చగాణ్ణి. నాకు బిచ్చం ఎలా ఎత్తాలన్నదాన్ని గురించి సలహాలివ్వకండి!'' అంటూ అక్కడి నుంచి వెనుదిరిగాడు

మూడవ వరం


విపులుడు, చంద్రకాంతుడు అనే ఇద్దరు మిత్రులు దారిపక్కన సత్రంలో కూర్చుని ఏవో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక అపరిచితుడు అక్కడికి వచ్చి ఒక ఉంగరం చూపుతూ, ‘‘ఈ వజ్రపుటుంగరాన్ని, మీ రెవరైనా కొనుక్కుంటారా?'' అని అడిగాడు.
 
ఆ ఇద్దరు మిత్రుల్లో విపులుడు ధనికుడు. చంద్రకాంతుడు పేద ఉపాధ్యా…ుుడు. అందువల్ల చంద్రకాంతుడికి దాన్ని కొనే శక్తీ, ఆసక్తీ రెండూ లేవు. విపులుడికి ఆ విలువైన ఉంగరాన్ని కొనుక్కోవాలనిపించింది.
 
‘‘ఈ ఉంగరం నీకెక్కడిది?'' అని అడిగాడు విపులుడు దానిని తెచ్చిన వ్యక్తిని.
 
‘‘ఆ సంగతి చెప్పను. వద్దంటే చెప్పు. దీన్ని నగల వ్యాపారికి అమ్ముకుంటాను. డబ్బు వెంటనే కావాలి గనకే నీ దగ్గరికి వచ్చాను,'' అన్నాడు ఉంగరం తెచ్చినవాడు. విపులుడు వాణ్ణి తన ఇంటికి రమన్నాడు. వాడు చాలా సంతోషంగా చంద్రకాంతుడితో కలిసి, అతని వెంట బ…ులుదేరాడు.
 
విపులుడు వాడితో అమితస్నేహంగా మాట్లాడుతూ ఇంటికి తీసుకుపోయి, వాడికి చెందవలసిన మొత్తాన్ని ముట్టజెప్పాడు. ఆ తరవాత, ‘‘మిత్రమా, బాగా పొద్దుపోయింది. ఇంత డబ్బు తీసుకుని రాత్రి పూట వీధుల గుండా వెళ్ళడం క్షేమం కాదు కదా?'' అన్నాడు.
 
విపులుడి అనుమానం సబబైనదే అన్నాడు చంద్రకాంతుడు. ఇద్దరి మాటలూ విన్న వచ్చినవాడు ఆ రాత్రికి అక్కడే వుండి తెల్లవారాక బ…ులు దేరుదామని అనుకున్నాడు.
 
చంద్రకాంతుడు వెళ్ళిపో…ూక, ఉంగరం అమ్మినవాడికి, విపులుడు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశాడు. వాటితో పాటు మత్తు పానీ…ుం కూడా అందించాడు. మత్తు పానీ…ుం కడుపులోకి చేరగానే, అతిథి, విపులుణ్ణి తెగ పొగడడం ప్రారంభించాడు.

ఆ తరవాత తనకు ఉంగరం ఎలా లభించిందో కూడా చెప్పేశాడు:
 
పట్టణానికి కొద్దిదూరంలోని అడవిలో వున్న తాంత్రికుడు ప్రతి అమావాస్య అర్ధరాత్రి సమ…ుంలో …ుజ్ఞం చేస్తాడు. …ుజ్ఞం పూర్త…్యూక, కోరినవారికి కోరిన వరం ఇచ్చేశక్తి అతనికి వస్తుంది. ఒకనాడు ఈ అతిథి అక్కడికి వెళ్ళి, తాంత్రికుడికి ప్రీతికరంగా నడుచుకోవడంతో, సంతోషించిన ఆ…ున …ుజ్ఞం పూర్తి చే…ుగానే, చేతిలోకి చిటికెడు విబూది ఇచ్చి, ఏదో మంత్రం చెప్పి, ‘‘బిడ్డా, మూడు క్షణాలలోగా నీకిష్టమైనది కోరుకో,'' అన్నాడు.
 
అతడు వజ్రపుటుంగరం కావాలని కోరుకున్నాడు. ఆక్షణమే అతని చేతిలోకి అది వచ్చింది. దానిని చూసి మొదట సంతోషించినప్పటికీ, ఆ తరవాత, ‘‘అెూ్య, ... రాజ్యాన్ని కోరుకోకుండా పో…ూనే,'' అని పశ్చాత్తాపపడ్డాడు.
 
తెల్లవారగానే, అతిథి, విపులుడు పెట్టిన ఫలహారంతిని, సంతోషంగా వెళ్ళిపో…ూడు. విపులుడు ఎలాగైనా అడవికి వెళ్ళి తాంత్రికుణ్ణి చూసి వరం పొందాలని నిర్ణయించాడు. అయితే ఒంటరిగా వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. నమ్మకస్థుడైన మిత్రుడు చంద్రకాంతుణ్ణి పిలిపించి, సంగతి చెప్పి, అతన్ని తనకు తోడుగా రమ్మని కోరాడు.
 
అంతా నిర్లిప్తంగా విన్న చంద్రకాంతుడు, ‘‘భగవంతుడు నీకు కావలసినంత ధనం ఇచ్చాడు. ఇంకా ఎందుకు ఆశిస్తావు. మనిషికి కావలసింది మానసిక ప్రశాంతత. నిజాయితీగా ఉంటూ, చుట్టూ ఉన్న వారికి చేతనైన సా…ుం చేస్తూ జీవించడంలో ఉన్న ఆనందం మరెందులోనూ రాదు,'' అన్నాడు. ‘‘నేను ధనమే కోరుకుంటాననే నిర్ణ…ూనికి నువ్వెలా వచ్చావు?'' అని అడిగాడు విపులుడు.
 
‘‘చూడు మిత్రమా! సక్రమంగా దేన్నయినా పొందాలంటే రెండే మార్గాలున్నాయి. మొదటిది సహజంగా మనకు ప్రాప్తిస్తాయి. రెండవది శ్రమించి సాధించాలి. అలా కాకుండా అడ్డదారులలో సంపాయించాలనుకోవడం అవివేకం. ఎవరో తాంత్రికుడి ద్వారా ఏదో సాధించాలనుకుంటే అవి తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి,'' అనిహెచ్చరించాడు చంద్రకాంతుడు.
 
అయితే, తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి తీరాలని విపులుడు పట్టుపట్టాడు. ఒకవైపు మిత్రుడి పట్ల ఉన్న సానుభూతి కొద్దీ, మరొకవైపు మిత్రుడి అసంతృప్తికి గురికావడం భావ్యం కాదన్న ఉద్దేశంతోనూ చంద్రకాంతుడు విపులుడికి తోడుగా వెళ్ళక తప్పలేదు. అమావాస్య చీకట్లు కమ్ముకుంటూండగా, ఇద్దరు మిత్రులూ అడవిలో ప్రవేశించి తాంత్రికుడి కుటీరాన్ని కనుగొన్నారు.

తాంత్రికుడు వాళ్ళపట్ల ఎంతో ఆదరం చూపాడు. అడవిలో దారితప్పి వచ్చారని భావించి వారికి భోజనం పెట్టాడు. ‘‘ఈ రాత్రికి మీరు ఇక్కడ నా కుటీరంలోనే గడిపి వెళ్ళవచ్చు. నేను ఇప్పుడు ఒక …ుజ్ఞం చే…ూలి. అది పూర్తి కాగానే ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను, '' అన్నాడు తాంత్రికుడు.
 
‘‘అడవి వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు, స్వామీ,'' అని అడిగాడు విపులుడు.
 
‘‘దానిని గురుంచి నీ కెందుకు విచారం, నా…ునా? నేనొక మహత్కార్యాన్ని సాధించాలని, ఇక్కడ ప్రతి అమావాస్య రాత్రి …ుజ్ఞం చేస్తూ వస్తున్నాను. ఈ రాత్రి …ుజ్ఞంతో అది పరిసమాప్తమవుతుంది,'' అన్నాడు తాంత్రికుడు.
 
‘‘మీరిచ్చే చిటికెడు విబూదిని చేతిలో ఉంచుకుని మూడు కోరికలను కోరుకుంటే అవి సిద్ధిస్తా…ున్నది, నిజమా? కాదా?'' అని అడిగాడు విపులుడు.
 
ఆప్రశ్న విని విస్మ…ుం చెందిన తాంత్రికుడు, ‘‘ఆ సంగతి నీ కెవరు చెప్పారు? బహుశా వజ్రాన్ని పొందిన ఆ వెర్రిబాగులవాడే చెప్పి ఉంటాడు. అవును. వాడి మీది జాలికొద్దీ అలా చేశాను. ఉంగరం సంగతి ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాను కూడా!'' అన్నాడు తాంత్రికుడు.
 
‘‘నా మీద కూడా అలాంటి కరుణ చూపవచ్చు కదా?'' అని అడిగాడు విపులుడు. ఆ మాటకు తాంత్రికుడు నవ్వి, ‘‘నా…ునా, నువ్వు ఆజ్ఞాపించి నా నుంచి కరుణను పొంద లేవు. కొందరిని చూస్తే జాలి కలుగుతుంది. మరికొందరిని చూస్తే కలగదు. నీ పట్ల కరుణ చూపడానికినాకెలాంటి కారణమూ కనిపించడం లేదు,'' అన్నాడు.
 
‘‘నాకాసా…ుం చే…ుడం వల్ల నీకు వాటిల్లే నష్టం ఏదీ లేదు కదా? దానికెందుకిలా మొండికెత్తుతావు?'' అన్నాడు విపులుడు.
 
‘‘అది నీకు తీరని హాని చే…ువచ్చు! నా …ుజ్ఞానికి ఆటంకం కలిగించ వద్దని హెచ్చరిస్తున్నాను,'' అన్నాడు తాంత్రికుడు గంభీరంగా.
 
‘‘అయితే, నువ్వు నా కోరికలు తీరిస్తే తప్ప, నీ …ుజ్ఞాన్ని ఇక్కడ సక్రమంగా జరగనివ్వను. ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాను. అంతలో తెల్లవారిపోయి, పుణ్యకాలం కాస్తా వెళ్ళి పోతుంది,'' అని బెదిరించాడు విపులుడు. ‘‘నిజంగానా!'' అన్నాడు తాంత్రికుడు ఆగ్రహంతో. జరుగుతున్న దానిని చూస్తూంటే చంద్ర కాంతుడికి జుగుప్స కలిగింది.
 
‘‘విపులా, ద…ుచేసి తాంత్రికుడి ఆగ్రహానికి గురి కావద్దు. అది నీకు మంచిది కాదు,'' అని స్నేహితుణ్ణి మెల్లగా హెచ్చరించాడు.
 
‘‘నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. అవతలికి వెళ్ళు. నేనీ సువర్ణ అవకాశాన్ని వదల దలుచుకో లేదు,'' అన్నాడు విపులుడు.

చంద్రకాంతుడు మెల్లగా బ…ుటికి నడిచి, ఏంచే…ుడానికీ నిర్ణ…ుంచుకోలేక కుటీరం పక్కన నిలబడ్డాడు. తాంత్రికుడు నిప్పురగిలించి ఏవో మంత్రాలు వల్లించసాగాడు. విపులుడు పక్కనే నిలబడ్డాడు. కొంత సేప…్యూక, తాంత్రికుడు చిటికెడు బూడిదతీసి విపులుడి అరచేతిలో ఉంచాడు. విపులుడు ఎలాంటి వరాలు కోరుకున్నాడో చంద్రకాంతుడికి వినిపించలేదు. కాని మంటల కాంతిలో తాంత్రికుడి ముఖంలో హేళన మాత్రం అతనికి స్పష్టంగా కనిపించింది.
 
‘‘నేను తలపెట్టిన బృహత్కార్యం సాధించాలంటే ఈ రాత్రికి నేను అబద్ధం చెప్పకూడదు. ఇతరులకు అసంతృప్తి కలిగించకూడదు. అందుకే నీ కోరికలు సిద్ధించేలా వరం ఇచ్చాను. ఇక వెళ్ళు ఇక్కణ్ణించి,'' అన్నాడు తాంత్రికుడు. విపులుడు ఆ…ునకు వంగి నమస్కరించి పరమానందంతో కుటీరం నుంచి వెలుపలికి వచ్చి, మిత్రుణ్ణి కలుసుకున్నాడు. ఇద్దరూ తిరుగుముఖం పట్టారు. తెల్లవారగానే ఇద్దరూ నదిలో స్నానం చేసి, గ్రామం మధ్య ఉన్న రచ్చబండ సమీపానికి వచ్చారు. ఏదో పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరూ అక్కడ గుమిగూడి ఉన్నారు.
 
వాళ్ళను చూడగానే విపులుడు తన మిత్రుడితో, ‘‘వీళ్ళందరూ నా పాలితులవుతారు. నేను మహారాజును కాబోతున్నాను కదా!'' అన్నాడు. ‘‘ఆ వరమేనా నువ్వు కోరుకున్నది?'' అని అడిగాడు చంద్రకాంతుడు. ‘‘అది వరాల్లో ఒకటి మాత్రమే!'' అన్నాడు విపులుడు. ‘‘మరి, మిగిలిన రెండు వరాలు?'' అని అడిగాడు చంద్రకాంతుడు. ‘‘నేను ఎన్నడూ వ్యాధిగ్రస్తుణ్ణి కాకూడదు; ముసలితనం రాకూడదు.'' ‘‘మరి దీర్ఘా…ుుస్సును ఎందుకు కోరుకో లేదు?'' ‘‘మరీ అంత మూర్ఖుడిగా ఉన్నావేమిటి?
 
ముసలితనం రాకూడదంటే, నేనెప్పుడూ …వనంలో ఉంటాననే కదా అర్థం!'' హఠాత్తుగా విపులుడి ముఖం పాలిపోయింది. అతడు గుండె పట్టుకుని అలాగే కుప్పకూలిపో…ూడు. ‘‘నేనే పరమ మూర్ఖుణ్ణి. నేను కోరుకున్న మూడవ వరం, నాకు ముసలితనం వచ్చేంతవరకు నన్ను ప్రాణాలతో ఉండనీ…ుదని గ్రహించ లేకపో…ూను,'' అంటూ విపులుడు మూలుగుతూ ప్రాణాలు విడిచాడు.

పద్ధెనిమిది రహస్యం


అది 1945 జూలై 30వ తేదీ. హాలీవుడ్‌లో సూర్యోద…ు సమ…ుం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద తిన్నగా వెళుతూన్న చిన్న వ్యాన్‌ను, పొదలచాటు నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు అడ్డగించారు. ఆ ఇద్దరిలో ఒకడు, పొడవుగా, సన్నగా, ఆతృతతో ఉన్నాడు. రెండవవాడు పొట్టిగా, లావుగా నెమ్మదిగా ఉన్నాడు. తుపాకీ గురిపెట్టి, వాహనంలోని ఇద్దరిని బ…ుటకు లాగారు.
 
వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి లాక్కుపోయి దాపులనున్న చెట్టుకు కట్టారు. ఆ తరవాత వ్యానులోకి జొరబడి, అందులోని ఆరుసంచీల వెండినాణాలనూ, ఒక అట్టపెటె్టనిండుగా ఉన్న కొత్త డాలర్‌నోట్లనూ తీసుకుని కొద్ది దూరంలో ఆపిన కారులోకి చేరవేసి, శరవేగంతో ఉద…ుపు పొగమంచులోకి దూసుకుపో…ూరు. పట్టపగలు జరిగిన భ…ుంకరమైన దొంగతనం అది!
 
ఆ వ్యాన్‌ హాలీవుడ్‌ స్టేట్ బ్యాంకుకు చెందినది. చాలా సేప…్యూక, చెట్టుకు బంధించబడిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు, ఆ దారిగుండా వెళుతున్న వారిసా…ుంతో బ…ుటపడ కల్గారు. వారు భ…ుంతో గడగడలాడి పో…ూరు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. తమను తాము రక్షంచుకోలేకపో…ూరు.
 
లాక్‌హీడ్‌ కంపెనీ కార్మికుల జీతాలకోసం బ్యాంకు నుంచి తీసుకువెళుతున్న ధనాన్ని భద్రంగా అక్కడికి చేర్చే తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేకపోయినందుకు వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. దొంగలు ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. వాళ్ళ మీద అపహరణ, దారిదోపిడీ నేరాలు ఆరోపించబడ్డాయి. దొంగిలించిన మొత్తాన్ని పట్టుకోవాలంటే కేసు త్వరగా పరిష్కారం కావాలి. పోలీసులకూ, నేరపరిశోధకులకూ ఇదొక పెద్ద సవాలుగా మారింది.
 
బందిపోట్లు ఏవైనా ఆనవాళ్ళు వదిలారా? చాలామంది దగ్గర విచారణ జరిపారు. దోపిడీకి గురైన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. తన కళ్ళకు గంతలు కడుతూన్నప్పుడు, లావుపాటి చిన్న దొంగ చొక్కా మీద ఒక బ్యాడ్‌‌జ కనిపించిందనీ, అది లాక్‌హీడ్‌ సంస్థ ఎంబ్లెమ్‌ అనీ వారిలో ఒక ఉద్యోగి చెప్పాడు. 

అంటే, ఆ దొంగ ఆ సంస్థలో పనిచేస్తూన్నట్టు చూపుకోవడానికి అలా చేసి ఉండవచ్చు. ఒకనాడు ఒక పోలీసు అధికారికి, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలివే…ుబడిన ఒక కారు కనిపించింది. ఆ కారులోపల ఒక కాగితం ముక్కపై, ఒక వ్యక్తి పేరూ, చిరునామా కనిపించాయి. వెంటనే అక్కడికి వెళ్ళి, ఆ ఇంటి తలుపు తట్టాడు పోలీసు అధికారి.
 
ఒక స్ర్తీ తలుపు తీసి, పోలీసులకేసి ఆశ్చర్యంగా చూసింది. ‘‘దర్యాప్తు కోసం వచ్చాం,'' అన్నారు పోలీసులు. ‘‘అలాగా! సరే కానివ్వండి,'' అని సమాధనం ఇచ్చింది ఏబ్లార్‌‌డ అనే మధ్యవ…ుస్కురాలైన ఆ స్ర్తీ. పోలీసులు ఇల్లంతా వెతికారు. ఆతరవాత ఏబ్లార్‌‌డ పిల్లలు బంతి ఆట ఆడుకుంటూన్న తోటలోకి వెళ్ళారు. ఒక కుర్రాడు విసిరిన బంతి, వేగంగా వెళ్ళి, కాంపౌండ్‌ చివర ఉన్న షెడ్‌లోకి వేగంగా దొర్లుకుంటూ తలుపు కింద వున్న సందు గుండా లోపలికి వెళ్ళింది.
 
పిల్లలు దాని వెనక పరిగెత్తారు. అయితే తలుపుకు తాళం వేసి ఉంది. ‘‘ఆ షెడ్‌లో ఏం వుంది?'' అని అడిగాడు ఒక పోలీసు అధికారి. ‘‘రెండు వారాలక్రితం ఇద్దరు …ుువకులు వచ్చి దానిని అద్దెకు తీసుకున్నారు. అయినా కొన్ని రోజులుగా వాళ్ళు అక్కడ కనిపించడం లేదు,'' అన్నది ఏబ్లార్‌‌డ. పోలీసు అధికారులు అనుమానంతో షెడ్‌ తలుపులు పగలగొట్టారు. తమ బంతి దొరికినందుకు పిల్లలు చాలా సంతోషించారు.
 
అయితే, వాళ్ళకన్నా మరింత ఎక్కువగా సంతోషించారు పోలీసు అధికారులు. ఎందుకంటే వాళ్ళకు ఆ షెడ్‌లో నేల మీద లాక్‌హీడ్‌ గుర్తింపు బ్యాడ్‌‌జతో ఉన్న ఒక చొక్కా, బ్యాంకు మెసెంజర్‌‌సకు చెందిన ఆటోమేటిక్‌ రైఫిల్‌, రివాల్వర్లు కనిపించాయి. పోలీసులు బ్యాడ్‌‌జని లాక్‌హీడ్‌ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళారు.
 
అయితే, అందులోని నంబరుకూ అక్కడి ఉద్యోగుల పేర్లకూ సంబంధం లేదని పరిశోధన ద్వారా తెలి…ువచ్చింది. అంటే దొంగలు తెలివిగా, అసలు అంకెను చెరిపేసి, ప్రత్యేకమైన పెన్నుతో దొంగనంబరు రాశారన్న మాట. అయితే, సైన్‌‌స ప్రెూగశాలలో అల్ట్రా వెుులెట్ వెలుతురు కింద,బ్యాడ్‌‌జ కొన్ని అంకెలను సూచించింది.

వాటిలో ఒరిజినల్‌గా ముద్రించబడిన అంకెల జాడలు కనిపించాయి. వెంటనే పోలీసులు లాక్‌హీడ్‌ ఉద్యోగుల రికార్డులను నిశితంగా పరిశీలించారు. బ్యాడ్‌‌జ మీది పాత నంబరు-పొడవాటి సన్నటి హడావుడి కార్మికుడు జాన్సన్‌కు చెందినదని కనుగొన్నారు.
 
లావుగా, పొట్టిగా నిమ్మకు నీరెత్తినట్టు కనిపించే హార్డీ అతని స్నేహితుడని కూడా కనుగొన్నారు. అతను కూడా కంపెనీలో ఉద్యోగం చేసేవాడే. ఆఖరికి రహస్యం బ…ుడ పడింది. నేరస్థులు గుర్తించబడ్డారు. అయితే, తోడుదొంగలు ఆపాటికే ఎప్పుడో కంపెనీని వదిలి పెట్టారు. వాళ్ళిప్పుడు ఎక్కడ ఉంటారు? ఫ్యాక్టరీ రికార్డుల నుంచి తీసుకున్న వారి ఫోటోల సా…ుంతో, పోలీసులు జాన్సన్‌ను ఒక దారి పక్క హోటల్లో పట్టుకున్నారు.
 
ఆరోజు సా…ుంకాలమే హార్డీ కూడా అదే హోటల్‌ పరిసరాలలో తచ్చాడుతూ పట్టుబడ్డాడు. ఇద్దరనీ జైల్లో బంధించారు. దొంగిలించిన డబ్బును గురించి అడిగినప్పుడు మొదట తమకేమీ తెలి…ుదన్నారు. ఆ తరవాత, తమ ప్రాణాలు తీసినా అదెక్కడ దాచామో చెప్పమన్నారు. అయితే, ఒకనాటి రాత్రి, జాన్సన్‌ పడక కింద నీళƒ్ళితోనిండిన ఒక పాత్ర కనిపించింది. ఆ నీళ్ళ మీద ఒక పాత డాలర్‌నోటు తేలుతున్నది.
 
అసంబద్ధమైన ఈ ప్రెూగం ఎందుకై వుంటుంది? వాళ్ళు డబ్బు దాచిన చోటు తెలుసుకోవడానికి ఇందులో ఏమైనా క్లూ దొరుకుతుందా? పరిశోధనా శాఖ మళ్ళీ రంగంలోకి దిగింది. బహుశా డబ్బును చిత్తడిగా ఉన్న చోట దాచారేమో! అందువల్ల కరెన్సీనోటు నీళ్ళల్లో పడేస్తే ఎన్నాళ్ళలో కుళ్ళిపోతుందో తెలుసుకోవాలని నిందితులు ఈ ప్రెూగానికి దిగారేమో! తోడు దొంగలను జైలులో విడివిడి గదులలో బంధించారు.
 
అయితే, ఒక గార్‌‌డ సా…ుంతో వాళ్ళు పరస్పరం చీటీల ద్వారా రహస్య సందేశాలను అందజేసుకుంటున్నట్టు అధికారులకు తెలిసింది. నేర పరిశోధకులు ఈ సందేశాలను చాలావరకు సేకరించారు. వాళ్ళ సందేశాలలో తరచూ ‘18' అంకె, ‘కాగితం' అనే మాట కనిపించాయి.


 ‘‘మనం ఇక్కడే చాలాకాలం ఉండిపోతే, శీతాకాలం వానలు కాగితాలను నాశనం చే…ుగలవు,'' అని ఒక సందేశంలోనూ, ‘‘మా చిన్న చెల్లెలు వాటిని రక్షంచగలదు. అయితే ఆమె అక్కడికి చేరుకోవడం కష్టం,'' అని మరొక సందేశమూ తెలి…ుజేశాయి. ‘కాగితం' అనే మాట డబ్బుకు పర్యా…ు పదం అయివుంటుంది. అదే నిజమయితే, దానిని మరీ చిత్తడి ప్రదేశంలో, చిన్న పిల్లలు వెళ్ళలేని చోట దాచారన్న మాట.
 
మరి18 దేనికి సంకేతం? అది రోడ్‌ నంబర్‌ అయివుంటుందా? పోలీసులూ, నేర పరిశోధకులూ ‘18' సంఖ్య చెక్కినరాతి ఫలకంగల రోడ్డుకోసం అన్వేషణ ప్రారంభించారు. అదికనిపించింది. దాని పక్కన వాళ్ళకొక సన్నటి మార్గం, దాని చివర పదడుగుల ఎత్తు తీగలకంచెగల శ్మశాన వాటిక కనిపించాయి. ‘‘నిజమే, ఈ సమాధిరాేు సులభంగా జ్ఞాపకం ఉంచుకోగల కొండ గుర్తయివుంటుంది,'' అన్నాడు ఒక పోలీసు అధికారి.
 
‘‘అవునవును. చిన్న పిల్ల, ఎత్తయిన తీగల కంచెను దాటి వెళ్ళ లేదు కదా?'' అన్నాడు మరొక నేరపరిశోధనాధికారి ఉత్సాహంగా. వాళ్ళ అనుమానాలన్నీ ఒకే చోటికి దారితీశాయి. అధికారులు శ్రమకోర్చి శ్మశాన వాటికలో వరుసలు వరుసలుగా ఉన్న సమాధులనన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి చూశారు. మరేదైనా స్పష్టమైన ఆధారం లభిస్తుందా అని జాగ్రత్తగా చూడసాగారు. 1898 సంవత్సరంలో మరణించిన ఒక సైనికుడి సమాధిరాయి వెనక చెత్తాచెదారం, ఆకులూ అలములూ, కొమ్మలూ రెమ్మలూ కప్పిన ఎత్తయిన మట్టిదిబ్బ కనిపించింది! అధికారులు దానిని తవ్వి చూశారు.
 
సమాధిరాయి కింద చాలాలోతులో దొంగిలించిన - ఆరు సంచీల వెండి నాణాలూ, అట్టపెటె్ట నిండుగా మిలమిలలాడే కొత్త డాలర్‌ నోట్లూ కనిపించాయి! తాము కనుగొన్న దానిని గురించి జైల్లో వున్న తోడుదొంగలకు తెలి…ుజేశారు. మొదట వాళ్ళు దానిని నమ్మ డానికి నిరాకరించారు. అయితే ఆఖరికి, తమనేరాన్ని అంగీకరించక తప్పలేదు. 

శత్రువిభజన


వెంకటగిరి అనే గ్రామంలో వీరన్న అనే రైతు ఉండేవాడు. అతనికి నాలుగు ఎకరాల పొలం ఉండేది. అతను కష్టపడి పని చేసి, అందులో వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక ఏడు వర్షాలు లేక కరువు వచ్చి, ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువయింది. కాని మరుసటేడు వర్షాలు పడి, పైర్లు పచ్చగా పెరిగాయి. వీరన్న పొలంలో జొన్న బాగా పండింది.
 
వీరన్న రాత్రిళ్ళు పొలానికి కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి అతను తన గుడిసెలో పడుకుని కునుకుతూ ఉండగా ఉన్నట్టుండి చేనులో ఏదో చప్పుడయింది. దొంగలై ఉంటారనుకుని వీరన్న కర్ర తీసుకుని, కంబళి కప్పుకుని బయలుదేరాడు. అల్లంత దూరంలో నలుగురు దొంగలు చేనులో ప్రవేశించి కంకులు కోస్తూ ఉండటం అతని కంటబడింది. వెన్నెలలో అతను ఆ దొంగలను పోల్చుకున్నాడు.
 
వాళ్ళు అతని గ్రామానికి చెందినవాళ్ళే. వాళ్ళు నలుగురూ, తాను ఒక్కడే! కర్ర తీసుకుని వారి పైకి పోవటం తనకే ప్రమాదం. ఏం చెయ్యూలా అనుకుంటూ ఉండగా అతినికి ఒక ఆలోచన వచ్చింది. అతను కరన్రు అక్కడే వదిలేసి, నిర్భయంగా దొంగలను సమీపించాడు. వీరన్న చేనులో దొంగతనంగా రాత్రివేళ జొరబడి కంకులు కోస్తూన్న నలుగురిలో ఒకడు పురోహితుడు, ఒకడు వ్యాపారి, ఒకడు క్షత్రియుడు, నాలుగోవాడు నాగన్న అనే పేద రైతు.
 
వీరన్న పురోహితుణ్ణి సమీపించి నమస్కారం చేసి, ‘‘స్వామీ, మీరు అర్ధ రాత్రి వేళ రావాలా? కాకి చేత కబురు పంపితే మీకు కావలిసిన జొన్న కంకులు నేనే కోసి తెచ్చి ఇంటి దగ్గిర ఇద్దును కద! మీరు నిశ్చింతగా కోరినన్ని కంకులు కోసుకోండి,'' అన్నాడు.

పురోహితుడు పొంగి పోయి, తనకేమీ భయం లేదనుకున్నాడు. తరవాత వీరన్న క్షత్రియుడి వద్దకు వెళ్ళి, రామరాజుగారూ, తమరు మాకు ప్రభువులు. అందుచేత ఈ పొలం మీదే. మీరు ఎన్ని కంకులు కోసుకుంటే మటుకు అడిగే వాడెవడు? అన్నాడు. ఈ మాటవిని క్షత్రియుడు తనకు కూడా భయం లేదనుకుని, నిశ్చింతగా కంకులు కోయసాగాడు. వీరన్న వ్యాపారి వద్దకు వెళ్ళి, శ్రేష్ఠిగారూ, మా బతుకులు మీ మీదే ఆధారపడి ఉన్నాయి.
 
సమయూనికి అప్పులూ, సప్పులూ ఇచ్చి ఆదుకుంటూ ఉంటారు. మీకు అడ్డేమిటి? మీ చిత్తం వచ్చినన్ని కంకులు కోసుకోండి, అన్నాడు. ఈ మాటలతో వ్యాపారికి కూడా భయం తీరిపోయింది. వీరన్న రైతును సమీపించి, ఒరే, నాగన్నా, ఈ ముగ్గురికీ మనబోటి వాళ్ళు దానంగానో, పన్ను రూపంలోనో, బాకీకి వడ్డి రూపంలోనో ఇచ్చుకోవలిసిన వాళ్ళం. కాని నువ్వు సాటి రైతువై ఉండి, ఈ పని చెయ్యటం ఏమీ బాగాలేదు.
 
పద మా అమ్మ దగ్గిరికి, నీకు ఆవిడ ఏం తీర్పు చెబుతుందో చూస్తాం, అని నాగన్నను రెక్కపట్టుకుని తన గుడిసెకు ఈడ్చుకు పోయూడు. మిగిలిన ముగ్గురూ నాగన్నను ఏ విధంగానూ ఆదుకోలేదు. వీరన్న పొలంలో పడి దొంగతనం చెయ్యటానికి తమ ముగ్గురికీ హక్కు ఉన్నదిగాని, నాగన్నకు లేదని వాళ్ళకు నమ్మకం కుదిరింది.


వీరన్న కొంచెం సేపటికి తిరిగి వచ్చి కంకులు కోస్తూన్న పురోహితుడితో, అయ్యూ, మా అమ్మ అంటున్నది గదా, పురోహితుడు దానం ఇస్తే పుచ్చుకోవచ్చు గాని, దొంగిలించటం తప్పు అంటున్నది. మీరు ఒకసారి ఆవిడ దగ్గిరికి రండి! అంటూ పురోహితుడి చెయ్యి పట్టుకున్నాడు. పద, మీ అమ్మ అనుమతితోనే కంకులు కోసుకుంటాను, అంటూ పురోహితుడు వీరన్న వెంటవెళ్ళాడు. కొద్దిసేపట్లో వీరన్న మళ్ళీ తిరిగి వచ్చి వ్యాపారితో, అయ్యూ, శ్రేష్ఠిగారూ! మీరు మాకు ఏనాడూ అప్పులిచ్చి ఆదుకోలేదని మా అమ్మ అంటున్నది.
 
మీరు కంకులు కొయ్యటం తప్పట. వచ్చి సంజాయిషీ చెప్పుకోండి, అంటూ చెయ్యి పట్టుకున్నాడు. వ్యాపారి క్షత్రియుడి కేసి దీనంగా చూశాడు. కాని క్షత్రియుడు అతన్ని ఆదుకునే ధోరణిలో లేడు. ఈసారి వీరన్న కరత్రో సహా వచ్చాడు. అప్పటికి క్షత్రియుడు తాను కోసిన కంకులన్నీ మూట గట్టుకున్నాడు. అతను వీరన్ననూ, అతని చేతిలోవున్న కరన్రూ చూడగానే జొన్నకంకుల మూట ఎత్తుకుని పారిపోసాగాడు. వీరన్న క్షత్రియుడి వెంటబడి కరత్రో బాదాడు.
 
ఆ దెబ్బకు క్షత్రియుడు కింద పడిపోయి, వీరన్నకు చిక్కాడు. వీరన్న అతని చేతులు అంటగట్టి, మిగిలిన ముగ్గురూ దొంగతనం చేస్తూ ఉంటే శిక్షించ వలిసినవాడివి, నువ్వు కూడా వాళ్ళతో చేరి దొంగతనం చేస్తావా? ఈ నేరానికి నువ్వు శిక్ష పొందవలిసి ఉంటుంది, అన్నాడు. నన్ను కూడా మీ అమ్మ దగ్గిరికి తీసుకుపో, మిగిలిన ముగ్గురినీ క్షమించిన మీ అమ్మ నన్ను మాత్రం క్షమించదా? అన్నాడు క్షత్రియుడు.
 
వీరన్న నవ్వి,మా అమ్మ ఎవరనుకున్నావు? ఈ భూదేవే! ఆమె పక్షానే నేను నిన్ను బంధించాను. మిగిలిన ముగ్గురిని కూడా నా గుడిసెలో కట్టి పడేశాను, అన్నాడు. అతను చుట్టుపట్ల రైతులందరినీ కేకేసి, వారంతా రాగానే జరిగినదంతా చెప్పి, తెల్ల వారగానే దొంగలందరినీ న్యాయస్థానానికి పంపేశాడు.

అసలు రహస్యం


భూమయ్య అనే ఒక యూభై ఏళ్ళ వ్యవసాయదారుడికి, ఒక్క సింగుపాలెం గ్రామంలోనే కాక, ఆ చుట్టు పక్కల వున్న గ్రామాల్లో కూడా చాలా తెలివైనవాడనీ, వివేకి అనీ మంచి పేరున్నది. ఆయన ఇరవై ఏళ్ళ యువకుడిగా, కేవలం కట్టుబట్టలతో ఎక్కడి నుంచో, ఆ గ్రామం వచ్చి పదెకరాల పొలం, ఇతరత్రా కొన్ని ఆస్తిపాస్తులు సంపాయించాడు.
 
ఒకనాటి సాయంవేళ భూమయ్య గ్రామ చెరువు గట్టునవున్న మర్రిచెట్టు కింద కూర్చుని, చెరువులో ఈదుతున్న బాతుల్నీ, చెరువు నీళ్ళ పైన ఎగురుతున్న కొంగల్నీ చూస్తూ ఆనంది స్తూండగా, ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి, ఆయన పక్కనే కూర్చున్నారు. కొంతసేపు ఏదో పిచ్చాపాటీ మాట్లాడాక యువకుల్లో ఒకడు, ‘‘మావయ్యూ, నిన్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను,'' అన్నాడు. భూమయ్య చిరునవ్వు నవ్వి, ‘‘అలాగే అడుగు.
 
నువ్వు పెద్దవాళ్ళను ప్రశ్నలడిగి మంచీ, చెడూ తెలుసుకోవలసిన వయసు వాడివిగదా!'' అన్నాడు. ‘‘మావయ్యూ, ఎప్పుడో నువ్వీ గ్రామం వచ్చినప్పుడు, డబ్బున్న వాడివేం కాదని గ్రామంలో చెప్పుకుంటారు. మరిప్పుడేమో గ్రామంలో వున్న కొద్ది మంది ఆస్తిపరుల్లో నువ్వొకడివి. ఇంత ఆస్తి ఎలా సంపాదించావు? దాని వెనకవున్న రహస్యమేమిటి?'' అని అడిగాడు యువకుడు. ఆ ప్రశ్నకు భూమయ్య ఆప్యాయంగా యువకుడి భుజం తట్టి, ‘‘మాది సత్య కాలం నాయనా. ఓర్పూ, కృషీ, పట్టుదలా, నిజాయితీ, నేర్పూ-ఇదీ అసలు రహస్యం! ఆస్తి సంపాద నకు అడ్డుదారులు లేవు!'' అంటూ పెద్దగా నవ్వాడు.

బుద్ధివైకల్యం


పూర్వం గిరివ్రజపురమనే దేశాన్ని, గిరిధరుడనే రాజు పాలిస్తూండేవాడు. ఆయనకు ప్రతి సంవత్సరం ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించే అలవాటుండేది. ప్రతి సంవత్సరం శరన్నవ రాత్రుల వేళకు మంత్రులు దేశంలో వున్న విశిష్ట వ్యక్తుల జాబితా తయూరు చేసి రాజుకు సమర్పించేవారు. వారిలో తనకు నచ్చిన వ్యక్తిని రాజు సన్మానించేవాడు. ఇలావుండగా-ఆ సంవత్సరం మంత్రులు ఇచ్చిన జాబితాలో వున్న వ్యక్తులెవరూ కూడా రాజుకు నచ్చలేదు.
 
అప్పుడు మంత్రులు ఆయనతో, ‘‘మహారాజా! ఈ సంవత్సరం తమకు నచ్చే గుణాలున్న విశిష్ట వ్యక్తులెవరూ మాకు కనిపించలేదు. మామూలు విద్వాంసులూ, కళాకారులూ కావలసినంత మందివున్నారు. వారి జాబితా తయూరు చేయమంటే చేస్తాం,'' అన్నారు. రాజు దానికి అంగీకరించక, ‘‘విద్వత్తూ, కళలూ చాలామందిలో కనిపిస్తాయి. కాని, నేను కోరుకునే విశిష్టమైన మానవతా గుణాలు కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా వుంటారు.
 
అటువంటి వ్యక్తి దొరకకపోతే, ఈ సంవత్సరం సన్మానాన్ని మానుకుంటాను గాని, అనర్హుడికి మాత్రం సన్మానం చెయ్యను!'' అని ఖచ్చితంగా చెప్పాడు. అలా మరోపక్షం రోజులు గడిచిపోయూయి. ఒకనాడు రాజు పరివారంతో కలిసి వేటకు బైలుదేరాడు. మధ్యాహ్నం వరకూ వేట ముమ్మరంగా సాగింది. మధ్యాహ్నానికి పరివారమంతా అలసటతో కాస్త వెనకబడింది.
 
రాజు మాత్రం వేట ఉత్సాహంలో అడవిలోపలికి వేగంగా చొచ్చుకుపోతూ దారితప్పాడు. తను దారి తప్పానని గ్రహించిన రాజు అందుకు చింతించక, దాహం వేస్తూవుండడంతో నీటిని వెతుక్కుంటూ మరికాస్త ముందుకు వెళ్ళాడు. ఎక్కడా నీరు కనిపించలేదుగాని, ఒక చోట ఆశ్రమంలాంటిదేదో కంట బడింది.

అక్కడ దాహం తీర్చుకోవచ్చునన్న ఆశతో రాజు, ఆశ్రమం లోపలికివెళ్ళాడు. అయితే ఊహించని విధంగా అక్కడ కనిపించిన దృశ్యం ఆయనను సర్వమూ మరిచి పోయేలా చేసింది. ఆ ఆశ్రమంలో వున్న వారందరూ ఏదో ఒకరకంగా అంగవైకల్యం కలవారే. అయితే, ఏ ఒకరి మొహంలోనూ తాము అంగవికలురమన్న బాధగాని, చిన్నతనంగాని లేవు. కొందరు బుట్టలల్లుతుంటే, మరికొందరు చాపలు అల్లుతున్నారు.
 
ఇంకొందరు బట్టలు నేస్తున్నారు. రాజు తన దాహం సంగతి కూడా మర్చిపోయి వారి కేసి చూస్తూండగా, లోపలి నుండి ఒక అందగాడైన యువకుడు వచ్చి, రాజును, ‘‘ఎవరు బాబూ మీరు? ఏంకావాలి?'' అంటూ ఆదరంగా ప్రశ్నించాడు. రాజు అతడికి తను ఎవరైనదీ చెప్పక కేవలం దాహం మాత్రం అడిగి, చల్లని నీళ్ళు తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ తర్వాత యువకుడు చూపించిన ఆసనం మీద కూర్చుని, కుతూహలంకొద్దీ రకరకాల ప్రశ్నలు వేశాడు.
 
ఆ యువకుడు చిరునవ్వు నవ్వుతూ, ‘‘మీ ప్రశ్నలన్నింటికీ జవాబుగా, ఒక కథ చెబుతాను వినండి!'' అంటూ ఇలా చెప్పసాగాడు : ఇక్కడికి దగ్గర్లోనే రేపల్లె అనే ఒక కుగ్రామం వుంది. అక్కడ నివసించే నారాయణ శాస్ర్తి అనే పండితుడికి, కృష్ణశాస్ర్తి అనే కొడుకొక్కడే సంతానం. ఆ కురవ్రాడు అందచందాల్లోనూ, విద్యాబుద్ధుల్లోనూ సాటిలేని మేటిగా పేరుతెచ్చుకున్నాడు.
 
అయితే, ఆ గొప్పదనం అతడిలో ఎక్కడలేని గర్వాన్ని కలిగించడం మాత్రం అతడి తండ్రికి సుతరామూ నచ్చలేదు. అలా గర్విష్టిగా ప్రవర్తించవద్దనీ, వినయ సౌశీల్యాలే పండితుడి పాండిత్యానికి అలంకారాలనీ కొడుక్కు చెప్పి చెప్పి, ఆ తండ్రి విసుగెత్తి పోయూడుగాని, కృష్ణశాస్ర్తిలో మాత్రం మార్పు రాలేదు. ఒకసారి అక్కడికి సమీపంలోనే వున్న బలభద్రపురం జమీందారు శరన్నవరాత్రుల సందర్భంగా నూతన కవులకు పోటీలు ప్రకటించాడు.
 
ఆ ప్రకటన వింటూనే కృష్ణశాస్ర్తి తనకు ఆ పోటీలో విజయమూ, సన్మాన సత్కారాలూ తథ్యమని ఊహిస్తూ, బండిలో అక్కడికి బైలుదేరాడు. బండి గ్రామందాటి కొంచెం దూరం వెళ్ళగానే, నడవలేక అవస్థపడుతున్న ఒక నల్లని యువకుడు కనిపించాడు. కృష్ణశాస్ర్తి వున్న బండిని చూస్తూనే అతడు, బండిని ఆపమంటూ చెయ్యెత్తి సైగ చేశాడు.

కృష్ణశాస్ర్తి ఏదో అనే లోగా బండి తోలేవాడు బండిని ఆపి, ‘‘ఏం, కాలికి దెబ్బతగిలిందా?'' అంటూ జాలిగా ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు ఇద్దరివైపూ చిరునవ్వుతో చూస్తూ, ‘‘కాలిలో ముల్లు దిగబడింది. ముల్లు వచ్చేసింది గాని నొప్పివుండి పోయింది. నేను బలభద్రపురం వెళ్ళాలి. మీరు గనక అటేవెళుతుంటే కాస్త మీ బండిలో నన్నూ తీసుకువెళతారా?'' అంటూ అడిగాడు.
 
ఆ మాటలతో అతణ్ణి పరీక్షగా చూసిన కృష్ణశాస్ర్తికి, అతడి మొహంలో కాస్త విద్యాగంధం వున్నట్టే కనిపించింది, దాంతో కాస్తహుందాగా, ‘‘సరే, రండి!'' అన్నాడు. యువకుడు వచ్చి బండిలో కూర్చున్నాడు. కృష్ణశాస్ర్తి అతణ్ణి, ‘‘మీ పేరేమిటి?'' అని ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు, ‘‘నాకు కాస్త చెవుడున్నది. దయచేసి గట్టిగా మాట్లాడండి,'' అన్నాడు. కృష్ణశాస్ర్తి, ఆ యువకుణ్ణి తిరస్కారంగా చూస్తూ, ‘‘మీ పేరేమిటని అడుగుతున్నాను,'' అంటూ ఇంచుమించు అరిచాడు.
 
యువకుడు చిరునవ్వుతో, ‘‘జగన్నాధుడు! బలభద్రపురం జమీందారుగారిఆశ్రయం కోరి కవితా పోటీలకు వెళుతున్నాను,'' అన్నాడు. ఆ జవాబు వినగానే కృష్ణశాస్ర్తి ముఖంలో ఇంతింతనరాని హేళన కనిపించింది. బండి బలభద్రపురం పొలిమేరలకు చేరగానే, ‘‘ఇక్కడికి దరిదాపుల్లో అపరధన్వంతరిగా పేరుబడ్డ నరసింహయ్య అనే ఒక వైద్యుడున్నాడు. ఆయన చేత కాలికి మందు వేయించుకుని వస్తాను,'' అని చెప్పి జగన్నాధుడు బండి దిగిపోయూడు.
 
ఆ మర్నాడు ఉదయమే కవితా పోటీలు ప్రారంభమయ్యూయి. కృష్ణశాస్ర్తి మొదట్లోనే తన కవిత్వాన్ని వినిపించి, జమీందారు ప్రశంసల్ని అందుకున్నాడు. అతడి తర్వాత మరోనలుగురు తమ కవిత్వాలు వినిపించారు. అంతలో, జగన్నాధుడు మరో నడివయస్కుడితో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ నడివయస్కుణ్ణి చూస్తూనే జమీందారు సాదరంగా పలకరించి, ఆయనను అపరధన్వంతరి అయిన వైద్యశిఖామణి నరసింహయ్యగా సభికులకు పరిచయం చేశాడు. అప్పుడు నరసింహయ్య పక్కనవున్న జగన్నాధుణ్ణి, జమీందారుకు చూపుతూ, ‘‘ఈ యువకుడి పేరు జగన్నాధుడు.

నిన్న మధ్యాహ్నం మంచి ఎండలో కుంటుకుంటూ వచ్చాడు. కాల్లో ముల్లు దిగబడిపోయి నొప్పి చేసిందని మందు అడిగాడు. సరేనని కూర్చో బెట్టి కట్టుకడుతూ, ఆ మాటా ఈ మాటా మాట్లాడాను. తను ఇక్కడ జరగబోయే కవిత్వపు పోటీలకు వచ్చానని చెప్పేసరికి, ‘‘ఏదీ, మందు మీద కవిత్వం చెప్పండి, చూద్దాం!'' అని వేళాకోళంగా అన్నాను. అప్పుడు ఇతడు ఆశువుగా చెప్పిన కవిత్వపు సారాంశం ఏమిటో వినండి: అందరు వైద్యులూ మందులిస్తారు.
 
అవి వున్న రోగాన్ని మాత్రమే నయంచేస్తాయి. కరుణార్ర్దహృదయుడైన వైద్యుడి చేతి మందు మాత్రం, అమృతం కంటే మహిమగలదై ఉన్న రోగాల్నే కాక, రాబోయే రోగాల్ని కూడా నివారిస్తుంది. ఈ వైద్యుడు అటువంటి వాడేగనుక, నాకు ఈ రోజు లభించింది మందు కాదు, అమృతం అనటంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు! ఈ కవిత్వం విన్న తర్వాత ఇక ఈ జగన్నాధుణ్ణి ఎలా వదిలి పెట్టను చెప్పండి, వెంటబెట్టుకు వచ్చాను!'' అన్నాడు. ఈ మాటలన్నీ విన్న జమీందారు ఆనందంతో చప్పట్లు కొడుతూ, ‘‘చాలా బావుంది.
 
ఏది స్వామీ... మీ కవితా సుగంధాన్ని ఇక్కడ కూడా కాస్త విరజిమ్మండి,'' అంటూ సాదరంగా ఆహ్వానించాడు. ఆ వెంటనే నరసింహయ్య, జమీందారుతో, ‘‘జగన్నాధుడికి ఒక వ్యాధికారణంగా చెవుడు సంప్రాప్తించింది. మనం కాస్త గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు. నేను తాపీగా ఇతణ్ణి పరీక్షించి ఆ కాస్త లోపం కూడా లేకుండా చేస్తాను,'' అన్నాడు. ఆ మాటలకు జమీందారు, ‘‘చెవుడైతేనేం? మనిషికి శారీరక అవయవాల్లో లోపం వున్నా ఫర్వాలేదు, బుద్ధిబాగుంటే అంతే చాలు,'' అన్నాడు.
 
ఆ తర్వాత జగన్నాధుడు తన సుమధుర కవిత్వంతో సభికుల్ని మైమరపింపజేశాడు. ఆ కవిత్వం విన్న తర్వాత కృష్ణశాస్ర్తితో సహా మిగతా కవులందరికీ కూడా తమ కవిత్వం ఎంత రసవిహీనమైనదో తెలియవచ్చింది. కృష్ణశాస్ర్తికి, జగన్నాధుడు తనకు కేవలం కవిత్వం లోనే గాక మానవతాగుణాల్లో కూడా పాఠం నేర్పినట్టు అనిపించింది. అతడి మనసు గర్వాన్ని విడిచిపెట్టి వినయగుణాన్ని నేర్చుకునేందుకు నెమ్మదిగా సిద్ధమైంది. పోటీలు ముగియగానే జమీందారు, జగన్నాధుణ్ణి దుశ్శాలువలతో సత్కరించి, అతడి కోరిక ప్రకారం తన ఆస్థానకవిని చేసుకున్నాడు.

విశ్రాంతి సమయంలో కృష్ణశాస్ర్తి, జగన్నాధుణ్ణి కలుసుకుని, మాటలకు కాస్త తడుముకుంటూ, ‘‘నేను మిమ్మల్ని నిన్న బండి ప్రయూణ సమయంలో చిన్నచూపు చూసిన మాట నిజం. అందుకు నన్ను క్షమించండి. మీరింత గొప్ప కవులనుకోలేదు,'' అన్నాడు. ఇందుకు జగన్నాధుడు పెద్దగా ఆనందించకుండా, ‘‘అంగవైకల్యం గలవారు ఏదో విధంగా గొప్పవారైతేనే వారిని ఆదరించాలను కోవడం పొరపాటు. అలా ఆలోచించే వారికి బుద్ధివైకల్యం వున్నట్టే!'' అన్నాడు.
 
ఆ మాటలు కృష్ణశాస్ర్తికి కొరడా దెబ్బల్లా తగిలాయి. అతడు ఒక్క నిముషం మౌనంగా వుండి, ‘‘విషం కూడా ఒక్కొక్కసారి అమృతంలా పనిచేస్తుందన్న విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు మీరన్న మాటలు నాకు ముందు విషప్రాయంగా వున్నా, ముందు ముందు అవి అమృతోపమానంగా పనిచేసి, నా మనసుకు పట్టిన, పట్టనున్న రోగాలన్నిటినీ నయం చేస్తాయన్న గట్టి నమ్మకం నాకు కుదిరింది. ఇక శెలవు!'' అంటూ చేతులు జోడించి అక్కడి నుంచి వచ్చేశాడు.
 
తర్వాత అతడు తన ఊరిపొలిమేరల్లో ఒక ఆశ్రమాన్ని నిర్మించి, అందులో వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి జీవితం పట్ల ఆశాభావాన్ని పెంపొందించేందుకూ, వారు ఏదో ఒక వృత్తివిద్యలో నైపుణ్యాన్ని సాధించేందుకూ పాటుపడసాగాడు. ఇక్కడి దాకా కథ చెప్పిన ఆ యువకుడు, రాజుతో, ‘‘అయ్యూ, నేనే ఆ కృష్ణశాస్ర్తిని. నేను ఈ ఆశ్రమం స్థాపించి దాదాపు నాలుగేళ్ళుకావస్తున్నది. దీని గురించి విన్న జగన్నాధుడు తనకు బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికి వస్తున్నాడు.
 
ఆయనే నా గురువు, దైవం... అన్నీ అనిభావిస్తూ, నేను ఈ కార్యభారాన్ని వహిస్తున్నాను,'' అంటూ ముగించాడు. కృష్ణశాస్ర్తి చెప్పినదంతా విన్న రాజు గిరిధరుడు పరవశంలో మునిగిపోతూ, తానెవరైనదీ అతడికి చెప్పి, ‘‘ఈ సంవత్సరం నాకు సన్మానానికి అర్హులైనవాళ్ళు దొరకలేదని బాధ పడ్డాను. ఇప్పుడు నాకు ఒక ఏడుకాదు జీవితమంతా కూడా సన్మానించ తగ్గ వ్యక్తులు ఒకరు కాదు, ఇద్దరు దొరికారు. ఇది నా భాగ్యం!'' అన్నాడు.