Pages

Sunday, September 9, 2012

పశుపతి మాన్యం


పశుపతి వాడవల్లి వేదపాఠశాలలో పదేళ్ళ వయసున్నప్పుడు చేరి వేదం నేర్చుకున్నాడు. ఇరవై సంవత్సరాలు వచ్చాక, నేర్చుకున్న విద్యతో ఏదో ఒక గ్రామంలో పురోహితుడిగా స్థిరపడి సంసారి కావాలని, గురువుల ఆశీస్సులు పొంది బయలుదేరాడు. పశుపతి అలా ప్రయూణం చేస్తూ రాజవరం అనే గ్రామాన్ని సమీపిస్తూండగా, ఒక వ్యక్తి చేతిలో శివలింగంతో ఏటి నీటిలోకి దిగడం చూశాడు.
 
పశుపతి ఆయన్ను ఆపి, ‘‘అయ్యూ, తమరు ఏమిటి చేయబోతున్నారు?'' అని అడిగాడు. ‘‘మా గ్రామ శివాలయం శిథిలమై పోవడంతో పునర్నిర్మించి, పాత శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించాలని, కాశీ నుంచి ఈ శివలింగాన్ని తీసుకువచ్చాను. కాని ప్రతిష్ఠ సమయూనికి తిరిగి రాలేక పోయూను. పాతశివలింగాన్నే ప్రతిష్ఠించారు. అందువల్ల ఈ శివలింగాన్ని జల నిమజ్జనం చేస్తున్నాను,'' అన్నాడు ఆ వ్యక్తి విచారంగా.
 
‘‘అయ్యూ, కాశీనుంచి తెచ్చిన శివలింగం తప్పక పూజార్హం కావాలి. ఒక దేవాలయంలో ఎన్ని శివలింగాలయినా ఉండవచ్చు. ఇది వేద ప్రమాణం. పాత దానితో పాటు దీన్ని కూడా ప్రతిష్ఠించండి. రెండు శివలింగాల గుడిగల గ్రామంగా మీ ఊరు పేరు పొందాలన్నది దైవ సంకల్పమై ఉంటుంది. మీ గ్రామస్థులకు నేను వచ్చి చెబుతాను. పదండి ఊళ్ళోకి వెళదాం,'' అన్నాడు పశుపతి. పశుపతి వేదప్రమాణంగా చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి. రెండు శివలింగాల ప్రతిష్ఠ జరిగి నూతన దేవాలయం అందరినీ ఆకర్షించ సాగింది.

ప్రతిష్ఠ సమయంలో పశుపతి వేదమంత్రాలు వల్లించిన తీరు అందరినీ ఎంత గానో ఆకట్టుకున్నది. అతణ్ణి తమ గ్రామంలోనే ఉండిపొమ్మని కోరారు. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన పెద్దమనిషి పేరు పట్టెయ్య. పెద్ద భూస్వామి. తను తెచ్చిన శివలింగానికి గుర్తింపు తెచ్చిన పశుపతి తమ గ్రామంలోనే ఉండాలన్న కోరికతో ఒక ఎకరం పొలాన్ని అతనికి దానంగా ఇచ్చాడు.
 
నా అన్న వాళ్ళు లేని పశుపతి రాజవరం గ్రామంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. శివలింగ ప్రతిష్ఠ జరిగాక ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో శివాలయ పూజారి కుమార్తె దుర్గ శివలీలల కథాగానం చేసి భక్తులను ఎంతగానో అలరించింది. ఆఖరి రోజున ఆమె నందీశ్వరుడి కథ చెప్పింది. దాన్ని విని, ��కథ విన్నవారికి పాడి ఆవు, చెప్పిన వారికి చూడిఆవు ఇవ్వాలని అంటారు.
 
చక్కని కథలు చెప్పిన పూజారిగారమ్మాయికి నేను చూడావును బహూకరిస్తాను,�� అంటూ బసవయ్య అనే పెద్దమనిషి ఆమెకు ఒక చూడి ఆవును కానుకగా ఇచ్చాడు. బహుమతిగా ఇచ్చిన ఆవు మరికొద్ది సేపట్లోనే కవల కోడె దూడలను ఈనింది. నందీశ్వరుడే కోడెదూడల రూపంలో అవతరించి రెండు శివలింగాలకు నమస్కరించదలిచాడని జనం భక్తితో పరవశించిపోయూరు.
 
నందీశ్వర ప్రతిరూపాలైన ఆ దూడలను శివార్పితంగా అచ్చోసి ఆబోతులుగా వదిలెయ్యూలని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఆ మాటలు విన్న గంగిరెద్దులవాడు ఊరి పెద్దలకు నమస్కరించి, ��అయ్యూ, శివుడు నాట్యప్రియుడు. మా గంగిరెద్దుల ఆటకు ప్రసన్నుడయ్యూడేమో! మాకో దూడను ఇప్పించండి. దానికి ఆట పాట నేర్పి, యేటా శివరాత్రి ఉత్సవాలకు తీసుకువస్తాం,�� అన్నాడు.
 
అయితే, అక్కడే ఉన్న పశుపతి, ��అది నాలుగేళ్ళ తరవాతి మాట. అప్పటికిగాని దూడలు పెద్దవి కావు. పైగా అవి పూజారిగారివి. ఆయన అభిప్రాయూన్నిమన్నించాలి కదా?�� అనడంతో అందరూ అవునంటూ అంతటితో ఊరుకున్నారు. ఆ మరునాటి సాయంకాలం ఏటిగట్టున కూర్చుని వున్న పశుపతికి మరో ఊరికి తిరిగి వెళ్ళిపోతూన్న గంగిరెద్దులవాళ్ళు కనిపించారు.

వాళ్ళ వెంట నాలుగయిదు గంగి రెద్దులు ఉన్నాయి. వాటిలో ఒక కోడెదూడ నీరసంగాకుంటుతూ వెళ్ళడం గమనించిన పశుపతి మనసు కలత చెందింది. అది దీనంగా తనకేసి చూస్తున్నట్టు పశుపతికి అనిపించింది. మరి కొంతసేపటికి అతడి చూపు కొంత దూరంలో అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తూ పచ్చిక మేస్తున్న ఆబోతు మీదికి మళ్ళింది. అతడు లేచి దాని దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, పరిశీలనగా చూస్తూ ఆప్యాయంగా నిమిరాడు.
 
ఆ తరవాత ఏటిగట్టుకు తిరిగివచ్చాడు. ఆబోతు అతడి వెనకే మెల్లగా వచ్చింది. ఏటిగట్టున పెద్ద రావిచెట్టు ఉంది. ఆ రోజు శనివారం కావడంతో రావిచెట్టును పూజించడానికి వచ్చిన పూజారి కూతురు దుర్గ పశుపతినీ, అతడి పక్కనే వున్న ఆబోతు ఒంటి మీది వాతలనూ చూసి, ��పాపం, ఏమిటిది?�� అని అడిగింది. ��ఏముంది! అంతా మనం చేసే పనులే,�� అంటూ నిట్టూర్చిన పశుపతి, కొంతసేపు మౌనంవహించి ఆ తరవాత, ��దేవలోకానికి కామధేనువులాంటిది భూలోకానికి పశుసంపద.
 
పాడి పంటలకు అది మూలాధారం. మన పూర్వులు వాటిని దైవాలుగా భావించి పూజలు చేసేవారు. కొందరైతే దేవుడికి గోవుల రూపంలో మొక్కులు చెల్లించేవారు. అలా వచ్చిందే అచ్చోసి ఆబోతును వదిలే మన సంప్రదాయం. అచ్చోసి వదిలే కోడెదూడను అందరూ నందీశ్వరుడిగా భావించేవారు. ఇంటి గుమ్మంలోకి వస్తే చేటలో బియ్యం పోసి పెట్టేవారు. అది పంటచేల్లో పడి మేసినా కొట్టరు.
 
కాని ఈ ఆబోతును ఎవరో చితకకొట్టారు. అదేవిధంగా గంగిరెద్దుల వారికిచ్చే కోడెదూడలను కూడా వాళ్ళు ఆటలు నేర్పడానికి వాటిని నానా హింసలు పెడతారు. కొడతారు. దారికి వచ్చేంత వరకు తిండి పెట్టకుండా మాడుస్తారు. ఈ విషయూలను తలుచుకుంటే బాధగా ఉంటోంది,�� అన్నాడు. ��అవును, వేదపండితులు కదా. తమ మాటకు తిరుగేముంటుంది? అయినా, ఇలాంటి దుస్థితి నుంచి వాటిని కాపాడడానికి కూడా తమరే ఏదో ఆలోచించాలి మరి,�� అంటూ అక్కడి నుంచి బయలుదేరింది దుర్గ.

ఆలోచనలో పడ్డ పశుపతి తెల్లవారే సరికి ఒక నిర్ణయూనికి వచ్చి, గ్రామపెద్దను కలుసు కుని, ��పట్టెయ్య నాకు దానంగా ఇచ్చిన పొలాన్ని పశుపోషణకు వినియోగించాలనుకుంటున్నాను. గ్రామంలో తిరిగే ఆబోతుల అవసరాలు చూసుకుంటూ, గోశాలను ఏర్పాటు చేసి పశువులను శ్రద్ధగా మేపే రైతుకు ఆ పొలాన్ని కౌలుకు ఇస్తూ, అందులో వచ్చే ఆదాయూన్ని పశుపోషణకే వినియోగించేలా తమరు ఏర్పాటు చేయూలి,�� అని వేడుకున్నాడు.
 
��మరి నీ జీవనోపాధికి ఏంచేస్తావు?�� అని అడిగాడు గ్రామపెద్ద. ��ఆ పొలం నేను ఆశించి రాలేదు. భగవత్కృపవల్ల వచ్చిన ఆ పొలాన్ని నందీశ్వరుడి సేవకు వినియోగిస్తున్నాను. నేను నేర్చుకున్న వేదవిద్య ద్వారా ఆ పరమేశ్వరుడే నాకు ఏదో మార్గం చూపకపోడు. నేను ఈ రోజే మరో ఊరికి బయలుదేరుతాను,�� అన్నాడు పశుపతి. అంతకు ముందే అక్కడికి వచ్చి అతడి మాటలు విన్న శివాలయ పూజారి, ��నాయనా పశుపతీ! వేద మంత్రాలతో పాటు గోసంపద మీద నీకున్న శ్రద్ధ ప్రశంసనీయం.
 
నీకు అభ్యంతరం లేకపోతే నీలాంటి ఉన్నత వ్యక్తికి మా ఒక్కగానొక్క కూతురు దుర్గను ఇచ్చి వివాహం జరిపించడం భాగ్యంగా భావిస్తాను. నువ్వు వేరెక్కడికీ వెళ్ళనవసరం లేదు. మాతోనే ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ సుఖంగా జీవయూత్ర సాగించవచ్చు,�� అన్నాడు. ��మీ కుమార్తెకు సమ్మతమైతే, సరస్వతీ కటాక్షం గల ఆమెను వివాహమాడడం నాకూ సంతోషమే,�� అన్నాడు పశుపతి చిన్నగా నవ్వుతూ.
 
మరుసటి ముహూర్తంలోనే ఊరి పెద్దల సమక్షంలో దుర్గ-పశుపతుల వివాహం నిరాడంబరంగా జరిగింది. నూతన వధూవరులు బసవయ్య కానుకగా ఇచ్చిన ఆవు-దూడల పోషణను తామే స్వయంగా చూసుకోవాలనుకున్నారు. పశుపతి నిర్ణయూన్ని గ్రామప్రజలందరూ మెచ్చుకున్నారు. పశుపోషణకని అతడు ఇచ్చిన పొలానికి కాలక్రమంలో పశుపతి మాన్యం అనే పేరువచ్చింది.

అక్కచెల్లెళ్ళు


ఒకానొకప్పుడు ఒకరాజు ప్రజలక్షేమమే ధ్యే…ుంగా పరిపాలన జరిపేవాడు. మంత్రులద్వారా, రాజోద్యోగుల ద్వారా ప్రజల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి చారులను గూడా ని…ుమించాడు. అంతేగాదు. తరచూ తనే మారువేషాలలో తిరుగుతూ తన పాలనగురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి కష్టసుఖాలేమిటో స్వ…ుంగా తెలుసుకునేవాడు.
 
ఒకనాటి అర్ధరాత్రి సమ…ుంలో రాజు నగరంలోని ప్రధాన వీధిగుండా వెళుతూంటే, ఒక రాజోద్యోగి ఇంటినుంచి ఏవోమాటలు వినిపించాయి. రాజు ఆ ఇంటిని సమీపించాడు. ఒక కిటికీ తెరిచివుంది. లోపల చిన్న దీపం నుంచి కొద్దిగా వెలుతురు వస్తోంది. మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు …ుువతులు తాము ఎలాంటి వారిని వివాహమాడాలో చర్చించుకుంటున్నారు.
 
‘‘నాకు భోజనం అంటే మంచి ఇష్టమని మీకు తెలుసుకదా? నాకు రాజభవనంలోని వంటవాణ్ణి పెళ్ళాడాలని వుంది. అలాజరిగితే, మహారాజుకూ, మహారాణికీ త…ూరు చేసే వంటలన్నిటినీ రుచిచూడవచ్చు,'' అన్నది ఒక …ుువతి. ‘‘నేను మంత్రినే గనక వివాహమాడితే, ఆ…ునతోపాటు రాజ్యమంతా ప్ర…ూణం చేసి, అన్ని ఊళ్ళూ చూస్తాను. కొత్తప్రదేశాలు చూడడమంటే నాకు మహాఇష్టం,'' అన్నది రెండవ …ుువతి.
 
ఆ తరవాత కొంతసేపు నిశ్శబ్దం నెలకొన్నది. ముందుమాట్లాడిన ఇద్దరు …ుువతులూ, ‘‘నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీకెవరిని పెళ్ళాడాలని వుందో చెప్పు,'' అని అడిగారు. ‘‘మహారాజుగారు నన్ను వివాహమాడితే, ఆ…ునకు అందమైన పిల్లల్ని కని ఇవ్వాలని వుంది,'' అన్నది మూడవ …ుువతి. ముగ్గురూ గలగలా నవ్వారు. ఆ మాటలను విన్న రాజు మౌనంగా రాజభవనానికి వెనుదిరిగాడు. వారి మాటలను గురించితీవ్రంగా ఆలోచించసాగాడు.

ప్ప టికే రాజుకు ఇద్దరు భార్యలున్నారు. ఇద్దరికీ సంతానభాగ్యం కలగలేదు. ఆ వినిపించిన కంఠస్వరాలు-ముగ్గురు అక్కచెల్లెళ్ళవని రాజు ఊహించాడు. మూడవ …ుువతి కోరుకున్నట్టు ఆమెను తాను వివాహమాడితే మంచిదేకదా అని భావించాడు. మరునాడు తెల్లవారగానే రాజు ముగ్గురు …ుువతులనూ రాజభవనానికి రమ్మని మేనాను పంపాడు. ఆ …ుువతులు రాజభవనానికి రాగానే, వారి తండ్రిని పిలిచి రాత్రి జరిగిన సంగతి చెప్పి, ‘‘మీ పెద్దమ్మాయి మా వంటవాణ్ణీ, రెండవ అమ్మాయి మంత్రినీ వివాహమాడడానికి నేను ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు.
 
తనకేసీ, రాజుకేసీ మార్చిమార్చి చూస్తూన్న తన చిన్న కూతురి గురించి ఏంచెబుతాడో అని రాజోద్యోగి ఆతృతగా ఎదురు చూశాడు. రాజు మందహాసం చేస్తూ, ‘‘నేను నీ చిన్న కుమార్తెను నా మూడవ భార్యగా స్వీకరించి ఆమెను రాణిని చేస్తాను!'' అన్నాడు. ఆ మాట వినగానే చిన్న కూతురు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మూడు పెళ్ళిళ్ళూ ఘనంగా జరిగాయి.
 
ముగ్గురు పెళ్ళికూతుళ్ళూ, వారి వారి భర్తల ఇళ్ళకు చేరి కాపురాలు చే…ుసాగారు. తమ చెల్లెలు రాజభవనంలో రాజభోగాలు అనుభవిస్తూండగా తాము మాత్రం సాధారణ గృహాలలో మామూలు జీవితంగడవలసివచ్చిందే అని అక్కలు ఇద్దరూ విచారపడసాగారు. క్రమంగా ఆ విచారం అసూ…ుగా మారింది. అయితే, చెల్లెలు మాత్రం అక్కలపట్ల ఎంతో ప్రేమాదరాలతో మసలుకోసాగింది.
 
తన ఇద్దరి అక్కలలో ఎవరైనా ఒకరు ఆనాటి రాత్రి రాజుగారిని వివాహమాడాలని కోరుకుని ఉంటే తనకీ భాగ్యం లభించేది కాదు కదా అన్న కృతజ్ఞతాభావంతో వారిపట్లనడుచుకునేది. ేుడాది తిరిగేలోపల మూడవ రాణి గర్భవతి అయింది. కాన్పు సమ…ుం సమీపించడంతో, తన అక్కలు తనకు సా…ుంగా ఉంటే బావుంటుందని రాజుకు చెప్పింది. రాజు సంతోషంగా ఆమె ఇద్దరు అక్కలనూ రాజభవనానికి పిలిపించాడు. వాళ్ళు అక్కడే ఉండసాగారు. అయితే చెల్లెలి మీద అకారణ అసూ…ూద్వేషాలతో కుట్రపన్నసాగారు.
 
ఆమె మగబిడ్డను ప్రసవించగానే, రాణిపరిచారిక సా…ుంతో ఆ బిడ్డను ఒక బుట్టలో ఉంచి, రాజభవన సమీపంలో ప్రవహించే నదిలో వదిలేలా చేశారు. బిడ్డస్థానంలో అప్పుడే పుట్టిన ఒక కుక్కపిల్లను తెచ్చి పడుకోబెట్టి రాణితో, ‘‘కుక్కపిల్లను ప్రసవించావు,'' అని చెప్పారు.

‘‘అదే భగవంతుడి సంకల్పమయితే, దానినే నేను నా బిడ్డగా స్వీకరిస్తాను,'' అన్నది రాణి చెప్పరాని ఆవేదనతో. మరుసటి సంవత్సరం కూడా రాణి మరొక మగ శిశువును ప్రసవించింది. అయితే అక్కలు మళ్ళీ తమ దుష్ట పథకంతో, బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలి, ఒక పిల్లిపిల్లను తెచ్చి రాణి పక్కనపడుకోబెట్టారు. తన విధిని తలుచుకుని రాణి, ‘‘అంతా భగవదేచ్ఛ,'' అని సరిపెట్టుకున్నది.
 
మళ్ళీ ఒక సంవత్సరం గడిచింది. రాణి ఈసారి పండంటి ఆడ శిశువును ప్రసవించింది. అక్కలు మళ్ళీ తమ దుష్టపథకం ప్రకారం బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలి, ఒక మట్టి బొమ్మను తెచ్చి, రాణి పక్కన పడుకోబెట్టారు. రాణి తనకు జరుగుతున్న దానికి విషాదం చెందింది. రాజు కూడా విచారించాడు. ఆనాటి రాత్రి, ‘‘రాజు నన్ను వివాహమాడితే, ఆ…ునకు అందమైన పిల్లల్ని కంటాను,'' అని ఆమె అనడం తలుచుకుని బాధపడసాగాడు.
 
రాజు …ుధాప్రకారం మారువేషంలో మళ్ళీ తిరగడం ప్రారంభించాడు. రాణిగారు కుక్కపిల్ల, పిల్లిపిల్ల, మట్టిబొమ్మలను ప్రసవించడం గురించి ప్రజలు వింత వింతలుగా మాట్లాడుకోవడం రాజువిన్నాడు. రాణి మామూలు స్ర్తీ కాదనీ, ఆమె ద…్యుమనీ, అలా పిల్లలకు బదులు జంతువులను కనడం, రాజ్యానికి జరుగనున్న అనర్థాలకు సూచనలనీ పలువురు మాట్లాడుకోసాగారు. ఆమె ఇంకా రాజభవనంలో ఉంటే రాజ్యానికి అరిష్టమనీ ఆమెను అడవిలో వదిలిపెట్టడమే రాజ్యానికి క్షేమం అనీ చెప్పుకోసాగారు.
 
ఆ మాటలువిన్న రాజు ఆమెను అడవిలో వదిలిపెట్టాడు. ఇది ఇలా ఉండగా అంతకుముందే మరొక విచిత్రం జరిగింది. రాజభవనానికి ఆనుకుని ప్రవహించే నదీతీరంలో, అరణ్య సమీపాన బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. ఆ బ్రాహ్మణుడు వేకువ జాముననదిలో స్నానంచేసి సంధ్యావందనం చేస్తూండగా ప్రవాహంలో ఒక బుట్ట కొట్టుకురావడం కనిపించింది. అందులో అప్పుడే పుట్టిన శిశువును చూసి అతడు అమితాశ్చర్యం చెంది, బిడ్డను తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు.
 
అంతవరకు సంతానానికి నోచుకోని ఆ దంపతులు, బిడ్డను అమితానందంతో పెంచసాగారు. మరుసటి సంవత్సరం కూడా బ్రాహ్మడికి బిడ్డ నదిలో తేలుతూ రావడం కనిపించింది. ఆ బిడ్డను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పిల్లలిద్దరూ ఒకే పోలికతో ఉండడం చూసి దంపతులు ఆశ్చర్యపో…ూరు.

మరో సంవత్సరం గడిచాక అదేవిధంగా మరొక శిశువువున్నబుట్ట నదిలో తేలుతూ రావడం చూసి బ్రాహ్మడు ఆశ్చర్యానందాలు చెందాడు. ఇప్పుడు తేలుతూవచ్చింది ఆడశిశువు. ఆ దంపతులు పిల్లలకు మదనుడు, మోహనుడు, మోహిని అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. కొన్నేళ్ళకు బ్రాహ్మణుడూ, ఆ తరవాత అతని భార్యా మరణించారు. పిల్లలు తమను తామే పోషించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఒకరోజు, వేటకు అడవికి వెళ్ళిన రాజు, తన పరివారానికి దూరమై దారితప్పి, రాత్ర…్యూక కాలినడకన బాగా అలిసిపోయి, నదీ తీరంలో ఆ ముగ్గురు పిల్లలున్న ఇంటి దగ్గరికి వచ్చాడు. పిల్లలు ఆ…ునకు అన్నపానాదులిచ్చి, సపర్యలు చేశారు. రాజు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. తెల్లవారి నిద్రలేచాక, రాజు తాను ఎవరైనదీ వాళ్ళకు తెలి…ుచేసి తన సా…ుం కావలసి వచ్చినప్పుడు రాజధానికి రావచ్చునని చెప్పాడు.
రాజధానికి చేరగానే భటులచేత వాళ్ళకు సంచీ నిండుగా బంగారు నాణాలు పంపాడు. తమ ఇంటికి సాక్షాత్తు రాజుగారే అతిథిగా వచ్చారు గనక తమ ఇంటిని కూడా రాజభవనంలా కట్టుకోవాలని మోహిని అన్నలకు సలహా ఇచ్చింది. అన్నలు ఆమె కోరికను నెరవేర్చారు. పెద్ద భవన నిర్మాణం జరిగింది. మోహిని అందమైన వస్తువులతో ఇంటిని అలంకరించసాగింది.

ఒకరోజు ఒకెూగి అటుకేసి వచ్చాడు. నదీ తీరంలో వెలసిన అందాల భవనాన్ని చూసి ఆనందం చెందాడు. అయితే అది అరణ్యసమీపంలో ఉండడమే ఆ…ునకు వింతగొలిపింది. ెూగికి అతిథి సత్కారాలు చేసిన మోహిని, తమ భవనంలో ఏదైనా లోపం ఉందా? అని అడిగింది. ‘‘అంతా బాగానే వుంది. అయితే, ఇలాంటి భవనంలో బంగారు చెట్టు, బంగారు పంజరంలో బంగారు చిలుక, ఒక బంగారు విల్లు ఉన్నట్టయితే మరీ బావుంటుంది!'' అన్నాడు.
‘‘అవి ఎక్కడున్నాయి?'' అని అడిగింది మోహిని. ‘‘ఉత్తరదిశలో ఉన్న కొండశిఖరంమీద, ఆ మూడూ ఉన్నాయి,'' అని, వాటిని ఎలా తెచ్చుకోవాలో వివరాలు చెప్పి వెళ్ళిపో…ూడుెూగి. అన్నలూ, చెల్లెలూ ఆ విష…ుం గురించి బాగా ఆలోచించారు. ఆఖరికి మదనుడు లేచి నిలబడి, ‘‘చెల్లీ, నేను వెళ్ళి వాటిని సాధించుకుని వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి.


ఇదిగో ఈ కత్తిని నీ దగ్గర ఉంచు. నాకేదైనా ఆపదవాటిల్లితే ఈ కత్తి పదును తగ్గుతుంది,'' అని చెప్పి చెల్లెలికి తన కత్తిని ఇచ్చి బ…ులుదేరాడు. కొన్ని రోజులు గడిచాయి. కత్తి పదునుతో తళతళలాడుతూనే ఉన్నది. తన అన్న క్షేమంగా ఉన్నాడని ఆమె భావించింది. అయితే ఒకనాడు ఉద…ుం కత్తి పదును కోల్పోయి, వెలవెలబోయింది. అక్కడ మదనుడికి ఏం జరిగిందంటే- అతడు ెూగి చెప్పిన కొండశిఖరాన్ని చేరుకుని భవనం మెట్లను ఎక్కుతూన్నప్పుడు, ‘‘మదనా, ముందుకు వెళ్ళకు!'' అనే మాటలు వినిపించాయి.
 
అయినా మెటె్లక్కుతూన్నప్పుడు వెనుతిరిగి చూడకూడదన్న ెూగి హెచ్చరికను గుర్తుంచుకున్న మదనుడు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాడు. మరొక రెండు మెట్లు ఎక్కాడు. ‘‘మదనా, ఆగు. నేనూ వస్తాను,'' అన్న మాటలు తన పెంపుడుతండ్రి కంఠస్వరంతో వినిపించడంతో, అతడు తిరిగి చూశాడు. మరుక్షణమే శిలగా మారిపో…ూడు! మోహనుడు తన వేణువును తీసి చెల్లెకిస్తూ, ‘‘మార్గ మధ్యంలో నా కేదైనా ఆపద వాటిల్లినట్టయితే, వేణువు రెండుగా చీలి విరిగి పోతుంది,'' అని చెప్పి అన్నను వెతుక్కుంటూ బ…ులుదేరాడు.
 
కొన్నాళ్ళకు అతడు కొండశిఖరం మీది భవనాన్ని సమీపించి మెటె్లక్కుతూండగా, ‘‘మోహనా, నేను నీ వెనకే ఉన్నాను. ఆగు, వస్తాను,'' అంటూ అన్న కంఠస్వరం వినిపించింది. అన్నను వెతుక్కుంటూ వెళుతూన్న మోహనుడు ఆ మాటలకు వెనుదిరిగి చూశాడు. అంతే, ఆక్షణమే అతడూ శిలగా మారిపో…ూడు! అక్కడ ఇంట వేణువు రెండుగా చీలివిరిగిపోవడంతో మోహిని దిగ్భ్రాంతి చెందింది.
 
ఆరోజంతా భోరున విలపించింది. మరునాడు ధైర్యాన్ని కూడగట్టుకుని అన్నలను వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించింది. ఆమె కూడా కొన్నిరోజులకు ెూగి సూచించిన కొండశిఖరం మీది భవనాన్ని సమీపించింది. దృఢసంకల్పంతో భవనం మెటె్లక్కసాగింది. అమ్మానాన్నలు, అన్నలు పిలుస్తున్నట్టు ఏవేవో కంఠస్వరాలు వినిపించాయి.
 
అయినా ఆమె వెనుదిరిగి చూడలేదు. హెచ్చరికలూ, బెదిరింపులూ వినిపించాయి. అయినా ఆమె గుండె నిబ్బరంతో ముందుకు అడుగువేసింది. భవన మంటపాన్ని చేరి అక్కడి బంగారు చెట్టునూ, బంగారు పంజరంలోని చిలుకనూ …ూసింది.

ఆమెను చూడగానే బంగారు చిలుక, ‘‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో ఆ మృదంగం మీద బంగారు విల్లు కనిపిస్తోంది చూడు. ఆ విల్లుతో మృదంగాన్ని వాయించు. ఆ శబ్దం వినగానే శిలలుగా మారిన నీ అన్నలు సజీవులవుతారు,'' అన్నది. మోహిని చిలుక చెప్పినటే్ల చేసి, ‘‘నా చేతికి బంగారువిల్లు, బంగారుచిలుక వచ్చాయి. మా అన్నలు వెతుక్కుంటూ వెళ్ళిన బంగారుచెట్టును సాధించేదెలా?'' అని అడిగింది.
 
‘‘మీ అన్నలలో ఒకడు ఈ విల్లుతో ఆ చెట్టు మొదలును తాకితే, అది తానంతట ఆ…ున చేతిలోకి వస్తుంది,'' అన్నది చిలుక. ‘‘మోహినీ, నువ్వెలా ఇక్కడికి వచ్చావు?'' అంటూ అన్నలు అక్కడికి రావడం చూసి, మోహిని పరమానందం చెందింది. ‘‘అవన్నీ తరవాత చెబుతాను. ముందు మీలో ఒకరు ఈ బాణంతో ఆ బంగారు చెట్టు మొదలును తాకండి. అది మీ చేతుల్లోకి వస్తుంది,'' అన్నది మోహిని ఉత్సాహంగా. మదనుడు విల్లుతో బంగారు చెట్టును తాకాడు.
 
అది అలాగే లేచి అతని చేతిలోకి వచ్చింది. ముగ్గురూ భవనం నుంచి వెలుపలికి వచ్చి కొండదిగి ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల తరవాత వాళ్ళు రాజును తమ ఇంటికి ఆహ్వానించారు. రాజువచ్చి, భవనంలోపల తిరిగిచూసి, వాళ్ళ సంపదకు అమితాశ్చర్యం చెందాడు. భోజనాలకు కూర్చున్నప్పుడు పళ్ళాలలో ఆహార పదార్థాలకు బదులు, మణులు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు ఉన్నాయి.
 
‘‘ఏమిటీ విడ్డూరం?'' అని అడిగాడు రాజు. ‘‘ఒకస్ర్తీ కుక్కపిల్లనూ, పిల్లిపిల్లనూ, మట్టిబొమ్మనూ ప్రసవించగలిగినప్పుడు, బంగారుచెట్టు ప్రసాదించే మణిమాణిక్యాలతో వంట చే…ువచ్చు కదా? ఇందులో వింత, విడ్డూరం ఏమున్నాయి?'' అన్నది బంగారు పంజరంలోని బంగారుచిలుక. చిలుక మాటలలోని అంతరార్థాన్ని రాజు గ్రహించాడు. ‘‘అయితే, నా పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?'' అని అడిగాడు.
 
‘‘నీ ఎదుటే ఉన్నారు మహారాజా! అసూ…ూగ్రస్తులైన వారి అక్కలే రాణిగారికి కుక్క పిల్లా, పిల్లిపిల్లా, మట్టిబొమ్మా పుట్టా…ుని చెప్పారు. ఇప్పుడైనా వెళ్ళి ఆమెను ఏలుకోండి మహారాజా!'' అన్నది బంగారుచిలుక. రాజు వెళ్ళి అడవిలోవున్న రాణిని వెంట బెట్టుకుని అక్కడికి వచ్చాడు. పిల్లలను చూసి తల్లితండ్రులూ, తల్లితండ్రులను చూసి పిల్లలూ చెప్పలేని ఆనందం పొందారు.

రక్షంచిన నీడ


జైలుగదిలో ఒంటరిగావున్న జో ఎర్‌‌డమన్‌ విచారంతో నిండిన తీవ్రమైన ఆలోచనలలో మునిగిపో…ూడు. పట్టణంలోని ప్రముఖ రాజకీ…ు నా…ుకుణ్ణి హతమార్చడానికి ప్ర…ుత్నించాడని అతని మీద నేరం ఆరోపించబడింది. ఆరోజు సా…ుంకాలం జైలుఅధికారి, ఎర్‌‌డమన్‌ను చూడడానికి ఎవరో వచ్చినట్టు అతనికి చెప్పాడు. ఎర్‌‌డమన్‌ తలెత్తి వచ్చిన వ్యక్తికేసి ఆశ్చర్యంగా చూశాడు. ‘‘మిత్రమా, ఆశ్చర్యపడకు. నా పేరు జాన్‌ వాట్సన్‌. న్యా…ువాదిని. నీ తరఫున ఉచితంగా వాదించడానికి వచ్చాను,'' అన్నాడు మధ్య వ…ుస్కుడైన ఆ వచ్చిన వ్యక్తి.
 
ఆ న్యా…ువాది ఈ సంఘటన గురించి ఉద…ుం వార్తాపత్రికలో చదివాడు. 1910 మే 22 ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 2.25 గంటలకు, ఒక రాజకీ…ునా…ుకుడు విల్లీ బానిష్టర్‌, ఎప్పటిలా వాహ్యాళికి వెళ్ళి తిరిగి వస్తూండగా, ఆ…ున ఇంటి ముందు వరండాలో ఒక తోలు సంచీని చూశాడు. ఆ సంచీ నుంచి సన్నటి తెల్ల తీగ, ఆ…ున తలుపు గడి…ుగుండా వెళ్ళడం గమనించాడు. బానిష్టర్‌ వెంటనే పోలీసులను రప్పించాడు.
 
పలువురు అపరాధ పరిశోధకులు వచ్చి, సంచీని తెరిచి చూశారు. లోపల డైనమైట్ స్టిక్‌‌సతో పాటు ఒక పిస్టల్‌ కనిపించింది. ఆ తెల్లటి తీగ పిస్టల్‌ ట్రిగ్గర్‌కు కట్టబడివుంది. వార్తాపత్రికలోని ఈ ఉదంతం న్యా…ువాదిలో అనేక అనుమానాలను రేకెత్తించింది. ఇదంతా ఏదో కావాలనే ఏర్పాటు చేసిన తంతులా ఆ…ునకు తోచింది. ఆ రోజు మధ్యాహ్నానికల్లా నిందితుణ్ణి జైల్లో పెట్టారన్న వార్త రాగానే ఆ…ునలోని అనుమానం మరింత బలపడింది.
 
అందుకే వెంటనే బ…ులుదేరి జైలుకు వచ్చాడు. ‘‘ద…ుచేసి మీ అమూల్య మైన సమ…ూన్ని నాకోసం వృథా చేసుకోకండి. మీ ప్ర…ుత్నాలు ఏవీ ఫలించవు,'' అని కొంతసేపు మౌనం వహించిన ఎర్‌‌డమన్‌, ుళ్ళీ, ‘‘ఆ రాజకీ…ు నా…ుకుణ్ణి నేను ద్వేషించే మాట నిజమే.

ఇటీవలకూడా ఘర్షణపడ్డాను. అన్నిటికీ మించి నాకెవ్వరూ ముందూ వెనకా లేరు. నేరం జరిగిన సమ…ుంలో నేనక్కడ లేదు; మరెక్కడో ఉన్నానని నిరూపించగల సాక్ష్యాధారాలు నావద్ద లేవు. నాకు సా…ుపడే స్నేహితులూ లేరు. జామీనులో విడుదల కావడానికి నావద్ద డబ్బులు కూడా లేవు!'' అన్నాడు నిర్లిప్తంగా. అయినా జాన్‌ వాట్సన్‌ ఆ…ున తరఫున వాదించాలనే నిర్ణయించాడు. ‘‘విచారించకు, నువ్వు అపరాధివి అని నిరూపించడానికి కూడా చాలినన్ని సాక్ష్యాధారాలు లేవు, మిగిలినవన్నీ రేపు కోర్టులో చూసుకుందాం,'' అని ధైర్యం చెప్పి వెళ్ళాడు.
 
మరునాడు కోర్టులో ఏడుగురు సాక్షలు హాజర…్యూరు. మే 22 మధ్యాహ్నం 2.25 గం.లకు సంచీ కనుగొనడానికి ముందు, ఆ రాజకీ…ునా…ుకుడి ఇంటిసమీపంలో జో ఎర్‌‌డమన్‌ను చూసినట్టు అందరూ సాక్ష్యం చెప్పారు. న్యా…ువాది జాన్‌ వాట్సన్‌ మౌనంగా ఊరుకున్నాడు. ఆతరవాత ప్రధాన సాక్షులైన, పొడవాటి తెల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అంతకు ముందు సాక్ష్యం చెప్పిన ఏడుగురూ-ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ ఇంటి పక్కగా నడిచి వెళ్ళడం చూసినట్టు చెప్పారు.
 
అక్కచెల్లెళ్ళయిన ఆ అమ్మాయిలు చెప్పిన సాక్ష్యం ఇలా ఉంది: మే 22 ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 1.50 గం.లకు వాళ్ళు చర్చి నుంచి ఇంటికి తిరిగివస్తూ, విల్లీ బానిష్టర్‌ ఇల్లు ఉన్న వీధిగుండా వెళ్ళారు. ఆ సమ…ుంలో వాళ్ళకు జో ఎర్‌‌డమన్‌, భవనం వెనకవున్న సందుగుండా వేగంగా వెళుతూ కనిపించాడు. అతని కుంటి నడక, గళ్ళచొక్కా, నీలంరంగు టోపీ కూడా వాళ్ళకు గుర్తున్నాయి. బాక్‌‌సలో కూర్చున్న ఖైదీ, గళ్ళ చొక్కాతోనే ఉన్నాడు. హాల్లో నడవమన్నప్పుడు కుంటుతూనే నడిచాడు.
 
నీలం టోపీ చూపగానే అది తనదే అని వెంటనే అంగీకరించాడు. విచారణ ముగిసినటే్ట అనిపించింది. నిందితుడి తరఫున్యా…ువాది జాన్‌ వాట్సన్‌ గాఢంగా నిట్టూర్చాడు. అయితే ఆ…ున నమ్మకాన్ని కోల్పోలేదు. ప్ర…ుత్నించి చూడాలనే నిర్ణయించాడు. లేచి నెమ్మదిగా అక్క చెల్లెల్ని సమీపించాడు. ‘‘మీరు చర్చినుంచి వెలుపలికి రాగానే ఏంచేశారో చెప్పండి,'' అన్నాడు.

‘‘ఫోటోలు దిగాము,'' అన్నారు అక్కచెల్లెళ్ళు. ‘‘అందుకు ఏ స్టూడిెూకన్నా వెళ్ళారా?'' ‘‘లేదు. వృద్ధుడైన ఆ పూజారి ద…ుతో ఫోటో తీశారు. మేము చర్చిముందు నిలబడ్డాము. అంతే.'' ‘‘ఆ ఫోటో మీ దగ్గరున్నదా?'' ‘‘ఉంది. ఇదిగో నాసంచీలోనే ఉంది. కావాలంటే దీనిని మీరే ఉంచుకోండి. మా దగ్గర ఇంకో కాపీ ఉంది.'' ఈ సమ…ుంలో న్యా…ుమూర్తి, విరామం ప్రకటించాడు. జాన్‌ వాట్సన్‌ పక్కన ఉన్న పార్కులోకి వెళ్ళి చెట్టుకింద కూర్చుని, ఫోటోను పరిశీలనగా చూశాడు.
 
తెల్లటి పొడవాటి దుస్తులతో అమ్మాయిలు చర్చి ముందు నిలబడి ఉన్నారు. కల్లాకపటం తెలి…ుని ఆ పిల్లలు చెప్పిన సాక్ష్యంతో కేసు ముగిసినటే్ట అయింది. అందులో నుంచి ఏదైనా తెలి…ువస్తుందేమో అన్న ఆశతో ఆ ఫోటో కేసి అతడు మళ్ళీమళ్ళీ చూశాడు. ఆ ఫోటోలోని చాలా స్వల్పమైన విష…ుం ఆ…ున దృష్టిని హఠాత్తుగా ఆకర్షించింది. ఆ…ున మనసులో రకరకాల ఆలోచనలు రాసాగాయి. అయినా అసలు సంగతి పట్టుబడడం లేదు.
 
ఆ ఫోటోను తీసుకుని చర్చి వద్దకు వెళ్ళి దాని ముందు నిలబడ్డాడు. ఆ…ున తలపైన ఎంతో ఎత్తులోవున్న చర్చి గోపురం గడి…ూరం రెండు సార్లు మోగింది. జాన్‌ వాట్సన్‌ అక్కడినుంచి కారులో ప్రెూగశాలను చేరుకున్నాడు. ఆ…ున అక్కడ ఖగోళ శాస్ర్తజ్ఞుణ్ణి కలిశాడు. వెంటనే న్యా…ుస్థానానికి తిరిగివచ్చి, తనకు నూతన సాక్ష్యాధారం లభించిందనీ, రేపటి వరకు వాయిదా కావాలనీ కోరాడు.
 
జాన్‌ వాట్సన్‌ ఏదో కొత్త విష…ూన్ని బ…ుటపెట్టనున్నాడన్న వార్త అంతటా వ్యాపించడంతో, మరునాడు ఉద…ుం న్యా…ుస్థానంలో జనం కిటకిటలాడుతున్నారు. ప్రతివాది తరఫున తొలి సాక్ష్యాన్ని పిలిచారు. ఆ…ున పొట్టిగా, లావుగా చిన్న గడ్డం, నెరిసిన మీసంతో ఉన్నాడు. ‘‘అ…్యూ, తమరు విశ్వవిద్యాల…ుంలో ఖగోళశాస్ర్త ఉపన్యాసకులు కదా?'' ‘‘అవును. ప్రధాన ఉపన్యాసకుణ్ణి.'' ‘‘ఇక్కడ ఒక ఫోటో వుంది. ద…ుచేసి దానిని పరిశీలించి చూసి, ఆ ఫోటో ఎప్పుడు తీ…ుబడిందో సమ…ుం సరిగ్గా చెప్పగలరా?''

‘‘చెప్పగలను. సమ…ుమే కాదు. ఏరోజు తీ…ుబడిందో కూడా చెప్పగలను!'' ‘‘అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?'' ఖగోళశాస్ర్తజ్ఞుడు తన గడ్డాన్ని సవరించు కుంటూ, ‘‘అది చాలా సులభం. ఈ ఫోటోలో నీడ వుంది చూశారూ. చర్చిగోపురం నీడ. ఆ నీడ ఏర్పరచిన కోణాన్ని లెక్కగట్టి, అప్పుడు సమ…ుం ఎంతో సరిగ్గా చెప్పగలను!'' ‘‘చెప్పండి మరి. సరిగ్గా ఏ సమ…ుంలో ఆ ఫోటో తీ…ుబడింది?'' ‘‘1910 మే 22 తేదీ మధ్యాహ్నం 3.10 గం.లకు కెమెరా క్లిక్‌ మన్నది!''
 
నిపుణుడు అందించిన ఈ సాక్ష్యాధారం వల్ల, అంతకు ముందు ఏడుగురు చెప్పిన సాక్ష్యాలూ, తెల్ల దుస్తుల ఇద్దరు అమ్మాయిల మాటలూ నిలబడలేక పో…ూయి. అనేక సందేహాలకు లోన…్యూయి. వాళ్ళ జ్ఞాపక శక్తిని అనుమానించవలసి వచ్చింది. నిందితుణ్ణి వాళ్ళు చూసినమాట ఒకవేళ వాస్తవమే అయినప్పటికీ, అది సంచీ దొరికిన మధ్యాహ్నం 2.25 గం.లకు పిమ్మట నలభై అయిదు నిమిషాలు గడిచిన తరవాతే అన్న సంగతి తేటతెల్లమయింది.
 
ఖగోళ శాస్ర్తజ్ఞుణ్ణి మళ్ళీ ప్రశ్నించడానికి ఎవరూ సాహసించలేక పో…ూరు. ఆ…ున లెక్కలూ, సాక్ష్యాలూ నిక్కచ్చిగా ఉంటా…ుని అందరూ నమ్మారు. అంతకు ముందు రాత్రి అతడెన్నోలెక్కలు వేశాడు. ఒక నిరపరాధిని శిక్ష నుంచి రక్షంచే అవకాశాన్ని జారవిడుచుకో కూడదన్న లక్ష్యంతో పొద్దున కోర్టుకు రావడానికి ముందు చర్చి దగ్గరికి వెళ్ళి అన్నిటినీ మరొక్కసారి క్షుణ్ణంగా పరిశీలించివచ్చాడు.
 
ఆఖరికి నిందితుడు నిరపరాధి అని నిర్ణయించి విడుదల చే…ుబడ్డాడు. అయినా, కొందరు కేవలం ఫోటోలోని నీడకోణం సమ…ూన్ని నిర్ణయించగలదన్న సంగతిని నమ్మలేకపో…ూరు. అలాంటివారు, ఒక సంవత్సరం తరవాత, సరిగ్గా అదేరోజు, అదే సమ…ూనికి చర్చిముందు నిలబడి ఫోటోలు దిగారు. అప్పుడు వాళ్ళ ఫోటోలలోని చర్చిగోపురం నీడ కోణం - తెల్లటి దుస్తుల ఇద్దరమ్మాయిల ఫోటోలో ఉన్న గోపురం నీడ కోణంలోనే ఉంది!

ఘటోత్కచుడు


భీమసేనుడికీ, హిడింబకూ జన్మించిన ఘటోత్కచుడు తండ్రికి సాటి రాగల బలపరాక్రమాలూ, తల్లికి మించిన రాక్షస మాయలూ ప్రదర్శించిన వీరుడు. రాక్షసి కడుపున పుట్టినప్పటికీ సద్వర్తనుడు. పాండవులకు విధేయుడై వారికి అండగా నిలబడ్డాడు. అతడి జన్మవృత్తాంతం చాలా ఆసక్తి కరమైనది: పాండవులు వారణావతంలోని లక్క ఇంటి నుంచి తప్పించుకుని అర్ధరాత్రి సమయంలో సొరంగ మార్గం గుండా అరణ్యం చేరారు.
 
కటిక చీకటిలో చాలా దూరం నడిచి గంగానదిని దాటి దక్షిణ దిశగా వెళ్ళారు. చాలాసేపు నడిచి బాగా అలిసిపోయి ఒక మర్రి చెట్టు కింద పడుకున్నారు. భీముడు వాళ్ళకు కాపలా కాయసాగాడు. ఆ వనంలో హిడింబుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఆహారం కోసం అరణ్యమంతా తిరిగి, ఒక మద్ది చెట్టెక్కి జుట్టు విదిలించుకుంటూ, ఆవులిస్తూ చూస్తూండగా, వాడికి దూరాన మర్రి చెట్టు కింద పడుకుని కొందరు మనుషులు కనిపించారు.
 
వాడు తన చెల్లెలైన హిడింబను పిలిచి, ‘‘ఆ మర్రి చెట్టు కింద నిద్రపోతూన్న వారిని చంపి తీసుకురా, కడుపు నిండా తిందాం,'' అన్నాడు. హిడింబ సరేనని బయలుదేరి పాండవులున్న చోటికి వచ్చి, నిద్రపోతూన్న కుంతినీ, ధర్మరాజునూ, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనూ; వారికి కాపలా కాస్తున్న భీముణ్ణీ చూసింది. హిడింబ కంటికి భీముడు నవమన్మథుడిలా కనిపించాడు.

వెంటనే సుందరమైన రూపం ధరించి, సిగ్గుతో కూడిన చిరునవ్వులు చిందిస్తూ వచ్చి భీముడితో, ‘‘మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మిమ్మల్నందరినీ చంపి ఆహారంగా తెమ్మని మహాబలుడైన రాక్షసుడైన మా అన్న నన్ను పంపాడు. కానీ నిన్ను చూడగానే నాలో నిన్ను పెళ్ళాడాలనే కోరిక కలిగింది. నన్ను పెళ్ళాడి నా కోరిక తీర్చావంటే మీకు మా అన్న భయం లేకుండా కామగమనం గుండా మిమ్మల్ని ఈ క్షణమే సురక్షిత ప్రాంతానికి చేరుస్తాను,'' అన్నది.
 
వెళ్ళిన హిడింబ రావడానికి ఆలస్యం కావడంతో హిడింబుడు అక్కడికి వచ్చి చెల్లెలి అందమైన రూపం చూసి, మండిపోయి, ‘‘వాళ్ళను చంపి తీసుకురమ్మంటే, మానవరూపంతో వాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి చూస్తున్నావా? మొదట వాళ్ళను చంపి, నీ ప్రాణం కూడా తీస్తానుండు,'' అంటూ భీముడితో తలపడ్డాడు. భీముడు వాణ్ణి దూరంగా లాక్కు పోయూడు. ఇద్దరికీ ఘోరంగా యుద్ధం జరిగింది. భూమి అదిరింది. చెట్టు చేమలు కూలాయి. హిడింబుడు భయంకరంగా పెడబొబ్బ పెట్టాడు.
 
అరుణోదయమవుతూండగా భీముడు హిడింబుణ్ణి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి, నడుమువిరిచి చిత్రవధ చేశాడు. హిడింబుడు పెద్దగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు. అంతలో హిడింబ తన గురించీ, తన అన్న గురించీ-కుంతీదేవికీ, ధర్మరాజుకూ వివరించి, తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఆమెను వివాహమాడడానికి భీముడు మొదట వెనుకాడినప్పటికీ, తల్లీ, అన్నా చెప్పడంతో హిడింబకు కొడుకు పుట్టేంతవరకూ ఆమెను తన భార్యగా చూసుకోవడానికి ఒప్పుకున్నాడు.
 
హిడింబ భీముణ్ణి తీసుకుని ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఇద్దరూ పర్వత శిఖరాలపైనా, కొండ గుహల్లోనూ, నదీ తీరాలా, సరస్సులవద్దా, అందమైన పొదరిళ్ళలోనూ విహరించారు. కాలక్రమాన హిడింబ గర్భవతియై ఒక కొడుకును కన్నది. వాడు పుట్టుతూనే కామరూపుడై, అప్పటికప్పుడే పెరిగి పెద్దవాడే తల్లిదండ్రులకు, పెద్దలకు మ్రొక్కి నిలబడ్డాడు. వాడి నెత్తిన ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఉండడం వల్ల వాడికి ఘటోత్కచుడు అంటే కేశరహితమైన కుండలాంటి తల కలిగినవాడు అనే పేరు పెట్టారు.

ఘటోత్కచుడు పెద్దలకు మ్రొక్కి, ‘‘మీకు నా వల్ల ఏదైనా పనిపడితే నన్ను తలుచుకోండి. తక్షణమే మీ ఎదుట నిలుస్తాను,'' అని చెప్పి ఉత్తర దిశగా బయలుదేరాడు. మహావీరుడిగా రాక్షసులకు నాయకుడై మేఘవర్ణుడు, అంజన పర్వుడు అనే ఇద్దరు కొడుకులను కన్నాడు. మహాభారత యుద్ధంలో కౌరవ సేనలను ముప్పుతిప్పలు పెట్టి చీల్చి చెండాడాడు. భగదత్తుడికీ, ఘటోత్కచుడికీ యుద్ధం చిత్రంగా జరిగింది.
 
భగదత్తుడు పెద్ద ఏనుగును ఎక్కి పాండవ సైన్యాన్ని చిందరవందర చేశాడు. తమను కాపాడేవాళ్ళు లేక పాండవసేనలు పారిపోయూయి. ఘటోత్కచుడు అకస్మాత్తుగా మాయమయ్యూడు. కౌరవ సేనలలో హాహాకారాలు చెలరేగాయి. ఘటోత్కచుడు మళ్ళీ కనిపించి భగదత్తుడి మీద బాణవర్షం కురిపించి అదృశ్యమయ్యూడు. అర్జున కుమారుడైన ఇరావంతుడు భయంకరంగా యుద్ధం చేసి మూర్ఛపోయి ఉన్నప్పుడు ఆర్షభృంగుడనే రాక్షసుడు కత్తితో అతణ్ణి నరికి చంపాడు.
 
దానిని చూసి ఘటోత్కచుడు ఆగ్రహోదగ్రుడై భయంకరాకారంతో చేతిలో మెరిసే శూలాన్ని పట్టుకుని రాక్షసగణాలతో కౌరవ సేనల మీద విరుచుకు పడ్డాడు. దుర్యోధనుడు ఘటోత్కచుడికి ఎదురు వచ్చి సింహనాదం చేశాడు. అతడి వెనకగా ఏనుగుల సేన వచ్చింది. రాక్షసులు ఏనుగు సేనల మీద పడి ధ్వసం చేయసాగారు. ఘటోత్కచుడు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని, తన చేతిలోని శక్తిని అతడిపై విసిరాడు. అంతలో వంగదేశపు రాజు తను ఎక్కిన ఏనుగును దుర్యోధనుడి రథానికి అడ్డంగా తోలాడు.

ఘటోత్కచుడు విసిరిన శక్తి తగిలి ఆ ఏనుగు కూలిపోయింది. వంగరాజు దానిపై నుంచి కిందికి దూకి తప్పించుకుని పారిపోయూడు. ఘటోత్కచుడు విజృంభించి భయంకరంగా అరుస్తూ దుర్యోధనుణ్ణి పీడించసాగాడు. భీష్ముడి సలహా మేరకు ద్రోణుడు-సోమదత్తుడూ, సైంధవుడూ మొదలైన వీరులతో కలిసి దుర్యోధనుడికి సాయంగా వెళ్ళాడు. ఘటోత్కచుడు వాళ్ళందరినీ కూడా భయంకరంగా హింసించాడు.
 
అంతలో ధర్మరాజు కోరిక మేరకు అభిమన్యుడూ, ఉపపాండవులూ మొదలైన వారిని వెంటబెట్టుకుని భీముడు ఘటోత్కచుడికి సాయంగా వెళ్ళాడు. ఉభయ పక్షాలకూ జరిగిన యుద్ధంలో పాండవులదే పైచెయ్యి అయింది. ఆ తరవాత దుర్యోధనుడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు. భీముడు దెబ్బ తినడంతో ఘటోత్కచుడూ, అభిమన్యుడూ మొదలైన పాండవవీరులు దుర్యోధనుణ్ణి చుట్టు ముట్టారు. అది తెలిసి ద్రోణుడు కౌరవ వీరులను వెంటబెట్టుకుని దుర్యోధనుడికి సాయంగా వచ్చాడు.
 
అప్పుడు సాగిన యుద్ధంలో ఘటోత్కచుడు రాక్షస మాయలు ప్రయోగించి శత్రుసేనలకు దిగ్భ్రమ కలిగించాడు. ఘటోత్కచుడి దెబ్బకు తట్టుకోలేక కౌరవ సైన్యాలు చెల్లాచెదరై శిబిరాలకేసి పరిగెత్తసాగాయి. ఆ తరవాత భీష్ముడి సలహా ప్రకారం భగదత్తుడు సుప్రతీకమనే ఏనుగు నెక్కి పాండవుల సేనల మీదికి వెళ్ళాడు. ఘటోత్కచుడు ఎదుర్కొన్నాడు. ఇరువురికీ భీకరంగా యుద్ధం జరిగింది. ఆపిమ్మట భీష్ముడు యుద్ధ రంగంలో దిగి పాండవ సేనలను నాశనం చేశాడు.
 
ఆఖరికి శిఖండిని అడ్డు పెట్టుకుని వచ్చిన అర్జునుడిపై బాణాలు ప్రయోగించలేక, అంపశయ్య పాలయ్యూడు. ఆ తరవాత యుద్ధానికి వచ్చిన కర్ణుడు, ఆర్షభృంగుణ్ణీ, అలాయుధాసురుణ్ణీ సంహరించి తన మీదికి వచ్చిన ఘటోత్కచుడి ధాటికి తట్టుకోలేకపోయూడు. అన్నాళ్ళు అర్జునుడి మీద ప్రయోగించాలని భద్రంగా ఉంచిన ఇంద్రుడిచ్చిన శక్తిని ఘటోత్కచుడి మీదికి ప్రయోగించడంతో అతడు వీరమరణం పొందాడు.

తండ్రిని ఉప్పులాగా ప్రేమించిన యువరాణి


ఒకానొకప్పుడు పరమ గర్విష్ఠి అయిన ఒక రాజుకు ఏడుగురు కుమార్తెలు ఉండేవారు. యుక్త వయస్కులయ్యూక వారికి వివాహాలు జరిపించాలని రాజు నిర్ణయించాడు. అంతకు ముందు తన కుమార్తెలు తనను ఎవరెవరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలన్న వింత కోరిక రాజుకు కలిగింది. వెంటనే వారిని పిలిపించి, ‘‘మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారో, ఒక్కొక్కరుగా చెప్పండి,'' అన్నాడు.
 
‘‘నాన్నా, నేను నిన్ను తియ్యటి పంచదారను ప్రేమించినట్టు ప్రేమిస్తున్నాను,'' ‘‘మధురమైన తేనెలా ప్రేమిస్తున్నాను,'' ‘‘తియ్యటి మిఠాయిలా ‘ప్రేమిస్తున్నాను,'' అంటూ ఆరుగురు పెద్ద కూతుళ్ళూ ఒకరితో ఒకరు పోటీపడి తమ మనోభావాలను వెలిబుచ్చారు. ఆ మాటలు విని రాజు పరవసించి పోయూడు. ఆ తరవాత మౌనంగా ఉన్న చిన్న కుమార్తెను దగ్గరికి పిలిచి, ‘‘నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, చెప్పు తల్లీ,'' అన్నాడు ఆప్యాయంగా.
 
‘‘నాన్నా, నేను మిమ్మల్ని చాలా గొప్పగా ఉప్పులాగా ప్రేమిస్తున్నాను,'' అన్నదామె మృదువైన కంఠస్వరంతో. ఆ మాట విని రాజు దిగ్భ్రాంతి చెందాడు.

తను ఎంతగానో ప్రేమించే చిన్న కూతురు ఇంత తేలిగ్గా తీసిపారేసిందేమిటి అనుకుంటూ, ‘‘నిరుపేదలకుసైతం అందుబాటులో ఉండే ఉప్పుతో నన్ను పోలుస్తూ గొప్పగా ప్రేమిస్తున్నాను అంటావేమిటి? అదెలా సాధ్యం? నన్నెలా ప్రేమిస్తున్నావో చెప్పు,'' అని అడిగాడు రాజు ఆశ్చర్యమూ కోపమూ కలిసిన కంఠస్వరంతో. అయితే, యువరాణి మళ్ళీ, ‘‘నేను నిజమే చెబుతున్నాను నాన్నా! మిమ్మల్ని ఉప్పులాగానే ప్రేమిస్తున్నాను,'' అన్నది.

ఆ మాటతో రాజు అమితాగ్రహానికి లోనయ్యూడు. పెద్ద కుమార్తెలారుగురికీ రాకుమారులతో వివాహాలు జరిపించాడు. ఏడవ కూతురిని అడవి సమీపంలో కట్టెలు కొట్టుకుని పొట్టపోసుకునే ఒక నిరుపేదవాడికి కట్టబెట్టాలని నిర్ణయించాడు. తండ్రి నిర్ణయూనికి యువరాణి మౌనంగా రోదించింది. అయినా, తండ్రిని తను ఎంతగా ప్రేమిస్తున్నదీ తండ్రి అర్థంచేసుకునేలా చేయూలని నిశ్చయించింది.
 
పెళ్ళయ్యూక భర్త వెంట అతడి గుడిసెకు బయలుదేరింది. మరునాడు భర్త అడవికి బయలుదేరుతూండగా, ‘‘మీరు రోజూ తిరిగి వచ్చేప్పుడు అడవినుంచి ఏదైనా కానుక తీసుకురావడానికి మరిచిపోకండి. అది మనలను త్వరలో సంపన్నులను చేస్తుంది,'' అన్నదామె. భర్త అందుకు వెంటనే అంగీకరించాడు. ఆ రోజు అతడు అడవిలో కట్టెలు కొట్టడానికి బాగా ఆలస్యమైపోయింది. అతడు కట్టెల మోపుతో తిరుగు ప్రయూణమయ్యేసరికి సూర్యుడు అస్తమించాడు.
 
భార్య చెప్పిన కానుక మాట గుర్తురావడంతో ఏం చేయడమా అని కంగారు పడ్డాడు. కాలికి అడ్డంగా ఏదో మెత్తగా తగిలింది. అది పొడవుగా ఉండడంతో దారం అని భావించి దాన్నయినా తీసుకువెళ్ళి భార్యకు ఇద్దామని వంగితీసుకున్నాడు. ఇంటిని సమీపించగానే భార్యకు ఇచ్చాడు. దాన్ని దీపం వెలుగులో చూసిన యువరాణి, ‘‘చచ్చిన పామును తెచ్చారేమిటి?'' అని అడిగింది. భయంకరమైన పొరబాటు జరిగిపోయినందుకు వాడు నొచ్చుకుని, ‘‘ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం?'' అని అడిగాడు భార్యను.
 
‘‘గుడిసె పైకప్పు మీదికి విసిరివేయండి. ఉదయం లేచాక ఏం చేద్దామో ఆలోచిద్దాం,'' అన్నది ఆమె. ఇక్కడ ఇలా ఉండగా, అక్కడ రాజధానిలో మహారాణి తన గారాల చిన్న కూతురికి జరిగిన అన్యాయూనికి తల్లఢిల్లి పోయింది. అయినా రాజుకు ఎదురు చెప్పలేక విచారంతో ఉద్యానవనంలో తిరుగుతూండగా, ఆమె మెడలోని వజ్రాలహారం జారి కింద పడిపోయింది. దుఃఖంలో మునిగి వుండడంవల్ల ఆమె దానిని గమనించలేదు. మౌనంగా రాజభవనానికి తిరిగివెళ్ళింది. రాజోద్యానం మీద తిరుగుతూన్న ఒక డేగ మెరుస్తూన్న వజ్రాల హారాన్ని చూసింది.

కిందికి వాలి దాన్ని ముక్కున కరుచుకుని అడవికేసి ఎగిరి వెళుతూ, కట్టెలు కొట్టేవాడి గుడిసె మీద ఉన్న చచ్చిన పామును చూసింది. వెంటనే ఆ గుడిసె మీద వాలి, వజ్రాల హారాన్ని అక్కడ పడేసి చచ్చిన పామును తన్నుకుని ఎగిరివెళ్ళింది. అదే సమయంలో రాజభవనంలో మహారాణి వజ్రాల హారం కనిపించలేదని వెతకసాగారు.
 
ఎలాగైనా దాన్ని మళ్ళీ తెప్పిస్తానని రాజు రాణిగారికి మాట ఇచ్చాడు. ఆ తరవాత రాణిగారి వజ్రాల హారం ఎక్కడైనా కనిపిస్తే తెచ్చి ఇచ్చినవారికి కోరిన బహుమతి ఇస్తానని రాజ్యం నాలుగు చెరగులా చాటింపు వేయమని భటులను ఆజ్ఞాపించాడు. మరునాటి ఉదయం కట్టెలు కొట్టేవాడు ఇంటి కప్పు మీదికి విసిరిన చచ్చిన పామును తీసివేద్దామని నిచ్చెన వేసి ఇంటి కప్పు మీదికి ఎక్కాడు. అక్కడ మిలమిలా మెరుస్తూన్న హారాన్ని చూసి బిత్తరపోయి, ‘‘యువరాణీ! ఇలా వచ్చి చూడు. ఇంటి కప్పు మీద ప్రకాశం!
 
కప్పుకు నిప్పంటుకుందేమో చూడు!'' అంటూ కేకలు పెట్టసాగాడు. యువరాణి వచ్చి చూసి నవ్వుతూ, ‘‘అది నిప్పు కాదు. మా తల్లిగారి విలువైన వజ్రాల హారం! విధియే దాన్ని మన దగ్గరికి చేర్చింది. నన్ను మా తండ్రిగారు సరిగ్గా అర్థం చేసుకునేలా చేయడానికి మంచి అవకాశం దొరికింది!'' అన్నది. ఆమె మాట ముగించే లోపలే దండోరా శబ్దం, ఆ తరవాత, ‘‘అందరూ వినండహో! మహారాణిగారి అమూల్యమైన వజ్రాల హారం కనిపించడం లేదు. అది దొరికితే, తెచ్చి అప్పగించే వారికి కోరిన బహుమతి ఇవ్వబడుతుంది! ఇది రాజుగారి ప్రకటన! అందరూ వినండహో!'' అన్న భటుల చాటింపు వినిపించింది.
 
యువరాణి భర్త కేసి తిరిగి, ‘‘నువ్వు వెంటనే వజ్రాలహారంతో వెళ్ళి దాన్ని మహారాజుకు అప్పగించు. నువ్వు ఎవరు అన్నది చెప్పవద్దు. ఎలాంటి బహుమతినీ కోరవద్దు. రేపు మధ్యాహ్నం మహారాజు వచ్చి మన ఇంట్లో భోజనం చెయ్యూలి. అదే ఆయన మీకిచ్చే బహుమతిగా చెప్పండి,'' అన్నది.
 
కట్టెలు కొట్టేవాడు అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళి, రాజును సందర్శించి వజ్రాల హారాన్ని అప్పగించి, ‘‘మహారాజా! మహారాణిగారి వజ్రాల హారాన్ని విధి మా ఇంటి కప్పు మీదికి చేర్చింది,'' అన్నాడు.హారాన్ని తీసి పరిశీలనగా చూసిన మహారాజు, ‘‘మహారాణి పోగొట్టుకున్న వజ్రాల హారం ఇదే. తెచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఏం బహుమతి కావాలో కోరుకో. ఇప్పుడే ఇస్తాను,'' అన్నాడు ఎంతో ఆనందంగా.

‘‘నేను కట్టెలు కొట్టుకుని బతికే ఒక నిరుపేదను. నాకు ఎలాంటి బహుమతీ వద్దు. మహారాజుగారు రేపు ఒంటరిగా మా ఇంటికి వచ్చి మాతో కలిసి భోజనం చేస్తే, అదే మహాభాగ్యంగా భావిస్తాను,'' అన్నాడు కట్టెలు కొట్టేవాడు వినయంగా. వాడి కోరిక విని రాజు ఒక్క క్షణం విస్మయం చెందాడు. అయినా ఆహ్వానాన్ని మన్నించక తప్పలేదు.
 
చెప్పిన ప్రకారం మరునాడు రాజు ఒంటరిగా కట్టెలు కొట్టే వాడి గుడిసెకు వెళ్ళాడు. అక్కడున్న యువరాణి, ముఖం కనిపించకుండా మేలి ముసుగు వేసుకుని ఎదురువచ్చిరాజుకు నమస్కరించి మౌనంగా గుడిసెలోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. ఆ తరవాత రకరకాల మధురమైన పిండివంటలను వడ్డించింది. మహారాజు వాటిని తిన్నాక మరికొన్ని మధుర పదార్థాలు వడ్డించింది. వాటిని ముగించాక ఇంకా కొన్ని తీపి వంటకాలను వడ్డించ బోయింది.
 
కాని రాజు అడ్డుకుంటూ, ‘‘క్షమించు తల్లీ, ఇక ఒక్క ముక్క కూడా తినలేను. జబ్బు చేస్తుంది. వెగటు పుట్టిస్తోంది. ఏదైనా ఉప్పగా ఉంటే ఇవ్వు తింటాను,'' అన్నాడు. వెంటనే యువరాణి మేలిముసుగును తొలగిస్తూ, ‘‘ఇప్పుడు తెలిసిందా నాన్నా ఉప్పు విలువ! తమరిని నేను ఉప్పులాగా ప్రేమిస్తున్నాను అని చెప్పినందుకు ఆరోజు ఆగ్రహించారు. ఇవాళ తీపి పదార్థాలు వద్దు, ఉప్పటి వంటకం కావాలంటున్నారు,'' అన్నది. రాజు అవాక్కయి పోయూడు.
 
ఆనాటి తన చర్యకు సిగ్గు పడి తల పంకిస్తూ, ‘‘నన్ను క్షమించు తల్లీ! ఉప్పువిలువ తెలుసుకోలేక పోయూను. తక్కిన వారికన్నా నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఇప్పుడు అర్థమయింది,'' అన్నాడు. యువరాణి తండ్రికి మళ్ళీ ఒకసారి నమస్కరించి ఆప్యాయతతో ఆయన చేతులు పట్టుకున్నది.
 
కుమార్తె తెలివినీ, మంచితనాన్నీ గ్రహించిన రాజు ఆమెను రాజభవనానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. తన రాజ్యంలో కొంత భాగాన్ని ఆమెనూ ఆమె భర్తనూ పాలించుకోమని ఇచ్చాడు. వాళ్ళు చక్కగా పరిపాలిస్తూ, మహారాజు ఉన్నంత వరకు ఆయన్ను ఎంతో అభిమానంగా చూసుకున్నారు.

పారిపోయిన దుష్టమృగం!


వేనవేల సంవత్సరాలకు పూర్వం, చైనాలో ఒక అందమైన ప్రశాంత పట్టణం ఉండేది. పట్టణ ప్రజలు కష్టపడి పనిచేసేవారు. పనులన్నిటినీ చేశాక, సా…ుంకాల సమ…ూలలో గుంపులు గుంపులుగా చేరి హాయిగా కథలు చెప్పుకుని ఆనందించేవారు. వేసవికాలంలో, పిన్నలూ పెద్దలూ ఆరుబ…ుటే ఉండేవారు. అయితే శీతాకాలం మాత్రం భరించరాని చలిగా ఉండేది. చాలా మంది చలిమంటలు కాచుకుంటూ ఇళ్ళలోపలే ఉండేవారు.
 
కావలసినంత టీ, ఇతరపానీ…ూలు తాగి ఒంట్లో వెచ్చదనం నిలుపుకునేవారు. అలాంటి భ…ుంకరమైన ఒక శీతాకాలంలోనే పట్టణంలో భ…ూనకమైన ఆ దుర్ఘటన జరిగింది. అది జరగడానికి ముందు పట్టణంలోని ఆ ఒకే ఒక సత్రంలో అసంఖ్యాకంగా ప్రజలు గుమిగూడి రకరకాల కబుర్లు చెప్పుకోసాగారు. ‘‘ఈ శీతాకాలంలో ఈ వేడివేడి టీ మనప్రాణాలు కాపాడుతున్నది,'' అన్నాడు ఒక వర్తకుడు. ‘‘అవునవును.
 
సత్రానికి రావడానికి మంచులో దారీ డొంకా తెలి…ుక అల్లాడిపో…ూను,'' అన్నాడు పక్కనే ఉన్న ఇంకొక వర్తకుడు. ఇలా తమ తమ అనుభవాలను చెప్పుకుంటూ టీ తాగుతూ వెచ్చటి సత్రంలో హాయిగా ఉన్నవాళ్ళకు హఠాత్తుగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపలే భ…ుంకర ఆకారంతో ఒక వింతప్రాణి సత్రంలోకి జొరబడింది.
 
అది ఏమిటో పరీక్షగా చూసే లోపలే అక్కడున్నవాళ్ళందరినీ బీభత్సంగా హతమార్చింది. దాని దాడినుంచి ఒకే ఒక కురవ్రాడు మాత్రం బ…ుటపడ్డాడు. దాని భ…ుంకర రూపాన్ని చూడగానే కుర్చీలో కూర్చున్న కురవ్రాడు కిందపడి స్పృహకోల్పో…ూడు. వాడు మేజాకింద కదలామెదలక పడి ఉండడం అదృష్టవశాత్తు ఆ ద…్యుం గమనించలేదు.
 
ఈ భీకర దుర్ఘటనతో పట్టణమంతా భ…ుంతో గడగడవణికిపోయింది. ఒక్కక్షణంలో బంధుమిత్రులను కోల్పోయిన ప్రజలు హతా శుల…్యూరు. ఇలాంటి భ…ూనక వాతావరణాన్ని సృష్టించిన ఆ నిేున్‌ భూతాన్ని పట్టుకోవడానకి బృందాలను ఏర్పాటు చేశారు.

కాని వాళ్ళు ఎంత వెతికినా ఎక్కడా దాని జాడ కనుగొనలేకపో…ూరు. ఆ శీతాకాలమంతా అందరూ ఇళ్ళలోపలే ఉండిపో…ూరు. సా…ుంకాలం అేు్య సరికి పట్టణ వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించేవి. రాత్రుల్లో ఇళ్ళ తలుపులూ, కిటికీలూ గట్టిగా మూసి లోపల పడుకునేవారు. వసంతకాలం ఆరంభమయింది. పట్టణానికి నూతన చైతన్యం రాసాగింది. పొలాలు పచ్చదనం సంతరించుకున్నాయి.
 
చిన్నచిన్న రకరకాల పువ్వులు, వీచే చల్లని పిల్ల గాలులకు హాయిగా తలలూపసాగాయి. జంతువులూ, పక్షƒులూ స్వేచ్ఛగా తిరుగుతూ, ఎగురుతూ కనిపించాయి. మనుషులు కూడా ఇళ్ళనుంచి వెలుపలికి వచ్చారు. విత్తనాలు విత్తే కాలం కావడంతో, పనులలో తలమునకలై భీకర వింతమృగం సంగతి మరిచిపో…ూరు. కొన్నాళ్ళకు మళ్ళీ, శీతాకాలం రావడంతో చలి, తీవ్రమైన మంచు ముంచుకొచ్చాయి.
 
మళ్ళీ సత్రంలో ప్రజలు వేడి టీ తాగుతూ, కబుర్లు చెప్పుకోవడానికి చేరసాగారు. అయితే, మళ్ళీ ఒకసారి నిరుటిలాగే ఆ ద…్యుం వచ్చిపడి సత్రంలోని-ఒక్క …ుువకుణ్ణి తప్ప అందరినీ క్షణంలో చంపివెళ్ళింది. ఇది కూడా గత సంవత్సరం వచ్చిన భూతమే అని బతికి బ…ుట పడ్డ …ుువకుడి ద్వారా తెలుసుకున్నారు. పట్టణ ప్రజలలో ఆవేదన, ఆగ్రహం పెల్లుబికాయి. ‘‘ఈ పీడకు ఎలాగైనా విరగడ చూడాలి. ేుటేటా ఆ భూతం మన వాళ్ళను చంపి వెళ్ళడం చూస్తూ ఊరుకోలేం.
 
దాన్ని ఎలాగైనా హతమార్చాలి!'' అన్నాడు పట్టణాధికారి. ఆ తరవాత ప్రజలందరూ కలిసి ఆ ఊళ్ళోవున్న వివేకవంతులైన వారి దగ్గరికి వెళ్ళి సలహా అడిగారు. పండితులు కొంతసేపునిదానంగా ఆలోచించి, ‘‘రెండు సందర్భాలలోనూ నిేున్‌ శీతాకాలం ముగుస్తూన్న సమ…ుంలోనే వచ్చి మనమీద పడింది. కాబట్టి, ఆ సమ…ుంలో మనం జాగ్రత్త పడాలి,'' అన్నారు.
 
‘‘మనం ఆ ద…్యూన్ని ఎలా ఎదుర్కో గలం?'' అని అడిగాడు ఒక …ుువకుడు. ‘‘ఎరుపు దుష్టశక్తుల్ని తరుమగొడుతుంది. ఎరట్రి బట్టలు సకల ప్రాణులనూ భ…ుభ్రాంతుల్ని చేస్తాయి. అదే సమ…ుంలో భ…ుంకర ధ్వనులు పుట్టిస్తే అవి వాటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడతాయి. హఠాత్తుగా బాణాసంచా పేలిస్తే ఎలాంటి ప్రాణికైనా హడలు పుట్టిస్తుంది.

కాబట్టి ఆ దుష్టమృగాన్ని ఎలా ఎదుర్కోవాలో మీరే నిర్ణయించుకోండి,'' అన్నాడు వృద్ధుడైన ఒక పండితుడు. పట్టణ ప్రజలు ఎదురుచూసిన మరుసటి శీతాకాలం రానేవచ్చింది. నిేున్‌ను ఎదుర్కోవడానికి పట్టణంలోని ప్రజలందరూ ఆ…ుత్త మ…్యూరు. దానిని ఎలాగైనా మట్టుపెట్టాలన్న పట్టుదల వారిలో కలిగింది. గత రెండేళ్ళు నిేున్‌ వచ్చిన రోజును గుర్తు పెట్టుకున్నారు. ఈేుడు ఆ రోజున పిల్లలూ, స్ర్తీలూ, వృద్ధులూ ఇళ్ళలోపల ఉండిపో…ూరు. …
 
ుువకులు సత్రం వద్ద చేరారు. వారిలో కొందరు కత్తులు, కొందరు బాణాలూ, మరి కొందరు దివిటీలు పట్టుకున్నారు. ఇంకా కొంతమంది పెద్దపెద్ద తప్పెటలనూ, డప్పులనూ, ఢంకాలనూ, కరల్రనూ పట్టుకున్నారు. మరి కొందరు ఎర్ర జెండాలను, ఎర్ర బట్టలను పట్టుకుని నిలబడ్డారు. హఠాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసినట్టు కాంతి కనిపించింది. ఆ తరవాత గుండెల విసేలా వింతగొంతుతో భ…ుంకరంగా అరుస్తూ నిేున్‌ వచ్చింది.
 
నిప్పుకణికల్లాంటి కనుగుడ్లు తిప్పుతున్నది. నోరు తెరిస్తే నిప్పుటేరులా సెగలు వెలువడుతున్నవి. వంకర్లు తిరిగిన గోళ్ళతో వికారమైన వేళ్ళు. పెద్ద పెద్ద రెక్కలల్లారుస్తూ అది జనం మీదికి వాలింది. అయితే, సిద్ధంగా వున్న …ుువకులు ఒక్కసారిగా, దానిని చుట్టుముట్టి డప్పులూ, ఢంకాలూ, తప్పెటలూ వాయించారు. ఎర్ర జెండాలను అదే పనిగా ఊపారు. బాణాసంచాను పేల్చి దానిమీదికి విసిరారు. నిేున్‌ హడలిపోయింది. భీతిగొలిపే ఎరట్రి కాంతులు, మిరమిట్లు దానికి కళ్ళు కనబడకుండా చేశాయి.
 
కాస్సేపు అటుఇటూ తిరిగి దిక్కుతోచక అరుస్తూ తోకముడిచి ఎటో పారిపోయింది! …ుువకులు ఆనందోత్సాహాలతో గెంతులువేశారు. ‘‘నిేున్‌ పారిపోయింది. ఇక అది మన దరిదాపులకు వచ్చే సాహసం చే…ుదు. నూతన శకానికి ఇది ఆరంభం. పండుగ చేసుకుందాం!'' అని ప్రకటించాడు పట్టణ అధికారి.
 
ఇవే చైనావాళ్ళు జరుపుకున్న మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలు. భ…ూందోళనల నుంచి విముక్తి పొందిన ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు. బంధు మిత్రులను కలుసుకోవడం, పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆటలు పాటలు, విందులు వినోదాలతో ఆ రోజంతా హాయిగా గడిపారు.

నీళ్ళప్రభావం


ఒక గ్రామంలో వీర…్యు అనే గజఈతగాడు ఉండేవాడు. ఈతలో వాడి ప్రావీణ్యానికి మెచ్చి, ఎవరో జమీందారు ఇచ్చిన అద్భుతమైన కంచు విగ్రహం ఒకటి వాడి దగ్గిర ఉండేది. అది విదేశాల నుంచి వచ్చిన అరుదైన విగ్రహం. ఒక సంవత్సరం వీర…్యు వసంతోత్సవాలు చూడటానికి రాజధానికి పోతూ, తన విగ్రహాన్ని షావుకారు కృష్ణ…్యు వద్దకు తీసుకుపోయి, తాను రాజధాని నుంచి తిరిగి వచ్చేదాకా దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు.
 
అంత అందమైన విగ్రహం వీర…్యు వంటి పేదవాడి దగ్గిర ఉండేకన్న తన వంటి సంపన్నుడి వద్ద ఉంటే బాగుంటుందనుకుని, కృష్ణ…్యు దాన్ని తనకు అమ్మమన్నాడు. ‘‘అది అమ్మేది కాదు లెండి. నేను తిరిగి వచ్చేవరకూ మీ దగ్గిర ఉంచండి, చాలు,'' అన్నాడు వీర…్యు. అతనికి సంబంధించినంత వరకు ఆ విగ్రహం తన ఈత నైపుణ్యానికి చిహ్నం. ఆ విగ్రహాన్ని వీర…్యుకు తిరిగి ఇ…్యుకూడదని కృష్ణ…్యు అప్పుడే అనుకున్నాడు.
 
అతను ఆ విగ్రహం సహా…ుంతో అచ్చులు త…ూరుచేసి, అలాంటిదే ఒక మట్టిబొమ్మ త…ూరు చేయించి, దానికి ఇత్తడి పూతపూయించి, వీర…్యు తిరిగి రాగానే దాన్ని ఇచ్చేశాడు. వీర…్యు దాన్ని ఇంటికి తీసుకుపోయి, దాని స్థానంలో ఉంచబోతూ మోసం జరిగినట్టు తెలుసుకున్నాడు. అది ఓటిమోతమోగింది. అదీగాక దాన్ని గట్టిగారుద్దితే పై పూత పోయి, లోపల కుండపెంకు బ…ుటపడింది.
 
వెంటనే వీర…్యు విగ్రహాన్ని తీసుకుని కృష్ణ…్యు వద్దకుపోయి, ‘‘నా అసలు విగ్రహం దాచుకుని, ఈ మట్టి బొమ్మ ఇస్తావా? ఏం పన…్యూ? పెద్దమనిషి చె…్యువలసిన పనేనా? నా విగ్రహం నాకు ఇచ్చెయ్యి, లేకపోతే పదిమందిలో నీ సంగతి బ…ుటపెడతాను,'' అన్నాడు. ‘‘నీ విగ్రహమే నీ కిచ్చాను.
 
మా బావి నీళ్ళతో కడిగిన కారణం చేత నీ కంచు కాస్తా మట్టిగా మారిందేమో! నీటి ప్రభావం అలాటిది. దానికి ఎవరేం చేస్తారు?'' అన్నాడు కృష్ణ…్యు. వీర…్యు చేసేదిలేక ఊరుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున షావుకారు కృష్ణ…్యు భార్య ఊరి చివరన ఉన్న మంచి నీటి బావిలో ఇత్తడి కడవతో నీరు తోడుతూండగా, కడవ బావిలో పడిపోయింది.

ఆ బావి చాలా లోతు. ఊరికంతకూ అది ఒకటే మంచినీటి బావి. దానిలో దిగి కడవ తీ…ుగలవాడు వీర…్యు ఒక్కడే ఉన్నాడు. వీర…్యును అడగటం ఇష్టం లేకపోయినా, తప్పనిసరి కావటం చేత, మంచినీళ్ళబావి నుంచి తన ఇత్తడి కడవ తీసి పెట్టమని కృష్ణ…్యు వీర…్యును బతిమాలాడు. ‘‘దానికేం భాగ్యం, షావుకారుగారూ? రేపు ఉద…ుం మీ కడవ తప్పక తీసిపెడతాను,'' అన్నాడు వీర…్యు.
 
ఆ రోజు అర్ధరాత్రి దాటగానే వీర…్యు ఒక మట్టి కడవ తీసుకుని బావి వద్దకు వెళ్లి, బావిలో దిగి ఇత్తడి కడవ పైకితీసి, దానికి కట్టి ఉన్న తాడుముక్క తీసి మట్టి కడవకు తగిలించి, మట్టి కడవను బావిలో వదిలి, ఇత్తడి కడవను ఒక రహస్యప్రదేశంలో దాచి, ఇంటికి వెళ్లి పడుకుని నిద్రపో…ూడు. మర్నాడు ఉద…ుం షావుకారు చూస్తూండగానే వీర…్యు బావిలోకి దిగి, నీటిలో ముణిగి, మట్టికడవ పైకి తెచ్చాడు.
 
అది చూసి షావుకారు తెల్లబోయి, ‘‘అది మన గ్రామంవాళ్ళదే, ఇంకెవరిదో అయి ఉంటుంది. ఇంకొక్కసారి ముణిగి చూడు, వీర…్యూ,'' అని బతిమాలాడు. వీర…్యు ముణిగి, కాసేపటికి పైకి వచ్చి, ‘‘బావిలో ఈ మట్టి కడవ తప్ప ఇంకో కడవ లేదు, షావుకారుగారూ. నీటి ప్రభావం వల్ల మీ ఇత్తడి కడవ మట్టి కడవ అయిందేమో! నీళ్ళ ప్రభావం మీకూ తెలుసుగదా,'' అని ఇంటికి వెళ్లి పో…ూడు.
 
అయినా ఆశ తీరక కృష్ణ…్యు డబ్బులిచ్చి ఇద్దరు మనుషులను పెట్టి, బావిలో నీరంతా తోడించాడు. బావిలో కుండ పెంకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ రోజు మంచి నీరులేకుండా చేసినందుకు గ్రామస్థులందరూ కృష్ణ…్యును నానామాటలూ అన్నారు. ఆ రాత్రి రహస్యంగా కృష్ణ…్యు వీర…్యు ఇంటికి వెళ్ళి, తాను మోసం చేశానని ఒప్పుకుని చెంపలు వాయించుకుని, వీర…్యు విగ్రహం వీర…్యుకిచ్చి, తన ఇత్తడికడవ తాను తెచ్చుకున్నాడు.

లాభం-నష్టం


కామేశం మొక్కు తీర్చుకునేందుకు ఒక రోజు రామేశాన్ని తోడు తీసుకుని కాలినడకన చిన్నాపురం బయలుదేరాడు. దారిలో పెద్ద వానపడి ఇద్దరూ బాగా తడిసిపోయూరు. వెంటనే కామేశానికి జలుబు చేసి తుమ్ములు ప్రారంభమయ్యూయి. ‘‘రోజూస్నానం చేశాక రెండు తులసాకులు తిను. జలుబన్నది రాదు. అందుకు నేనే నిదర్శనం,'' అన్నాడు రామేశం. ‘‘తులసాకులు తిన్నా, జలుబురాక తప్పదు, నువ్వూరుకో,'' అన్నాడు కామేశం విసుగ్గా.
 
చిన్నాపురం చేరాక వైద్యుడి వద్దకు వెళ్ళారు. రామేశం ఆయనతో, ‘‘రోజూ తులసాకులు తింటే జలుబు రాదన్నాను. నమ్మడు. జలుబంటూ వస్తే దానికి మందు లేదన్నాను. వినడు. నువ్వు చెబితే వింటాడేమో చూడు,'' అని కామేశం మీద ఫిర్యాదు చేశాడు. వైద్యుడు అతణ్ణి గుర్రుగా చూసి, ‘‘నా దగ్గరికి వచ్చేవాళ్ళలో సగం మంది జలుబు రోగులే. అది రాకుండా ఆపే చిట్కా ఉందనీ, వచ్చినా మందు అక్కరలేదనీ చెప్పడమంటే నేను వృత్తి మానుకుని పోవాలి,'' అంటూ కామేశానికి మూడు రోజులకు సరిపడా మందిచ్చాడు.
 
రామేశాన్ని వైద్యుడు కూడా తప్పు పట్టినందుకు మనసులో నవ్వుకున్న కామేశం ఆరోజుకు మందువేసుకుని, రామేశంతో కలిసి గుడికి బయలుదేరితే ఆయనకు మళ్ళీ మళ్ళీ తుమ్ములొచ్చాయి. ‘‘నేను చెప్పానుకదా. మందులు వేసుకున్నా మూడు రోజులవరకు తగ్గదని. నా మాట విని రోజూ తులసాకులు తినడం ప్రారంభించు,'' అన్నాడు రామేశం.
 
‘‘అబ్బా! తులసాకుల సొద వదలవుకదా!'' అని విసుక్కున్నాడు కామేశం. ఇద్దరూ గుడి మెట్లెక్కుతూంటే అక్కడ ఒకడు ఆగకుండా తుమ్ముతున్నాడు. రామేశం అతనికి తులసాకుల సలహా ఇవ్వడానికి వెళ్ళాడు. అంతలో అక్కడికి వచ్చిన ధనరాజు అనే వ్యక్తి కామేశానికి నమస్కరించి, ‘‘శ్రీనివాసుడి గుడికి వచ్చే భక్తుడి నుంచి ఇరవై వరహాలు దానంగా పుచ్చుకుని వ్యాపారం ప్రారంభిస్తే అచ్చివస్తుందని ఒక సాధువు చెప్పాడు.

తమరు సాయం చేయగలరా?'' అని అడిగాడు. అప్పుడు కామేశానికి అతణ్ణి ఉపయోగించి రామేశాన్ని ఆటపట్టించాలనిపించి, అతనికి రామేశాన్ని చూపించి, ‘‘నువ్వాయన దగ్గరికి ఒకరొక్కరుగా మనుషుల్ని పంపి-జలుబురాకుండా ఏం చేయూలని అడగమను. ఆయన చెప్పింది విని ఎకసక్కెంగా బదులిమ్మను. ఆయన్ను ఎకసక్కెం చేసిన వారెంత మంది ఉంటే అన్ని వరహాలు నీకిస్తాను,'' అన్నాడు.
 
ధనరాజు సరేనని ఆయన చెప్పినట్టు చేశాడు. రామేశం మెట్లెక్కుతూ తనను అడిగిన ఒక్కొక్కరికీ ఓపికగా తులసాకుల సలహా ఇచ్చాడు. బదులుగా, ‘‘మా ఊళ్ళో తులసి మొక్కలు లేవు ఉసిరాకులు తినవచ్చా?'' అన్నాడొకడు. ‘‘నాకు జ్ఞాపకశక్తి తక్కువ. రోజూ మా ఇంటికి వచ్చి గుర్తు చేస్తావా?'' అన్నాడు ఇంకొకడు. అలా ఒక్కొక్కరే రామేశాన్ని వేళాకోళం చేస్తుంటే కామేశానికి చాలా సంతోషం కలిగింది.
 
కొంత సేపయ్యూక ఒకడు ధనరాజు చెయ్యి పట్టుకుని రామేశం దగ్గరికి లాక్కెళ్ళి, ‘‘అయ్యూ, ఇతగాడికి మీరంటే ఎగతాళిగా ఉన్నట్టుంది,'' అంటూ జరిగింది చెప్పి వెళ్ళాడు. రామేశం ధనరాజువంక చూశాడు. అతడు ఏం చెప్పాలో తెలియక కామేశం వంక చూస్తే ఆయన, ‘‘అవును రామేశం, మనమేం చేసినా దానివల్ల కలిగే లాభం-నష్టం బేరీజు వేయూలి. చాదస్తం వల్ల నీకేం లాభం లేదు. నవ్వులపాలు చేస్తుంది. నీకది తెలియూలనే ఈ నాటక మాడించాను,'' అంటూ ధనరాజు కథ చెప్పాడు.
 
‘‘నా స్వానుభవంలోని తులసాకుల వైద్యం వల్ల ఒక్కడు బాగుపడినా నాకది లాభమే. ఆ ప్రయత్నంలో నన్ను చూసి వెయ్యిమంది నవ్వినా, ఎకసక్కెం చేసినా నాక్కలిగే నష్టం ఏమీ లేదు,'' అన్నాడు రామేశం నవ్వుతూ. అప్పుడు ధనరాజు రామేశానికి చేతులు జోడించి, ‘‘మిమ్మల్ని నవ్వులపాలు చేయూలనుకున్న ఆయనగారి డబ్బు నాకు వద్దు, అది నాకు అచ్చిరాదు,'' అన్నాడు.
 
రామేశం అతడికి ఇరవై వరహాలు తీసి ఇచ్చి, ‘‘నువ్వు వ్యాపారం ప్రారంభించు. తులసాకు వైద్యమేకాదు; నువ్వు మంచిదనుకున్న ప్రతి విషయూన్నీ పదిమందికీ తెలియజెయ్యి,'' అన్నాడు. ఆ విధంగా కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.

స్వార్థపరుడి పెత్తనం


సీతమ్మకు తాను ధనవంతురాలినన్న అహం ఎక్కువ. ఆ అహంకారంతోనే ఆమె, వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన ఆడబడుచు కుటుంబాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చింది. ఆడబడుచుది పొరుగూరు. ఆమె భర్త పోయి, ఒక్కగానొక్క కూతురుతో దిగాలు పడుతున్న పరిస్థితిలో కూడా, ఆమెపట్ల కించిత్తూ జాలి చూపించక, తిరిగి తన గ్రామానికి వచ్చేసింది. అయితే, ఆ తర్వాత కొద్ది నెలలకే తల్లి కూడా పోయి దిక్కులేనిదానిలా మిగిలిన ఆడబడుచు కూతురు పదహారేళ్ళ అరుణ బాధ్యత, సీతమ్మకు తప్పనిసరైంది.
 
పోయిన ఆడబడుచుకు జరగవలసిన కర్మకాండ అంతా ముగి…ుగానే, ఆమె తిరిగి తన గ్రామానికి ప్ర…ూణం కట్టింది. ఆ సమ…ుంలో ఊరి పెద్దలిద్దరు ముగ్గురు, ఆమెతో, ‘‘ఇదిగో, సీతమ్మగారూ! నీ మేనకోడలు అరుణను ఒక్కర్తెనూ వదిలేసిపోతావేమో! అంతపని మాత్రం చె…్యుకు. ఎంత లేదన్నా మేనత్తవి. పిల్లను ఇంటి కోడల్ని చేసుకోలేకపోతేపో…ూవు. తీసుకుపోయి దగ్గర ఉంచుకుని, కలో గంజో పొయ్యి,'' అని మొహం మీదే చెప్పడంతో, ఇక చేసేది లేక - పోనీ ఇంటిచాకిరీకైనా పనికొస్తుందిలే అని సరిపెట్టుకుని, అయిష్టంగానే అరుణను తన ఇంటికి తీసుకువచ్చింది.
 
తను ఇంట చేరిన మరునాడే మేనత్త, పనిమనిషిని మానిపించింది. ఆ క్షణం నుంచీ, ఇంటెడు చాకిరీ తన నెత్తిన రుద్దేసరికి అరుణ మనసులో చిన్నబుచ్చుకున్నా, వెంటనే సర్దుకుని ఇంటెడు పనీ చె…్యుడానికి అలవాటు పడింది. ఇంట్లో ఉండేది మొత్తం ఐదుగురు. సీతమ్మ, ఆమె ఒక్కగానొక్క కొడుకు సూర్యంతో పాటు సీతమ్మకు స్వ…ూనా అన్నగారైన పద్మనాభƒం, ఆ…ున ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళల్లో పెద్ద కూతురు మాలతి, సూర్యానికి కాబోేు పెళ్ళామని గ్రామమంతా చెప్పుకుంటారు.

సూర్యం మంచివాడు, తెలివైన వాడిలా కనిపిస్తాడు. ఐతే, ఇంటి వ్యవహారాలేవీ సూర్యం మాట మీద జరగవు. మొత్తం పెత్తనమంతా పద్మనాభానిదే. ఆ…ునే, పొలాల్లో ఎక్కడ, ఎప్పుడు ఏ పంట వె…్యూలి, ఏ ధరకు ఎవరికి అమ్మాలి అన్న విష…ూలన్నీ నిర్ణయిస్తాడు. రైతులూ, వ్యాపారులూ అందరూ ఆ…ునతోనే మాట్లాడుతారు. ఇక ఇంటి అలంకరణ దగ్గర్నించీ, పండగలకు పబ్బాలకు చేసే పిండివంటల వరకూ పెత్తనమంతా మాలతిది. ‘‘మీ మామ…్యు పోయినప్పటినుంచీ, మా అనే్న్యు మాకు అన్నీ చూసి పెడుతున్నాడు.
 
ఇక మాలతి లేకపోతే మాకు ఒక్కపూట కూడా గడవదు,'' అంటూ అరుణ దగ్గర సగర్వంగా మాట్లాడేది సీతమ్మ. ఒకరోజు సూర్యం, పద్మనాభంతో, ‘‘ఈసారి వరి ఎక్కువగా వె…్యువద్దు, మామ…్యూ! మొన్నటి పంటలో వరి దిగుబడే ఎక్కువగా ఉండి, పప్పుధాన్యాలకు కొరతగా ఉందని పట్నం నుంచి వచ్చిన, నా మిత్రుడొకడు చెప్పాడు. అందుచేత పప్పుధాన్యాలు ఎక్కువగా పండిస్తే, మనకు మంచి లాభాలు వస్తాయి!'' అని అనడం, ఆ పక్క వరండాలో కూర్చుని కందులు విసురుతున్న అరుణ చెవిన పడింది.
 
ఆ మరుక్షణం, పద్మనాభం కసురుతున్నట్లుగా, ‘‘అదే బురల్రేని తనం! అందరూ నీలాగే ఆలోచించి పప్పుధాన్యాలే వేస్తే, మనకొచ్చే లాభం సున్నా! అంచేత వరే వేద్దాం,'' అన్నాడు. ‘‘కానీ, ఈ చుట్టుపక్కల చాలా పొలాలు వరికి మాత్రమే అనుకూలమైనవి, మామ…్యూ! మనలా వరి, పప్పుధాన్యాలు రెండూ చక్కగా పండే శ్రేష్ఠమైన భూములు వున్నవాళ్ళు చాలా తక్కువ. అందువల్ల, చాలా మంది వరే వేస్తారు,'' అన్నాడు సూర్యం.
 
‘‘అదిగో, మళ్ళీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. పట్నం నుంచి ఎరువులు కొనుక్కొచ్చి, రాతి నేలలో కూడా బంగారం పండించేస్తున్నారు, మన గ్రామం వాళ్ళు. అంచేత మనం కొరివితో తల గోక్కోకుండా వరే వేద్దాం, సరా!'' అన్నాడు పద్మనాభం. ‘‘అదేం లేదు, మామ…్యూ!'' అంటూ సూర్యం ఏదో చెప్పబోేుంతలో, అక్కడే వున్న సీతమ్మ కల్పించుకుని, ‘‘ఒరే! మామ…్యు పెద్దవాడు. అనుభవంతో చెబు తూంటే, కాదంటూ ఒకటే వాదిస్తావేమిట్రా? అలాగే, అన్న…్యూ, వరే వేద్దాంలే.


వాడు చిన్నవాడు, ఏమీ తెలి…ుని తనం. వాడి మాటలు పెద్దగా పట్టించుకోకు,'' అన్నది. ఆ మాటలు వింటూనే అప్ర…ుత్నంగా సూర్యంకేసి చూసిన అరుణకు, అతడు మొహం చిన్నబుచ్చుకోవటం, పద్మనాభం పెద్దకూతురు మాలతి చిన్నగా నవ్వడం కనిపించాయి. ‘‘ఇప్పటి పరిస్థితుల్లో నాకు విలువ లేదు. కానీ ఇంటి …ుజమాని అయి ఉండీ కూడా బావకు విలువ లేదు. నాకంటే అతడి పరిస్థితి మరీ అన్యా…ుం!'' అనుకుని జాలిపడింది అరుణ.
 
ఆ తర్వాత నెల రోజులకు దేవీ నవరాత్రులు సమీపించాయి. గ్రామపెద్దలు తొమ్మిది రోజులూ తొమ్మిది కార్యక్రమాల్ని, తలొకటీ చొప్పున ఏర్పాటు చె…్యుటం, ఆ గ్రామం ఆనవాయితీ. భోజనాల…్యూక ఇంట్లో అందరూ తీరిగ్గా కూర్చుని వున్న సమ…ుంలో పద్మనాభం, ‘‘ఎప్పుడూ మనకు అలవాటుగా వచ్చి హరికథ చెప్పే భాగవతారుకు, ఒంట్లో బాగాలేదట! రాలేనని కబురు పంపించాడు. మరొక భాగవతారుకు కబురు చేస్తున్నాను,'' అన్నాడు.
 
సూర్యం ఉత్సాహంగా, ‘‘అలా అయితే హరికథ వద్దు, మామ…్యూ! పెద్ద రైతు రామ…్యు ఎటూ హరికథే పెట్టిస్తాడు. నటరాజ నాటక సమితి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళచేత మహిషాసుర మర్దనం నాటకం వేయిద్దాం. గ్రామంలోని వాళ్ళకు కొత్త కాలక్షేపం, మనకు మంచి పేరు!'' అన్నాడు. పద్మనాభం వెంటనే, ‘‘నీకు తెలివిగా ఆలోచించటం ఎప్పటికొస్తుందో, నాకు తెలి…ుడం లేదురా! ఖర్చు మాట అలా ఉంచి, దేవీ నవరాత్రుల్లో నాటకాలూ అవీ ఏమిటని, ఎవరైనా అన్నారంటే, ఉన్న పరువు కూడా పోతుంది,'' అన్నాడు.
 
ఇలా అయినదానికీ కానిదానికీ మేనల్లుడి మీద, పద్మనాభం పెత్తనం చెలాయించటం అరుణకు చాలా కోపం తెప్పించింది. అయితే, ఈ సంఘటన జరిగిన వారం రోజులకు, విచిత్రంగా నటరాజ నాటక సమితికి చెందిన ఒక వ్యక్తి వచ్చి, గ్రామంలోని పెద్దలను కలుసుకుని, తానెవరైనదీ చెప్పి, నవరాత్రులకు మహిషాసుర మర్దనం నాటకం ఇక్కడ ఉచితంగా ప్రదర్శిస్తామని మొక్కుకున్నాం, అందుకు అనుమతించవలసిందిగా కోరాడు.

తమకు కొత్త కాలక్షేపం దొరుకుతుందని సంతోషిస్తూ అందుకు పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తన మాట నెగ్గకపోయినా, తన కోరిక నెరవేరుతున్నందుకు, సూర్యం చాలా సంతోషించాడు. పాడ్యమినాడు ప్రదర్శింపబడిన, ఆ నాటకం, చిన్నాపెద్దా తేడా లేకుండా, గ్రామస్థులందర్నీ విశేషంగా ఆకట్టుకున్నది. తమకు లభించిన ఆ అశేష ఆదరణకు, నాటక సమితి అధ్యక్షుడు పరమానందభరితుడై వేదిక మీద నిలబడి, ‘‘మా నాటకం మీ అందరికీ నచ్చినందుకు చాలా కృతజ్ఞులం.
 
మేము మొక్కుకోవడం, ఉచిత ప్రదర్శనా - అదంతా నిజం కాదు. ఇందుకు బాలాత్రిపుర సుందరీదేవితో పాటు మీరూ మమ్మల్ని క్షమించాలి. నాలుగు రోజుల క్రితం ఒక …ుువకుడు, మా దగ్గరకు వచ్చి, ఇక్కడ నాటకం ప్రదర్శించేందుకు మేమడిగిన డబ్బు ఇచ్చాడు. కానీ, కారణం తెలి…ుదు, తన పేరు గుప్తంగా ఉంచమని చెప్పాడు. అయినప్పటికీ, మా ప్రదర్శనకు మీరిచ్చిన ప్రశంసల్లో ఆ…ునది ముఖ్య భాగం.
 
అందుకని ఆ…ున పేరు చెప్పక తప్పదు; సూర్యంగారు,'' అంటూ ముగించాడు. ఊహించని విధంగా, నాటక సమితి అధ్యక్షుడు తన పేరు చెప్పడంతో సూర్యం తెల్లబోయి, ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ, ఇంటికి బ…ులుదేరబోతుండగా, గ్రామస్థులంతా అతణ్ణి చుట్టుముట్టి, ‘‘సూర్యం, ఏమో అనుకున్నాంగానీ, నువ్వు మహా గట్టివాడివ…్యూ! 

ఇంత కాలంగా నువ్వు మేనమామ చాటు బిడ్డవనుకుంటున్నాం. కానీ, నువ్వు మంచి వ్యవహారకర్తవు!'' అంటూ ప్రశంసించారు. ఆ మర్నాడు అరుణ, సూర్యాన్ని ఒంటరిగా కలుసుకుని, ‘‘ఈ జరిగినదానికి నువ్వు చాలా ఆశ్చర్యపడి ఉంటావు బావా, అవునా? నేను తెర వెనక ఉండి, ఈ కథంతా నడిపినందుకు ఏమీ అనుకోకు. మా గ్రామాధికారి, మాకు చాలా దగ్గరి చుట్టం. మా అమ్మ పోతూ, నాకోసం ఒక చిన్న మొత్తం ఆ…ున దగ్గర ఉంచింది. మన పాలికాపు నారా…ుణకు సంగతి సందర్భాలన్నీ చెప్పి, ఆ…ునకు కబురు పంపాను.
 
ఆ…ున, ఈ పనికి నేనే నా డబ్బు ఖర్చు పెట్టగలను. అరుణ నాకు పరాయిదేం కాదు! అని, నారా…ుణకు చెప్పి, ఈ ఏర్పాటంతా చేశాడు. సూర్యం పేరుతో నాటకాలవాళ్ళ వద్దకు వెళ్లినవాడు, ఆ…ున కడగొట్టు కొడుకు! నీ అంతట నువ్వుగా, నీ మేనమామ పద్మనాభానికి ఎదురు తిరిగే పరిస్థితి లేదనిపించి, నేను స్వతంత్రించాను. ఇప్పటికైనా కాస్త చురుకుదనంతో నువ్వు స్వ…ుం నిర్ణ…ూలు తీసుకుంటూ, ఆ స్వార్థపరుడి పెత్తనం నుంచి బ…ుట పడటం గురించి ఆలోచించు,'' అని చెప్పింది.
 
అరుణ మాటలకు సూర్యం నవ్వుతూ, ‘‘అరుణా! ఈ దేవీ నవరాత్రుల్లో చేసింది, మరొక తరహా మహిషాసుర మర్దనం. నువ్వు నన్ను విముక్తుణ్ణి చేశావు. ఈ క్షణం నుంచీ ఇల్లూ, పొలాల విష…ుంలో ప్రతి నిర్ణ…ుం నాదే! దానితో పాటు మరొక ముఖ్య నిర్ణ…ుం కూడా తీసుకున్నాను,'' అన్నాడు. ‘‘ఏమిటా ముఖ్య నిర్ణ…ుం, బావా!'' అంటూ అరుణ ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది.
 
‘‘మరేం లేదు, నిన్ను జీవితాంతం, నా మంత్రిగా ని…ుమించుకుని, నీ సలహా సంప్రదింపులతో జీవించాలన్నది!'' అన్నాడు సూర్యం. మంచి భార్య, భర్తకు సలహాలివ్వడంలో మంత్రిలా నడుచుకుంటుందన్న పెద్దల మాటలు తెలిసిన అరుణ, అతడి మాటల్లోని అంతరార్థం గ్రహించి, చిరునవƒ్వుతో తల వంచుకున్నది.