Pages

Friday, September 14, 2012

కొంగముక్కు రాజు


నూరేళ్ళ క్రితం వరకు ఉత్తర పోలండ్‌ ప్రజలు రకరకాల చెట్లతో నిండిన ఒక చిన్న లో…ుకేసి చూపెడుతూ, ‘‘ఇక్కడే ఒకానొకప్పుడు అద్భుత శక్తులు కలిగిన వ్లాడిమీర్‌ ఆపిల్‌ చెట్టు ఉండేదట! అది ఇప్పుడు కూడా ఉంటే ఎంత బావుండేది!'' అని చెప్పుకునేవారు. ఈనాడు అక్కడొక పట్టణం ఏర్పడడంతో ఆ పచ్చటి లో…ుకూడా కనుమరుగై పోయింది.
 
అయినా - వ్లాడిమీర్‌, అతడి వింత చెట్టును గురించిన విచిత్రమైన కథ మాత్రం ఆ దేశపు పూర్వగాథలలో చిరస్థాయిగా నిలిచిపోయింది: ఉత్తర పోలండ్‌కు చెందిన ఒక మహిళకు కొంత కాలం సంతానం లేకపోయింది. ఆమె దేవాల…ూనికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థించినప్పుడు ఒక వింత వాణి వినిపించిన అనుభూతికి లోనయింది.
 
ఆమెకు అసాధారణమైన కొడుకు పుడతాడనీ; వాడు ధనవంతుడో, నిత్య సంతోషిగానో అవుతాడనీ; ఆ రెండింటిలో ఏది కావాలో కోరుకోమనీ వింతవాణి ఆదేశించింది. సంతోషం కలిగించే వివిధ వస్తువులలో, విష…ూలలో ధనం ఒకటి మాత్రమే అవుతుంది. అది లేకుండానే సంతోషంగా ఉండగలిగినప్పుడు ఇక ధనం ఎందుకు? దాని వెంట వచ్చే బాదర బందీ ఎందుకు? అని ఆలోచించిన ఆమె తనకు నిత్యసంతోషి అయిన కొడుకే కావాలని కోరుకున్నది.
 
ఆమెకు కొన్నాళ్ళకు పండంటి కొడుకు పుట్టాడు. వ్లాడిమీర్‌ అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగింది. ఆమె పేదరాలు కావడంతో బిడ్డను, దూరంగా ఉన్న బడికి పంపలేక పోయింది. కొన్నాళ్ళకు అతన్ని బూట్లు కుటే్ట పని నేర్చుకోమని ఒక పెద్ద చర్మకారుడి వద్దకు పంపింది. వ్లాడిమీర్‌ కొన్నాళ్ళు చర్మకారుడి ఇంటి వద్దే ఉన్నాడు గాని, ఒకనాడు తన ఇంటికి తిరిగివచ్చి, ‘‘అమ్మా, బూట్లు కావాలని వచ్చే వారందరూ ధనికులే.

పేదలకు బూట్లు కొనుక్కునే శక్తిలేదు. ధనికులకు మాత్రమే పనికివచ్చే వృత్తి నాకు ఇష్టం లేదు,'' అని చెప్పాడు. తల్లి సరేనని తల ఊపి, అతన్ని కుట్టుపని నేర్చుకోమని ఒక దర్జీ వద్దకు పంపింది. వ్లాడిమీర్‌ అక్కడ పని నేర్చుకోసాగాడుగాని, కొన్నాళ్ళకే అక్కడి నుంచీ తిరిగి వచ్చి, ధనికులు మాత్రమే కుట్టించుకున్న బట్టలు తొడుక్కుంటున్నారు; అలాంటివారికి సేవలు చే…ుడం తనకు ఇష్టం లేదని తల్లికి చెప్పాడు.
 
ఆ తరవాత తల్లి అతన్ని ఖడ్గాలు త…ూరు చేసే నిపుణుడి వద్దకు పంపింది. ఆ రోజుల్లో తరచూ …ుుద్ధాలు జరిగేవి గనక, ఖడ్గాలకు మంచి గిరాకీ ఉండేది. అయితే, వ్లాడిమీర్‌ అక్కడ కూడా ఒక వారం రోజులకు మించి ఉండలేక పో…ూడు. ‘‘అమ్మా, మనుషులను చంపే ఆ…ుుధాలను నేను త…ూరు చే…ూలా?'' అన్నాడు బాధగా. ‘‘వద్దు నా…ునా.
 
అయినా, నీకు నచ్చిన జీవనోపాధిని చూపలేక పోతున్నాను. అదే నాకు బాధగా వుంది,'' అని కొంతసేపు ఆలోచించిన తల్లి, ‘‘గ్రామంలోని ఇతర పిల్లల్లాగే నువ్వూ, పశువులను దాపులనున్న మైదానాలలోకి తోలుకు వెళ్ళి మేపుకుని, రా,'' అన్నది. వ్లాడిమీర్‌ తల్లి సలహాను పాటించాడు. పశుల కాపరులతో కలిసి మెలిసి ఆడుతూ, పాడుతూ పచ్చటి పొలాలగుండా తిరుగుతూ, పశువులను కాపలాకా…ుడం అతనికి ఎంతో ఆనందం కలిగించింది.
 
ఒకరోజు మిట్టమధ్యాహ్న సమ…ుం. ఎత్తయిన ఒక బండ చుట్టూ నిప్పంటు కోవడం వ్లాడిమీర్‌ గమనించాడు. ఆ బండ మీద ఉన్న ఒక తొండ, నిప్పుల నుంచి బ…ుట పడడానికి ప్ర…ుత్నిస్తున్నదిగాని, సాధ్యపడలేదు. వ్లాడిమీర్‌ తన వద్ద వున్న పొడవాటి కరన్రు ఉపెూగించి తొండను అగ్నిజ్వాలల నుంచి కాపాడాడు. మరుక్షణమే ఆ తొండ ఒక వృద్ధురాలిగా మారి, ‘‘నా…ునా, నీ ఉపకారగుణం మెచ్చ తగింది.
 
ఇదిగో ఈ మొక్కను తీసుకుపోయి, నీ పెరట్లో నాటు. ఈ చెట్టు నుంచి కాచే ఆపిల్‌ పళ్ళకు వ్యాధులను న…ుం చేసే అద్భుత శక్తి ఉంటుంది,'' అంటూ ఒక మొక్కను ఇచ్చి, తొండగా మారి పొదలోకి వెళ్ళిపోయింది. వ్లాడిమీర్‌ ఆ మొక్కను తెచ్చి, తన ఇంటి కిటికీ పక్కన తోటలో నాటాడు. రెండు నెలల కల్లా అది ఏపుగా పెరిగి ఫలాలివ్వడం ప్రారంభించింది. వ్లాడిమీర్‌ మొట్టమొదటి పండును కోసి జ్వరంతో బాధపడుకున్న తన తల్లికి ఇచ్చాడు. వెంటనే ఆమె జ్వరం తగ్గి పోయింది.

ఆ తరవాత వివిధ వ్యాధులతో బాధపడుతున్న మరికొందరికి వ్లాడిమీర్‌ తన ఆపిల్‌ పళ్ళను ఇచ్చాడు. వాళ్ళ వ్యాధులన్నీ న…ుమై పో…ూయి. ఈ సంగతి కొన్నాళ్ళకు ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు తెలి…ువచ్చింది. ‘‘మనం వ్లాడిమీర్‌ను మన ఆస్థాన ఉద్యోగిగా ని…ుమిద్దాం,'' అన్నాడు రాజు. ‘‘అవసరం లేదు, ప్రభూ! వ్లాడిమీర్‌ చెట్టును తెచ్చి, మన ఉద్యానంలో నాటితే సరిపోతుంది,'' అన్నాడు ఆస్థాన వైద్యుడు.
 
‘‘అవునవును,'' అంటూ వైద్యుడి మాటకు వంత పలికాడు అతని బావమరది అయిన మంత్రి. రాజు వెంటనే ఆజ్ఞలను జారీ చేశాడు. సైనికులు వెళ్ళి, వ్లాడిమీర్‌తో ఒక మాటయినా చెప్పకుండా, అతని తోటలోని వింత చెట్టును పెకలించుకుని వచ్చి రాజోద్యానంలో నాటారు. అయితే, ఆ తరవాత ఆ చెట్టు ఒక్క కా…ుకూడా కా…ులేదు. అందరూ ఆశాభంగానికి లోన…్యూరు. రాజవైద్యుడికీ, మంత్రికీ నోట మాటరాలేదు.
 
దీనికి సరైన పరిష్కారం చూడమని రాజు వారిని ఆగ్రహంతో హెచ్చరించాడు. రాజు కొన్నాళ్ళుగా తీరని జలుబుతో బాధ పడుతూ రాజవైద్యుడు ఎన్నిరకాల మందులిచ్చినా అది తగ్గక పోేుసరికి వింత చెట్టు నుంచి కాచే ఆపిల్‌ పండు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమ…ుంలో అక్కడ వ్లాడిమీర్‌, తన వద్దకు వచ్చే వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సా…ుం చే…ులేక పోవడంతో తీరని విచారానికి లోన…్యూడు.
 
మైదానంలోకి వెళ్ళి, ఆనాడు తొండకనిపించిన బండ సమీపంలోని చెట్టు కింద కూర్చున్నాడు. ‘‘ద…ూస్వభావం గల తల్లీ, ఒకసారి కనిపించవూ,'' అని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. ఉన్నట్టుండి చిన్న సుడిగాలి రావడంతో అతని ముందున్న ఎండుటాకులు గిర్రున గుండ్రంగా తిరగసాగాయి. మరుక్షణమే అక్కడ వృద్ధస్ర్తీ కనిపించింది. వ్లాడిమీర్‌ ఆమెకు రాజూ, అతని మనుషులూ చేసిన దురాగతాన్ని వినిపించాడు.
 
ఆ వృద్ధస్ర్తీ, అతనికి ఒక బుట్టనిండా ఆపిల్‌ పళ్ళను ఇచ్చి, ‘‘వీటిని తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళి విక్రయించు. ఆ తరవాత జరిగే తమాషా చూడు,'' అని చెప్పి, తొండగా మారి, సుడిగాలి వీస్తూండగా పొదలకేసి తిరిగి వెళ్ళిపోయింది. వ్లాడిమీర్‌ పళ్ళ బుట్టను తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళాడు, ‘‘పళ్ళో పళ్ళు. ఈ పళ్ళు తింటే అనుకోని అద్భుతాలు జరుగుతాయి,'' అని అమ్మసాగాడు.

రాజభటులు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళారు. రాజు అతన్ని చూసి, ‘‘ఈ పళ్ళు, నా జలుబును పోగొట్టగలవా?'' అని అడిగాడు. ‘‘పోగొట్టవచ్చు. ఇంకా మరేదైనా కూడా చే…ువచ్చు,'' అన్నాడు వ్లాడిమీర్‌. రాజు, మరికొందరు రాజోద్యోగులు తలా ఒక పండు తీసుకుని తిన్నారు. చాలా బావుందన్నారు.
 
అయితే, మరుక్షణమే వారి ముక్కులు పొడవుగా కొంగ ముక్కుల్లా పెరిగి పో…ూయి. ‘‘ఏమిటిది?'' అని అరిచాడు కీచుకంఠంతో రాజు హడలిపోతూ. ‘‘ప్రభూ! తమరి జలుబు పోయిందా, లేదా మొదట ఆ సంగతి సెలవివ్వండి,'' అన్నాడు వ్లాడిమీర్‌ నిర్భ…ుంగా. ‘‘జలుబు ఉందాలేదా అన్న విష…ుం కూడా తెలుసుకోలేనంత పెద్ద ముక్కు త…ూరయింది,'' అన్నాడు రాజు బాధగా. ‘‘ఏమిటిది? ఏమిటిది?''
 
అన్న హాహాకారాలు బ…ులుదేరాయి. పళ్ళను తిన్న సభా సదులందరికీ పెద్ద పెద్ద కొంగముక్కులు వచ్చేశాయి. ‘‘ప్రభూ, గౌరవనీ…ుులైన తమరూ, తమ ఉద్యోగులూ పెద్ద పెద్ద ముక్కులతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు,'' అన్నాడు వ్లాడిమీర్‌. ‘‘అంత ప్రత్యేకంగా కనిపించడం మాకిష్టంలేదు. మా పాత మామూలు ముక్కులు ఉంటేచాలు.
 
వాటిని మళ్ళీ ఎలా పొందగలం?'' అని అడిగాడు రాజు అసహనంగా. ‘‘బహుశా, నా తోటలో నుంచి తమరు దొంగిలించిన చెట్టు పళ్ళను తినడం ద్వారానే అది సాధ్యం కావచ్చు. దానిని తీసుకుపోయి …ుథాస్థానంలో నాటితేనే అది మళ్ళీ పళ్ళ నివ్వగలదు. అంత వరకు గొప్పవారైన తమరు గొప్ప ముక్కులతోనే తిరగక తప్పదు,'' అన్నాడు వ్లాడిమీర్‌ సాలోచనగా. ఆ చెట్టును పెకలించి వ్లాడిమీర్‌ తోటలో నాటడానికి రాజు క్షణాల్లో ఏర్పాటు చేశాడు.
 
ఆ చెట్టు మళ్ళీ ఫలాలివ్వడానికి ఒక వారం రోజులు పట్టింది. వ్లాడిమీర్‌ బుట్టనిండా ఆపిల్‌ పళ్ళతో వచ్చి, వారికి ఇచ్చాడు. వాటిని తినగానే వారికి మామూలు ముక్కులు వచ్చాయి. పెద్దగండం నుంచి గటె్టక్కినట్టు అందరూ పరమానందం చెందారు. రాజు వ్లాడిమీర్‌కు తన ఆస్థానంలో ఉన్నత పదవినిచ్చాడు. అయినా, వ్లాడిమీర్‌ జీతం పుచ్చుకునేవాడు కాదు. అవసరమని వచ్చిన వారికి అద్భుతశక్తిగల ఆపిల్‌ పళ్ళను ఇస్తూ సంతోషంగా చిరకాలం జీవించాడు. అతడు కాలధర్మం చెందడంతో, ఆ చెట్టు కా…ుడం ఆగిపోయింది.

No comments:

Post a Comment