Pages

Friday, September 14, 2012

ధైర్యే సాహసే లక్ష్మీ!


పల్లలందరూ రాత్రి భోజనాలు చేసి, ‘‘కథ చెప్పు, బామ్మా!'' అంటూ సావిత్రమ్మ బామ్మ చుట్టూ చేరారు. బామ్మ కథ ప్రారంభించబోేుంతలో, నాగబాబు అనేవాడు, సూర్యం అనేవాడి కేసి చేయి చూపుతూ, ‘‘బామ్మా! వీడు మధ్యలోనే బడినుంచి పారిపో…ూడు. ఎందుకో తెలుసా? కొత్తగా కొనుక్కున్న కలాన్ని ఎవరో దొంగిలించారని సుందరం, పంతులుగారికి చెప్పాడు. ఆ…ున పిల్లలందరి సంచులనూ తణిఖీ చే…ుమన్నాడు.
 
వీడు తన సంచీలో చేయిపెట్టి చూసి, చేతికేదో గట్టిగా తగలడంతో, వణుకుతూ అటూ ఇటూ చూసి బ…ుటికి పరిగెత్తాడు. ఇంతకీ, ఆ కలాన్ని దొంగిలించి తన సంచీలో దాచినవాడు, గోపీ!'' అని చెప్పాడు. ‘‘ఔరా!'' అంటూ బామ్మ, సూర్యంకేసి నవ్వుతూ చూసి, ‘‘ఒరే, సూర్యం! నువ్వు కలాన్ని దొంగిలించలేదు. అయినా, ఎందుకు పారిపో…ూవు?'' అని అడిగింది. ఆ ప్రశ్నకు సూర్యం, ‘‘దొంగనంటారేమో అని భ…ుం వేసింది, బామ్మా!'' అన్నాడు.
 
‘‘అలాగా! ధైర్యే సాహసే లక్ష్మీ, అన్నార్రా బుద్ధివంతులు. దాన్ని గురించి చెబుతాను, వినండి!'' అంటూ కథ ప్రారంభించింది: పూర్వం ఒకానొక గురుకులంలో శ్రీధరుడు, విమలుడు అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. వాళ్ళిద్దరూ తెలివిగలవాళ్ళేగాక, విన…ుశీలురు కూడా కావటంతో, గురువు వారిని ఎంతో అభిమానిస్తూండేవాడు. విద్యాభ్యాసం పూర్తయి, వాళ్ళు గురుకులం వదిలి వెళ్ళే సమ…ుం వచ్చింది.
 
అప్పుడు గురువు వాళ్ళతో, ‘‘నా…ునలారా! పూర్వం ఒకానొక గొప్ప మహారాజుకు చెప్పరాని దుర్దశవాటిల్లిందట. అష్టలక్ష్ములూ ఒకటొకటిగా ఆ…ున్ను విడిచి వెళ్ళసాగాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజ…ులక్ష్మి ... ఇలా ఏడుగురు దేవతలూ తన గడపదాటినా, ఆ…ున కించిత్తూ చలించలేదు. కాని, ఆఖ రుగా ధైర్యలక్ష్మి తనను వదిలి వెళ్ళబోేు సరికి మాత్రం దిగులు పడుతూ, ‘అమ్మా, మిగతా లక్ష్ములు పెడదిరిగినా ఫరవాలేదు.

నువ్వొక్కర్తివీ వుంటే చాలు!' అని ప్రార్థించాడట. రాజు ఇలా కోరగానే, ధైర్యలక్ష్మి జాలితో కరిగిపోయి, ‘అలాగే నా…ునా! నేను సదా నీతోనే వుంటాను!' అని వరమిచ్చిందట. ధైర్యలక్ష్మి అండతో ఆ…ున కొన్నాళ్ళకు మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాడట. అందుకే పెద్దలు, ‘ధైర్యే సాహసే లక్ష్మీ' అన్నారు. మనిషిని ఆపద నుండి గటె్టక్కించేది ధైర్యమే! కాబట్టి మీరు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా బతుకుతూ గొప్పవాళ్ళుకండి!'' అంటూ ఆశీర్వదించాడు.
 
శిష్యులిద్దరూ గురువుకు నమస్కరించి, గురుకులం నుంచి బ…ులుదేరి రాజధాని దిశగా ప్ర…ూణం కట్టారు. వారు రాజధాని పొలిమేర చేరేసరికి పొద్దువాటారింది. మరి కొంత దూరం వెళ్ళే సరికల్లా బాట పక్కన ఒక సత్రం కనిపించింది. ఇద్దరూ ఆ సత్రంలోకి వెళ్ళారు. సత్రం …ుజమాని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ, వారి దగ్గర చెరొకరూక తీసుకుని భోజనానికీ, పడకకూ ఏర్పాట్లు చేశాడు.
 
దాదాపు అర్ధరాత్రి కావస్తూండగా, సత్రంలో రేగిన పెద్ద కలకలంతో, మిత్రులిద్దరికీ నిద్రాభంగమైంది. శ్రీధరుడు లేచి కూర్చుని, ‘‘ఏమిటీ కలకలం? ఏం జరిగింది!'' అంటూ తన పక్కనున్న వ్యక్తిని ప్రశ్నించాడు. ‘‘రాజుగారి అంతఃపురంలో పడిన దొంగలు ఇటే వచ్చారట. రాజభటులు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చారు. అందర్నీ సోదా చేస్తున్నారు!'' అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. ‘‘ఓహో, అదా సంగతి!'' అని శ్రీధరుడు, విమలుడు నిశ్చింతగా కూర్చున్నారు.
 
కొద్ది సేపటికి రాజభటులు వచ్చి, వారి వివరాలు అడిగి, వెంటవున్న సంచులు చూపించమన్నారు. రాజభటులు సంచులు వెతకగా, శ్రీధరుడి సంచిలోంచి నవరత్న ఖచితమైన కంఠహారాలు రెండు బ…ుట పడినై. ఇది చూసి ఇద్దరూ అమితాశ్చర్యం చెందారు. భటులు, ‘‘ఇవి రాణిగారి హారాలు!'' అంటూ మిత్రులిద్దర్నీ ఒడిసి పట్టుకుని, ‘‘చెప్పండి, మీ ముఠాలోని మిగతా దొంగలెక్కడ?'' అంటూ గద్దించారు. దాంతో ఇద్దరికీ ముచ్చెమటలు పోశాయి. ముందుగా తేరుకున్న శ్రీధరుడు, ‘‘మేం దొంగలం కాదు.

నేను ఆద మరిచి నిద్రపోతూండగా, ఎవరో ఈ నగల్ని నా సంచీలో పెట్టివుండాలి!'' అన్నాడు. అయితే, రాజభటులు మాత్రం శ్రీధరుడి మాటలు వినిపించుకోకుండా, చేతుల్లోనిదండాలతో మిత్రులిద్దర్నీ చెరోదెబ్బా వేశారు. ఆ వెంటనే విమలుడు ఒక ఊపున భటుడి చేతిని విదిలించి మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపో…ూడు. దాంతో రాజభటులు, శ్రీధరుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్ళి రాజు ఎదుట హాజరుపరిచారు.
 
రాజు …ుశ్వంతసింహుడు చాలా వివేకి. అతడు, శ్రీధరుడు చెప్పినదంతా శాంతంగా విని, ‘‘మీరు నిజంగా నిర్దోషులే అయిన పక్షంలో, నీ మిత్రుడికి పారిపోవలసిన అగత్యం ఎందుకొచ్చింది?'' అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా శ్రీధరుడు, తాము గురుకులం నుంచి బ…ులుదేరే ముందు, గురూపదేశం గురించి వివరంగా చెప్పి, ‘‘మహారాజా! తనకు శిక్ష తప్పదన్న పిరికితనమే, నా మిత్రుడు విమలుణ్ణి పారిపోవడానికి పురిగొల్పింది తప్పితే మరేమీ కాదు,'' అంటూ ఒకక్షణం ఆగి, ‘‘భగవత్సాక్షగా మేం నిర్దోషులం, ప్రభూ! నన్ను విడిచిపెట్టినట్లయితే, నేను మీకు అసలు దొంగలను పట్టిస్తాను.
 
కావలిస్తే నాతోబాటు ఎవరినైనా పంపండి!'' అన్నాడు. రాజు, శ్రీధరుడి మాటలకు మెచ్చు కోలుగా తలపంకిస్తూ, ‘‘సరే! సా…ుంత్రం దాకా నువ్విక్కడేవుండు. మా మనిషి నీతో వస్తాడు,'' అని చెప్పాడు. సా…ుంత్రం కావస్తూండగా, శేఖరుడనే వ్యక్తి వచ్చి, శ్రీధరుణ్ణి కలుసుకున్నాడు. శ్రీధరుడు అతడితో మాట్లాడుతూ, ‘‘మేం దిగిన సత్రం …ుజమాని మీద, నాకు అనుమానంగా వుంది.
 
అతడు దొంగలకు ఆశ్ర…ుమిస్తూ, వాళ్ళ దగ్గర నుంచి వాటా తీసుకుంటున్నాడేమో అన్నది, నా శంక. మనం ఇలా చేద్దాం!'' అంటూ తన పథకం వివరించాడు. ఆ తర్వాత వాళ్ళు విపణి వీధికి వెళ్ళి, కొన్ని వస్తువులు కొన్నారు. వాటితో మరునాటి ఉద…ూనే అదే సత్రానికి వెళ్ళి బస చేశారు. శ్రీధరుడు మారువేషంలో వుండటం వల్ల, సత్రం …ుజమానికి ఎలాంటి అనుమానం కలగలేదు. వాళ్ళిద్దరు తమ సంచుల్లోంచి కొన్ని నకిలీ నగలు తీసి వ్యాపారుల్లా మాట్లాడుకోవడం సాగించారు.

ఆ రాత్రి భోజనాల…్యూక శ్రీధరుడు, శేఖరుడు పడుకుని నిద్రనటించటం ప్రారంభించారు. దాదాపు అర్ధరాత్రి కావస్తూండగా ఎవరో కొత్తవాళ్ళు వచ్చిన అలికిడీ, సత్రం …ుజమాని వాళ్ళతో లోగొంతుకలో మాట్లాడుతున్న సవ్వడీ, వారికి తెలిశాయి. వచ్చిన వాళ్ళు దొంగలేననీ, సత్రం …ుజమాని తమ గురించే చెబుతున్నాడనీ ఇద్దరూ గ్రహించారు.
 
తర్వాత మామూలుగా నిద్రపోయి, తెల్లవారి లేచి ప్ర…ూణమ…్యూరు. సత్రం రాజధాని పొలిమేరల్లో వుండటం వల్ల, అక్కడి నుంచి కొంత దూరం వరకూ నిర్జనంగావుంటుంది. శ్రీధరుడు, శేఖరుడు ఆదారిలో కొంత దూరం వెళ్ళేసరికి ముగ్గురు దొంగలు హఠాత్తుగా వాళ్ళ మీద దాడి చేసి, ఇద్దర్నీ బాట పక్కనున్న చెట్లవెనక్కులాక్కు పోవాలని ప్ర…ుత్నించారు.
 
అయితే, ఇలా జరగవచ్చని ముందే ఊహించి, అందుకు సిద్ధంగావున్న శ్రీధరుడు, శేఖరుడు తమ గుప్పెట్లలోవున్న కారపు పొట్లాలను మెరుపుల్లా విప్పి, దొంగల ముఖాల మీదికి విసిరారు. మరుక్షణం, ఆ ప్రాంతమంతా దొంగల హాహాకారాలతో నిండి పోయింది. వెంటనే శ్రీధరుడు తన సంచిలోంచి తాళ్ళు తీసి, శేఖరుడి సహా…ుంతో దొంగలను బంధించాడు. ఆ తరవాత సత్రం …ుజమానిని కూడా బంధించి రాజు సమక్షంలో హాజరు పరచి, కఠిన శిక్ష విధించేలా చేశాడు.
 
అంత వరకూ కథ చెప్పిన బామ్మ నవ్వుతూ, ‘‘ఒరే, పిల్లల్లారా! ధైర్యంగావున్న శ్రీధరుడు ఎంతటి ఘనవిజ…ూన్ని సాధించాడో చూశారుగదా? శ్రీధరుడి వెంట వచ్చిన శేఖరుడు ఎవరో కాదు; సాక్షాత్తూ …ుువరాజే! ఆ తర్వాత శేఖరుడు, తండ్రి దగ్గర శ్రీధరుడి తెలివినీ, ధైర్యాన్నీ ఎంతగానో ప్రశంసించి, అతణ్ణి తన ఆంతరంగిక సలహాదారుగా ని…ుమింప జేశాడు.
 
పారిపోయిన విమలుణ్ణి కూడా వెదికి పట్టుకుని రాజు కొలువులో ప్రవేశ పెట్టారు. అదీ కథ! అంచేత, ఇక నుంచి మీరు కూడా అనుక్షణం గుర్తుంచుకోవలసింది ఏమిటో చెప్పండి? '' అని అడిగింది. పిల్లలు ఆనందంగా చప్పుట్లు కొడుతూ, ఏకకంఠంగా, ‘‘ధైర్యే సాహసే లక్ష్మీ!'' అన్నారు.


No comments:

Post a Comment