పిల్లలందరూ …ుథాప్రకారం రాత్రి భోజనాలు పెందలాడే ముగించి, ‘‘కథ
చెప్పు, బామ్మా!'' అంటూ సావిత్రమ్మ బామ్మ చుట్టూ చేరారు. అప్పుడు రఘు
అనేవాడు, ‘‘బామ్మా! మా మామ…్యు నాన్నతో మాట్లాడుతూ, ‘చెరపకురా చెడేవు,
అంటారే, అలాంటి ప్రా…ుశ్చిత్తమే చలపతికి జరిగింది' - అంటూ ఏమిటేమిటో
చెప్పాడు. చెరపకురా చెడేవు అంటే ఏమిటి, బామ్మా!'' అని అడిగాడు. బామ్మ, రఘు
కేసి ఆప్యా…ుంగా చూస్తూ, ‘‘ఒరే, నువ్వింత చిన్న వ…ుసుకే, అలాంటి మాటలు
జ్ఞాపకం పెట్టుకోవడం మెచ్చుకోదగిందేరా.
చెరపకురా చెడేవు అన్న కథే చెబుతాను,'' అంటూ ప్రారంభించింది: పూర్వం
మంగిపూడిలో కేశవ…్యు అనే రైతువుండేవాడు. భార్యా, నలుగురు పిల్లలూ, తల్లీ,
తండ్రీ - ఇదీ కేశవ…్యు సంసారం. కేశవ…్యు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా
సంసారం కోసం శ్రమించేవారేకావడం చేత, బ్రతుకులు సజావుగా సాగిపో సాగాయి.
కేశవ…్యు ఎదురిల్లు వరద…్యుది.
అతడికి ఒద్దికగా సాగిపోేు కేశవ…్యు సంసారాన్ని చూస్తే, ఎప్పుడూ
దుఃఖమే. వరద…్యు పెద్ద కూతురు సీత, కేశవ…్యు పెద్ద కూతురు లక్ష్మి, ఒకే
ఈడువాళ్ళు. కాలం గడిచి లక్ష్మి, సీత పెళ్ళీడు కొచ్చారు. ఇలా వుండగా, ఒకనాటి
ఉద…ూన్నే కేశవ…్యు ఇంటి ముందు ఖరీదైన గురప్రు బగ్గీ ఆగింది. అందులోంచి
కేశవ…్యు దూరపు బంధువయిన మాధవ…్యు, భార్యా పిల్లలతో సహా దిగాడు.
మాధవ…్యు ఆరేడేళ్ళ కిందట ఒకసారి ఎందుకో సకుటుంబంగా వచ్చి కేశవ…్యు
ఇంట్లో రెండు రోజులు వున్నాడట! ఆ రెండు రోజుల్లోనూ కేశవ…్యు కుటుంబీకుల
బ్రతుకు తీరు ఆ…ున్ను చాలా ఆకర్షించింది. ముఖ్యంగా, చలాకీగా తిరుగుతూ అన్ని
పనులూ చాకచక్యంగా చేస్తున్న లక్ష్మి, ఆ…ునకూ, ఆ…ున భార్యకూ కూడా చాలా
నచ్చింది.
లక్ష్మిని తమ ఇంటి కోడల్ని చేసుకోవాలని వాళ్ళు ఆనాడే అనుకున్నారట!
ఇప్పుడు వచ్చింది ఆ పనిమీదే! కానీ కట్నం లేకుండా లక్ష్మి లక్షాధికారుల ఇంటి
కోడలవబోతున్నదని వినేసరికి, ఎదురింటి వరద…్యు కళ్ళు భగ్గున మండాయి. వెంటనే
ఏం చె…్యూలో నిశ్చయించుకున్న వరద…్యు, నవ్వుతూ వెళ్ళి మాధవ…్యును
పలకరించి, ఆ…ునను తన ఇంటికి తీసుకు వచ్చాడు.
ఆ…ునతో ఎంతో అభిమానం నటిస్తూ వరద…్యు, ‘‘మాధవ…్యుగారూ! గిట్టక
చెబుతున్నా ననుకోకండి. లక్ష్మి చురుకుదనమంతా మేడి పండుచందం! ఆ పిల్లకు
మూర్చరోగం వున్నది. పిల్లరోగాన్ని కప్పిపుచ్చి పెళ్ళి చేసే…ూలన్నది వాళ్ళ
ఆలోచన. పెళ్ళయితే రోగం తగ్గవచ్చునని వైద్యుడు చెప్పాడట!'' అన్నాడు. ఈ మాటలు
మాధవ…్యు మౌనంగా విని, గంభీరంగా తలపంకించి లేచి వెళ్ళిపో…ూడు. ఆ తర్వాత
సా…ుంత్రానికే మాధవ…్యు కుటుబం తిరుగు ప్ర…ూణం కట్టింది. అయితే, సంబంధం
కోరివచ్చిన మాధవ…్యు, అలా తిరిగిపోవడానికి వరదే్యు కారకుడై వుంటాడని
ఊహించిన వ్యక్తి ఒకడున్నాడు.
అతడు వరద…్యు పొరుగునే వుండే దేవ…్యు. ఈ దేవ…్యుకు ధనాశమెండు. వరద…్యు
ఓర్వలేని తనాన్ని తమకు అనువుగా చేసుకుని, అతడి నుండి డబ్బులాగాలని పథకం
వేశాడు. పథకం ప్రకారం వరద…్యుతో ఒంటిగా కబుర్లకు దిగిన దేవ…్యు, ‘‘ఏమిటో,
లక్ష్మికి గుప్పెట్లో తేలిగ్గా చిక్కిందనుకున్న అదృష్టం, ఇటె్ట చేజారి
పోయింది. అన్నట్టు .... మన సీత విష…ుంలో నాకు తెలిసిన కుర్రాడొకడున్నాడు.
వాడి పేరు గోవిందం. గోవిందానికి తల్లి తప్ప ఎవరూ లేరు. అతడి అమ్మమ్మ
లక్షల ఆస్తికి …ుజమాని. మనవడు సొంత పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేస్తూ
సమర్థుడనిపించుకుంటే, తన ఆస్తి ఇస్తానంటున్నది. గోవిందుకు ప్రెూజకత్వం
అయితే వుందిగాని, పెట్టుబడికి లేదు. అంచేత పదివేల రూపా…ులు కట్నంగా
తీసుకుని పెళ్ళాడి, ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు,''
అని చెప్పాడు. అమ్మమ్మ ఇవ్వనున్న ఆస్తితో లక్షాధికారి కాబోతున్న వాడు
పదివేల కట్నానికే చవగ్గా దొరుకుతాడనేసరికి వరద…్యుకు ఆశ కలి గింది.
అతడు వారం తిరక్కుండా, దేవ…్యు ఇంట్లోనే రహస్యంగా సీతకు పెళ్ళి చూపులు
జరిపించాడు. గోవిందం, సీతను చూస్తూనే ఇష్టపడి, తన వేలి ఉంగరం తీసి సీతకు
కానుకగా ఇచ్చాడు. వరద…్యు మహదానంద పడుతూ, గోవిందం కోరిన పెళ్ళి కట్నం
పదివేల రూకలూ ఎంచి అతడికిచ్చాడు. గోవిందం ముహూర్తం నిశ్చయించి తెలి…ు
జె…్యుమని చెప్పి వెళ్ళిపో…ూడు.
గోవిందం వెళ్ళిన మూడవ రోజు ఉద…ుం పట్నం నుంచి వచ్చిన మాధవ…్యుతో
కలిసి, కేశవ…్యు, వరద…్యు ఇంటికి వెళ్ళాడు. కొద్ది సేపు అవీయివీ మాట్లాడాక
మాధవ…్యు నవ్వుతూ, ‘‘ఏం, వరద…్యూ, గోవిందంతో సీత పెళ్ళి ఎప్పుడు?'' అంటూ
ప్రశ్నించాడు. ఉహించని ఆ ప్రశ్నకు వరద…్యు తెల్లబో…ూడు. మాధవ…్యు చిన్నగా
నవ్వి, ‘‘నువ్విచ్చిన పదివేలూ పంచుకోవటంలో వాటాలు కుదరక గోవిందం, దేవ…్యు
కొట్లాటకు దిగారు.
సమ…ూనికి నేనటుగా వెళుతూ విష…ుం ఆరా తీశాను. గోవిందం పట్నంలో పెద్ద
మోసగాడు. దేవ…్యు, అతడి సహా…ుంతో నిన్ను మోసం చేసి, నీ దగ్గర నుంచి
డబ్బులాగాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కారాగారంలో వున్నారు,'' అన్నాడు. వరద…్యు
అవమానంతో తలవంచుకున్నాడు. మాధవ…్యు, ‘‘ఇప్పుడు చెప్పు, వరద…్యూ! లక్ష్మికి
మూర్చ రోగం వున్నదని నువ్వు, నాతో అన్న మాట నిజమేనా?'' అని అడిగాడు.
వరద…్యు, ‘‘కాదు, అది నేను కల్పించి చెప్పిన అబద్ధం,'' అంటూ గొణిగాడు.
‘‘అందుకు తగిన ప్రా…ుశ్చిత్తం జరిగింది, వరద…్యూ. చెరపకురా చెడేవు -
అంటారే, అదేయిది. ఇక నుంచయినా, ఇరుగు పొరుగు పట్ల మనసులో ద్వేషభావంరాకుండా
తగు జాగ్రత్త పడు,'' అంటూ మాధవ…్యు హెచ్చరిస్తున్నట్టు, వరద…్యు భుజం
తట్టాడు. కథ ముగించిన బామ్మ, ‘‘పిల్లలూ, చూశారా!
మోసపు మాటలతో ఇతరులకు హాని చే…ూలనుకున్న వరద…్యు, తనే మరొక మోసకారి
వలలో చిక్కి డబ్బు నష్ట పోవడమే కాక నవ్వులపాల…్యూడు. అందువల్ల, మనం అలాంటి
మోసపుటాలోచనలకు దూరంగా వుండాలి,'' అన్నది. ‘‘అవును, బామ్మా!'' అంటూ
పిల్లలందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు.
No comments:
Post a Comment