Pages

Friday, September 14, 2012

విచిత్ర స్వప్నం


 
లక్ష్మీపురం గ్రామంలో, ధనిక రైతుకుటుంబానికి చెందిన శివరాముడనే …ుువకుడుండేవాడు. వాడి తల్లితండ్రులు కాలం చే…ుడంతో, వాడి మేనత్తవాణ్ణి పెంచి పెద్ద చేసింది. శివరాముడిలో బద్ధకం పాలెక్కువ. వాడు పొలం పనులు కూలీల మీదా, నౌకర్ల మీదా వదిలి గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతూండేవాడు. ఇలా వుండగా - ఒక అమావాస్య నాటి రాత్రివేళ వాడు సుష్టుభోజనం చేసి గదిలో గుర్రుపెట్టి నిద్రపో…ూడు.
 
తెలతెలవారు తూండగా, వాడికొక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో అంకాళమ్మ గుడి ముందు ఒక బంగారు సింహాసనం వుంది. ఆ సింహాసనం మీద శివరాముడు కూర్చునివున్నాడు. వాడి తల మీద ఒక గుడ్లగూబ వాలివుంది. గ్రామస్థులందరూ అంకాళమ్మ గుడిలోకి వెళ్ళకుండా, వాడికి పూజలు చేస్తూ, నైవేద్యం పెడుతున్నారు.
 
దూరాన ఒక కుక్క మాత్రం వాణ్ణి చూసి అదే పనిగా మొరుగుతున్నది. శివరాముడికి మెలుకువ వచ్చింది. ఆ కలను మరిచిపోలేక పో…ూడు. వాడు ఆ కల గురించి మేనత్తకు చెప్పి అర్థం అడిగాడు. మేనత్త నవ్వి, ‘‘ఒరే, శివా! కలలు దేవరహస్యాలు. మనబోటి పామరులకు అర్థంకావు. మన గ్రామపెద్ద హరినారా…ుణుడు తెలివిగలవాడు.
 
ఆ…ున్ని కలిసి అర్థం అడుగు,'' అని సలహాయిచ్చింది. శివరాముడు, హరినారా…ుణుడి దగ్గరకు వెళ్ళి, తన కల గురించి వివరించి అర్థం అడిగాడు. హరినారా…ుణుడు, ‘‘నిన్ను నీవు గొప్పగా ఊహించుకుంటున్నావు. అందువల్లే అలాంటి కల వచ్చింది,'' అని చెప్పాడు. అందుకు శివుడు, ‘‘అ…్యూ! నా గురించినేనెంత గొప్పగా ఊహించుకున్నా, దేవతకంటే గొప్పగా ఏనాడూ ఊహించుకోలేదు. పోనీ, కుక్క నన్ను చూసి ఎందుకు మొరిగింది? గుడ్లగూబ నా తల మీద ఎందుకు వాలింది?'' అని ప్రశ్నించాడు.

హరినారా…ుణుడు మరొకసారి తలగోక్కుని, ‘‘మన పొరుగూరి జమీందారు శ్రీనిధుడు ఇటువంటి కలల గురించి అర్థం చేసుకునేందుకు చాలా శాస్ర్తగ్రంథాలు చదివాడు. ఆ…ున్ని అడిగి చూడు,'' అని చెప్పాడు. శివుడు, శ్రీనిధుడి వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆ…ున ఆశ్చర్యపోతూ, శివుడి ముఖంకేసి ఒకటికి రెండు సార్లు చూసి, ‘‘మీ గ్రామానికి ఏదో అరిష్టం రాబోతున్నది.
 
అందుకే, కలలో గ్రామస్థులు దేవతకు కాకుండా, నీకు పూజలు చేశారు,'' అంటూ వివరణ ఇచ్చాడు. శివరాముడికా వివరణ అంతగా నచ్చలేదు. ‘‘మరి కుక్క, గుడ్లగూబల మాటే మిటి?'' అని అడిగాడు. ‘‘తనకు తిండి పెట్టనందుకు కుక్క మొరిగింది. దేవతకు కాక, నీకు పూజలు జరిపించుకున్నందుకు, నీకు కీడు జరగాలని గుడ్లగూబ నీ తల మీద వాలింది!''
 
అని చెప్పాడు శ్రీనిధుడు. శివరాముడు తన గ్రామానికి బ…ులుదేరాడు. గ్రామం చేరాక అలసటతో గ్రామం మధ్యవున్న మర్రిచెట్టునీడలో కూర్చున్నాడు. అక్కడ చుట్టకాల్చుకుంటున్న బైరాగి, శివరాముణ్ణి, ‘‘ఏరా అబ్బీ! ఈమధ్య కానరాలేదు. ఏమ…్యూవు?'' అని ప్రశ్నించాడు.
 
ఈ బైరాగిని గ్రామంవాళ్ళు, పిచ్చివాడు, మతి సరిగాలేనివాడు-అని హేళనచే…ుడం, శివుడికి తెలుసు. వాడు బైరాగితో, ‘‘నాకొక వింత కల వచ్చింది. దాని అర్థం తెలుసుకోడానికి ఊళ్ళన్నీ తిరుగుతున్నాను,'' అని చెప్పాడు. బైరాగి చుట్టను దూరంగా గిరవాటువేసి చిన్నగా నవ్వి, ‘‘సరైన అర్థం ఎవరూ చెప్పలేదుగదా, అవునా?'' అన్నాడు.


 ‘‘అంతే జరిగింది! అయినా ఆ సంగతి నీకెలా తెలుసు?'' అని అడిగాడు శివరాముడు. ‘‘ఓరి వెర్రివాడా! నీ కలకు అర్థం చెప్పగలవాడు, ఈ భూప్రపంచంలో ఒకే ఒక్కడు వున్నాడు; వాడెవరెవడో కాదు, నేనే!'' అన్నాడు. శివరాముడు చిన్నగా నిట్టూర్చి, ‘‘ఎవరిబురల్రో ఏముందో, ఆ అంకాళమ్మకే ఎరుక. సరే, కల అర్థం నీవు చెప్పగలవేమో చూడు!''
 
తన కల గురించి వివరించాడు. అంతావిన్న బైరాగి ఫక్కున నవ్వి, తాపీగా చుట్టముట్టించి, ‘‘అరె ఒరె అబ్బీ, విను మరి! ప్రజలలో దైవభక్తి తగ్గిపోతున్నది. స్వార్థం, సోమరితనం పెరిగి పోతున్నాయి. అందుకు నిదర్శనంగా, పనీపాటా లేకుండా సోమరిలా తిరిగే నీకు పూజలు జరిపి నైవేద్యం పెట్టారు. ఇక బంగారు సింహాసనం నీలోని పొగరుబోతుతనానికీ, ఆశకూ కొండగుర్తు లాంటిది!'' అన్నాడు.
 
‘‘ఐతే కుక్క ఎందుకు మొరిగింది? గుడ్లగూబ నాతల మీద ఎందుకు వాలింది?'' అని అడిగాడు శివరాముడు. ఆ వెంటనే బైరాగి, ‘‘నిన్ను పెంచి పెద్ద చేసిన నీ మేనత్త నీకు రోజూ కడుపునిండుగా భోజనం పెడుతూ, ఆ కుక్కకు ఒక ముద్ద అన్నం వేస్తున్నది. సొంత పొలం పనులు వాళ్ళకూ, వీళ్ళకూ అప్పగించి గ్రామంలో తిరిగే నువ్వంటే అసహ్యంచుకుని కుక్క మొరిగింది. గుడ్లగూబ మాటంటావా - గుడ్లగూబకు చీకటంటే మహా ఇష్టం.
 
సోమరితనం, అజ్ఞానంలో బతికే నువ్వు చీకటికంటే కటిక చీకటివి. అందుకే గుడ్లగూబ నిన్ను ఆప్యా…ుంగా ఆశ్రయించింది!'' అని చెప్పాడు. దానితో శివరాముడు చేతులు జోడించి, ‘‘నీవు పిచ్చివాడివి కాదు; గొప్ప మేధావివి. నువ్వు కలను వివరించిన తీరు - నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది.
 
ఇప్పటికి నా సోమరి నేత్రాలు తెరిపిన పడినై,'' అని ఇంటికేసి బ…ుల్దేరాడు. బైరాగి వాణ్ణి కాస్త ఆగమని, ‘‘అరే ఒరే, అబ్బీ! గ్రామమంతా నేను పిచ్చివాణ్ణని కోడైకూస్తూంటే, కాదనేందుకు నువ్వెవడివి? ఛీ!'' అంటూ, అక్కడి నుంచి దూరంగా వున్న మరొక గ్రామంకేసి ప్ర…ూణంకట్టాడు.

No comments:

Post a Comment