Pages

Friday, September 14, 2012

వింత గొడుగు


హేలాపురనివాసి కామ…్యుకు అత్యవసరంగా, సుగంధపురికి వెళ్ళవలసిన పనిబడింది. గొడుగు వేసుకుని మిట్టమధ్యాహ్నపు ఎండలో బ…ులుదేరాడు. పక్క వీధిలో వుండే శీత…్యు కూడా గొడుగు వేసుకుని వస్తూ, కామ…్యును కలిశాడు. శీత…్యు ప్ర…ూణం కూడా సుగంధపురికే. ఇద్దరికీ మాటలు కలిసినై. కామ…్యు గొడుగు కొత్తదిగావున్నది; శీత…్యు గొడుగు పాతబడి చిరుగులు పడివున్నది.
 
శీత…్యు, కామ…్యు గొడుక్కేసి ఒకసారి పరీక్షగా చూసి, ‘‘ఏం, కామ…్యూ! మనం రెండేళ్ళ క్రితం పెదవీర్రాజు కొట్లో ఒకేనాడు గొడుగులు కొన్నాం కదా. నా గొడుగు పాతబడి పోయింది, నీ గొడుగు కొత్తదిలా మెరిసిపోతున్నది. ఏమిటీ రహస్యం?'' అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఇందులో రహస్యం ఏమీ లేదు, శీత…్యూ!
 
నా గొడుగుకు నాలుగైదు తడవలు మరమ్మతులు చేయించాను. అందుకే అలా కొత్తగా కనిపిస్తున్నదేమో?'' అన్నాడు కామ…్యు. ‘‘భలేవాడివే! ఎంత మరమ్మతులు చేయిస్తే మాత్రం కొత్తదానిలా వుండడం ఎలా సాధ్యం! నా గొడుక్కూ చాలాతడవలు మరమ్మతులుచేయించాను. అయినా పాతగొడుగులాగే వున్నది కదా,'' అన్నాడు శీత…్యు.
 
‘‘అదే నాకూ అంతుబట్టడం లేదు, శీత…్యూ! రెండు వారాల క్రితం సంతకు వెళ్ళినప్పుడు, లక్ష్మ…్యు కనిపించాడు. ఇద్దరం ఏవో కొ…్యుసామానులు బేరమాడుతూ గొడుగుల్ని అక్కడి చెక్కబల్ల మీద పెట్టాం. కొనుగోళ్ళు పూర్త…్యూక గొడుగులు తీసుకుని, సంతలో చెరోవైపుకూ వెళ్ళాం. ఆశ్చర్యం! తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే, నా గొడుగు కొత్త గొడుగులా మెరుస్తూ వుంది, విచిత్రంగా!'' అన్నాడు కామ…్యు. కామ…్యు, లక్ష్మ…్యుల మతిమరుపుతనం ఎవరికి లాభించిందో అర్థమై, శీత…్యు చిన్నగా నవ్వుకున్నాడు.

No comments:

Post a Comment