పూర్వం దామరమడుగు అనే గ్రామంలో ఎక్కువమంది ధనవంతులు ఉండేవారు. అదే
గ్రామంలో దుగ్గిశెట్టి అనే వ్యాపారి, తన ఇద్దరు కొడుకులతో చిన్న వ్యాపారం
చేస్తూ జీవించేవాడు. దుగ్గిశెట్టి ఒకప్పుడు బాగా ఉన్నవాడే, కాని వ్యాపారంలో
అపారంగా నష్టపోయి, ఒక పెద్ద ఇల్లు తప్ప మిగిలిన ఆస్తి అంతా
పోగొట్టుకున్నాడు. అయినా చిన్న ఎత్తున మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు.
ముసలితనం ముంచుకొచ్చినా, పూర్వపు స్థితికి తిరిగి చేరుకోవాలన్న ఆశ
దుగ్గిశెట్టికి పోలేదు.
ధనిక గ్రామం కావటంచేత దామర మడుగుకు అప్పుడప్పుడూ బందిపోటు బెడద
ఉండేది. అలా ఒకసారి బందిపోటు వస్తున్నట్టు తెలిసి అందరూ గ్రామం ఖాళీ
చేశారు. దుగ్గిశెట్టి మటుకు తన కొడుకులతో, ‘‘నేను మీతోపాటు రాలేదు. రెండు
రోజుల పాటు ఇక్కడే తలదాచుకుంటాను. మన పెరట్లో గడ్డవామి మధ్య కాస్త
చోటుచేసి, నాకు కూడూ, నీరూ పెట్టి వెళ్లండి,'' అన్నాడు. దుగ్గిశెట్టిని
కొడుకులు గడ్డివామిలో ఉపా…ుంగా దాచి వెళ్లిపో…ూరు.
బందిపోటు దొంగలు గ్రామానికి రానే వచ్చారు. తన అనుచరులు ధనంకోసం
ఇల్లిల్లూ గాలిస్తూ ఉంటే, వారి నా…ుకుడు గుర్రంమీద వీధి వెంబడి వచ్చాడు.
దొంగలు ఊళ్లమీద పడి దోచుకున్నదంతా రెండు సంచులలో గుర్రానికి అటూ ఇటూ
వెళ్లాడుతున్నది. లంకంత ఇల్లూ, పెరడూ దొంగల నా…ుకుడి దృష్టిని ఆకర్షించాయి.
ఆ ఇల్లూ, పెరడూ దుగ్గిశెట్టివే.
దొంగల నా…ుకుడు తన పెరట్లోకి గుర్రం మీద రావటం చూడగానే దుగ్గిశెట్టికి
ప్రాణం కడబట్టినట్టయింది. దొంగల నా…ుకుడు తన గుర్రాన్ని గడ్డి వామి పక్కన
ఒక రాతికి కటే్టసి, ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమో చూడటానికి లోపలికి
వెళ్లాడు.
ఆకలి మీద ఉన్న గుర్రం వామిలో నుంచి గడ్డిలాగి మె…్యుసాగింది.
దుగ్గిశెట్టి గడ్డి వామిలో నుంచి బ…ుటికివచ్చి, గుర్రం కట్టువిప్పి,
దానిమీద ఉన్న ధనం సంచులు రెండూ తీసుకుని వామి మధ్యకు వెళ్లిపోయి, గడ్డి
అడ్డం పెట్టుకున్నాడు. కట్టు విప్పిన గుర్రం …ుథేచ్ఛగా పెరడంతా తిరుగుతూ
పచ్చిక మే…ుసాగింది. ఇల్లంతా గాలించినా దొంగల నా…ుకుడికి విలువగలది ఏమీ
దొరకలేదు.
అతను తిరిగి పెరడులోకి వచ్చేసరికి గుర్రం కట్టువిప్పుకుని దూరంగాపోయి
గరిక మేస్తున్నది. దానిమీద ధనపు మూటలు లేవు. మూటలు ఎక్కడ పడిపో…ూెూ అని
దొంగల నా…ుకుడు పెరడంతా వెతుకుతూండగా అతని అనుచరులు అక్కడికి వచ్చారు.
వాళ్లను చూస్తూనే దొంగల నా…ుకుడు, ‘‘గుర్రం మీది రెండు మూటలనూ మీలో ఎవరన్నా
తీశారా?'' అని అడిగాడు. దొంగలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
తమను మోసం చె…్యుటానికి తమ నా…ుకుడు దోచినదంతా ఎక్కడో దాచి, అది
పోయినట్టు నటిస్తున్నాడన్న అనుమానం సహజంగా దొంగలకు కలిగింది. పోయిన
మూటలకోసం వాళ్లు తెగ వెతికారు, కాని ప్రెూజనం లేకపోయింది. ఆ మూటల ఆరా తీసే
భారం దొంగల నా…ుకుడు తాను చూస్తానన్నాడు.
మర్నాడు
దొంగలు గ్రామం వదిలి వెళ్లారు. వాళ్లు వెళ్లిపోయిన వార్త అందగానే
గ్రామస్థులు తిరిగివచ్చారు. దుగ్గిశెట్టి మూటలను తన ఇంట్లోనే రహస్యంగా
దాచాడు. ఆ…ున తన కొడుకులతో ఈ సంగతి ఏమీ చెప్పలేదు. ఆ మూటల ఆరా తాను
తీస్తానని దొంగల నా…ుకుడు ప్రతిజ్ఞ చె…్యుటం ఆ…ున విని ఉన్నాడు.
ఆ…ున అనుకున్నటే్ట దొంగల నా…ుకుడు గుర్రాల వర్తకుణ్ణని చెప్పుకుంటూ ఆ
గ్రామంవచ్చి, ఊళ్లో ఉండే ధనికుల గురించి అడగసాగాడు. ఇటీవల అకస్మాత్తుగా
ఎవరన్నా ధనికుల…్యూరేమో తెలుసుకుందామని వాడి ఉద్దేశం. దుగ్గిశెట్టి వాణ్ణి
గుర్తుపట్టాడు. దొంగ ఆ రాత్రి తన ఇంటికి రావచ్చునని దుగ్గిశెట్టికి అనుమానం
తగిలింది. అందుచేత ఆ…ున వెయ్యికళ్లతో తన పెరడును కనిపెట్టి ఉన్నాడు.
ఆ…ున అనుమానించినటే్ట, చీకటిపడగానే దొంగ చల్లగా తన పెరట్లో
ప్రవేశించి, ఇంటి గోడవారనక్కి కూర్చున్నాడు. ఇంట్లో వాళ్లు తాను
పోగొట్టుకున్న ధనం మూటల గురించి ఏమన్నా మాట్లాడుకుంటారేమో వినాలని వాడి ఆశ.
ఇదంతా గమనించిన దుగ్గిశెట్టి పొద్దు పోనిచ్చి తన కొడుకులతో, దొంగకు
వినిపించే లాగా, ‘‘ఒరే, అబ్బాయిలూ, మొన్న మన పెరట్లో గడ్డిలాగుతూంటే
గడ్డికింద రెండు నగల మూటలు కనిపించాయిరా!'' అన్నాడు.
కొడుకులు ఆశ్చర్యానందాలతో, ‘‘నిజమా? మరి మాకు చెప్పావు కావేం?''
అన్నారు. ‘‘అది ఎవరిదో ఏమిటో తెలి…ుకుండా దాని సంగతి ఎలా బ…ుట పెటే్టదిరా?
అందుకని ఆ మూటలను ప్రస్తుతానికి రహస్యంగా దాచి ఉంచాను,'' అన్నాడు
దుగ్గిశెట్టి. ‘‘ఎక్కడ దాచావేం?'' అని కొడుకులు తండ్రిని అడిగారు. ‘‘మన
పెద్ద బావిలో పడేశాను,'' అన్నాడు దుగ్గిశెట్టి. దొంగ ఈ మాట విని
సంతోషించాడు.
ఊరు మాటుమణిగినాక వాడు తాడు తెచ్చి బావి మీది గిలకకొ…్యుకు కట్టి,
దాని సహా…ుంతో బావిలోకి దిగాడు. వెంటనే దుగ్గిశెట్టి తన కొడుకులకు అసలు
సంగతి చెప్పేశాడు. ముగ్గురూ పెరట్లోకి వెళ్లి, దొంగకు ఆధారంగా ఉన్న తాడు
కాస్తా కోసేసి, దొంగ నెత్తిన బండరాళ్లు వేసి, వాణ్ణి బావిలోనే చంపేసి, వాడి
శవాన్ని పైకితీసి, తెల్లవారే లోపల తమ పెరట్లోనే పాతేశారు. తరవాత
దుగ్గిశెట్టి ఏ చీకూచింతా లేకుండా తాను బతికి ఉన్నంతకాలమూ ఐశ్వర్యంలో
ఓలలాడాడు.
No comments:
Post a Comment