Pages

Friday, September 14, 2012

రాజుగారి మనోగతం!


ఒకానొకప్పుడు అపరిమితమైన పశుసంపద కలిగిన రాజు ఉండేవాడు. ఆ…ున వద్ద లెక్క లేనన్ని పశువులు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఉండేవి. ఒకనాడా…ునకు ఒక వింత ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆస్థానంలో పనిచేసే ఉద్యోగులనూ, సేవకులనూ రాజభవనం ముందు గుమిగూడమని ఆజ్ఞాపించాడు. కారణం ఫలానా అని చెప్పకుండా రాజు రమ్మన డంతో, అందరూ ఆశ్చర్యపో…ూరు.
 
మరునాడు తెల్లవారగానే రాజు ఎందుకు పిలిపించాడా అన్న ఉత్కంఠతతో అందరూ రాజభవనం ముందు గుమిగూడారు. రాజు వారి ఎదుటికి వచ్చి, ‘‘అందరూ వచ్చారా?'' అని అడిగాడు. అందరూ చేతులు కట్టుకుని మౌనం వహించారు. ‘‘మీ మౌనాన్ని చూస్తూంటే అందరూ వచ్చారనే భావిస్తున్నాను.
 
నేనొక ప్రశ్న అడిగి, మీ ఒక్కొక్కరి నుంచీ విడివిడిగా సమాధానం రాబట్టాలనుకుంటున్నాను,'' అన్నాడు రాజు వారందరి కేసీ పరిశీలనగా చూస్తూ. కొంతసేపు తరవాత రాజు మళ్ళీ, ‘‘నా మనసులో ఇప్పుడు ఏమున్నదో మీరు చెప్పాలి. నాలో విచారం ఉందా? సంతో షంగా ఉన్నానా? ఆదుర్దాతో ఉన్నానా? నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? అన్న విష…ుం మీరు చెప్పాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాను.
 
ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మీ సమాధానం చెప్పండి,'' అన్నాడు. ఒక్కొక్కరు ముందుకు వచ్చి తమకు తోచిన సంగతి చెప్పారు. రాజు అంగీకరించి సంతోషిస్తాడ నుకున్నారు. అయితే, ప్రతి ఒక్కరి సమాధానానికీ రాజు తల అడ్డంగా ఊపసాగాడు. అయినా, రాజు ముఖంలో ఎలాంటి ఉద్వేగమూ కని పించక పోవడంతో ఆ…ున ఆగ్రహం చెందాడా? ఆశాభంగం చెందాడా? విచారంతో ఉన్నాడా? అన్న విష…ుం ఎవరూ ఏమాత్రం పసిగట్టలేక పో…ూరు.

‘‘మీలో ఏ ఒక్కరి అభిప్రా…ుంతోనూ ఏకీ భవించలేక పోతున్నందుకు విచారిస్తున్నాను. వెళ్ళి మీ మీ పనులు చూసుకోండి,'' అన్నాడు రాజు నిర్వికారంగా. రాజభవనానికి ముందు ఒక మూలలో నిలబడి మంత్రి జరుగుతూన్న తతంగాన్నంతా మౌనంగా చూడసాగాడు.
 
ఇప్పుడు రాజు దృష్టి మంత్రి మీదికి మళ్ళింది ఆ…ున మంత్రిని దగ్గరికి రమ్మని పిలిచి, ‘‘నా మనోభావాలను చదవగల మనిషిని ఒక నెలలో వెతికి తీసు కురా. అలా వెంటబెట్టుకు రాకపోతే నిన్ను మంత్రి పదవినుంచి తొలగిస్తాను,'' అని చెప్పి, భవనం లోపలికి వెళ్ళిపో…ూడు. మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. మౌనంగా ఇంటికి వెళ్ళి పైకప్పును చూస్తూ పడుకుని, ‘‘రాజు మనసును చదవగల మేధావిని నేనెక్క డని వెతకగలను?'' అని ఆలోచిస్తూ గడిపాడు.
 
‘‘రేపు వెళ్ళి వెతుకుతాను,'' అన్న ఆలోచనతో చిన్న కునుకు తీశాడు. తెల్లవారక ముందే లేచాడు. గబగబా వెళ్ళి, దారిలో ఎదురుపడిన ప్రతివాడికీ తన సమ స్యను ఏకరువు పెట్టాడు. ఎవరూ పరిష్కారం చూపలేక పో…ూరు. కొందరయితే రాజు గారి వ్యవహారం గనక, ఎటు పోయి ఎటు వస్తుందో నన్న అనుమానంతో అసలు నోరు కదపలేక పో…ూరు. రాజు పట్ల భ…ుంతో ఎలాంటి సలహా ఇవ్వలేక ఊరుకున్నారు.
 
మంత్రి ఇలా మరికొన్ని రోజులు తిరిగాడు. రాజు చెప్పిన నెలరోజుల గడువు దగ్గర పడుతున్నది. కాని సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనిపించక పోేుసరికి మంత్రికి నిద్ర కరువయింది. ఆకలి నశిం చింది. నిద్రాహారాలు మాని రాత్రుల్లో సైతం పడక మీద కూర్చుని దిగులు పడసాగాడు. భోజనం చే…ుమని భార్య ప్రాథే…ుపడేది. అయినా అతడు వినిపించుకునేవాడుకాదు.
 
ఈ స్థితిని చూసిన మంత్రి కుమార్తె ఒకరోజు ఆ…ున దగ్గరికి వెళ్ళి, ‘‘నాన్నా, మీ విచారా నికి కారణం ఏమిటి? ఎందుకిలా ఆవేదనపడు తున్నారు? నాకు చెప్పండి,'' అని అడి గింది. అయినా మంత్రి, ఆమె మాటలు పట్టిం చుకో లేదు. ఒకనాటి ఉద…ుం ఆ…ున విచా రంతో స్నానం చే…ుడానికి సైతం నిరాకరిం చాడు. దాన్ని చూస్తూ ఆ…ున కుమార్తె ఊరుకో లేకపోయింది. ‘‘నాన్నా, మీరు ఆహారం తీసుకో లేదంటే, నేనూ, అమ్మా కూడా అసలు తిండి ముట్టుకోం.
 
మీ విచారానికి కారణం చెప్పండి. ఎవరు చూశారు, నేనే దాన్ని పరిష్కరించ వచ్చు,'' అన్నది పట్టుదలతో. ఆ మాటతో మంత్రి లేచి కూర్చున్నాడు. తన సమస్యకు పరిష్కారం చెబుతానన్న మొట్ట మొదటి మనిషిని చూడడంతో ప్రాణాలు లేచి వచ్చినట్టయి, రాజాజ్ఞను గురించీ, తన విఫల ప్ర…ుత్నం గురించీ కుమార్తెకు వివరించి చెప్పాడు.

అంతావిన్న మంత్రి కుమార్తె, ‘‘గడువు పూర్తికావడానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి?'' అని అడిగింది. ‘‘ఒకటి రెండు రోజులే ఉన్నాయి, తల్లీ,'' అన్నాడు మంత్రి. ‘‘సరిగ్గా ఎప్పుడు ముగుస్తుందో చెప్పు. రాజుగారికి కావలసిన మనిషిని తెచ్చి అప్ప గించే బాధ్యత నాది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసిరా. అందరం కలిసి భోజనం చేద్దాం,'' అంటూ తండ్రి చేతులు పట్టుకుని లేపి, గది వెలుపలికి తీసుకువచ్చింది.
 
భోజనం చేస్తూ మంత్రి, ‘‘నేను ఎల్లుండి, రాజుగారి దగ్గరికి మనిషిని తీసుకువెళ్ళాలి,'' అన్నాడు కుమార్తెతో. ‘‘ఎల్లుండే కదా! దిగులు పడకండి నాన్నా. నేను తప్పక మీకు కావలసిన మనిషిని ఆలోగా తీసుకువస్తాను,'' అని ధైర్యం చెప్పింది కుమార్తె. మంత్రి కుమార్తె మరెక్కడికీ వెళ్ళలేదు. తమ గొర్రెలు, మేకలు కాచే …ుువకుడు ఆమెకు గుర్తుకు వచ్చాడు. ఆ గొర్రెల కాపరి …ుువకుడికి సొంతంగా మూడు గొర్రె పొటే్టళ్ళు ఉన్నాయి.
 
పైగా వాడు మాట్లాడలేడు; చెవులు వినిపించవు. మంత్రి కూతురు వాణ్ణి పిలిచి, కడుపునిండా భోజనం పెట్టి, వాడు తన తండ్రితో కలిసి రాజదర్శనానికి వెళ్ళాలని సంజ్ఞలతో వాడికి అర్థమే్యులా తెలి…ుజేసింది. వాడు సరేనని సంతోషంగా తల ఊపాడు. ఆమె ఆ సంగతి తన తండ్రికి చెప్పలేదు. మంత్రి రాజదర్శనానికి బ…ులుదేరుతూన్న సమ…ుంలో తన కూతురు గొర్రెలకాపరిని తీసుకు రావడం చూసి ఆ…ున దిగ్భ్రాంతి చెందాడు.
 
‘‘మూగ చెవిటివాణ్ణి తీసుకువచ్చా వేమిటి తల్లీ,'' అని అడిగాడు. ‘‘రాజుగారి మనసులో ఉన్నదంతా వాడికి క్షƒుణ్ణంగా తెలుసు. మీరు ఏమాత్రం సంశయించ కుండా వాణ్ణి మీ వెంటబెట్టుకు వెళ్ళండి. తక్కినవన్నీ వాడే చూసుకుంటాడు,'' అని ధైర్యం చెప్పింది కూతురు. కూతురి తెలివి తేటలపట్ల మంత్రికి అపార నమ్మకం ఉంది. అందువల్ల మరేమీ మాట్లాడ కుండా, ఆ…ున గొర్రెల కాపరిని వెంట బెట్టుకుని రాజాస్థానా నికి బ…ులుదేరాడు.
 
రాజు అప్పటికే కొలువు తీరి ఉన్నాడు. మంత్రి వెంటబెట్టుకుని వచ్చే మనిషి రాజు గారి మనోభావాలను ఎలా వెలి బుచ్చగలడో చూడాలని సభికులందరూ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మంత్రి వచ్చి రాజుకు తలవంచి నమస్క రించాడు. గొర్రెల కాపరి …ుువకుడు కూడా అదే విధంగా తలవంచి నమస్కరించాడు.

రాజు వాడి కేసి ఒకసారి పరిశీలనగా చూసి మౌనంగా చేయి పైకెత్తి ఒక వేలును చూపాడు. గొర్రెలకాపరి …ుువకుడు రెండు వేళ్ళు చూపాడు. రాజు మందహాసం చేసి, మూడు వేళ్ళు చూపాడు. గొర్రెల కాపరి …ుువకుడు తల అడ్డంగా ఊపుతూ మళ్ళీ రెండు వేళ్ళే చూపాడు. రాజు మరింత పెద్దగా నవ్వుతూ, మంత్రి వైపు తిరిగి, ‘‘గొప్ప ప్రతిభావంతుణ్ణి తీసుకు వచ్చావు.
 
నాకు సరైన సమాధానాలిచ్చాడు. నిన్ను మనసారా అభినందిస్తున్నాను, మంత్రీ,'' అన్నాడు. ‘‘కృతజ్ఞతలు, మహారాజా!'' అంటూ మంత్రి మళ్ళీ ఒకసారి వంగి నమస్కరించి, ‘‘తమరు అన్యథా భావించలేదంటే ఒక మనవి. తమరు అడిగిన ప్రశ్నలనూ, వాటికి ఈ …ుువ కుడు ఇచ్చిన సమాధానాలనూ తెలి…ు జేశా రంటే సభికులు కూడా విని ఆనందించ గలరు,'' అన్నాడు విన…ుంగా. ‘‘అలాగే మంత్రీ! ఈ రాజ్యానికి నేనొక్కడినే కదా అధిపతిని అని అడుగుతూ ఒక వేలిని చూపాను.
 
అతడు అందుకు - కాదు, నాతో పాటు దేవుడు కూడా ఉన్నాడంటూ రెండు వేళ్ళు చూపాడు. ఈ రాజ్యం మీద ఆధిపత్యం వహించేవారు వేరెవరైనా ఉన్నారా అంటూ నేను మూడు వేళ్ళు చూపాను. అతడు మళ్ళీ రెండు వేళ్ళే చూపుతూ, లేదు దేవుడూ, నేను మాత్రమే ఈ రాజ్యాధినేతలమని సూచించాడు. అతడు నా మనోభావాలను ఎంత చక్కగా స్పష్టంగా అర్థం చేసుకున్నాడో, చూశావా?'' అన్నాడు పరమానందంతో.
 
ఆ తరవాత రాజు మంత్రినీ, గొర్రెలకాపరి …ుువకుణ్ణీ విలువైన కానుకలతో సత్కరించి పంపాడు. ఇల్లు చేరగానే మంత్రి తన కూతురి సా…ుంతో, ఆ …ుువకుడు రాజుగారి మనోగతాన్ని ఎలా గ్రహించగలిగాడో అడిగాడు. ఆ మూగవాడు- రాజుగారు ఒకవేలు చూపుతూ నన్ను ఒక పొటే్టలు పిల్లనిస్తావా? అని అడిగాడు.
 
రెండు వేళ్ళు చూపుతూ రాజుగారు కదా కావాలంటే రెండు తీసుకోండి, అన్నాను నేను. రాజుగారేమో నా వద్దవున్న మూడు పొటే్టళ్ళనూ ఇవ్వమని అడిగినప్పుడు ససేమిరా కాదని అడ్డంగా తలూపుతూ రెండే అమ్ముతాను, అని రెండు వేళ్ళే చూపాను అంతే - అని సౌంజ్ఞలతో వివ రించాడు. అసలు సంగతి గ్రహించిన మంత్రీ, ఆ…ున కూతురూ నవ్వు ఆపుకోలేక పో…ూరు!

No comments:

Post a Comment