ఒకానొకప్పుడు అడవి సమీపంలోని ఒక గ్రామంలో సుజూ, …ుమార్ అనే ఇద్దరు
స్నేహితులు ఉండేవారు. సుజూ చాలా బలంగానూ, చురుగ్గానూ ఉండేవాడు. …ుమార్ అంత
బలహీనుడుకాదు గాని, మహాబద్ధకస్తుడు. ఒక చెట్లో పళ్ళు కనిపించా…ుంటే, ఎంత
ఎత్తయినా సరే, సుజూ చెటె్టక్కి వాటిని కోసుకువచ్చేవాడు. అయితే, వాటిని మొదట
…ుమార్‌కు ఇచ్చి, కావలసిన వాటిని తీసుకోనిచ్చేవాడు.
ఇద్దరూ పెరిగిపెద్దవాళ్ళ…్యూరు. ఇద్దరికీ పెళ్ళిళ్ళ…్యూయి. సుజూ ఒక
చిన్న ఇంట్లో వుంటూ కూలినాలి చేసుకుని జీవించేవాడు. తండ్రి నుంచి కొంత పొలం
సంక్రమించడంతో …ుమార్ సుఖ జీవనం సాగించసాగాడు. అయితే, ఇద్దరి మధ్య స్నేహం
మాత్రం కొనసాగుతూవచ్చింది. తీరిక సమ…ూల్లో ఇద్దరూ కలిసి అడవికి
వెళ్ళేవారు.
ఒకనాడు అలా అడవిలో తిరుగుతూ ఒక గుహలో ప్రవేశించారు. గుహలో కమ్ముకున్న
చీకట్లో మెరుస్తూ చిన్న చిన్న రాళ్ళు కొన్ని సుజూకు కనిపించాయి. వాటిని
తీసుకుని బ…ుటికివచ్చాక, సుజూ ఆ రాళ్ళను …ుమార్‌కు చూపాడు. …ుమార్ వాటిని
తీసుకుని పరిశీలించి చూశాడు. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అయినా ఆ సంతోషం
బ…ుటపడకుండా, ‘‘రేపు నేను పట్నం వెళ్ళవలసిన పనివుంది.
అప్పుడు వీటికి ఏమైనా విలువవుందేమో కనుగొంటాను,'' అన్నాడు …ుథాలాపంగా.
మర్నాడు …ుమార్ పట్నం వెళ్ళాడు. వాడి ఊహ నిజమయింది. అవి చాలా విలువైన
మణులు. వాటిని అమ్మి బోలెడంత ధనంతో ఇంటికి తిరిగివచ్చాడు. అయితే, సుజూకు
కొన్ని నాణాలు మాత్రం ఇస్తూ, ‘‘అవి ఎందుకూ పనికిరాని రాళ్ళు. అయినా ఒక
ధనవంతుడు తన పూలకుండెను అలంకరించడానికి వాటిని కొనుక్కున్నాడు.
అతడిచ్చిన
దానిలో సగం ఇది,'' అన్నాడు. …ుమార్ త్వరలోనే పెద్ద భవనం
నిర్మించుకున్నాడు. గుర్రాలు కొన్నాడు. నౌకర్లను ఏర్పాటు చేసుకున్నాడు.
‘‘మా తాతల నాటి ఇంట్లో దాచిన నిధులు బ…ుట పడ్డాయి,'' అని ఇరుగుపొరుగుతో
చెప్పుకున్నాడు. తన స్నేహితుడు ధనవంతుడు కావడం చూసి సంతోషించిన సుజూ,
‘‘మనకేదైనా అవసరం ఏర్పడినప్పుడు అతని సా…ుం అడగవచ్చు కదా,'' అన్నాడు
భార్యతో.
అతని భార్యకు మాత్రం …ుమార్ సా…ుపడగలడన్న నమ్మకం లేదు. పైగా, తన
భర్తకు లభించిన మెరిసేరాళ్ళే, …ుమార్ సంపదలకు మూలకారణం అన్న అనుమానం కూడా
ఆమెకు లేకపోలేదు. ఒకనాడు సుజూ అడవిలోని గుహ కేసి వెళుతున్నాడు. తన కొడుక్కు
జబ్బు చే…ుడంతో మందులు కొనడానికి డబ్బులు లేక అవస్థపడుతున్నాడు.
ఆ సమ…ుంలో …ుమార్ గుహ నుంచి వెలుపలికి వస్తూండడం చూసి, ‘‘ఇక్కడేం
చేస్తున్నావు?'' అని అడిగాడు సుజూ. ఆ మాటకు ఉలిక్కిపడిన …ుమార్, ‘‘ఏం
లేదు. ఏమీ తోచక ఇలా వచ్చాను, అంతే. అది సరే, నువ్వెందుకు ఇక్కడికి
వచ్చావు?'' అని ఎదురుప్రశ్న వేశాడు. ‘‘ఇక్కడ మళ్ళీ ఏమన్నా విలువైన రాళ్ళు
దొరుకుతాేుమోనన్న ఆశతో వచ్చాను,'' అన్నాడు సుజూ. ‘‘అలాగా! మంచిది రా.
ఇద్దరం కలిసే వెతుకుదాం. ఏవైనా దొరికా…ుంటే నేను పట్నం వెళ్ళి
అమ్ముకుని వస్తాను. నువ్వు అమా…ుకుడివి. నీకు సరైన ధర ఇవ్వరు,'' అన్నాడు
…ుమార్. ఇద్దరూ లోపలికి వెళ్ళి బండలకిందా, పైనా, వెతికారు గాని, ఒక్క రాయి
కూడా దొరకలేదు. ఇద్దరూ గుహ నుంచి వెలుపలికి వచ్చి, గ్రామంకేసి నడవ సాగారు.
‘‘వర్షం వచ్చేలా వుంది. త్వరగా నడువు,'' అంటూ …ుమార్ వేగంగా నడవసాగాడు.
‘‘ఈ కటె్టల మోపును కాస్త తలపైకి ఎత్తు, నా…ునా, ముసలిదాన్ని,'' అన్నది
చెట్టుకింద కటె్టల మోపుతో కూర్చున్న ఒక వృద్ధురాలు. …ుమార్ ఆ వృద్ధురాలి
కేసి ఒకసారి నిరసనగా చూసి గబగబా వెళ్ళిపో…ూడు. అతని వెనకనే వచ్చిన సుజూ,
‘‘అవ్వా, ఈ కటె్టల మోపును నేనే తీసుకొస్తాను, రా,'' అంటూ దానిని తలపైకి
ఎత్తుకుని అవ్వ వెంట నడవసాగాడు. అవ్వ గుడిసె ముందు కటె్టల మోపును కింద
పెట్టాడు. ‘‘నా…ునా, నీది చాలా దొడ్డ మనసు.
నీ సా…ుం మరవలేను,'' అంటూ వృద్ధురాలు గుడిసె లోపలికి వెళ్ళి ఒక రొటె్ట
ముక్కను తెచ్చి సుజూకు ఇచ్చి, ‘‘ఆకలిగా ఉన్నట్టున్నావు. ఈ రొటె్టను తిను.
ఇది నీ ఆకలి తీర్చడమే కాక, నీ కేదైనా నలత ఉంటే, దాన్నికూడా పోగొడుతుంది,''
అన్నది. సుజూ చాలా సంతోషించాడు. జబ్బుతో బాధ పడుతున్న తన బిడ్డకు ఆ రొటె్ట
ముక్కను ఇవ్వాలనుకుని ఇంటికేసి వేగంగా నడసాగాడు.
అతడు నాలుగడుగులు వేశాడో లేదో, ‘‘ఎవరు నా…ునా, వెళుతున్నది. ఆకలితో
చచ్చిపోతున్నాను. ఏదైనా తినడానికి ఇవ్వు బాబూ,'' అన్న దీనస్వరం
వినిపించింది. సుజూ వెనక్కు తిరిగి చూశాడు. బండ మీద పడుకున్న ఒక మనిషి
ప్రాణాలకు కొట్టి మిట్టాడుతున్నట్టు కనిపించడంతో, మరో ఆలో చన లేకుండా సుజూ
రొటె్టముక్కను ఆ మనిషి చేతిలో పెట్టాడు.
దానిని తిన్న ఆ పెద్దమనిషి వెంటనే లేచి కూర్చున్నాడు. ‘‘ప్రాణాలు
కాపాడావు. నీ ఉపకార బుద్ధి చాలా గొప్పది. నాయీ చిన్న కానుకను తీసుకో,''
అంటూ ఆ మనిషి వెదురుపుల్లలతో చేసిన చిన్న చక్రాన్ని సుజూకు ఇచ్చాడు. ఆ
చక్రం తిప్పడానికి వీలుగా చిన్న వెదురుదబ్బ అమర్చివుంది. ‘‘బాబూ, ఇది
చూడడానికి చిన్నదేగాని, పెద్ద పెద్ద పనులు చే…ుగలదు. నీకు కావలసినదానిని
మనసులో తలుచుకుని, దీనిని కుడివైపుకు తిరిగించు.
నీ కోరిక సిద్ధించాక, దానిని వెనకవైపుకు తిప్పావంటే ఇవ్వడం
ఆపేస్తుంది. అయినా ఎల్లప్పుడూ దీని మీదే ఆధారపడకు.నీకు కావలసిన వాటినంతా
సమకూర్చుకుని, ఇక నిశ్చింతగా జీవించగలం అన్న పరిస్థితి ఏర్పడగానే దీన్ని
సముద్రంలోకి వేసె్ు,'' అన్నాడతడు మళ్ళీ. సుజూ అతనికి కృతజ్ఞతలు తెలి…ుజేసి
వెదురు చక్రాన్ని తీసుకుని ముందుకు నడిచాడు. ఒక వెదురుచక్రం కోరిన కోరికలు
తీరుస్తుందని సుజూ నమ్మలేక పో…ూడు.
అతనికిప్పుడు కొడుక్కు వైద్యం చే…ుడానికి కొంత డబ్బుకావాలి. తన
స్నేహితుడు …ుమార్ సా…ుపడగలడని అతడు ఆశించాడు. అతడు …ుమార్ ఇల్లు
చేరేసరికి వర్షం ఆరంభమయింది. ‘‘మిత్రమా, నా బిడ్డకు జబ్బు చేసింది. కొంత
డబ్బు కావాలి,'' అన్నాడు సుజూ. ‘‘సుజూ, ఇంటికి వచ్చావు. రా భోంచేద్దాం.
అంతేగాని, ఇప్పుడు నాకు చాలా మంది స్నేహితులున్నారు.
జబ్బు పడ్డ స్నేహితుల పిల్లలందరి వైద్యానికీ డబ్బులు ఇవ్వాలంటే
సాధ్యమే్యు పనికాదు,'' అన్నాడు …ుమార్. ‘‘ఉచితంగా కాదు. అప్పుగా ఇవ్వు,
తిప్పి ఇచ్చేస్తాను,'' అన్నాడు సుజూ. ‘‘నేను చెప్పిన మాటే మళ్ళీ
చెప్పాలనుకుంటున్నావా?'' అన్నాడు …ుమార్ నిర్మొహమాటంగా. ‘‘వద్దు,'' అంటూ
గాఢంగా నిట్టూర్చి, సుజూ అక్కడినుంచి బ…ులుదేరాడు.
‘‘ఏం తెచ్చావు నాన్నా?'' అని అడిగాడు జబ్బుతో పడుకున్న సుజూ కొడుకు,
తండ్రి చేతిలోని వెదురుచక్రం కేసి ఆశగా చూస్తూ. సుజూ చిన్నగా నవ్వుతూ,
‘‘ఇది మనకు కొంచెం ఆహారం ఇస్తుంది,'' అంటూ చక్రాన్ని కుడివైపుకు తిప్పాడు.
మరుక్షణమే రకరకాల వంటలు ప్రత్యక్షంకాసాగాయి. సుజూ చక్రాన్ని ఎడమవైపుకు
తిప్పడంతో, ఆహారం రావడం ఆగిపోయింది. సుజూ దంపతులూ, కొడుకూ దానిని చూసి
ఆనందాశ్చర్యాలు చెందారు.
తన కొడుకు జబ్బు మాన్పించే మందు అడిగాడు సుజూ. మరుక్షణమే వచ్చింది.
దానిని పుచ్చుకోగానే, కురవ్రాడి జబ్బు న…ుమయింది. అప్పటికే వర్షం భోరున
కురవడంతో ఇంటి పైకప్పు ఉరవ సాగింది. ‘‘మా కొక మంచి ఇల్లు కావాలి!'' అంటూ
చక్రం తిప్పాడు సుజూ. అతని కోరిక నెరవేరింది.
ఆ ప్రాంతంలోనే చాలా అందమైన సుజూ ఇల్లు చూసి గ్రామస్థులందరూ
విస్తుపో…ూరు. …ుమార్ అమితాశ్చర్యంతో ఇంటిని ఒకటికి వందసార్లు పరికించి
చూశాడు. ‘‘ఇదెలా సాధ్య మయింది?'' అని స్నేహితుణ్ణి అడిగాడు. ‘‘అంతా దేవుడి
ద…ు,'' అన్నాడు సుజూ. సుఖవంతమైన జీవితం సాగించడానికి కావలసిన వసతులన్నిటినీ
సుజూ, మా…ూచక్రం ద్వారా క్రమక్రమంగా సమకూర్చుకున్నాడు. …
ుమార్‌కు స్నేహితుడి స్థితి చూసి మనశ్శాంతి నశించింది. నిద్ర
కరువయింది. రాత్రి తెల్లవార్లూ సుజూ ఇంటి చుట్టూ తిరుగుతూ, కిటికీ గుండా
తొంగి చూస్తూ, అతడి సంపదల రహస్యం తెలుసుకోడానికి ప్ర…ుత్నించాడు. ఒకనాటి
రాత్రి సమ…ుంలో సుజూ మా…ూ చక్రాన్ని తిప్పి, పూజించడానికి దేవత శిలావిగ్రహం
కావాలని కోరుకున్నాడు.
విగ్రహం రాగానే, అతడు భార్యతో, ‘‘మనం ఈ చక్రాన్ని సముద్రంలో పడ
వే…ువలసిన సమ…ుం వచ్చింది. మనకు కావలసినవన్నీ సమకూర్చుకున్నాం,'' అన్నాడు.
‘‘నిజమే,'' అన్నది సుజూ భార్య. కిటికీ వద్ద నిలబడిన …ుమార్‌కు ఇప్పుడు అసలు
రహస్యం తెలిసిపోయింది. అర్ధరాత్రి సమ…ుంలో సుజూ దంపతులు గాఢనిద్రలో
ఉన్నప్పుడు చక్రాన్ని దొంగిలించుకుని వచ్చేశాడు.
మరునాడు ఒక పడవ తీసుకుని తీరానికి కొద్ది దూరంలో ఉన్న దీవికి
బ…ులుదేరాడు. సకల సదుపా…ూలతో అక్కడొక సుందర విలాస భవనాన్ని సృష్టించుకుని,
తన భార్యా పిల్లలతో అక్కడికి చేరుకోవాలన్నది అతడి పథకం. అలా చేస్తే తను
చేసిన దొంగతనం సుజూ పసికట్టలేడని అతడు భావించాడు. పడవలో ఒక గంటసేపు ప్ర…ూణం
చేశాక, ఆకలి వే…ుడంతో తన వెంట తెచ్చుకున్న ఆహారం మూటను విప్పి ఒక ముద్ద
నోట్లో పెట్టుకున్నాడు.
వండిన పదార్థాలలో ఉప్పు లేదు. చక్రాన్ని కుడిపైపుకు తిప్పి, ‘‘ఉప్పు
కావాలి,'' అన్నాడు. తక్షణమే వాడి ఎదుట ఉప్పురాశిగా ప్రత్యక్షమయింది. అయితే,
ఆ రాశి అమితవేగంతో ఎక్కువ కాసాగింది. పడవలో బరువెక్కువకావడం గ్రహించి వాడు
ఒక క్షణం బెదిరిపో…ూడు. అయినా పెరుగుతూన్న ఉప్పు మేటను ఆపడం ఎలాగో వాడికి
తెలి…ులేదు. వాడు హడలుతో చూస్తూండగానే పడవ మునగసాగింది.
…ుమార్‌కు
ఈత రాదు గనక, పడవతో పాటు సముద్ర గర్భంలోకి మునిగిపో…ూడు. మా…ూచక్రం, ఇంకా
ఇంకా ఉప్పును పుట్టిస్తూనే ఉన్నది. సముద్రమంతా ఉప్పునీళ్ళుగా మారిపోయింది.
సముద్రంలో ఎంత వానకురిసినప్పటికీ, ఉప్పుగుణం పలచబడని విధంగా ఈనాటికీ చక్రం
ఉప్పును ఇస్తూనే ఉన్నది! అదీ సముద్రం ఉప్పునీటి కథ!
No comments:
Post a Comment