రాజుగారికి మరణం సమీపించింది.
తనకు గల ముగ్గురు కుమారుల్లో ఎవరికి రాజ్యాన్ని అప్పగించాలనే ఉద్దేశంతో
తెలివైన కుమారుడు ఎవరని తెలుసుకోవాలని రాజుగారు నిర్ణయించారు. ఈ నిర్ణయం
మేరకు ముగ్గురికి ఒక పరీక్ష పెట్టదలచుకున్నాడు. ఒకరోజు వాళ్ల ముగ్గురిని
పిలిచి నాయనలారా! నేను మీకో పరీక్ష పెడతున్నాను. నెగ్గిన వారికే
రాజ్యాధికారం అన్నాడు. అలాగే నాన్నగారూ అన్నారు. ముగ్గురు.
మరైతే ఈ గదిని ఏ వస్తువుతోనైనా పూర్తిగా నింపితే వారే గెలిచినట్టు అన్నాడు రాజు. మరైతే ఈ గదిని ఏ వస్తువుతోనైనా నింపితే సరి అన్నాడు రాజు. వీరి ముగ్గురిలో పెద్ద కొడుకు గబగబా బయటికెళ్లి వజ్రాలతో గదిని నింపడానికి యత్నిస్తాడు. అయితే వజ్రాలతో గది నిండలేదు. దీనిని గమనించిన రెండవ కుమారుడు దూదితో గదిని నింపేందుకు ప్రయత్నించి గదిని దూదితో నింపుతాడు.
అయితే గదిలో ఎక్కడైనా ఓ చోట ఖాళీ కనిపిస్తుండటంతో విఫలమయ్యాడు. ఇద్దరి చర్యలను గమనించిన మూడో వాడు ఆ గదిలో ఒక దీపం ముట్టించాడు. దీనితో ఆ గది నిండా వెలుతురు వ్యాపించింది. ఏ మూలలో చూసినా వెలుతురే. వెలుతురుతో గదంతా నిండిపోయింది. మూడో వాడి తెలివిని రాజుగారు మెచ్చుకుని రాజ్యాధికారాన్ని అతడికి అప్పగిస్తాడు.
నీతి: అన్నీ సమస్యలను తెలివితో చాకచక్యంగా సాధించాలి.

No comments:
Post a Comment