Pages

Saturday, August 4, 2012

బీర్బల్ తెలివి తేటలకు ఇరాన్ రాజు పరీక్ష - అక్బర్-బీర్బల్ కథలు


ఒకసారి ఇరాన్ రాజు కి బీర్బల్ ను చూడాలనిపించింది ఒక సారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బెర్బల్కి సందేశం పంపించాడు మరో  రెండు నెలల్లో  ఇరాన్ కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడు. బీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు టోపీలూ పెట్టించి మరో ఐదుగుర్ని తనతో పాటు సింహాసనం పై కుర్చోబెట్టుకున్నాడు బీర్బల్ తెలివి తేటలకు ఇదిఒక పరీక్ష అనుకున్నాడు.

బీర్బల్ రానే వచ్చాడు రాజభటులు బీర్బల్ను సాదరంగా రాజ సభకు తీసుకువచ్చారు బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కిరిసిపోయింది సభలో అడుగు పెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు ఆరుగురు రాజులు కూర్చొని వుండటం చూసి తనకు పరీక్షా పెట్టటానికే ఈ ఏర్పాటు అనుకున్నాడు ఒక్క నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్లి అభివాదం చేసాడు ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు..... ఇంతమందిలో నీనే రాజునని ఎలా తెలుసుకున్నారు మీరు? అని బీర్బల్ని అడిగాడు ఏముంది రాజా ! మీరు తిన్నగా చూస్తువుంటే ఈ నకిలీ రాజులు మిమల్నే చూస్తున్నారు అన్నాడు బీర్బల్.

ఇంత నిశిత పరిశీలనా వుంది కాబట్టే మీరు మహా మేధావి మిమల్ని కలవటం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ ని కౌగిలించుకున్నాడు సభలో ప్రజలందురు బీర్బల్ తెలివికి జోహర్లు అర్పించారు.

No comments:

Post a Comment