రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన
రైతు సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా, హయిగా ఉండేవాడు.
ధనం లేక పోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు.
సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా, ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమోనని భయపడేవాడు సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య.
ఒక రోజు సోమయ్య రామయ్యను పిలిచి నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు.
రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టె వంకే చూస్తూ కాలం గడిపాడు సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది.
తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి నేను పేదవాణ్ణి సోమయ్యా నన్ను ఇలాగే ఉండనివ్వు నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తోంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు.

No comments:
Post a Comment