జమ్మికుంట అనే ఊర్లో ఓ
జమీందారు ఉండేవాడు. అతడి దగ్గర ఓ మేలుజాతి గుర్రం ఒకటి ఉండేది. ఆ గుర్రం
అంటే జమీందారుకి చాలా ఇష్టం, అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు.
ఆ గుర్రం బాగోగులు చూసేందుకు ఒక పనిమనిషిని కూడా నియమించాడు.
కొంతకాలానికి ఆ గుర్రం కుంటుతూ నడవటం మొదలెట్టింది. తన ప్రియమైన గుర్రం అలా కుంటుతూ కుంటుతూ నడవటాన్ని చూసి తట్టుకోలేని ఆ జమీందారు ఎంతోమంది వైద్యులకు చూపించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. గుర్రాన్ని చూసిన ఏ వైద్యుడూ అదెందుకలా కుంటుతోందో కారణం కనిపెట్టలేకపోయారు.
అలా కొంత కాలం గడచిన తరువాత... ఆ వూరికి ఓ సాధువు వచ్చాడు. మహాజ్ఞాని అయిన ఆ సాధువు.. తన గుర్రం ఎందుకు కుంటుతోందో చెబుతాడని నమ్మిన జమీందారు అతడి వద్దకు గుర్రంతో సహా వెళ్లాడు.
విషయమంతా విన్న ఆ సాధువు... "ఈ గుర్రం ఆలనా పాలనా చూసుకునే పనివాడిని ఇక్కడికి తీసుకురండి" అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే జమీందారు అతడిని రప్పించాడు.
పనివాడు వస్తుండగా చూసిన సాధువు... "నాయనా నీ గుర్రానికి ఈ కుంటితనం ఏదో జబ్బువల్ల వచ్చింది కాదు. అదిగో అతన్ని చూశావా..? అతను కుంటివాడు. రోజూ తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించటం వల్లనే ఆ కుంటితనం వచ్చింది" అన్నాడు.
అలాగే... "నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. నీ గుర్రం కుంటితనం మానాలంటే, దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే...!" అని తేల్చి చెప్పాడు సాధువు.
అంతా విన్న జమీందారు వెంటనే గుర్రాన్ని చూసుకునే పనివాడిని మార్చేసి, మామూలుగా నడిచేవాడిని కొత్తగా పనిలో పెట్టుకున్నాడు. కొంతకాలానికి గుర్రం అతన్ని అనుకరించి మామూలుగా నడవటం మొదలుపెట్టింది.

No comments:
Post a Comment