సంబల్‌పురి పట్టణంలో ఒక
ప్రత్తి వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. అతడికి నలుగురు కుమారులు. ప్రత్తి
వ్యాపారంలో బాగా ఆస్తిపాస్తులను వెనుకేసుకున్న ఆ వ్యాపారి ఓ రోజు హఠాత్తుగా
బాగా జబ్బుపడ్డాడు. తానింక ఎక్కువ రోజులు బ్రతకలేననుకున్న అతడు
కొడుకులందరినీ పిలిచాడు.
"మనకున్న ఆస్తి అంతా ప్రత్తే కాబట్టి, మన గోదాములో ఉన్న ప్రత్తితో మీరందరూ కలిసికట్టుగా వ్యాపారం చేస్తూ, మంచిగా జీవించండి" అని చెప్పాడు. అతనలా చెబుతుండగా, అక్కడికి ఓ పిల్లి వచ్చింది. అది వాళ్ల పెంపుడు పిల్లి కాబట్టి, "మరి నాన్నా దీన్నేం చేయాలి?" అని అడిగాడు చిన్న కొడుకు. "దాన్ని కూడా మీరు సమానంగా చూసుకోవాలి" అని చెప్పాడు తండ్రి.
మరికొన్ని రోజులకు ఆ వ్యాపారి చనిపోయాడు. నలుగురు కొడుకులూ తండ్రి చెప్పినట్లుగా జాగ్రత్తగా వ్యాపారం చేస్తూ ఉంటారు. తండ్రి పిల్లిని సమానంగా చూసుకోమన్నాడు కాబట్టి, నలుగురూ తలా ఓ కాలుని తమ వంతుగా తీసుకుని, ఒక్కో కాలునీ తమకి నచ్చినట్లుగా అలంకరించుకోవటం మొదలుపెట్టారు.
ఒకరోజు పిల్లికి వెనక కుడికాలుకి చిన్నపాటి దెబ్బ తగిలింది. ఆ కాలు అందరికంటే చిన్నవాడు చూసుకుంటున్నది కాబట్టి, వెంటనే దానికి నూనె పూసి, బట్టతో కట్టుకట్టాడు. అలా కట్టుతో ఆ పిల్లి గోదాములో ఎలుకను పట్టబోయి, చమురు దీపంపై పడింది. అంతే.. అప్పటికే నూనెతో తడిసిన కాలికట్టుకి నిప్పు అంటుకుంది. కంగారులో పిల్లి ప్రత్తి బస్తాలపై దూకగా, ప్రత్తి మొత్తం తగలబడి పోయింది.
జరిగిన నష్టానికి కారణం చిన్నకొడుకు చూసుకుంటున్న పిల్లి కాలు కాబట్టి, ముగ్గురు అన్నలూ తమ్ముణ్ణి నష్టపరిహారం చెల్లించమని చెప్పారు. అంత మొత్తం తాను చెల్లించలేనని తమ్ముడు మొండికేశాడు. దీంతో అన్నలు ఆవూరి పెద్దకు ఫిర్యాదు చేశారు.
విషయమంతా విన్న ఆ ఊరి పెద్ద "గోదాము తగలబడింది నిప్పు అంటుకున్న కాలువల్లే. కానీ, ఆ పిల్లి పత్తి బస్తాల మీదకు దూకింది మాత్రం మిగతా మూడు కాళ్లతోనే కదా...! కాబట్టి, అసలు కారణం ఆ మూడు కాళ్లు. అందువల్ల మీ ముగ్గురూ కలిసి చిన్నవాడికే నష్టపరిహారం చెల్లించాలి" అంటూ తేల్చి చెప్పాడు.
దీంతో ముగ్గురు అన్నలూ నిరాశతో తలవంచుకుని నిల్చున్నారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఇలా అన్నాడు.. "మీలో మీరు తెలివితక్కువగా పోట్లాడుకుంటే మీకే నష్టం జరుగుతుంది. పిల్లి కాళ్ల సంగతి పక్కనపెట్టి, మళ్లీ అందరూ కలిసి ఐకమత్యంతో, కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి" అంటూ బుద్ధి చెప్పి పంపించాడు.
ఊరిపెద్ద మాటలు సబబుగా అనిపించటంతో ఆ నలుగురు అన్నదమ్ములు ఇంకెప్పుడూ తమలో తాము గొడవ పడదనుకుని గట్టిగా నిర్ణయించుకుని సంతోషంగా ఇళ్లకు బయలుదేరారు. ఆరోజు నుంచి నలుగురు అన్నదమ్ములూ ఆనందంగా జీవనం గడపసాగారు.

No comments:
Post a Comment