ధర్మయ్య ఒక నిజాయితీ గల వర్తకుడు. ఒకరోజు వ్యాపార నిమ్మితం పరదేశానికి
వెళ్లిన ధర్మయ్య అక్కడ సత్రంలో రంగయ్య అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో బస
చేశాడు. తెల్లవారక ముందే సత్రంలో నుండి బయలుదేరిన ధర్మయ్య తన వ్యాపార
లావాదేవీలను కొనసాగించేందుకు మరో పట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణ పోలీసులు
అతన్ని అడ్డగించి తనతో పాటు బస చేసిన రంగయ్య హత్య చేయబడ్డాడని తెలుసుకొని
నిర్ఘంతపోయాడు. పోలీసులు ధర్మయ్యను ప్రశ్నిస్తూ అతని సంచి వెదకగా అందులో
రక్తంతో తడిసిన కత్తి ఉండడంతో ధర్మయ్యే నేరస్ధుడని నమ్మిన పోలీసులు ధర్మయ్య
ఎంతగా వాదించినా వినకుండా అతన్ని ఇరవై ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు.
దీనంగా దేవుణ్ణి ప్రార్దించడం తప్ప మరేమీ చేయలేని ధర్మయ్య దేవుడి కృపకోసం ఎదురు చూడ సాగాడు. అంతలోనే కొంత మంది కొత్త నేరస్ధులను జైలులోకి తీసుకువచ్చారు అధికారులు. వారిలో కరడుగట్టిన హంతకుడు రత్నయ్య కూడా ఉన్నాడు. రత్నయ్య మాటలలో రంగయ్యను చంపింది రత్నయ్యేనని తెలుసుకున్నాడు ధర్మయ్య. కాని ప్రతీకారం తీర్చుకోవాలని చూడలేదు ధర్మయ్య.
ఒకరోజు జైలు నుండి పారిపోయేందుకు సొరంగం తవ్వుతున్న రత్నయ్యను చూశాడు ధర్మయ్య. సొరంగం తవ్వుతున్న చప్పుడు విన్న పోలీసులు వచ్చి గదిలో ఆరా తీశారు. కాని రత్నయ్యే సొరంగం తవ్వాడని ధర్మయ్య చెప్పలేదు సరికదా మౌనంగా తెలియనట్లే ఊరుకున్నాడు. తన నేరం వల్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ధర్మయ్యకి తన పట్ల ఇంత దయ, ప్రేమ చూసేసరికి తట్టుకోలేకపోయినా రత్నయ్య ధర్మయ్య కాళ్లపై పడి తనను క్షమించమంటూ వేడుకోగా, "దేవుడే క్షమిస్తాడు" అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ధర్మయ్య.
మరుసటి రోజే తన నేరం అంగీకరించిన రత్నయ్య తన వల్ల నేరం అనుభవిస్తున్న ధర్మయ్య నిరపరాధి అని అతన్ని విడిచిపెట్టమని జైలు అధికారుబతిమాలాడు. అసలు నేరస్ధుడు దొరకడంతో ధర్మయ్యను వదిలేశారు అధికారులు.

No comments:
Post a Comment