- అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం
- అసత్యం ఆడకూడదు
- ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము
- ఆటలాడుచోట, అలుక పూనరాదు
- ఆడిన మాట తప్పరాదు
- ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి
- ఇంటి పని (హోం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి
- ఇంటి పని (హోం వర్క్) సరిగ్గా చేయటం
- ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం
- ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి
- ఉపాధ్యాయులను గౌరవించటం
- ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం
- ఎల్లప్పుడూ దైవచింతన చేయుము
- ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి
- ఒకరి మీద చాడీలు చెప్పరాదు
- కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు
- ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం
- గురువుల మాట వినాలి
- గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు
- చక్కగా తల దువ్వు కోవటం
- చెడ్డవారి చెలిమి చేయరాదు
- చేసిన మేలు మరువరాదు
- జీవహింస చేయరాదు
- టి వి చూసేటప్పుడు టి వి కి దగ్గరగా కూర్చోవద్దు
- తనను తాను పొగడు కొనరాదు
- తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు
- తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం
- తొందరపడి ఏ పనీ చేయరాదు
- నమ్మిన వారిని మోసం చేయరాదు
- నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు
- నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి
- నీళ్ళు వృధా చేయవద్దు
- నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది
- పరనింద పనికిరాదు
- పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం
- పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి
- పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం
- పెద్దల మాటలు వినవలెను
- పెద్దలను గౌరవించాలి
- పేదల మీద దయ ఉంచవలెను
- బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి
- బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి
- బీదలను చూసి హేళన చేయవద్దు
- బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి
- భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవటం
- భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం
- మంచి అలవాట్లకు మించిన ధనం లేదు
- మంచిని మించిన గుణం లేదు
- మనిషికి మాటే అలంకారం
- మాట వెండి, మౌనం బంగారం
- రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి
- లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం
- విద్య చెప్పిన వారిని మరువరాదు
- వేకువ(తెల్లవారు) జామునే లేవటం
- వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం
- శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం
- శుభ్రంగా పళ్ళు తోముకోవటం
- శుభ్రమైన బట్టలు ధరించటం
- సజ్జనులతో స్నేహము చేయవలెను
- సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం
- స్వామి యందు భక్తి నుంచుము
Thursday, August 16, 2012
మంచి అలవాట్లు
Labels:
childrens stories,
indian folk tales,
indian stories,
jataka tales,
kids stories,
moral stories,
neeti kathalu,
panchatantra kathalu,
telugu folk tales,
telugu stories,
చిన్నపిల్లల కధలు,
నీతి కథలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment