కోసల రాజ్యాన్ని పరిపాలించే రాజుకు తన ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారో
తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన మంత్రితో సంప్రదించి, బాగా రద్దీగా ఉండే
దారి మధ్యలో రాత్రికి రాత్రే ఒక బండరాయిని పాతించాడు. ఆ దారిలో
వెళ్లేవాళ్లందరూ దానిని దాటి వెళ్ళే ప్రయత్నం చెసేవారు. కానీ ఎవరూ ఆ రాయిని
తొలగించే ప్రయత్నం మాత్రం చెసేవాళ్లు కాదు.
రాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి ఆ దారిని గమనిస్తూ ఉండేవాళ్లు. ఎంతటివారు అయినా కష్టపడి పక్కనుండి వెళ్ళేవారే తప్ప, ఆ రాయిని మాత్రం కదిల్చే ప్రయత్నం చేయలేదు. తమ ప్రజల ప్రవర్తన రాజుని ఆశ్చర్యపరిచింది. ఒక రోజు ఒక రైతు, పక్క ఊరి నుండి కూరగాయల సంచి మోస్తూ ఆ ఊరిలోకి వచ్చాడు. దారిలో అడ్డంగా రాయి కనిపించడంతో ఆ రైతు తన సంచిని పక్కన పెట్టి, ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేశాడు. చాలాసేపు కష్టపడ్డాక ఆ రాయిని పక్కకి దొర్లించ గలిగాడు. దానితో ఆ ప్రదేశం విశాలమై అందరికీ సౌకర్యంగా మారింది.
రాయిని దొర్లించి వెన్నక్కి తిరుగుతుంటే, రైతుకు ఆ రాయి ఉండిన స్థలంలో ఒక సంచి కనిపించింది. ఏమై ఉంటుంది అని చూస్తే, అందులో కొన్ని బంగారు నాణాలూ, ఒక ఉత్తరమూ కనిపించాయి. ఆ ఉత్తరం రాజు రాసినది. దానిలో - "అందరికీ ఉపయోగపడేలా రాయిని తొలగించినవారికి ఈ బంగారం" అని రాసి ఉంది. రైతు సంతోషిస్తూ, తన కూరగాయల సంచిని తీసుకుని వెళ్లిపోయాడు.
ఇదంతా గమనిస్తున్న రాజు, మంత్రితో -"చూశారా మంత్రిగారూ, అందరూ అడ్దంకిని తప్పించుకునే ప్రయత్నమే చేశారు గానీ, ఈ రైతు దానిని ఎదుర్కొన్నాడు. అందుకే దానిని తీసేయగలిగాడు. మన జీవితాల్లో అడ్డంకులు కూడా మనకి మనం మెరుగుపరచుకోవడానికి అవకాశాల్లాంటివి" అన్నాడు. మంత్రి అవునంటూ తల ఊపాడు.

No comments:
Post a Comment