తెనాలి రామలింగడి దగ్గరకు ఒక పండితుడు తాను రాసిన కొన్ని పద్యాలను
వినిపించాలని వచ్చాడు. తన పాండిత్యాన్ని రామలింగడి ముందు ప్రదర్శించాలని
ఆయన కోరిక. అసలు తీరికలేని రామలింగడు "పండితావర్యా! మీరు మీ పద్యాలను మా
వద్ద ఉంచి వెళ్ళండి. మేము తరువాత వాటిని తప్పకుండా చదివి అభిప్రాయం మీకు
చెబుతామ" అని చెప్పాడు. రామలింగడి మాటలు నమ్మని ఆ పండితుడు పద్యాలను
ఇప్పుడు వినవలసిందేనంటూ పట్టుబట్టాడు.
పండితుడు మొండి వైఖరి రామలింగడికి కోపం తెప్పించినా "సరే! మొదలెట్టండి" అని ఒక గోడకు ఒరిగి కూర్చున్నాడు. పండితుడు పద్యాలు చదవడం మొదలెట్టాడు. మొదటి రెండు మూడు పద్యాలకు "ఊ" కొట్టిన రామలింగడు ఆ తర్వాత ఎంచక్కా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పండితుడు. పండితుడు తన పద్యాల మోత మాత్రం ఆపలేదు.
రామలింగడు కాస్సేపటి తర్వాత నిద్రలేచాడు.
"అయ్యా! నా పద్యాలను మరోసారి వినిపించాలా?" అడిగాడు పండితుడు. "ఎందుకు? నేను ఇందాకే నా అభిప్రాయం చెప్పానుగా!" అన్నాడు రామలింగడు. "మీరా..... అభిప్రాయమా? లేదే! మీరు జోరునిద్రలోకి జారుకున్నారు" అని ఆశ్చర్యంగా అన్నాడా పందితుడు. "అవును నిజమే! నేను నిద్రలోకి జారుకున్నప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చాను" అని ముక్తసరిగా బదులిచ్చాడు రామలింగడు.
రామలింగడి వ్యంగ్య సమాధానానికి, అతని చతురతను కొనియాడాలో లేక తనను వెక్కిరించాడని బాధ్పడాలో అర్ధంకాక అక్కడి నుండి జారుకున్నాడు ఆ పండితుడు.

No comments:
Post a Comment