కోయిల పాడే దెందుకని? పాటలు బాగా పాడమని | |
కోడి కూసేదెందుకని ? వేకువ జామున లేవమని | |
నెమలి ఆడేదెందుకని ? ఆనందముగా ఉండమని | |
ఉడత గంతులు ఎందుకని ? చింతలు లేక మెలగమని | |
పావురం చెప్పేదేమిటని ? శాంతిని ఎపుడూ కోరమని | |
తాబేలు చెప్పేదేమిటని ?తొందరపాటు తగదని | |
సాలీడు చెప్పేదేమిటని ?పట్టుదలగ పైకెదగమని | |
కుందేలు చెప్పేదేమిటని ?ఖుషీ ఖుషీ గా ఉండమని | |
ఒంటెలు చెప్పేదేమిటని ? ఒంటరితనం వీడమని | |
చేపలు చెప్పేదేమిటని ?చురుకుగా ఎప్పుడు ఉండమని |
No comments:
Post a Comment