అనగనగా ఒక అడవిలో ఒక నక్క వుండేది. ఒక రోజు ఆ నక్క ఓ జింకను చూసింది.
జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత
దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం
తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క.
ఆ సింహం దెగ్గిరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. “రాజన్! మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక వుంది!” అని నక్క అంది.
సింహం నక్కతో బయలుద్యారింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి యెక్కి దాక్కుంది. నక్కా, సింహం అక్కడికి వచ్చే సరికి వాటికి యేమి కనిపించలేదు.
సింహం ఆ నక్కను కోపంగా చూసి, “నన్నే ఆటపట్టించాలనుకున్నావా! జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే!” అని ఆ నక్కను తినేసింది.
దుష్టులెప్పుడైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు.

No comments:
Post a Comment