సీత శివాలయానికి చెందిన ఏనుగు. మావటివాడు రోజూ దాన్ని ఆ దగ్గరలో ఉన్న
చెరువుకు తీసుకుని వెళ్ళేవాడు. చెరువుకు వెళ్ళేదారిలో గోపయ్య ఇల్లు ఉంది.
అతను తన ఇంటి అరుగుమీద కూర్చుని బట్టలు కుట్టేవాడు.
సీత రోజూ గోపయ్య ఇంటి ముందు కొంచెంసేపు ఆగేది. గోపయ్య అరటి పండ్లు, కొబ్బరిచిప్పలు, తన దగ్గర ఏమి ఉంటే అవి ఏనుగుకు ఇచ్చేవాడు. సీత అవి తీసుకుని అతన్ని తన తొండంతో ఆశీర్వదించి వెళ్ళిపోయేది.
ఒకరోజు గోపయ్యకు, అతని భార్యకు మధ్య చిన్న తగువు జరిగింది. ఆ కోపంలోనే వచ్చి కుట్టుమిషను ముందు కూర్చున్నాడు. ఎప్పటిలా చెరువుకు వెళుతూ సీత అతని ముందు ఆగింది. కానీ కోపంగా ఉన్న గోపయ్య దాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. చాలాసేపు నిలబడి, నిలబడి తను వచ్చానని తెలపడానికి సీత గట్టిగా ఘీంకరించింది.
గోపయ్య ఆ శబ్ధానికి ఉలిక్కిపడ్డాడు. అతనికి చాలా చిరాకు కలిగింది. తన చేతిలో ఉన్న సూదితో ఏనుగు తొండంలో గుచ్చాడు.

No comments:
Post a Comment