ఒక
అరణ్యంలో జింక ఒకటి ఉండేది. దానికి తొందర పాటుతనం ఎక్కువ. అది పసికట్టి
వాళ్ళమ్మ ''నీ ప్రవర్తన వల్ల నువ్వు ఒకరోజు ఏ వేటగాడి చేతిలోనో
ఇరుక్కుంటావు!'' అని ఎప్పుడూ హెచ్చరించేది. కానీ తల్లి మాటలు ఈ జింకపిల్ల ఏ
రోజూ పట్టించుకునేది కాదు. చాలా నిర్లక్ష్యంగా తల్లి మాటల్ని
కొట్టిపారేసేది. తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించేది కాదు.
ఒకరోజు కొందరు వేటగాళ్లు ఒక జింకను తరమడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తి ఆ జింక చెట్ల పొదల వెనుక దాక్కుంది. ఆ వేటగాళ్ళు దానికోసం వెతికారు. కానీ అది ఎక్కడా కనిపించలేదు. వారు అలాగే ఆలోచిస్తూ నిలబడ్డారు. వారు వెళ్ళిపోయారనుకున్న జింక అక్కడ చెట్లకున్న లేత ఆకులను కొరికి తినడం ప్రారంభించింది.
దానితో ఆ చెట్టుకొమ్మలు కదిలాయి. ఆలోచిస్తూ నిలబడ్డ వేటగాళ్ళలో ఒకరి దృష్టి కదిలే కొమ్మలపై పడింది.
వెంటనే అతడికి విషయం అర్థమైంది. ఇంకేం! తన విల్లు తీసి ఎక్కుపెట్టి బాణం వేశాడు. పాపం! జింక ప్రాణాలు కోల్పోయింది. దాని తొందరపాటే దాని ప్రాణాలు మీదకు తెచ్చింది.

No comments:
Post a Comment