అనగా అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటం అంటే
చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా "కొత్త విషయాలు చెప్పండి- కొత్త విషయాలు
చెప్పండి" అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్ళకు ఏదో
ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప
శాస్త్రవేత్తలను పిలిపించాడు- "మీరు కనుగొన్న క్రొత్త క్రొత్త పరికరాలను,
పదార్థాలను, ప్రయోగాలను వివరించండి" అన్నాడు.
అందరూ ఎవరికి వారు తాము కనుగొన్న విషయాలను చూపి, వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి- కానీ వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు.
శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక, రాజుగారు ఆలోచనలో పడ్డారు: "ఇవన్నీ కొత్త సంగతులు- సరే- కానీ, మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు?" అని.

అప్పుడు
మంత్రి "ప్రభూ! నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే
జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమౌతుంటాయి. మీరు
కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను" అన్నాడు రాజుతో.
రాజుగారు సంతోషంగా 'సరే'అనగానే, మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు.
శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి ఆరు కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి, శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేసాడు. ఈగ కొంచెం సేపు బాధపడి, ఆపైన మళ్ళీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది.
రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త -"ప్రభూ! ఈ ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈ ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమ శక్తి, భూమి, గిట్టుబాటు ధర- ఈ ఆరూ రైతుకు ఆరు కాళ్ల లాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడి-పోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటంకోసం ఇలా చేయవలసి వచ్చింది- క్షమించాలి" అన్నాడు.
తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు.

No comments:
Post a Comment