అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి నాలుగు వైపులా పెంకులతో ఏటవాలు
ఇంటికప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన
గుమ్మడి పాదు ఒకటి అల్లుకుంటూ, ఏపుగా పెరుగుతుంటుంది. ఆ గుమ్మడి చెట్టు
బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాసాయి.
ఇక ఆ ఇంటి కప్పుల్నే తన ఇల్లుగా మార్చుకున్న ఓ ఎలుక కూడా... ఆ గుమ్మడికాయలతోపాటు కాపురం చేయసాగింది. తుంటరిదైన ఆ ఎలుక కనబడ్డ వాటినల్లా కొరికేస్తూ, చాలా సంతోషంగా జీవితం గడిపేయసాగింది. ఆ ఇల్లు తనదే అన్నట్లుగా ఈ ఎలుకగారు అక్కడికి ఎవరు వచ్చినా వారిని ఊరికే వదలిపెట్టదు.
రోజులలా గడుస్తుండగా.. ఇంటి చావడిలోకి మేత కోసం వచ్చిందొక మేకపిల్ల. ఇంతలో తుంటరిదైన మన ఎలుకగారు ఊరుకుంటారా..? వెంటనే ఒక గుమ్మడికాయని ఫుటుక్కున కొరికేసింది. దీంతో గుమ్మడికాయ జరజరా జారుతూ... డుబుక్కున గడ్డి మేస్తున్న మేకపిల్లపై పడింది. వెంటనే ఆ మేకపిల్ల మే... మే... అని అరుచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఇదండీ... పుటుక్కు.. జరజర.. డుబుక్కు.. మే కథ. ఏదీ మీరూ ఒక్కసారి "పుటుక్కు జర జర డుబుక్కు మే" అనండి. భలే తమాషాగా ఉంది కదూ...?!

No comments:
Post a Comment