పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి
శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, అలౌకికశక్తులూ, ప్రాణులకు హాని
కలిగిస్తూ జీవించడమే నైజంగాగల విషసర్పాల్లాంటి జీవులూ విచ్చలవిడిగా
సంచరించే, ఈ భయంకర శ్మశానంలో, రాత్రివేళ నిర్భయంగా కార్యసాధనకు పూనుకున్న
నిన్ను, ధీరాతి ధీరుడవని ప్రశంసించక తప్పదు.
నీ ధైర్యసాహసాలు అద్భుతం. ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు నీలాగే
కఠిన శ్రమల కోర్చిన శశికాంతుడనే గ్రామీణ యువకుడి కథ చెబు తాను, శ్రమ
తెలియకుండా, విను,'' అంటూ ఇలా చెప్పసాగాడు: పూర్వం కనకవరం అనే గ్రామంలో
శశికాంతుడనే యువకుడుండేవాడు.
అతడు అనేక విద్యలు నేర్చినవాడు. ముఖ్యంగా ఖడ్గ విద్యలో అతణ్ణి మించిన
వాళ్ళు ఆ చుట్టుపక్కల మరెవ్వరూలేరు. అతడి తండ్రి పేరు మోసిన వ్యాపారి.
దురదృష్టవశాత్తూ ఆయనా, భార్యా ఒక ఓడ ప్రమాదంలో మరణించారు. వాళ్ళు
మిగిల్చిపోయిన ధనాన్ని శశికాంతుడు, మరికొందరు వ్యాపారులతో కలిసి,
వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు.
ఐతే,
వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేని అతణ్ణి, ఆ వర్తకులు మోసగించి కట్టుబట్టలతో
మిగిల్చారు. ఈ దుర్భరపరిస్థితుల్లో, జయూనందుడనే పక్క గ్రామం మిత్రుడు
శశికాంతుణ్ణి చూడవచ్చి, ‘‘శశికాంతా! నీవు ఖడ్గవిద్యలో అసాధారణమైన
శక్తిమంతుడివి. ఈ గ్రామానికే పరిమితమైతే ఆ విద్యలో రాణించలేవు. బయల్దేరి మన
రాజధాని కరివీరపురం వెళ్ళు.
అక్కడ జరగనున్న
విజయదశమి పోటీలలో పాల్గొని, నీ ఖడ్గ విద్యానైపుణ్యం చూపావంటే తప్పక
రాజాస్థానంలో ఉద్యోగం దొరుకుతుంది,'' అని అతణ్ణి ప్రోత్సహించాడు.
జయూనందుడిచ్చిన సలహాకు చాలా సంతోషించిన శశికాంతుడు, ఆ మర్నాటి ఉదయమే
కరివీరపురానికి ప్రయూణమయ్యూడు.
అతడు
మార్గమధ్యంలో వున్న అరణ్యం చేరి, ఎండతాపానికి ఓర్చలేక దారి పక్కనే వున్న ఒక
చెట్టు నీడకు పోయి కూర్చోబోయేంతలో, దాపులనున్న పొదలనుంచి, ‘‘పులి! పులి!
రక్షించండి,'' అన్న కేకవినిపించింది. శశికాంతుడు చప్పున ఒరలో నుంచి
కత్తిలాగి అటుకేసి వెళ్ళాడు. పులి, ఒక ముని మీద దాడి చేయబోతున్నది.
శశికాంతుడు, మునికీ, పులికీ మధ్యగా దూకి, కత్తితో పులి తలమీద బలంగా
కొట్టాడు.
ఆ దెబ్బకు పులి కింద పడిందికాని,
కత్తి శశికాంతుడి చేతి నుంచి జారిపోయింది. అంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ
లేచింది. శశికాంతుడు ఎగిరి పులి డొక్కలో గట్టిగా తన్నాడు. పులి పక్కకు
ఒరిగి మళ్ళీ దాడి చేయడానికి ముందుకు ఉరకబోయేంతలో అతడు, పులి వెనుక కాళ్ళను
ఒడిసి పట్టుకుని విరిచాడు. అంతే! పులి నేలబడి గిలగిలా తన్నుకోసాగింది.
ఇదంతా
గమనిస్తున్న ముని, శశికాంతుడితో, ‘‘ఓయీ, వీరయువకా! నువ్వు గొప్ప సాహసివి.
నీవంటి నిస్వార్థ దయూపరులైన వీరులు చాలా అరుదుగా ఉంటారు. నేనీ ప్రాంతం
వదిలి హిమాలయూలకు పోదలిచాను,'' అంటూ అందుబాటులో వున్న పొద నుంచి ఒక కత్తి
తీసి, ‘‘ఇది మహిమగల ఖడ్గం. అట్లని దుస్సాహసానికి పూనుకోకు. నీలో
ధైర్యసాహసం, ఖడ్గచాలనంలో నేర్పూవున్నప్పుడే ఇది నీకు సాయపడుతుంది!'' అని
ఖడ్గాన్ని శశికాంతుడికిచ్చాడు.
శశికాంతుడు, మునికి పాదాభివందనంచేసి, అక్కడి నుంచి తన ప్రయూణాన్ని
కొనసాగించాడు. చీకటి పడుతున్న వేళ నగరం చేరి, ఒక పూటకూళ్ళ ఇంట వసతి ఏర్పాటు
చేసుకున్నాడు. ఆ మరసటి రోజు విజయదశమి ఉత్సవాలు ప్రారంభమయినై. రాజుగారి
దగ్గరి బంధువు చక్రధరుడనే వాడు కత్తియుద్ధంలో పాల్గొన్నవాళ్ళందర్నీ
ఓడించాడు. ఇందుకు రాజు చాలా సంతోషించి, అతడికి ఖడ్గవీరుడు అన్న బిరుదు
ప్రదానం చేయబోతున్నంతలో శశికాంతుడు, ‘‘మహారాజా! క్షమించండి.
నేనీ పోటీలకు కొంత ఆలస్యంగా వచ్చాను,'' అంటూ ఖడ్గాన్ని ఒరలో నుంచి
లాగిపైకెత్తాడు. ఇది చూస్తూనే చక్రధరుడు ఉగ్రుడైపోతూ, ‘‘ఎవ్వడితగాడు?
పల్లెవాసిలా వున్నాడు. కత్తియుద్ధంలో నా అంతటివాడితో పోటీయూ! ఒకవేళ నేను
ఓడటమే జరిగితే, ఆ క్షణమే రాజ్యం వదిలిపోతాను,'' అంటూ ఒరనుంచి చర్రున
కత్తిలాగాడు. పోటీలు చూడవచ్చిన జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.
రాజు పక్కనే కూర్చుని వున్న ఆయన ఏకైక పుత్రిక మణికర్ణిక మందహాసం
చేసింది. కత్తియుద్ధం ప్రారంభమైంది. చక్రధరుడి కత్తి విసురులను శశికాంతుడు
సునాయూసంగా తిప్పికొట్టడమేగాక, ఒక్క పావుగంట కాలం గడిచేలోగా అతణ్ణి
చిత్తుగా ఓడించి ఖడ్గాన్ని కళ్ళకద్దుకున్నాడు. ఎవరూ ఊహించని శశికాంతుడి
విజయం ప్రేక్షకులతో పాటు రాజునూ, రాకుమారి మణికర్ణికనూ చాలా ఆశ్చర్య
పరిచింది.
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం చక్రధరుడు వెంటనే విజయదశమి ఉత్సవాలను విడిచి
వెళ్ళిపోయూడు. ఆనాటి వరకూ ఖడ్గనైపుణ్యంలో సాటిలేని మేటిగా ప్రసిద్ధిగల
రాజుగారి బంధువు సామాన్య యువకుడి చేతిలో ఓడిపోవడం చూసిన జనం, శశికాంతుణ్ణి
మెచ్చుకుంటూ ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.
రాజు, జనం చేసే కోలాహలం మధ్య, శశికాంతుడికి ఖడ్గవీరుడన్న బిరుదు
ప్రదానం చేసి, అతణ్ణి ఆ సాయంత్రం ఉద్యానవనంలో తనను కలవవలసిందిగా
ఆహ్వానించాడు. రాజు, యువరాణి మణికర్ణిక, ప్రధాన మంత్రి, ఆస్థాన పండితుడు
భవనం చేరాక, రాజు మంత్రితో, ‘‘చక్కని అంగసౌష్ఠవం, వర్ఛస్సూగల ఈ శశికాంతుడు,
ఏదో మారు మూల గ్రామాన్నుంచి పోటీలకు వచ్చానంటున్నాడు.
ఇతడేమైనా విద్యాగంధం కలవాడేనా అన్న సంశయం కలుగుతున్నది!'' అన్నాడు.
దానికి మంత్రి, ‘‘మహారాజా! కొత్తగా నగరానికి వచ్చి పూటకూటి ఇండ్లా,
సత్రాల్లో విడిది చేసే వాళ్ళ గురించి, మన గూఢచారులు అన్ని వివరాలూ
సేకరిస్తారు గదా.ఈ శశికాంతుడు ఒకనాటి సంపన్నకుటుంబంవాడే, కాని కాలవశాన
చితికిపోవడంతో, తన ఖడ్గవిద్యాకౌశలాన్ని ప్రదర్శించి, మన ఆస్థానంలో ఉద్యోగం
సంపాయించేందుకు వచ్చాడు.
ఇతర విద్యల్లో కూడా ఆరితేరినవాడని కూడా తెలిసింది,'' అన్నాడు. ఇది
విన్న రాకుమారి చిరునవ్వు నవ్వుతూ, ఆస్థాన పండితుడికేసి చూసింది. ఆయన
ఆశీర్వదిస్తున్నట్టు చేయివూపాడు. కత్తియుద్ధంలో అందర్నీ ఓడించినవాణ్ణి,
రాకుమారి వివాహమాడుతుందని రాజు ముందుగా ప్రకటించాడు. ఈ పోటీల్లో తప్పక తన
బంధువు చక్రధరుడు విజయుడవుతాడని ఆయన నమ్మకం! అయితే, ఇప్పుడు జరిగింది ఆయన
ఏమాత్రం ఊహించనిది.
ఆ సాయంత్రం రాజూ, యువరాణీ, మంత్రీ, శశికాంతుడూ, ఆస్థానపండితుడూ
ఉద్యానవనంలో సమావేశమైవుండగా, గూఢచారుల నాయకుడు అక్కడికి వచ్చి, అందరికీ
నమస్కరించి రాజుతో, ‘‘మహారాజా! చక్రధరుడు రాజ్య సరిహద్దు ప్రాంతాలకు చేరి,
తిరుగుబాటుకు జనాన్ని కూడగట్టుకోవాలని యత్నిస్తున్నాడు.
శశికాంతుడు, ఒకానొక తాంత్రికుడు ప్రసాదించిన మహత్తుగల కత్తికారణంగానే,
తనను కత్తియుద్ధంలో ఓడించాడనీ, అలాంటి వాడు కానున్న మహారాణి అయిన
మణికర్ణికను వివాహమాడేందుకు యోగ్యుడుకాడనీ ప్రచారం చేస్తూ, తిరుగు బాటుకు
జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు,'' అని చెప్పాడు. ఇది వింటూనే
రాజు ఆశ్చర్యపోయి, ‘‘నా సొంత బంధువే రాజద్రోహానికి ఒడిగట్టడమా!'' అన్నాడు.
అందుకు ఆస్థాన పండితుడు మందహాసం చేస్తూ, ‘‘మహారాజా! అతడు చేస్తున్న
దుష్ర్పచారం మనకు కీడుకాక, మేలే కలిగిస్తుంది. అందులో సందేహం లేదు. కానున్న
మహారాణి భర్త వద్ద మహిమగల ఖడ్గం వున్నదంటే-ఇరుగుపొరుగు శత్రురాజులు
మనరాజ్యం కేసి కన్నెత్తి కూడా చూడలేరు,'' అని, యువరాణీ, శశికాంతులను,
‘‘నేచెప్పింది అర్థమైనట్లేనా?'' అని అడిగాడు. ఇద్దరూ ఆనందంగా తలలూపారు.
బేతాళుడు ఈ కథ చెప్పి ‘‘రాజా, ఆస్థాన పండితుడన్న దాంట్లో ఏదో యుక్తి,
చమత్కారం తప్ప, వాస్తవం ఉన్నట్టు కనబడడం లేదు కదా? శశికాంతుడి ఖడ్గం
మహిమగలదన్న విషయం చక్రధరుడికి ఎలా తెలుసు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా
చెప్పకపోయూవో నీ తల పగిలి పోతుంది,'' అన్నాడు. దానికి విక్రమార్కుడు,
‘‘ఆస్థాన పండితుడన్న దాంట్లో యుక్తీ, చమత్కారాలకు మించిన వాస్తవం కూడా
ఉన్నది! ఓడటమే జరిగితే రాజ్యం వదిలి పోతానని మొదట బీరాలు పలికిన చక్రధరుడు,
తీరా ఓడి పోయూక ఓటమిని భరించలేక, శశికాంతుడి ఖడ్గానికిగల మహిమవల్లనే తను
ఓడిపోయూనని ప్రచారం చేస్తూ, తృప్తి పొందడానికి యత్నించాడు.
అది నిజమైన వీరుడి లక్షణం కాదు. పైగా, స్వార్థం కోసం తిరుగుబాటు
చేయడానికి జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నించడం అతడి దుష్టబుద్ధిని
చాటుతున్నది. ఆస్థాన పండితుడు చెప్పినట్టు అతడి ప్రచారం వల్ల రాజ్యానికి
మేలు తప్ప, హాని జరగదు. స్వశక్తీ, ధైర్యసాహసం, ఖడ్గచాలనంలో నేర్పూ
ఉన్నప్పుడే ఖడ్గం సాయపడగలదని ముని, స్పష్టంగా చెప్పాడు.
అవన్నీ పుష్కలంగా ఉన్న శశికాంతుడికి ఓటమి అన్నది లేదు. అందువల్ల
రాజ్యానికి ఎలాంటి ఆపదారాదు,'' అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే,
బేతాళుడు శవంతో సహా మా
ుమై, తిరిగి చెటె్టక్కాడు.
No comments:
Post a Comment