ఓ పెద్ద సరస్సు. రకరకాల నీటి పక్షులతో కళకళలాడుతూ ఉండేది. అందమైన రాయంచలెన్నో అక్కడ విహరిస్తుండేవి.
ఆ పరిసరాలలో ఉన్న కాకికి హంసలపట్ల అసూయకలిగింది. తెల్లటి ఈకలతో, అవి సుందరంగా ఉన్నాయి. వాటి స్వరాలు వీనుల విందుగా రాగాలు పలుకుతుంటాయి. తానేమో అందంగా లేదు. తన కూత కర్కశంగా ఉంటుంది. హంసల్ని మెచ్చుకునే వాళ్లెవరూ తనవైపు చూడనైనా చూడరు. అందుకే వాటికి అంత గర్వం! వాటి పొగరణచాలన్న గట్టి కోరిక కాకికి కలిగింది.
అది సరస్సు నడుమ వొయ్యారంగా ఈదులాడుతున్న హంసలరాజు తల చుట్టూ ఎగురుతూ, 'ఏమోయ్! నువ్వేనా హంసల రాజువి? నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావ్? ఎందులో నీ గొప్ప? మా కాకులకంటే మిన్నగా నువ్వెగరగలవా? నాతో పందెం కాయి చూద్దాం!' అంది డాంబికంగా.
'నీతో నాకెందుకు పోటీ?' అంది రాజహంస సౌమ్యంగా. 'భయపడుతున్నావా?' అంటూ హేళనగా నవ్వింది కాకి. ఒంటి రెక్కతో కాసేపు, వంకరటింకరగా కాసేపు, పల్టీలు కొడుతూ కాసేపు ఎగిరి చూపించింది. 'చూశావా నా విన్యాసాలు? నువ్వు నన్ను గెలవలేవు' అంది అట్టహాసంగా.
'ఆకాశంలో నాకంటే ఎక్కువ సేపు ఉండగలనన్న నమ్మకం నీకుంటే, పోటీకి సిద్ధమే!' అంది హంస.
ఆ రెండూ ఒక్కసారిగా ఆకాశంలోకి లేచాయి. కాకి వేగంగా ముందుకెళ్లిపోయింది. వెనక వస్తున్న హంసను అపహాస్యం చేసింది.
హంస మెల్లగా ఎత్తులకెగురుతూ, 'ఏదీ, నాలాగా మేఘాలను దాటుకో చూద్దాం' అంది. హంస కంటే తక్కువ కాకూడదని కాకి కూడా పైపైకి పోసాగింది. అప్పటికి అది అలిసి పోయింది. కళ్లు బైర్లు కమ్మాయి. అది గమనించిన హంస 'ఇక నీ వేగం ఏ పాటిదో చూపించు' అంటూ ముందుకు దూసుకుపోసాగింది. ఆ వేగాన్ని అందుకోవడం కాకికి సాధ్యం కాలేదు. చాలా దూరం వెళ్లాక, దానికి రెక్కలాడించడమే కష్టమైపోయింది. గుండె పగిలి పోయేలా రొప్పుతూ, కింద ప్రవహిస్తున్న ఓ నదిలో దబుక్కున పడిపోయింది. 'హంస రాజా! నన్ను కాపాడు. నేను ఓడిపోయాను. నా ధిక్కారాన్ని మన్నించు' అని వేడుకుంది కాకి.
హంస కిందికి వచ్చి, మునిగిపోతున్న కాకిని పైకి లాగి వీపున వేసుకుని దాని గూటికి చేర్చింది. 'అధికులతో పోటీకి దిగటం అనర్థమని తెలిసొచ్చింది..' అంటూ లెంపలు వేసుకొంది కాకి.
కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్

No comments:
Post a Comment