Pages

Sunday, September 9, 2012

రక్షంచిన నీడ


జైలుగదిలో ఒంటరిగావున్న జో ఎర్‌‌డమన్‌ విచారంతో నిండిన తీవ్రమైన ఆలోచనలలో మునిగిపో…ూడు. పట్టణంలోని ప్రముఖ రాజకీ…ు నా…ుకుణ్ణి హతమార్చడానికి ప్ర…ుత్నించాడని అతని మీద నేరం ఆరోపించబడింది. ఆరోజు సా…ుంకాలం జైలుఅధికారి, ఎర్‌‌డమన్‌ను చూడడానికి ఎవరో వచ్చినట్టు అతనికి చెప్పాడు. ఎర్‌‌డమన్‌ తలెత్తి వచ్చిన వ్యక్తికేసి ఆశ్చర్యంగా చూశాడు. ‘‘మిత్రమా, ఆశ్చర్యపడకు. నా పేరు జాన్‌ వాట్సన్‌. న్యా…ువాదిని. నీ తరఫున ఉచితంగా వాదించడానికి వచ్చాను,'' అన్నాడు మధ్య వ…ుస్కుడైన ఆ వచ్చిన వ్యక్తి.
 
ఆ న్యా…ువాది ఈ సంఘటన గురించి ఉద…ుం వార్తాపత్రికలో చదివాడు. 1910 మే 22 ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 2.25 గంటలకు, ఒక రాజకీ…ునా…ుకుడు విల్లీ బానిష్టర్‌, ఎప్పటిలా వాహ్యాళికి వెళ్ళి తిరిగి వస్తూండగా, ఆ…ున ఇంటి ముందు వరండాలో ఒక తోలు సంచీని చూశాడు. ఆ సంచీ నుంచి సన్నటి తెల్ల తీగ, ఆ…ున తలుపు గడి…ుగుండా వెళ్ళడం గమనించాడు. బానిష్టర్‌ వెంటనే పోలీసులను రప్పించాడు.
 
పలువురు అపరాధ పరిశోధకులు వచ్చి, సంచీని తెరిచి చూశారు. లోపల డైనమైట్ స్టిక్‌‌సతో పాటు ఒక పిస్టల్‌ కనిపించింది. ఆ తెల్లటి తీగ పిస్టల్‌ ట్రిగ్గర్‌కు కట్టబడివుంది. వార్తాపత్రికలోని ఈ ఉదంతం న్యా…ువాదిలో అనేక అనుమానాలను రేకెత్తించింది. ఇదంతా ఏదో కావాలనే ఏర్పాటు చేసిన తంతులా ఆ…ునకు తోచింది. ఆ రోజు మధ్యాహ్నానికల్లా నిందితుణ్ణి జైల్లో పెట్టారన్న వార్త రాగానే ఆ…ునలోని అనుమానం మరింత బలపడింది.
 
అందుకే వెంటనే బ…ులుదేరి జైలుకు వచ్చాడు. ‘‘ద…ుచేసి మీ అమూల్య మైన సమ…ూన్ని నాకోసం వృథా చేసుకోకండి. మీ ప్ర…ుత్నాలు ఏవీ ఫలించవు,'' అని కొంతసేపు మౌనం వహించిన ఎర్‌‌డమన్‌, ుళ్ళీ, ‘‘ఆ రాజకీ…ు నా…ుకుణ్ణి నేను ద్వేషించే మాట నిజమే.

ఇటీవలకూడా ఘర్షణపడ్డాను. అన్నిటికీ మించి నాకెవ్వరూ ముందూ వెనకా లేరు. నేరం జరిగిన సమ…ుంలో నేనక్కడ లేదు; మరెక్కడో ఉన్నానని నిరూపించగల సాక్ష్యాధారాలు నావద్ద లేవు. నాకు సా…ుపడే స్నేహితులూ లేరు. జామీనులో విడుదల కావడానికి నావద్ద డబ్బులు కూడా లేవు!'' అన్నాడు నిర్లిప్తంగా. అయినా జాన్‌ వాట్సన్‌ ఆ…ున తరఫున వాదించాలనే నిర్ణయించాడు. ‘‘విచారించకు, నువ్వు అపరాధివి అని నిరూపించడానికి కూడా చాలినన్ని సాక్ష్యాధారాలు లేవు, మిగిలినవన్నీ రేపు కోర్టులో చూసుకుందాం,'' అని ధైర్యం చెప్పి వెళ్ళాడు.
 
మరునాడు కోర్టులో ఏడుగురు సాక్షలు హాజర…్యూరు. మే 22 మధ్యాహ్నం 2.25 గం.లకు సంచీ కనుగొనడానికి ముందు, ఆ రాజకీ…ునా…ుకుడి ఇంటిసమీపంలో జో ఎర్‌‌డమన్‌ను చూసినట్టు అందరూ సాక్ష్యం చెప్పారు. న్యా…ువాది జాన్‌ వాట్సన్‌ మౌనంగా ఊరుకున్నాడు. ఆతరవాత ప్రధాన సాక్షులైన, పొడవాటి తెల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అంతకు ముందు సాక్ష్యం చెప్పిన ఏడుగురూ-ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ ఇంటి పక్కగా నడిచి వెళ్ళడం చూసినట్టు చెప్పారు.
 
అక్కచెల్లెళ్ళయిన ఆ అమ్మాయిలు చెప్పిన సాక్ష్యం ఇలా ఉంది: మే 22 ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 1.50 గం.లకు వాళ్ళు చర్చి నుంచి ఇంటికి తిరిగివస్తూ, విల్లీ బానిష్టర్‌ ఇల్లు ఉన్న వీధిగుండా వెళ్ళారు. ఆ సమ…ుంలో వాళ్ళకు జో ఎర్‌‌డమన్‌, భవనం వెనకవున్న సందుగుండా వేగంగా వెళుతూ కనిపించాడు. అతని కుంటి నడక, గళ్ళచొక్కా, నీలంరంగు టోపీ కూడా వాళ్ళకు గుర్తున్నాయి. బాక్‌‌సలో కూర్చున్న ఖైదీ, గళ్ళ చొక్కాతోనే ఉన్నాడు. హాల్లో నడవమన్నప్పుడు కుంటుతూనే నడిచాడు.
 
నీలం టోపీ చూపగానే అది తనదే అని వెంటనే అంగీకరించాడు. విచారణ ముగిసినటే్ట అనిపించింది. నిందితుడి తరఫున్యా…ువాది జాన్‌ వాట్సన్‌ గాఢంగా నిట్టూర్చాడు. అయితే ఆ…ున నమ్మకాన్ని కోల్పోలేదు. ప్ర…ుత్నించి చూడాలనే నిర్ణయించాడు. లేచి నెమ్మదిగా అక్క చెల్లెల్ని సమీపించాడు. ‘‘మీరు చర్చినుంచి వెలుపలికి రాగానే ఏంచేశారో చెప్పండి,'' అన్నాడు.

‘‘ఫోటోలు దిగాము,'' అన్నారు అక్కచెల్లెళ్ళు. ‘‘అందుకు ఏ స్టూడిెూకన్నా వెళ్ళారా?'' ‘‘లేదు. వృద్ధుడైన ఆ పూజారి ద…ుతో ఫోటో తీశారు. మేము చర్చిముందు నిలబడ్డాము. అంతే.'' ‘‘ఆ ఫోటో మీ దగ్గరున్నదా?'' ‘‘ఉంది. ఇదిగో నాసంచీలోనే ఉంది. కావాలంటే దీనిని మీరే ఉంచుకోండి. మా దగ్గర ఇంకో కాపీ ఉంది.'' ఈ సమ…ుంలో న్యా…ుమూర్తి, విరామం ప్రకటించాడు. జాన్‌ వాట్సన్‌ పక్కన ఉన్న పార్కులోకి వెళ్ళి చెట్టుకింద కూర్చుని, ఫోటోను పరిశీలనగా చూశాడు.
 
తెల్లటి పొడవాటి దుస్తులతో అమ్మాయిలు చర్చి ముందు నిలబడి ఉన్నారు. కల్లాకపటం తెలి…ుని ఆ పిల్లలు చెప్పిన సాక్ష్యంతో కేసు ముగిసినటే్ట అయింది. అందులో నుంచి ఏదైనా తెలి…ువస్తుందేమో అన్న ఆశతో ఆ ఫోటో కేసి అతడు మళ్ళీమళ్ళీ చూశాడు. ఆ ఫోటోలోని చాలా స్వల్పమైన విష…ుం ఆ…ున దృష్టిని హఠాత్తుగా ఆకర్షించింది. ఆ…ున మనసులో రకరకాల ఆలోచనలు రాసాగాయి. అయినా అసలు సంగతి పట్టుబడడం లేదు.
 
ఆ ఫోటోను తీసుకుని చర్చి వద్దకు వెళ్ళి దాని ముందు నిలబడ్డాడు. ఆ…ున తలపైన ఎంతో ఎత్తులోవున్న చర్చి గోపురం గడి…ూరం రెండు సార్లు మోగింది. జాన్‌ వాట్సన్‌ అక్కడినుంచి కారులో ప్రెూగశాలను చేరుకున్నాడు. ఆ…ున అక్కడ ఖగోళ శాస్ర్తజ్ఞుణ్ణి కలిశాడు. వెంటనే న్యా…ుస్థానానికి తిరిగివచ్చి, తనకు నూతన సాక్ష్యాధారం లభించిందనీ, రేపటి వరకు వాయిదా కావాలనీ కోరాడు.
 
జాన్‌ వాట్సన్‌ ఏదో కొత్త విష…ూన్ని బ…ుటపెట్టనున్నాడన్న వార్త అంతటా వ్యాపించడంతో, మరునాడు ఉద…ుం న్యా…ుస్థానంలో జనం కిటకిటలాడుతున్నారు. ప్రతివాది తరఫున తొలి సాక్ష్యాన్ని పిలిచారు. ఆ…ున పొట్టిగా, లావుగా చిన్న గడ్డం, నెరిసిన మీసంతో ఉన్నాడు. ‘‘అ…్యూ, తమరు విశ్వవిద్యాల…ుంలో ఖగోళశాస్ర్త ఉపన్యాసకులు కదా?'' ‘‘అవును. ప్రధాన ఉపన్యాసకుణ్ణి.'' ‘‘ఇక్కడ ఒక ఫోటో వుంది. ద…ుచేసి దానిని పరిశీలించి చూసి, ఆ ఫోటో ఎప్పుడు తీ…ుబడిందో సమ…ుం సరిగ్గా చెప్పగలరా?''

‘‘చెప్పగలను. సమ…ుమే కాదు. ఏరోజు తీ…ుబడిందో కూడా చెప్పగలను!'' ‘‘అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?'' ఖగోళశాస్ర్తజ్ఞుడు తన గడ్డాన్ని సవరించు కుంటూ, ‘‘అది చాలా సులభం. ఈ ఫోటోలో నీడ వుంది చూశారూ. చర్చిగోపురం నీడ. ఆ నీడ ఏర్పరచిన కోణాన్ని లెక్కగట్టి, అప్పుడు సమ…ుం ఎంతో సరిగ్గా చెప్పగలను!'' ‘‘చెప్పండి మరి. సరిగ్గా ఏ సమ…ుంలో ఆ ఫోటో తీ…ుబడింది?'' ‘‘1910 మే 22 తేదీ మధ్యాహ్నం 3.10 గం.లకు కెమెరా క్లిక్‌ మన్నది!''
 
నిపుణుడు అందించిన ఈ సాక్ష్యాధారం వల్ల, అంతకు ముందు ఏడుగురు చెప్పిన సాక్ష్యాలూ, తెల్ల దుస్తుల ఇద్దరు అమ్మాయిల మాటలూ నిలబడలేక పో…ూయి. అనేక సందేహాలకు లోన…్యూయి. వాళ్ళ జ్ఞాపక శక్తిని అనుమానించవలసి వచ్చింది. నిందితుణ్ణి వాళ్ళు చూసినమాట ఒకవేళ వాస్తవమే అయినప్పటికీ, అది సంచీ దొరికిన మధ్యాహ్నం 2.25 గం.లకు పిమ్మట నలభై అయిదు నిమిషాలు గడిచిన తరవాతే అన్న సంగతి తేటతెల్లమయింది.
 
ఖగోళ శాస్ర్తజ్ఞుణ్ణి మళ్ళీ ప్రశ్నించడానికి ఎవరూ సాహసించలేక పో…ూరు. ఆ…ున లెక్కలూ, సాక్ష్యాలూ నిక్కచ్చిగా ఉంటా…ుని అందరూ నమ్మారు. అంతకు ముందు రాత్రి అతడెన్నోలెక్కలు వేశాడు. ఒక నిరపరాధిని శిక్ష నుంచి రక్షంచే అవకాశాన్ని జారవిడుచుకో కూడదన్న లక్ష్యంతో పొద్దున కోర్టుకు రావడానికి ముందు చర్చి దగ్గరికి వెళ్ళి అన్నిటినీ మరొక్కసారి క్షుణ్ణంగా పరిశీలించివచ్చాడు.
 
ఆఖరికి నిందితుడు నిరపరాధి అని నిర్ణయించి విడుదల చే…ుబడ్డాడు. అయినా, కొందరు కేవలం ఫోటోలోని నీడకోణం సమ…ూన్ని నిర్ణయించగలదన్న సంగతిని నమ్మలేకపో…ూరు. అలాంటివారు, ఒక సంవత్సరం తరవాత, సరిగ్గా అదేరోజు, అదే సమ…ూనికి చర్చిముందు నిలబడి ఫోటోలు దిగారు. అప్పుడు వాళ్ళ ఫోటోలలోని చర్చిగోపురం నీడ కోణం - తెల్లటి దుస్తుల ఇద్దరమ్మాయిల ఫోటోలో ఉన్న గోపురం నీడ కోణంలోనే ఉంది!

No comments:

Post a Comment