పెసరపాడు గ్రామాధికారి భూషయ్య ఏడేళ్ళ కూతురు కమల తండ్రి వద్దకు వచ్చి
‘నాన్నా రహస్యం అంటే ఏమిటీ’ అనడిగింది. ‘ఎందుకూ?’ అనడిగాడతను. కమల తన
స్నేహితురాలు వనజ ఇంట్లో ఆడుకుంటూంటే, ఒకావిడ వచ్చి వనజ తల్లితో, ఏదో
చెప్పబోయింది. అప్పడు వనజ తల్లి పిల్లలతో, ‘రహస్యాలు పిలలు వినకూడదు. బైటకు
వెళ్ళి ఆడుకోండి.’ అంది. ‘ సమాచారం, రహస్యం అంటే ఏమిటి నాన్నా ?
అనడిగింది. కమల.
భూషయ్య ‘ వాటి అర్థం తరువాత చెబుతాను కాని, ముందు నువ్వు రచ్చబండ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వారందరితోనూ సాయంత్రం నేను మామిడితోపు దగ్గరకు రమ్మన్నానని చెప్పిరా, అన్నాడు.
కమల వెంటనే పరుగెత్తుకు వెళ్ళి చెప్పి వచ్చింది. కాసేపటి తరువాత భూషయ్య కొబ్బరితోటకు వెళ్తూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. త్రోవలో ఓ ఇంటి వద్ద ఆగి, ఆ ఇంటి ఆసామీని పిలిచాడు. అతను బైటకు రాగానే, గొంతు తగ్గించి, ‘ వచ్చే నెలలో పెసర వెల పెరగబోతున్నట్లు సమాచారం అందింది. తొందరపడి నీ పంటంతా చవగ్గా అమ్మేయకు, ఈ సంగతి ఎవరికి చెప్పకు’ అన్నాడు. భూషయ్య.
కొంతదూరం వెళ్ళాక మరోవ్యక్తి కనిపిస్తే అతన్ని పక్కకు పిలిచి, ముందు వ్యక్తికి చెప్పినట్టే చెప్పాడు. భూషయ్య. త్రోవ పొడువునా మరో అరడజనుమందికి అలాగే చెప్పాడు. అదంతా గమనిస్తూన్న కమల విస్తుపోతూ, అదేంటి నాన్నా, ఎవరికి చెప్పొద్దంటూ అందరికి నువ్వే చెప్పేశావు.? అనడిగింది.
భూషయ్య నవ్వి, రహస్యమంటే ఇదేనమ్మా? ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కక్కరికే చాటుగా చెప్పేదే రహస్యం!’ అన్నాడు. సమాచారమంటే భాహుటంగా పదిమందికి తెలియపరచేది. నువ్వు రచ్చబండకు వార్తమోసుకుపోలా? అదన్నమాట,’ రహస్యమంటే ఇధా! అంటూ బుర్ర గోక్కుంది కమల. భూషయ్య నవ్వి, కొబ్బరి బొండాలు దింపించి తీయటి కొబ్బరినీటిని కమలకు ఇప్పించాడు.

No comments:
Post a Comment