ఒకసారి అక్బర్ దర్భారులో ఉన్నవారికి ఒక వింత ప్రశ్నవేశాడు. మన పట్టణంలో
గ్రుడ్డివారు ఎక్కువ మంది ఉన్నారా లేకు మంచివారు ఎక్కువ మంది ఉన్నారా ? అని
సభలోని వారంతా మంచివారే ప్రభూ అని సమాదానం ఇచ్చారు. బీర్బల్ మాత్రం మన
పట్టణంలో గ్రుడ్డివారే ఎక్కువ మంది ఉన్నారు ప్రభూ. మన పట్టణమే కాదు. ఈ
ప్రపంచంలో గ్రుడ్డివారు ఎక్కువ అని సమాదానం ఇచ్చాడు. అలా ఎలా చెప్పగలవు అని
ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బర్. ఇప్పటికి ఇప్డు దీనికి నేను సమాధానం
చెప్పలేను గానీ, నాకు ఒక రెండు రోజులు గడువు ఇస్తే మీకు ఋజువుతో
గ్రుడ్డివారే ప్రపంచంలో ఎక్కువ అని నిరూపిస్తాను అని వినయంగా పలికాడు
బీర్బల్.
ఆ మర్నాడు బీర్బల్ ఊళ్లో జన సంచారం ఎక్కువగా ఉండే నాలుగు దారుల కూడలి దగ్గర కూర్చున్నాడు. అతని చుట్టూ పాత చెప్పులు ఉన్నాయ్. బీర్బల్ ఒక తెగిన చెప్పును చేతిలోకి తీసుకుని దాన్ని కుడుతూ కూర్చున్నాడు. ఆ దారిన పోయే ప్రతి ఒక్కరూ బీర్బల్ గారూ , అక్కడ కూర్చుని మీరే చేస్తున్నారు ? అని అడుగుతూ ఉన్నారు. అలా అడిగిన ప్రతి ఒక్కరి పేరూ, చిరునామా బీర్బల్ పక్కనే కూర్చుని, ఆయనచే నియిమించబడ్డ ఒక వ్యక్తి రాసుకుంటున్నాడు. సాయంత్రం పూట అక్బర్ వ్యాహ్యాళికి ఆ దారిన వెళ్తూ చెప్పులు కుడ్తున్న బీర్బల్ ని చూశాడు. ఏంటీ బీర్బల్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. అంటే, అక్బర్ పాదుషా పేరు కూడా పక్కన కూర్చున్న వ్యక్తి రాసుకున్నాడు.
ఆ మర్నాడు బీర్బల్ మామూలు ప్రకారం దర్బారుకి వెళ్లాడు. ప్రభూ పట్టణములోని కొంతమంది. గుడ్డివారి జాబితా నేను తయారు చేశాను చూడండి అంటూ తాను చెప్పులు కుడ్తున్నపుడు ఏం చేస్తున్నారు అని అడిగిన వారి పేర్లు జాబితాని అక్బర్ కి ఇచ్చాడు. అక్బర్ అందులోని పేర్లు చూశాడు. చివరగా తన పేరుకూడా అందులో ఉండటం చూశాడు. బీర్బల్ ఏమిటిది ? ఇందులో నా పేరు కూడా ఉందే ? అని కాస్త కోపంగా అడిగాడు. అందుకు నన్ను మీరు మన్నించాలి. నిన్న నేను పట్టణ కూడలిలో కూర్చుని చెప్పులు కుడ్డూవుంటే చూసి కూడా ఏమి చేస్తున్నారు అని అడిగారు. చివరికి మీరు కూడా నన్నీ ప్రశ్న అడిగారు. చివరికి మీరు కూడా నన్నీ ప్రశ్న అడిగారు. కాబట్టి ఆ జాబితాలోని వారందరూ గుడ్డివారే కదా ప్రభూ. నా ఉద్దేశంలో వాళ్ళంతా కళ్ళున్న గ్రుడ్డివారు ! బీర్భల్ ఋజువుతో సహా అంత తెలివిగా సమాదానం చెప్పినందుకు అక్బర్ సంతోషించి సత్కరించాడు.

No comments:
Post a Comment