అనగ అనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సింహం. పులి ప్రాణ స్నేహితులుగా ఉండేవి.
రెండూ వేరు వేరు జాతులకు చెందినవి కదా, వాటి మధ్య స్నేహమేమటి ? అని సందేహం
కలగవచ్చు. అదే మరి విచిత్రం. అవి ఊహ తెలియని వయసునుంచి అంటే పులి, సింహం
అనే తేడాలేవి తెలియని వయసునుంచే స్నేహితులయ్యాయి. కాలం గడిచేకొద్దీ వాటి
మధ్య స్నేహం మరింత బలపడింది. దానికి తోడు అవి నివసించే పర్వత ప్రాంతం ఎంతో
ప్రశాంతంగా ఉండేది. ఆ సమయంలోనే ఒక సన్యాసి ఉండేవాడు.
ఆయన సాత్విక, ప్రశాంత వైఖరి కూడా పులి, సింహాలపై ప్రభావం చూపిందని అనుకోవచ్చు. ఇలా ఏ చీకు చింతా లేకుండా కాలం హాయిగా సాగిపోతుండగా ఒక రోజు సింహం, పులి పిచ్చాపాటీ మాట్లాడుకోసాగాయి. కబుర్లు అలా అలా సాగి ‘ చలి ’ వైపు మళ్ళాయి. పులి ఇలా అంది ‘‘ చలి ఎప్పుడు వస్తుందో తెలుసా, పున్నమి నుంచి చంద్రుడు అమావాస్య దిశగా క్షీణించే కాలంలో చలి పెరుగుతుంది ఇలా చాలామంది అనుకోగా విన్నాను.’’ సింహ అందుకొని ‘ చాల్లే ఆపు నీ అర్థం లేని మాటలు, ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది ఒక దారని సామెత ఉందిలే. అలా ఉంది నువ్వు చెప్పేది.
అందరూ అనేది అమావాస్య నుంచి చంద్రుడు పున్నమి దిశగా వృద్ది చెందే దశలో చలి గిలిగింతలు పెడుతుందని నువ్వెక్క విన్నావో ఆ లోకవిరుద్దమైన మాటలు అంది. అంతే ఆ రెండిటి మధ్య మాటమీద మాట పెరిగి అదొక వివాదంగా ముదిరింది. ఒకరి మాటను మరొకరు అంగీకరించటానికి సిద్దంగా లేరు. చిలికి చిలికి గాలివాన అన్న చందంగా పరిస్థితి మారింది. తామిద్దరూ మంచి మిత్రులు. ఇప్పుడే గొడవ మొదలైంది ఇక దీనికి పరిష్కారమేమిటి ? అని ఆ రెండూ అనుకున్నాయి.
వాటికి చటుక్కన సన్యాసి గుర్తుకు వచ్చాడు. ‘ ఆ! మహానుభావుడికి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి ఆయననే అడిగితే సరి’ అనుకొని రెండూ సన్యాసి దగ్గరకు వెళ్ళి, గౌరవభావంతో తలవంచి నమస్కరించాయి. ఆ తర్వాత తమ వివాదాన్ని వివరించి ‘‘ ఇపుడు మీరు చెప్పండి స్వామీ వాస్తవమేమిటో’’ అన్నాయి. అంతా విన్న సన్యాసి కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ‘ అమావాస్య నుంచి పున్నమి లోపల అయినా, పున్నమి నుంచి అమావాస్య లోపల అయినా ఎప్పుడయినా చలి రావచ్చు.
కాబట్టి ఈ విధంగా చూస్తే మీ ఇద్దరి మాటలూ సరైనవే, ఎవరూ, ఎవరి చేతిలో ఓడిపోయింది లేదు. వీటన్నింటికంటే ముఖ్య విషయమొకటి మీరు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే తగవులూ లేకుండా కలిసి మెలిసి ఉండటం. ఏ రకంగా చూసినా ఐకమత్యమే ఉత్తమం’’ సింహం, పులి ఆ మాటల అసలు అర్థాన్ని గ్రహించాయి. తమ స్నేహం చెడిపోనందుకు అవి ఎంతో సంతోషించాయి. ఈ కథలోని నీతి : వాతావరణంలో మార్పులు రావచ్చు. కానీ చెలిమి మాత్రం చెక్కు చెదరకుండా నిలుపుకోవాలి.

No comments:
Post a Comment