ఒకరోజు దర్బారులో అందరూ కూర్చుని ఉన్నారు. అందరూ అక్బర్ రాక కోసం
ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో అక్బర్ రానే వచ్చాడు. రాగానే తన సింహసనంలో
కూర్చుంటూ సభలోని వారిని ఇలా అడిగాడు. ‘నిన్న ఒకరు నా మీసాలు లాగి, గడ్డం
పట్టుకుని పీకాడు. వాడిని ఏం చేయాలి ? అది వినగానే సభలోని వారంతా ‘‘ హవ్వా
హవ్వా! ఎంత అపచారం? అన్నారు.
‘‘ వాడిని దేశం నుండి బహిష్కరించండి’’ అని ఒకడు అన్నాడు. ‘‘ వాడిని జీవితాంతం ఖైదులో ఉంచండి.’’ అని మరొకరు అన్నాడు ఇలా ఆవేశంగా తలోక శిక్ష వెయ్యమని అందరూ అరవసాగారు. బీర్బల్ మాత్రం లేచి నలబడి ‘‘ ప్రభూ! మీతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు తినిపించండి. వాడికి మీ ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వండి’’ అన్నాడు వినయంగా.
‘‘ బీర్బల్ గారూ! ప్రభువుతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు పంచి ఆస్తి రాసివ్వాలా, మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా?’’ అని సభలోని కొందరు బీర్బల్ మాటలకి అభ్యంతరాన్ని తెలియజేశారు. అప్పడు బీర్బల్ చిరునవ్వుతో పాదుషా వారితో అలా ప్రవర్తించే చనువు కేవలం మనవడికి లేదా మనవారిలికి మాత్రమే ఉంటుంది. అందుకే అలా అన్నాను’’ అన్నాడు.
‘నిజమే! నన్ను నా మీసాలు లాగి నా గడ్డాన్ని పీకింది నా మనవడే!’’ అని నవ్వుతూ పలికాడు అక్బర్. బీర్బల్ తెలివితేటల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు అక్బర్.

No comments:
Post a Comment