అనగనగా వారణాసిలో ఒక వృద్దుడు ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన స్నేహితుడు
ఉండేవాడు. వృద్దుడి బార్య పడుచుది. అందమైంది. కూడా వృద్దుడికి ఒక కొడుకు
పుట్టాడు. కుమారుడంటే వృద్దుడికి పంచప్రాణాలు. ఒక రోజు వృద్దుడికి ఒక ఆలోచన
కలిగింది. ఈ పడుచు భార్యను నమ్మడానికి లేదు. నేను గనుక చనిపోతే, ఈమె
తప్పకుండా మరో పెళ్ళి చేసుకుంటుంది. తను కష్టపడి, కూడబెట్టిన సంపదంతా వారి
విలాసాలకే ఖర్చు చేస్తారు. పిల్లవాడికి ఏమీ మిగలదు. కాబట్టి ఈ పసివాడికోసం
సంపదంతా ఒకచోట రహస్యంగా పాతిపెట్టడం మంచిది. అలా అనుకోగానే నమ్మకస్తుడైన
సేవకుడు నందుడిని పిలిచాడు. ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళి సంపదంతా ఒక చోట
పాతిపెట్టారు ఆ తర్వాత వృద్దుడు, సేవకుడితో ఇలా అన్నాడు :
నందా ! నువ్వేంతో మంచివాడివి, నమ్మకపాత్రుడివి. నేను చనిపోయాక ఈ నిధిని, నా కుమారుడికి అప్పగించే బాధ్యత నీదే. ఈ సంపధను తెలివిగా, సద్వినియోగం చేయవలసిందిగా మా వాడడికి నా మాటగా చెప్పు. అలాగేనయ్యా అన్నాడు నందుడు. ఆ తర్వాత కొద్దికాలానికే వృద్దుడు మరణించాడు. కొన్నెళ్ళకు అతడి కుమారుడి చదువు పూర్తయింది. ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లి, కుమారుడితో ఇలా అంది, అబ్బాయి! అనుమానపు మనిషి అయిన మీ నాన్నగారు నా మీద అపనమ్మకంతో, సంపదనంతా ఎక్కడో దాచి ఉంటాడు. ఆ సంగతి నందుడికి తెలిసే ఉంటుందని నానమ్మకం. నువ్వు వాడినడిగి ఆ విషయం తెలుసుకో ఆ సంపద లభిస్తే నువ్వు చక్కగా పెళ్ళి చేసుకుని, ఇంటి బాధ్య సమర్ధవంతంగా నిర్వహించవచ్చు.
కుమారుడు, తల్లి చెప్పినట్లు నందుడిని, తండ్రి దాచిన సంపద గురించి అడిగాడు, నందుడు సంపదనంతా అడవిలో పాతిపెట్టారని, ఆ చోటు తనకు తెలసుననీ చెప్పాడు. ఇద్దరూ ఒక గంప, పార తీసుకుని అడవికి వెళ్లారు. ధనం దాచిన చోటుకు చేరుకోగానే ఒక్కసారిగా నందుడి వైఖరి మారిపోయింది. తాను కేవలం సేవకుడే అయినా, నిధి రహస్యం తెలిసిన ఏకైక వ్యక్తి కనుక కుమారుడికన్నా తానే గొప్ప అన్న ఆహాంకారం తలెత్తింది. దాంతో ఛీ నీ పుట్టుకే నీచమైంది. నీకు నిధి దక్కటమా ? అంటే అవాకులూ, చవాకులూ వాగాడు. నెమ్మదస్తుడైన కుమారుడు ఆ మాటలకు నొచ్చుకున్నాడు. తిరిగి ఏమీ అనలేదు.
నందుడి ప్రవర్తన అతనికి వింతగా తోచింది. కొద్దిసేపటకి వారు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఇద్దరూ అడవికి వెళ్ళారు. రెండుసార్లూ నందుడు అలాగే ప్రవర్తించాడు. కుమారుడు ఇలా అనుకున్నాడు. ఇదేమిటి, నందుడు ఇంటి దగ్గర బాగానే ఉంటాడు. నిధి ఉన్నచోట చెపుతానంటారు. తీరా అక్కడికి వెళ్ళగానే మారిపోతున్నాడు. ఆ అన్నట్లు నాన్నగారి మిత్రుడు ఒకరున్నారు ఆయన చాలా తెలివైనవారు. ఆయనను అడిగితే సరి అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆయనతో జరిగినదంతా వివరించాడు.
ఆయన శ్రద్దగా విని ఇలా అన్నాడు. నువ్వు నందుడితో కలిసి మళ్ళీ అడవికి వెళ్లు అతడు నిన్ను దూషించే అధికారం అతనికి లేదని కోప్పడి, అక్కడినుంచి పంపించు. ఆ తర్వాత ఆ చోటులో నువ్వే తవ్వి చూడు. నిధి తప్పకుండా దొరుకుతుంది. నందుడిలో మానసిక బలహీనత ఉంది. అందుకే తన ప్రాముఖ్యత గుర్తుకు రాగానే అహంబావంతో ప్రవర్తిస్తున్నాడు. కుమారుడు ఆయన దగ్గర సెలవు తీసుకుని, ఆయన చెప్పినట్లుగానే చేశాడు. నిధి లభించింది. తండ్రి కోరుకున్నట్లుగానే ఆ సంపధను సద్వినియోగం చేశాడు.

No comments:
Post a Comment