బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, ఒకప్పుడు బోధిసత్వుడు, ఒక
గ్రామంలో చర్మకారుడుగా జన్మించాడు. ఆయన తన వృత్తిధర్మం నిర్వహించుకుం
టూనే, ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి, ఒక అపూర్వ మైన మంత్రం నేర్చుకున్నాడు. ఆ
మంత్రశక్తితో చర్మకారుడైన బోధి సత్వుడు అకాలంలో మామిడి పళ్ళు చెట్లకు
కాయించేవాడు.
ఆయన రోజూ ఉదయూనే ఒక కొంకి కర్ర భూజాన వేసుకుని, అడవిలో వున్న ఒక
మామిడిచెట్టు వద్దకు వెళ్ళేవాడు. అక్కడ చెట్టుకు ఏడడుగుల దూరాన నిలబడి
మంత్రం పఠించేవాడు. తరవాత కొమ్మల మీద మంత్రజలం చల్లేవాడు. ఆ వెంటనే, మామిడి
కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూతపూసి, కాయలు కాసేవి. ఒకరోజున ఆయన మామిడి
చెట్టుకు ఇలా కాయలు కాయిస్తూండగా, దర్భలకై అడివికి వచ్చిన సునందుడు అనే ఒక
బ్రాహ్మణ కురవ్రాడు చూశాడు.
అతనికి చదువు సంధ్య లేమీ అబ్బలేదు. కాని, ఏ దేవి కృపవల్లో క్షణాల మీద
పండితుడైపోవాలనీ; వెండీ, బంగారాలతో తులతూగాలనీ కలలు కంటూండేవాడు.
బోధిసత్వుడు అడవి నుంచి ఇంటికి రాగానే, సునందుడు ఆయన కొంకికర్రా,
మామిడిపళ్ళ మూటా అంది పుచ్చుకుని, తరవాత, ఆయనతో తాను ఫలానా అని చెప్పుకుని,
ఆనాటి నుంచీ ఇంటి పనులన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు.
ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు బోధిసత్వుడు భార్యతో, ‘‘ఈ కురవ్రాడు
మనలను ఎందుకు ఆశ్రయించాడో తెలుసా? వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే
మంత్రం నేర్చుకోవాలని ఆశగా వున్నది. వాడు చాలా దురాశాపరుడు. నేను దయతలచి
మంత్రం నేర్పినా, వాడికి అది ఎంతోకాలం మేలు కలిగించదు,'' అన్నాడు.
సునందుడు ఇంట్లో అంటి పెట్టుకొని వుంటూ, తలలో నాలుకలా మసులు కోవడం
చేత, బోధిసత్వుడి భార్యకు అతడంటే జాలి కలిగింది. ఆమె భర్తతో, ‘‘ఈ పిల్లవాడు
మన ఇంట అడ్డమైన పనులూ చేస్తూ, కన్న కొడుకు కంటె ఎక్కువ అణుకువగా
వుంటున్నాడు. మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది? ఒకవేళ అలా
జరిగితే దోషం వాడిదే అవుతుంది! మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించక
తప్పదు,'' అన్నది.
బోధిసత్వుడు కొంచెం ఆలోచించి, భార్య మాటల్లోని ఇంగితాన్ని గుర్తించి,
సునందు డికి మంత్రం ఉపదేశిస్తానన్నాడు. ఆ మర్నాడు ఆయన సునందుణ్ణి పిలిచి,
‘‘నాయనా, ఇది చాలా న్యాయమార్గాన ఉప యోగించుకున్నావంటే ధనమూ, కీర్తీ రెండూ
లభిస్తాయి. కాని, ఒక సంగతి గుర్తుంచుకో! దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు?
అన్న ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రం, రహస్యం వెల్లడించకూడదు.
రహస్యం వెల్లడించావో, ఆ క్షణం నుంచీ మంత్రపటిమ అంతరించి పోతుంది,''
అని చెప్పి, మంత్రం ఉపదే శించాడు. సునందుడు మంత్రం నేర్చుకుని ఇల్లు చేరి,
అకాలపు మామిడిపళ్లు సృష్టిస్తూ, వాటిని విక్రయించి ధనం సంపాయించ సాగాడు.
సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి పళ్ళలో ఒకటి, కాశీరాజుకు చేరింది. ఆయన
ఆశ్చర్యపడి, వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి, సునందుడని
తెలియగానే, అతణ్ణి పిలిపించాడు. ‘‘ఋతువు కాని ఋతువులో, ఈ మామిడి పళ్ళు
నువ్వెక్కడి నుంచి తెస్తున్నావు?
ఇవి దైవసృష్టా? మానవసృష్టా? అసలు విషయం ఏమిటో దాచకుండా నిజం చెప్పు,''
అని రాజు సునందుణ్ణి అడిగాడు. సునందుడు, రాజుతో మహానందంగా, ‘‘మహారాజా!
నేను విక్రయించే ఈ మామిడి పళ్లు, నేను సృష్టిస్తున్నవి. నా కొక మహా మంత్రం
తెలుసు!
దాని మహిమ వల్లనే, నేను అకాలంలో మామిడి చెట్లకు కాయలు కాయి
స్తూంటాను,'' అన్నాడు. ఈ జవాబుకు రాజు మరింతగా ఆశ్చర్య పోతూ, ‘‘అలాగా! ఆ
మంత్ర పటిమ ఎలాం టిదో స్వయంగా చూడాలని కోర్కెగా వున్నది. నా ఉద్యానవనంలోని
చెట్లకు, నీ మంత్ర మహిమతో కాయలు కాయించగలవా?'' అన్నాడు.
సునందుడు సంతోషంగా ఇందుకు ఒప్పు కున్నాడు. మర్నాడు రాజూ, పరివారం వెంట
రాగా ఉద్యానవనంలోకి వెళ్లాడు. అక్కడ ఒక చెట్టుకు ఏడడుగుల దూరంలో నిలబడి
మంత్రం పఠించి, కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు. వెంటనే
చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు కింద రాలినై. ఈ అద్భుతం చూసి రాజూ,
ఆయన పరివారం అమిత ఆశ్చర్యం పోందారు. వాళ్ళు పళ్ళను ఏరి తెచ్చుకుని తిని
చూశారు. అద్భుతమైన రుచి.
రాజు, సునం దుణ్ణి ఘనంగా సన్మానించి, ‘‘ఇంత గొప్ప శక్తిగల మంత్రాన్ని,
నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు?'' అని ప్రశ్నించాడు. సునందుడికి ఏమి
చెప్పడానికీ పాలు పోలేదు. నిజం వెల్లడిస్తే, మంత్రపటిమ పోతుందని చెప్పిన
గురువు మాటలు అతడికి జ్ఞాపకం వున్నవి. ఐనా, కంఠతా వచ్చిన మంత్రానికి పటిమ
పోవడం ఏమిటి? ఇవన్నీ గురువుగారి భేషజపు పలుకులు అనుకుని, రాజుకు తాను
మంత్రం ఎక్కడ నేర్చుకున్నదీ చెప్పేశాడు.
రాజు హేళన చేస్తూ నవ్వి, ‘‘ఇంత పటిమగల గొప్ప మంత్రాన్ని నువ్వు
నేర్చుకు న్నది చర్మకార వృత్తిలో బతికేవాడి దగ్గరా? బ్రాహ్మడివై వుండీ,
ఇహలోక సౌఖ్యాలుకోరి, స్వధర్మాన్ని మంటగలిపావు. ఇది చాలా నీచమైన పని,''
అన్నాడు. రాజు ఇలా అనేసరికి సునందుడు మాట్లాడ కుండా తల వంచుకుని ఇంటికి
వెళ్ళాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు కాశీరాజుకు మామిడిపళ్ళు తినా లన్న
కోర్కె కలిగింది.
ఆయన సునందుణ్ణి పిలిపించి, సంగతి చెప్పాడు. అందరూ కలిసి తోటలోకి
వెళ్ళారు. సునందుడు ఎప్పటిలా చెట్టుకు ఏడడు గుల దూరంలో నిలబడి మంత్రం పఠించ
బోయూడు. కాని, ఎంతకూ అది స్ఫురణకు రాలేదు. తరవాత ఎంత ప్రయత్నించినా మంత్రం
జ్ఞాపకం రాకపోయేసరికి, తను గురువాజ్ఞ తప్పడంవల్ల, మంత్రం పూర్తిగా
మర్చిపోవడం జరిగిందని తెలుసుకున్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో, సునం
దుడు తాను గురువాజ్ఞను ధిక్కరించడంవల్ల మంత్ర పటిమ పోగొట్టుకున్నానని
చెప్పి, విచారంగా ఇంటికి వెళ్ళిపోయూడు.
No comments:
Post a Comment