బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు తక్షశిలా
నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడుగా జన్మించాడు. తక్షశిలా నగరపు
శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా
విద్యాభ్యాసానికిగాను, ఆయన వద్దకు పంపటం మంచిదని నిర్ణయించాడు. రాజు, తన
కుమారుడికి ఒక జత ఆకు జోళ్ళూ, ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి, ‘‘నువ్వు
తక్షశిలా నగరానికి వెళ్ళి, అక్కడి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి,
విద్య పూర్తికాగానే తిరిగిరా!
ఆయనకు గురు దక్షిణగా ఇవ్వటానికి వెయ్యి వెండి కాసులు వెంట తీసుకుపో,''
అన్నాడు. రాజకుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒంటరిగా బయలుదేరి, వెయ్యి
కాసులుగల మూట మోస్తూ, ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ, నానా అగచాట్లు పడి,
తక్షశిల చేరాడు. అక్కడ అతడు శిల్పాచార్యుణ్ణి దర్శించి, తాను వచ్చిన పని
చెప్పి, ఆయనకు వెయ్యి వెండికాసులూ గురుదక్షిణగా ఇచ్చి, ఆయన వద్ద విద్యా
భ్యాసం ప్రారంభించాడు. అతడి శిల్పవిద్య బాగానే సాగింది.
అతడి తెలివి తేటలకు గురువు చాలా సంతోషించాడు. కొంతకాలం గడిచింది. గురు
శిష్యులు ప్రతి ఉదయమూ ఊరి వెలుపల వున్న నదికి వెళ్ళి స్నానం చేసి
వస్తూండేవారు. ఒకనాడు వారు స్నానంచేసే సమయంలో, ఒక ముస లమ్మ కొన్ని నువ్వులు
తెచ్చి, నీటిలో కడిగి శుభ్రం చేసి, నది ఒడ్డున వస్ర్తం పరిచి, దాని మీద
ఆరబోసింది. రాజకుమారుడు నువ్వులను చూసి, చప్పున స్నానం ముగించి ఒడ్డుకు
వచ్చి, ముసలావిడ పరధ్యానంగా వున్నట్టు కనబడిన సమయంలో, గుప్పెడు నువ్వులు
తీసి నోట పోసుకున్నాడు. అయితే, ముసలమ్మ ఇది గమనించింది, కాని ఏమీ అనలేదు.
మర్నాడు కూడా అలాగే జరిగింది. మళ్ళీ ముసలమ్మ చూసి చూడనట్టు
వూరుకున్నది. మూడోనాడు కూడా అలాగే జరిగింది. కుర్ర వాడి దొంగబుద్ధి చూసి
ముసలమ్మకు కోపం వచ్చింది. ఆమె, శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు
రాగానే, ‘‘చూడండి, మూడు రోజు లుగా మీ శిష్యుడు నా నువ్వులు అపహరించి
తింటున్నాడు. నువ్వులు పోయూయని నాకు విచారం లేదు గాని, అతను దొంగబుద్ధులు
అలవరుచుకోవటం అతనికీ మంచిది కాదు, మీ కీర్తికీ మంచిది కాదు.
ఇలా ఎన్నడూ చేయకుండా శిక్షించండి,'' అన్నది. ఇంటికి వెళ్ళగానే
శిల్పాచార్యుడు, రాజ కుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు
చెప్పి, అతడి వీపు మీద బెత్తంతో మూడు దెబ్బలు కొట్టి, ‘‘కూడని పని
చేసినందుకు, నీకిది శిక్ష! ఇక ఎన్నడూ చెయ్యకు,'' అన్నాడు. రాకుమారుడికి
గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే, అతను కాశీ రాజ్యం పొలిమేరల
లోపల రాజకుమారుడు గాని, ఇక్కడ సామాన్య వ్యక్తి. దండించే అధికారం
గురువుకున్నది.
‘‘నేను రాజునయ్యూక, ఈ దుర్మార్గుణ్ణి ఏదో మిష మీద కాశీ రాజ్యానికి
పిలిపించి, తప్పక ప్రాణాలు తీస్తాను!'' అని రాజకుమారుడు అక్కసుకొద్దీ
మనసులో గట్టిగా శపథం చేసు కున్నాడు. కాలక్రమాన రాజకుమారుడి చదువు
పూర్తయింది. అతడు కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి, ఆయన
ఆశీర్వాదం పొందాడు. తరువాత అతను గురువుతో, ‘‘ఆర్యా, నేను రాజునయ్యూక తమరు
ఒకసారి తప్పక కాశీనగరానికి దయ చెయ్యూలి.
అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను,'' అన్నాడు. శిష్యుడి
ఆహ్వానానికి గురువు చాలా సంతో షించి సరేనన్నాడు. కాశీరాజ్యానికి తిరిగి
వెళ్ళిన కొంత కాలా నికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యూడు. ఒకనాడతనికి తన
గురువు విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు ఒక నౌకరును పిలిచి, ‘‘నువ్వు
తక్షశిలా నగరం వెళ్ళి, శిల్పా చార్యుణ్ణి కలుసుకుని, ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక
అందజెయ్యి!'' అన్నాడు. శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకుని కూడా వెంటనే
బయలుదేరలేదు.
రాజు సంహాసనం ఎక్కిన మోజులో వుంటాడు. రాజ్యభారం ఎలాంటిదో
తెలిసివచ్చాక చూద్దా మనుకున్నాడు. ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం
గడిచాక, కాశీనగరానికి వెళ్ళి, రాజప్రాసా దంలో వున్న శిష్యుణ్ణి చూడబోయూడు.
రాజు గారి గురువు వచ్చాడని సభాసదులు శిల్పా చార్యుడికి చాలా మర్యాద
చూపించి, ఉన్న తాసనం ఇచ్చారు. గురువును చూసిన క్షణం నుంచీ రాజుకు పాత పగ
జ్ఞాపకం వచ్చి కోపం పొంగిపోతు న్నది. అతడు మాటల మధ్యలో గురువు కేసి
తీక్షణంగా చూస్తూ, ‘‘ముష్టి నువ్వులు పిడి కెడు తిన్నందుకు శిక్షించిన
వాణ్ణి, చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా?'' అని అడిగాడు.
సభలో ఇంకెవరికీ అర్థంకాకుండా, శిల్పా చార్యుడికి చావుభయం కలిగించి,
తరవాత వీలువెంట ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు. అయితే, రాజు
అనుకున్నట్టు శిల్పా చార్యుడు బెదరలేదు. పైపెచ్చు ఆయన ఈ విధంగా రాజు రహస్యం
బయటపెట్టేశాడు: ‘‘ఓ రాజా! నువ్వు నా దగ్గిర శిష్యుడివిగా, నా బాధ్యత కింద
వున్న సమయంలో నీ తాహతుకు తగనిపని చేశావు. శిష్యుడి దుష్ర్ప వర్తనను
దండించి, సన్మార్గంలో పెట్టటం గురువు విధి.
నిన్నానాడు నేను దండించి వుండకపోతే, నువ్వీపాటికి కాశీరాజ్యానికి
రాజుగా వుండటానికి మారుగా, దొంగవై వుందువు. బుద్ధిమంతులైనవారు, తప్పుచేసి
నప్పుడు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చెందరు, కృతజ్ఞత చూపుతారు!''
అన్నాడు శిల్పాచార్యుడు. అసలు విషయం సభవారందరికీ తెలిసి పోయింది. రాజుకు
అవమానం అయింది. అతడు సింహాసనం దిగి గురువు కాళ్ళపై బడి, ‘‘మహానుభావా, మళ్ళీ
తప్పుదారిన పడిన నా మనస్సును సరి అయిన దారిన పెట్టావు, కృతజ్ఞుణ్ణి!''
అన్నాడు.
రాజులో వచ్చిన మంచి మార్పుకు, సభా సదులతోపాటు గురువు కూడా ఎంతగానో
ఆనందించాడు. రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి
మార్చి, ఆస్థాన ఆచార్యు డుగా వుంటూ, రాజును సరి అయిన మార్గాన నడిపించాడు.
No comments:
Post a Comment